nitya menon

‘యన్టీఆర్‌’ దీపావళి శుభాకాంక్షలు

Updated By ManamMon, 11/05/2018 - 18:02
  • యన్టీఆర్‌లో నిత్యామీనన్...

nitya menon-balakrishna with NTR biopic

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా క్రిష్ తెరకెక్కిస్తున్న చిత్రం యన్టీఆర్. దీపావళి పండుగ సందర్భంగా గుండమ్మ కథ చిత్రంలోని ‘ లేచింది నిద్ర లేచింది’ పాట స్టిల్ విడుదల చేసారు. సావిత్రి పాత్రలో నిత్యామీనన్ నటిస్తున్నారు. పండుగ సందర్భంగా తెలుగు ప్రేక్షకులకు.. నందమూరి అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు ఎన్టీఆర్ యూనిట్. జనవరి 9న కథానాయకుడు.. 24న మహానాయకుడు విడుదల కానున్నాయి.విజయ్ కోసం ఇద్దరు హీరోయిన్లు!

Updated By ManamSat, 08/11/2018 - 19:50

Vijay Deverakonda, Rashmika Mandanna, Geetha Govindham, Nitya Menon, Anu emmanuel  విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ రూపొందించిన చిత్రం ‘గీత గోవిందం’. ఈ చిత్రం ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘అర్జున్‌రెడ్డి’ తర్వాత విజయ్ హీరోగా నటించిన సినిమా కావడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మండన్న హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ సినిమలో రష్మిక కాకుండా మరో ఇద్దరు హీరోయిన్లు కూడా కనిపిస్తారని తెలుస్తోంది. కథ ప్రకారం ఈ ఇద్దరు హీరోయిన్లు సినిమాలో లేనప్పటికీ అతిథి పాత్రల్లో కనిపిస్తారట.

ఆ ఇద్దరు హీరోయిన్లు నిత్యా మీనన్, అనూ ఇమ్మానుయేల్. ఈ చిత్ర కథ కీలక మలుపు సమయంలో నిత్యా మీనన్ కాసేపు కనిపిస్తుంది. అలాగే అను మరో సందర్భంగా కనిపించి ప్రేక్షకులకు కనువిందు చేస్తుందట. ఇద్దరు పాపులర్ హీరోయిన్లు ఈ సినిమాలో కాసేపు నటించడం విశేషంగానే చెప్పుకోవాలి. కేరాఫ్ ఫిమేల్ డైరెక్ట‌ర్స్

Updated By ManamMon, 05/21/2018 - 20:48

c/o female directorsచిత్ర ప‌రిశ్ర‌మ‌.. అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లాగే స్ప‌ష్టంగా పురుషాధిక్యం ఉన్న ప‌రిశ్ర‌మ‌. తార‌ల విష‌యం ప‌క్క‌న‌పెడితే.. టెక్నీషియ‌న్లలో స్త్రీలు చాలా త‌క్కువ మంది క‌నిపిస్తుంటారు. అందుకు త‌గ్గ‌ట్టే.. 'కెప్టెన్ ఆఫ్ ది షిప్‌'గా భావించే డైరెక్ట‌ర్‌లుగా స్త్రీలు క‌నిపించ‌డం అరుదు. అయిన‌ప్ప‌టికీ.. అడ‌పాద‌డ‌పా కొంత‌మంది ఫిమేల్ డైరెక్ట‌ర్స్ సంద‌డి చేస్తూనే ఉన్నారు. వీరిలో కొంతమంది సంచ‌ల‌న విజ‌యం అందుకున్న‌వారు ఉన్నారు. అలాంటి ఫిమేల్ డైరెక్ట‌ర్స్‌తో త‌రుచుగా సినిమాలు చేస్తూ కొంత‌మంది క‌థానాయిక‌లు వార్త‌ల్లో నిలుస్తున్నారు. వారి వైపు కాస్త దృష్టి సారిస్తే..

దీపికా ప‌దుకొనే

ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో అత్య‌థిక పారితోషికం తీసుకుంటున్న క‌థానాయిక దీపికా ప‌దుకొనే. క‌న్న‌డ చిత్రంతో ఈమె కెరీర్ మొద‌లైనా.. ద‌శ, దిశ మారింది మాత్రం బాలీవుడ్ మూవీ 'ఓం శాంతి ఓం'తోనే. నృత్య ద‌ర్శ‌కురాలు ఫ‌రా ఖాన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంతో.. ఆ త‌రువాత దీపికా వెనుతిరిగాల్సిన అవ‌స‌రం రాలేదు. ఈ చిత్రం త‌రువాత కూడా దీపిక 'హ్యాపీ న్యూ ఇయ‌ర్' చిత్రం కోసం ఫ‌రా డైరెక్ష‌న్‌లో నటించారు. అలాగే ర‌జ‌నీకాంత్ కుమార్తె సౌంద‌ర్య రూపొందించిన త‌మిళ చిత్రం 'కోచ‌డైయాన్'లోనూ దీపికా న‌టించారు. 

నిత్యా మీన‌న్

ద‌క్షిణాదిలోని అన్ని భాష‌ల్లోనూ క‌థానాయిక‌గా సంద‌డి చేసిన కేర‌ళ కుట్టి నిత్యా మీన‌న్. క‌న్న‌డ‌లో మిన‌హాయిస్తే.. మిగిలిన అన్ని భాష‌ల్లోనూ మ‌హిళా ద‌ర్శ‌కుల‌తో ప‌నిచేశారు నిత్య‌. తెలుగులో ఆమె తొలి చిత్రం 'అలా మొద‌లైంది'.. నందిని రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కింది. సంచ‌ల‌న విజ‌యం సాధించిన ఈ సినిమా త‌రువాత‌ నిత్య ఇక వెనుతిరిగి చూడాల్సిన అవ‌స‌రం రాలేదు. నందిని మ‌రో  చిత్రం 'జ‌బ‌ర్‌ద‌స్త్'లో అతిథి పాత్ర పోషించారు. అలాగే.. అంజ‌నా ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళ చిత్రం 'వెప్పమ్‌' (సెగ‌) చేశారు. అదేవిధంగా.. శ్రీ‌ ప్రియ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన త‌మిళ చిత్రం 'మాలిని 22 ప‌ల‌యం కోట్టై' (ఘ‌ట‌న‌)లోనూ న‌టించారు. ఇక మ‌ల‌యాళంలో అంజ‌లీ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'బెంగ‌ళూరు డేస్‌'లోనూ నిత్య సంద‌డి చేశారు. ఇలా.. త‌న కెరీర్‌లో చెప్పుకోద‌గ్గ సంఖ్య‌లోనే మ‌హిళా ద‌ర్శ‌కుల‌తో సినిమాలు చేశారు నిత్య.

న‌జ్రీయా న‌జీమ్

త‌మిళ అనువాద చిత్రం 'రాజా రాణి'తో తెలుగు వారికి ప‌రిచ‌య‌మైన క‌థానాయిక న‌జ్రీయా న‌జీమ్. మ‌ల‌యాళం, త‌మిళ చిత్రాల్లో సంద‌డి చేసిన న‌జ్రీయాకి.. మ‌హిళా ద‌ర్శ‌కుల‌తో ప‌నిచేసిన చిత్రాలు న‌టిగా మంచి పేరు తీసుకువ‌చ్చాయి. ముఖ్యంగా న‌జ్రీయా కెరీర్‌లో ప్ర‌త్యేకంగా నిలిచిన 'బెంగ‌ళూరు డేస్‌'కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించింది ఫిమేల్ డైరెక్ట‌ర్ అంజ‌లీ మీన‌న్‌నే. సెన్సేష‌న‌ల్ హిట్ అయిన ఈ చిత్రంలో త‌న‌కు జోడీగా న‌టించిన ఫ‌హ‌ద్ ఫాజిల్‌నే నిజ‌జీవితంలో పెళ్ళి చేసుకున్న న‌జ్రీయా.. పెళ్ళ‌య్యాక సినిమాల‌కు దూర‌మ‌య్యారు. ఇటీవ‌లే మ‌ళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లుపెట్టిన న‌జ్రీయా.. అంజ‌లీ మీన‌న్ చిత్రంతోనే  రీ ఎంట్రీ ఇస్తుండ‌డం విశేషం. ఆమె క‌థానాయిక‌గా న‌టించిన తొలి చిత్రం 'మ్యాడ్ డాడ్'కి కూడా మ‌హిళా ద‌ర్శ‌కురాలు (రేవ‌తి ఎస్‌.శ‌ర్మ‌) డైరెక్ష‌న్ చేయ‌డం విశేషం.

అలియా భ‌ట్‌

అన‌తికాలంలోనే బాలీవుడ్‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ క‌థానాయిక అలియా భ‌ట్‌. తాజాగా 'రాజీ' చిత్రంతో ఈ ముద్దుగుమ్మ సంద‌డి చేశారు. మేఘ‌నా గుల్జార్ రూపొందించిన ఈ సినిమా.. అలియాకి న‌టిగా మ‌రింత గుర్తింపు తీసుకువ‌చ్చింది. ఈ చిత్రానికి కంటే ముందే 'డియ‌ర్ జింద‌గీ' కోసం మ‌రో మ‌హిళా ద‌ర్శ‌కురాలు గౌరీ షిండేతో క‌లిసి ప‌నిచేశారు అలియా. ప్ర‌స్తుతం మ‌రో మ‌హిళా ద‌ర్శ‌కులు జోయా అఖ్త‌ర్ డైరెక్ష‌న్‌లో 'గ‌ల్లీ బాయ్స్' చిత్రం చేస్తున్నారు.  

అమైరా ద‌స్తూర్

త‌మిళ అనువాద చిత్రం 'అనేకుడు'తో ప‌రిచ‌య‌మైన క‌థానాయిక అమైరా ద‌స్తూర్.  ఈ ఏడాది ఆరంభంలో విడుద‌లైన 'మ‌న‌సుకు న‌చ్చింది' చిత్రంతో ఈ ముద్దుగుమ్మ‌ తెలుగు ప్రేక్ష‌కుల‌కు నేరుగా ప‌రిచ‌య‌మ‌య్యారు. ఈ సినిమాతోనే సూప‌ర్ స్టార్ కృష్ణ కుమార్తె మంజుల ఘ‌ట్ట‌మ‌నేని ద‌ర్శ‌కురాలిగా  ప‌రిచ‌య‌మ‌య్యారు. ఈ చిత్రం ఫ‌లితం సంగ‌తి ప‌క్క‌న పెడితే.. ఇదే ఏడాది మ‌హిళా ద‌ర్శ‌కులు రూపొందించిన మ‌రో రెండు సినిమాల‌తో అమైరా సంద‌డి చేయ‌నున్నారు. సంజ‌నా రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రాజ్ త‌రుణ్‌కు జోడీగా అమైరా న‌టించిన 'రాజు గాడు' చిత్రం జూన్ 1న విడుద‌ల కానుండ‌గా.. లీనా యాద‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న 'రాజ్మా చావ‌ల్' ఈ ఏడాదిలోనే తెర‌పైకి రానుంది.                                                   -మ‌ల్లిక్ పైడి

 

 విడుద‌కు సిద్ధ‌మైన నిత్యా మీన‌న్ 'ప్రాణ' 

Updated By ManamMon, 03/19/2018 - 21:18

pranaనిత్యా మీన‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన చిత్రం 'ప్రాణ‌'. తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాష‌ల్లో తెరకెక్కిన ఈ చిత్రానికి 'కావ్యాస్ డైరీ' ఫేమ్ వి.కె.ప్ర‌కాశ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. పి.సి.శ్రీ‌రామ్ ఛాయాగ్ర‌హ‌ణం అందించిన ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు గ్రహీత రసూల్ పూకుట్టి సౌండ్ డిజైన‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు.  ఒకే ఒక పాత్ర‌తో తెర‌కెక్కిన ఈ సినిమాలో నిత్యా ర‌చ‌యిత్రిగా క‌నిపించ‌నున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటున్న ఈ సినిమాని వేస‌వి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.  నిత్యా ‘ప్రాణ’కి లెజండ‌రీ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌

Updated By ManamSun, 03/04/2018 - 11:46

pranaసన్నివేశం ఏదైనా, పాత్ర ఏదైనా సింగల్ టేక్‌లోనే సెటిల్డ్ పెర్‌ఫార్మెన్స్‌ ఇవ్వ‌గ‌లిగే న‌టిగా నిత్య మీన‌న్‌కు ద‌క్షిణాదిన మంచి పేరే ఉంది. అలాంటి నిత్య ప్రధాన పాత్రలో.. దర్శకుడు వి.కె.ప్రకాష్ రూపొందిస్తున్న‌ చిత్రం ‘ప్రాణ’. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ భాష‌ల్లో కూడా ఈ సినిమా తెరకెక్కుతోంది. సింక్ సౌండ్ ప‌ధ్ధ‌తిలో తెర‌కెక్కుతున్న తొలి భార‌తీయ చిత్రం ఇది. ఆస్కార్ అవార్డు గ్రహీత రసూల్ పూకుట్టి సౌండ్ డిజైన‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఒకే ఒక్క పాత్ర (నిత్య పాత్ర)తో హిల్ స్టేషన్ నేపథ్యంలో సాగే ఈ థ్రిల్లర్ ఫిలింలో రచయిత్రిగా సందడి చేయనున్నారు నిత్య.

louis banksఇదిలా వుంటే.. ఈ చిత్రానికి “గాడ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ జాజ్” లూయిస్ బ్యాంక్స్ సంగీతం అందిస్తున్నారు. ఒకే ఒక్క పాత్ర తెరపై కనిపించ‌నున్న‌ప్ప‌టికీ.. ఆ పాత్రకు తోడుగా లూయిస్ అందించ‌నున్న‌ నేపథ్య సంగీతం కూడా కీల‌క పాత్ర పోషించ‌నుంది. నిత్య వ్యక్తపరచే హావభావాలతోపాటు ఈ  నేపథ్య సంగీతం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నిర్మాణ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ‘ప్రాణ’కి జాజ్ వాయిద్యం ద్వారా వచ్చే సంగీతం కూడా ప్లస్ అవుతుందని చిత్ర బృందం చెబుతోంది.

pranaఇదిలా ఉంటే.. ఈ సినిమాలో నిత్య ఒక పాట కూడా పాడింద‌ట‌. ఆ విషయమై నిత్య మాట్లాడుతూ “నా కిష్టమైన కళ-జాజ్. అందులోనూ లూయిస్ బ్యాంక్స్ వంటి లెజండ‌రీ జాజ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ కాంబినేష‌న్‌లో ‘ప్రాణ’ మూవీ కోసం నాలుగు భాషల్లోనూ పాట పాడ‌డం కొత్త అనుభూతినిచ్చింద‌”ని చెప్పుకొచ్చారు. కేవ‌లం 23 రోజుల్లో చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.తప్పకుండా దర్శకత్వం చేస్తాను  - నిత్య

Updated By ManamMon, 02/19/2018 - 20:44

nitya menon‘తెలుగు సినిమాల్లో విప్లవం రావాలని కోరుకుంటున్నాను. ‘అ!’ సినిమా ఇలాంటి కొత్తదనానికి చిన్న దారి చూపించింది. నేను ఏదైనా పాత్ర చేసేటప్పుడు.. అది సొసైటీపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందోనని ఆలోచించే ఒప్పుకుంటాను’ అని అంటోంది నిత్యా మీనన్.

ఇటీవల విడుదలైన ‘అ!’ చిత్రంలో నటించిన నిత్యా మీనన్..  సినిమా గురించి మాట్లాడుతూ ‘‘ ‘‘నేను కథను నమ్మే ‘అ!’ సినిమా చేశాను. నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలనుకుంటాం. ఒకే తరహా పాత్రలు చేస్తే నాకు బోర్ కొట్టేస్తుంది. ప్రశాంత్ నా దగ్గరకు వచ్చి కథ చెప్పగానే చాలా ఎగ్జయిట్ అయ్యాను. తను ఈషా రెబ్బా చేసిన రాధమ్మ పాత్ర, కృష్ణవేణి పాత్రను చెప్పి ఏది చేస్తారో మీ ఇష్టం’ అని అన్నాడు. నేను కృష్ణవేణి పాత్రను చేయడానికి నిర్ణయించుకున్నాను. నేనే కాదు ఈ సినిమాలో అందరూ.. దర్శకుడు ప్రశాంత్ వర్మ కోసమే చేశారు. కథ అందరికీ బాగా నచ్చింది. రెండోసారి ప్రశాంత్ నన్ను కలిసినప్పుడు నానియే ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారని చెప్పగానే చాలా హ్యాపీగా అనిపించింది.

కృష్ణవేణి క్యారెక్టర్ నాకు చాలా కొత్తగా అనిపించింది. ‘ఎలా చేస్తామో’ అని అనుకున్నాను. ‘కాంచన’లో గంగ పాత్ర చేసేటప్పుడు నాకు ఛాలెంజింగ్‌గా అనిపించింది. అదే కృష్ణవేణి పాత్ర విషయానికి వస్తే.. ఛాలెంజింగ్‌గా అనిపించింది కానీ.. అంత ఛాలెంజింగ్‌గా అనిపించలేదు. ఇక ‘మహానటి’లో సావిత్రి పాత్ర చేసే అవకాశం నాకే వచ్చింది కానీ.. అది వర్కవుట్ కాలేదు. ప్రస్తుతం ‘ప్రాణ’ సినిమా చేస్తున్నాను. నాలుగు భాషల్లో సినిమా ఉంటుందది. ఒకే ఒక పాత్రతో నడిచే సినిమా అది. నాలుగు భాషల్లో సినిమాను 23 రోజుల్లో పూర్తి చేసేశాం. ఈ సినిమాలో రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో కూడా పనిచేశాను. భవిష్యత్‌లో తప్పకుండా దర్శకత్వం చేస్తాను. కానీ ప్రొడ్యూస్‌ చేయను. తెలుగు ప్రేక్షకులు అన్ని రకాల సినిమాలను ఆదరిస్తున్నారు. ఇలాంటి ప్రేక్షకుల కోసం కొత్త తరహా సినిమాలు చేయాలి'' అని ముక్తాయించింది.'అ!'.. ఫ‌స్ట్ వీకెండ్ క‌లెక్ష‌న్స్‌

Updated By ManamMon, 02/19/2018 - 18:38

aweవాల్ పోస్ట‌ర్ సినిమా ప‌తాకంపై నేచుర‌ల్ స్టార్‌ నాని నిర్మించిన చిత్రం 'అ!'. కాజ‌ల్‌, నిత్యా మీన‌న్‌, రెజీనా, ఈషా రెబ్బా, అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌, ప్రియ‌ద‌ర్శి.. ఇలా భారీ తారాగ‌ణం న‌టించిన ఈ కాన్సెప్ట్ ఒరియెంటెడ్ మూవీకి నూత‌న ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ సినిమా.. మూడు రోజుల‌కిగానూ తెలుగు రాష్ట్రాల్లో రూ.2.5 కోట్ల షేర్‌ను,  ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.4.5 కోట్ల షేర్‌ను రాబ‌ట్టుకుందని ట్రేడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. వ‌ర‌ల్డ్ వైడ్ థియేట్రిక‌ల్ రైట్స్ రూ.6 కోట్లు ఉన్న ఈ సినిమా.. బ్రేక్ ఈవెన్ కావ‌డానికి చేరువ‌లో ఉంది.'అ!'.. ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌

Updated By ManamSat, 02/17/2018 - 21:02

aweవాల్ పోస్ట‌ర్ సినిమా ప‌తాకంపై యువ క‌థానాయ‌కుడు నాని నిర్మించిన చిత్రం 'అ!'. కాజ‌ల్‌, నిత్యా మీన‌న్‌, రెజీనా, ఈషా రెబ్బా, అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌,  ప్రియ‌ద‌ర్శి ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాకి ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ కాన్సెప్ట్ ఒరియెంటెడ్ మూవీకి మిక్స్‌డ్ టాక్ వ‌చ్చింది.  అయితే తొలి రోజు క‌లెక్ష‌న్లు బాగున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ.90 ల‌క్ష‌ల షేర్‌ను రాబ‌ట్టుకున్న ఈ చిత్రం.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.1.7 కోట్ల షేర్‌ను రాబ‌ట్టుకుంది. వ‌ర‌ల్డ్ వైడ్ థియేట్రిక‌ల్ రైట్స్ రూ.6 కోట్లు ఉన్న ఈ సినిమా.. బ్రేక్ ఈవెన్ అయ్యే అవ‌కాశ‌ముంద‌ని ట్రేడ్ పండితులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.  'అ!' రివ్యూ

Updated By ManamFri, 02/16/2018 - 18:23

aweచిత్రంః 'అ!'
న‌టీన‌టులుః కాజ‌ల్ అగ‌ర్వాల్‌, నిత్యా మీన‌న్‌, రెజీనా, ఈషా రెబ్బా, అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌, దేవద‌ర్శిని, ప్రియ‌ద‌ర్శి, ప్ర‌గ‌తి త‌దిత‌రులు
సంగీతంః మార్క్ కె.రాబిన్‌
ఛాయాగ్ర‌హ‌ణంః  కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని
ఆర్ట్ః సాహి సురేష్ 
స‌మ‌ర్ప‌ణః నాని
ద‌ర్శ‌క‌త్వంః ప్ర‌శాంత్ వ‌ర్మ‌

విడుద‌ల తేదిః ఫిబ్ర‌వ‌రి 16, 2018           

తెలుగులో కాన్సెప్ట్ ఒరియెంటెడ్ మూవీస్ రావ‌డం అరుదు. అలాంటి అరుదైన చిత్రాల‌లో ఒక‌టిగా వ‌చ్చిన సినిమా 'అ!'. వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న యువ క‌థానాయ‌కుడు నాని ఈ సినిమాని నిర్మించ‌డంతో.. ఈ చిత్రంపై ప్ర‌త్యేక ఆస‌క్తి ఏర్ప‌డింది. కాజ‌ల్‌, నిత్యా మీన‌న్‌, రెజీనా వంటి తార‌లు తోడ‌వ‌డంతో.. సినిమాపై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. దీనికి తోడు ఓ కొత్త ద‌ర్శ‌కుడు (ప్ర‌శాంత్ వ‌ర్మ‌) తెర‌కెక్కించిన సినిమా కావ‌డంతో ఈ చిత్రంపై మంచి బ‌జ్ వ‌చ్చింది. శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ సినిమాపై 'మ‌నం' అందిస్తున్న స‌మీక్ష మీ కోసం..

క‌థ‌
aweకాలి (కాజ‌ల్‌) ఒక కాఫీ షాప్‌లోకి అడుగుపెట్ట‌డంతో సినిమా మొద‌ల‌వుతుంది. ఆ రోజే ఆమె పుట్టిన రోజు కూడా.  అయితే, ఏదో తెలియ‌ని ఆందోళ‌న‌తో ఆమె ఉంటుంది. మ‌రో వైపు అదే కాఫీ షాప్‌లో త‌న త‌ల్లిదండ్రులుతో  ప్రేమ వ్య‌వ‌హారం చెప్పి.. త‌న ల‌వ‌ర్‌ను ప‌రిచ‌యం చేస్తుంది రాధ (ఈషా రెబ్బా) . అయితే.. ఆ ల‌వ‌ర్‌ను చూసి 'అ!' అని నోరు వెల్ల‌బెట్ట‌డం ఆమె త‌ల్లి (రోహిణి) వంతు అవుతుంది. ఆ ల‌వ‌ర్ ఎవ‌రంటే.. బ్రైన్ డాక్ట‌ర్ క్రిష్ అలియాస్ కృష్ణ వేణి (నిత్యా మీన‌న్‌). ఇక అదే షాప్‌లో వంట‌వాడి ఉద్యోగం కోసం వ‌స్తాడు నల (ప్రియ‌ద‌ర్శి). అత‌నికి జాబ్ ఇవ్వ‌డానికి చిత్ర (ప్ర‌గ‌తి) కొన్ని టెస్ట్‌లు పెడుతుంది.  నాని అనే చేప (దీనికి నాని వాయిస్ ఓవ‌ర్‌), చంటి అనే బోన్సాయ్ మొక్క (దీనికి ర‌వితేజ వాయిస్ ఓవ‌ర్‌) స‌హాయంతో ఆ టెస్ట్‌ల‌లో పాస్ అవుతూ వ‌స్తుంటాడు. ఇక అదే కాఫీ షాప్‌లోకి యోగి (ముర‌ళీ శ‌ర్మ‌) అనే మెజీషియ‌న్ వ‌స్తాడు. అయితే ఆ కాఫీ షాప్ ఓన‌ర్ కూతురు (చిన్న పాప‌) నీ కంటే గ్రేట్ మేజిష‌న్ ఉన్నారు అన‌డంతో.. అత‌ని ఇగో దెబ్బ‌తింటుంది. అత‌ను ఎవ‌రో తెలుసుకోవాల‌నే ప్రాసెస్‌లో.. విచిత్ర‌మైన ప‌రిస్థితుల్లో ఓ బాత్ రూమ్‌లో లాక్ అయిపోతాడు యోగి. ఇంకోవైపు సైంటిస్ట్ కావాల‌నుకునే శివ (అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌).. టైమ్ మిష‌న్ స‌హాయంతో త‌ను చిన్న‌ప్పుడు మిస్ అయిన త‌ల్లిదండ్రుల‌ను క‌లుసుకోవాల‌నుకుంటుంటాడు. వీల్ ఛైర్‌లో పార్వ‌తి (దేవ‌ద‌ర్శిని) అక్క‌డికి వ‌చ్చి.. 'నేను భ‌విష్య‌త్‌ను' అని చెబుతుంది. నేను చెప్పిన‌ట్టు చేస్తే.. మ‌న త‌ల్లిదండ్రుల‌ను కలుసుకోవ‌చ్చు అని చెబుతుంది. మ‌రో వైపు.. డ్ర‌గ్ అడిక్ట్ మీరా (రెజీనా) అదే కాపీ షాప్‌లో పనిచేస్తుంటుంది. త‌న ప్రియుడు చెప్పిన ప్లాన్‌కు స‌హ‌క‌రిస్తే.. వాళ్ల‌ లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఇలా.. ఐదు క‌థ‌లు ఒకే షాప్‌లో జ‌రిగిపోతుంటాయి. అయితే వీట‌న్నింటికి ఒక లింక్ ఉంటుంది. అదేమిట‌న్న‌దే 'అ!' సినిమా.

విశ్లేష‌ణ‌
ఓ కాఫీ షాప్‌.. ఐదు జోన‌ర్లు.. చిన్న చిత‌కా పాత్ర‌ల‌తో క‌లుపుకుని అటుఇటుగా 35 క్యారెక్ట‌ర్లు.. ఇది సింపుల్‌గా 'అ!' మూవీ గురించి చెప్పాలంటే.  ప‌తాక స‌న్నివేశానికి ముడిపెడుతూ.. నాలుగు జోన‌ర్ల‌తో సినిమా న‌డిపించాల‌నే ద‌ర్శ‌కుడి ఆలోచ‌న మెచ్చుకుతీరాల్సిందే. అయితే..కొత్త‌ద‌నం పేరుతో కొన్ని స‌న్నివేశాల‌కు నేల విడిచి సాము చేయ‌డం మాత్రం.. ప్రేక్ష‌కుల‌ను కొంత గొంద‌ర‌గోళానికి గురిచేస్తుంది. సినిమా మొత్తానికి.. కాజ‌ల్ పాత్ర‌నే కీల‌కం. ఆమె పాత్ర‌కి, మిగిలిన పాత్ర‌ల‌కి ఉన్న సంబంధం ఏమిట‌న్న‌ది?  తెర‌పైనే చూడాలి. 

న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే.. మ‌ల్టీపుల్ ప‌ర్స‌నాలిటీ డిజార్డ‌ర్ ఉన్న పాత్ర‌లో కాజ‌ల్ న‌ట‌న బాగుంది. ప‌తాక స‌న్నివేశాల్లో.. ఆమె క‌నిపించే విధానం ఆమె అభిమానుల‌ను అల‌రిస్తుంది.  నిత్యా మీన‌న్‌, ఈషా రెబ్బా, రెజీనా, అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌, ప్రియ‌ద‌ర్శి.. ఇలా అంద‌రూ త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. ఇప్ప‌టివ‌ర‌కు చూడ‌ని పాత్ర‌ల్లో క‌నిపించి అల‌రించారు. 
సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. మార్క్ కె.రాబిన్ అందించిన నేప‌థ్య సంగీతం, సాహి సురేష్ ఆర్ట్ వ‌ర్క్‌, కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని ఛాయాగ్ర‌హ‌ణం సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. మాట‌ల్లో 'దేవుడు సృష్టించింది పాపం ఎలా అవుతుంది', 'ఎముక‌లోని గుజ్జుని లాగిన‌ట్టు.. నీ బుర్ర‌లోని గుజ్జుని కూడా లాగేసిన‌ట్టుంది', 'క‌ళ్ళు మూసుకోవ‌డానికి క‌నీసం రెప్ప‌లు కూడా ఇవ్వ‌లేదు దేవుడు' అనే మాట‌లు బాగున్నాయి. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

ప్ల‌స్ పాయింట్స్‌
కొత్త త‌ర‌హా కాన్సెప్ట్‌
న‌టీన‌టులు
సాంకేతిక నిపుణులు
క్లైమాక్స్‌
సినిమా నిడివి

మైన‌స్ పాయింట్స్‌
స‌గటు ప్రేక్ష‌కుడు కోరుకునే ఎంట‌ర్‌టైన్‌మెంట్ లేక‌పోవ‌డం
కొత్త‌ద‌నం పేరిట నేల విడిచి సాము చేయ‌డం

చివ‌ర‌గా.. 'అ!' అనిపించే ప్ర‌య‌త్నం
రేటింగ్‌.. 2.75/5

‘మనసుకు నచ్చింది’ రివ్యూ కోసం క్లిక్ చేయండి'అ!'.. అనిపించే థీమ్ సాంగ్‌

Updated By ManamMon, 02/12/2018 - 18:16

aweస‌మ్‌థింగ్ స్పెష‌ల్ అనిపించే కాన్సెప్ట్‌తో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న చిత్రం 'అ!'. వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న నేచుర‌ల్ స్టార్ నాని ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడు కాగా.. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, నిత్యా మీన‌న్‌, ఈషా రెబ్బా, రెజీనా, ప్రియ‌ద‌ర్శి, అవ‌స‌రాల శ్రీ‌నివాస్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి మార్క్ కె.రాబిన్ సంగీత‌మందించారు. ఇదిలా ఉంటే.. ఈ రోజు (సోమ‌వారం) ఈ చిత్రం థీమ్ సాంగ్‌ను విడుద‌ల చేశారు.  ''విశ్వ‌మే దాగినా నాలోనా.. ఎప్పుడూ ఒంట‌రే నేనేనా.. '' అంటూ మొద‌ల‌య్యే ఈ థీమ్ సాంగ్‌లో ఒక్కో క్యారెక్ట‌ర్‌కు సంబంధించిన పాత్ర స్వ‌భావాన్ని రెండు వాక్యాల్లో చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. ''అంద‌నే అందదు ఒక్క అవ‌కాశం.. అందితే చేర‌నా నేను ఆకాశం'' వంటి వాక్యాలు బాగున్నాయి. ఈ నెల 16న ఈ సినిమా తెర‌పైకి రానుంది.

Related News