tamilnadu

45కి చేరిన ‘గజ’ మృతుల సంఖ్య

Updated By ManamMon, 11/19/2018 - 14:03
 • తుఫాను బాధితులకు డీఎంకే కోటి విరాళం

Cyclone Gaja: Death toll rises to 45

సేలం: తమిళనాడును గజగజలాడిస్తున్న ‘గజ’ తుఫాను ధాటికి మృతి చెందినవారి సంఖ్య 45కి చేరింది. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు తుఫాను సహాయక చర్యల్లో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొనాలని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి పిలుపునిచ్చారు.  తుఫాను ధాటికి పలు జిల్లాలు పూర్తిగా అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. ఆయా జిల్లాల్లో పర్యటించి బాధితులను ఆదుకోవాలని కోరారు. మరోవైపు 2.49 లక్షల మందికి ప్రభుత్వం పునరావసం కల్పించింది.

కాగా తుఫాను కారణంగా  1.70 లక్షల చెట్లు కూలగా,735 మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. అలాగే  1.17  లక్షల ఇళ్లు దెబ్బతిన్నాయి. మరోవైపు ఆరు జిల్లాల్లో సుమారు  88,102 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఆస్తినష్టంపై అంచనా వేసేందుకు ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది.

అలాగే మృతుల కుటుంబాలను రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఇక ప్రతిపక్షపార్టీ డీఎంకే... గజ తుఫాను బాధితులకు కోటి రూపాయలు విరాళం ప్రకటించింది. అంతేకాకుండా ప్రతిపక్ష నేత స్టాలిన్ నిన్న తిరువారూర్‌, నాగపట్నం జిల్లాల్లో వరద ప్రాంతాలను సందర్శించి, బాధితులను పరామర్శించారు.గజ తుఫాను: 28కి చేరిన మృతుల సంఖ్య

Updated By ManamSat, 11/17/2018 - 09:29

Gaja Cycloneచెన్నై: గజ తుఫాను తమిళనాడును అతలాకుతం చేస్తోంది. ఎప్పటికప్పుడు వేగాన్ని, స్థితిని మార్చుకుంటూ వాతావరణ శాఖ అంచనాలను తలకిందులు చేస్తున్న ఈ తుఫాను ప్రభావంతో ఇప్పటివరకు 28మంది మరణించారు. పలుచోట్ల 120కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తుండటంతో 30వేల విద్యుత్ స్తంభాలు, వేలాది ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసమయ్యాయి.

వేలాంగిణిలోని 16వ శతాబ్ధానికి చెందిన ప్రముఖ క్రైస్తవ పుణ్యక్షేత్రంలోని చర్చి పైభాగం ధ్వంసమైంది. ముందస్తు జాగ్రత్తగా కొన్ని జిల్లాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. చాలా వరకు పంటలు దెబ్బతిన్నాయి. సహాయకచర్యల్లో పాల్గొంటున్న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ బలగాలు ఇప్పటివరకు 81వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.10లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.తమిళనాడు గజ.. గజ..!

Updated By ManamFri, 11/16/2018 - 16:00
 • నాగపట్నం-వేదారణ్యం మధ్య తీరం దాటిన తుపాను

 • 23 మంది ప్రజల దుర్మరణం

 • సహాయశిబిరాల్లో 1.76 లక్షల మంది

 • గంటకు 120 కి.మీ. వేగంతో గాలులు

 • విద్యుత్, కమ్యూనికేషన్ల వ్యవస్థ ధ్వంసం

 • నాలుగు జిల్లాలు పూర్తిగా అస్తవ్యస్తం

 • హెల్ప్‌లైన్ నంబర్లు ప్రకటించిన సర్కారు

 • మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు

 • యుద్ధప్రాతిపదికన సహాయుచర్యలు: సీఎం

Cyclone Gaja: 23 Killed as Storm Hammers Coastal Tamil Nadu

చెన్నై: పెను తుపానుగా మారిన ‘గజ’ తీరం దాటే సవుయంలో తన విశ్వరూపం చూపించింది. తమిళనాడులో విధ్వంసం సృష్టించింది. తుపాను ప్రభావంతో ఏకంగా 23 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడు - పుదుచ్చేరి తీరంలో నాగపట్నం, వేదారణ్యం మధ్య శుక్రవారం తెల్లవారుజామున గత తుపాను తీరాన్ని దాటే సమయంలో గాలి వేగం గంటకు 120 కిలోమీటర్లుగా నమోదైంది. దానికితోడు నాగపట్నం, వేదారణ్యం తదితర ప్రాంతాలలో భారీ వర్షాలు నమోదయ్యాయి. దాంతో విద్యుత్, టెలిఫోన్ లైన్లకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రధానంతా నాగపట్నం జిల్లాపై తుపాను ప్రభావం అత్యంత ఎక్కువగా కనిపించింది.

తుపాను కారణంగా మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 10 లక్షల చొప్పున పరిహారాన్ని సీఎం పళనిసామి ప్రకటించారు. సహాయ పునరావాస కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికన చేపడతామని, ఇప్పటికే అవి మొదలయ్యాయని చెప్పారు. సేలంలో ఆయన ఈ విషయమై విలేకరులతో మాట్లాడారు. తుపాను సహాయం కోసం తమిళనాడు ప్రభుత్వం 1070 (రాష్ట్రస్థాయి), 1077 (జిల్లాస్థాయి) హెల్ప్‌లైన్ నంబర్లను ప్రకటించింది. లోతట్టు ప్రాంతాలకు చెందిన 1.76 లక్షల మందిని ఖాళీ చేయించి, ఆరు జిల్లాల పరిధిలోని 470 సహాయ శిబిరాలకు తరలించారు. తుపాను ప్రభావం నాగపట్నం, పుదుక్కొట్టాయ్, రామనాథపురం, తిరువారూరు జిల్లాలపై ఎక్కువగా కనిపించింది. నాగపట్నం సహా పలు తీరప్రాంతాలలో ముందుజాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌కు చెందిన నాలుగు బృందాలు నాగపట్నంలో మోహరించాయి. కడలూరు తీరంలో రాష్ట్ర విపత్తు నివారణ బృందానికి చెందిన రెండు దళాలు ఉన్నాయి. 

మత్స్యకారులను మరికొంతకాలం పాటు వేటకు వెళ్లొద్దని సూచించారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో తుపాను తీరాన్ని తాకిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే కొన్ని గంటల్లో ఇది పశ్చిమదిశగా ప్రయణించి క్రమంగా బలహీనపడుతుందని వివరించారు. తుపాను ప్రభావంతో నాగపట్నం, తిరువారూరు, తంజావూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. గాలులు కూడా తీవ్రంగా ఉండటంతో పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకూలాయి. గురువారం సాయంత్రం నుంచే గాలులు, వర్షాలు మొదలయ్యాయి. ఆగ్నేయ అరేబియా సముద్రంలోకి 20వ తేదీ వరకు చేపల వేటకు వెళ్లొద్దని కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం తమ రాష్ట్రానికి చెందిన మత్స్యకారులను హెచ్చరించింది. 

దక్షిణ రైల్వే నాలుగు రైళ్లను రద్దుచేసింది. నాగపట్నం, తిరువారూరు, తంజావూరు జిల్లాలకు చెన్నై నుంచి వెళ్లే రైళ్లను రద్దుచేశారు. దక్షిణాది జిల్లాల మీదుగా వెళ్లే మరో నాలుగు ఎక్స్‌ప్రెస్ రైళ్లను దారిమళ్లించారు. తుపాను ప్రభావిత ప్రాంతాలకు మందులు, ఇతర నిత్యావసర సరుకులు అందించేందుకు భారత నౌకాదళం రణ్‌వీర్, ఖంజర్ అనే రెండు నౌకలను రంగంలోకి దించింది. నౌకాదళ హెలికాప్టర్లను కూడా సహాయ, పునరావాస కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు. గజ తుఫాను: ఏడుగురు మృతి

Updated By ManamFri, 11/16/2018 - 10:45

Gaja Cycloneచెన్నై: తమిళనాడు రాష్ట్రాన్ని గజ తుఫాను అతలాకుతం చేస్తోంది. తీరం దాటిన ఆ తుఫాను పశ్చిమ దిశగా పయనిస్తోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో పశ్చిమ, మధ్య తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తంజావూరు జిల్లా అధిరామ్‌పట్నంలో అత్యధికంగా 16సెం.మీ. వర్షపాతం నమోదు అయ్యింది. ఈ వర్షాల కారణంగా ఇప్పటివరకు ఏడుగురు మృతిచెందినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 

110కిలోమీటర్ల వేగంతో వీచిన ప్రచండ గాలులతో భారీ వృక్షాలు సైతం నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. దీంతో పలు ప్రాంతాలకు అంధకారంలో ఉన్నాయి. నాగపట్నంలో నాలుగు, కడలూరు జిల్లాల్లో రెండు ఎన్డీఆర్‌ఎఫ్ బ‌ృందాలు సహాయచర్యలు కొనసాగిస్తున్నాయి.గజ తుఫాను: తమిళనాడులో హై అలర్ట్

Updated By ManamWed, 11/14/2018 - 09:20

Gaja Cycloneచెన్నై: బంగాళాఖాతంలో గజ తుపాను ప్రభావం కొనసాగుతోంది. ఈ తుపాను గురువారం మధ్యాహ్నం తీరం దాటే అవకాశం ఉంది. ఈ క్రమంలో తమిళనాడులో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. కడలూరు, రామనాథపురం, పుదుకొట్టై, తూత్తుకుడి, తంజావూరు, తిరువాయూరులో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇక కడలూరుకు ఇప్పటికే 11 ఎన్టీఆర్‌ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. మరోవైపు మత్స్యకారులెవ్వరు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. అలాగే అక్కడ 130 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. మరోవైపు గజ తుఫానుతో ఏపీలోనూ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.‘ప్రమాదకరమైనది’ ప్రజలే తేలుస్తారు

Updated By ManamTue, 11/13/2018 - 19:00
 • నేనింకా పూర్తి రాజకీయవేత్తను కాదు

 • తన వ్యాఖ్యలపై రజనీకాంత్ వివరణ

Rajinikanth Clarifies on BJP, Still Cryptic

చెన్నై : బీజేపీకి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పది పార్టీలు ఏకమయ్యాయంటే ఆ పార్టీ బలవంతమైనది, ప్రమాదకరమైనది కావొచ్చునని తాను చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం సృష్టించడంతో తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ వివరణ ఇచ్చారు. బీజేపీ ‘ప్రమాదకరమైన పార్టీ’ కావొచ్చునని విపక్షాలు భావిస్తున్నాయని, కానీ తాను అలా అనుకోవడం లేదని రజనీకాంత్ పేర్కొన్నారు.

బీజేపీ ప్రమాదకరమైన పార్టీ అని నిర్ణయించేది ప్రజలేకానీ పార్టీలు కాదని అన్నారు. ఒక వ్యక్తికి వ్యతిరేకంగా పది మంది వెళ్తున్నారంటే.. ఎవరు బలవంతమైన వ్యక్తో అర్థమవుతోందని సోమవారం రజనీకాంత్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దాంతో ఆయన బీజేపీలో చేరుతారని వార్తలు వచ్చాయి. 

ఈ నేపథ్యంలో ఆయన స్పందిస్తూ.. తానింకా పూర్తి రాజకీయవేత్తను కాదని, తన వ్యాఖ్యలను తప్పుడుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. తన వెనుక బీజేపీ లేదని, ఇది నిజం కాదని చెప్పారు. ఒక్క దేవుడు, ప్రజలే తన వెనుక ఉన్నారని చెప్పారు.

తాను చేసే రాజకీయాలు ఆధ్యాత్మికత మిళితమై ఉంటాయని మరోసారి ఆయన స్పష్టం చేశారు. నీతినిజాయితీతో కూడుకుని ఉంటాయన్నారు. కాగా, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకులను విడుదల చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మానవతా దృక్పధంతో స్పందించి శిక్ష అనుభవిస్తున్న ఏడుగురు హంతకులను విడుదల చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాజీవ్ హంతకులు తెలీదు అనడానికి తానేమి మూర్ఖుడిని కాదని అన్నారు.దినకరన్‌కు హైకోర్టు షాక్

Updated By ManamThu, 10/25/2018 - 11:37

Dinakaranచెన్నై: శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్‌కు మద్రాసు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. దినకరన్ వర్గానికి చెందిన 18మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ వేసిన అనర్హత వేటును హైకోర్టు సమర్ధించింది. దీంతో పళని ప్రభుత్వానికి పెద్ద ఊరట లభించినట్లైంది. దీనిపై మాట్లాడిన దినకరన్.. కోర్టు తీర్పును గౌరవిస్తానని, శుక్రవారం ఎమ్మెల్యేలను కలుస్తానని అన్నారు. తీర్పు వ్యతిరేకంగా వస్తుందనే ఎమ్మెల్యేలను ముందస్తుగా రిసార్ట్‌కు పంపానని, ఎమ్మెల్యేలతో చర్చించిన తరువాత నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు. ఈ అనర్హతపై సుప్రీంలో అప్పీలు చేస్తామని ఆయన అన్నారు.

18మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంతో ఖాళీ అయిన స్థానాలకు మళ్లీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. సుప్రీంలో దినకరన్‌కు సానుకూలంగా తీర్పు వస్తే తప్ప ఇక్కడ ఎన్నికలు జరగడం అనివార్యమైంది. ఒకవేళ అదే జరిగితే పళని ప్రభుత్వానికి మరో సమస్య ఎదురుకానుంది.ఇటు ఏపీ, అటు తమిళనాట ఐటీ దాడులు

Updated By ManamThu, 10/25/2018 - 08:46

IT Raidsవిశాఖపట్నం: ఏపీలో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. విశాఖపట్నంలోని దువ్వాడ సెజ్‌లో గురువారం ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అక్కడ ఉన్న వివిధ పారిశ్రామిక సంస్థలపై ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో అధికార టీడీపీ నేతలకు సంబంధించిన సంస్థలు, ఆస్తులపై ఈ దాడులు జరుగుతున్నాయి. వీటిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసంతృప్తిని వ్యక్తపరిచిన విషయం తెలిసిందే.

మరోవైపు తమిళనాట కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి. వీవీ మినరల్స్ యజమాని వైకుందరాజన్ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. దాదాపు 100 ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.దానిపై నేను కామెంట్ చేయలేను: కమల్

Updated By ManamMon, 10/15/2018 - 13:01

Kamal Haasanచెన్నై: ప్రముఖ అయ్యప్పస్వామి ఆలయం శబరిమలలో మహిళలకు అనుమతినిస్తూ సుప్రీం కోర్టు ఇటీవల చారిత్రాత్మక తీర్పును ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ తీర్పుపై కొన్ని మహిళా సంఘాలతో పాటు పలు అయ్యప్ప సంఘాలు భగ్గుమంటున్నాయి.

ఈ తీర్పును పున:పరిశీలించాలంటూ ఆ సంఘాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఈ వివాదంపై ఉలగనాయగన్, మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్ స్పందించారు. ‘‘ఇది భక్తులకు, సుప్రీం కోర్టుకు మధ్య సంబంధించిన విషయం. నేను కేవలం చూసేవాడిని మాత్రమే. ఈ వివాదంపై తాను ఎలాంటి కామెంట్ చేయనని.. అలాగని నో కామెంట్ అని కూడా చెప్పను’’ అంటూ చెప్పుకొచ్చారు కమల్ హాసన్.జయలలితనే మీ తల్లి అనడానికి ఆధారాలు లేవు

Updated By ManamSat, 10/13/2018 - 08:58

Jayalalithaa, Amruthaచెన్నై: తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత తన తల్లి అంటూ కోర్టుకెక్కిన బెంగళూరు యువతి అమృతకు చుక్కుదురు అయ్యింది. జయలలిత, అమృత తల్లి అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని తేల్చిన కోర్టు.. ఆమె వేసిన పిటిషన్ కొట్టివేసింది. 

ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు.. జయలలితను మాత్రమే తల్లిగా ప్రకటించాలని ఎందుకు కోరుతున్నారని, శోభన్‌బాబును తండ్రిగా ఎందుకు అడగడం లేదని అమృతను ప్రశ్నించారు. ఈ విషయంలో తగిన వివరణ ఇవ్వాలంటూ తమిళనాడు ప్రభుత్వాన్ని న్యాయమూర్తి వైద్యనాథన్ ఆదేశించారు. దీంతో అమృత, జయలలిత కుమార్తె కాదనేందుకు తగిన వీడియోను ప్రభుత్వ తరపున న్యాయవాది కోర్టుకు సమర్పించారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు ఈ కేసును కొట్టివేసింది. ఈ సందర్భంగా జయలలిత జీవితమంతా మిస్టరీగానే మిగిలిపోయిందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. కాగా తాను శోభన్‌బాబు-జయలలితలకు జన్మించానని, డీఎన్‌ఏ పరీక్షలు చేయిస్తే ఆ విషయం తెలుస్తుందంటూ అమృత హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

Related News