ap cm chandrababu naidu

హోదా ఎందుకివ్వరు?

Updated By ManamWed, 09/19/2018 - 23:15
 • ఇది సమాఖ్య సూర్తికి విఘాతం.. నిధులపై విచారణ చేయండి

 • మీ జడ్జినే నియమించండి.. బీజేపీకి, బ్రిటీష్‌కు తేడా ఏమిటి?

 • అసెంబ్లీలో కేంద్రంపై చంద్రబాబు ఫైర్

Chandrababuఅమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వొద్దని ఆర్థిక సంఘం చెప్పనప్పుడు, రాష్ట్రానికి హోదా ఎందుకివ్వరని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని నిలదీశారు. బుధవారం అసెంబ్లీలో ‘ఏపీకి రావాల్సిన నిధులపై కేంద్రం నిర్లక్ష ధోరణి’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. కేంద్రం, రాష్ట్రానికి చేస్తున్న నిర్లక్ష్య ధోరణి సమాఖ్య స్ఫూర్తికి  విఘాతం కలిగిస్తుందని ఆయన మండిపడ్డారు. దేశంలో 11 రాష్ట్రాలకు ఇస్తున్న విధంగా పన్ను రాయితీలతో కూడిన ప్రత్యేక హోదా ఏపీకి ఇవ్వాలని, అప్పటి ప్రధాని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని శాసనసభ డిమాండ్ చేస్తోందన్నారు. ప్రత్యేక హోదా హామీని నెరవేర్చి పార్లమెంట్ వ్యవస్థ గొప్పతనాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని కేంద్రం గౌరవించాలన్నారు. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చేశామని చెబుతున్న 90 శాతం నిధులపై, వాళ్ల జడ్జీనే నియమించి విచారణ జరిపించాలని చంద్రబాబు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇచ్చిందని ఆ కమిషన్ తేల్చితే, తాను కేంద్రాన్ని ఏమీ అడగనని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదా కోరుతున్నారని, ప్రత్యేక హోదా ఇవ్వకపోతే, భవిష్యత్ తరాలు కూడ బీజేపీపై కోపంగా ఉంటారని చంద్రబాబు పేర్కొన్నారు. 

ఇలాంటి పార్టీలు చాలా చూశా..
‘‘నేను ఎప్పుడూ హైదరాబాద్‌కు వ్యతిరేకంగా మాట్లాడలేదు. అక్కడ గొప్ప వారసత్వ సంపద ఉంది. హైదరాబాద్ లాంటి సిటీని నిర్మించాలంటే రూ. 5 లక్షల కోట్లు ఖర్చవుతుంది. 20 ఏళ్లు పడుతుందని చెప్పాను. ఈ రోజు ఇంకో నగరాన్ని నిర్మిస్తానని చెప్పాను కానీ ఎప్పుడూ హైదరాబాద్‌కు వ్యతిరేకంగా మాట్లాడలేదు. ప్రతిపక్ష పార్టీ బీజేపీని ఒక్క మాట కూడా విమర్శించదు. రిమోట్ కంట్రోల్ మొత్తం మోదీ దగ్గరే ఉంది. అందుకే జగన్ మాట్లాడటంలేదు. మమ్మల్ని కూడా భయపెట్టాలని కేంద్రం చూస్తోంది. 40 ఏళ్లు రాజకీయ జీవితంలో ఉన్నా. ఇలాంటి పార్టీలను నేను చాలా చూశాను. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ఈ గడ్డపై పుట్టుంటే.. నేను ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని బలపరచాలి. కేంద్రాన్ని విమర్శించా లి’’అని చంద్రబాబు సవాల్ విసిరారు. 

బీజేపీకి బ్రిటీష్ వాళ్లకు తేడా ఏంటి?
కేంద్రానికి తాము ఎప్పుడూ పన్నులు కడుతూనే ఉండాలా? అని చంద్రబాబు కేంద్రాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాలపై కక్ష పూరితంగా వ్యవహరించేటట్లు అయితే బీజేపీ వాళ్లకు, బ్రిటీష్ వాళ్లకు తేడా ఏముందని ఆయన నిలదీశారు. అన్ని రాజకీయ పార్టీలు ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతున్నప్పుడు  కేంద్రానికి ఏంటీ ఇబ్బంది అని ప్రశ్నించారు. కేంద్రం, ఏపీపై వివక్ష చూపిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు.ఏ నేరం చేయలేదు

Updated By ManamSat, 09/15/2018 - 00:14
 • ఉత్తర తెలంగాణ ఎడారి కారాదనే బాబ్లీ దగ్గర నిరసన దీక్ష చేపట్టా

 • అరెస్ట్ చేసి విమానంలో పంపారు.. 8 ఏళ్ల తర్వాత వారెంట్ జారీనా?

 • దేనైన్నా ఎదుర్కొనేందుకు సిద్ధం.. జలసిరికి హారతి పవిత్ర కార్యక్రమం

 • నీటి సంరక్షణ కోసం జలదీక్ష చేపట్టా.. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తా: చంద్రబాబు

కర్నూలు: ‘‘బాబ్లీ ప్రాజెక్టు విషయంలో నేను ఏ నేరం కానీ.. ఘోరం కానీ చేయలేదు. ప్రాజెక్టుపైన మరోప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం వల్ల ఉత్తర తెలంగాణ ఎడారిగా మారిపోతుందని ఆ రోజు నిరసన తెలియజేసేందుకు ఎమ్మెల్యేల బృందంతో వెళ్లాం. అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని అరెస్ట్ చేయించింది. తాము ఏ తప్పు చేయలేదని, ఏం చేస్తారో చేయమని నిర్మొహమాటంగా చెప్పాం. బలవంతంగా విమానంలో ఎక్కించి హైదరాబాద్‌కు పంపించారు. 8 ఏళ్ల తర్వాత ఇప్పుడు బాబ్లీ విషయంలో నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేశారు. ఇన్ని రోజులు గుర్తుకు రానిది.. ఇప్పుడు ఎందుకు గుర్తుకు వచ్చిందో అర్థం కావడంలేదు. కార్యకర్తలు అన్నింటికి సిద్ధంగా ఉండాలి’’ అని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. జలసిరికి హారతికి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కర్నూలు జిల్లా శ్రీశైలానికి వచ్చారు. ముందుగా శ్రీశైల మల్లికార్జున, భ్రమరాంబిక దేవిలను దర్శించుకున్నారు. అనంతరం శ్రీశైలం ప్రాజెక్టు దగ్గరకు చేరుకుని కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభాస్థలికి చేరుకుని పులకుర్తి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేశారు.

image


ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. జలసిరికి హారతి ఎంతో పవిత్రమైన కార్యక్రమన్నారు. నీరు సమస్త మానవాళికి ప్రాణాధారమన్నారు. ఏ అభివృద్ధి జరగాలన్నా నీరే అవసరమని పేర్కొన్నారు. దేశంలో 12 నదులకు 12 సంవత్సరాలకు ఒక్కసారి పుష్కరాలు జరుగుతాయని, నీరు ఎక్కడ ఉంటే.. నాగరికత అక్కడ ఉంటుందన్నారు. సింధు, నైలు నదిలో నీరు ఉన్నందున నాగరికతలు వెలసిల్లాయన్నారు. ఎక్కడైతే ప్రకృతిని ఆరాధిస్తారో..  ఆ ప్రాంతం సస్యశ్యామలంగా ఉంటుందన్నారు. నీటిని ఒడిసిపట్టి వ్యవసాయం చేస్తే.. ఎన్నో అభివృద్ధి ఫలాలు సాధ్యమవుతాయన్నారు. కొంత మంది అయ్యప్ప దీక్ష.. మరికొంత మంది శివదీక్ష.. ఇంకొంత మంది భవాని దీక్ష చేస్తారని, కానీ తాను జలదీక్ష చేపట్టానని అన్నారు. ప్రతి ఒక్కరికి నీళ్లు ఇచ్చే ఈ దీక్ష చేస్తున్నానన్నారు.

రాష్ట్రంలో 57 ప్రాజెక్టులు పూర్తి చేయాలని, నదులు అనుసంధానం చేసి రాష్ట్రానికి సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. imageపోలవరం ప్రాజెక్టులో ఇప్పటి వరకు 58శాతం పూర్తి చేశామన్నారు. పోలవరానికి రూ.16వేలు కోట్లు ఖర్చు చేశామని, కానీ కేంద్రం రూ.2,800 కోట్లు ఇంకా ఇవ్వాల్సి ఉందని చెప్పారు. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు 81 శాతం పనులు పూర్తి అయ్యాయని, ప్రాజెక్టు పూర్తి చేసి ప్రకాశం జిల్లాకు నీరు అందిస్తామన్నారు. వచ్చే సంవత్సరం నాటికి 46 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని అన్నారు. ఇప్పటికే 10 ప్రాజెక్టులు పూర్తి చేశామని, మిగిలిన ప్రాజెక్టులను త్వరలో పూర్తిచేస్తామని తెలిపారు. కేంద్రం సహకరించినా.. సహకరించకపోయినా నదుల అనుసందాన కార్యక్రమం జరుగుతుందన్నారు. వ్యవసాయ రంగంలో ఏపీ దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచిందన్నారు. దేశంలో 16 జాతీయ ప్రాజెక్టులు ఉన్నాయని, వీటిలో ఏవీ కూడా పూర్తికాలేదన్నారు. ముందు చూపుతోనే పట్టిసీమ తీసుకురావడంతో నేడు కృష్ణా జలాలు రాయలసీమకు అందుతున్నాయన్నారు. పట్టిసీమ నిర్మాణంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, డబ్బు వృధా అవుతుందని విమర్శలు చేయడంతో పాటు కొందరు కోర్టుకు వెళ్లారని తెలిపారు.

30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నానని, ఎంతో మంది ఎన్నో ఆరోపణలు చేశారని, ఏ ఒక్కటి నిరూపణ కాలేదన్నారు. గుండ్రేవుల ప్రాజెక్టుకు నిర్మాణానికి అంతరాష్ట్ర సమస్య ఉందని, త్వరలోనే సమస్య పరిష్కరించి ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకుంటామన్నారు. నీటి సంరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో శ్రీశైలాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, శాసనమండలి చైర్మన్ ఎన్‌ఎండీ ఫరూక్, మంత్రులు దేవినేని ఉమా, కాల్వ శ్రీనివాసులు, అఖిల ప్రియ, ఎంపీ ఎస్పీవై రెడ్డి, కేఈ ప్రభాకర్, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, మణిగాంధీ, సోమిశెట్టి వెంకటేశ్వర్లు, తిక్కారెడ్డి, వీరభద్రగౌడ్, ఏవీ సుబ్బారెడ్డి, నాగేశ్వర రావు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. 
 చంద్రబాబుకు వారెంట్!

Updated By ManamThu, 09/13/2018 - 21:53
 •  బాబ్లీ కేసులో చంద్రబాబుకు నాన్ బెయిల్‌బుల్ వారెంట్

Non Bailable Warrant to AP CM Chandrababu Naidu

అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నాన్ బెయిల్‌బుల్ వారెంట్ జారీ అయింది. 2010లో బాబ్లీ ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా ధర్నా చేసేందుకు వెళ్లిన చంద్రబాబు నాయుడుతో పాటు మరో 15మందిపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.

ఈ కేసుకు సంబంధించి ఈ నెల 21న చంద్రబాబుతో పాటు మిగతావారంతా కోర్టుకు హాజరు కావాలని మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనుమతిల లేకుండా ప్రాజెక్ట్ వద్దకు వచ్చారని పోలీసులు కేసు నమోదు చేశారు.  అయితే ఎనిమిదేళ్లుగా ఒక్క నోటీసు కూడా లేకుండా ఒకేసారి నాన్ బెయిల్‌బుల్ వారెంట్ జారీ చేయడం పట్ల తెలుగుదేశం పార్టీ నేతలు తప్పుబడుతున్నారు. 

కాగా తిరుమల బ్రహ్మోత్సవాలు సందర్భంగా చంద్రబాబు ప్రస్తుతం తిరుమలలో ఉన్నారు. శ్రీవారి సేవలో వుండగానే నోటీసులు వచ్చినట్లు తెలుసుకున్న ముఖ్యమంత్రి న్యాయనిపుణులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిపై వారెంట్ జారీ కావడంతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. భవితకు అస్త్రం

Updated By ManamMon, 09/10/2018 - 22:32

Chandrababuఅమరావతి: ఏ దేశానికైనా యువతరమే వెన్నెముక. విద్యావంతులైన యువతరానికి ఉపాధి అవకాశాలు అందించగలిగితే సమాజ  భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. నైపుణ్య సాధనకు యువతకు ఆర్థిక చేయూతనిచ్చి, వారిని ఉద్యోగార్ధులను చేయాలనే లక్ష్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా అర్హులైన నిరుద్యోగ యువతకు ప్రతి నెలా వెయ్యి రూపాయలు నిరుద్యోగ భృతి అందిస్తారు. యువనేస్తం వెబ్‌సైట్‌లో ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి పథకానికి అర్హులా కాదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. తర్వాత అర్హులకు నైపుణ్యాభివద్ది, అప్రెంటిస్ ఆన్‌జాబ్ ట్రైనింగ్ అన్ని ఆన్‌లైన్‌లో జరిగిపోతాయి. యువనేస్తం వెబ్‌సైట్ ఓ రకంగా ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్చేంజ్‌లా పనిచేస్తుంది. దేశంలోని వివిధ కంపెనీలు ఈ వెబ్‌సైట్ లో రిజిస్టర్ అయ్యి తమకు కావాల్సిన అభ్యర్థులను ఎంపిక చేసుకొని ఇంటర్వ్యూకి పిలుచుకునే అవకాశం కూడా ఉంది. ముఖ్యమంత్రి యువనేస్తం వెబ్ సైట్ ని సెప్టెంబర్ 14న ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అక్టోబర్ 2 నుంచి యువత బ్యాంకు ఖాతాల్లో భృతి జమ అవుతుంది.   

పథకం ముఖ్య అంశాలు...

 • ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ

 • స్వయం ఉపాధి శిక్షణ, స్వయం ఉపాధి కల్పన

 • అప్రెంటిస్ కార్యక్రమం. ఆన్ జాబ్ ట్రైనింగ్

 • కాంపిటేటివ్ పరీక్షల కోసం శిక్షణ

 నిరుద్యోగ భృతికి అర్హతలు  

 • 22 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు

 • పీజీ లేదా గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా పూర్తి చేసి ఏడాది పూర్తి కావాలి.  

 • తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి 

 • ప్రజా సాధికార సర్వేలో నమోదై ఉండాలి 

 • కుటుంబంలో ఏ ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగి అయ్యి ఉండకూడదు 

 • ఆంధ్రప్రదేశ్‌లో నివసిస్తున్న నిరుద్యోగులై ఉండాలి 

 • కుటుంబంలో నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు 

 • ప్రభుత్వం నుంచి లోన్ /సబ్సిడీ రూ 50,000 మించి పొంది ఉండకూడదు.

 • గరిష్ఠంగా 2.5 ఎకరాల మాగాణి, 5 ఎకరాల మెట్ట భూమిని మించి ఉండకూడదు 

 • అనంతపురం జిల్లాకు సంబంధించి గరిష్టంగా 5 ఎకరాల మాగాణి, 10 ఎకరాల మెట్ట భూమిని మించి ఉండకూడదు 

 • ఈపీఎఫ్, ఈఎస్‌ఐసీ కింద నమోదుకాబడిన ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగులై ఉండకూడదు

 • బ్యాంకు ఖాతా, మొబైల్ నంబర్, ఆధార్ కార్డుకు జతచేసి ఉండాలి. 

 • తల్లిదండ్రులు/ కుటుంబ సభ్యులకు సామాజిక పింఛన్లు లభిస్తున్నప్పటికీ, నిరుద్యోగ భృతికి అర్హులుగానే పరిగణించబడతారు. 

 • శారీరక వికలాంగుల కోటా కింద పెన్షన్ పొందే వారు అనర్హులు

 • కుల, మత ప్రాధాన్యాలు నిబంధనల ప్రకారం అమలుచేస్తారు

 • ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ తొలగించిన వారు అనర్హులు  

 • నేరస్థుడిగా శిక్షింపబడినవారు అనర్హులు

 • ఇతర రాష్ట్రాల విశ్వ విద్యాలయాల నుండి డిగ్రీలను పొందిన అర్హులే

నమోదు చేసుకోవడం ఎలా ? 
ముఖ్యమంత్రి యువనేస్తం పథకం ద్వారా నిరుద్యోగ భృతి పొందాలనుకునే వారు ‘యువనేస్త్తం.ఏపీ.జీవోవి.ఇన్’ వెబ్‌సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. వెబ్‌సైట్‌లోని అప్లై నౌ బటన్‌ను నొక్కి ఆధార్ కార్డు నెంబరు ఆధారంగా దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి. విద్యార్హతకు సంబంధించిన పత్రాల కాపీలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియలో ఎదురైన సమస్యలను పరిష్కరించుకోవడానికి కాల్ సెంటర్ నెంబర్ 1100ని సంప్రదించవచ్చు. 

నిరుద్యోగులకు వివిధ రంగాల్లో శిక్షణ... 
ఈ పథకం ద్వారా నిరుద్యోగులు తమకు ఇష్టమైన మూడు రంగాలలో ఉద్యోగం పొందేందుకు అవసరమైన శిక్షణను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అప్రెంటిస్ కార్యక్రమాన్ని దీనికి అనుసంధానం చెయ్యడం ద్వారా నిరుద్యోగులకు ఆన్ జాబ్ ట్రైనింగ్ ఇప్పిస్తున్నది. ఇందుకోసమే దేశ వ్యాప్తంగా ఉన్న అనేక కంపెనీలను యువనేస్తంలో భాగస్వామ్యం చేస్తుంది. ఆన్ జాబ్ ట్రైనింగ్ ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువుగా ఉంటాయి యువనేస్తం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రెండు నెలల్లోనే 36 సమీక్షా సమావేశాలు నిర్వహించారు. యువత ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ముఖ్యమంత్రి యువనేస్తం కార్యక్రమం కోసం దరఖాస్తు చేసుకోవడం, నైపుణ్యాభివద్ది, అప్రెంటిస్ ఇలా అన్ని మాడ్యూల్స్ ఆన్ లైన్ ద్వారా చేసుకునే విధంగా ఈ వెబ్‌సైట్ ని రూపొందించారు. ఇతర రాష్ట్రాల్లో కేవలం సరైన సమాచారం లేకపోవడం వలనే ఇటువంటి కార్యక్రమం విఫలం అయ్యిందని గుర్తించిన మంత్రి నారా లోకేష్ అన్ని శాఖలను అనుసంధానం చేశారు. అన్ని శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించి వారి నుండి సమాచారం సేకరించారు. వివిధ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్‌లర్లతో సమావేశమై అందరిని సహకరించాలి అని కోరారు. ఈ కార్యక్రమం అమలులో కీలకం అయిన అంశం పిఎఫ్, ఈఎస్‌ఐ డేటా ని కేంద్రం నుండి తీసుకురావడానికి ఢిల్లీ నుంచి త్వరితగతిన వచ్చేందుకు బాగా శ్రమించారు. కేవలం ముఖ్యమంత్రి యువనేస్తం వెయ్యి రూపాయలు భృతి ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం కాదని..యువత సరైన మార్గంలో నడిపించాలనే ఉద్దేశంతో ప్రవేశపెడుతున్నామని మంత్రి నారా లోకేష్ అంటున్నారు. స్పాట్‌లో సస్పెన్షన్

Updated By ManamSun, 09/09/2018 - 05:44
 • సోమవారానికల్లా మార్పు రావాలి.. లేకపోతే అధికారులపై కఠినచర్యలు 

 • మానవ తప్పిదాలు క్షమార్హం కావు.. డెంగ్యూ.. మలేరియా తీవ్రతపై సీఎం

 • ఎందుకు నియంత్రించలేదని నిలదీత.. ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయికి వెళ్లాలి

 • ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు


imageఅమరావతి: డెంగ్యూ..మలేరియా లాంటి జ్వరాలు ప్రబలుతున్నా వాటిని నియంత్రణలోకి తేవడంలో అధికారుల వైఫల్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. ఈ పరిస్థితిలో సోమవారానికల్లా మార్పు రాకపోతే అధికారులను స్పాట్‌లోనే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. డెంగ్యూ, మలేరియా ప్రబలడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘ఎందుకు నియంత్రించలేక పోతున్నారు..? మీరు ఎక్కడ విఫలం అయ్యారు..? అక్కడే ఎందుకని మకాం వేసి సకాలంలో చర్యలు తీసుకోలేదు..?’’ అంటూ అధికారులను నిలదీశారు.

కొందరు చేసిన తప్పులకు అందరికీ చెడ్డపేరు రావడాన్ని సహించనని చెప్పారు. విధి నిర్వహణలో అలక్ష్యాన్ని సహించేది లేదని.. హుద్‌హుద్ సమయంలో లాగానే విశాఖలో వచ్చి మకాం ఉంటానని చెప్పారు. అవసరమైతే వారం రోజులు అక్కడే మకాం వేస్తాననన్నారు. మానవ తప్పిదాలు క్షమార్హం కాదంటూ వివరించారు. ప్రతి స్థాయిలో సమన్వయం, సమర్థ నాయకత్వం ఉండాలన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని.. ప్రజల యోగక్షేమాలు విచారించాలని చెప్పారు. వ్యాధిగ్రస్తులకు వైద్యసేవలు అందేలా శ్రద్ధ వహించాలన్నారు. అసెంబ్లీకి సెలవులు ఉన్నప్పుడు ఈ పని చేయాలని ప్రజాప్రతినిధులకు చెప్పారు. ఎంపీలకు కూడా పార్లమెంటు లేదు కాబట్టి ప్రజాప్రతినిధులంతా క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. అసమర్ధతను, నిర్లక్ష్యాన్ని సహించే ప్రసక్తేలేదని.. బాధ్యతారాహిత్యాన్ని ఉపేక్షించనని సీఎం తేల్చిచెప్పారు. కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకు పూర్తి బాధ్యతగా వ్యవహరించాలన్నారు. 

ఇక్కడే ఎందుకు?
మనం ఉన్నది ప్రజల కోసమే, వారికి సేవలు అందించడం కోసమేనని అందరూ గుర్తించుకోవాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడా అంటువ్యాధుల బెడదలేదు. ఒక్క విశాఖలోనే ఎందుకని ప్రబలాయని సీఎం ప్రశ్నించారు. వివరణలు, సంజాయిషీలు కాదు కార్యాచరణ ప్రజల కళ్లకు కనిపించాలన్నారు. మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ ఎందుకని వెళ్లలేదు..? వైద్యశాఖ సలహాదారు ఎందుకని వెళ్లలేదు..? నువ్వు వెళ్లాలా..? నేను వెళ్లాలా..? అనుకోవడం బాధాకరమని, తలదించుకోవాల్సిన పరిస్థితి తెస్తున్నారని సీఎం మండిపడ్డారు. ప్రతిరోజూ హెల్త్ బులెటిన్లు, శానిటేషన్ బులిటెన్లు విడుదల చేయాలన్నారు. ఆర్టీజికి ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి, ఏవిధంగా స్పందనలు వచ్చాయి, ఏయే చర్యలు తీసుకున్నారు అనేది రోజువారీ బులెటిన్లలో వెల్లడించాలన్నారు. విశాఖలో 72 వార్డులలో ఒక్కో వార్డుకు ఒక్కొక్క సీనియర్ అధికారిని నియమించి వారికి వార్డు పర్యవేక్షణ బాధ్యత అప్పగించాలన్నారు. అధికారులు, సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ ప్రజల యోగక్షేమాలు విచారించాలన్నారు. ఎక్కడెక్కడ మురుగునిల్వలు ఉన్నాయో పరిశీలించాలన్నారు.

యాంటీ లార్వా ఆపరేషన్లు ముమ్మరం చేయాలని.. దోమల ఉత్పత్తి కేంద్రాలను (మస్కిటో బ్రీడింగ్ సోర్స్) ధ్వంసం చేయాలని సూచించారు. మురుగు నిల్వలపై ఆయిల్ బామ్‌లు విడుదల చేయాలన్నారు. బ్లీచింగ్, క్లోరినేషన్, ఫాగింగ్ యుద్ధ ప్రాతిపదికన అన్నిచోట్ల చేపట్టాలన్నారు. క్లోరిన్ టాబ్లెట్లు పంపిణీ చేయాలని.. కాచి చల్లార్చిన నీటినే తాగేలా ప్రజలను చైతన్యపరచాలన్నారు. ఎక్కడెక్కడ మురుగు నిల్వ చేరిందో ఫొటోలు తీసి పంపాలని ఆదేశించారు. డ్రోన్ల ద్వారా అన్ని చోట్ల ప్రత్యేక పర్యవేక్షణలు జరపాలన్నారు. ఆసుపత్రికి ఈ రోజు ఎన్ని కేసులు వచ్చాయనేది నమోదు చేయాలని, ఆయా కేసులను జియో ట్యాగింగ్ చేయాలని చెప్పారు. వ్యాధి సోకిన ప్రతి ఇంటి చుట్టుపక్కల వందఇళ్ల వారిని అప్రమత్తం చేయాలన్నారు. సమాచారం తీసుకోవడం ఎంత ముఖ్యమో దానికి అనుగుణంగా స్పందించి చర్యలు తీసుకోవడం అంతే ముఖ్యమన్నారు.

‘‘అంటువ్యాధులు తీవ్రమయ్యాక నివారణ చర్యలు చేపట్టడం కాదు. ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలి. అసలు అంటువ్యాధులను జీరో చేయాల’’ని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వైద్య, ఆరోగ్యశాఖ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలదే ప్రధాన బాధ్యతన్నారు. ఈ మూడు శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. పరిస్థితి అదుపులోకి వచ్చేదాకా సెలవులు రద్దు చేసుకోవాలన్నారు. సమర్ధంగా విధులు నిర్వహించేవారిని అభినందించాలని..నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ముఖ్యమంత్రి తేల్చిచెప్పారు. జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, డిఎంహెచ్‌వోలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.ప్రజలను మెప్పించాలి

Updated By ManamFri, 09/07/2018 - 22:43
 • అందుకు తగ్గ వ్యూహాలు కావాలి

 • సభలో చర్చలు అర్ధవంతంగా జరగాలి

 • సభకు హాజరు కాని సభ్యత్వం వృథా

 • అసెంబ్లీ వ్యూహా కమిటీ సభ్యులతో ముఖ్యమంత్రి చంద్రబాబు

imageఅమరావతి: ప్రతిపక్షం ఉన్నప్పుడే వ్యూహాల గురించి యోచన చేయడం కాదని.. ఎల్లప్పుడూ ప్రజలను మెప్పించే వ్యూహాలు ఉండాలని అసెంబ్లీ వ్యూహ కమిటీ సభ్యులకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. అసెంబ్లీ వ్యూహ కమిటీ సభ్యులతో ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఉదయం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో మంత్రులు, విప్‌లు, పార్టీ బాధ్యులు, ఇతర టీడీపీ ముఖ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రతిపక్షం లేకపోయినా అసెంబ్లీ బాగా జరిగిందనే పేరు రావాలని ఆకాక్షించారు. ప్రజలు అన్నింటిని నిశితంగా గమనిస్తున్నారని వారంతా సానుకూల దృక్ఫథం గలవారన్నారని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. ప్రతికూల స్వభావాన్ని ప్రజలు సహించరని.. ఇక బాధ్యతా రాహిత్యాన్ని అయితే అసలే సహించరని చంద్రబాబు విశ్లేషించారు. ప్రభుత్వం పనిచేసేది ప్రతిపక్షం కోసం కాదని..ప్రజల కోసమని అన్నారు.

కాగా అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదని ప్రతిపక్షాన్ని ఇటీవల ఉపాధ్యాయులు నిలదీశారని దానికి సమాధానం చెప్పలేని స్థితిలో ైవె సీపీ నేతలు ఉన్నారని సీఎం వ్యాఖ్యానించారు. అన్నివర్గాల ప్రజల్లో ప్రతిపక్షంపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ప్రాథమిక బాధ్యతల నుంచి ప్రతిపక్షం విస్మరించడమేనని చంద్రబాబు విశ్లేషించారు. సభకు హాజరుగాని సభ్యత్వం వృథా అని.. ప్రతి సమావేశానికి హాజరుకావడం శాసన సభ్యుడి ప్రాథమిక బాధ్యత అని సీఎం హితవు పలికారు. సభ్యులు ఎల్లప్పుడూ ప్రశ్నలు వేయడమే కాదని, స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్చలు అర్ధవంతంగా జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. శాసన మండలిలో, రాజధాని నిర్మాణంపై జరిగే చర్చలో అందరూ పాల్గొనాలని సీఎం చంద్రబాబు టీడీపీ ప్రజాప్రతినిధులకు సూచించారు. అనుబంధ ప్రశ్నల ద్వారా లోతైన చర్చ జరిగేలా శ్రద్ధ చూపడం, విషయ పరిజ్ఞానంతో వాస్తవాలను ప్రజల్లోకి పంపడం చేయాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు.చంద్రబాబు బయోపిక్

Updated By ManamSun, 09/02/2018 - 01:36

imageతెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఇప్పుడు బయోపిక్‌ల హవా నడుస్తోంది. ప్రముఖుల జీవిత కథలతో సినిమాలు చేసేందుకు దర్శకనిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే చాలా బయోపిక్‌లు ప్రారంభమయ్యాయి. కొన్ని ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. మహా నాయకులుగా పెరొందిన ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు, వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి  బయోపిక్‌లు ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఇందులో చంద్రబా బునాయుడు బయోపిక్‌ను పి.వెంకటరమణ దర్శకత్వంలో జి.జె.రాజేంద్ర నిర్మిస్తున్నారు.

మోహన శ్రీజ సినిమాస్, శ్వేతార్క గణపతి ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్స్‌పై సంయుక్తంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు వెంకటరమణ మాట్లాడుతూ ‘‘చంద్రబాబునాయుడుగారు ఓ లివింగ్ లెజెండ్. దేశ చరిత్రలోనే ఆయనొక అరుదైన, ఆదర్శవంతమైన నాయకుడు. ఓ సామాన్య కుటుంబంలో పుట్టి అగ్ర స్దానానికి ఎదిగిన ఆయన జీవితం అందరికీ తెలియచెప్పాలనే సంకల్పంతో బాబుగారి బయోపిక్‌ను తెరమీదకు తీసుకువస్తున్నాం. ఇప్పటికే 80 శాతం చిత్రీకరణ పూర్తి చేశాం. వినోద్ నువ్వుల చంద్రబాబు నాయుడుపాత్రలో నటిస్తున్నారు. భాస్కర్ ఎన్టీఆర్‌గా కన్పిస్తారు’’ అన్నారు. నిర్మాత రాజేంద్ర మాట్లాడుతూ ‘‘ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుగారు ప్రమాణ స్వీకారం చేసి ఈ  సెప్టెంబర్ 1కి 23 సంవత్సరాలవుతోంది. ఈ సందర్బంగా మా చిత్ర ఫస్ట్‌లుక్  పొస్టర్‌ను విడుదల చేస్తున్నాం’’ అన్నారు.చిత్తూరులో అపోలో నాలెడ్జ్ సిటీ

Updated By ManamFri, 08/31/2018 - 23:39
 • ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు   

image

చిత్తూరు: చిత్తూరులో కొత్తగా ఏర్పాటు చేసిన అపోలో నాలెడ్జ్ సిటీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టిన గడ్డపై మెడికల్ కాలేజీ స్థాపించాలని అపోలో చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి కోరారని అన్నారు. 70 ఎకరాల్లో నిర్మించిన అపోలో నాలెడ్జి సిటీ ద్వారా ఏడు వేల మంది నర్సింగ్ విద్యార్థినులకు, ఫ్యాకల్టీకి ఉపాధి లభిస్తుందని తెలిపారు. త్వరలోనే హంద్రీనీవా పనులను పూర్తిచేసి, చిత్తూరు జిల్లాకు నీటి కొరత లేకుండా చేస్తామని తెలిపారు. చిత్తూరు, తిరుపతిని ట్విన్ సిటీలుగా అభివృద్ధి చేస్తామని అన్నారు. తిరుపతి, చిత్తూరు మధ్య ఆరు లేన్ల రోడ్డు మంజూరయ్యిందని తెలిపారు.  అనంతరం కేరళ వరద బాధితులకు విరాళంగా ప్రతాప్ సి రెడ్డి రూ.3.06 లక్షల విలువైన చెక్కును ముఖ్యమంత్రికి అందజేశారు.20న టీడీపీ లీడర్‌షిప్ మీట్

Updated By ManamThu, 08/16/2018 - 00:27

imageవిశాఖపట్నం:  తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం సీబీన్ ఆర్మీ ఆధ్వర్యంలో 15 నియోజకవర్గాల జిల్లా స్థాయి లీడర్‌షిప్ మీట్ ఈ నెల 20న విశాఖపట్నంలో జరగనుంది. విశాఖ నగరంలోని పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ఈ సమావేశం జరుగుతుంది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో ఆవిష్కరించారు. 20వ తేదీన జరిగే లీడర్‌షిప్ మీట్‌లో పాల్గొనాలని సోషల్‌మీడియా జిల్లా అధ్యక్షులు ముఖ్యమంత్రిని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా టీడీపీ సోషల్ మీడియా విభాగం 15 నియోజకవర్గాల ప్రతినిధులు, అర్బన్, రూరల్ అధ్యక్షులు పాల్గొన్నారు. పకడ్బందీగా జల నిర్వహన

Updated By ManamMon, 07/30/2018 - 23:50
 • రిజర్వాయర్లలో నీటి చేరిక ఆశాజనకం.. సూక్ష్మసేద్యాన్ని మరింత ప్రోత్సహించాలి

 • సీమలో దానిమ్మ, జామ సాగు పెంచాలి.. రైతులను సెరికల్చర్ వైపు మళ్లించాలి

 • చంద్రబాబునాయుడు ఆదేశం.. నీరు-ప్రగతి, వ్యవసాయ పురోగతిపై సమీక్ష

imageఅమరావతి: ఉపరితల, భూగర్భ జలాల నిర్వహణ పకడ్బందీగా జరగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు పేర్కొన్నారు. నీరు-ప్రగతి, వ్యవసాయం పురోగతిపై తన నివాసం నుంచి సీఎం సోమవారం అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎగువ రాష్ట్రాల నుంచి నదు ల్లోకి భారీగా నీరు వస్తోందన్నారు. రిజర్వాయర్లలో నీటి చేరిక ఆశాజనకంగా ఉందని, అయితే మన రాష్ట్రంలో  వర్షాలు తగ్గాయన్నారు. వర్షపాతం 10% లోటు ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఉపరితల జలాలు, భూగర్భజలాల నిర్వ హణ పకడ్బందీగా జరగాలని ఆదేశించారు. ఖరీఫ్‌లో వర్షాభావం ఉన్నా పంట దిగుబడులు తగ్గకుండా చూడాలన్నారు. డ్రైస్పెల్ వల్ల 36వేల హెక్టా ర్లలో పంటలు వాడిపోయే స్థితి వచ్చిందని, రెయిన్ గన్ టెక్నాలజీ  ద్వారా పంటలు కాపాడాలని సూచించారు. జిబా టెక్నాలజినీ సద్వినియోగం చేసుకో వాలన్నారు. శాస్త్రవేత్తలు వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి తెగుళ్లపై రైతులకు తగిన సూచనలు ఇవ్వాలన్నారు. సూక్ష్మ సేద్యాన్ని మరింతగా ప్రోత్సహించాలన్నారు. రాయలసీమలో దానిమ్మ, జామ సాగును పెంచా లన్నారు. సెరికల్చర్ వైపు రైతులను మళ్ళించాలన్నారు. మల్బరీ రైతులకు సబ్సిడీ మరింత పెంచాలని, సాగువ్యయంలో 50% వరకు సబ్సిడీ రూపంలో అందేలా చూడాలన్నారు. గోకులా లు,పశుగ్రాస క్షేత్రాల అభివృద్ధిపై దృష్టిపెట్టాలని కోరారు. 

దీనిపై అధికారులు స్పందిస్తూ, ముందస్తు కరవు ప్రకటనకు వీలుగా ఎప్పటి కప్పుడు వర్షపాతం, పంటల స్థితిగతులపై నివేదికలను సిద్ధం చేస్తున్నట్లు వివరిం చారు. 2017 ఖరీఫ్ పంటబీమా కింద రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.464కోట్లు విడు దల చేశామని, ఇన్సూరెన్స్ కంపెనీలు రూ. 280కోట్లు విడుదల చేశాయని, మిగిలిన రూ.282 కోట్లు  ఆగస్టు 1లోపు విడుదల చేయాల్సి వుందని తెలియజేశారు. దీనిపై ముఖ్య మంత్రి స్పందిస్తూ ఇన్ పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూ రెన్స్ త్వరితగతిన అందజేస్తే రైతుకు ఖరీఫ్ పెట్టుబడికి ఉపయోగపడుతుందన్నారు. ఆక్వా ఉత్పత్తుల నాణ్యత మెరుగుపడేందుకు చర్యలు తీసుకో వాలని ఆదేశించారు. నరేగాలో రూ.12వేల కోట్ల లక్ష్యం చేరుకోవాలన్నారు. ఇప్పటివరకు రూ.3,878 కోట్లు నరేగా నిధులను వినియోగించుకున్నారన్నారు. పంటకుంటలు, ఇంకుడు గుంతలు, సిమెంట్ రోడ్లు, బిటి రోడ్లు, ప్రహరీగోడల నిర్మాణంపై దృష్టి పెట్టాలి. పక్కా ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలిని ఆదేశించారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో వివిధ శాఖల ఉన్నతాధికారులు రాజశేఖర్, గోపాల కృష్ణద్వివేది, చిరంజివి చౌదరి, జవహర్ రెడ్డి, రామాంజనేయులు, అహ్మద్ బాబు,ఆయా జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.

మొబైల్ ఏటీఎంలు ప్రారంభం
పౌరుల్లో ఆర్థిక అక్షరాస్యత, డిజి టల్ బ్యాంకింగ్ అవగాహన పెంపొం దించడానికి ప్రవేశపెట్టిన మొబైల్ ఏటీఎంలనుimage ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు ప్రారంభించారు. నాబార్డు సాయంతో ఆప్కాబ్ ప్రవేశపె ట్టిన 12 ఏటీఎంలను ఉండవల్లి ప్రజావే దిక వద్ద చంద్రబాబు జెండా ఊపి ప్రారం భించారు.  ఈ ఏటీఎంలలో మైక్రో ఏటీ ఎం, పేటిమ్, క్యాష్ విత్ డ్రా, క్యాష్ డిపా జిట్ సదుపాయాలు ఉంటారు. దేశంలో మరే రాష్ట్ర సహకార బ్యాంకింగ్ వ్యవస్థకు లేని ఏటీఎం వ్యవస్థ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకం. ఈ కార్యక్రమంలో మంత్రి కళా వెంకటరావు, ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఎల్‌విఎస్‌ఆర్‌కె. ప్రసాద్, ముఖ్యమంత్రి కార్యదర్శి అడుసుమల్లి వెంకట రాజమౌళి, ఆప్కాబ్ ఎండీ భవానీ శంకర్, నాబార్డు సీజీఎం కె.సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఆపన్నులకు సాయం
imageగుంటూరు జిల్లా ప్రత్తిపాడు మం డలం అడవి తక్కెళ్లపా డుకు చెందిన షేక్ జాఫర్ షరీఫ్ అనే యువకుడు పుట్టుకతోనే మానసిక వైకల్యం (ఢిప్యూజ్ సెరిబ్రల్ ఆట్రోఫీ)తో బాధపడుతున్నాడు. అతనికి తరచూ ఫిట్స్ వస్తుం టాయి. తమ బిడ్డను ఆదుకోవాలని జాఫర్ త ల్లిదండ్రులు సోమవారం ముఖ్యమంత్రిని కలిసి వేడు కున్నారు. వెం టనే స్పం దించిన ముఖ్యమంత్రి చంద్రబాబుజా ఫర్ వైద్యం కోసం రూ.5 లక్షలు మం జూరు చేశారు.

Related News