cm kcr

విలక్షణ నేత వాజపేయి

Updated By ManamFri, 09/28/2018 - 00:53
 • ప్రధానుల్లోనూ ఆయన ప్రత్యేకం

 • ఎకరం స్థలంలో స్మారకం కడతాం.. నగరంలో వాజపేయి విగ్రహం

 • శాసనమండలిలో ముఖ్యమంత్రి కేసీఆర్ 

kcrహైదరాబాద్: దేశ ప్రధానుల్లో వాజపేయి విలక్షణమైన వారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గురువారం శాసనమండలిలో వాజపేయి సంతాప తీర్మానాన్ని ఆయన ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... వాజపేయి స్మారకార్థం హైదరాబాద్‌లో ఎకరం స్థలం కేటాయించాలని, విగ్రహం నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ముక్కుసూటిగా, నిష్కర్షంగా వెళ్లే వ్యక్తి వాజపేయి అని వివరించారు. వాజపేయి ఏదో ఒక రోజు దేశానికి ప్రధానమంత్రి అవుతారని జవహర్‌లాల్ నెహ్రూ అన్న మాటలను అటల్ నిజం చేశాడన్నారు. ఆయన గొప్ప వ్యక్తి.  ప్రతిపక్షంలో ఉన్నా గౌరవం తగ్గలేదు, బతికున్నప్పుడు వాజపేయి కి భారతరత్న రావడం అదృష్టం, ఈ అవకాశం అతి కొద్ది మందికి మాత్రమే లభిస్తుంది అని ఆయన అన్నారు. మాజీ  రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వాజపేయి ఇంటికి వచ్చి భారతరత్న పురస్కారాన్ని అందచేశారని, దేశ చరిత్రలో వాజపేయి చిర స్ధాయిగా నిలిచిపోతారని, ఆయన ఉపన్యాసాలు మృదుభాషలో ఉంటా యని, ఉత్తమమైన విలువలు నెలకొల్పారు అని కేసీఆర్ కొనియాడారు. దేశానికి ఉత్తమ పరిపాలన అందించారు. అంతర్జాతీయంగా దేశ ఖ్యాతిని ఇనుమడింపచేశారు, విజయవంతంగా అణుపరీక్షలు నిర్వహించారు,  దేశ ప్రయోజనాల విషయంలో ఆయన ఏనాడూ రాజీ పడలేదు, ఎవరు గొప్ప పనులు చేసినా వాజపేయి పొగిడేవారు, గొప్ప ఆదర్శ పురుషుడు, ఇందిరాగాంధీని వాజపేయి అపరకాళీగా అభివర్ణించారు, హైదరాబాద్‌తో వాజపేయికి ప్రత్యేక అనుబంధం ఉంది, జ్ఞాపకాలు, వారి చర్యలు భావితరాలకు స్పూర్తిగా ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు. వాజపేయి ఆత్మకు శాంతి చేకూరాలని, ప్రగాఢమైన సానుభూతిని వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబానికి సంతాపాన్ని తెలియజేశారు. ముఖ్యమంత్రి ప్రతిపాదించిన సంతాప తీర్మానంపై షబ్బీర్ అలీ, రామచంద్రరావు, పాతూరి సుధాకర్ రెడ్డి తదితరులు మాట్లాడారు. అనంతరం సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది.

రెండు గంటల పాటు సాగిన మండలి సమావేశాలు
తెలంగాణ శాసనమండలి పదో విడత సమావేశం గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయింది.  మండలి ఛైర్మన్ కనకమామిడి స్వామిగౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్, మంత్రులు, మండలి సభ్యులు పాల్గొన్నారు. దివంగత ప్రధా ని అటల్ బిహారీ వాజపేయి, లోక్ సభ మాజీ స్పీకర్ సోమనాథ్ చటర్జీ, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, శాసనమండలి మాజీ సభ్యులు నేరెళ్ల వేణుమాధవ్‌లకు, కేరళ వరదలు, కొండగట్టు బస్పు ప్రమాదాల్లో మరణించిన వారికి సంతాపం తెలియచేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. సంతాప తీర్మానాలపైన షబ్బీర్ అలీ, రామచంద్రరావు, పాతూరి సుధాకర్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, కర్నె ప్రభాకర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, ఆకుల లలిత తదితరులు మాట్లాడారు. వేణుమా ధవ్ స్మారకార్ధం ఒక అవార్డును ప్రకటించబోతున్నామని ముఖ్యమంత్రి తెలియచేశారు. అనంతరం సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. సుమారు ఒంటి గంట సమయంలో ఛైర్మన్ స్వామిగౌడ్ సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

రాజ్యాంగ నిబంధనలకు లోబడే సమావేశాలు: చీఫ్ విప్
రాజ్యాంగ నిబంధనలకు లోబడే మండలిని సమావేశ పర్చడం జరుగుతుందని మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ విలేకరులకు తెలియచేశారు. సంతాత తీర్మానాలతోనే సభ ప్రారంభమవుతుందన్నారు. కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి నివాసాలపై జరుగుతున్న ఈడీ దాడులతో టీఆర్‌ఎస్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ నాయకులు అనవసర ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతల చవకబారు ఎత్తుగడలు విజయం సాధించవన్నారు. కాంగ్రెస్ నాయకులు నేల విడిచి సాము చేస్తున్నారని ఆరోపించారు. వారి పరిస్థితి ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా ఉందన్నారు.

ఆధునీకరించిన మందిరంలో  శాసనమండలి సమావేశాలు
ఆధునీకరించిన సమావేశ మందిరంలో గురువారం శాసనమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన మంత్రి వర్గ సహచరులు, మండలి సభ్యులు హజరయ్యారు. ఉపముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, సభా వ్యవహారాల శాఖ మంత్రి టి. హరీశ్‌రావు, హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహచార్యులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు.కొండా లక్ష్మణ్ బాపూజీకి సీఎం కేసీఆర్ నివాళులు

Updated By ManamThu, 09/27/2018 - 03:34

imageహైదరాబాద్: ఆచార్య కొండా లక్ష్మణ్  బాపూజీ 103 జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు ఘనంగా నివాళ్లర్పించారు. తెలంగాణ కోసం ఆయన చేసిన పోరాటాలను గుర్తు  చేసుకున్నారు. స్వాతంత్య్ర సమరయోధునిగా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు జీవితాంతం పోరాడిన మహో యేధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. ఆయన ఆశయ సాధనలో ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించడానికి నిరంతరం పాటు పడుతున్నామని వివరించారు.నరసింహన్‌తో కేసీఆర్ భేటీ

Updated By ManamThu, 09/27/2018 - 00:54
 • ముందస్తు ‘వ్యవహారాలపై’నే సుధీర్ఘ చర్చ?.. సంక్షేమ పథకాల అమలుపై గవర్నర్‌కు వివరణ..

 • గవర్నర్‌ను కలిసిన సీఎస్, డీజీపీ.. కేంద్రం నుంచి అందిన సమాచారం మేరకే చర్చలు! 

kcrహైదరాబాద్: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం మధ్యాహ్నం గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో రాజ్‌భవన్‌లో సమావేశమయ్యారు. ఇది కేవలం మర్యాదపూర్వకమైన భేటీ మాత్రమేనని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నప్పటికీ, ఈ భేటీ రెండు గంటలకు పైగా జరగడం, సమావేశం తరువాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్. కె.జోషి, పోలీసు డైరెక్టర్ జనరల్ మహేందర్ రెడ్డి కూడా గవర్నర్‌ను కలవడంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. ముందస్తు ఎన్నికల ఏర్పాట్ల పైనే ప్రధానంగా చర్చ జరిగి ఉంటుందని భావిస్తున్నారు.    రైతు బంధు చెక్కుల పంపిణీ, బతుకమ్మ చీరల పంపిణీ తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. కేసీఆర్ రాజ్ భవన్ లో గవర్నర్‌తో వివిధ అంశాలపైన చర్చలు జరిపారు.  అక్టోబర్‌లో రెండవ విడత రైతు బంధు చెక్కులను పంపిణీ చేయవలసి ఉంది, అదే విధంగా బతుకమ్మ చీరలను కూడా పంపిణీ చేయడం పైన గవర్నర్‌తో చర్చించినట్లు తెలిసింది.  మిషన్ భగీరథ పురోగతి, కేంద్రం ప్రకటించిన ఆయుష్మాన్ భవ పథకం అమలు పర్చక పోవడానికి గల కారణాలను గవర్నర్‌కు వివరించినట్లు తెలిసింది. కేంద్రం ప్రకటించిన ఆయుష్మాన్‌భవ పథకం కంటే  ప్రభుత్వం అమలు జరుపుతున్న ఆరోగ్యశ్రీ పథకం బాగుందని వివరించినట్లు తెలిసింది. ఉద్యోగులకు ఐఆర్ అంశం గవర్నర్ దృష్టికి తెచ్చినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే అమలులో ఉన్న పథకాల కొనసాగింపులో అభ్యంతరాలు లేనప్పటికీ పాలనాపరంగా తీసుకోవలసిన చర్యలపై ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి,  పోలీసు డైరెర్టర్ జనరల్‌తో కూడా గవర్నర్ శాంతి భద్రతల అంశాన్ని చర్చించారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. పట్టపగలు నడి రోడ్డులో అందరి కండ్లముందే  హత్యలు జరగడం పట్ల గవర్నర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్లు తెలియవచ్చింది. ముందస్తు ఎన్నికల ఏర్పాట్లపై కూడా ఈ సందర్బంగా చర్చించారని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి ఇంతటి సుదీర్ఘ చర్చలు గవర్నర్‌తో జరపలేదని రాజ్ భవన్ వర్గాలు పేర్కొన్నాయి. గత కొంత కాలంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఫామ్‌హౌజ్ నుండే పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు.

పార్టీ అభ్యర్దుల ప్రచారాలను సమీక్షించడం జరుగుతుంది. అసంతృప్తులను బుజ్జగించడం, కొందరికి హెచ్చరికలు జారీ చేయడం లాంటి వ్యవహారాలతోనే తీరిక లేకుండా ఉన్నారు. పార్టీ అభ్యర్ధుల ప్రచారం, ప్రజాభిప్రాయం పై సర్వేలు నిర్వహించడం జరిగింది. సర్వే నివేధికల ఆధారంగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాలని భావించి అక్టోబర్ 3న నిజామాబాద్, 4న నల్లగొండ, 5న మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి సిద్దమయ్యారు. కేంద్రం నుండి అందిన అత్యంత కీలకమైన అంశంపైన చర్చించడానికి గవర్నర్ నరసింహన్ బుధవారం ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీసు డైరెక్టర్ జనరల్‌ను రాజ్‌భవన్‌కు పిలిపించుకొని ఉంటారని భావిస్తున్నారు. నవంబర్‌లో తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరిపించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతుందనే ప్రచారానికి ఊతమిచ్చే విధంగా బుధవారం నాటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆక్టోబర్ 8న ఓటరు జాబితాను ప్రకటించడంతో కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ శానసనభకు ఎన్నికలు జరిపించడానికి సర్వం సిద్దంగా ఉందనే సంకేతాలు ఇప్పటికే వెలువడ్డాయి.ముందే ఉర్కండి

Updated By ManamTue, 09/25/2018 - 00:09
 • ప్రత్యుర్థులు షురువు చేయకముందే మొదటి దశ ముగించండి

 • ఎన్నికల ప్రచారంపై టీఆర్‌ఎస్ అభ్యర్థులకు కేసీఆర్ ఆదేశం

kcrహైదరాబాద్: రాష్ట్రమంతా ముందస్తు ఎన్నికల కోలాహలమే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో విపక్ష పార్టీలను, ప్రత్యర్థి నాయకులను ముప్ప తిప్పలు పెట్టడానికి టీఆర్‌ఎస్ అధినేత, ఆపద్ధర్మ సీఎం వ్యూహం ఖరారు చేశారు. దీనిలో భాగంగా ఎవరూ ఊహించని రీతిలో ప్రచారం చేయాలని నిశ్వచయించారు. తాను ఎన్నికల సభల్లో పాల్గొంటూ ప్రచారం చేయడంతో పార్టీ నాయకులు, అభ్యర్థులు వెన్నంటి ఉంటూ సరికొత్త పద్ధతిలో ముందుకు నడిపించనున్నారు. మరో పక్క తమ పార్టీ నేతల అలకలు, అసమ్మతులు చల్లార్చడానికి ముందుగా ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం మొదలుపెడితే అవన్నీ సద్దుమణుగుతాయని నేతలకు సూచిస్తూ, ఆ మేరకు వారికి దిశానిర్దేశనం చేస్తున్నారు. తమ మాట వినని నేతలను దారికి తెచ్చేందేకు ట్రబుల్ షూటర్లతో పాటు మంత్రులు, జిల్లా నేతలను రంగంలోకి దింపారు. చర్చలు, మంతనాలు, బుజ్జగింపుల అనంతరం కూడా మొండికేసే వారిపై అధిష్టానం కఠిన చర్యలకు దిగనుందని సమా చారం.  కొంతమంది టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఈసరికే ప్రచా రం కొనసాగిస్తున్నారు. దీనికి తోడు పార్టీ అభ్యర్థులకు అవసరమైన ప్రచార సామాగ్రిని సోమవారం సరఫ రా చేసింది. అభ్యర్ధులను ప్రకటించిన 105 శాసనసభ నియోజకవర్గాలకు సామాగ్రి తర లింపు పూర్తయింది. సీఎం కే. చంద్రశేఖర్‌రావు రాజకీయ కార్యదర్శి, టీఎస్‌ఎండీసీ ఛైర్మన్ శేరి సుభాష్ రెడ్డి ప్రచార సామాగ్రిని పంపిణీని పర్యవేక్షించారు. సామాగ్రిలో వివిధ సైజుల్లో పార్టీ జెండాలు, కండువాలు, టోపీలు, బ్యాడ్జిలు, కారు గుర్తు , కేసీఆర్ చిత్రపటంతో కూడిన జెండాలు ఉన్నాయి. గ్రామ గ్రామాన జరిగే అభ్యర్థుల ప్రచారం, వాహన ర్యాలీలు, బహిరంగ సభలకు అవసరమైన సామాగ్రి అంతా ఇందులో ఉంది. ప్రచార సామాగ్రి అం దడంతో పార్టీ కేడర్‌లో నూతనోత్సాహం కనప డుతుంది. ప్రచారం మరింత ఊపందు కుంటుందని అభ్యర్థులు చెబుతు న్నారు. విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లడం, పార్టీ ప్రచార హోరు తెలిపే విధంగా సామాగ్రి ఉంటే సరికొత్త జోష్ వస్తుంద ని అభ్యర్థులంటున్నారు. 90 శాతానికి పైగా అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేసి ప్రత్యర్థుల ను కంగుతినిపించిన కేసీఆర్... ప్రతిపక్షాల అభ్యర్థులు ఖరారు కాక ముందే మొదటి దశ ప్రచారాన్ని పూర్తి చేయాలని పార్టీ అభ్యర్థులకు సూచిస్తున్నారు. దీంతో వారందరు ప్రచారంలో నిమగ్నమ య్యారు. ఇదే ఊపు ఉత్సాహాన్ని కొనసాగించా లని సూచిస్తున్నారు. గ్రామాల్లో అభ్యర్థులు చేసే ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తామంటూ వందలాది గ్రామాల్లో తీర్మానాలు  చేస్తున్నారు.కాంగ్రెస్ సీనియర్లపై కేసీఆర్ గురి

Updated By ManamThu, 09/20/2018 - 01:03
 • ఓడించడమే లక్ష్యంగా వ్యూహరచన

 • ముందస్తు ఎన్నికలపై సమాలోచనలు

 • తెరాసకు ఎదురే లేదంటున్న కేసీఆర్

 • సరికొత్త మేనిఫెస్టోకు తుది రూపం

kcrహైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్లపైన తెరాస దృష్టి పెట్టింది. వారిపై పోటీకి బలమైన అభ్యర్ధ్దులను పెట్టాలని భావిస్త్తోంది. ఎంపిక చేసిన కాంగ్రెస్ సీనియర్ల నియోజక వర్గాల్లో ప్రజాభిప్రాయం సేకరించిన తర్వాత తెరాస నాయకత్వం ఈ దిశగా పావులు కదుపుతుంది.  దాదాపు 21 నియోజక వర్గాల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా గ ట్టి పోటీ ఇచ్చే అభ్యర్ధులను బరిలోకి దింపా లని భావించింది. తెరాస అధ్యక్షులు కేసీఆర్ ఈ మేరకు కసరత్తు జరుపుతున్నారు. అభ్యర్ధుల వేటలో పడ్డారు. సీనియర్లను ఓడించడమే లక్ష్యంగా ఎన్నికల కార్యాచరణ ఉండాలని సీనియర్లతో జరిగిన చర్చ సందర్భంగా తన అభిప్రాయం వ్యక్తం చేశారు. తెరాసకు ఎదురేలేదనే విధంగా సర్వే నివేదికలు అందుతున్నాయని పేర్కొన్నారు. అభ్యర్ధులు అధైర్యపడవద్దని, గెలిపించుకుంటామని ధైర్యం నూరి పోస్తున్నారు. ఇప్పటికే జరుగుతున్న ప్రచారంపై కేసీఆర్ సమీక్షలు జరుపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించాలని అభ్యర్ధులకు సూచిస్తున్నారు. తన ఎన్నికల ప్రచారం ఈ నెల చివరి వారంలో ప్రారంభించడం జరుగుతుందని తెలియచేశారు.  సోషల్ మీడియా ద్వారా  ప్రచారం నిర్వహించవలసి ఉంటుందన్నారు. ప్రతిపక్షాలు ఇప్పటి వరకు అభ్యర్దులను ప్రకటించక పోవడం, విపక్షాలన్ని కూటమిగా ఏర్పడుతూండడంపై  తెరాసలో తర్జనభర్జన జరుగుతుంది. విపక్షాలు అభ్యర్ధులను ప్రకటించే నాటికి తెరాస అభ్యర్ధులు నియోజక వర్గాలను చుట్టుముట్టాలని సూచిస్తున్నారు. ప్రచార సరళిని సమీక్షించుకుంటూ ముందకు పోవాలంటున్నారు. అసమ్మతులను చల్లార్చడానిక ఇప్పటికే చర్యలు తీసుకోవడంతో అత్యధిక నియోజక వర్గాల్లో అసమ్మతులు సద్దుమణిగాయని, కొద్దిపాటి నియోజక వర్గాల్లో ఉత్పన్నమవుతున్నా సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ సీనియర్ల నియోజక వర్గాలపై చర్చ జరుగుతుంది.

2014లో కాంగ్రెస్ గెలుపొందిన నియోజక వర్గాల్లో పార్టీ పరిస్ధితిని బేరీజు వేసుకుంటున్నారు. పార్టీ శ్రేణులను ఉత్తేజ పర్చడంతో పాటుగా  బలమైన అభ్యర్ధులను బరిలోకి దింపడానికి చర్యలు తీసుకుంటున్నారు. జగిత్యాల ( టి.జీవన్ రెడ్డి), మధిర ( మల్లు బట్టి విక్రమార్క),  కొడంగల్ ( రేవంత్‌రెడ్డి), వనపర్తి ( చిన్నారెడ్డి), గద్వాల (డి.కె. అరుణ), అలంపూర్ ( ఎస్.ఏ. సంపత్ కుమార్), కల్వకుర్తి ( వంశీచందర్‌రెడ్డి), జహీరాబాద్ ( డాక్టర్. గీతారెడ్డి), నల్లగొండ ( కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి), నాగార్జున సాగర్ ( జానారెడ్డి), హుజూర్‌నగర్ ( ఉత్తమ్ కుమార్ రెడ్డి) కోదాడ ( పద్మావతిరెడ్డి) నియోజకవర్గాల్లో బలమైన  కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇవ్వడానికి  కేసీఆర్ అభ్యర్ధుల వేటలో పడ్డారు. సంగారెడ్డి నియోజక వర్గంపై కూడా ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నారు. తెరాస అధ్యక్షులు కేసీఆర్ గత మూడు నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతూనే ఎన్నికల ప్రచారం, అసంతృప్తుల బుజ్జగింపులు, విపక్షాల కదలికలు, ఎన్నికల  నిర్వహణ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంటున్న చర్యలపైన దృష్టి కేంద్రీకరించారు. నవంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం లేదనే ప్రచారంపై కూడా సమాలోచనలు చేస్తున్నారు. ఎన్నికలను అడ్డుకోవడానికి కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తుందని, వారి వాదనల్లో పసలేక పోవడంతో ఎన్నికల సంఘం నవంబర్‌లోనే ఎన్నికలు జరిపించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని తనను కలుసుకున్న నాయకులతో అన్నట్లు తెలిసింది.  ఎన్నికల షెడ్యూలు ప్రకటించడంలో ఆలస్యం అయిన పక్షంలో  ఇప్పటికే ప్రచారం ప్రారంభించిన వారికి ఇబ్బంది కరమైన పరిస్ధితి తప్పదనే భావనతో ఉన్నారు. తెరాస మెనిఫెస్టో పై కూడా కేసీఆర్ ముందస్తు కసరత్తు జరిపారు. ప్రాధాన్యతలను గుర్తించి సమాలోచనలు జరుపుతున్నారు. ప్రజలను వెంటనే ఆకట్టుకొనే విధంగా మెనిఫెస్టో ఉండాలని సూచిస్తున్నారు. ఇప్పటి వరకు అమలు జరిపిన మామీలు, కాంగ్రెస్ కొత్తగా కురిపిస్తున్న హామీలను బేరీజు వేసుకుంటున్నారు. కాంగ్రెస కంటే మెరుగైన మెనిఫెస్టో ప్రకటించడం జరుగుతుందని సీనియర్ల తెలియచేశారు. త్వరలోనే కసరత్తు పూర్తవుతుందని వెల్లడించారు. అన్ని వర్గాల ప్రయోజనాలు పరిరక్షించడంతో పాటు సంపద పెంచి పేదలకు పంచడం లక్ష్యంగా మెనిఫెస్టో రూపకల్పన జరుగుతుందని పేర్కొన్నారు.అందర్మథనం

Updated By ManamMon, 09/17/2018 - 07:30
 • ముఖ్యనేతలతో సీఎం కేసీఆర్ సమాలోచనలు

 • భ్రమిత్‌షా అంటూ అమిత్‌పై కేటీఆర్ ఫైర్

 • మోదీపాలనలో ప్రజలు చచ్చేదిన్ వచ్చిందని విమర్శ

trsహైదరాబాద్: భాజపా జాతీయ అధ్యక్షులు అమిత్ షా పర్యటనపై తెరాసలో అంతర్మథనం జరుగుతోంది. ఆయన తెలంగాణ పర్యటనలో తెరాసపై చేసిన విమర్శలను పార్టీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. ముఖ్యమంత్రి, పార్టీ అధినేత  కేసీఆర్ ఈ విష యంలో కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అమిత్‌షా చేసిన రాజకీయ విమర్శలను తెరాస నాయకత్వం సాధారణమే అని భావించింది. కానీ, కేటీఆర్ కుటుంబంపై చేసిన ఆరోపణలను మాత్రం జీర్ణించుకోలేక పోతుంది. విమర్శలను తిప్పికొట్టడానికి వెనుకాడకూడదని భావించింది. పార్టీ నిర్ణయం మేరకే ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదివారం జరిగిన ఒక సమావేశంలో అమిత్‌షాపై విరుచుకుపడ్డారు. అమిత్‌షా ఉత్త భ్రమిత్‌షా అంటూ ఎద్దేవా చేశారు. ఎన్డీయేతో అచ్ఛే దిన్ అంటూ ప్రజలను మాయ చేశారని ఆరోపించారు. ఇప్పుడు ప్రజలు చచ్చేదిన్ వచ్చిందంటూ భాజపాని కేటీఆర్ విమర్శించారు. ముందస్తు ఎన్నికలను అమిత్‌షా తప్పుబట్టడం విడ్డూరంగా ఉందన్నారు. 2002లో నరేంద్రమోదీ, 2004లో వాజ్‌పేయి చేసిందేమిటని ప్రశ్నించారు. భాజపాతో సఖ్యత లేకపోయినప్పటికీ ఘాటైన విమర్శలు చేయరాదని భావించిన తెరాస నాయకత్వం అమిత్‌షా పర్యటనతో   విమర్శలు అనివార్యం అని భావించింది. రాష్ట్ర ప్రయోజనాలను ఆశించి కేంద్రంలోని భాజపాతో సఖ్యతగా ఉన్నప్పటికీ సిద్ధాంత పరంగా విభేదిస్తూనే ఉన్నామని సీనియర్లు పేర్కొంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ విషయంలో కూడా సానుకూల ధృక్పథంతో ఉండటానికి రాష్ట్ర ప్రయోజనాలే ప్రధానం అని పేర్కొన్నారు. మైనార్టీలను దూరం చేసుకోవలసిన అవసరం తెరాసకు లేదన్నారు. మైనారిటీలకు రక్షణ కల్పించడంతో పాటుగా రిజర్వేషన్లు కల్పించి వారి ఆర్ధిక స్ధితిగతులను మెరుగుపర్చడానికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో మైనారిటీలంతా తెరాసకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. తెరాసకు రాజకీయ సిద్ధాంతం ఉందని, పార్టీ నిర్ణయం మేరకే  ఎన్నికల సర్దుబాట్లు ఉంటాయని వెల్లడించారు. భాజపాతో మొదటి నుండి తెరాస దూరంగానే ఉంటుందని తెలియచేశారు. కొత్తగా ఆ పార్టీతో కలిసి పని చేసే పరిస్ధితి ఉత్పన్నం కాదన్నారు. తెలంగాణలో భాజపా బలం ఎంతనేది అందరికీ తెలిసిన విషయమేనన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా భాజపా అధ్యక్షులు అమిత్‌షా పర్యటనపై ఆదివారం ముఖ్యులతో సమాలోచనలు చేశారు. తన ఎన్నికల ప్రచారంలో భాజపా చేసిన ఆరోపణలను తిప్పికొట్టడం జరుగుతుందని తెలిపారు. పార్టీ అభ్యర్థుల ప్రచారం గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. అత్యధికులైన అభ్యర్దులు ఇప్పటికే ప్రచారంలో పరుగులు తీస్తున్నారని, అమాత్యులందరు అన్నికల ప్రచారం ప్రారంభించడం జరిగిందని తెలియచేశారు. 

భావితరాలకు బంగారుబాట..
భావితరాలకు బంగారు బాట వేయాలనే అలోచనతోనే తెరాస ముందస్తు ఎన్నికలకు సిద్దమైందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అభివృద్ది పనులకు అడ్డుతగులుతున్న విపక్షాల చర్యల వల్లనే ముందస్తు ఎన్నికలకు సిద్దమయ్యామని పేర్కొన్నారు. తెరాస గెలుపు విషయంలో ఎలాంటి ఆందోళన లేదన్నారు. తమకు ఎవరు కూడా పోటీ కాదంటున్నారు. స్పష్టమైన మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి రంగంలో తీసుకుంటున్న చర్యలకు విపక్షాలు అడుగడుగున అడ్డుపడుతున్నాయని తెలిపారు. అభివృద్ది నిరోధకులకు ప్రజలే బుద్ది చెప్పాలనే ఆలోచనతోనే ముందస్తు ఎన్నికలకు తెరాస సిద్దమైందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు బంగారు బాటలు వేయాలనే ఆలోచన మేరకు ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నామని, దేశంలోనే ప్రగతిదాయకమైన రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రభాగాన ఉందని పేర్కొన్నారు. సాగునీరు, తాగునీరు, విద్యుత్ తదితర రంగాల్లో తెలంగాణ దూసుకుపోతుందన్నారు.‘ఫ్యాన్’ స్పీడ్, ‘కారు’ జోరు

Updated By ManamSat, 09/15/2018 - 12:25
 • జగన్‌కు జై కొట్టిన ఏపీ ప్రజలు

 • తెలంగాణలో మళ్లీ సీఎం కేసీఆరే...

 •  ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా సర్వేలో వెల్లడి

YSR Congress president ys jagan as the next chief minister in ap!

న్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికలు హాట్ టాఫిక్‌గా మారగా, మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు వేడెక్కితున్నాయి. తెలంగాణలో ముందస్తు ఎన్నికల హడావుడి, అలాగే ఆంధ్రప్రదేశ్‌లో కాబోయే ముఖ్యమంత్రి పదవికి ఎవరు దక్కించుకుంటారనే వార్తలు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. దీంతో సర్వేలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఓ వైపు ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ సర్వే అంటూ .... మీడియాలో హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా నిర్వహించిన సర్వే ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలో టీఆర్ఎస్‌కే ప్రజలు మళ్లీ పట్టం కడతారని, ఇక ఏపీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే ముఖ్యమంత్రి పీఠం దక్కనున్నట్లు ఈ సర్వేలో తేలింది. నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఏపీలో అధికార మార్పిడి తథ్యమని ఈ సర్వేలో వెల్లడి అయింది. అంతేకాకుండా టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు కంటే వైఎస్ జగన్‌కే ప్రజాదరణ ఎక్కువ ఉన్నట్లు సర్వే పేర్కొంది.

జగన్‌కే జై కొట్టారు...

india today Survey predicts victory for YSRCP in Ap

ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ప్రజలు తమ అభిప్రాయాన్ని సర్వే ద్వారా స్పష్టం చేశారు. సీఎం అభ్యర్థిత్వం విషయానికొస్తే  వైఎస్ జగన్‌ మోహ న్‌రెడ్డికి 43%, చంద్రబాబు నాయుడుకు 38%, జనసేన నేత పవన్‌ కళ్యాణ్‌కు 5% మద్దతు ప్రకటించారు.  సెప్టెంబర్ 8 నుంచి 12 వరకూ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో 10,650 మంది అభిప్రాయాలను సేకరించడం జరిగింది. ఈ సర్వేపై శుక్రవారం రాత్రి ఇండియా టుడే ఛానెల్‌లో ‘పొలిటికల్‌ స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో పలు అంశాలపై చర్చ జరిగింది.

సర్వే పాజిటివ్‌గా రావడంతో వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. మరోవైపు టీడీపీ మాత్రం ఈ సర్వే ఫలితాలను కొట్టిపారేసింది. రాబోయే ఎన్నికల్లో కూడా తమదే విజయం అంటూ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే ఈ ట్రెండ్ ఎన్నికల వరకూ కొనసాగుతుందో లేదో చూడాలంటే ఎన్నికలు జరిగి, ఫలితాలు వచ్చేవరకూ వేచి చూడాల్సిందే. 

కేసీఆర్‌కే మళ్లీ పట్టం

kcr will be back in telangana cm

తెలంగాణలో మళ్లీ గులాబీ గుభాళించనుంది. ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకే ప్రజలు పట్టం కట్టనున్నట్లు ఈ సర్వేలో తేలింది.  తెలంగాణ అసెంబ్లీని ఎనిమిది నెలల ముందుగానే రద్దు చేసి ముందస్తుకు సిద్ధమైన కేసీఆర్‌ కారులో దూసుకుపోతున్నారు. తదుపరి సీఎంగా కేసీఆర్‌కు 43 శాతం మంది మద్దతు తెలిపారు. ఆ తర్వాత తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌కు 18శాతం మంది మొగ్గు చూపారు. తెలంగాణలోని అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాలో జరిగిన ఈ సర్వేలో మొత్తం 7,110మంది పాల్గొన్నారు.

పడిపోయిన ‘స్వామి’ గ్రాఫ్

kumaraswamy

ఇక కర్ణాటక గద్దెనెక్కి నాలుగు నెలలు కాకముందే ఆ రాష్ట్ర  ముఖ్యమంత్రి కుమారస్వామి గ్రాఫ్ తగ్గిపోయింది. జేడీఎస్-కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ పనితీరుపై 23 శాతం బాగుందని, 28 బాగోలేదని, 35శాతం మంది ఏమాత్రం బాగోలేదని కర్ణాటక ప్రజలు నిర్మొహమాటంగా వెల్లడించారు.రాబందులా?.. రైతు బంధులా?

Updated By ManamThu, 09/13/2018 - 04:55
 • ఎవరు కావాల్నో ప్రజలే తేల్చుకుంటరు

 • ఇద్దరు గడ్డపోళ్లు  ఒక్కటవుతున్నారు

 • గడ్డం పెంచుకుంటే గబ్బర్‌సింగులవుతరా

 • అవకాశవాదులను వాయించి కొట్టే చాన్సొచ్చింది

 • సురేష్‌రెడ్డి చేరిక సందర్భంగా జరిగిన సభలో కేటీఆర్

kcrహైదరాబాద్: రాబందులు కావాలో.. రైతు బంధు ప్రభుత్వం కావాలో?.. తేల్చుకొనే సువర్ణావకాశం తెలంగాణ ప్రజలకు వచ్చిందని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.  కాంగ్రెస్, తెదే పాల జుగుప్సాకరమైన, అపవిత్ర, నీచ కలయిక వల్ల రాష్ట్ర ప్రజలకు ఈ అవకాశం కలిగిందన్నారు. తెలంగాణకు అడ్డుపడ్డవారంతా ఏకమవు తున్నారని తెలిపారు. కాంగ్రెస్‌ను బొందపెట్టే లక్ష్యంతో ఆనాడు ఎన్.టి. రామారావు స్ధాపించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అదే కాంగ్రెస్‌కు తోక పార్టీగా మారబోతున్నందున స్పష్టమైన ప్రత్యామ్నాయం ప్రజల ముందుందన్నారు. ఇద్దరు గడ్డపోళ్లు  ఒక్కటవుతున్నారు. ఇద్దరిని వాయించి, వాయించి కొట్టే అవకాశం ప్రజలకు దొరికిందన్నారు. గడ్డం పెంచుకుంటే గబ్బర్ సింగ్‌లవుతారా? అని ఆయన ప్రశ్నించారు. ప్రజా కోర్టును మించిన కోర్టు ప్రజాస్వామ్యంలో మరొకటి లేదని,  అందుకే ప్రజా తీర్పు కోరుతున్నామని తెలిపారు.  శాసనసభ  మాజీ స్పీకర్, కాంగ్రెస్ సీనియర్ నేత కె. ఆర్. సురేష్‌రెడ్డి, మాజీ మంత్రి నేరెళ్ల ఆంజనేయులు, కరీంనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు ఆకారపు భాస్కర్‌రెడ్డి, మాజీ శాసనసభ్యులు సత్యనారాయణ గౌడ్, బిరుదు రాజమల్లు, ఉప్పల్ నియోజక వర్గం కాంగ్రెస్ ఇన్‌చార్జి లకా్ష్మరెడ్డి, కార్పోరేటర్లు శాంతి తదితరులు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో తెరాసలో చేరారు. వీరందరినీ కేసీఆర్ తెరాసలోకి స్వాగతించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. 

ఎన్ని పక్షాలు ఏకమైనా తెరాస విజయాన్ని అడ్డుకోజాలవన్నారు. ఢిల్లీ దిక్కు చుద్దామా, తెలంగాణ గల్లీ దిక్కు చూద్దామా అనేది ఆలోచించుకొనే తరుణం ఆసన్నమైందన్నారు. తెలంగాణలో ఎన్నికల కోసం బాబు, ఉత్తమ్ ఒక్కటవుతున్నారు, తెలంగాణకు అడ్డుపడ్డ వారంతా ఏకమవుతున్నారు, కాంగ్రెస్‌కు తోక పార్టీలుగా చిన్నా చితక పార్టీలు జతకడుతున్నాయి, కాంగ్రెస్ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ తెదేపా అధ్యక్షులు ఎల్ . రమణ ఫోటోలు చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది, తెలంగాణ రైతాంగాన్ని కరెంటు షాకులతో, పోలీసు కాల్పులతో చంపేసిన వారంతా అధికారం కోసం ఏకమవుతున్నారు, అవకాశవాదులకు బుద్ది చెప్పడానికి కలిసొచ్చిన అవకాశం అని కేటీఆర్ కార్యకర్తల హర్షధ్వానాల మధ్యన అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రోజంతా కరెంటు ఇస్తుంది, అన్ని విధాలుగా రైతులను ఆదుకుంటుంది, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీళ్లిస్తుంది, అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతిని సాధించే దేశమంతా తెలంగాణ వైపు చూసే విధంగా పరిపాలన అందిస్తుంది, స్వీయపాలన కోసం పోరాడిన తెలంగాణ ప్రజలు ఢిల్లీకి కట్టుబానిసలుగా ఉండాలనుకోరు అని అన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్దమన్న విపక్షాలు ఎన్నికల కమిషన్ ముందు ఎన్నికలకు తొందరెందుకంటున్నాయని ఎద్దేవా చేవారు. అధికార పార్టీ పదవులు ఒదులుకొని ప్రతిపక్షాల అసత్య ప్రచారానికి తెరదింపేందుకు ఎన్నికలు వెళ్లడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో  రాజ్యసభ సభ్యులు కె. కేశవరావు, పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత, మల్లారెడ్డి,  మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, ఈటల రాజేందర్‌తో పాటు పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

అభివృద్ధిలో నా వంతు పాత్ర పోషిస్తా: సురేష్‌రెడ్డి
తెలంగాణ అభివృద్దికి తన వంతు పాత్ర పోషిస్తానని మాజీ స్వీకర్ కె.ఆర్.సురేష్‌రెడ్డి అన్నా రు. అభివృద్ధి దిశగా పరుగెడుతున్న రేస్ గుర్రం వైపు ఉండాలనే ఆలోచనతోనే తెరాసలో చేరానన్నారు. తెలంగాణకు మెరుగైన భవిష్యత్ తెరాసతోనే సాధ్యమన్నారు. మంత్రి కేటీఆర్ పనితీరుతో ప్రపంచమంతా తెలంగాణ వైపు చూస్తుందన్నారు. కేసీఆర్‌ను మించిన నాయకుడు తెలంగాణలో లేడన్నారు. కేసీఆర్ పనితీరు, ఆలోచనా వైఖరి తనను ఆకర్షించాయన్నారు. కల్వకుంట్ల కవిత, కేశవరావు, ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి తదితరులు మాట్లాడుతూ, సురేష్‌రెడ్డి చేరికతో పార్టీ బలం పెరిగిందన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను పూర్తి స్ధాయిలో ప్రజల దగ్గరకు తీసుకెళ్లడంతో అన్ని స్దానాల్లో విజయం సాధించవలసి ఉందన్నారు. కేసీఆర్ అనుభవంతోనే తెలంగాణ పురోగమిస్తుందన్నారు.ధర్మ సూక్ష్మ మెరిగిన పాలకుడు...

Updated By ManamWed, 09/12/2018 - 00:32

image‘ధర్మము ధర్మమటంచు వితండ వితర్కము లాడదేలా... ఆ మర్మము మీమెరుంగమే అణు మాత్రము సందియమేలా..’

యేందిర సత్తి... పద్యాలు పాడుతున్న వియ్యాల
యేంలేదన్నా... రామాంజనేయ యుద్దం అనే పౌరాణిక నాటకంల పద్యమిది. 
యేందిర అండ్ల అర్తం..బిత్తిరోడ..అయినా ఆ పద్యమెందుకురా ఇప్పుడు.?
నీకేం సోయుండదు.. చెప్తినన్న.

రాముడేమంటడంటే.. ‘ధర్మము ధర్మము అంటూ ధర్మమూర్తినయిన నాతోనే వితండ వా దాలు చేయడం సరికాదుimage ఆంజనేయా... ధర్మం యొక్క మర్మం దానిలోతు దాని తాత్పర్యం నాకు తెలువది అనుకోకు ..యేది యెప్పుడు చేయాల్నో యేది యెప్పుడు చేయకూడదో నాకు పూర్తిగా అవగాహనున్నది.. నీకు అనుమాత్రం గూడా అనుమానం అక్కరలేదు... నిశ్చింతగా వుండి నీను చెప్పినపనిచేయి..’ అంటూ ఆంజనేయునికి బుద్దులు చెప్తడు శ్రీరాముడు.

అవునురా... మరి ఇప్పుడెందుకురా ఆ ముచ్చెట... ఆ పద్యం.?
అదే అన్నా... ఇపుడు తెలంగాణలో కూడా ధర్మమేందో అధర్మమేందో తెలుసుకోలేని ఆంజనేయునివంటి ఆంధ్రా మేధావులు ఎక్కువయిన్రే.

అయిందానికి కానిదానికి రంధ్రాన్వేషణ చేసే కోతులు ఆడోటి ఈడోటి మోపయినయి. ఈ మేధావి కోతులు (ఆంజనేయునికి పర్యాయ పదం) తెలంగాణల చీమ చిటుక్కుమంటే... అధర్మరాగాలాపన మొదలు పెడుతున్నయి. పొం తన లేని పోలికలను ముందుకు తెచ్చి సగత దోపిడీ వలస పాలనకు నేటి తెలంగాణ ఆదర్శ వంతమైన పాలనకు లింకుపెట్టేందుకు ఆత్రపడు తున్నయి.
నీ కాల్మొక్తరా... సత్తీ... నాకు వొక్క ముక్క అర్థం కావట్లే... నీ ధర్మమేందో అధర్మమేందో.. ఆపద్ధర్మమేందో..
వూకో అన్న... యేం సదువుతవే పేపర్లు.. వుకెనే పైపైన సదువుడు కాదు... ఎడిట్ పేజీలు సదువవా.. లోపలగూడ సదువాలె. 

ఆపద్దర్మంలోనూ అధర్మ పాలనే అంటూ వో పత్రికలో వో సీనియర్ జర్నలిస్టు వ్యాసం పేరు తో తన అక్కసు కక్కిండు తెలంగాణ ముఖ్య మంత్రి మీద.. సూశినవా (మంగళవారం, సాక్షి ఎడిట్ పేజీలో ఏబీకే వ్యాసం..).
సూడలేరా సూస్త...యేమన్నర్రా అండ్ల..?
ముందుగాల సదువు... అయిటంక మాట్లా డుదాంగని
అవును కదరా... నెరీ గింత గోరంగ రాస్తార్రా... గా పెద్దమనిషి..
అవునన్నా.. యెట్లయిన మా చేతిల పెన్ను న్నదని యేది బడితె అది రాస్తే వుకుంటమా.. ప్రజాస్వామ్యంలో ప్రతివొక్కరికీ మాట్లాడే స్వేచ్చ వుంటది... భావస్వేచ్చ పేరుతో ఇష్టం వచ్చినట్లు తెలంగాణల కుప్పిగంతలు వేస్తమంటే వూకునే పరిస్తితిలో తెలంగాణ సమాజం లేదు. తెలంగా ణను ఎప్పుడు ఎట్లా నడిపించాల్నో ఎప్పుడు ఎన్నికలకు పోవాల్నో.. ముఖ్యమంత్రి కేసీయార్ కు తెలుసు..యేది ధర్మమో ఆపద్దర్మమో, ధర్మం లోని మర్మమేందో... తెలంగాణ వ్యతిరేకులు ద్రోహులతో చెప్పించుకునే పరిస్తితిలో తెలంగాణ కానీ కేసీయార్ కానీ లేరనే సంగతిని ఈ ఆంధ్రా పక్షపాత అధర్మమేధావులు తెలుసుకోవాల్సిన అక్కెరున్నది.

అవున్రా సత్తీ... కరెక్టు చెప్పినవుర. కనీ ఆ యన వో సీనియర్ జర్నలిస్టు కార్ర..అట్లనొద్దు రా..
సీనియర్ యేంది గీనియరేంది.. యెవలయి నాకేంది..ఆయన యేం రాసిండో సదువినంక కూడా యెందుకు యెనుకేసుకొస్తున్నవ్ నీ అసొం టోల్లతోనే గింతకాడికొస్తాంది... సీనియరయితే ఇష్టం వున్నట్టు ఎట్ల రాస్తడు.? ఆయన యేం రా సిండో యెందుకు రాసిండో  తెలంగాణ మీద, కేసీయార్ మీద విషం గక్కిండనే సంగతిని ఆయ న గురించి తెలిసిన ప్రతి తెలంగాణ బిడ్డ అల్కగ పసిగడుతడు.

అవున్రా...సత్తీ.. ఎంత గలీజుగ రాసిండే మిరా...ఆపద్ధర్మంలోనూ అధర్మపాలనే నం ట... ఈనెకు అప్పటికే కనపడ్డ అధ ర్మమేందో ఆయన చేసే రంధ్రా న్వేషణ యేందో ... కలం చేతులున్నదిగద అని యేది పడితే అది రాస్తే వూకోరు జనం అనే సంగతి తెలు సుకో వాలెరా.. ఆ పెద్ద మనిషి.. గూడ జర ఆలోచించి రాయనుండె
అందికేనే అన్నా నీ ను అనేది...మంటికైనా ఇంటోడే కావాలె..అని. మం చయినా చెడయినా మాట్లాడు కోవడానికి తెలంగాణ హృదయం కా వాలె. 

ఆరి సత్తీ నిజమేనేమిరో....రానురాను మేధా వి ముసుగున ఆంద్రా పక్షపాతం జోరందు కుంటున్నదిరో... మనం వీటికి ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేయకపోతే ఆగమాగం చేసే ప్రమాద మున్నదిరో..
నీను ఎప్పటినుంచో చెప్తాన మీరింటరా.. పోరా బిత్తిరోడా అని అదురగొడుతరు.. నన్ను.. ఈ నొక్కలేనా..? యెంతమంది యెన్నితీర్ల పొద్దు గాల లేసి టీవీల కాడ కూసోని వొర్లుతాన్రో తెలుస్తలేదా.? వొకాయినె అంటడు టీవీల కూసో ని.. ప్రభుత్వాన్ని రద్దు చేసినంకనట రాష్ర్టపతి పాలన చేయమని చెప్పేదుండెనట కేసీయార్ సారు. ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగకుంట రాష్ర్టపతి పాలన పెట్టున్రి.. అని గవర్నర్‌కు చెప్పి వుంటె బాగుండునట...అట్ల చెప్పితే తెలంగాణల ప్రజాస్వామ్యం నిలవడేదట. 
యేందీ.. తెలంగాణల రాష్ర్టపతి పాలన వస్తె ప్రజాస్వామ్యం నిలవడుతదా... యెవల్రా అంతలావు మోతెవరి. ఆ మేధావి తలకాయ కనవడ్డదాచర్చల మాట్లాడుతున్నప్పుడు. లేకుంటె ఆయన మోకాల్లు చూయించిన్రా టీవీ చాన లోల్లు.

అవుపడ్డదే తలకాయే.. వున్నది వున్నది
మరి అట్లెట్ల మాట్లాడిండురా...యేం పేరో అంటివి ఆయనది
అదేందో పార్టీ .. జోక్ సత్తా అని వుండెగా ఎనుకటికి. అండ్లో రొండో లీడరుండె సూడు ఆయనపేరేందో వుండె.. పటారో పుటారో సుతా రో యేందో ఆయన పేరు యెవలికి యాదికున్న దిగని.. ఫుల్లు చేతులంగి పైకి మల్సుకుంటడు సూడు గాయిన.  యేందేందో మాట్లాడుతాండు అడ్డగోలుగ ఆంధ్రా చానలు చర్చల కూసోని..పొద్దుగాల పొద్దుగాల
ఎక్కడి కతరా సత్తీ వీల్లతోని.. యెవడెవడె వడో యేదిపడితె అది మాట్లాడుకుంట రాసు కుంట మోపయిన్రు హైద్రాబాద్ల..
ఆ మరి వుకెనే వొదిలిపెడుతరు అనుకున్న వా.. ఆల్లు మనల. ఎటుదిరిగి సందుకోసం సూస్తాన్రు. యెప్పుడు దొరుకుద్దిరా యెట్ల అందు కుందాని తెలంగాణను.. ఎట్లాగం చేద్దామని...గీ కేసీఆర్‌ను వొక్కన్ని వోడగొడితె సాలు.. ఇగ యెవలొచ్చినా హైద్రాబాద్ మన కంట్రోల్లనే వుం టది అనే ప్లానేత్తాండ్రు ఆంధ్రా నాయకులు ఛాన ల్లు కలిపి.

అవున్రా... సత్తీ.. వొక్కడన్న మాట్లాడుతా న్రార...టిడిపీ కాంగ్రేస్ పార్టీ పొత్తుల మీద. దు ర్మార్గపు పొత్తులమీద వాల్ల అనైతిక సిద్దాంతాల మీద వొక్కడంటే వొక్క ఆంధ్రా మేధావి రాజ కీయ నాయకులు మాట్లాడుతాం లేరు.. వీల్ల పె న్నుల్ల ఇంకులు వొడిసిపోయినాయిర..వాల్ల పత్తు లు ఇరిగిపోయినాయిర. అదే తెలంగాణ మీదన యితే కోడిగుడ్డు మీద ఈకెలుపీకుదానికి రడి అంటరు.
యే వూకోవె అన్నా...వొర్లి వొర్లి వాడుబాయె వొండుక తిని వీడు పాయె అన్నట్టు...మీరింట్లె కూసోని వొర్లుతనే వుంటరు ఆల్లు బజార్లకెక్కి తెలంగాణను బదునాం చేస్తనే వుంటరు.

మరి యేం జేయమంటవురా..
యేం చేసేదేంది అన్నా... ఇటువంటి కీలక సమయంలోనన్నా బయటపడాలెకదా మన మే ధావులు.. ఎక్కడికక్కడ రౌండుటేబుల్ సమా వే శాలు పెట్టి యీ ఆంధ్రా మేధావులు జర్నలి స్టు లు రాజకీయ నాయకుల కుట్రలను తిప్పికొట్టా లె గద. వీల్లు, రాతల ముసుగున చర్చల ముసు గున తెలంగాణ ప్రజలను గందరగోళ పరిచే కు యుక్తులకు కౌంటరియ్యాలె గద. మనోల్లందరి తోని రోజు పేపర్లు సదివిపిచ్చి ఆంధ్రా థాట్ పోలీసింగు రాతల దాడులను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలెగద. అన్నీ కేసీయార్ సారు మీద నే యేసి కూసంటమా.? తెలంగాణ ఉద్య మంల ఎట్ల కొట్టాడినం.. ఎవలిసక్కిన వా ల్లం. ఆయన చేత్తడు ఈనే చేత్తడు అని ఎదిరిచూసినమా..? తెలంగాణ రాంగనే అయి పోయిందా... దాన్ని నిలవెట్టుకోవద్దా.? నాలు గేండ్లు కాలే యేమిట్లెకేమయిందని...అప్పుడే యేం పంచకపోయిన్రని బెల్లపప్పలు..యిగలేదా ముందుముందు సైమం. మనం కాకపోతే యిం కెవడన్న వత్తాండా పోటీకి. అరువయేండ్ల సంది మంది యేసుకపోతే యేంలేదుగాని నాలుగేండ్లకే హైబతైబతి అయితున్నరు నాగ్గావాలె నాగ్గావాలె అని మన మేధావులు రాజకీయ నాయకులు.

ఆపురా నాయిన నీ పాటం చెప్పుడు... ఇప్పు డు ఎవలు కాదన్నర్రా నిన్ను. యెవలు చేత్తలేరు పని..వస్తరు వస్తరు ఆగు జర వోపిక పట్టు..
యే వూకో అన్న... వోపిక పట్టకుంటె యెట న్న వురుకుతున్నమా..వున్న ముచ్చెటే అంటాన. అదే ఆంధ్రోల్లయితే యెట్లుందురు వొక్కతాటి మీద. మనోల్లకేమొచ్చింది? అయినా.. ఈ మేధా వులతోని వూదుగాలదు పీరి లేవదు.. తెలంగాణ ప్రజలు కేసీయార్ సారు యెంటున్నరు... ఆల్లకు అన్నీ యెరుకేతీయ్.
మరింకేందిర....నువ్వన్నట్టు రేపు ఎన్నికల్ల బంపరు మెజారిటీతోని గెలిసి, యిప్పటోలిగనే కేసీయార్ సారు మల్లొక్క ఐదేండ్లు జర గట్టిగ అనుకోని తెలంగాణను నడిపిండనుకో..యిగ అ న్ని సదురుకుంటయి యెక్కడియక్కడ. అటు అభివృద్ధి పథకాలు ఇటు సంక్షేమ పథకాలు అన్నీగూడ గాడిలపడుతయి. ఇప్పుడిప్పుడే పూలు పూసి పిందలేస్తున్న వందల తీర్ల పథకాలు.. కా యలు కాసి ఫలాలుగ మారి తెలంగాణ జనా లకు అందుడు మొదలయితయి. 

ఇగ..సాగునీటి ప్రాజెక్టుల నీల్లతోని పల్లెలన్ని పచ్చబడుతయి. పల్లెజనాలకు చేతినిండ పని. ఇంతలకే విద్యా వైద్యం మస్తు బాగయితయి. వూల్లల్ల తాగునీరు రోడ్లు కరెంటు ట్రాన్స్ఫోర్టు అన్ని తీర్ల మౌలిక సదుపాయాలు అందుబాటుల కొస్తయి. మన పిలాన్లకు కొలువులు ఉపాధి హామీ దొరుకుద్ది. ఇంక సూర్రాదు యేమేమి చేత్తడో కేసీయార్ సారు..బ్రమ్మాండంగ బంగారి తెలంగాణను తీర్చి దిద్దుతడు..సూడు.
అవున్రా సత్తి... తెలంగాణకు మంచి చేయా లనేదే కేసీయార్ సారుకు లక్ష్యం తప్ప యింకోటి యేముంటదిరా.. మనం సూత్తలేమా ఇరువయేం డ్ల సంది.. యెంత కష్టం చేసిండో.
అన్నా వొక డౌటనుమానం నాకు..

యేందిర సత్తి..?
వొక్కపాలే వో పదేండ్లు ..ఎన్నికలు లేవు గిన్నికలు లేవు..సారుకే తెలంగాణను అప్పజెప్పే చట్టం లేదానె మనతాన.
లేదురా..ప్రతి ఐదేండ్లకోపాలి ఎన్నికలు జ రుపాల్సిందే.. ఎందుకురా అట్లంటివి.?
యేంలేదే...వో పని మీద పడిపోతున్నడు సారు. నడుమ నడుమ గియన్నీ డిస్టబెన్సు ఎందుకు.. టైం వేస్టు కదా.. అటు అభివృద్ది సూ స్కోవాల్నాయె.. ఇటు రాజకీయాలు చేయాల్నా యె..నడుమ నడుమ మనసొంటి మేధావుల లొల్లి..గియన్ని ఎందుకే పరేషాను.. సారు కావట్టి చేయగలుగుతాండు గని యింకోలింకోలింకో లయితే కండ్లు తేలేసి కాడెత్తేసి వురుకుదురు..ఈ పతిపకచ్చాలు ఆంధ్రా పచ్చాలతోటి యేగలేక..
అవున్రా సత్తీ..కేసీయార్ సారుకు ధర్మం యెరుకే రాజధర్మం యెరుకే...ధర్మంలోని మర్మం అందులోని సూక్ష్మం లోతు తాత్పర్యం అన్ని యె రుకే...నాడు భారతంల శ్రీకృష్ణుడు ఎట్లయితే ధర్మాన్ని గెలిపించడానికి కష్టాలుపడి కత నడిపిం డో సేమ్ టు సేమ్ అట్లనే తెలంగాణల ప్రభు త్వాన్ని రాజకీయాన్ని నడుపుకుంట వత్తాండు. శత్రువులకు తంతె గుద్దినట్టయితాంది. 

అవున్నన్నా...ప్రభుత్వాన్ని రద్దు చేసినప్పుడు యేందో అనుకున్న గానీ..అందుల ఇంత ధర్మ సూక్ష్మం దాగివుందని నీనుసుత అనుకోలేదే. ఇప్పుడర్తమైంది నాకు..తన నిర్ణయం తెలం గాణకు యెంతో మేలు చేస్తది నామాట వద్దమైతే సూడు నువ్వు రేపటినాడు.
అంతే నంటవార
అంతేనే..

- రమేశ్ హజారి
9390919090అధికార లాంఛనాలతో మణెమ్మ అంత్యక్రియలు

Updated By ManamSun, 09/09/2018 - 15:52
Telangana State honours for ex mla manemma funeral

హైదరాబాద్ : మాజీ ఎమ్మెల్యే మణెమ్మ అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలుతో జరగనున్నాయి. తెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చారు. మణెమ్మ అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి సతీమణి అయిన మణెమ్మ ఓసారి ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేశారు.

Related News