rgv

'ఆఫీస‌ర్' రెండో టీజ‌ర్ వ‌చ్చేసింది

Updated By ManamFri, 05/04/2018 - 18:15

officerకింగ్‌ నాగార్జున హీరోగా సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ రూపొందించిన చిత్రం 'ఆఫీస‌ర్‌'. మైరా స‌రీన్ క‌థానాయిక‌. చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న ఈ సినిమా మే 25న తెర‌పైకి రానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా టీజ‌ర్ ఇటీవ‌లే విడుద‌లై నాగ్‌, వ‌ర్మ అభిమానుల‌ను అల‌రించింది. కాగా.. ఈ రోజు (శుక్ర‌వారం) సినిమాకి సంబంధించిన రెండో టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ టీజ‌ర్‌ను బ‌ట్టి.. తండ్రీకూతుళ్ళ‌ అనుబంధం నేప‌థ్యంలో రూపొందిన సినిమాగా ఆఫీస‌ర్ ఉండ‌బోతోంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతుంది. అలాగే మాఫియాతో పోరాడే పోలీస్ అధికారిగానూ నాగ్ కొత్త త‌ర‌హా యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో సంద‌డి చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. అదేవిధంగా.. ఈ సినిమా ట్రైల‌ర్‌ను మే 12న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ఈ టీజ‌ర్‌లో ప్ర‌స్తావించింది చిత్ర బృందం.మ‌రోసారి వ‌ర్మ‌ను విచారించ‌నున్న పోలీసులు

Updated By ManamWed, 04/04/2018 - 22:11

rgvసంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన జీఎస్టీ (గాడ్, సెక్స్, ట్రూత్) లఘు చిత్ర వివాదం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఇది నెమ్మదిగా వర్మకు త‌ల‌నొప్పి వ్య‌వ‌హారంగా తయారవుతోంది. గత ఫిబ్రవరిలో ఈ చిత్రానికి సంబంధించి అసభ్యత, అశ్లీలత ఉందన్న అభియోగాల‌తోపాటు.. సామాజిక కార్యకర్త దేవిపై చేసిన అనుచిత వ్యాఖ్యల నిమిత్తం సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ జరిపిన విషయం తెలిసిందే. ఆ విచారణలో తాను ఈ సినిమాని చిత్రీకరించడం కోసం పోలాండ్ వెళ్లానన్నది అవాస్తవమని.. తాను ఈ చిత్రానికి దర్శకత్వం వహించలేదని.. నిర్మాతలు కోరితే వారికి స్కైప్‌ ద్వారా సూచనలు మాత్రమే ఇచ్చానని తెలియజేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కథ తనదేనని ఓ యువకుడు.. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా పోలీసులకు అందజేసాడు.

ఇదిలా ఉంటే.. మరో ఇద్దరు యువకులు (వారి వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు) ఈ చిత్రాన్ని హైదరాబాద్‌లోనే చిత్రీకరించారని.. మియా మల్కోవాను హైదరాబాద్‌కు రప్పించి ఓ స్టార్ హోటల్‌లో షూటింగ్ నిర్వ‌హించార‌ని.. అందుకు తగిన సాక్ష్యాలను కూడా పోలీసులకు అందజేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో వర్మను మరోసారి విచారించేందుకు పోలీసులు సిద్ధపడుతున్నారు. అయితే.. ఈసారి వర్మ పాస్ పోర్టును పరిశీలించి జీఎస్టీ చిత్రీకరణ కోసం ఆయన పోలాండ్ వెళ్ళారా? లేదా? అన్నది నిర్ధారించుకోనున్నారు. అలాగే.. గతంలో వర్మ లాప్‌టాప్, ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు సాక్ష్యాల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించారు. వర్మపై తీసుకోబోయే తదుపరి చర్యలు ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చే నివేదికపై ఆధారపడి ఉంటాయ‌ని పోలీసులు చెబుతున్నారు.‘ఆఫీసర్’..రూమర్స్‌కి స్పందించిన వర్మ

Updated By ManamTue, 04/03/2018 - 16:26

rgvకింగ్ నాగార్జున, సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కాంబినేషన్‌లో ‘ఆఫీసర్’ మూవీ తెరకెక్కుతున్న‌ విషయం తెలిసిందే. వర్మ నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో మైరా సరీన్ నాయిక పాత్ర పోషిస్తోంది. నాగార్జున రఫ్ అండ్ టఫ్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది ఈ చిత్రం. ఒక పోలీస్ ఆఫీసర్ అయిన తండ్రి.. తన కూతురుని కాపాడుకునే వైనమే చిత్ర కథ.

ఇదిలా ఉంటే.. కొద్ది రోజులుగా ఈ సినిమాపై కొన్ని పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా కథను ‘టేకెన్’ అనే ఫారిన్ మూవీ  నుంచి కాపీ చేసారనే కథనాలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలకు తెరదించుతూ.. సినిమా నిర్మాత, దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. ఈ కథ తను సొంతంగా రాసుకున్నదని.. ఏ చిత్రం నుంచి స్ఫూర్తి పొందో, లేక‌ కాపీ చేసో ఈ కథను తెరకెక్కించలేదని అన్నారు. నా కథలో పాత్రలు వేరే సినిమా పాత్ర‌ల‌తో కలిసినంత మాత్రాన అది కాపీ అంటే ఎలా? అని ప్రశ్నించారు.

24 సంవత్సరాల గ్యాప్ తర్వాత నాగ్, వర్మ కలయికలో రూపొందుతున్న‌ ఈ చిత్రం.. మే 25న తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదల కానుంది.'రంగ‌స్థ‌లం'పై ఆర్జీవీ ఏమ‌న్నారంటే..

Updated By ManamTue, 04/03/2018 - 15:16

rgvసౌండ్ ఇంజ‌నీర్ చిట్టిబాబుగా 'రంగ‌స్థ‌లం'లో రామ్ చ‌ర‌ణ్ చేసిన సంద‌డికి వ‌సూళ్ళ వ‌ర్షం కురుస్తోంది. ఇప్ప‌టికే రూ.100 కోట్ల గ్రాస్ రాబ‌ట్టుకున్న ఈ సినిమా.. మ‌రిన్ని రికార్డుల వైపుగా దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాని చూసిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ ట్విట్ట‌ర్‌లో ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ''రంగ‌స్థ‌లం.. నిజంగా సెంట‌ర్ స్టేజ్ బుల్లెట్ ఎఛీవ్‌మెంట్.. రామ్ చ‌ర‌ణ్ మైండ్‌బ్లోయింగ్లీ ఫెంటాస్టిక్'' అని ప్ర‌శంసించారు. అలాగే ''హేయ్ సుకుమార్‌.. నీకు నా 3 వంద‌నాలు (ఎమోజీలు). అలాగే మై త్రి (నిర్మాత‌లు, సంస్థ‌ను ఉద్దేశించి) మీకు నా ముద్దులు (ఎమోజీలు)'' అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను బ‌ట్టి ఆర్జీవీకి ఈ సినిమా బాగా న‌చ్చేసింద‌ని అర్థం చేసుకోవ‌చ్చు.నాగ్ సైకిల్ చైన్‌తో కొట్టినా స‌రే - ఆర్జీవీ

Updated By ManamTue, 03/27/2018 - 23:37

nagarjunaసంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌.. త‌న తొలి చిత్ర క‌థానాయ‌కుడు నాగార్జున‌తో ప్ర‌స్తుతం ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. 'ఆఫీస‌ర్' పేరుతో తెర‌కెక్కుతున్న ఈ సినిమా మే 25న తెర‌పైకి రానుంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం త‌రువాత త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను అఖిల్‌తో చేయ‌బోతున్నారు ఆర్జీవీ. ఈ విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా అధికారికంగా క‌న్‌ఫ‌ర్మ్ చేశారు వ‌ర్మ‌. 

పాతికేళ్ల క్రితం ద‌ర్శ‌కుడిగా త‌న‌కు నాగ్‌ తొలి అవ‌కాశం ఇచ్చార‌ని.. క‌ట్ చేస్తే ఇప్పుడు నాగ్ హీరోగా త‌నే నిర్మాత‌గా ఓ సినిమాని తెర‌కెక్కిస్తున్నానని ఆయ‌న చెప్పుకొచ్చారు. అంతేగాకుండా.. అఖిల్ హీరోగా త‌న ద‌ర్శ‌క‌త్వంలో నాగ్ ఓ సినిమాని నిర్మించ‌బోతున్నార‌ని.. దీంతో ఓ స‌ర్కిల్ పూర్తి చేయ‌గ‌లిగాన‌ని సంతోషంగా ట్వీట్ చేశారు వ‌ర్మ‌. అలాగే.. 'శివ' నాటి నాగ్‌తో పోలిస్తే.. అఖిల్ వాయిస్‌, స్టైల్ విష‌యంలో ఎంతో మెరుగ్గా ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పుకొచ్చారు. దీనికి నాగ్‌ కోప‌గించి సైకిల్ చైన్‌తో కొట్టినా ప‌ర్లేద‌ని.. ఈ విష‌యాన్ని నిజాయ‌తీగా చెబుతున్నాన‌ని తెలిపారు. ఇది ప్రేమ‌క‌థ‌గా కాకుండా వాస్త‌విక‌త ఉట్టిప‌డే యాక్ష‌న్ చిత్రంగా ఉంటుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డి కానున్నాయి.

ఇదిలా ఉంటే..  సోమ‌వారం అఖిల్ మూడో సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. 
 శ్రీదేవి హఠాన్మరణానికి ముందు అసలేం జరిగిందంటే..!

Updated By ManamSun, 03/04/2018 - 10:34

Boney Kapoor Opened Up About Sridevi's Last Moments: Film Trade Analyst Komal Nahtaఅతిలోకసుందరి, లెజండరీ నటి, ఇండియన్ స్టార్ శ్రీదేవి.. కోట్లాది మంది అభిమానులను, వేలాదిమంది నటీనటులను విషాదంలోకి నెట్టేసి తిరిగిరాని లోకాలకు చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె చనిపోలేదని ఇదంతా కలయేనని కొందరు వీరాభిమానులు, ఆరాధ్యులు ఇంకా భ్రమలోనే ఉన్నారు. అయితే ఫిబ్రవరి-24న అసలేం జరిగింది?. పెళ్లిలో సంతోషంగా గడిపిన శ్రీదేవి ఎందుకిలా హఠాన్మరణం చెందారు? ఇది హత్య కాదు.. ఆత్మహత్య అంతకంటే కాదని దుబాయ్ ఫోరెన్సిక్ రిపోర్టులో నిగ్గుతలిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఆ నాటి నుంచి నేటి వరకూ ఆమె మరణంపై అనుమానాలు మాత్రం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంపై బోనీ కపూర్ బాల్యమిత్రుడు కోమల్ నాహ్తా స్పందించారు. బోనీ చెప్పిన తనతో చెప్పినతో మాటలన్నీ ఆయన తన ట్విట్టర్, బ్లాగ్‌ ద్వారా నిశితంగా విశ్లేషించారు. కోమల్‌ బ్లాగ్‌లో షేర్‌ చేసిన ప్రకారం (బోనీ మాటలు కోమల్ ద్వారా)...

దుబాయ్ వస్తున్నట్లు శ్రీదేవి తెలియదు..!
దుబాయ్ పెళ్లి వేడుక అయిపోయిన అనంతరం నేను ఇండియాకు వచ్చేశాను. ఫిబ్రవరి 24 ఉదయం నేను శ్రీదేవితో ఫోన్లో మాట్లాడాను. ఆ రోజు సాయంత్రం నేను దుబాయ్‌ వస్తున్నట్టు ఆమెకు చెప్పలేదు. దుబాయ్‌ వెళ్లాలనే ఆలోచనకు జాన్వీ కూడా ఓకే చెప్పింది. ఎందుకంటే.. శ్రీదేవి ఒంటరిగా ఉంటే భయపడుతుందని, పాస్‌పోర్ట్, ఇతర కీలకమైన పత్రాలను ఎక్కడో పెట్టి మరిచిపోతుందనే భయం. గడిచిన 24 ఏళ్లలో నేను, శ్రీదేవి కలిసి విదేశాలకు పెద్దగా వెళ్లలేదు.. మొత్తం మీద వెళ్లింది రెండుసార్లే. శ్రీదేవే సినిమా ప్రదర్శనల కోసం న్యూజెర్సీ, వాంకోవర్‌లకు వెళ్లింది.. కానీ నేను ఆమెతో వెళ్లలేదు. ఆ సమయంలో నా స్నేహితుడి భార్యను శ్రీదేవికి తోడుగా పంపాను. మొట్టమొదటి సారిగా శ్రీదేవి రెండురోజుల పాటు ఎవరూ లేకుండా ఓ విదేశీ గడ్డపై ఉండటం మాత్రం దుబాయ్‌ హోటల్‌‌లో మాత్రమే.

పెళ్లి అయిపోయిన తర్వాత.. సడన్ సర్‌ఫ్రైజ్!
ఫిబ్రవరి 20న నేను, శ్రీదేవి, నా చిన్న కుమార్తె ఖుషీ ఓ వివాహం నిమిత్తం దుబాయ్‌ వెళ్లాం. ఫిబ్రవరి 22న లక్నోలో ఓ కీలకమైన సమావేశం ఉండటంతో దానికి హాజరయ్యేందుకు నేను ఇండియాకు రావాల్సి వచ్చింది. ఫిబ్రవరి 22, 23వ తేదీల్లో జుమేరా ఎమిరేట్స్‌ టవర్‌ హోటల్‌లోని రూమ్‌ నంబర్‌ 2201లో శ్రీదేవి రిలాక్స్‌ అవుతోంది. ఆ రెండు రోజులూ జాన్వీ కోసం షాపింగ్‌ చేసింది. ఫిబ్రవరి 24న మధ్యాహ్నం స్వతహాగా నేనే 3.30 గంటలకు నేను విమాన టికెట్‌ బుక్‌ చేసుకున్నాను. దుబాయ్‌ కాలమానం ప్రకారం సాయంత్రం 6.20 గంటలకు శ్రీదేవి ఉంటున్న హోటల్‌కు చేరుకున్నాను. హోటల్ సిబ్బందితో మాట్లాడి డూప్లికేట్ తాళంతో తలుపులు తెరిచాను. హోటల్‌ వద్ద శ్రీదేవిని సర్‌ప్రైజ్‌ చేశాను. ఇద్దరం హగ్ చేసుకున్నాం.. కిస్ చేసుకున్నాం.. అలా ఇద్దరం అరగంటపాటు గడిపాము.

శ్రీదేవి బాత్రూమ్‌‌ వెళ్లింది.. నేను మ్యాచ్ చూస్తున్నా.. ఇంతలోనే!
అనంతరం నేను ఫ్రెషప్‌ అయి.. రొమాంటిక్‌ డిన్నర్‌కు వెళదామని శ్రీదేవికి చెప్పగా దీనికి ఓకే అన్న శ్రీదేవి.. శ్రీదేవి మాస్టర్‌ బాత్‌రూమ్‌కు వెళ్లింది. షాపింగ్‌‌ను కూడా నా కోరిక మేరకు ఆదివారానికి వాయిదా వేసుకోవడం జరిగింది. లివింగ్‌ రూమ్‌కు వచ్చిన నేను ‘సౌతాఫ్రికా- ఇండియా మ్యాచ్‌’ను టీవీ చూస్తూ కొద్దిసేపు గడిపాను. 15–20 నిమిషాల తర్వాత సమయం 8 గంటలకు సమీపిస్తుండటం.. శనివారం కావడంతో హోటల్‌లో రష్‌ పెరిగిపోతుందనే ఉద్దేశంతో లివింగ్‌ రూమ్‌ నుంచే రెండుసార్లు బిగ్గరగా ‘జాన్..జాన్..జాన్’ పిలిచాను.. ఆమె పలకలేదు. దీంతో టీవీ వాల్యూమ్‌ తగ్గించి మళ్లీ పిలిచినప్పటికీ ఆమె నుంచి ప్రతి స్పందన లేదు. దీంతో బెడ్‌రూమ్‌లోకి వెళ్లి  డోర్‌ కొట్టి.. మళ్లీ శ్రీదేవిని పిలిచాను.

ఎంతసేపటికీ డోర్‌ తీయకపోవడం.. లోపలి నుంచి ట్యాప్‌ అన్‌ చేసి ఉన్న శబ్దం రావడంతో ఆందోళన చెంది డోర్‌ తెరిచే ప్రయత్నం చేశాను. లోపల బోల్ట్‌ పెట్టకపోవడంతో డోర్‌ సులువుగానే తెరుచుకుంది. లోపలికి వెళ్లి చూస్తే బాత్‌టబ్‌లోని నీటిలో పూర్తిగా మునిగిన శ్రీదేవి కనిపించింది. తల నుంచి కాలి వరకు పూర్తిగా మునిగిపోయి ఉంది. ఎంత పిలిచినా.. తట్టి లేపినా ఆమెలో ఎలాంటి చలనం లేదు. దీంతో షాక్‌కు గురైన నేను ఏం చేయాలో దిక్కుతోచక అలాగే శ్రీదేవి చూస్తూ ఉండిపోయాను. 

రెండు గంటల్లోనే అంతా జరిగిపోయింది..!
శ్రీదేవి బాత్ టబ్‌లో మునిగిపోయింది.. బోనీ ప్రపంచం బద్దలైపోయింది. శ్రీదేవిని బోనీ సర్‌ప్రైజ్‌ చేసిన రెండు గంటల్లోనే అంతా జరిగిపోయిందని కోమల్‌ తన బ్లాగ్‌లో తీవ్ర ఆవేదనతో పేర్కొన్నారు. తొలుత నీట మునిగి ఆ తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లి ఉండొచ్చని లేదా మొదట నిద్రలోకి జారుకుని లేదా అపస్మారక స్థితిలోకి వెళ్లి నీట మునిగిపోయి ఉండొచ్చని కోమల్‌ అంచనా వేశారు. బాత్ టబ్ పూర్తిగా నీటితో నిండివున్నా చుక్క నీరు కూడా కింద పడలేదని, అంటే బాత్ టబ్‌లో ఆమె చేతులు లేదా కాళ్లు ఆడించటం వంటివి చేయలేదు. ఒకవేళ శ్రీదేవి బాత్ టబ్‌లో పడుకుని నిద్రపోయి, నీట మునిగి ఉండవచ్చని కోమల్ అంచనా వేశారు. ఇదే సమయంలో నీట మునిగి ఆపై క్షణాల్లోనే అపస్మారక స్థితిలోకి వెళ్లి ఉంటుందని కూడా భావిస్తున్నట్టు చెప్పారు. తన అభిప్రాయాలను కోమల్ సొంతంగా నిర్వహిస్తున్న బ్లాగ్‌లో వెల్లడించారు. శ్రీదేవిని ఒక్క క్షణం కూడా బాధ పెట్టకుండా ప్రాణం పోయినట్టు తనకు అనిపించిందని చెప్పారు. ఆమె ఒక్క నిమిషం కూడా వేదన అనుభవించిన దాఖలాలు లేవు.. ఎందుకంటే బాత్‌టబ్‌ పూర్తిగా నిండినా చుక్క నీరు కింద పడకపోవడం దీనికి నిదర్శనమని స్పష్టం చేశారు. 

ఆమె హఠాన్మరణం అనంతరం దుబాయ్‌లో జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే. దుబాయ్‌‌లో బోనీని పోలీసులు ప్రశ్నించడం.. ఆ తర్వాత రంగంలోకి దిగిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ రచ్చరచ్చ చేయడం.. ఆయన హడావుడి వల్ల పార్థివదేహం తరలింపులో ఒకరోజు జాప్యం జరగడం ఇవన్నీ జరిగిపోయాయి. ఇవన్నీ అటుంచింతే జాతీయ, ప్రాంతీయ చానెల్స్ మాత్రం ఇంకేదో ఊహించుకుని ఇష్టానుసారం ప్రసారాలు చేయడం, వెబ్‌సైట్లు పిచ్చిపిచ్చిగా రాసేయడం మనందరమూ చూశాము. ఆఖరికి ముంబైకి భౌతికకాయం రానే వచ్చింది. ఫిబ్రవరి-28న అభిమానుల అశ్రునయనాల మధ్య ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు ముగిశాయి.

                 కోమల్ నాహ్తా బ్లాగ్‌కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..అఫీషియ‌ల్ః నాగ్‌, వ‌ర్మ చిత్రం 'ఆఫీస‌ర్‌'

Updated By ManamTue, 02/27/2018 - 17:30

officerసెన్సేష‌న‌ల్ కాంబినేష‌న్‌ నాగార్జున‌, రామ్ గోపాల్ వ‌ర్మ క‌ల‌యిక‌లో దాదాపు 24 ఏళ్ళ త‌రువాత ఓ సినిమా వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి టైటిల్, విడుదల తేదీ వివరాలు రెండు రోజుల క్రితం (ఫిబ్రవరి, 25) ప్రకటించాల్సి ఉండగా.. వర్మ అభిమాన నటి శ్రీదేవి ఆకస్మిక మరణంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. కాగా, ఈ రోజు (మంగ‌ళ‌వారం) సాయంత్రం 5 గంట‌ల‌కు ఈ సినిమా టైటిల్‌తో పాటు విడుదల తేదీని కూడా ప్ర‌క‌టించారు వర్మ. ఇంత‌కుముందు వ‌చ్చిన వార్త‌ల ప్ర‌కారంగానే.. ఈ చిత్రానికి ‘ఆఫీసర్’ అనే టైటిల్‌నే ఖరారు చేసారు. అలాగే.. ఇంటెన్సిటీతో కూడిన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌లో విడుద‌ల తేదీగా మే 25ని ప్ర‌క‌టించారు.  దీనితోపాటు.. ఫ‌స్ట్ లుక్‌ మోష‌న్ టీజ‌ర్‌ను కూడా విడుద‌ల చేశారు. చూస్తుంటే.. 'శివ' మ్యాజిక్‌ను నాగ్‌, వ‌ర్మ కాంబో మ‌రోసారి రిపీట్ చేసేలానే ఉందంటున్నారు నెటిజ‌న్లు.జాబిలమ్మకు శాశ్వతంగా జోలపాడాడు!

Updated By ManamSun, 02/25/2018 - 09:42

Jamu rathiri jabilamma‘జాము రాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇల.. జోరు గాలిలో జాజి కొమ్మ ..జార నీయకే కలా’.. ఈ పాట అందరికీ గుర్తుండే ఉంటుంది. మరీ ముఖ్యంగా శ్రీదేవి, పాటల ప్రియులకు కొత్తగా పరిచయం చేయనక్కర్లేదని పాట. అప్పటికీ ఇప్పటికీ ఈ సినిమాకున్న రేంజే వేరు. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం క్షణ క్షణం. తన ఆరాధ్య దేవతతో ఆర్జీవీ తీసిన మొట్టమొదటి సినిమా ఇదే. ఈ చిత్రంలో హీరోగా వెంకటేష్, కథానాయికగా శ్రీదేవి నటించి మెప్పించారు. అప్పట్లో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. కాగా ఈ చిత్రానికి వర్మ దర్శకత్వంతో పాటు ఎం.ఎం కీరవాణి సంగీతం తోడవ్వడంతో జనాలంతా అప్పట్లో థియేటర్లకు క్యూ కట్టి తిరుగులేని విజయాన్ని ఇచ్చారు. ఈ చిత్రంలో నటించిన శ్రీదేవి ఆదివారం (ఫిబ్రవరి-24) తెల్లవారుజామున కన్నుమూశారు. ఆమె మృతి పట్ల పలువురు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

కాగా.. ఆమె మరణంతో ఈ జాబిలమ్మ పాటను ఓ అభిమాని ఎలా మార్చేశారో చూడండి..
‘ఈ సారి ఆ దేవుడే ఒక జామురాతిరి ఆ జాబిలమ్మకు శాశ్వతంగా జోలపాడాడు. తన జాజికొమ్మను ఎక్కువకాలం భూ లోకంలో ఉంచలేక శాశ్వతంగా తన దరికి చేర్చుకున్నాడు’ అని హారిణి అనే ఓ శ్రీదేవి వీరాభిమాని ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌‌ను అతిలోక సుందరి ఆరాధ్యుడు రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్‌‌లో షేర్ చేశారు. కాగా ఆమె మరణించారని తెలిసిన నిమిషం నుంచి వర్మ వరుస ట్వీట్లు, ఫోటోలను శ్రీదేవితో తనుకున్న అనుబంధాన్ని గుర్తు తెచ్చుకుని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.


 బాబు గారూ ఆర్జీవీని కాపాడాలనుకుంటున్నారా?

Updated By ManamWed, 02/21/2018 - 14:39

IDWA Leader Mani Demonds RGV Arrest

విశాఖపట్నం: సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మను అరెస్ట్ చేయాలని మహిళా సంఘాలు ఆందోళన చేపట్టాయి. జీఎస్టీకి సంబంధించిన డిబెట్‌‌లో తమను అసభ్య పదజాలంతో దూషించారని సామాజికవేత్త దేవీ, ఐద్వా సంయుక్త కార్యదర్శి మణి హైదరాబాద్ సీసీఎస్‌‌‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వర్మను విచారించిన పోలీసులు అరెస్ట్‌‌కు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. ఐద్వా ఆద్వర్యంలో 48గంటల నిరాహార దీక్ష పేరుతో విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర మహిళ సంఘాలు ఆందోళనకు దిగాయి. వర్మను అరెస్ట్ చేసి తీరాల్సిందేనని సంఘాలు పట్టుబట్టాయి. మహిళా సంఘాలకు సామాజికవేత్త దేవి మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా మణి మాట్లాడుతూ..
" ఆర్జీవీ ప్రతిదీ వ్యాపారం చేయగలడు. ఓంకారమైనా, ఆడవాళ్లనైనా, టీవీ చానెల్స్ అయినా దేన్నయినా ఆయన వ్యాపారం చేయగలడు. దీంతోనే సమాజం యొక్క స్థితిని దిగజారుస్తున్నాడు. ఇప్పుడున్న విలువలను నాశనం చేస్తున్నాడు. ఆడవాళ్ల స్వతంత్రాన్ని కాపాడుతానని చెప్పి..భూస్థాపితం చేస్తున్నాడు. వర్మ చాలా దుర్మార్గమైన వాడు. ఈ వ్యవస్థ యొక్క వికృత స్వరూపం రాంగోపాల్ వర్మ. అందుకే ఆయన్ను ఎట్టిపరిస్థితిల్లోనూ వదలడానికి వీల్లేదు. వైజాగ్‌లో 48గంటల పాటు మహిళా సంఘాలు నిరాహార దీక్ష చేపడుతున్నాము. చంద్రబాబు గారూ మీరు ఆర్జీవీని కాపాడదలుచుకున్నారా? మమ్మల్ని కాపాడుదలుచుకున్నారా? అని సీఎంకు సూటి ప్రశ్న సంధించారు. తక్షణమే వర్మను అరెస్ట్ చేసి మహిళల మనోభావాలను కాపాడాలి" అని మణి కోరారు.వ‌ర్మ మ‌రో సంచ‌ల‌నం.. పోర్న్ క‌ల్యాణ్ 

Updated By ManamSun, 02/18/2018 - 16:28

rgvవాక్ స్వాతంత్ర్యం, వాక్ చాతుర్యం వుంది కాబట్టి ఏమైనా మాట్లాడొచ్చు అనే వైఖరి సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వర్మది. అందుకే ఎప్పుడూ ఏదో ఒక రూపంలో వివాదాల చుట్టూనే ఈ పేరు తిరుగుతూ ఉంటుంది. ఇటీవల జీఎస్టీ పేరుతో అడల్ట్ మూవీ తీసి..సామాజిక కార్యకర్త దేవిని దూషించిన నేపథ్యంలో.. పోలీస్ అధికారులతో మాట్లాడి బయట‌కి వచ్చిన వర్మ మరో కొత్త వివాదానికి తెర తీసారు. తాజాగా మళ్ళీ జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ట్విట్టర్‌లో చెడామడా ట్వీట్లు చేసేశారు వ‌ర్మ‌. ఏకంగా పవన్ కల్యాణ్‌పై  పోర్న్ కల్యాణ్ అని హ్యాష్ ట్యాగ్ చేసారు ఈ వివాదాస్పద దర్శకుడు. “ప్రస్తుతం పోర్న్, పవన్..ఈ రెండింటికి పిచ్చ పాపులారిటీ ఉంది. పోర్న్ కల్యాణ్ అనేది అల్టిమేట్ బ్రాండ్ అవుతుందనేది నా ఆలోచన. వ్యక్తిగతంగా నాకు పోర్న్ మరియు పవన్ ఇద్దరూ ఇష్టమే” అంటూ ప్ర‌క‌టించ‌డ‌మే కాకుండా..  ''మీకు ఎక్కువగా పోర్న్ ఇష్టమా..? పవన్ ఇష్టమా..?'' అంటూ ఏకంగా ఓ సర్వేకు తెరతీశారు. 
వాక్ స్వాతంత్ర్యం ఉంటే ఏదైనా అనేముందు ఎవరిని అంటున్నాం? సమాజంలో వారి హోదా ఏంటి? అని ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని పవన్ అభిమానులతో పాటు సాధారణ ప్ర‌జానీకం అభిప్రాయ‌ప‌డుతున్నారు. జనాలలో ఒక పాపులారిటీ ఉన్న వ్యక్తి, అదీ గాక..జనసేన అనే రాజకీయ పార్టీ పెట్టి ప్రజలకి సేవ చేయాలని ఉద్దేశ్యంతో రాజకీయాల్లోకి వచ్చిన వారిపై.. ఇటువంటి కామెంట్లు చేయడం మంచిది కాదని.. ఇది బాధాకరమైన విషయమని  తీవ్రమైన వ్యతిరేకత రావడంతో..అసలే టాపిక్‌ను డైవర్ట్ చేయడంలో దిట్ట అయిన ఆర్జీవి.. వచ్చే ఎన్నికల్లో జనసేన కీలకంగా మారనుందని ట్వీటడం కొసమెరుపు.

rgvఇదిలా ఉంటే.. ఇప్ప‌టివ‌ర‌కు ఈ పోలింగ్‌లో 32, 363 ఓట్లు న‌మోద‌య్యాయి. వీరిలో ఎక్కువ‌గా పోర్న్ వైపు మొగ్గు చూప‌డం విశేషం. ఇంకా పోలింగ్‌కు ఆరు గంటల స‌మ‌యం మిగిలి ఉంది. మ‌రి ఫైన‌ల్‌గా దేనికి మెజార్టీ ఓట్లు వ‌స్తాయో చూడాల‌ని నెటిజ‌న్లు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News