whatsapp

అసత్య వార్తలపై సమరం

Updated By ManamMon, 07/23/2018 - 13:16

బ్రిటన్‌లో స్టార్టప్‌ను ఆరంభించిన ఎన్‌ఆర్‌ఐ జైన్

lyric jainలండన్: అసత్య.. నకిలీ వార్తలు! సామాజిక మాధ్యమాల్లో విర్రవీగుతున్న ఈ వార్తలు మన దేశంలో ఎంతటి బీభత్సాన్ని సృష్టిస్తున్నాయో తెలిసిందే. ఇలాంటి వార్తలకు చెక్ పెట్టేందుకు బ్రిటన్‌లో భారత సంతతికి చెందిన ఔత్సాహిక పారిశ్రామిక వేత్త లిరిక్ జైన్ కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగా ఓ స్టార్టప్ సంస్థను నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కర్ణాటకలోని మైసూరుకు చెందిన లిరిక్ జైన్.. కేంబ్రిడ్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తిచేశారు.

ఫేస్‌బుక్, వాట్సప్ తదితర సామాజిక మాధ్యమాల్లో విచ్చలవిడిగా అసత్య వార్తలు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. భారత్‌లో వీటి ప్రభావం మరీ దారుణంగా ఉంది. చిన్నపిల్లలను ఎత్తుకెళ్తున్నారనే వార్తలు ప్రచారం కావడంతో.. తమ ప్రాంతంలో ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపిస్తే చాలు వారి వివరాలకు తెలుసుకోకుండా సామూహిక దాడులకు పాల్పడుతున్నారు. కొట్టి చంపేస్తున్నారు. 

ఇలాంటి ఘటనలు ప్రపంచవ్యాప్తంగా  అనేక దేశాల్లోనూ కొనసాగుతున్నాయి. ఈనేపథ్యంలో ఓ సాంకేతిక పరిజ్ఞానాన్ని జైన్ రూపొందించారు. ప్రస్తుతం ఈ పరిజ్ఞానంపై పరీక్షలు జరుగుతున్నాయి. విజయ వంతమైతే బ్రిటన్, అమెరికాలో సెప్టెంబరు నుంచి ఈ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. మన దేశంలో మాత్రం అక్టోబర్‌లో అందుబాటులోకి రావొచ్చు. వాట్సప్‌లో కొత్త ఫీచర్!

Updated By ManamMon, 07/09/2018 - 21:27

imageన్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగిస్తున్న వాట్సప్ మెసేజింగ్ యాప్‌లో మరో కొత్త సౌకర్యం రానున్నది. వినియోగదారులు తమకు వచ్చే సందేశాల్లోని లింకులు నిజమైనవా? నకిలీవా? తెలుసుకునే అవకాశం లభించనుంది. ఆ లింకులను ఓపెన్ చేస్తే నష్టమా? ప్రమాదమా? అనే వివరాలను అందివ్వనుంది. ఒకవేళ లింకులు నకిలీవైతే ఆ మెసేజ్‌లపై ‘అనుమానాస్పదం( సస్పీషియస్) పేరుతో ఓ సందేశం రానుంది. ఈ హెచ్చరిక ద్వారా వినియోగదారులు జాగ్రత్త పడే అవకాశముంది.వాట్సాప్ చెల్లింపుల సేవపై పేమెంట్ కార్పొరేషన్ ఆరా

Updated By ManamMon, 06/04/2018 - 00:15

whatsappన్యూఢిల్లీ: వాట్సాప్ చెల్లింపుల సర్వీసు రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు అనుగుణంగానే ఉందా, కస్టమర్ల డాటాకు భద్రత ఉందా అనే అంశాలను ఆరా తీయవలసిందిగా కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక పరిజ్ఞాన మంత్రిత్వ శాఖ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్.పి.సి.ఐ)ని కోరినట్లు తెలిసింది. ఆ మొబైల్  మెసెంజర్ యాప్ సేవల స్థాయిని పెంచుకోకముందే ఆ సంగతులను పరిశీలించవలసిందిగా మంత్రిత్వ శాఖ కోరింది. వాట్సాప్ చెల్లింపులు ఆర్.బి.ఐ అనుమతులకు లోబడే పనిచేస్తున్నాయా, లావాదేవీల డాటాను అది ఎక్కడ స్టోరు చేస్తోంది, ఆ డాటాను దాని మాతృ సంస్థ ఫేస్‌బుక్ పంచుకుంటోందా వంటి విషయాలను ఆ సర్వీసు బిగ్గర్ వెర్షన్ ప్రారంభం కాకముందే పరిశీలించాలని ఎన్.పి.సి.ఐని మంత్రిత్వ శాఖ కోరినట్లు అధికారిక వర్గాలవారు తెలిపారు. పేమెంట్ సిస్టం ఆపరేటర్లు అందరూ చెల్లింపులకు సంబంధించిన డాటాను ఇండియాలో మాత్రమే నిక్షిప్త పరచాలని రిజర్వ్ బ్యాంక్ 2018 ఏప్రిల్ 5న ఆదేశించింది. నిబంధనలకు అనుగుణంగా సేవలను మలచుకునేందుకు సంస్థలకు అది ఆరు నెలల గడువు ఇచ్చింది. చెల్లింపుల సేవకు చెందిన బేటా-వెర్షన్ (10 లక్షల మంది చందాదారుల వరకు) నడిపేందుకు వాట్సాప్‌కు అనుమతి ఉంది. అవెురికా కేంద్రంగా ఉన్న ఆ మెసేజింగ్ యాప్ సేవలను విస్తృతపరచి, స్థాయిని పెంచకముందే అన్ని విధానాలను పాటిస్తోందో లేదో చూడవలసిందని ఎన్.పి.సి.ఐని కోరింది. 

లావాదేవీ జరిగే సమయంలో, రెండు అంశాల ప్రమాణీకరణ చుట్టూ కూడా కొన్ని అంశాలున్నాయి. లావాదేవీ భద్రత విషయంలో కూడా వాట్సాప్ నిబంధనలను పాటిస్తోందో లేదో పరిశీలించవలసిందని ఎన్.పి.సి.ఐని మంత్రిత్వ శాఖ కోరింది. ఫేస్‌బుక్‌తో వాట్సాప్ డాటా పంచుకోవడంపై మంత్వ్ర శాఖకు కొన్ని ఆందోళనలున్నాయని ఆ వర్గాలవారు తెలిపారు. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్, బ్రిటన్ కేంద్రంగా ఉన్న రాజకీయ కన్సల్టింగ్ సంస్థ కేంబ్రిడ్జ్ ఎనలిటికాలు ఇటీవల డాటా బట్టబయలు విషయంలో వివాదానికి కేంద్ర బిందువుగా మారిన నేపథ్యంలో మంత్రిత్వ శాఖ కలత చెందుతున్నట్లు తెలిసింది. లావాదేవీలు జరిగేందుకు మాత్రమే చెల్లింపుల డాటాను ఉపయోగించుకుంటున్నాం. దుర్వినియోగం కాకుండా, మోసానికి లోనుకాకుండా యూజర్లను కాపాడేందుకు, వారికి కస్టమరు మద్దతును అందించేందుకు డాటాను ఉపయోగించుకుంటున్నట్లు వాట్సాప్ తెలిపింది. ‘‘డాటాను భద్రంగా నిక్షిప్తపరుస్తున్నాం. డెబిట్ కార్డులోని 6 చివరి సంఖ్యలు, యు.పి.ఐ పి.ఐ.ఎన్  వంటి సున్నితమైన వాడకందారుని డాటాను అసలు స్టోరే చేయడం లేదు’’ అని వాట్సాప్ వెల్లడించింది. ఈ సేవకు ఫేస్‌బుక్ మౌలిక వసతులను ఉపయోగించుకుంటున్నట్లు ఈ మొబైల్ మెసేజింగ్ సంస్థ అంగీకరించింది. తన మాతృ సంస్థ పేమెంట్ సమాచారాన్ని వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించుకోదని కూడా వాట్సాప్ పేర్కొంది. ‘‘వాట్సాప్‌పై మీరు చెల్లింపు జరిపినప్పుడు, ఫేస్‌బుక్‌కు చెందిన భద్రమైన చెల్లింపు వసతుల సాయంతో మేం చెల్లింపు ఆదేశాలను మా పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ (పి.ఎస్.పి)కి పంపుతాం. వాట్సాప్ పేమెంట్ సమాచారాన్ని ఫేస్‌బుక్ వాణిజ్య ప్ర యోజనాలకు ఉపయోగించుకోదు. సురక్షితమైన, భద్రమైన ఉత్తమ శ్రేణి చెల్లింపు మౌలిక వసతులను ఇవ్వజూపుతున్నం దు వల్ల సర్వీస్ ప్రొవైడర్‌గా ఫేస్‌బుక్‌ను వాట్సాప్ ఉపయోగించుకుంది’’ అని వాట్సాప్ ఈ మొ త్తం వ్యవహారంపై తన స్పందనను తెలియజేసింది. వాట్సాప్ తప్ప ఏం వాడను

Updated By ManamFri, 05/25/2018 - 10:53

ram charan  సోషల్ మీడియాకు తాను దూరంగా ఉంటానని హీరో రామ్ చరణ్ అన్నాడు. ‘హ్యాపీ మొబైల్స్‌’ పేరుతో రానున్న స్మార్ట్‌ఫోన్ ఓపెనింగ్‌లో పాల్గొన్న రామ్ చరణ్ అక్కడ మీడియా ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. అందులో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లో మీరు ఎక్కువగా ఏం వాడుతారని అడిగిన ప్రశ్నకు స్పందించిన చెర్రీ.. తాను వాట్సాప్ తప్ప ఏ సామాజిక మాధ్యమం వాడనని తెలిపాడు.

ఫేస్‌బుక్ అకౌంట్‌ను కూడా తన స్నేహితుడు హ్యాండిల్ చేస్తున్నాడని.. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో తనకు అకౌంట్ లేదని పేర్కొన్నాడు. అయితే తన భార్య ఉపాసన మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుదని వెల్లడించాడు. కాగా చెర్రీ ప్రస్తుతం బోయపాటి చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.
 వాట్సాప్‌కు సోనూసూద్ ఫన్నీ రిక్వెస్ట్

Updated By ManamFri, 05/11/2018 - 14:37

sonusood సోషల్ మీడియా వలన ఎంత ఫన్ ఉంటుందో అప్పుడప్పుడు అంతే చిరాకు కూడా ఉంటుంది. ఇక మెసేంజర్ యాప్ అయిన వాట్సాప్‌లో అయితే గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్‌నూన్, గుడ్ నైట్ అంటూ కొంతమంది మెసేజ్‌లు చేస్తూనే ఉంటారు. అలా పంపడం వారికి సరదా కాకపోయినా, వాటిని రిసీవ్ చేసుకున్న వారికి మాత్రం కొన్నిసార్లు చిరాకు వస్తుంటుంది. ఆ బాధితుల లిస్ట్‌లో నటుడు సోనూసూద్ ఒకరు. దీంతో విసుగు చెందిన ఆయన వాట్సాప్‌కు ఓ ఫన్నీ రిక్వెస్ట్‌ను పెట్టారు.

‘‘డియర్ వాట్సాప్, గుడ్‌మార్నింగ్ మెసేజ్‌లు పంపే వారందరికీ మీరు అమౌంట్ చార్జ్ చేయగలరా, ఆ తరువాత ఇంకా అలా ఎంతమంది గుడ్ మార్నింగ్ మెసేజ్‌లు పెడతారో చూడండి. లేకపోతే ఆ మెసేజ్‌లు రిసీవ్ చేసుకున్న వారికి డబ్బులన్నా ఇవ్వండి. గౌరవంతో మీ సోనూ’’ అంటూ రిక్వెస్ట్‌ పెట్టాడు సోనూసోద్. సోషల్ మీడియాలో ఆయన చేసిన ఈ మెసేజ్ ఇప్పుడు అందరి చేత నవ్వులు పూయిస్తోంది.

 వాట్సాప్‌లో మరో కొత్త గ్రూపు ఫీచర్..

Updated By ManamTue, 05/01/2018 - 14:16

WhatsApp, Android Users, Restricted Group Feature, Group Info Editsశాన్ ఫ్రాన్సిస్కో: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ అనుబంధ మెసేజింగ్ సంస్థ వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. వాట్సాప్ అప్లికేషన్‌లో కొత్త గ్రూపు సెట్టింగ్స్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకూ వాట్సాప్‌లో గ్రూపుసభ్యులుగా ఉన్నవారిలో గ్రూపు అడ్మిన్‌గా ఉన్నవారు మాత్రమే కాకుండా గ్రూపులోని ప్రతిఒక్కరూ గ్రూపు ఇన్ఫో సెట్టింగ్స్‌లో ఐకాన్, డిస్ర్కిపిక్సన్, విషయాన్ని తమకు నచ్చిన విధంగా మార్చుకునే వీలుంది. కానీ, తాజాగా వాట్సాప్ ప్రవేశపెట్టిన ఈ కొత్త ఫీచర్‌ అప్‌డేట్‌తో ఇకపై గ్రూపులోని అందరి సభ్యులపై గ్రూపు అడ్మిన్ మాత్రమే పరిమితి విధించవచ్చు. దీనిద్వారా గ్రూపు ఇన్ఫో సెట్టింగ్‌లోని ఐకాన్, డిస్ర్కిపిక్సన్, విషయాన్ని గ్రూపు సభ్యులు మార్చడం కుదరదు. గ్రూపు అడ్మిన్ అనుమతితో మాత్రమే మార్చుకోవచ్చునని వీఏబీటాఇన్ఫో పేర్కొంది. ఈ ఫీచర్‌కు సంబంధించి ఇటీవలే టెస్టింగ్ ప్రక్రియను పూర్తి చేసినట్టు తెలిపింది.

ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌ల్లో మాత్రమే అందుబాటులో ఉంది. కానీ, త్వరలోనే ఈ ఫీచర్‌ అప్‌డేట్‌ను అన్ని ఆండ్రాయిడ్, ఐఫోన్ (ఐఓఎస్), విండోస్ ఫోన్ ప్లాట్‌ఫాంలపై కూడా అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది. ఈ ఫీచర్ అప్‌డేట్ కావాలంటే వాట్సాప్ వినియోగదారులు ఆండ్రాయిడ్ వీ2.18.32 బీటా వెర్షన్‌ను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వెర్షన్‌లో మాత్రమే గ్రూప్ రిస్ట్రికెడ్ ఫీచర్ కనిపిస్తుంది. ఇంకేందుకు ఆలస్యం.. వెంటనే మీ వాట్సాప్‌ను అప్‌డేట్ చేసుకోండి.. 

కొత్త ఫీచర్ అప్‌డేట్ ఇలా చేసుకోవచ్చు..
- వాట్సాప్ గ్రూపు అడ్మిన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి.
ఎడిట్ గ్రూపు అడ్మిన్స్ , గ్రూపు ఇన్ఫో ఆప్షన్‌ కనిపిస్తుంది.
గ్రూపు ఇన్ఫో ఆప్షన్‌పై క్లిక్ చేయగానే.. ఆల్ పార్టిసిపెంట్స్ , ఓన్లీ అడ్మిన్స్ అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. 
ఓన్లో అడ్మిన్స్ అనే ఆప్షన్ ఓకే చేస్తే.. అడ్మిన్ మాత్రమే ఐకాన్, సంక్షిప్త సమాచారాన్ని మార్చవచ్చు.
ఆల్ పార్టిసిపెంట్స్ ఆప్షన్ ఓకే చేస్తే.. గ్రూపులోని అందరూ సెట్టింగ్స్‌లో మార్పులు చేసేందుకు వీలు ఉంటుంది. ప్రాణం తీసిన ఫేస్‌బుక్, వాట్సాప్ వ్యసనం

Updated By ManamTue, 04/17/2018 - 12:38
  • భర్తను, పిల్లలను నిర్లక్ష్యం చేసిన భార్య.. విసుగుపుట్టి చంపేసిన భర్త

man kills wife for ignoring family through addicted to facebook whatsappగురుగ్రామ్: ఫేస్‌బుక్, వాట్సాప్ మోజులో పడి భర్తను, పిల్లలను నిర్లక్ష్యం చేసిన భార్యను చంపేశాడో భర్త. హర్యానాలోని గురుగ్రామ్‌లోగల సెక్టార్ 92లోని సారే హోమ్స్‌లో గురువారం జరిగిందీ దారుణం. నిందితుడు హరిఓమ్ సింగ్ (32) తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు. తానే పోలీసులకు లొంగిపోయాడు. తన భార్య లక్ష్మి (32).. నిత్యం ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో చాటింగులు చేస్తుండేదని, ఆ మోజులో పడి తనను, తన పిల్లలను నిర్లక్ష్యం చేసిందని, భార్యగా తాను చేయాల్సిన పనులనూ చేయలేదని, దీంతో విసుగు చెందే తాను ఆమెను హతమార్చానని హరిఓం చెప్పుకొచ్చాడు. గురువారం రాత్రి ఆమె నిద్రపోతున్న సమయంలో గొంతు నులిమి హత్య చేశానని చెప్పాడు.

‘‘2006లో మాకు పెళ్లయింది. మాకు ఇద్దరు పిల్లలు. మా కాపురం అంతా సవ్యంగానే సాగిపోతుండేది. ఆ తర్వాత ఆమెకు నేను స్మార్ట్‌ఫోన్ కొనిచ్చాను. అప్పటి నుంచే మా కాపురంలో కొంత కల్లోలం మొదలైంది. రెండేళ్లుగా ఫోన్లో వాట్సాప్, ఫేస్‌బుక్‌లకు బాగా బానిసైపోయింది. మొదట్లో నేను కూడా లైట్ తీసుకున్నాను. తర్వాత తనకే బోరు కొడుతుందిలే అనుకున్నాను. మారలేదు. వాటి మోజులో పడి ఇంటి బాధ్యతలనే మరచిపోయింది.  వంట చేసేది కాదు. పిల్లలను స్కూలుకు రెడీ చేసేది కాదు. హోం వర్క్ చేయించేది కాదు. రాత్రింబవళ్లూ ఫేస్‌బుక్, వాట్సాప్‌లకే తన జీవితాన్ని అంకితం చేసింది. దీంతో కొన్ని రోజులు పోయాక తరచూ గొడవలు జరుగుతుండేవి. పిల్లలు కూడా బాగా బాధపడేవారు. దీంతో పిల్లలను కూడా కురుక్షేత్రలోని బోర్డింగ్ స్కూలుకు బలవంతంగా పంపించాల్సి వచ్చింది. అయినా కూడా ఆమెలో కించిత్ మార్పు కనిపించలేదు’’ అని హరిఓం చెప్పాడు.

అది మరింత ముదరడంతో ఎవరితోనో ఆన్‌లైన్‌లో వ్యవహారాలు నడుపుతున్నట్టు అనుమానమొచ్చిందని, గురువారం నిలదీస్తే పెద్ద గొడవే జరిగిందని, దీంతో దానిని మరింత ముందుకు తీసుకెళ్లకూడదన్న ఉద్దేశంతోనే ఆమెను చంపేశానని హరిఓం చెప్పాడు. పోలీసులకు లొంగిపోయిన అతడిపై కేసు నమోదు చేశారు. వాట్సప్, ఫేస్‌బుక్‌కు పెను కష్టం!

Updated By ManamWed, 03/07/2018 - 18:37

blackberryప్రజల జీవితాలతో విడదీయలేని అనుసంబంధాన్ని పెనవేసుకున్న వాట్సప్‌కు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. బ్లాక్‌బెర్రీ తీసుకున్న తాజా నిర్ణయం వాట్సప్ సంస్థ వెన్నులో వణుకుపుట్టిస్తోంది. తమ మెసేజింగ్ యాప్‌ను కాపీ కొట్టడం ద్వారా బ్లాక్‌బెర్రీ పేరిట ఉన్న ‘పేటెంట్’ హక్కులను ఫేస్‌బుక్, వాట్సప్, ఇన్‌స్టాగ్రమ్ ఉల్లంఘించాయని బ్లాక్‌బెర్రీ ఆరోపిస్తోంది. దీనికి సంబంధించి పెద్ద మొత్తంలో నష్టపరిహారం చెల్లించాలంటూ కోర్టులో దావా వేసింది. దావాలో బ్లాక్‌బెర్రీ ఎంత నష్టపరిహారం కోరిందో స్పష్టంగా తెలియకున్నా...ఇది వేలాది కోట్ల రూపాయలుగా ఉండొచ్చని తెలుస్తోంది.

2000 దశకంలో బ్లాక్‌బెర్రీ మెసెంజర్ అప్లికేషన్ చాలా పాపులర్‌గా ఉండేది. ఈ యాప్‌లో తాము తొలుత డిజైన్ చేసిన వాటినే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రమ్, వాట్సప్ కాపీ కొట్టాయని ఆ సంస్థ ఆరోపిస్తోంది. ఈ విషయంలో చాలా ఏళ్లుగా సదరు సంస్థలతో జరిగిన చర్చలు ఫలప్రదంకాకపోవడంతో...తమ షేర్‌హోల్డర్ల సూచన మేరకు చట్టరీత్యా ఎదుర్కొంటామని బ్లాక్‌బెర్రీ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

గతంలో పేటెంట్ వివాదాలకు సంబంధించి పలు కేసులను బ్లాక్ బెర్రీ గెలిచింది. ఇప్పుడు ఇదే వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రమ్‌ల వెన్నులో వణుకు పట్టిస్తోంది. జిగ్నేష్‌‌ను చంపేందుకు పోలీసుల కుట్ర!?

Updated By ManamSat, 02/24/2018 - 15:09

Jignesh Mevani fears for safetyన్యూఢిల్లీ: గుజరాత్ ఎమ్మెల్యే, దళిత యువనేత జిగ్నేష్ మేవానీ పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఎన్‌కౌంటర్‌ చేసేందుకు గుజరాత్‌ పోలీసులు కుట్ర చేస్తున్నారని ట్వీట్ చేశారు. ట్విట్టర్ వేదికగా ఈ ఆరోపణలు చేసిన జిగ్నేష్, దీనికి సంబంధించిన ఓ వెబ్‌ లింక్‌ను కూడా జత చేసి పోస్ట్ చేశారు. ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారుల మధ్య జరిగిన వాట్సప్ సంభాషణే దీనికి ఉదహారణ అని జిగ్నేష్ పేర్కొన్నారు. ఇప్పుడీ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 
 
ఈ వ్యవహారంపై మేవానీ గుజరాత్‌ డీజీపీ, ఆ రాష్ట్ర హోంమంత్రికి ఫిర్యాదు చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. కర్ణాటకలో బీజీపీకి వ్యతిరేకంగా ఏప్రిల్‌ నెలలో ప్రచారం చేస్తానని జిగ్నేష్ మేవానీ ప్రకటించిన విషయం తెలిసిందే. కర్నాటక రాష్ట్రంలో 20శాతం దళితులు ఉన్నారని.. ఒక్క దళిత ఓటు కూడా బీజేపీకి పడకుండా ప్రచారం చేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే.

వీడియోలో ఏముందంటే..
కొంతమంది పోలీసులు ఓ రాజకీయనాయకున్ని చితక బాదుతుండగా.. మరో వీడియోలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్‌కౌంటర్లపై పోలీసులను ప్రశంసిస్తూ యూపీ సీఎం ఇచ్చిన ఇంటర్వ్యూ ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఈ రెండు వీడియోలకు ఆ సదరు డిప్యూటీ ఎస్పీ పోలీసులు పట్ల అనుచితంగా, వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఇలాంటి చర్యలే తీసుకోవాల్సి ఉంటుందని క్యాఫ్షన్‌ ఇచ్చాడు. దీనిపై స్పందించిన ఆ ఎస్పీ, ఆ వీడియో సాదారణంగా షేర్ చేసుకున్నది మాత్రమేనని చెప్పుకొచ్చారు. మరి ఈ వీడియో వ్యవహారం ఎందాకా వెళ్తుందో.. ఆ పోలీసులపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. అయితే అసలు ఈ వీడియోలు ఆయనకు ఎలా వచ్చాయన్న విషయం తెలియరాలేదు. ఇప్పుడీ వీడియోలు వాట్సాప్‌లో వైరల్‌గా మారాయి.

 

 వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్!

Updated By ManamSat, 01/13/2018 - 18:35

WhatsApp, testing new feature, dismiss option, Group admin buttonశాన్ ఫ్రాన్సిస్కో: ప్రముఖ వాట్సాప్ యాప్‌లో మరో కొత్త ఫీచర్ బటన్ రాబోతోంది. సాధారణంగా వాట్సాప్ గ్రూపులో ఎంతమందైనా గ్రూప్ అడ్మిన్‌లుగా ఉండే సౌకర్యం ఉంది. అయితే కొన్నిసార్లు గ్రూపులో అడ్మిన్‌గా ఉన్న వ్యక్తిని అడ్మిన్ బాధత్యల నుంచి తొలగించే క్రమంలో సదరు వ్యక్తిని పూర్తిగా గ్రూపు నుంచి తొలగించాల్సి వస్తోంది. మళ్లీ ఆ వ్యక్తిని గ్రూపులోకి  కొత్తగా చేర్చుకోవాల్సి ఉంటుంది. ఇకపై అలాంటి ఇబ్బంది లేకుండా కేవలం గ్రూప్ అడ్మిన్‌గా మాత్రమే గ్రూపు నుంచి తొలగించే సౌకర్యంతో కొత్త ఫీచర్ బటన్.. త్వరలో అందరికి అందుబాటులోకి రానుంది. ఈ కొత్త ఫీచర్‌కు సంబంధించి స్క్రీన్ షాట్‌ను కూడా వాట్సాప్ ఇన్ఫో షేర్ చేసింది. అదే ‘డిస్మిస్’. ప్రస్తుతం ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌లో‌ ఈ ఫీచర్‌ టెస్టింగ్ దశలో ఉంది. ఇప్పటికే గూగుల్ ప్లే బీటా ఆండ్రాయిడ్ 2.18.12 వెర్షన్‌లో అందుబాటులో ఉంది. బీటా వెర్షన్‌ టెస్టింగ్ చేసుకునేందుకు సైన్ ఇన్ అయిన యూజర్లు ఈ యాప్ అందుబాటులో ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ను చెక్ చేసుకోవాలంటే కచ్చితంగా వాట్సాప్ గ్రూపు సభ్యులు కొందరిలో మీరూ అడ్మిన్‌గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. 

ఈ క్రమంలో గ్రూప్‌ అడ్మిన్‌గా ఉండే వ్యక్తులకు మరిన్ని అధికారాలు ఇచ్చే అంశంపై కూడా ప్రస్తుతం వాట్సాప్‌ పనిచేస్తోంది. గ్రూప్‌లోని సభ్యులెవరైనా చేసే టెక్ట్స్‌, ఫొటో, వీడియో, జిఫ్‌, డాక్యుమెంట్‌, వాయిస్‌ మెసేజ్‌లు వంటివి ఏవైనా నియంత్రించే అధికారం అడ్మిన్‌లకు ఇవ్వనుంది. గ్రూపులోని ఎవరైనా సభ్యడు ఇవన్నీ చేయాలంటే ముందుగా అతనికి అడ్మిన్‌ అనుమతి తప్పనిసరి. అలాగే, వాట్సాప్ మరో కొత్త ‘క్విక్ స్విచ్’ ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తేనుంది. ఈ ఫీచర్ ద్వారా వాయిస్ నుంచి వీడియో కాల్స్‌కు మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే ఈ ఫీచర్ యాప్ ఇప్పటికే ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉంది. 

Related News