tamilnadu

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

Updated By ManamWed, 08/01/2018 - 11:49

road accidentచెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోయంబత్తూరు సుందరాపురం సమీపంలో వేగంగా వచ్చిన లగ్జరీ కారు బస్టాండ్‌లోని జనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మరణించగా.. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు కాలేజీ విద్యార్థులు ఉన్నారు. గాయపడ్డవారిని కోయంబత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రత్యక్షసాక్ష్యులు చెబుతున్నారు. సంఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తును ప్రారంభించారు.అమ్మ ఎప్పుడూ గర్భం దాల్చలేదు

Updated By ManamWed, 07/25/2018 - 09:20

jaya చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత తన తల్లి అంటూ బెంగళూరుకు చెందిన అమృత ఆ మధ్య తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఆమె కోర్టులో కేసు కూడా వేయగా.. దానికి సంబంధించిన విచారణ మద్రాసు హైకోర్టులో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా జయలలిత తన జీవితంలో ఎప్పుడూ గర్భం దాల్చలేదని తమిళనాడు ప్రభుత్వం మద్రాస్ హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు 1980 నాటి జయలలిత వీడియో క్లిప్‌లను కోర్టుకు సమర్పించింది. 

జయలలిత ఆస్తులపై కన్నేసిన అమృత వాటిని సొంతం చేసుకునేందుకే ఈ వ్యాఖ్యలు చేసినట్టు తమిళనాడు అడ్వకేట్ జనరల్ విజయ్ నారాయణ్ పేర్కొన్నారు. ఒకవేళ అమృత, అమ్మ కుమార్తెనే అయితే, తన జీవితకాలంలో ఆమెతో కలిసి ఒక్క ఫొటో కూడా ఎందుకు తీసుకోలేకపోయారని ప్రశ్నించారు. జయలలితకు తాను 1980లో పుట్టినట్టు అమృత తన పిటిషన్‌లో పేర్కొనడంతో, అదే ఏడాది జయలలిత ఓ అవార్డు కార్యక్రమంలో పాల్గొన్న వీడియోను తమిళనాడు ప్రభుత్వం కోర్టుకు సమర్పించింది. అమృత పుట్టినట్టు చెబుతున్న తేదీకి నెల రోజుల ముందే ఈ కార్యక్రమం జరిగిందని, ఈ వీడియోలో జయ గర్భంతో ఉన్న ఆనవాళ్లు లేవని కోర్టుకు తెలిపారు. అవసరం అనుకుంటే జయలలిత బంధువల డీఎన్‌ఏతో అమృత డీఎన్ఏను పోల్చి చూడాలని వారు కోరారు. వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.తమిళనాడులో దారుణం...

Updated By ManamSun, 07/22/2018 - 09:31
  • క్లాస్‌లో డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ రెజ్లింగ్‌ తరహాలో ఫైటింగ్‌..

  • తోటి విద్యార్థిని నేలకేసి కొట్టిన మరో విద్యార్థి

  • తలకు బలమైన గాయంతో మృతి

 Fatima Matriculation schoolచెన్నై : తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ రెజ్లింగ్‌ తరహాలో ఓ స్కూల్‌​ క్లాస్‌ రూమ్‌లో జరిగిన ఫైటింగ్‌లో  విద్యార్థి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోయంబత్తూరు జిల్లా కయత్తూరులోని ఫాతిమా మెట్రిక్యులేషన్‌ స్కూల్‌లో ఓ విద్యార్థిని సహ విద్యార్థి నేలకేసి కొట్టాడు. తల నేలకు బలంగా తగలడంతో ఆ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. వారం రోజుల క్రితం (జూలై 16న) ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఉదంతం మొత్తం క్లాస్‌ రూమ్‌ లోని సీసీ కెమెరాలో రికార్డు అయింది.

లంచ్‌ విరామ సమయంలో పదో తరగతికి చెందిన ఇద్దరు విద్యార్థుల మధ్య మొదలైన వివాదం చిలికి చికిలి గాలివానలా మారింది. దీంతో రెజ్లింగ్‌ తరహాలో ఆ విద్యార్థిని.. తన తోటి విద్యార్థిని క్లాస్‌ రూమ్‌లో నేలకేసి కొట్టాడు. అయితే కిందపడిన విద్యార్థి పైకి లేస్తాడనుకున్నా...అప్పటికే అతడు చనిపోయాడు.

కాగా  మృతి చెందిన విద్యార్థి కుటుంబసభ్యులు మాత్రం కావాలనే తమ కుమారుడిని తోటి విద్యార్థి హతమార్చాడంటూ ఆరోపించారు. అంతేకాకుండా ఆ విద్యార్థి ఇంటిపై దాడి చేసి, నిప్పు పెట్టారు.  ప్రస్తుతం పరారీలో ఉన్న ఆ విద్యార్థి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు విచారణకు ఆదేశించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.కొత్తజంట మధ్య పచ్చబొట్టు చిచ్చు

Updated By ManamFri, 07/20/2018 - 09:32

wife ఆ ఇద్దరు ఇటీవలే వివాహం చేసుకున్నారు. పెళ్లయిన ఐదు రోజుల తరువాత ఓ గుడికి వెళ్లారు. అక్కడ కాసేపు ముచ్చట్లు చెప్పుకొని.. భవిష్యత్ గురించి ప్రణాళికలు వేసుకున్నారు. అలా మాట్లాడుతుండగానే.. భర్త చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆ భార్య దృష్టిలో పడింది. అదేంటని చూస్తే అదో అమ్మాయి పేరు.

దీంతో.. ఆ కొత్త పెళ్లికూతురు అపర కాళి అయిపోయింది. బయట ఉన్నామని చూడకుండా భర్తపై శివాలెత్తింది. ఆ పచ్చబొట్టు ఆమె ఎవరంటూ ప్రశ్నించింది. సమాధానం చెప్పేందుకు భర్త తటపటాయిస్తుండటంతో జుట్టుపట్టుకొని భర్తను చెడామడా వాయించేసింది. కాళ్లతో కొడుతూ, వీపుపై పిడిగుద్దులు గుద్దుకుంటూ ఈడ్చుకెళ్లింది. దీంతో ఆలయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. అక్కడున్న వారు ఆమెను ఆపేందుకు ప్రయత్నించినా ఊరుకోలేదు. ఆ పచ్చబొట్టు అమ్మాయి ఎవరో చెప్పాలంటూ భర్తను చెడుగుడు ఆడుకుంది. ఈ సంఘటన తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా మేట్టుపాళయంలో జరిగింది. ఐటీ చరిత్రలోనే తొలిసారి..

Updated By ManamTue, 07/17/2018 - 13:33
  • పార్క్ చేసిన కార్లలో కోట్లాది రూపాయల నగదు

IT raids in SPK company

చెన్నై: తమిళనాడుకు చెందిన ఎస్‌పీకే అండ్‌ కో యజమానుల నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ దాడుల్లో కోట్లాది రూపాయల నగదు, పెద్ద ఎత్తున బంగారం లభించడంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులే బిత్తరపోతున్నారు. ఐటీ శాఖ దాడుల్లోనే ఇప్పటివరకూ ...అంత పెద్ద మొత్తంలో నగదు, కేజీల కొద్ది బంగారం పట్టుబడటం దేశంలోనే తొలిసారని ఆ శాఖకు చెందిన ఓ అధికారి చెబుతున్నారు. రెండోరోజు కూడా సోదాలు కొనసాగుతున్నాయి. 

కాగా పెద్ద నోట్ల రద్దు (2016) అనంతరం ఐటీ దాడుల్లో చెన్నైకి చెందిన మైనింగ్ వ్యాపారి శేఖర్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో రూ.110 కోట్లు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఎస్‌పీకే కంపెనీ దాన్ని అధిగమించేసింది. మరోసారి తమిళనాడులోనే పెద్ద మొత్తంలో నగదు, బంగారం సీజ్ చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 

తమిళనాడు రాష్ట్రంలో పేరుమోసిన కాంట్రాక్ట్‌ సంస్థ అయిన ఎస్‌పీకే అండ్ కంపెనీపై ఐటీ శాఖ చాలా కాలం నుంచే కన్నేసింది. ఆ కంపెనీ కార్యకలాపాలపై అధికారులు నిఘా పెట్టారు. ఈ కంపెనీకి ప్రభుత్వం నుంచి భారీగా కాంట్రాక్టులు చేజిక్కించుకోవడంతో పాటు హోటల్స్‌, ఇతర వ్యాపారాలు నిర్వహిస్తోంది. అయితే పన్ను చెల్లింపులో అవకతవకలకు పాల్పడుతుండటంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు  22 ప్రాంతాల్లో  పెద్ద ఎత్తున దాడులు చేశారు. ఈ సోదాల్లో నోట్ల కట్టలను ట్రావెల్ బ్యాగుల్లో నింపి పార్క్ చేసిన కార్లులో గుర్తించారు. అలాగే బంగారు బిస్కెట్లు, ఆభరణాలు ...సుమారు  100 కేజీల బంగారం బయటపడటంతో బిత్తరపోవడంతో అధికారుల వంతైంది. 

కాగా  ఎస్‌పీకే సంస్థ యజమాని సెయ్యాదురై ఒకప్పుడు పశులువు మేపుకునే వాడు. ఆ తర్వాత అధికార పార్టీకి చెందిన మంత్రులతో పరిచయం అతడి జీవితాన్నే మార్చేసింది. వారి సిఫార్సులతో జాతీయ రహదారుల్లో చిన్నపాటి కాంట్రాక్టులు చేజిక్కించుకోవడంతో మొదలైన ప్రస్థానం...క్రమంగా సెయ్యాదురై కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టులు చేసే స్థాయికి చేశాడు. అనతికాలంలోనే ఎస్‌పీకే అండ్‌కో అగ్రశ్రేణి సంస్థగా ఎదిగింది. మరోవైపు ఈ సంస్థలో పలువురు రాజకీయ నేతలకు వాటాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వాటిపై కూడా ఐటీ శాఖ అధికారులు దృష్టి సారించారు. యువతి ప్రాణం తీసిన మాక్‌డ్రిల్

Updated By ManamFri, 07/13/2018 - 09:21

logeswari చెన్నై: తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. కోయంబత్తూరు జిల్లా కోవైలోని ఓ ప్రైవేట్ కాలేజీలో మాక్‌డ్రిల్ చేస్తుండగా.. ఓ యువతి బిల్డింగ్ నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయింది. ప్రకృతి వైపరిత్యాలు, అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు తమని తాము ఎలా రక్షించుకోవాలి అనే అంశంపై కాలేజీలో మాక్‌డ్రిల్ నిర్వహించారు. రెండో అంతస్థు నుంచి దూకి ఎలా ప్రాణాలు రక్షించుకోవాలో చేయించి చూసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కాలేజీలో బీబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్న లోగేశ్వరి అనే యువతిని బిల్డింగ్‌పైకి ఎక్కించారు. కింద పడితే పట్టుకోవడానికి నెట్ కూడా ఏర్పాటు చేశారు.

అయితే అంత ఎత్తు నుంచి దూకేందుకు లోగేశ్వరి భయపడింది. ఆమె వెనక్కి వెళ్తుంటే కోచ్ ఆర్ముగం ఆమెను కిందకు తోశాడు. ఈ క్రమంలో ఆమె అప్రమత్తంగా లేకపోవడంతో.. కింద ఫ్లోర్ సెల్ఫ్‌కు తల బలంగా తాకి లోగేశ్వరి కుప్పకూలింది. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో కాలేజీలో విషాదం చోటుచేసుకోగా.. విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు భోరున విలపించారు. మరోవైపు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బలవంతంగా లోకేశ్వరిని కిందకు తోసిన కోచ్ ఆర్ముగంను అదుపులోకి తీసుకున్నారు.బాలికపై 99 ఏళ్ల వృద్ధుడి అఘాయిత్యం

Updated By ManamMon, 07/09/2018 - 13:05
abuse

చెన్నై : కాటికి కాలు చాచిన వయసులో కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ వృద్ధుడు అభం శుభం తెలియని చిన్నారి పాలిట రాక్షసుడు అయ్యాడు.  ముక్కుపచ్చలారని పదేళ్ల బాలికపై  లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. మానవత్వానికి మచ్చ తెచ్చే ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. దీంతో బాలికపై వేధింపులకు పాల్పడిన ఆ రిటైర్డ్ స్కూల్ ప్రిన్సిపాల్‌ను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.

బాదిత బాలిక కుటుంబం గత రెండేళ్లుగా రిటైర్ట్ ప్రిన్సిపాల్ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. అయితే పెద్ద వయసుకు చెందిన అతడు తన మనవరాళ్ల వయసు ఉన్న చిన్నారిని లైంగికంగా వేధించసాగాడు. కాగా కడుపునొప్పితో బాధపడుతున్న కుమార్తెను ఆరా తీయగా అసలు విషయం బయటపడింది.

దీంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు విచారణలో చిన్నారి తనపై జరుగుతున్న దారుణాన్ని వివరించింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. కాగా  అయిదుగురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు...మనవళ్లు, మనవరాళ్లు, ముని మనవళ్లు ఉన్న అతగాడికి ఇదేమీ పాడుబుద్ధి అంటూ స్థానికులు ఈసడించుకుంటున్నారు.
 మంట‌ పుట్టిస్తున్న కావేరీ జ‌లాలు

Updated By ManamMon, 07/02/2018 - 12:32
Cauvery water

న్యూఢిల్లీ : కావేరీ జ‌లాల వివాదం తమిళనాడు, కర్ణాటకల మధ్య దూరాన్ని రోజురోజుకూ పెంచుతూపోతోంది. నీటి విడుద‌ల విష‌యంలో పంతాలు, పట్టింపుల కార‌ణంగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నా వ్య‌వ‌హారం స‌ద్దుమ‌ణ‌గ‌డంలేదు. సుప్రీం ఆదేశాలు, కేంద్రం చొర‌వ‌తో అంతా సజావుగా సాగే అవ‌కాశాలున్నాయ‌ని భావిస్తుండ‌గానే.. కర్ణాటక ప్రభుత్వం అనుస‌రిస్తున్న తీరు మ‌ళ్లీ వివాదాన్ని రాజేసింది.  

కావేరీ వ్యవహారంలో మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతోపాటు సోమవారం ఢిల్లీలో జరగనున్న కావేరీ అథారిటీ మొద‌టి భేటీలో నిర‌స‌న‌గ‌ళం విప్పనున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇందుకోసం అన్ని క‌న‌డ రాజకీయ పక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చింది.   

కావేరీ జలవివాదం పరిష్కారానికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కావేరీ వాట‌ర్ మేనేజ్‌మెంట్ అథారిటీని గ‌త నెల్లోనే కేంద్రం ఏర్పాటుచేసింది. ఈ  అథారిటీ తొలి స‌మావేశం ఇవాళ (సోమ‌వారం) ఢిల్లీలో జ‌ర‌గ‌నుంది. ఈ భేటీలో కర్ణాట‌క‌కు అన్యాయం జ‌రిగే ఏ చిన్న ప్ర‌య‌త్నాన్నీ ఒప్పుకోవ‌ద్ద‌ని కుమార‌స్వామి నాయ‌క‌త్వంలో స‌మావేశ‌మైన క‌న్న‌డ అఖిల‌ప‌క్షంలో నిర్ణ‌యించారు. ఇందులో బీజేపీ కూడా ఉంది. న్యాయనిపుణులు, సాగునీటి పారుద‌ల నిపుణుల సలహాలతో మరోసారి సుప్రీంకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేయాలని నిర్ణయించారు. 

ఈ విష‌యంపై త‌మిళ‌నాడు వేచిచూసే ధోర‌ణిలో ఉంది. క‌న్న‌డ ప్ర‌తినిధుల వ్య‌వ‌హారం ఆధారంగానే స్పందించాల‌ని భావిస్తోంది. ఇప్ప‌టికే క‌ర్ణాట‌కతో త‌మ‌కు తీవ్ర‌మైన న‌ష్టం జ‌రుగుతోంద‌ని న‌మ్ముతున్న త‌మిళ‌నాడు.. ఏమాత్రం తేడా వ‌చ్చినా త‌మ నిర‌స‌న గ‌ళాన్ని బ‌లంగానే వినిపించ‌నుంది. సుప్రీంకోర్టు తీర్పునే ప‌ట్టించుకోక‌పోతే.. దేనికి విలువిస్తారంటూ క‌ర్ణాట‌క తీరుపై మండిప‌డుతోంది. మళ్లీ పోలీసులకు చిక్కాడు

Updated By ManamThu, 06/28/2018 - 12:32

Jai ర్యాష్ డ్రైవింగ్ కేసులో కోలీవుడ్ నటుడు జై మరోసారి పోలీసులకు చిక్కాడు. మంగళవారం రాత్రి నుంగంబాక్కుమ్ ప్రధాన రహదారిపై అధిక ధ్వనితో సైరన్ మోగించుకుంటూ వెళ్లి ఇతర వాహనదారులను భయబ్రాంతులకు గురిచేశాడు. దీంతో ఆ ప్రాంత ట్రాఫిక్ పోలీసులు జై కారును వెంబడించి అడ్డుకున్నారు. ధ్వని కాలుష్యానికి కారణమైన వారిపై తాము తీసుకునే చర్యల గురించి జై కి వివరించారు. దీంతో తాను చేసింది తప్పని ఒప్పుకున్న జై, పోలీసులకు సారీ చెప్పడంతో హెచ్చరించి పంపారు.

అయితే ర్యాష్ డ్రైవింగ్‌లో జై, పోలీసులకు చిక్కడం ఇది తొలిసారేం కాదు. గతంలో ఓ సారి మద్యం తాగా ఇంటికి వెళ్లే క్రమంతో ఓ డివైడర్‌ను గుద్దేశాడు. అలాగే 2014లో కేకే నగర్ సమీపంలోని కాశి థియేటర్ ప్రాంతంలో మద్యం మత్తులో ట్రాఫిక్ పోలీస్ వాహనాన్నే గుద్దేసి వార్తల్లో నిలిచాడు జై.మత్య్సకారుడి ఇంట డంప్.. భారీగా వెలుగుచూస్తున్న ఆయుధాలు

Updated By ManamTue, 06/26/2018 - 10:06

weapons చెన్నై: తమిళనాడులో భారీ ఎల్‌టీటీఈ డంప్ బయల్పడింది. రామేశ్వరంలోని ఓ మత్స్యకారుడి ఇంట్లో ఇది కనుగొనగా.. అందులో భారీ ఆయుధాలు బయటపడ్డాయి. సోమవారం సాయంత్రం నుంచి ఈ తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఆయుధాల్లో ఏకే 47 గన్స్, రాకెట్ లాంఛర్లు, ల్యాండ్ మైన్లు ఉన్నాయి.

అయితే సెప్టిక్ ట్యాంక్ కోసం ఆ మత్స్యకారుడు తన ఇంటి వెనుక భాగంలో తవ్వుతుండగా ఇది బయటపడినట్లు పోలీసులు తెలిపారు. ఎస్పీ ఓంప్రకాశ్ మీనా ఆధ్వర్యంలో తవ్వకాలు కొనసాగుతుండగా ఇప్పటికి 22 ఆయుధాల పెట్టెలు సొంతం చేసుకున్నట్లు వెల్లడించారు.

Related News