rashmika mandanna

‘ఛలో’ జోడీ రిపీట్..?

Updated By ManamWed, 10/10/2018 - 14:23

Naga Shaurya, Rashmika Mandannaనాగశౌర్య హీరోగా వెంకీ కుడుముల తెరకెక్కిన చిత్రం ‘ఛలో’. ఈ చిత్రం ద్వారా రష్మిక మందన్న తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఈ చిత్రంలో నటించిన నాగశౌర్య, రష్మిక జోడీ మంచి పెయిర్‌గా మార్కులు కూడా కొట్టేసింది. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవ్వనున్నట్లు ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. సుకుమార్ రైటింగ్స్‌లో తెరకెక్కనున్న ఓ చిత్రం కోసం ఈ ఇద్దరు జత కట్టనున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా ప్రస్తుతం నాగశౌర్య ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రంతో బిజీగా ఉండగా.. రష్మిక ‘డియర్ కామ్రేడ్’ అనే చిత్రంలో నటించనుంది.అందుకే నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకున్నా

Updated By ManamSun, 10/07/2018 - 13:53

Rakshit Shettyవరుస విజయాలతో ఇటు టాలీవుడ్‌, అటు శాండిల్‌వుడ్‌లో దూసుకుపోతున్న బ్యూటీ రష్మిక మందన్న ఇటీవలే తన నిశ్చితార్ధాన్ని క్యాన్సిల్ చేసుకున్న విషయం తెలిసిందే. తన మొదటి హీరో రక్షిత్‌తో ప్రేమలో పడి, నిశ్చితార్థం చేసుకున్న రష్మిక.. ఆ తరువాత అతడితో విడిపోవడంపై పలు రకాలుగా మాటలు వినిపించాయి. ఈ నేపథ్యంలో వాటిపై తాజాగా స్పందించి క్లారిటీ ఇచ్చింది రష్మిక.

రక్షిత్ శెట్టిపై అభిమానం ఏర్పడి, అది ప్రేమగా మారడంతోనే నిశ్చితార్థం చేసుకున్నానని రష్మిక తెలిపింది. వయసులో ఉన్నప్పుడు మన కంటికి అన్నీ మంచిగానే కనిపిస్తాయని, తల్లిదండ్రలు మాత్రమే తమ పిల్లలకు ఏది మంచిదో గుర్తించగలరని రష్మిక పేర్కొంది. అంతా బాగా ఉన్నప్పుడు ఓ బంధాన్ని ముందుకు తీసుకెళ్లొచ్చని, కానీ పొరపాట్లు, లోపాలు కనిపిస్తే.. దాన్ని అక్కడితే వదిలివేయడం మంచిదని, లేదంటే భవిష్యత్‌లో చాలా కోల్పోతాం అంటూ రష్మిక చెప్పుకొచ్చింది.దేవదాస్ రివ్యూ

Updated By ManamThu, 09/27/2018 - 16:03

చిత్రం : దేవదాస్
బ్యాన‌ర్‌: వైజ‌యంతీ మూవీస్‌, వ‌యాకామ్ 18 మోష‌న్ పిక్చ‌ర్స్‌
న‌టీన‌టులు: నాగార్జున అక్కినేని, నాని, అకాంక్ష సింగ్‌, ర‌ష్మిక మంద‌న్నా, కునాల్ క‌పూర్‌, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్‌, న‌రేశ్‌, రావు ర‌మేశ్‌, వెన్నెల‌కిషోర్‌, అవ‌స‌రాల శ్రీనివాస్‌, స‌త్య త‌దిత‌రులు
మ్యూజిక్‌: మ‌ణిశ‌ర్మ‌
కెమెరా: శ్యామ్‌ద‌త్ సైనూద్దీన్‌
ఆర్ట్: సాహి సురేశ్‌
ప్రొడ్యూస‌ర్‌: అశ్వినీద‌త్ చ‌ల‌సాని
స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: శ్రీరామ్ ఆదిత్య‌

Nagarjuna Devadas Movie Review

వైజ‌యంతీ మూవీస్ ప‌తాకంపై అశ్వినీద‌త్ చల‌సాని ఓ సినిమాను నిర్మిస్తున్నారు.. అందులోనూ అది మ‌ల్టీస్టార‌ర్‌.. నాగార్జున‌, నాని క‌లిసి చేస్తున్నారు... అనే మాట విన‌గానే టాలీవుడ్‌లో బ‌జ్ మొద‌లైంది. కొన్నాళ్లు ఆ సినిమా మ‌రో ఫారిన్ చిత్రానికి రీమేక్ అనే ప్ర‌చారం కూడా సాగింది.

అయితే ఎట్ట‌కేల‌కు గురువారం విడుద‌లైంది ఈ సినిమా. `దేవ దాస్‌`గా విడుద‌లైన ఈ సినిమాకు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు న‌టించిన `దేవ‌దాస్‌`తో ఏమాత్రం సంబంధం లేదు. ఇందులో నాగార్జున దేవ‌గానూ, నాని దాస్‌గానూ న‌టించారు. మ‌రి ఈ న‌యా దేవ‌దాస్ ఎలా ఉంటుందో హావ్ ఎ లుక్‌...

క‌థ‌

Devadas Movie Review

దేవా (నాగార్జున‌) పెద్ద డాన్‌. ఎవ‌రికీ క‌నిపించ‌డు. కానీ త‌న చ‌ర్య‌ల‌తో లోక‌ల్ డాన్స్ ని ఉడికిస్తుంటాడు. అత‌ని నుంచి విముక్తి క‌ల్పించుకోవాల‌ని అనుకున్న లోక‌ల్ డాన్స్ అంద‌రూ క‌లిసి ఓ సిండికేట్‌గా త‌యార‌యి దేవాను పెంచుకున్న తండ్రిని చంపేస్తారు. అప్పుడు దేవా సిటీలోకి ఎంట‌ర్ అవుతాడు. యాక్సిడెంట‌ల్‌గా అత‌ని ఛాతీలో బుల్లెట్ దిగుతుంది. అత‌ను వెతుక్కుంటూ వెళ్లిన డాక్ట‌ర్ పేరు దాస్ (నాని). ప‌ల్లెటూరి నుంచి ప‌ట్ట‌ణానికి వ‌స్తాడు డాక్ట‌ర్ దాస్‌. త‌న అన్న కుటుంబంతో ఉంటూ సిటీలో ప్రాక్టీస్ చేస్తుంటాడు.

అయితే కార్పొరేట్ ఆసుప‌త్రుల ప‌ద్ధ‌తి అంతుచిక్క‌క అక్క‌డి నుంచి బ‌య‌ట‌ప‌డి, త‌న అన్న ఉంటున్న ఏరియాలోనే ఓ ఆసుప‌త్రిలో ప‌నిచేస్తాడు. స‌రిగా అక్క‌డే ఆయ‌న దేవాకు ట్రీట్‌మెంట్ చేస్తాడు. ఆ స‌మ‌యంలోనే దేవాకి జాహ్న‌వి, దాస్‌కి పూజా ప‌రిచ‌య‌మ‌వుతారు. వారి లవ్ చేప్ట‌ర్లు ఓపెన్ అవుతాయి. త‌న‌కు మాత్ర‌మే తెలిసిన దేవాని పోలీసుల‌కు దాస్ ప‌ట్టించాడా?  లేదా?  దాస్ స్నేహం వ‌ల్ల దేవాలో వ‌చ్చిన మార్పులేంటి? వ‌ంటివి ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు. పోలీస్ ఇన్‌స్పెక్ట‌ర్ పూజా దాస్‌ని నిజంగా ప్రేమించిందా? ఆమెకు అత‌నిలో ఏం న‌చ్చింది? వ‌ంటివ‌న్నీ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు. 

విశ్లేష‌ణ‌
`శ్రీరామ్ ఆదిత్య మ‌రీ రెండు రోజుల ముందు సినిమాను చూపించాడు. అదే నెల రోజుల ముందు చూపిస్తే ఏమైనా మార్పులుంటే చెప్ప‌గ‌లం` అని నాగార్జున ప్రెస్ ముందు అన్న‌ప్ప‌టి నుంచీ `దేవ‌దాస్ ` సినిమా అనుకున్నంత బాగా రాలేదా ఏంటి?.. అలా ఎందుక‌న్నారు అనేది చ‌ర్చ‌కింద మారింది. ప‌రిశ్ర‌మ‌లో చాలా మంది దీని గురించి మాట్లాడుకున్నారు. సినిమా చూశాక ఆయ‌న ఎందుకలా అన్నారో చాలా మందికి అర్థ‌మైంది. సినిమాను ఇంకాస్త ఎడిట్ చేసి ఉంటే బావుండేద‌ని ప‌లువురి అభిప్రాయం.

మ‌రీ ముఖ్యంగా ఫ‌స్టాఫ్‌లో అన‌వ‌స‌ర‌మైన స‌న్నివేశాలు చాలానే ఉన్నాయ‌నిపించింది. వాటిని ఇంకాస్త ట్రిమ్ చేసి క్రిస్పీగా చేసి ఉండాల్సింది. అలాగే సెకండాఫ్లోనూ ల్యాగ్‌ను త‌గ్గించాల్సింది. ఇవ‌న్నీ ప‌క్క‌న‌పెడితే నాగార్జున‌, నాని మ‌ధ్య బ్రొమాన్స్ బాగా పండింది. నిజ‌మైన ఫ్రెండ్‌షిప్‌ని ఎలివేట్ చేసే ప్ర‌య‌త్నం చేశారు. కానీ విల‌నిజాన్ని బ‌లంగా చూపించ‌లేదు. దాని ఫ‌లితం సినిమాలో కొన్ని స‌న్నివేశాలు పేల‌వంగా మారిన‌ట్టు అనిపించాయి. స్క్రీన్‌ప్లే మీద మ‌రికాస్త దృష్టి పెట్టి ఉంటే బావుండేది. స‌ర‌దాగా చూడాల‌నుకున్న‌వారు ఒక‌సారి చూడ‌ద‌గ్గ చిత్ర‌మిది.

ప్ల‌స్ పాయింట్లు

  •  ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్

  •  మ్యూజిక్‌

  •  కెమెరా

  •  లొకేష‌న్స్, కాస్ట్యూమ్స్

మైన‌స్ పాయింట్లు

  •  కొత్త‌ద‌నం లేని క‌థ‌

  •  మ‌లుపులు లేని స్క్రీన్‌ప్లే

  •  ఎమోష‌న్స్ పండ‌లేదు

  •  ఎడిటింగ్‌

రేటింగ్‌: 3/5
చివ‌రిగా... `దేవ‌`..`దాస్` కోసం చూడొచ్చు‘దేవదాస్‌’కు సెన్సార్ పూర్తి

Updated By ManamTue, 09/25/2018 - 11:18

Devadasనాగార్జున, నాని హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన చిత్రం ‘దేవదాస్’. మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సెన్సార్ పూర్తైంది. చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు ఎలాంటి కట్‌లు లేకుండా ‘యు/ఎ’ సర్టిఫికేట్‌ను ఇచ్చారు. ఇక ఈ చిత్రంలో నాగార్జున డాన్ పాత్రలో కనిపిస్తుండగా.. నాని డాక్టర్‌గా నటించాడు. వీరిద్దరి సరసన ఆకాంక్ష సింగ్, రష్మిక కనిపించనున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌, ఆడియోతో అందరినీ ఆకట్టుకుంటున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి.‘దేవదాస్’లో నా పాత్ర బాగా నచ్చింది

Updated By ManamSun, 09/23/2018 - 02:05

కన్నడలో ‘కిరాక్ పార్టీ’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన రష్మిక మందన్నా ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘గీత గోవిందం’ వంటి సూపర్‌హిట్ చిత్రంతో హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది. తాజాగా నాగార్జున, నాని హీరోలుగా నటిస్తున్న ‘దేవదాస్’ చిత్రంతో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమైంది. ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఈ చిత్రం గురించి రష్మిక మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో నా పేరు పూజ. పక్కింటమ్మాయిలా కనిపిస్తాను. సినిమాలో నా పాత్ర బాగా నచ్చింది. ఇది మల్టీస్టారర్ అయినప్పటికీ ఇందులో నా పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది. ఇందులో నాగ్‌సార్, నాని సార్ బ్రోమాన్స్ చాలా బావుంటుంది. నేనే దానికి ఫిదా అయ్యాను. నేను చేసిన అన్ని సినిమాల్లోనూ కామెడీ ఉంది. కానీ, కథ ప్రధానంగా ఉంటుంది.

image


ఈ సినిమాలో నాగ్ సార్‌తో రెండు రోజులు మాత్రమే పనిచేశాను. అయితే ఆయన సెట్లో ఉన్నంత సేపు నవ్వుతూనే ఉండేవాళ్లం. నానిగారితో పనిచేయడం వల్ల చాలా నేర్చుకున్నాను. ‘ఛలో’, ‘గీత గోవిందం’ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అందరూ ఇది హ్యాట్రిక్ మూవీ అంటున్నారు. సినిమా చూసిన తర్వాత అందరూ అలా చెప్తే చాలా ఆనందంగా స్వీకరిస్తాను. ‘దేవదాస్’ తర్వాత నేను చేస్తున్న సినిమా ‘డియర్ కామ్రేడ్’. ఈ సినిమా కోసం క్రికెట్ నేర్చుకున్నాను. కొన్నాళ్ళు షూటింగ్ కూడా చేశాను. ఆ టైమ్‌లో నా కాలికి దెబ్బతగిలింది. అలాగే స్కిన్ ఇష్యూస్ కూడా వచ్చాయి. కాస్త గ్యాప్ తీసుకున్నాను. ఈమధ్య నా ఎంగేజ్‌మెంట్‌కి సంబంధించి చాలా వార్తలు వచ్చాయి. నిజంగా చెప్పాలంటే నేను ఫిజికల్‌గా, మెంటల్‌గా స్ట్రాంగ్. ఇదే విషయాన్ని రెండు నెలలకు ముందు అడిగితే ‘అయ్యో సార్. అలాంటిదేమీ లేదండీ సార్’ అని చెప్పేదాన్ని. కానీ ఇప్పుడు మాత్రం నేను నా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడను’’ అన్నారు. వీడియో: గీతా గోవిందం’ పాటకు పేరడీ.. వైరల్!

Updated By ManamSat, 09/22/2018 - 19:30
  •  ఈ పాట విన్నారంటే.. విరగబడి నవ్వేస్తారంతే..!

  •  ఇంటి.. ఇంటి.. ఇంటికెళ్లాలే... కానీ ఇంట్లో దెయ్యాలే...

Vijay Devarakonda, Rashmika Mandanna, Geetha Govindham movie, Vijay Devarakonda, Rashmika Mandannaవిజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా జంటగా నటించిన ‘గీతా గోవిందం’ సినిమా మంచి హిట్ టాక్ అందుకుంది. అలాగే ఆ చిత్రంలోని పాటలు కూడా ఎంతో సూపర్ హిట్‌గా నిలిచాయి. చిత్రంలో అన్ని పాటల్లో కంటే ఎక్కువగా ‘‘ఇంకెం.. ఇంకెం.. ఇంకెం.. కావాలే... చాలే.. ఇది.. చాలే..’’ అనే పాట యువతను ఎంతో ఆకట్టుకుంటోంది. ఎక్కడా చూసినా ఈ పాటే అందరి నోటా ఎక్కువగా వినిపిస్తోంది. ఇప్పుడి పాటకు అభిషేక్ పాథ్రి అనే యువకుడు పేరడి కట్టి అందరిని కడుపుబ్బా నవ్విస్తున్నాడు..

అభిషేక్ పేరడి కట్టిన ‘‘బ్రతికున్న భూతము.. ఓర్పే శూన్యము.. ప్రేమే క్షణికము.. అనుదినము శాడిజము...సొగసరి సర్పము.. మిడిగుడ్ల మకటము మురిగితే శునకము.. ఇళ్లో పెద్ద నరకము.. ఇంటి.. ఇంటి.. ఇంటికెళ్లాలే... కానీ ఇంట్లో దెయ్యాలే... లుక్ చూసి బుక్కయ్యానే.. వీధికుక్క అయి పోయానే... ’’ ఈ పాట సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ఇదే ఆ వీడియో.. చూసి హాయిగా నవ్వుకోండి.. ఆ ‘దేవదాస్’ పుట్టిననాడే ఈ ‘దేవదాస్’ ఆడియో వేడుక

Updated By ManamTue, 09/18/2018 - 13:09

Devadasనాగార్జున, నాని హీరోలుగా యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన చిత్రం ‘దేవదాస్’. వైజయంతీ మూవీస్ నిర్మించిన ఈ చిత్రంలో అకాంక్ష సింగ్, రష్మిక మందన్న హీరోయిన్లుగా నటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్ర ఆడియో వేడుకకు ముహూర్తం ఖరారు అయ్యింది. మహానటుడు ఏఎన్నార్ జయంతి సందర్భంగా ఈ నెల 20న ఈ చిత్ర ఆడియో వేడుకను నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే పోస్టర్లు, టీజర్, పాటలతో ఆకట్టుకున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లో మంచి అంచనాలే ఉన్నాయి.

 చాలా రోజుల తరువాత నా పక్కన అందమైన అమ్మాయి: నాగ్

Updated By ManamTue, 09/18/2018 - 00:03

Akankshaనాగార్జున, నాని హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన చిత్రం దేవదాస్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రంలో నాగార్జున సరసన ‘మళ్లీ రావా’ ఫేమ్ ఆకాంక్ష సింగ్, నాని సరసన రష్మికా నటించగా.. తాజాగా ఆకాంక్ష ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో జాహ్నవీ అనే పాత్రలో ఆకాంక్ష నటిస్తుండగా.. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న నాగార్జున.. ‘‘చాలా రోజుల తరువాత నా పక్కన ఒక అందమైన అమ్మాయి’’ అంటూ కామెంట్ పెట్టారు. ఇక వీరిద్దరికి సంబంధించిన ఓ పాటను సోమవారం సాయంత్రం విడుదల చేయనున్నారు. కాగా వైజయంతీ మూవీస్ నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించిన విషయం తెలిసిందే.
 

image

 ఫస్ట్‌ టైం మిమ్మల్ని మెట్రోలో చూసినప్పుడే..

Updated By ManamMon, 09/17/2018 - 13:27

Rashmika Mandannaనాగార్జున, నాని హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన మల్టీస్టారర్ చిత్రం ‘దేవదాస్’. ఇందులో నాని సరసన రష్మిక మందన్న నటిస్తుండగా.. తాజాగా ఆమెకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. పూజా అనే పాత్రలో రష్మిక కనిపిస్తుండగా ఆమె లుక్‌ను షేర్ చేసిన నాని.. ‘‘ఫస్ట్ టైం మిమ్మల్ని మెట్రోలో చూసినప్పుడే.. లోపల ఏదో రింగ్ అయ్యింది పూజా గారు.. మళ్లీ ఎప్పుడు’’ అంటూ కామెంట్ పెట్టాడు. ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. 

 రష్మిక నిశ్చితార్థం రద్దు.. తల్లి స్పందన

Updated By ManamWed, 09/12/2018 - 13:11

Rashmika, Rakshitగత కొన్ని రోజులుగా ఇటు టాలీవుడ్, అటు శాండిల్ వుడ్‌లో హల్‌చల్ చేస్తున్న రక్షిత్, రష్మికల నిశ్చితార్థం క్యాన్సిల్ విషయంపై ఆమె తల్లి సుమన్ మందన్నా కన్ఫర్మ్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సుమన్ మందన్నా.. ప్రస్తుతం తమ కుటుంబం మొత్తం డిస్టర్బ్‌గా ఉన్నామని, దీని నుంచి వీలైనంత తొందరగా బయటపడాలనుకుంటున్నామని తెలిపారు.

కెరీర్‌ను దృష్టిలో పెట్టుకొనే ఆ ఇద్దరు ఈ నిర్ణయం తీసుకున్నారని.. ఇలా అవ్వడం ఆ ఇద్దరినీ బాధించిందని సుమన్ చెప్పారు. కాగా కన్నడలో విజయం సాధించిన కిరాక్ పార్టీలో ఈ ఇద్దరు కలిసి నటించగా.. ఆ చిత్ర షూటింగ్‌లోనే ప్రేమలో పడ్డ రక్షిత్, రష్మిక సినిమా తరువాత నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే ఆ తరువాత ఈ ఇద్దరు వరుస సినిమాలతో బిజీగా ఉండటం వలన వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినట్లు తెలుస్తోంది.

Related News