rashmika mandanna

75కోట్ల క్లబ్‌లో ‘గీత గోవిందం’

Updated By ManamFri, 08/24/2018 - 09:24

Geetha Govindamవిజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా పరశురామ్ తెరకెక్కించిన చిత్రం ‘గీత గోవిందం’. ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకొని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం 75కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా తెలిపింది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కేరళ, తమిళనాడుతో పాటు ఆస్ట్రేలియా, యూఎస్‌లో ఈ చిత్రం తన హవాను కొనసాగిస్తోంది. ఇప్పటికే 75కోట్ల క్లబ్‌లో చేరిందంటే ఇక ఫుల్‌రన్‌లో ఈ చిత్రం మరెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. కాగా రొటీన్ స్టోరీ అయినప్పటికీ పరశురామ్ తెరకెక్కించిన తీరు, నటీనటుల సహజ నటన, గోపి సుందర్ మ్యూజిక్ ఈ చిత్రానికి మెయిన్ అస్సెట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.వారి నటన కథకు అందాన్ని పెంచింది: చెర్రీ

Updated By ManamFri, 08/17/2018 - 11:32

Ram Charan, Geetha Govindamవిజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నటించిన ‘గీత గోవిందం’ థియేటర్లలో దూసుకుపోతుండగా.. చిత్రాన్ని చూసిన పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ గీత గోవిందంపై తన అభిప్రాయాన్ని పేర్కొన్నారు.

అర్జున్ రెడ్డి తరువాత విజయ్ దేవరకొండ ఛేంజ్ఓవర్ చాలా బావుంది. విజయ్ దేవరకొండ, రష్మిత నటన చాలా బావుంది. వారి నటనతో కథకు మరింత అందం తీసుకొచ్చారు. గోపి సుందర్ సంగీతం బావుంది. చాలా బాగా రచించి, చిత్రాన్ని తెరకెక్కించారు. దర్శకుడు పరశురామ్, నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ 2తో పాటు ఈ చిత్రంలో భాగమైన ప్రతి ఒక్కరికీ కంగ్రాట్స్ అంటూ కామెంట్ పెట్టారు.

 

A perfect changeover after #ArjunReddy. It was a treat to watch Vijay Deverakonda and Rashmika Mandanna perform so...

Posted by Ram Charan on Thursday, August 16, 2018

 నా పెళ్లి ఆగిపోయిందా..!

Updated By ManamFri, 08/17/2018 - 10:30

Rashmika Mandanna‘ఛలో’తో టాలీవుడ్‌కు పరిచయమైన రష్మిక మందన్న, ‘గీత గోవిందం’తో రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం రష్మిక తెలుగులో నాని సరసన దేవదాస్, విజయ్ దేవరకొండ సరసన కామ్రేట్‌లో నటిస్తోంది. ఇదిలా ఉంటే కిర్రిక్ పార్టీతో సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, ఆ చిత్ర హీరో రక్షిత్ శెట్టి ప్రేమలో పడింది. గతేడాది ఈ ఇద్దరు ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారు. అయితే ఇటీవల ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని, అందుకే వారిద్దరు నిశ్చితార్ధాన్ని క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. ఇవి కాస్త రష్మిక వద్దకు చేరడంతో వాటిపై ఆమె స్పందించింది.

తామిద్దరం రెండున్నరేళ్ల తరువాత పెళ్లి చేసుకోవాలని అనుకున్నామని, ఇప్పుడు నటనలో బిజీగా ఉండటంతో పెళ్లి చేసుకోవాలన్న తేదీలను నిర్ణయించుకోలేదని తెలిపింది. తమ పెళ్లి ఆగిపోయిందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపింది. ఇక గీత గోవిందం సినిమా కోసం దాదాపు ఏడున్నర నెలలు పనిచేశానని, అందులో ఏడు నెలల పాటు కోపంతో నటిస్తే, చివరి 15రోజులు మాత్రం సరదాగా గడిపానని తెలిపింది.‘గీత గోవిందం’పై పలువురి ప్రశంసలు

Updated By ManamThu, 08/16/2018 - 15:06

Geetha Govindamవిజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా పరశురామ్ తెరకెక్కించిన ‘గీత గోవిందం’ థియేటర్లలో దూసుకుపోతోంది. విడుదలకు ముందే ఈ చిత్రంలోని కొన్ని సీన్లు లీక్ అయినప్పటికీ.. రిలీజ్ తరువాత పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇక ఈ చిత్రాన్ని చూసిన పలువురు సినీ ప్రముఖులు సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ చిత్రాన్ని చూసిన మహేశ్ బాబు.. ‘‘గీత గోవిందం ఓ విజేత. సినిమా మొత్తం ఎంజాయ్ చేశాను. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా చాలా బాగా చేశారు. సుబ్బరాజు, వెన్నల కిశోర్‌లను ప్రత్యేకంగా పేర్కొనాలి. టీం మొత్తానికి కంగ్రాట్స్’’ అంటూ కామెంట్ పెట్టాడు. ‘‘గీత గోవిందం చూశాను. విజయ్ దేవరకొండ, రాహుల్ రామకృష్ణ ఇద్దరు ఉన్న ఏ చిత్రాన్నైనా చూస్తాను. టీమ్ మొత్తానికి కంగ్రాట్స్’’ అంటూ సమంత స్పందించింది.

వీరితో పాటు దర్శకుడు అనిల్ రావిపూడి స్పందిస్తూ.. ‘‘గీత గోవిందం చాలా బావుంది. విజయ్ దేవరకొండ నువ్వు చంపేశావు. రష్మిక మందన్నా నువ్వు సూపర్. వెన్నల కిశోర్ నిన్ను ప్రత్యేకంగా అభినందించాలి. మూలాలు మర్చిపోకూడదు. పరశురామ్ గ్రాండ్ సక్సెస్ నీ సొంతం. చిత్ర యూనిట్‌కు కంగ్రాట్స్’’ అంటూ పెట్టారు. అలాగే ‘‘గీత గోవిందం ఓ నవ్వుల ప్రవాహం. సినిమా మొత్తాన్ని ఎంజాయ్ చేశా. చిత్ర యూనిట్ మొత్తానికి కంగ్రాట్స్’’ అంటూ నిర్మాత శోభు యార్లగడ్డ పేర్కొన్నారు.గీత గోవిందంపై దర్శకధీరుడి ప్రశంసలు

Updated By ManamThu, 08/16/2018 - 09:21

Rajamouli, Geetha Govindamవిజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా పరశురామ్ తెరకెక్కించిన చిత్రం ‘గీత గోవిందం’. స్వాతంత్ర్యదినోత్సవం కానుకగా బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో థియేటర్లో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని చూసిన దర్శకధీరుడు రాజమౌళి మూవీ యూనిట్‌పై ప్రశంసలు కురిపించారు.

‘‘గీత గోవిందం ఓ నవ్వుల ప్రవాహం. విజయ్ దేవరకొండ పాత్రను ఇలా ఊహించలేదు. అర్జున్ రెడ్డి తరువాత అతడి పాత్ర ఎంపిక బావుంది. ఏం చేస్తున్నాడో అతడికి బాగా స్పష్టంగా తెలుసు. సినిమా మొత్తం నవ్వులు పూయించింది. పరశురామ్ చిత్రాన్ని బాగా రచించి, దర్శకత్వం వహించారు. రాహుల్ రామకృష్ణ, అన్నపూర్ణమ్మ గారు, వెన్నల కిశోర్.. చాలా బాగా చేశారు. చిత్ర యూనిట్ మొత్తానికి కంగ్రాట్స్’’ అంటూ ప్రశంసలు కురిపించాడు. దీనిపై స్పందించిన విజయ్ దేవరకొండ.. ‘‘మీ దగ్గర నుంచి ప్రశంసలు పొందడం ఎప్పటికైనా స్పెషల్’’ అంటూ కామెంట్ ఇచ్చాడు.

 ‘గీత గోవిందం’ రివ్యూ

Updated By ManamWed, 08/15/2018 - 13:21
Geetha Govindam

హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన‌ `పెళ్లిచూపులు`, `అర్జున్ రెడ్డి` సినిమాల త‌ర్వాత రిలీజ్‌కి ముందు ఆ రేంజ్‌లో ప‌బ్లిసిటీ వ‌చ్చిన సినిమా `గీత గోవిందం`. తొలి సినిమా `చ‌లో`తో గోల్డెన్ లెగ్‌గా పేరు తెచ్చుకున్న ర‌ష్మిక మండ‌న్న ఇందులో హీరోయిన్‌. వీరిద్ద‌రు క‌లిసి క‌నిపించిన `ఇంకేం ఇంకేం కావాలే` సాంగ్ సూప‌ర్ హిట్‌. సినిమా రిలీజ్‌కి ముందు పైర‌సీ అయి కొన్ని సీన్లు లీక‌య్యాయి. ఇవ‌న్నీ ఎక్స్ పెక్టేష‌న్స్ ని భారీగా పెంచాయి. సినిమా వాటికి ధీటుగా ఉంటుందా? ఆల‌స్య‌మెందుకు.. రివ్యూ చ‌దివేయండి. 

బ్యాన‌ర్‌:  జిఎ2 పిక్చ‌ర్స్
తారాగ‌ణం: విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మందాన్న, నాగ‌బాబు, సుబ్బ‌రాజు, వెన్నెల కిషోర్‌,  రాహుల్ రామ‌కృష్ణ‌, గిరిబాబు, అన్న‌పూర్ణ‌మ్మ‌, మౌర్యాని, సుభాష్‌, అభ‌య్‌, స్వ‌ప్న‌క‌, స‌త్యం రాజేష్‌, దువ్వాసి మెహ‌న్‌, గుండు సుద‌ర్శ‌న్‌, గౌతంరాజు, అనీష‌, క‌ళ్యాణి న‌ట‌రాజ‌న్‌, సంధ్య జ‌న‌క్ త‌దిత‌రులు...
మ్యూజిక్‌: గోపిసుంద‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ: మ‌ణికంద‌న్‌
ఎడిట‌ర్‌: మార్తాండ్‌.కె.వెంక‌టేష్
ఆర్ట్‌: ర‌మ‌ణ వంక‌
ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌: స‌త్య గ‌మిడి
లిరిక్స్‌: అనంత్ శ్రీరామ్‌, శ్రీమ‌ణి, 
ప్రెజెంట్స్: అల్లు అర‌వింద్‌
ప్రొడ్యూస‌ర్‌: బ‌న్నివాసు
స్టోరీ-స్క్రీన్‌ప్లే-డైలాగ్స్-డైర‌క్ష‌న్‌: ప‌రశురామ్‌
విడుద‌ల తేదీ: 15.08.2018

క‌థ‌
విజ‌య్ గోవింద్ (విజ‌య్ దేవ‌ర‌కొండ) ప్రైవేట్ ఇంజ‌నీరింగ్ కాలేజీలో లెక్చ‌ర‌ర్‌. గీత (ర‌ష్మిక‌) సాఫ్ట్ వేర్ ఎంప్లాయీ. గీత కంపెనీ ఓన‌ర్ కూతురు నీలు కి విజ‌య్ అంటే ఇష్టం. అత‌న్ని పెళ్లి చేసుకోవాల‌ని క‌ల‌లు కంటుంది. త‌న చెల్లెలి నిశ్చితార్థం కోసం ప‌ల్లెటూరికి వెళ్తాడు విజ‌య్‌. బ‌స్సులో అత‌ని ప‌క్క సీట్లో గీత ట్రావెల్ చేస్తుంది. అనుకోకుండా ఆమెతో అత‌నికి లిప్ లాక్ అవుతుంది. త‌న త‌ప్పేం లేద‌ని చాలా మొత్తుకుంటాడు విజ‌య్‌.

అత‌ని మాట విన‌కుండా త‌న అన్న‌య్య‌కు ఫోన్ చేసి విష‌యం చెబుతుంది. అత‌న్ని చంపేయాల‌ని తిరుగుతుంటాడు ఆమె అన్న‌య్య (సుబ్బ‌రాజు). అయినా అనుకోని ప‌రిస్థితుల కార‌ణంగా గీత‌, విజ‌య్ క‌లిసి తిరగాల్సి వ‌స్తుంది. దీని వ‌ల్ల ఏమైంది?  విజ‌య్ చెల్లెలి పెళ్లి సంగ‌తేంటి?  గీత అన్న‌య్య విజ‌య్ మీద ప‌గ పెంచుకున్నాడా? అతనికి ఇత‌నిపై ఎలాంటి అభిప్రాయం ఉంది? వ‌ంటివ‌న్నీ ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు. 

geeta govindam

స‌మీక్ష‌
ప్ర‌తి వ్య‌క్తికీ పెళ్లి ఒక క‌ల‌. చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలి?  చేసుకున్నాక ఎలా చూసుకోవాలి.. వంటివ‌న్నీ అబ్బాయిల జేబుల్లో లిస్ట్ అయి రెడీగా ఉంటుంది. ఈ సినిమాలో విజ‌య్ పాత్ర కూడా అలాంటిదే. చిన్న‌ప్పుడే త‌ల్లిని పోగొట్టుకుని, క‌నుసైగ‌ల్లో అర్థం చేసుకునే భార్య రావాల‌ని కోరుకుంటుంటాడు. తొలి చూపులోనే గీతతో ప్రేమ‌లో ప‌డ‌తాడు. అనుకోని పొర‌పాటు వ‌ల్ల త‌న ప్రేమ‌ను వ్య‌క్తం చేసే సంద‌ర్భం అత‌నికి రాదు.

త‌న మ‌న‌సులోని మాట‌ను తీరా అవ‌త‌లి వ్య‌క్తి చెప్పే సంద‌ర్భ‌మే ఎదురైనా తృణీక‌రిస్తాడు. త‌ర్వాత త‌ప్పు తెలుసుకుని బాధ‌ప‌డ‌తాడు. బావ‌ను కాళ్లావేళ్లా ప‌డి త‌ను అనుకున్న‌ది సాధిస్తాడు. ఇదంతా ఏంటి? అంటే కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుల‌తో వ్య‌క్తులు చేసే యుద్ధ‌మే. క్లిష్ట‌మైన ప‌రిస్థితుల‌ను త‌మ‌కు తాము సృష్టించుకుంటున్న ప‌లువురు యువ‌త‌కు నిద‌ర్శ‌నం విజ‌య్ పాత్ర‌. గీత పాత్ర కూడా నేటి స‌మాజానికి అద్దం ప‌టే పాత్రే. ఈ పాత్ర‌ల చుట్టూ ద‌ర్శ‌కుడు క‌థ అల్లుకున్నారు.

అయితే సీన్లు కాసింత కొత్త‌గా రాసుకుని ఉంటే బావుండేది. భావోద్వేగాల్లో ఇంకాస్త ప‌దును చూపించి ఉంటే స‌రిపోయేది. ముందే హిట్ట‌యిన పాట‌ల ఊపు సినిమాకు ప‌నికొచ్చింది. ఎన్న‌డూ లేనంత‌మంది యువ‌త‌ను థియేట‌ర్ల వైపు తీసుకొచ్చింది. ప్రారంభ‌పు వ‌సూళ్ల‌ను పిచ్చ‌గా రాబ‌ట్టింది. సినిమా యువ‌త‌కు న‌చ్చుతుంది. స‌కుటుంబంగా చూసేలా ఉంది. విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాకు ప్ల‌స్‌.

ర‌ష్మిక కూడా ప్ల‌స్సే. .. కాక‌పోతే క్లైమాక్స్ లో ఏడ‌వ‌డం స‌రిగా రాలేదు. ఆమె ఏడుస్తున్నా.. చిత్రమేంటో న‌వ్వుతున్న‌ట్టే అనిపించింది. అన్న‌పూర్ణ‌మ్మ‌, వెన్నెల కిశోర్ కామెడీ బావుంది. నాగ‌బాబుకు గొంతు అరువిచ్చారు. అయితే అదేదో కృత్తిమంగా అనిపించింది. సుబ్బ‌రాజుకు చాన్నాళ్ల త‌ర్వాత మంచి పాత్ర ప‌డింది. ద‌ర్శ‌కుడు సినిమాను చ‌క్క‌గా తీసినా, ఆయ‌న గ‌త సినిమాల్లో ఉన్న సెంటిమెంట్ స‌న్నివేశాలు, ప‌దునైన డైలాగులు ఇందులో అంత‌గా క‌నిపించ‌లేదు.

ప్ల‌స్ పాయింట్లు
- పాట‌లు
- న‌టీన‌టులు
- కామెడీ
- కెమెరా

మైన‌స్ పాయింట్లు
- నాగ‌బాబు వాయిస్‌
- ర‌ష్మిక న‌ట‌న‌
- పేల‌వంగా సాగే స‌న్నివేశాలు
- క‌థ ఫ్లాట్‌గా ఉండ‌టం

రేటింగ్‌: 3/5
బాట‌మ్ లైన్‌:  యూత్ కోసం `గీత గోవిందం`.విజయ్ కోసం ఇద్దరు హీరోయిన్లు!

Updated By ManamSat, 08/11/2018 - 19:50

Vijay Deverakonda, Rashmika Mandanna, Geetha Govindham, Nitya Menon, Anu emmanuel  విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ రూపొందించిన చిత్రం ‘గీత గోవిందం’. ఈ చిత్రం ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘అర్జున్‌రెడ్డి’ తర్వాత విజయ్ హీరోగా నటించిన సినిమా కావడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మండన్న హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ సినిమలో రష్మిక కాకుండా మరో ఇద్దరు హీరోయిన్లు కూడా కనిపిస్తారని తెలుస్తోంది. కథ ప్రకారం ఈ ఇద్దరు హీరోయిన్లు సినిమాలో లేనప్పటికీ అతిథి పాత్రల్లో కనిపిస్తారట.

ఆ ఇద్దరు హీరోయిన్లు నిత్యా మీనన్, అనూ ఇమ్మానుయేల్. ఈ చిత్ర కథ కీలక మలుపు సమయంలో నిత్యా మీనన్ కాసేపు కనిపిస్తుంది. అలాగే అను మరో సందర్భంగా కనిపించి ప్రేక్షకులకు కనువిందు చేస్తుందట. ఇద్దరు పాపులర్ హీరోయిన్లు ఈ సినిమాలో కాసేపు నటించడం విశేషంగానే చెప్పుకోవాలి. గన్‌తో నాగ్.. స్టెతస్కోప్‌తో నాని

Updated By ManamTue, 08/07/2018 - 17:23

Nagarjuna, Nani ‘Devadas’ first look

అక్కినేని నాగార్జున, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్‌లో వస్తున్న ‘దేవదాస్’. ఈ మూవీపై రోజురోజుకు అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ మల్టీస్టారర్ చిత్రంపై అంచనాలు సైతం పెరిగిపోతున్నాయి. కాగా ఇక్కటికే ఈ మూవీకి సంబంధించిన టైటిల్‌తో ఉన్న చిన్నపాటి పోస్టర్‌ను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ తాజాగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఈ స్టిల్‌ను చూసిన అక్కినేని, నాని అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఇప్పుడీ పోస్టర్ నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ఈ పోస్టర్‌లో నాగ్, నాని ఇద్దరూ ఒకే పడుకుని నిద్రిస్తున్నారు. నాగార్జున ఓ చేతిలో వైన్ బాటిల్‌.. మరో చేత్తో గన్ పట్టుకుని ఉన్నాడు. ఇక నాని విషయానికొస్తే సరికొత్త లుక్‌లో స్టెతస్కోపు‌, పుస్తకాలతో దర్శనమిచ్చాడు. కాగా నాగ్ డాన్‌గా.. నాని డాక్టర్‌గా ఈ చిత్రంలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ ఫస్ట్‌లుక్‌ను నాగ్, నాని తన ట్విట్టర్ ఖాతాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

ఈ హిలేరియ‌స్ ఎంట‌ర్ టైన‌ర్‌లో నాగార్జున‌కు జోడీగా ఆకాంక్ష సింగ్.. నానికి జోడీగా ర‌ష్మిక మంద‌న్న న‌టిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ చివ‌రిద‌శ‌లో ఉంది. సెప్టెంబ‌ర్ 27న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. వైజ‌యంతి మూవీస్ సంస్థ‌పై అశ్వినీదత్ నిర్మాత‌గా.. సిధ‌ర్మ‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో దేవ‌దాసు వ‌స్తుంది. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్‌ లోగోకు మంచి రెస్సాన్స్‌ వచ్చింది.

న‌టీన‌టులు
నాగార్జున‌, నాని, ర‌ష్మిక మంద‌న్న‌, ఆకాంక్ష సింగ్, న‌రేష్ వికే, బాహుబ‌లి ప్రభాక‌ర్, రావు ర‌మేష్, వెన్నెల కిషోర్, అవ‌స‌రాల శ్రీ‌నివాస్, స‌త్య‌
బ్యాన‌ర్: వైజ‌యంతి మూవీస్
నిర్మాత‌: అశ్వినీద‌త్
ద‌ర్శ‌కుడు: శ్రీ‌రామ్ ఆదిత్య‌
సినిమాటోగ్ర‌ఫ‌ర్: శ్యామ్ ద‌త్ సైనూదీన్
సంగీత ద‌ర్శ‌కుడు: మ‌ణిశ‌ర్మ‌ప్రియుడితో రష్మిక బ్రేకప్..!

Updated By ManamThu, 08/02/2018 - 15:41
Rashmika Mandanna

రష్మిక మందన్న.. తెలుగు, కన్నడలో ఈ భామకు ఇప్పుడు మంచి క్రేజ్ ఉంది. ‘కిర్రిక్ పార్టీ’తో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ భామకు ఇటు తెలుగు, అటు కన్నడలో చేతి నిండా సినిమాలు ఉన్నాయి. అందులో ఎక్కువగా తెలుగు సినిమాలే ఉన్నాయి. ఇదిలా ఉంటే రష్మిక తన ప్రియుడికి బ్రేకప్ చెప్పనున్నట్లు శాండిల్‌వుడ్‌లో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.

‘కిర్రిక్ పార్టీ’లో నటించినప్పుడు ఆ మూవీ హీరో రక్షిత్ శెట్టితో ప్రేమాయణం నడిపిన రష్మిక.. ఆ తరువాత అతడితో నిశ్చితార్థం కూడా చేసుకుంది. కొద్ది రోజుల తరువాత పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు. అయితే ఆ తరువాత ఇద్దరు వరుస ప్రాజెక్ట్‌లతో బిజీ అవ్వడంతో పెళ్లిని వాయిదా వేసుకుంటూ వచ్చారు. అయితే ఇటీవల కాలంలో రక్షిత్‌, రష్మిక మధ్య మనస్పర్థలు వచ్చినట్లు శాండిల్‌వుడ్‌లో తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కెరీర్‌ మీదే దృష్టి పెట్టాలని అనుకుంటున్న రష్మిక త్వరలోనే ప్రియుడికి గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారం. మరి ఈ వార్తలపై ఆ యువజోడి ఎలా స్పందింస్తుందో చూడాలి. కాగా విజయ్ దేవరకొండ సరసన రష్మిక నటించిన ‘గీత గోవిందం’ ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.విజయ్ ‘వాట్ ద ఎఫ్’ పాట విడుదల

Updated By ManamThu, 07/26/2018 - 12:16

Vijay devarakondaవిజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘గీత గోవిందం’ నుంచి రెండో సింగిల్ విడుదలైంది. విజయ్ స్వయంగా ఈ పాటను ఆలపించగా.. శ్రీమణి సాహిత్యం అందించాడు. గోపిసుందర్ అందించిన సంగీతం బావుండగా.. సింగర్‌గా విజయ్ ఫర్వాలేదనిపించాడు.

ఇక రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిక నటించింది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించగా.. పరశురామ్ దర్శకత్వం వహించాడు.  ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ క్లైమాక్స్‌కు రాగా ఈ చిత్రం ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Related News