ap

ఆంధ్రకేసరి వర్సిటీ

Updated By ManamFri, 11/02/2018 - 00:25
 • ఒంగోలులో ప్రకాశం విశ్వవిద్యాలయం

 • ఏర్పాటుకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ

 • నెరవేరిన ప్రకాశం ప్రజల ఆకాంక్ష: మంత్రి గంటా

imageఅమరావతి: ఒంగో లులో ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం ద్వారా ఒంగోలు ప్రజల చిరకాల ఆకాం క్షను నెరవేర్చామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివా సరావు అన్నారు. విద్యాపరంగా వెనుక బడిన ప్రకాశం జిల్లాలో వర్సిటీ ఏర్పాటు చేయడం చారిత్రక ఘట్టమని ఆయన అభివర్ణించారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వం వర్సిటీ ఏర్పాటుకు జీవో ఎం.ఎస్.నెం 32 విడుదల చేసింది. ఈ సందర్భంగా మంత్రి గంటా పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఒంగోలు పీజీ సెంటర్‌ను అప్ గ్రేడ్ చేస్తూ వర్సిటీని ఏర్పాటు చేయడం ద్వారా గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకొన్నామని మంత్రి గంటా స్పష్టం చేశారు. అన్ని జిల్లాల్లో వర్సిటీ ఉన్నా ఒంగోలులో లేకపోవడం కొరత గా ఉండేదని అన్నారు.

ఎప్పటికప్పుడు వర్సిటీ ఏర్పాటు చేయాలని సంకల్పించి చర్యలు తీసుకొన్నామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల చట్టం-1991 పరిధిలోకి వర్సిటీ వస్తుందని, వచ్చే శాసనసభ సమావేశాల్లో బిల్లుకు ఆమోదం తెలుపుతామన్నారు. విద్యా పరంగా తాము ఇచ్చిన అన్ని హామీలు నిలబెట్టుకుంటూ వస్తున్నామని, ఈ క్రమంలోనే ఒంగోలులో కూడా వర్సిటీ ఏర్పాటు చేశామన్నారు. మహనీయుడు ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పేరును వర్సిటీకి నామకారణం చేశామని, ఆయన స్ఫూర్తితో ప్రభుత్వం ముందుకెళ్తుం దని తెలిపారు.

వచ్చే జ్ఞానభేరి సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రస్తుతానికి పీజీ సెంటర్‌కు ఉన్న 114 ఎకరాల్లో వర్సిటీ ఏర్పాటు అవుతుందని మంత్రి గంటా తెలిపారు. ప్రస్తుతం 10 కోర్సులతో పీజీ సెంటర్ నడుస్తోందని,  పీజీ సెంటర్‌కు అనుబంధంగా 137 ప్రైవేట్ అన్ ఎయిడెడ్ కాలేజీలు, 48 మంది సిబ్బంది పనిచేస్తున్నారని చెప్పారు. వర్సిటీ ఏర్పాటు చేయడం ద్వారా ప్రకాశం జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్షను సార్థకం చేయడం సంతోషంగా ఉందని మంత్రి గంటా తెలిపారు. కరవుపై కలసి పోరాడుదాం

Updated By ManamFri, 11/02/2018 - 00:25
 • జనసేన నేత నాదెండ్ల మనోహర్.. రాష్ట్రంలో దుర్భర పరిస్థితుల్లో రైతులు

 • రాష్ట్రవ్యాప్త ఉద్యమం అత్యవసరం.. సీపీఐ, సీపీఎం నేతలు రావుకృష్ణ, మధు

imageవిజయవాడ: రాష్ట్రంలో నెలకొన్న కరవుపై ప్రభుత్వం తక్షణం స్పందించేలా చేపట్టనున్న ఆందోళనలకి కమ్యూనిస్టులతో జనసేన పార్టీ కలసి వస్తుందని జనసేన నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఆదేశాలతో  కరవు పరిస్థితులపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత సంబంధించిన రోడ్ మ్యాప్‌కి రూపకల్పన చేద్దామని ఆయన తెలిపారు. గురువారం విజయవాడలోని జనసేన పార్టీ రాష్ట్రకార్యాలయంలో సీపీఐ, సీపీఎం, జనసేన పార్టీ నాయకులు సమావేశమయ్యారు.

భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరిపారు. రాయలసీమ ప్రాంతంలో నెలకొన్న కరవు పరిస్థితులు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తిత్లీ తుపాను కారణంగా సంభవించిన నష్టంపై చర్చించారు. ఈ సందర్భంగా తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో  పవన్‌కళ్యాణ్ జరిపిన పర్యటన వివరాలను మనోహర్ కమ్యూనిస్టు పార్టీల నేతలకు వివరించారు. శుక్రవారం నుంచి తూర్పు గోదావరి జిల్లాలో అధినేతపవన్‌కళ్యాణ్ పోరాట యాత్ర మొదలవుతుందని తెలిపారు. అనంతరం రాయలసీమలో పర్యటిస్తారని తెలిపారు. తుపాను ప్రభావిత ప్రాంతాలకు జనసేన పార్టీ తరుపున తక్షణ సాయంగా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, మందులు, కొవ్వొత్తులు, ఆహార పదార్థాలు పంపిణీ చేసినట్టు మనోహర్ తెలిపారు.

రాయలసీమలో నెలకొన్న కరవు పరిస్థితులని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రావుకృష్ణ వివరించారు. కరవు తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలిపారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా నీరందుతుందన్న ఆశతో ఉన్న సీమ ప్రజలు, అది అందకపోవడంతో తీవ్ర నిరాశతో ఉన్నారని వెల్లడించారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో నెలకొన్న కరవు పరిస్థితులను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు వివరించారు. రెండు జిల్లాలు ఎన్నడూ లేని విధంగా కరవు కోరల్లో చిక్కుకున్నాయని చెప్పారు. రాష్ట్రంలోలో నెలకొన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో దళితులకి తీవ్ర అన్యాయం జరుగుతోందని, అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సమావేశంలో జనసేన పార్టీ తరపున పార్టీ రాజకీయ వ్యవహారాల కన్వీనర్ మాదాసు గంగాధరం, రాజకీయ కార్యదర్శి  పి.హరిప్రసాద్, రాజు రవితేజ, సీపీఐ నాయకులు ఓబులేసు,హరనాథ్‌రెడ్డి, సీపీఎం నుంచి జె.శ్రీనివాస్, వైవీరావు పాల్గొన్నారు. 

జనసేన పార్టీలో చేరిన గుంటూరు నేతలు
గుంటూరు జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు గురువారం జనసేన పార్టీలో చేరారు. గురువారం విజయవాడలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గానికి చెందిన పుట్టు లక్ష్మీస్వరాజ్యం, రమేష్, కళ్యాణ్, షేక్ సయ్యద్ తదితరులు జనసేన నేత నాదెండ్ల మనోహర్ సమక్షంలో పార్టీలో చేరారు. అందరినీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన మనోహర్ నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. వాట్సాప్‌లో వారిపై కామెంట్లు చేశారంటే?

Updated By ManamFri, 09/14/2018 - 18:39
 • ఏపీ, తెలంగాణ రాష్ట్ర పోలీసు వారి హెచ్చరిక.. 

 • పూర్తిగా వాట్సాప్ గ్రూపు అడ్మిన్‌దే బాధ్యత.. 

 • సభ్యులపై కేసు నమోదు చేసి పత్రికల్లో ప్రచురిస్తాం

No comment, Shares on Watsapp, AP, Telangana DGPsహైదరాబాద్/అమరావతి: ప్రముఖ సోషల్ మీడియా మెసేంజర్ వాట్సాప్‌లో అసభ్యకర వార్తలు షేర్ చేస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవు. ఈ మేరకు శుక్రవారం ఏపీ, తెలంగాణ డీజీపీలు హెచ్చరించారు. తెలుగు రాష్ట్రాల్లో ఏ రాజకీయ పార్టీ, లేదా ఏ నేత‌ను ఉద్దేశించి అసభ్యకరంగా సోషల్ మీడియాలో వాట్సప్ ద్వారా పోస్ట్ చేస్తే తీవ్ర పరిమాణాలుంటాయని పేర్కొన్నారు. ముఖ్యంగా వాట్సాప్ గ్రూపుల్లో ఇలాంటి సమాచారాన్ని షేర్ చేయడంగానీ, పోస్టు చేయడంగానీ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని, ముందుగా వాట్సాప్ గ్రూపు అడ్మిన్‌ ఈ చర్యకు పూర్తి బాధ్యుడివుతాడని స్పష్టం చేశారు.

గ్రూపు అడ్మిన్‌పై చర్యలకు తీసుకోవడమే కాకుండా పోస్టు చేసిన గ్రూపు సభ్యులపై కేసు నమోదు చేసి వారి వివరాలను పత్రికలలో ప్రచురిస్తామని తెలుగు రాష్ట్రాల డీజీపీలు వెల్లడించారు. చివరిగా గమనిక తెలియజేస్తూ.. వాట్సాప్ గ్రూపు సభ్యులందరూ దయచేసి ఇతరులకు మెసేజ్‌ను ఫార్వార్డ్ చేసే సమయంలో ఒక్కసారిగా నిశితంగా పరిశీలించుకోవాల్సిందిగా జాగ్రత్తలు సూచించారు. జయహో బీసీ!

Updated By ManamThu, 09/06/2018 - 07:11
 • దేశంలో సగం- టీడీపీతో మనం.. మహానాడు తరహా 2 రోజుల సదస్సు

 • తొలిరోజు బీసీకులాలతో సమావేశం.. రెండోరోజు భారీ బహిరంగ సమావేశం

 • అక్టోబరు నాలుగో వారంలో ఏర్పాటు.. పార్టీ వ్యూహాలు బయటకు వెళ్తే ఎలా?

 • గ్రూపు విభేదాలకు పూర్తిగా స్వస్తిచెప్పండి.. టీడీపీ వర్క్‌షాప్‌లో నేతలతో చంద్రబాబు

అమరావతి: ‘‘తెలుగుదేశం పార్టీకి  తొలి నుంచి బీసీలే అండదండ. వారి రుణం తీర్చుకోవడం మన బాధ్యత. అందుకే రాష్ట్రంలోని బీసీలందరినీ ఒక దగ్గర చేర్చేందుకు ‘దేశంలో సగం-తెలుగుదేశంతో మనం’ ట్యాగ్ లైన్‌తో త్వరలో ‘జయహో బీసీ’ సదస్సు ఏర్పాటు చేస్తున్నాం.’’ అని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. బుధవారం తెలుగుదేశం పార్టీ వర్క్‌షాప్‌లో చంద్రబాబు మాట్లాడారు. మహానాడు తరహాలో బీసీ సదస్సు రెండు రోజులు ఉంటుందని, తొలి రోజు అన్ని బీసీ కులాల వారితో సమావేశాలు ఉంటాయని, రెండో రోజు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. విజయదశమి తరువాత అక్టోబరు నాలుగో వారంలో బీసీ సదస్సు ఏర్పా టు చేయాలని వర్క్‌షాప్‌లో నేతలు నిర్ణయించారు. నెల్లూరు ‘దళిత తేజం-తెలుగుదేశం’ సదస్సుకు లక్షమంది పైగా హాజరయ్యారని... రెండు ఎస్సీ ఉపకులాల వారు టీడీపీ తమదిగా భావించి హాజరై  కార్యక్రమాన్ని విజయవంతం చేశార ని చంద్రబాబు గుర్తుచేశారు. సభకు అత్యంత భారీగా హాజరవుతారని, అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు ఉండాలని పార్టీ నేతలను చంద్రబాబు ఆదేశించారు.
 

image


నేతలంతా సంఘటితంగా ఉండాలి
‘‘టీడీపీలో తొలి ప్రాధాన్యం బీసీలకే. పదవుల్లో, సంక్షేమంలో, అభ్యున్నతిలో బీసీలకే పెద్దపీట. టీడీపీ చేస్తున్న అన్ని పనుల్లో తొలి తాంబూలం వారికే. పేదరికంలేని, ఆర్థిక అసమానతలు లేని సమాజం ఏర్పాటే పార్టీ లక్ష్యం. క్రమశిక్షణ లేని పార్టీ, కట్టుబాటులేని కుటుంబం కుప్పకూలుతాయి. పార్టీలో ఎంతమంది ఉన్నారనేది కాదు.. ఎంత ఐక్యంగా ఉన్నారనేది ముఖ్యం. మన కర్రతో మన ం కొట్టుకుంటే దెబ్బ తగులుతుందా లేదా..? అలాగే రాజకీయాల్లో ఎత్తుగడలు ఉంటాయి. కానీ మన వ్యూహాలు, ప్రతివ్యూహాలు బయటకు వెళ్లకూడదు. మన కాళ్లకు మనమే బంధాలు వేసుకుంటే ముందుకు పోలేం. ఎన్నికల ముందు అందరూ సంఘటితంగా ఉండాలి. గ్రూపు విభేదాలకు స్వస్తి చెప్పాలి.’’ అని చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. 

బీజేపీ నమ్మకద్రోహాన్ని ఎండగడతాం: మంత్రి కాల్వ
బీజేపీ చేస్తున్న నమ్మకద్రోహన్ని గురువారం నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఎండగడతామని మంత్రి కాల్వ శ్రీనివాసులు వెల్లడించారు. రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని సభ సాక్షిగా ప్రజల్లోకి తీసుకువెళతామన్నారు. 2014కు ముందు రాష్ట్రం ఏమవుతుందో అని ప్రజలందరిలో ఆందోళన ఉందని,అలాంటిది అసాధ్యాన్ని చంద్రబాబు సుసాధ్యం చేశారని మంత్రి కాల్వ ప్రశంసించారు. 

హరికృష్ణకు సంతాపం...
ఇటీవల రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన పార్టీ సీనియర్ నాయకుడు నందమూరి హరికృష్ణ మృతి పట్ల టీడీపీ నేతలు సంతాపం వెలిబుచ్చారు. టీడీపీ వర్క్‌షాప్‌లో సంతాప తీర్మానాన్ని, ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు ప్రవేశపెట్టారు. చైతన్య రథ సారథిగా 78 వేల కిలోమీటర్లు ఒక్క ప్రమాదం లేకుండా హరికృష్ణ నడిపారని గుర్తుచేశారు. అలాంటిది రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మృతి చెందడం బాధాకరమన్నారు. తెలుగుయువత అధ్యక్షునిగా, మంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా, పొలిట్‌బ్యూరో సభ్యునిగా పార్టీకి అనేక సేవలు అందించారని కళా వెంకట్రావు కొనియాడారు. 'ఏపీలో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదు'

Updated By ManamSun, 08/26/2018 - 17:37

No alliance, TDP, congress, AP, KE Krishnamurthi కర్నూలు: ఏపీలో మాత్రం కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉండదని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. కర్నూలు జిల్లాలో నిర్వహించిన ధర్మపోరాట దీక్ష విజయవంతమైందని ఆయన అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ధర్మపోరాట దీక్షకు వచ్చిన స్పందనతో జిల్లాలోని అన్ని నియెజకవర్గాల్లో టీడీపీ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

టీడీపీ జాతీయ పార్టీని, ఇతర పార్టీలతో పొత్తులు ఒకేలా ఉండవని, ఆయా రాష్ట్రాల పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయని చెప్పారు.  తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో పరిస్థితులను బట్టి పొత్తులపై సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని కేఈ తెలిపారు. నేటి నుంచి హార్టికల్చర్ షో

Updated By ManamWed, 08/22/2018 - 23:59
 • ప్రారంభించనున్న చంద్రబాబు: సోమిరెడ్డి  

imageఅమరావతి: విజయవాడ రూరల్ కానూరు వీఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌లో హార్టికల్చర్ ప్రదర్శన-2018ను ఏర్పాటు చేస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రదర్శనను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ నెల 23 నుంచి 26 వరకు ఈ ప్రదర్శన ఉంటుందని వెల్లడించారు. బిందు సేద్యంలో దేశంలోనే రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందన్నారు. ప్రతి ఏడాది అదనంగా 5 లక్షల ఎకరాల్లో ఉద్యానవన పంటలు పండించే దిశగా రైతులను ప్రోత్సహిస్తున్నామని వివరించారు. ప్రస్తుతం సాగు చేస్తున్న 40 లక్షల ఎకరాలను రాబోయే నాలుగు సంవత్సరాలలో కోటి ఎకరాలకు పెంచడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నిర్ణయించారని మంత్రి సోమిరెడ్డి తెలియజేశారు. 'నాలుగేళ్లు గడిచినా.. ఏపీకి దక్కని న్యాయం'

Updated By ManamFri, 08/10/2018 - 19:56

No justice, AP, 4years completed, MP Sujana chowdary న్యూఢిల్లీ: నాలుగేళ్లు గడిచినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేయాలనే ఆలోచన కేంద్రానికి లేదని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి విమర్శించారు. జులై 18 నుంచి ప్రారంభమైన పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా సుజనా మీడియాతో మాట్లాడుతూ... కేంద్రంపై ప్రజాక్షేత్రంలో కూడా తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు. వచ్చే శీతాకాల సమావేశాలు 45 రోజుల పాటు జరపాలని కేంద్రాన్ని కోరామని చెప్పారు. ‘‘జాతీయ పార్టీ మీద ప్రాంతీయపార్టీ పెట్టిన అవిశ్వాసం ఒక చరిత్రాత్మకం.

నాలుగేళ్లు గడిచినా.. ఏపీకి న్యాయం చేయాలనే ఆలోచన కేంద్రానికి లేదు. విభజన అన్యాయంగా జరిగిందన్న మోదీయే న్యాయం చేయటం లేదు. వైసీపీ తీరు దారుణంగా ఉందని, పీఏసీలో ఓటు ఎవరికి వేసిందో కూడా తెలియదు. ప్రతిపక్షాలు అన్నీ ఏకమైనా కొన్ని సాధించుకోలేకపోయాం. డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికలో ఎన్డీఏ వ్యతిరేక ఓట్లు కొంత అనుకూలంగానే పడ్డాయి. రాఫెల్‌ కుంభకోణం గురించి కేంద్రం ఎందుకు మాట్లాడటం లేదు’’ అని సుజనా ప్రశ్నించారుపెట్టుబడులకు ఏపీ అనుకూలం

Updated By ManamFri, 08/10/2018 - 00:01
 • 2029కి అభివృద్ధిలో నంబర్‌వన్ కావాలి

 • టెక్నాలజీ వినియోగంతోనే వృద్ధి సాధ్యం

 • రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ 

imageవిశాఖపట్నం: పారిశ్రామిక పెట్టుబడులకు రాష్ట్రంలో సానుకూల వాతావరణం ఉందని, పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో గురువారం జరిగిన టెక్నాలజీ సభలో లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ దేశంలోనే మూడో స్వచ్ఛ నగరమైన విశాఖలో ఈ సభ జరగడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర విభజన తరువాత అనేక సమస్యలు ఎదుర్కోన్నామని అన్నారు. స్టార్టప్ రాష్ట్రంగా అభివృద్ధి కోసం పరుగు పెడుతున్నామన్నారు. ఇతర దక్షణాది రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం తక్కువగా ఉందన్నారు. 2022 నాటికి దేశంలో అభివృద్ధి చెందిన మొదటి మూడు రాష్ట్రాల్లో ఒక్కటి గానూ, 2029కి దేశంలోనే నంబర్ వన్ స్థానంలోనూ, 2050కి ప్రపంచంతోనే పోటీ పడాలే రాష్ట్రాన్ని తయారు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు.

అనుకున్న లక్ష్యాలు సాధించాలి అంటే 15 శాతం వృద్ధి చెందాలి అని స్పష్టం చేశారు. ప్రస్తుతం 12 శాతం వృద్ధి సాధించామన్నారు. టెక్నాలజీ వినియోగంతోనే 15 శాతం వ ద్ధి సాధించడం సాధ్యం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో టెక్నాలజీని పెద్ద ఎత్తున వినియోగిస్తున్నా మన్నారు. కనపడే పాలన, కనిపించని ప్రభుత్వం అనే లక్ష్యాన్ని పెట్టుకొ ని పనిచేస్తున్నామన్నారు. పేపర్ లెస్ గవర్నెన్స్, ఈ కేబినెట్, రియల్ టైమ్ గవర్నెన్స్ అమలు చేస్తున్నామని లోకేశ్ వివరించారు. అనంతరం పలువురు పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశమయ్యారు.

నేడు విశాఖలో 13 ఐటీ కంపెనీల ప్రారంభం
రాష్టాన్ని ఐటీ హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం విశేష కృషి చేస్తోం ది. ఇందులో భాగంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ విశాఖప ట్నంలో కొత్తగా ఏర్పాటు చేసిన 13 ఐటీ కంపెనీలను శుక్రవారం ప్రారంభించనున్నారు. వీటితో పాటు మరో నాలుగు కంపెనీల విస్తరణ కార్యక్రమాల్లో ఆయన శుక్రవారం పాల్గొంటారు. ఇన్ఫరేషన్ టెక్నాలజీ రంగంలో వివిధ విభాగాల్లో సేవలందించే సీఈఎస్ లిమిటెడ్, సెరియం సిస్టమ్స్, సహస్రమయ టెక్నాలజీస్, వెలాంటా కేపీవో అకౌంటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, బెల్ ఫ్రిక్స్ క్రిప్టెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, స్వేయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్, ఇన్ డేటా అనలిటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, హెచ్‌ఆర్ స్క్వేర్ స్టాఫింగ్ సొల్యూషన్స్, ఇన్సోటీం కన్సల్టింగ్ సర్వీసెస్, న్యూవి సొల్యూషన్స్, వివిలెక్స్ టెక్నాలజిస్, ఎన్వోయ్ మోర్ట్గేజ్, హిప్పో క్యాంపస్ తదితర సంస్థలకు లోకేశ్ ప్రారంభించనున్నారు.

ఈ సంస్థల ద్వారా 2375 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. కాగా, సింబయోసిస్, ఇన్‌స్పైర్ ఎడ్జ్ ఐటీ సొల్యూషన్స్, కాన్డ్యూయెంట్, పాత్రా ఇండియా బీపీవో సర్వీసెస్ తమ సేవలను విస్తరించనున్నాయి. దీంతో 6900 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.టీటీడీకి జీఎస్టీ రిజిస్ట్రేషన్ వద్దు

Updated By ManamSat, 08/04/2018 - 23:40
 • గిరిజన కార్పొరేషన్, గిరిజన ఉత్పత్తులకు కూడా

 • ఎంఎస్‌ఎంఈల రాయితీలను కేంద్రమే భరించాలి

 • సినిమా టికెట్లు, సిమెంట్‌పై పన్ను తగ్గించండి

 • జీఎస్టీ కౌన్సిల్‌కు మంత్రి యనమల సూచనలు

imageన్యూఢిల్లీ: మధ్య, చిన్న, మైక్రో తరహా పరిశ్రమలకు రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వడాన్ని రాష్ట్ర మంత్రి ఆర్థిక మంత్రి యనమల స్వాగతించారు. ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో శనివారం జరిగిన 29వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మంత్రి యనమల రామకృష్ణుడు పాల్గొన్నారు. ఎంఎస్‌ఎంఈలకు రాయితీలు ఇవ్వడానికి ముందు ఫిట్‌మెంట్ కమిటీ, లీగల్ కమిటీలు ప్రణాళికలు తయారుచేసుకొని జీఎస్టీ మంత్రి వర్గ ఉపసంఘం ముందు పెట్టాలన్నారు. మధ్య, చిన్న, మైక్రో పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు, ప్రోత్సాహాకాలను కేంద్రప్రభుత్వమే భరించాలన్నారు.

సిమెంట్‌పై జీఎస్టీ 28 శాతం నుండి 18 శాతానికి, సినిమా టికెట్లుపై 18 శాతం నుండి 12 శాతానికి జీఎస్టీని తగ్గించాలని మంత్రి యనమల కోరారు. తిరుమల తిరుపతి దేవస్థానం, గిరిజన కార్పొరేషన్, గిరిజన ఉత్పత్తులను జీఎస్టీ రిజిస్ట్రేషన్ నుండి తప్పించాలని కోరారు. ఆక్వా, జూట్ బ్యాగ్, చేపలు పట్టే వలలు, మత్య్సకారుల పడవలు, ఎండినచింతపండు, చేనేత వస్త్రాలు, పత్తి నూలు, పట్టు నూలుపై ఉన్న జీఎస్టీ నుండి మినహాయింపు కోరారు. నాపాశ్లాబ్, ట్రాక్టర్లు, ట్రాక్టర్ విడిబాగాలపై జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలన్నారు.

సామాన్య ప్రజలు వినియోగించే 29 రకాల వస్తువులకు జీఎస్టీ నుండి మినహాయింపు ఇవ్వాలని యనమల కోరారు. డిజిటల్ కొనుగోలుదారులకు జీఎస్టీలో రెండు శాతం మినహాయింపు ఇవ్వడాన్ని మంత్రి స్వాగతించారు. అయితే డిజిటల్ కొనుగోలుదారులకు ఇచ్చే జీఎస్టీ మినహాయింపులో లోపాలు లేకుండా అమలు చేయడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని జీఎస్టీ కౌన్సిల్‌కు మంత్రి యనమల రామకృష్ణుడు కౌన్సిల్‌కు సూచించారు.ఏపీ ప్రజలు ఎలా కనిపిస్తున్నారు..?: పవన్

Updated By ManamFri, 07/20/2018 - 16:55

pawan kalyan serial tweets on Tdp and central govt

హైదరాబాద్: పార్లమెంట్‌‌లో అవిశ్వాస తీర్మానంపై జరుగుతున్న చర్చపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అవిశ్వాస తీర్మానంలో నెగ్గేదెవరో..? అని దేశ ప్రజలు.. మరీ ముఖ్యంగా ఏపీ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. టీడీపీపై వరుస ట్వీట్లు చేస్తూ తన ఆగ్రహాన్నంతటిని వెల్లగక్కుతున్నారు. మరికొద్దిసేపట్లో అవిశ్వాస తీర్మానం చర్చ ప్రారంభమవుతుందన్న సమయం నుంచి సాయంత్రం వరకూ వరుస ట్వీట్లు చేశారు.

పవన్ ట్వీట్స్..
"వ్యక్తిగత లాభాల కోసం ‘స్పెషల్ క్యాటగిరి స్టేటస్’ కి మూడున్నర సంవత్సరాలుగా తూట్లు పొడిచి ఈ రోజు వ్యర్ధమైన ప్రసంగాలు చేసి ప్రయోజనం ఏమిటి? దశాబ్దాల అనుభవం ఉన్న నాయకులకి కేంద్రం వంచన తెలియటానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది అంటే మేము నమ్మాలా?" అంటూ పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ నాయకులకు ప్రజలు ఎలా కనిపిస్తున్నారు..?
"
కొత్తగా వచ్చిన జనసేన పార్టీ కేంద్రం స్పెషల్ స్టేషస్ ఇవ్వదు అని గ్రహించి తిరుపతి సభలో రెండున్నరేళ్ల క్రితం చెప్పినప్పుడు.. మరి ఆరోజు బీజేపీని వెనకేసుకొని వచ్చారు. అందురూ గగ్గోలు పెడుతున్నా కానీ పాచిపోయిన లడ్లు లాంటి స్పెషల్ ప్యాకేజీని కళ్లకద్దుకొని తీసుకొని.. మమ్మల్ని తిట్టి, అనుభవరాహిత్యం అని విమర్శలు చేసిన వారు. బీజేపీ నాయకులి సన్మానాలు చేసిన వారు ఈ రోజున మోసం తెలుసుకోవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది అంటే మేము నమ్మాలా..? టీడీపీ నాయకులకు ఏపీ ప్రజలు ఎలా కనిపిస్తున్నారు..?" అని ఈ సందర్భంగా పవన్ ప్రశ్నల వర్షం కురిపించారు. వ్యక్తిగత లబ్ధి కోసమే హోదాను కేంద్రానికి టీడీపీ తాకట్టుపెట్టిందని తద్వారా ప్రజల్లో పూర్తి విశ్వాసాన్ని తెలుగుదేశం కోల్పోయిందన్నారు.

కాగా.. ఇంతకు మునుపు జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో సుమారు 13 సార్లుకు పైగా వైసీపీ అవిశ్వాస తీర్మానం పెట్టిన సమయంలో అవసరమైతే తాను కూడా దేశ రాజధాని ఢిల్లీకి వచ్చి అన్ని పార్టీల మద్దతు కోరి కేంద్రంపై యుద్ధం చేద్దామని పవన్ పిలుపునిచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఆయన మాట మీద నిలబడకపోవడం.. సైలెంట్ అయిపోవడంతో అప్పట్లో ఏపీ ప్రజలకే కాదు.. పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తల్లో సైతం అనుమానాలు వచ్చాయన్నది జగమెరిగిన సత్యమే. అయితే తాజాగా పవన్ వరుస ట్వీట్లు చేస్తుండటంతో అదేదో అప్పుడు మీరు చెప్పిన మాట మీద నిలబడి అన్ని పార్టీల మద్దతు కూడగట్టి వుంటే బహుశా ఏపీకి ప్రయోజనం చేకూరేదేమోనని.. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత హడావుడెందుకో..? అని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Related News