Amaravati

కుమారస్వామితో చంద్రబాబు భేటీ

Updated By ManamFri, 08/31/2018 - 10:31
kumaraswamy-chadrababu

అమరావతి : కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం భేటీ అయ్యారు. భేటీ అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ... కుమారస్వామితో మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిపారు. మళ్లీ భేటీ కావాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రాంతీయ పార్టీలు అన్ని ఏకతాటిపై రావాల్సిన అవసరం ఉందని, దక్షిణాదిలోని అన్నిపార్టీలు కలవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

కాగా అంతకు ముందు ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న కుమాస్వామికి మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, కలెక్టర్  లక్ష్మీకాంతం, మాజీ ఎంపి లగడపాటి, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తదితరులు స్వాగతం పలికారు. ముందుగా విజయవాడలోని గేట్ వే హోటల్‌లో బస చేసిన సీఎం కుమారస్వామి... అనంతరం చంద్రబాబును  కలిశారు.బీఎస్‌ఈలో అమరావతి బాండ్ల లిస్టింగ్‌

Updated By ManamMon, 08/27/2018 - 09:51

Chandrababuముంబై: రాజధాని నిర్మాణం కోసం సీఆర్‌డీఏ జారీ చేసిన అమరావతి బాండ్లను బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (బీఎస్‌ఈ)లో సోమవారం లిస్టింగ్ చేశారు. ఈ ఉదయం 9.15 గంటలకు గంట కొట్టి బాండ్ల లిస్టింగ్‌ను లాంఛనంగా ప్రారంభించారు సీఎం చంద్రబాబు. కాగా రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణకు సీఆర్‌డీఏ ఇటీవల ఎలక్ట్రానిక్‌ ప్లాట్‌ఫామ్‌పై బాండ్లను జారీ చేయగా కేవలం గంట వ్యవధిలోనే మదుపరుల నుంచి రూ.2 వేల కోట్లు సమకూరిన సంగతి తెలిసిందే. అవే బీఎస్‌ఈలో సోమవారం లిస్టింగ్‌ అయ్యాయి. ఈ కార్యక్రమంలో బీఎస్‌ఈ సీఈవో, ఎండీ ఆశిష్‌కుమార్‌, ఏపీ మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రముఖ పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు భేటీ కానున్నారు. వారిలో రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ, టీసీఎస్‌ సీఈవో చంద్రశేఖరన్‌, మంగళం బిర్లా సహా తదితరులు ఉన్నారు. వర్షాలు, వరద ఉధృతిపై చంద్రబాబు సమీక్ష

Updated By ManamTue, 08/21/2018 - 12:09
chandrababu niadu review meeting

అమరావతి :

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా  నల్లజర్ల మండలంలో ఎర్రకాల్వ ఉధృతిపై ఆయన ఈ సందర్భంగా ఆరా తీశారు. 5 నుంచి 6వేల క్యూసెక్కుల ప్రవాహం ఉందని అధికారులు తెలిపారు. అన్ని శాఖ అధికారులు సమన్వయంతో, కన్వెర్జన్సీ విధానంలో పని చేయాలని చంద్రబాబు సూచించారు. అలాగే  గ్రామదర్శిని,వివిధ శాఖల పురోగతి, తదితర అంశాలపై చర్చ జరిగింది.

కాగా అమరావతి సెక్రటేరియట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కృష్ణా జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి పాల్గొన్న జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఇంచార్జ్ కలెక్టర్ విజయ కృష్ణన్, విఎంసి కమిషనర్ జె. నివాస్,ఈఎస్ ఐటీ డైరెక్టర్ సుందర్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

మరోవైపు ఒడిశా తీరాన భువనేశ్వర్‌కు నైరుతి దిశగా బంగాళాఖాతంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. ఇది పశ్చిమ వాయవ్యందిశగా  పయనిస్తోంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తా ఆంధ్రాలో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.అమరావతిలో వర్షం.. అసెంబ్లీ, మంత్రుల చాంబర్లలోకి నీరు

Updated By ManamTue, 08/21/2018 - 10:39

Assemblyఅమరావతి: గత మూడు రోజులుగా ఏపీ రాజధాని అమరావతిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అమరావతి తడిసి ముద్దవ్వగా.. అక్కడ ఉన్న అసెంబ్లీతో పాటు సెక్రటేరియట్‌లోని మంత్రుల చాంబర్లలోకి నీరు వచ్చింది. భవనపు గోడలు లీక్ అవుతుండగా.. గోడల నుంచి నీరు ప్రవేశించింది. మంత్రి గంటా శ్రీనివాసరావు చాంబర్‌ను ఆనుకునే ఉండే వ్యక్తిగత గదిలో సీలింగ్ కున్న ధర్మాకోల్ షీట్లు ఊడిపడ్డాయి. మరో మంత్రి అమర్ నాథ్ కార్యాలయంలో కూడా పరిస్థితి ఇంతే. కాలువ శ్రీనివాసులు చాంబర్ లోనూ లీకేజీ కనిపించింది. ఇక కంప్యూటర్ ఆపరేటర్లు కూర్చునే గదిలోని సీలింగ్ నుంచి కూడా నీరు బయటకు వచ్చింది. వీటితో పాటు తొలి అంతస్తులోని రిపోర్టింగ్ రూమ్, లైబ్రరీ ప్రాంతాల్లోకి నీరు వచ్చి చేసింది. విషయాన్ని గుర్తించిన అధికారులు నీరు లీక్ అవుతున్న చోట అవసరమైన చర్యలు చేపట్టారు. అయితే గతేడాది కూడా కురిసిన భారీ వర్షాలకు అమరావతిలోని మంత్రులు, విపక్ష నేత వైఎస్ జగన్ కార్యాలయాల్లోకి నీరు ప్రవేశించిన విషయం తెలిసిందే.చంద్రబాబు రాష్ట్ర ద్రోహి: కన్నా లక్ష్మీనారాయణ

Updated By ManamWed, 08/15/2018 - 10:44

Kanna Lakshmi Narayana, Chandrababu Naiduహైదరాబాద్: చంద్రబాబుది ఎప్పుడూ రెండు కళ్ల సిద్ధాంతమే అంటూ ఏఫీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మరోసారి ఫైర్ అయ్యారు. బీజేపీతో ఉంటూనే, రాహుల్‌తో చంద్రబాబు సంప్రదించారని.. 2014లో కాంగ్రెస్సే ఏపీకి అన్యాయం చేసిందని చెప్పిన చంద్రబాబు, 2019 నాటికి కాంగ్రెస్‌నే మంచిదంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు రాష్ట్ర ద్రోహి అని, రాజధాని నిర్మాణం పేరుతో ఇటుకల కోసం తీసుకున్న డబ్బు ఏం చేశారంటూ ప్రశ్నించారు. ఇప్పుడు బాండ్ల ద్వారా సేకరించిన రూ.2వేల కోట్లను ఏం చేస్తారో చూడాలంటూ పేర్కొన్నారు. రాజధానికి కేంద్రం ఇచ్చిన నిధులతో ఒక్క దానికీ శంకుస్థాపన చేయలేదని, రాజధాని మాస్టర్ ప్లాన్ కూడా కేంద్రానికి ఇవ్వలేదని అన్నారు.హామీ ఇచ్చిన చంద్రబాబు లీకులిచ్చారు

Updated By ManamMon, 07/23/2018 - 08:55

pawan, babu అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై మరోసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటే రాజ్యసభ సీటు ఇస్తానని హామీ ఇచ్చిన బాబు, ఆ మరుసటి రోజే రెండు పేపర్లకు లీకులిచ్చి విషయాన్ని బయటకు పొక్కేలా చేశారని పవన్ అన్నారు. ఆ రోజే తనకు తెలుగుదేశం పార్టీపై, చంద్రబాబుపై నమ్మకం పోయిందని, ఆ తరువాతే తాను బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీని కలిశానని పవన్ చెప్పారు. 

అంతేకాకుండా అంతకు రెండేళ్ల ముందే చంద్రబాబును కలిసి రాజకీయ పార్టీ గురించి చర్చిస్తే, ఓట్లు చీలుతాయని ఆందోళనపడిన ఆయన, పోటీ వద్దని సూచించారని పేర్కొన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత లోకేశ్ ఒక్కరికే ఉద్యోగం వచ్చిందని వ్యాఖ్యానించిన పవన్, ఉపాధి చూపాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదా? అని ప్రశ్నించారు. లోకేష్ సీఎం అయితే తనకేమీ అభ్యంతరం లేదుగానీ, రాష్ట్రం ఏమవుతుందోనన్న భయం మాత్రం ఉందని పవన్ విమర్శలు గుప్పించారు. పుట్టుకతోనే ఎవరికీ రాజకీయ అనుభవం ఉండదని, తనకు రాజకీయ అనుభవం లేదని విమర్శిస్తున్న వారికి చురకలు అంటించారు. చంద్రబాబును కలిసిన శైలజానాథ్

Updated By ManamWed, 07/18/2018 - 12:20

sailajanath అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబునాయుడును మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శైలజానాథ్ కలిశారు. అమరావతికి, ముఖ్యమంత్రితో దాదాపు 10నిమిషాల పాటు సమావేశం అయ్యారు శైలజా నాథ్. అనంతరం శైలజానాథ్ మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యేల సమస్యలపై సీఎంను కలిశానని అన్నారు. అలాగే ఎన్టీఆర్ సేవా పథకంలో చికిత్స అందకపోవడంపై కూడా చంద్రబాబుకు వివరించానని తెలిపారు. వీటితో ఇరిగేషన్ అంశాలపైనా బాబుతో చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. కాగా.. ఈ భేటీలో రాజకీయ ప్రాధాన్యత ఏ మాత్రం లేదని, ఎప్పటికీ తాను కాంగ్రెస్ వాదినేనని శైలజానాథ్ చెప్పడం విశేషం.ఆ స్కాంలో బాబుకు ప్రమేయం ఉంది

Updated By ManamSat, 06/30/2018 - 08:49

pawan, babu అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. విశాఖపట్నంలో జరిగిన భూ కుంభకోణంలో చంద్రబాబు ప్రమేయం ఉందని, ఈ విషయం తనకు తెలుసని పవన్ ఆరోపించారు. అంతేకాదు ఈ కుంభకోణంలో పలువురు నేతలకూ భాగస్వామ్యం ఉన్నందునే, సిట్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం బయటపెట్టలేదని పవన్ వ్యాఖ్యానించారు.

ఒకవేళ అవినీతి లేకుంటే విశాఖ భూమి స్కామ్‌పై నివేదికను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం నేతలను చొక్కా పట్టుకొని నిలదీయకుంటే ప్రజలను బానిసలుగా చేస్తారని ఈ సందర్భంగా పవన్ అన్నారు. ఇక ఇటీవల వైరల్‌గా మారిన టీడీపీ ఎంపీల వీడియోపై స్పందించిన పవన్ ఆ పార్టీ ఎంపీలు ఎంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారో అర్థమౌతుందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ తధ్యమని పవన్ జోస్యం చెప్పారు.‘రాజధాని నిర్మించడమంటే పెద్ద సవాల్’

Updated By ManamTue, 04/10/2018 - 14:13

CM Chandrababu Inaugurates Happy Cities Summit 2018 At Amaravati

గుంటూరు: తొలిసారి ఆనందదాయక నగరాల సదస్సు నిర్వహించడం సంతోషకరమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మంగళగిరిలో ఆనంద నగరాల సదస్సులో సీఎం మాట్లాడుతూ.. ఫిన్లాండ్ లాంటి వరల్డ్ హ్యాపీయెస్ట్ కంట్రీ ఈ సదస్సులో పాల్గొనడం విశేషమన్నారు. దేశంలోనే తొలిసారి ఆనంద నగరాల గురించి ఇక్కడ చర్చ జరుగుతోందని సీఎం చెప్పారు. ఆనందంగా ఉండాలంటే కేవలం డబ్బులు ఖర్చు పెడితే సరిపోదన్నారు.

అమరావతి నిర్మాణంలో అత్యుత్తమ కన్సల్టెంట్లను నియమించాం. సింగపూర్ సంస్థలు అమరావతికి బృహత్తర ప్రణాళికలను అందించాయి. రాజధాని నిర్మించడమంటే పెద్ద సవాలు. ఒక్క పిలుపిస్తే.. రైతులు రాజధానికి విలువైన భూములిచ్చారు. భూమి లేకుండా రాజధాని నిర్మాణం ఊహించలేం. ఏపీని ఆనంద రాష్ట్రంగా తయారు చేస్తాం. అమరావతిని ‘బ్లూ అండ్ గ్రీన్’ సిటీగా తయారు చేస్తాం. సౌరశక్తి వినియోగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తాం. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు విధానాలను అన్వేషిస్తున్నామని... అందరూ విలువైన సూచనలు, సలహాలు అందించాలి. ఆదాయం, సంపద అన్ని సార్లూ సంతోషాన్ని ఇవ్వవన్నారు. నాలుగో విప్లపంగా ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ అవతరించింది. పారదర్శక పాలనా వ్యవస్థ నివాసయోగ్యమైన ఆవాసాలు కల్పించేలా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ప్రజల ఆనందకరమైన జీవనం కోసం ప్రపంచ దేశాలు ప్రణాళికలు రచిస్తున్నాయి" అని సీఎం స్పష్టం చేశారు.ఐదేళ్లలోనే బీజేపీ ప్రజలకు దూరం: యనమల

Updated By ManamThu, 03/22/2018 - 14:59

yanamalaఅమరావతి: బీజేపీ నుంచి రాష్ట్రానికి మున్ముందు మరిన్ని ఇబ్బందులు తలెత్తేలా ఉన్నాయని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ప్రస్తుతం పార్లమెంట్‌లో విభజన నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయని.. ఒకవేళ రాజ్యసభలో బీజేపీ మెజారిటీ ఉంటే ఇంకా ఎలా ప్రవర్తించేదో అంటూ అనుమానం వ్యక్తం చేశారు. ప్రజలకు దూరం కావడానికి కాంగ్రెస్‌కు దశాబ్దాలు పట్టిందని.. కానీ బీజేపీ ఐదేళ్లలోనే దూరం అయ్యేలా ఉందంటూ యనమల వ్యాఖ్యలు చేశారు. 
 

Related News