cm kcr

కేసీఆర్ ఏమీ పీకుతాడో ...పీకమను..

Updated By ManamSat, 10/06/2018 - 12:46
Revanth reddy-Manam Telugu News

హైదరాబాద్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌పై తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓటుకు నోటు కేసు గురించి పదే పదే మాట్లాడుతున్న కేసీఆర్ తనను ఏమీ ఏకుతాడో ...పీకమను అంటూ సవాల్ విసిరారు. తనను దాటాకే... చంద్రబాబు వద్దకు వెళ్లాలి కదా అని రేవంత్ అన్నారు.  

రేవంత్ రెడ్డి శనివారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ...‘ కేసీఆర్ వస్తాడా? ఆయన వెనకున్న నరేంద్ర మోదీ వస్తాడా? అని ప్రశ్నించారు. పొత్తు కోసం చంద్రబాబు ఐదుకోట్లు...మూడు హెలికాప్టర్లు పంపాడంటున్న కేసీఆర్... నీవు టీడీపీ పొత్తు పెట్టుకున్నప్పుడు ఎన్నికోట్లు తీసుకున్నావో ముందు లెక్క చెప్పు. ఆంధ్రవాళ్లు అంటూ విమర్శలు చేస్తున్న కేసీఆర్‌కు అమరావతి వెళ్లినప్పుడు అది గుర్తుకు రాలేదా?. కమ్మవాళ్లను విమర్శిస్తున్న కేసీఆర్2కు తన పార్టీలో ఆ సామాజిక వర్గం వాళ్లకు టికెట్ ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడు గుర్తు లేదా? అని ప్రశ్నలు సంధించారు.

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై కేసులు ఎందుకు ఎత్తివేయలేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. కేవలం కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవితలపై ఉన్న కేసులే ఉపసంహరించారు?. ఎందుకు ఉద్యమకారులపై కేసులు ఉపసంహరించలేదు. ఉద్యమ కేసులు వల్ల అనేకమంది యువత ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్ ఇప్పుడు కల్లుతాగిన కోతికి తేలు కుడితే ఎలా ఎగురుతుందో... అలా ఎగురుతున్నారు. ఎన్నికలు కేసీఆర్ వర్సెస్ చంద్రబాబు నాయుడు లాగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు.

చంద్రబాబుకు కనీసం ఇక్కడ ఓటు కూడా లేదు. మరోసారి సెంటిమెంట్‌తో రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్నికలు కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ అనేదాన్ని ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నాడు. తెలంగాణ టీడీపీ పార్టీలో ఉన్నవారు తెలంగాణ బిడ్డలు కాదా? ముఖ్యమంత్రిగా ఉండి నీచమైన విమర్శలు చేయడానికి సిగ్గులేదా?. ఆంద్రా కాంట్రాక్టర్స్ వద్ద మోకరిల్లినప్పుడు ఆంధ్రా అని తెలియదా? నాలుగేళ్లలో ఏమీ చేయలేదని చెప్పేందుకు ఏమీలేదని... చంద్రబాబును టార్గెట్‌తో తెలంగాణ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తున్నాడు. కేసీఆర్ లాంటి అథముడు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునేందుకు అనర్హడు.

ఇక నాపై ఐటీ రైడ్స్ సందర్భంగా కొన్ని టీవీలు...పత్రికలు తప్పుడు వార్తలు ప్రసారం చేశాయి. ఆ వార్తల ఆధారంగానే మొన్న నాపై ఐటీ అధికారులు నాలుగు, ఐదు గంటలపాటు వేధించారు. ఆ చానల్స్, పత్రికలు వెంటనే అవి తప్పుడు వార్తలని వివరణ ఇవ్వాలి. బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేకుంటే పరువునష్టం దావా వేస్తా. దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని’ రేవంత్ రెడ్డి హెచ్చరించారు.



తెలంగాణ ద్రోహులకు బుద్ధి చెప్పాలి 

Updated By ManamThu, 10/04/2018 - 04:26
 • అదొక దిక్కుమాలిన కూటమి.. కాంగ్రెసోళ్లకు నైతిక విలువల్లేవు.. 

 • బలిదానాలతో సాధించుకున్న తెలంగాణను మళ్లీ ఆంధ్ర పార్టీలకు అప్పగిద్దామా

 • బాబు మోచేతి నీళ్లు తాగాలా? ఢిల్లీకి గులాం కావాలా? తేల్చుకోవాలి

 • ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్-1

 • మళ్ళీ అధికారం ఇస్తే పెన్షన్ పెంచుతాం

 • అన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించండి

 • నిజామాబాద్ ప్రజాఆశీర్వాద సభలో కేసీఆర్


నిజామాబాద్: తెలంగాణకు ద్రోహం తలపెట్టిన పార్టీలు రాజకీయ అధికారంకోసం అనైతిక పొత్తులు పెట్టుకోవడం, కూటమి కట్టడం విడ్డూరంగా ఉందని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నిజామాబాద్ నగర శివారులోని గిరిరాజ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుంటున్న కాంగ్రెస్ మహాకూటమిగా ఏర్పడటం సిగ్గుమా లిన చర్యగా ఆయన అభివర్ణించారు. ఆంధ్రులకు అధికారం ఇస్తే తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టినట్లేనని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ మర్యాద పూర్వకంగా తమని అడిగితే కనీసం నాలుగు సీట్లు ఇచ్చేవాళ్ళమని, ద్రోహులతో జతక ట్టడం దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. వందలాది మంది ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణను ఆం ధ్ర పార్టీలకు అప్పగిస్తే మళ్ళీ మన బతుకులు అంధకారం అవుతాయన్నారు. చంద్రబాబు మోచేతి కింద నీళ్ళు తాగా లా? అమరావతి గులం కావాలా?, ఢిల్లీకి గులాం కావాలా? అనేది మీరే తేల్చుకోవాలన్నారు. నల్లధనం వెలికి తీసి ఇంటికి 15 లక్షలు ఇస్తామన్న బీజేపీ నేతల మాటలు ఎక్కడికి పోయాయని ఆయన ప్రశ్నించారు.

image


ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు అంధకారంలో మగ్గిన తెలంగాణను టీఆర్‌ఎస్ ప్రభు త్వం ఏర్పడిన నాలుగేండ్లలో అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నామని, వ్యవసాయ రంగానికి ప్రపంచంలోనే ఎక్క డా లేని విధంగా అభివృద్ధి చేస్తూ ప్రణాళిక బద్ధంగా ముం దుకు పోతున్నామన్నారు. రైతు బంధు పథకం, రైతు బీమా పథకం, భూ రికార్డుల ప్రక్షాళన, 24 గంటల నిరంతర విద్యు త్‌ను అందిస్తూ బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నాం అన్నారు. 1,690 గ్రామాలలో గోదావరి జలాలను అందిస్తున్నామన్నారు. వచ్చే రెండు నెలల్లో మిషన్ భగీరథ పనులు పూర్తి చేసి ఇంటింటికి తాగునీరు అందిస్తామని కేసీఆ ర్ చెప్పారు. కోటి ఎకరాలకు సాగు నీరు అందించే ప్రాజెక్టుల పనులు వేగవంతంగా సాగుతున్నాయని, పొరుగు రాష్ట్రాన్ని ఒప్పించి కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు సాధించుకోవడం గర్వంగా ఉందన్నారు.

అయితే ఈ ఘనతను తాము 1974-75 లోనే అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు, కాంగ్రెస్ చేస్తున్న అసత్య ప్రచారంపై తాము సవాల్ విసురుతున్నామ న్నారు. దీనిపై గత ఏడాది క్రితమే అగ్రిమెంట్ చూపితే రాజ్‌భవన్‌కుపోయి రాజీనామా చేస్తానని కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసిరినా ఇప్పటి వరకు నిరూపించలేక పోయార న్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే పింఛన్లు పెంచు తానని, ఎంత అనేది టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో కమిటీ నిర్ణ యిస్తుందని ఆయన స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లాలో జన ప్రభంజనంతో మళ్ళీ 9అసెంబ్లీ సీట్లు గెలుస్తామని, ఇక్కడి నుండి విజయఢంకా మోగించడం ఖాయమని ఆయన అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న తెలంగాణను కాంగ్రెస్ పార్టీ మహా కూటమి ఆంధ్రపాలకులకు అప్పజెప్పేందుకు కుట్రపన్నడం సరికాదన్నారు.

నిజానికి మహాకూటమిలోని నాయకులు చిల్లర రాజకీయాల కోసం ప్రజలను మోసం చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడి కుట్రలను తిప్పికొట్టడం ఖాయమని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలంటే గులాబి జెండా ఎగురవేయాలని, ప్రజాక్షేత్రంలో చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల తీర్పుతో నిరూపించుకునేందుకు ముందస్తు ఎన్నికలకు సమరశంఖం పూరించావున్నారు. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వచ్చిన తాము సిద్ధవేునని ప్రకటించినా ప్రతిపక్ష పార్టీలు ముందస్తు కొరకు అసెంబ్లీని రద్దు చేస్తే ఎన్నికలలో అడ్డుకునేందుకు కేసులు వేస్తున్నారని ఆయన ఆరోపించారు.

తెలంగాణను సస్యశామలం చేయాలన్న సంకల్పంతో చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే 96 కేసులు వేయడం వ్యవసాయం పట్ల వారికి ఎంత ఆసక్తి వుందో కేసులను బట్టి రుజువు అవుతున్నదని ఎద్దేవా చేశారు. ప్రజలు మళ్ళీ టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి అధికారాన్ని అప్పగిస్తే రాష్ట్రంలో అద్భుత పాలనను అందించి అన్ని వర్గాలకు పెద్దన్నలా ఎల్లప్పుడు అందుబాటులో వుంటానని కేసీఆర్ చెప్పుకొచ్చారు. వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు, బీడీ కార్మికులకు, గతంలో ఏ ప్రభుత్వం చేయని ఆలోచన పెద్దకొడుకుగా వెయ్యి రూపాయల పింఛన్‌ను అం దించి ఆసరా కల్పిస్తున్నామని ఆయన వెళ్లడించా రు. అదే విధంగా ఆడపడుచులకు వివాహం కోసం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ రూపంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని చెప్పారు. వీటితోపాటు 204 రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.

1956 సంవత్సరం నెహ్రూ కాలంలో, 1969 సంవత్సరంలో ఇంధిరాగాంధీ హయాంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలు ఉద్యమం చేశారని, నాడు ప్రజల్ని బలిగొన్న కాంగ్రెస్ పార్టీకి నేడు తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ దద్దమ్మలు, సన్నాసులకు నైతిక విలువలు లేవని ఆయన మండిపడ్డారు. భారతదేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్‌ఎస్ ప్రభుత్వం 50 శాతం చేనేత కార్మికులకు, సంక్షేమ ఫలాలు అందించడం జరిగిందన్నారు. దీంతోపాటు వృద్ధులకు కంటి చూపు రావాలని ఉద్దేశ్యంతో రాష్ట్రంలో 44 లక్షల మందికి చికిత్స అందించడం జరిగిందని తెలిపారు. రాబోయే రోజులలో వినికిడి లోపం వున్న వారికి ప్రత్యేకంగా ఈఎన్‌టి సౌకర్యాలు అందించి ఆరోగ్య తెలంగాణగా మార్చి ప్రతి ఒక్కరుహెల్త్ ప్రొఫైల్‌ను పొందేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. రాబోయే రోజులలో జిల్లాలోని నిజాంసాగర్, గుత్పా, ఎస్‌ఆర్‌ఎస్‌పీ ప్రాజెక్టు కింద రైతాంగానికి సకాలంలో సాగునీరు అందించి తీరుతామని కేసీఆర్ స్పష్టం చేశారు. వ్యవసాయ రంగంలో 70 వేల కోట్ల రూపాయలు రుణాలు మాఫీ చేశామని, 2631 మంది ఏఈవోలను నియమించుకోవడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ నాయకులు సొల్లు పురాణాలు చెప్పి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారని, కానీ తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీకి గెలుపు రూపంలో దీవెన అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.  

వహ్వా..క్యా బాత్ హై
ఉర్దూలో అదరగొట్టిన కవిత.. తండ్రికి తగ్గ తనయగా ప్రశంసలు

imageఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు, కూతురును తండ్రికి తగ్గ వారని ప్రతి ఒక్కరూ కీర్తిస్తారు. ఆయన లక్షణాలను అచ్చుగుద్దినట్లు పుణికిపుచ్చుకున్నారని చెబుతారు. ఇప్పుడు కవిత దాన్ని నిరూపించారు. మాటల మాంత్రికుడుగా కేసీఆర్‌ను కీర్తిస్తారు. ఎదుటి వారి స్థాయికి తగ్గట్లు, వారి భాషలో, వారు మెచ్చే హావభావాలు, ఛలోక్తులతో మాట్లాడి వారిని ఆకట్టుకోవడం కేసీఆర్ ప్రత్యేకత. ఇదే తీరులో.. సేమ్ టు సేమ్.. కవిత నిజామాబాద్ సభలో ఉర్దూలో మాట్లాడటమే కాదు, డైలాగులు చెబుతూ ఉర్దూ భాష వచ్చిన వారినే కాదు, రాని వారితో సైతం వహ్వా అనిపించారు.



కాంగ్రెస్ నేతలు గిలగిలలాడుతున్నారు: కేసీఆర్

Updated By ManamWed, 10/03/2018 - 17:06
CM KCR Speech at Praja Ashirvada Sabha in nizamabad

నిజామాబాద్ : ‘తెలంగాణ ఆత్మగౌరవ బావుటా ఎగురవేసిన జిల్లా నిజామాబాద్ జిల్లా.  నిజామాబాద్‌‌‌లో జరిగిన సభలో ఎన్నోసార్లు పాల్గొన్నా. అయితే ఇంతటి జన ప్రభంజనాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదు. అధికారం చేపట్టేనాటికి రాష్ట్రంలో అన్ని సంక్షోభాలే. నిజామాబాద్ జిల్లాలో ఈ సభ ఓ ప్రభంజనం. 24 గంటల పాటు నిరంతరం విద్యుత్ సాధించాం.  ప్రతి ఇంటికి నల్లా నీళ్లు , రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే మా లక్ష్యం‘ అని టీఆర్ఎస్ అధ్యక్షుడు, అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. 

కాంగ్రెస్ బతుకులే కేసుల మయం
నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మరోసారి  కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆ అంటే కేసు.. ఊ అంటే కేసు అంటూ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ బతుకులే కేసుల మయమని మండిపడ్డారు.  ప్రతిదానిపైనా కాంగ్రెస్ నేతలు కేసులు వేస్తున్నారని కేసీఆర్ ధ్వజమెత్తారు. దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు పోదామని బీరాలు పలికిన కాంగ్రెస్ నేతలు... తాను ప్రభుత్వాన్ని రద్దు చేసిన తర్వాత ...ఆ నేతలు గిలగిలాడుతున్నారని ఎద్దేవా చేశారు. 

పింఛన్ పెంచబోతున్నాం..
మరోసారి పింఛన్ పెంచుతామని కేసీఆర్ హామీ ఇచ్చారు. అయితే ఎంత పెంచేదీ ఇప్పుడే చెప్పబోమని అన్నారు. అయితే కాంగ్రెస్ నేతల నోటి నుంచి రూ.2వేలు ఇస్తామని చెప్పించిన ఘటన గులాబీ జెండాదేనని అన్నారు. త్వరలోనే మ్యానిఫెస్టోను రూపొందిస్తామని తెలిపారు. 452 పథకాలు అమలు  చేస్తున్నామని, రైతులకు పెట్టుబడి ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణయే అని  కేసీఆర్ పేర్కొన్నారు. ఇక ఆర్థిక ప్రగతిలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని తెలిపారు.

పోచారం లక్ష్మీపుత్రుడు...
ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్... మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తారు. పోచారం శ్రీనివాసరెడ్డికి తాను పెట్టిన పేరు లక్ష్మీపుత్రుడని అన్నారు. నిజామాబాద్ జిల్లాకు నీళ్లు అందించాలంటూ ఆయన తనతో కొట్లాడి సాధించుకున్నారన్నారు. పోచారం వ్యవసాయ శాఖ మంత్రి అయ్యాక రైతులకు మేలు జరుగుతుందన్నారు. రూ.10కోట్లు ఇచ్చి ఎర్రజొన్న రైతులను ఆదుకున్నామన్నారు.



మరోసారి అవకాశమివ్వండి

Updated By ManamWed, 10/03/2018 - 03:24
 • నేటి నిజామాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో కోరనున్న కేసీఆర్   

హైదరాబాద్: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షులు కేసీఆర్ మరో దఫా ఎన్నికల ప్రచారం బుధవారం ప్రారంభం కాబోతుంది. ముందుగా నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్య మంత్రి ప్రసంగిస్తారు. ఇప్పటికే హుస్నాబాద్ బహి రంగ సభలో మాట్లాడారు. మరో సారి ప్రభుత్వం ఏర్పాటుకు ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 4న నల్లగొండ, 5న వనపర్తి, 8న ఖమ్మం బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి పాల్గొం టారు. 7వ తేదీన వరంగల్‌లో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని భావించిప్పటికీ కొండా సురేఖ దంపతులు కాంగ్రెస్‌లో చేరడం, స్టేషన ఘన్‌పూర్ అభ్యర్థి తాటికొండ రాజయ్య అభ్యర్థిత్వాన్ని పార్టీ శ్రేణులు వ్యతిరేకించడం లాంటి కారణాలతో ముఖ్య మంత్రి బహిరంగ సభను రద్దు చేశారు.
image
ముఖ్యమంత్రి పాల్గొనే బహిరంగ సభలకు పెద్ద ఎత్తున జనాన్ని తరలించడానికి తెరాస శ్రేణులు ఎంతగానో కృషి చేస్తున్నాయి. దాదాపు వారం రోజులుగా మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు బహిరంగసభల ఏర్పాట్లపై దృష్టి కేంద్రీకరించారు. ముందస్తు ఎన్నికలు, విపక్షాల విష ప్రచారం గురించి వివరించడంతో పాటు తెరాస ప్రభుత్వాన్ని మరోసారి అధికారంలోకి తేవలసిన అవసరాన్ని ప్రజలకు వివరించే విధంగా ముఖ్యమంత్రి ప్రసంగాలు ఉంటాయని పార్టీ వర్గాలు తెలియచేశాయి. తెరాస అభ్యర్థులు ఇప్పటికే ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. ఇంటింటికీ తిరగడం, సభలు, సమావేశాలు ఏర్పాటు చేయడం, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను ఓటర్లకు వివరించడం, స్థానికంగా జరిగిన అభివృద్ధిని తెలియజేసి ఓట్లడగడం లాంటి ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. 

ప్రతిపక్షాలు ఎన్నికల రంగంలోకి దిగక ముందే తెరాస అభ్యర్థులు నియోజక వర్గాన్ని చుట్టుముట్టడం జరుగుతుంది. 
తాజా మాజీ ఎమ్మెల్యేలు రంగంలో ఉండటంతో ప్రచారం వేగం పుంజుకుందని పార్టీ సీనియర్లు పేర్కొంటున్నారు. తెలంగాణలోని అత్యధిక నియోజక వర్గాల్లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది, అభ్యర్థులందరూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. పార్టీ శ్రేణులను కదిలించడం, వివిధ వర్గాలను కలుసుకోవడం, అసంతృప్తులను బుజ్జగించడం, ప్రజాభిమానం చూరగొనడం లాంటి కార్యక్రమాలు ఊపందుకున్నాయని తెలంగాణ భవన్‌కు సమాచారం అందుతున్నది. వంద రోజుల్లో 50 సభల్లో పాల్గొనాలని కేసీఆర్ ముందుగా భావించారు. కానీ అది సాధ్యం కాకపోవచ్చని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కొన్ని నియోజక వర్గాల్లో పార్లమెంటు సభ్యురాలు  కల్వకుంట్ల కవిత, మరి కొన్ని నియోజక వర్గాల్లో మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించే అవకాశం ఉంది.

మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో ముఖ్యమంత్రి బహిరంగ సభలు పెట్టవలసిన అవసరం ఏర్పడిందన్నారు. మంత్రులు తమ నియోజక వర్గాలకే పరిమితమై ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కొందరు మంత్రులకు కూడా అసంతృప్తుల బెడద తప్పలేదు. మంత్రి కేటీఆర్ సమక్షంలో అసంతృప్తివాదులను బుజ్జగించవలసి వచ్చింది. కొందరు కేటీఆర్ ఎదుట పార్టీ గెలుపు కోసం పాటుపడుతామని హామీ ఇచ్చినప్పటికీ నియోజక వర్గాల్లో ప్రచారంలో పాల్గొనడం లేదని తెలుస్తోంది.  ముఖ్యమంత్రి కేసీఆర్ సెప్టెంబర్ 6న మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి శాసనసభను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం మరుసటి రోజు ఎన్నికల సంఘానికి చేరుకుంది. ఆనాటి నుంచి  కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లపైన దృష్టి కేంద్రీకరించింది. ఎన్నికలు నవంబర్‌లోగా జరిగితే బాగుంటుందని తెరాస భావిస్తున్నది. అందుకు అవసరమైన ఏర్పాట్లను అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూలును ప్రకటించవలసి ఉంది. 

దసరా తర్వాత కేటీఆర్, కవితల ప్రచారం
మంత్రి కేటీఆర్, పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవితల ఎన్నికల ప్రచార సభలు దసరా తర్వాత ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 3 నుండి 8 వరకు ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచార బహిరంగ సభలు ఉన్నందున, ఆ తర్వాతనే కేటీఆర్, కవితలు ఎంపిక చేసిన నియోజక వర్గాల్లో పార్టీ అభ్యర్ధుల గెలుపు కోసం ప్రచారం నిర్వహించబోతున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఎన్నికల షెడ్యూలు వెలువడిన పక్షంలో ఎన్నికల ప్రచారంలో మార్పులుచేర్పులు ఉంటాయని పేర్కొంటున్నారు. ఇతరుల నియోజక వర్గాల్లో మిగతా మంత్రులు పెద్దగా ప్రచారం చేసే అవకాశం లేదంటున్నారు. గజ్వేల్‌లో ముఖ్యమంత్రి తరఫున ఇప్పటికే మంత్రి హరీశ్‌రావు ప్రచారం నిర్వహిస్తున్నారు. మంత్రులు తమ నియోజక వర్గాలు, జిల్లాలకు పరిమితమై ప్రచారం చేసుకుంటారని తెలియజేశారు.



దారికొస్తున్న రెబెల్స్

Updated By ManamMon, 10/01/2018 - 04:03
 • ఎమ్మెల్సీలు, నామినేటెడ్ పోస్టులిస్తామని పూచీ

 • తగ్గిపోతున్న పోటాపోటీ సభలు, ర్యాలీలు

 • టీఆర్‌ఎస్‌లో ఫలితాలిస్తున్న అగ్రనేతల చర్చలు

trsహైదరాబాద్: మరోసారి అధికారం దక్కించుకునేందుకు పక్కా వ్యూహంతో ముందుకు పోతున్న టీఆర్‌ఎస్ ప్రచారంలో దూకుడు పెంచింది. నాయకులు అట్టహాసంగా ఊరూవాడా కలియదిరుగుతు న్నారు. మళ్లీ గెలిపిస్తే తెలంగాణ రూపురేఖలు మారుస్తామని హామీలిస్తున్నారు. అయితే, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సెప్టెంబర్ 6న 105 మంది తొలి జాబితా ప్రకటించిన విషయం తెలిసిందే. మిగతా 14 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిం చకుండా పెండింగ్‌లో పెట్టారు. కొన్ని స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు ఇంఛార్జిలకు టిక్కెట్లు ప్రకటించలేదు. దీంతో పలు నియోజక వర్గాల్లో ఆందోళనలు మొదలైనాయి. టిక్కెట్లు దక్కని నేతలు తమ అనుచరులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ ప్రకటించిన అభ్యర్థులకు మద్దతు ఇవ్వలేమని బాహాటంగా చెప్పారు. స్వతంత్రంగా బరిలో దిగుతామని కొన్ని చోట్ల హెచ్చరించి ‘అధికార’ అభ్యర్థులకు పోటాపోటీగా సమావేశాలు, ర్యాలీలు నిర్వహించారు. ఇటువంటి వారిని అదుపు చేసేందుకు పార్టీ పెద్దలు కేటీఆర్, కవిత, సంతోష్‌కుమార్‌తో పాటు ఆయా జిల్లాల మంత్రులు కూడా అసమ్మతి నేతలతో చర్చలు జరిపారు. ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ, నామినెటేడ్ పోస్టు ఇస్తామని హామీలిచ్చారు. దానితో అధిష్ఠానం పంపిన దూతల హామీ మేరకు రెబెల్స్ కొంత వెనకడుగు వేసి పార్టీ నిర్ణయం ప్రకారం ముందుకు పోవాలని భావిస్తున్నారు.

నియోజక వర్గాల వారీగా చూస్తే ఉప్పల్ నియోజక వర్గంపై టికెట్ ఆశించిన మేయర్ బొంతు రామ్మోహన్ జాబితాలో తన పేరు లేకపోవడంతో అలక వహించారు. ఆయనకు ఐదుగురు కార్పొరేటర్లు మద్దతుగా నిలిచారు. బేతి సుభాష్‌రెడ్డికి టికెట్ ఇవ్వొద్దని, ఆయన కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉండరని తాము సహకరించమని భీష్మించారు. మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగి కార్పొరేటర్లలతో మాట్లాడటంతో వారు శాంతించి అధిష్టానం ప్రకటించిన అభ్యర్థి వెంటే ఉంటామని పేర్కొన్నారు. అదే విధంగా శేరిలింగంపల్లిలో అరికెపూడి గాంధీ అభ్యర్థితత్వం ప్రకటించడంపై ఆశావహులు జగదీష్ గౌడ్, రాగం నాగేందర్ వంటి నాయకులు వ్యతిరేకంగా ప్రకటనలు చేసి స్థానికులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారం రోజుల పాటు పార్టీకి అంటిముట్టనట్లుగా వ్యవహారించారు. వెంటనే నగర మంత్రులు రంగంలోకి దిగి వారికి నచ్చజెప్పి పార్టీ లైన్‌లో నడవాలని సూచించడంతో వారు కూడా చల్లబడి అభ్యర్థికి  జై కొడుతున్నారు. కూకట్‌పల్లి మాధవరం కృష్ణారావుకు ఇవ్వడంపై ప్రజలు హర్షించరని, ప్రజాబలమున్న నాయకులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తాము బరిలో ఉంటామని కావ్య, హరీష్‌రెడ్డి పేర్కొన్నారు. వీరితో కూడ పార్టీ నాయకులు మాట్లాడి అసమ్మతి సద్దుమణిగేలా చేశారు. పటాన్‌చెరువులో గూడెం మహిపాల్‌రెడ్డికి టికెట్ ఇస్తే ఓటమి తప్పదని, గాలి అనిల్‌కుమార్ అనుచరులు వ్యతిరేకత  ప్రదర్శించారు. మహిపాల్‌కు తప్ప మరో నాయకునికి ఇవ్వాలని పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహించారు. జిల్లా మంత్రి హారీష్‌రావు వారికి నచ్చజెప్పి అనిల్‌కు ఎమ్మెల్సీ ఇస్తామని ఒప్పించడంతో ప్రస్తుతం ప్రచారం చేస్తున్నారు. షాద్‌నగర్‌లో సిట్టింగ్ అభ్యర్థి అంజయ్యయాదవ్‌కు వ్యతిరేకంగా శంకర్, అందెల బాబయ్యలు పోటాపోటీగా సమావేశాలు జరిపి మాఇద్దరిలో ఒకరికి ఇవ్వాలని హైకమాండ్‌ను కోరారు. మంత్రి మహేందర్‌రెడ్డి వారితో ప్రత్యేక సమావేశం జరిపి పార్టీ అభ్యర్థులపై సర్వే చేయించి టికెట్లు ఇచ్చిందని, దానిలో ఎటువంటి మార్పు ఉండదని, మీరంతా ఖచ్చితంగా అభ్యర్థికి సహకరించాలని స్పష్టం చేశారు. దీంతో విధిలేక రెబెల్స్‌గా ముద్రపడ్డ నేతలంతా పార్టీ అనుకూలంగా మారిపోయారు.

నల్లగొండ నియోజకవర్గం నుంచి వలస నేత కంచర్లభూపాల్‌రెడ్డికి కేటాయించారు. ఆగ్రహం వ్యక్తం చేసిన దుబ్బాక నర్సింహ్మారెడ్డి తాను రెబెల్‌గా పోటీ చేస్తానని ప్రకటించారు. ఐదురోజుల పాటు అనుచరులతో హంగామా చేశారు. ఇంతలోనే మంత్రి జగదీష్‌రెడ్డి ఆయనతో చర్చలు జరిపి అభ్యర్థికి ప్రచారం చేసేలా ఒప్పించారు. మునుగోడు సీటు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి ఇవ్వగా, అప్పటికే తాను పోటీ చేస్తానని చెప్పిన వేనేపల్లి వెంకటేశ్వరరావు ఒక్కసారిగా మండిపడ్డారు. ఏమాత్రం ప్రజాబలంలేని వారికి ఏవిధంగా టిక్కెట్ ఇస్తారని పార్టీ పెద్దలను ప్రశ్నించారు. తనకే  టిక్కెట్ ఇవ్వాలని, నిరాకరిస్తే బరిలో ఉంటానని కరాఖండీ చెప్పారు. ఆయన పోకడలను చూసిన మంత్రి కేటిఆర్ తన వద్దకు పిలుపించుకుని పార్టీ అధినేత మాటను దిక్కరించడం సరికాదు, ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత మీకు ఆశించిన పదవి కట్టబెడుతానని హామీ ఇవ్వడంతో ఆయన మౌనంగా దాల్చారు. మిర్యాలగూడలో నల్లమోతు భాస్కర్‌రావుకు ఇవ్వడంపై నియోజకవర్గం ఇంచార్జీ అమరేందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక కార్పొరేటర్లు, ఎంపీటీసీలతో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. భాస్కర్‌రావుకు మద్ధతు ఇచ్చేదిలేదని ప్రకటించారు. రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతుండటంతో జిల్లా మంత్రి చొరవ తీసుకుని సమస్యకు పుల్‌స్టాప్ పెట్టారు. అందరు కలిసి పనిచేసేలా చేశారు. పాలకుర్తిలో టీడీపీ నుంచి వచ్చిన ఎర్రబెల్లికి ఇవ్వడంపై ఆనియోజకవర్గ ఇంచార్జీ తక్కలపల్లి రవీందర్‌రావు వ్యతిరేకించారు. తానుకూడా పోటీ చేస్తానని పేర్కొన్నారు. ఆసమ్మతి పెరగకుండా పార్టీ ఇద్దరికి మధ్య సయోద్య కుదిరించి వ్యతిరేక వర్గం లేకుండా చేసింది. స్టేషన్ ఘన్‌పూర్ రాజయ్యను అభ్యర్థిగా ప్రకటన చేయడంతో ఉపముఖ్యమంత్రి కడియం వర్గీయులు ఆయనకు ఇవ్వద్దని ధర్నాలు చేశారు. వారం రోజుల పాటు స్థానికంగా ఆందోళనలు చేశారు. మహబూబబాద్ శంకర్‌నాయక్‌కు టిక్కెట్ కేటాయించడంతో మాజీ ఎమ్మెల్యే కవిత జీర్ణించుకోలేకపోయారు. ఆయనపై అనేక ఆరోపలున్నాయని, బరిలో ఓటమి తప్పదని, ఆసీటు తనకే ఇవ్వాలని డిమాండ్ చేసి అనుచరులతో ప్రదర్శనలు నిర్వహించింది. జిల్లా పార్టీ పెద్దలు రంగంలోకి దిగి ఈసారి పార్టీకి సహాకరిస్తే నామినెటేడ్ పదవి ఆఫర్ ఇవ్వడంతో ఆమె మెటు దిగింది. మానకొండూరులో రసమయి బాలకిషన్ వ్యతిరేకంగా ఓరుగంటి ఆనంద్ పోటీ చేస్తానని పేర్కొని, క్యాడర్‌ను సమాయత్తం చేస్తున్నారు. ఇంతలో ఎంపీ వినోద్‌కుమార్ చొరవతీసుకుని అందరు కలిసిపోయేలా చేసి ఐక్యత రాగం వినిపించేలా చేశారు. మంథనిలో పుట్టమధుకు ఇవ్వడంపై సునీల్‌కుమార్‌రెడ్డి వ్యతిరేకించి, మరోవర్గంగా మారడంతో పార్టీ నాయకత్వం ఆయనను ఒప్పించి పార్టీలో పనిచేసే విధంగా చేశారు. జగిత్యాల్లో డాక్టర్ సంజయ్‌కుమార్ ఇస్తే ఓడిస్తానని జితేందర్‌రావు హెచ్చరించారు. వేములవాడలో చెన్నమనేని రమేష్‌ను తప్పించి జెడ్పీ చైర్మన్ తుల ఉమకు ఇవ్వాలని పట్టుబట్టారు. కేటీఆర్ మాట్లాడంతో అందరం ఏకతాటిపైకి వచ్చారు. రామగుండంలో సోమావరపు సత్యనారాయణ ఓడిపోతాడని, కోరుకంటి చందర్‌కు ఇవ్వాలని స్థానిక నాయకులు డిమాండ్ చేశారు .కానీ ఈటల వారితో మాట్లాడి పార్టీ లైన్‌లో వెళ్లాలని సర్ధి చెప్పారు. సత్తుపల్లిలో పిడమర్తి రవి టికెట్‌పై మట్టాదయానంద్ సీరియస్‌గా ఉన్నారు. తాను బరిలో ఉంటానని హెచ్చరించారు. మంత్రి తుమ్మల సర్ధిచెప్పడంతో అందరు ఒకటైయ్యారు. పినపాక సీటు పాయం వెంకటేశ్వర్లుకు ఇవ్వడంతో వట్టం రాంబాబు వ్యతిరేకించి పోటీ చేస్తానని కుండ బ్దదలు కొట్టారు. తుమ్మల ఆయనతో చర్చలు జరిపి పోటీనుంచి తప్పుకునేలా చేశారు. దాదాపు టీఆర్‌ఎస్ అసమ్మతుల బెదడ తగ్గి, ప్రచారంలో దూసుకెళ్లుతున్నారు.మరో ఐదారుగురు ఉంటే వారిని కూడా అందుబాటులోకి తీసుకుని రాజీ కుదిరిచేందుకు నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి.



కేసీఆర్‌‌కు ఫిర్యాదు చేయడానికి వచ్చా..

Updated By ManamSun, 09/30/2018 - 17:01
 • ఆత్మహత్యాయత్నానికి పాల్పడలేదు

 • ఉస్మానియా వైద్య సిబ్బందిపై ఫిర్యాదు చేయడానికి వచ్చా.

man compaliant against to Osmania Hospital హైదరాబాద్ : ప్రగతి భవన్ ఎదుట ఆదివారం ఓ వ్యక్తి బలవన్మరణానికి యత్నించాడన్న వార్త కలకలం రేపింది. అయితే గుడిమల్కాపూర్‌కు చెందిన తోఫిక్ ... చాదర్‌ఘాట్‌లో జరిగిన ప్రమాదంలో గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లగా అక్కడ వైద్య సిబ్బంది సరైన వైద్యం అందించలేదు.

దీనిపై ప్రశ్నించగా, దాడికి పాల్పడ్డారని, వారి నిర్వాకంపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయటానికి వచ్చానట్లు బాధితులు తెలిపాడు. అయితే తన గాయాలు చేసిన సీఎం క్యాంప్ ఆఫీస్ పోలీసులు వెంటనే చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పాడు. అంతేగానీ తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడలేదని స్పష్టం చేశాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 



విలక్షణ నేత వాజపేయి

Updated By ManamFri, 09/28/2018 - 00:53
 • ప్రధానుల్లోనూ ఆయన ప్రత్యేకం

 • ఎకరం స్థలంలో స్మారకం కడతాం.. నగరంలో వాజపేయి విగ్రహం

 • శాసనమండలిలో ముఖ్యమంత్రి కేసీఆర్ 

kcrహైదరాబాద్: దేశ ప్రధానుల్లో వాజపేయి విలక్షణమైన వారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గురువారం శాసనమండలిలో వాజపేయి సంతాప తీర్మానాన్ని ఆయన ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... వాజపేయి స్మారకార్థం హైదరాబాద్‌లో ఎకరం స్థలం కేటాయించాలని, విగ్రహం నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ముక్కుసూటిగా, నిష్కర్షంగా వెళ్లే వ్యక్తి వాజపేయి అని వివరించారు. వాజపేయి ఏదో ఒక రోజు దేశానికి ప్రధానమంత్రి అవుతారని జవహర్‌లాల్ నెహ్రూ అన్న మాటలను అటల్ నిజం చేశాడన్నారు. ఆయన గొప్ప వ్యక్తి.  ప్రతిపక్షంలో ఉన్నా గౌరవం తగ్గలేదు, బతికున్నప్పుడు వాజపేయి కి భారతరత్న రావడం అదృష్టం, ఈ అవకాశం అతి కొద్ది మందికి మాత్రమే లభిస్తుంది అని ఆయన అన్నారు. మాజీ  రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వాజపేయి ఇంటికి వచ్చి భారతరత్న పురస్కారాన్ని అందచేశారని, దేశ చరిత్రలో వాజపేయి చిర స్ధాయిగా నిలిచిపోతారని, ఆయన ఉపన్యాసాలు మృదుభాషలో ఉంటా యని, ఉత్తమమైన విలువలు నెలకొల్పారు అని కేసీఆర్ కొనియాడారు. దేశానికి ఉత్తమ పరిపాలన అందించారు. అంతర్జాతీయంగా దేశ ఖ్యాతిని ఇనుమడింపచేశారు, విజయవంతంగా అణుపరీక్షలు నిర్వహించారు,  దేశ ప్రయోజనాల విషయంలో ఆయన ఏనాడూ రాజీ పడలేదు, ఎవరు గొప్ప పనులు చేసినా వాజపేయి పొగిడేవారు, గొప్ప ఆదర్శ పురుషుడు, ఇందిరాగాంధీని వాజపేయి అపరకాళీగా అభివర్ణించారు, హైదరాబాద్‌తో వాజపేయికి ప్రత్యేక అనుబంధం ఉంది, జ్ఞాపకాలు, వారి చర్యలు భావితరాలకు స్పూర్తిగా ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు. వాజపేయి ఆత్మకు శాంతి చేకూరాలని, ప్రగాఢమైన సానుభూతిని వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబానికి సంతాపాన్ని తెలియజేశారు. ముఖ్యమంత్రి ప్రతిపాదించిన సంతాప తీర్మానంపై షబ్బీర్ అలీ, రామచంద్రరావు, పాతూరి సుధాకర్ రెడ్డి తదితరులు మాట్లాడారు. అనంతరం సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది.

రెండు గంటల పాటు సాగిన మండలి సమావేశాలు
తెలంగాణ శాసనమండలి పదో విడత సమావేశం గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయింది.  మండలి ఛైర్మన్ కనకమామిడి స్వామిగౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్, మంత్రులు, మండలి సభ్యులు పాల్గొన్నారు. దివంగత ప్రధా ని అటల్ బిహారీ వాజపేయి, లోక్ సభ మాజీ స్పీకర్ సోమనాథ్ చటర్జీ, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, శాసనమండలి మాజీ సభ్యులు నేరెళ్ల వేణుమాధవ్‌లకు, కేరళ వరదలు, కొండగట్టు బస్పు ప్రమాదాల్లో మరణించిన వారికి సంతాపం తెలియచేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. సంతాప తీర్మానాలపైన షబ్బీర్ అలీ, రామచంద్రరావు, పాతూరి సుధాకర్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, కర్నె ప్రభాకర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, ఆకుల లలిత తదితరులు మాట్లాడారు. వేణుమా ధవ్ స్మారకార్ధం ఒక అవార్డును ప్రకటించబోతున్నామని ముఖ్యమంత్రి తెలియచేశారు. అనంతరం సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. సుమారు ఒంటి గంట సమయంలో ఛైర్మన్ స్వామిగౌడ్ సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

రాజ్యాంగ నిబంధనలకు లోబడే సమావేశాలు: చీఫ్ విప్
రాజ్యాంగ నిబంధనలకు లోబడే మండలిని సమావేశ పర్చడం జరుగుతుందని మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ విలేకరులకు తెలియచేశారు. సంతాత తీర్మానాలతోనే సభ ప్రారంభమవుతుందన్నారు. కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి నివాసాలపై జరుగుతున్న ఈడీ దాడులతో టీఆర్‌ఎస్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ నాయకులు అనవసర ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతల చవకబారు ఎత్తుగడలు విజయం సాధించవన్నారు. కాంగ్రెస్ నాయకులు నేల విడిచి సాము చేస్తున్నారని ఆరోపించారు. వారి పరిస్థితి ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా ఉందన్నారు.

ఆధునీకరించిన మందిరంలో  శాసనమండలి సమావేశాలు
ఆధునీకరించిన సమావేశ మందిరంలో గురువారం శాసనమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన మంత్రి వర్గ సహచరులు, మండలి సభ్యులు హజరయ్యారు. ఉపముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, సభా వ్యవహారాల శాఖ మంత్రి టి. హరీశ్‌రావు, హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహచార్యులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు.



కొండా లక్ష్మణ్ బాపూజీకి సీఎం కేసీఆర్ నివాళులు

Updated By ManamThu, 09/27/2018 - 03:34

imageహైదరాబాద్: ఆచార్య కొండా లక్ష్మణ్  బాపూజీ 103 జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు ఘనంగా నివాళ్లర్పించారు. తెలంగాణ కోసం ఆయన చేసిన పోరాటాలను గుర్తు  చేసుకున్నారు. స్వాతంత్య్ర సమరయోధునిగా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు జీవితాంతం పోరాడిన మహో యేధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. ఆయన ఆశయ సాధనలో ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించడానికి నిరంతరం పాటు పడుతున్నామని వివరించారు.



నరసింహన్‌తో కేసీఆర్ భేటీ

Updated By ManamThu, 09/27/2018 - 00:54
 • ముందస్తు ‘వ్యవహారాలపై’నే సుధీర్ఘ చర్చ?.. సంక్షేమ పథకాల అమలుపై గవర్నర్‌కు వివరణ..

 • గవర్నర్‌ను కలిసిన సీఎస్, డీజీపీ.. కేంద్రం నుంచి అందిన సమాచారం మేరకే చర్చలు! 

kcrహైదరాబాద్: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం మధ్యాహ్నం గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో రాజ్‌భవన్‌లో సమావేశమయ్యారు. ఇది కేవలం మర్యాదపూర్వకమైన భేటీ మాత్రమేనని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నప్పటికీ, ఈ భేటీ రెండు గంటలకు పైగా జరగడం, సమావేశం తరువాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్. కె.జోషి, పోలీసు డైరెక్టర్ జనరల్ మహేందర్ రెడ్డి కూడా గవర్నర్‌ను కలవడంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. ముందస్తు ఎన్నికల ఏర్పాట్ల పైనే ప్రధానంగా చర్చ జరిగి ఉంటుందని భావిస్తున్నారు.    రైతు బంధు చెక్కుల పంపిణీ, బతుకమ్మ చీరల పంపిణీ తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. కేసీఆర్ రాజ్ భవన్ లో గవర్నర్‌తో వివిధ అంశాలపైన చర్చలు జరిపారు.  అక్టోబర్‌లో రెండవ విడత రైతు బంధు చెక్కులను పంపిణీ చేయవలసి ఉంది, అదే విధంగా బతుకమ్మ చీరలను కూడా పంపిణీ చేయడం పైన గవర్నర్‌తో చర్చించినట్లు తెలిసింది.  మిషన్ భగీరథ పురోగతి, కేంద్రం ప్రకటించిన ఆయుష్మాన్ భవ పథకం అమలు పర్చక పోవడానికి గల కారణాలను గవర్నర్‌కు వివరించినట్లు తెలిసింది. కేంద్రం ప్రకటించిన ఆయుష్మాన్‌భవ పథకం కంటే  ప్రభుత్వం అమలు జరుపుతున్న ఆరోగ్యశ్రీ పథకం బాగుందని వివరించినట్లు తెలిసింది. ఉద్యోగులకు ఐఆర్ అంశం గవర్నర్ దృష్టికి తెచ్చినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే అమలులో ఉన్న పథకాల కొనసాగింపులో అభ్యంతరాలు లేనప్పటికీ పాలనాపరంగా తీసుకోవలసిన చర్యలపై ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి,  పోలీసు డైరెర్టర్ జనరల్‌తో కూడా గవర్నర్ శాంతి భద్రతల అంశాన్ని చర్చించారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. పట్టపగలు నడి రోడ్డులో అందరి కండ్లముందే  హత్యలు జరగడం పట్ల గవర్నర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్లు తెలియవచ్చింది. ముందస్తు ఎన్నికల ఏర్పాట్లపై కూడా ఈ సందర్బంగా చర్చించారని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి ఇంతటి సుదీర్ఘ చర్చలు గవర్నర్‌తో జరపలేదని రాజ్ భవన్ వర్గాలు పేర్కొన్నాయి. గత కొంత కాలంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఫామ్‌హౌజ్ నుండే పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు.

పార్టీ అభ్యర్దుల ప్రచారాలను సమీక్షించడం జరుగుతుంది. అసంతృప్తులను బుజ్జగించడం, కొందరికి హెచ్చరికలు జారీ చేయడం లాంటి వ్యవహారాలతోనే తీరిక లేకుండా ఉన్నారు. పార్టీ అభ్యర్ధుల ప్రచారం, ప్రజాభిప్రాయం పై సర్వేలు నిర్వహించడం జరిగింది. సర్వే నివేధికల ఆధారంగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాలని భావించి అక్టోబర్ 3న నిజామాబాద్, 4న నల్లగొండ, 5న మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి సిద్దమయ్యారు. కేంద్రం నుండి అందిన అత్యంత కీలకమైన అంశంపైన చర్చించడానికి గవర్నర్ నరసింహన్ బుధవారం ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీసు డైరెక్టర్ జనరల్‌ను రాజ్‌భవన్‌కు పిలిపించుకొని ఉంటారని భావిస్తున్నారు. నవంబర్‌లో తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరిపించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతుందనే ప్రచారానికి ఊతమిచ్చే విధంగా బుధవారం నాటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆక్టోబర్ 8న ఓటరు జాబితాను ప్రకటించడంతో కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ శానసనభకు ఎన్నికలు జరిపించడానికి సర్వం సిద్దంగా ఉందనే సంకేతాలు ఇప్పటికే వెలువడ్డాయి.



ముందే ఉర్కండి

Updated By ManamTue, 09/25/2018 - 00:09
 • ప్రత్యుర్థులు షురువు చేయకముందే మొదటి దశ ముగించండి

 • ఎన్నికల ప్రచారంపై టీఆర్‌ఎస్ అభ్యర్థులకు కేసీఆర్ ఆదేశం

kcrహైదరాబాద్: రాష్ట్రమంతా ముందస్తు ఎన్నికల కోలాహలమే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో విపక్ష పార్టీలను, ప్రత్యర్థి నాయకులను ముప్ప తిప్పలు పెట్టడానికి టీఆర్‌ఎస్ అధినేత, ఆపద్ధర్మ సీఎం వ్యూహం ఖరారు చేశారు. దీనిలో భాగంగా ఎవరూ ఊహించని రీతిలో ప్రచారం చేయాలని నిశ్వచయించారు. తాను ఎన్నికల సభల్లో పాల్గొంటూ ప్రచారం చేయడంతో పార్టీ నాయకులు, అభ్యర్థులు వెన్నంటి ఉంటూ సరికొత్త పద్ధతిలో ముందుకు నడిపించనున్నారు. మరో పక్క తమ పార్టీ నేతల అలకలు, అసమ్మతులు చల్లార్చడానికి ముందుగా ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం మొదలుపెడితే అవన్నీ సద్దుమణుగుతాయని నేతలకు సూచిస్తూ, ఆ మేరకు వారికి దిశానిర్దేశనం చేస్తున్నారు. తమ మాట వినని నేతలను దారికి తెచ్చేందేకు ట్రబుల్ షూటర్లతో పాటు మంత్రులు, జిల్లా నేతలను రంగంలోకి దింపారు. చర్చలు, మంతనాలు, బుజ్జగింపుల అనంతరం కూడా మొండికేసే వారిపై అధిష్టానం కఠిన చర్యలకు దిగనుందని సమా చారం.  కొంతమంది టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఈసరికే ప్రచా రం కొనసాగిస్తున్నారు. దీనికి తోడు పార్టీ అభ్యర్థులకు అవసరమైన ప్రచార సామాగ్రిని సోమవారం సరఫ రా చేసింది. అభ్యర్ధులను ప్రకటించిన 105 శాసనసభ నియోజకవర్గాలకు సామాగ్రి తర లింపు పూర్తయింది. సీఎం కే. చంద్రశేఖర్‌రావు రాజకీయ కార్యదర్శి, టీఎస్‌ఎండీసీ ఛైర్మన్ శేరి సుభాష్ రెడ్డి ప్రచార సామాగ్రిని పంపిణీని పర్యవేక్షించారు. సామాగ్రిలో వివిధ సైజుల్లో పార్టీ జెండాలు, కండువాలు, టోపీలు, బ్యాడ్జిలు, కారు గుర్తు , కేసీఆర్ చిత్రపటంతో కూడిన జెండాలు ఉన్నాయి. గ్రామ గ్రామాన జరిగే అభ్యర్థుల ప్రచారం, వాహన ర్యాలీలు, బహిరంగ సభలకు అవసరమైన సామాగ్రి అంతా ఇందులో ఉంది. ప్రచార సామాగ్రి అం దడంతో పార్టీ కేడర్‌లో నూతనోత్సాహం కనప డుతుంది. ప్రచారం మరింత ఊపందు కుంటుందని అభ్యర్థులు చెబుతు న్నారు. విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లడం, పార్టీ ప్రచార హోరు తెలిపే విధంగా సామాగ్రి ఉంటే సరికొత్త జోష్ వస్తుంద ని అభ్యర్థులంటున్నారు. 90 శాతానికి పైగా అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేసి ప్రత్యర్థుల ను కంగుతినిపించిన కేసీఆర్... ప్రతిపక్షాల అభ్యర్థులు ఖరారు కాక ముందే మొదటి దశ ప్రచారాన్ని పూర్తి చేయాలని పార్టీ అభ్యర్థులకు సూచిస్తున్నారు. దీంతో వారందరు ప్రచారంలో నిమగ్నమ య్యారు. ఇదే ఊపు ఉత్సాహాన్ని కొనసాగించా లని సూచిస్తున్నారు. గ్రామాల్లో అభ్యర్థులు చేసే ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తామంటూ వందలాది గ్రామాల్లో తీర్మానాలు  చేస్తున్నారు.





Related News