retirement

రిటైర్మెంట్ తీసుకోనున్న రామ్-లక్ష్మణ్

Updated By ManamWed, 09/12/2018 - 14:37

Ram- Lakshmanఎన్నో విజయవంతమైన చిత్రాలకు ఫైట్స్ అందించిన టాలీవుడ్ ఫైట్ మాష్టర్స్ రామ్- లక్ష్మణ్ త్వరలో రిటైర్మెంట్ తీసుకోనున్నారు. ఈ విషయాన్ని ఆ ఇద్దరు వెల్లడించారు. త్వరలో సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకొని, తమ గ్రామానికి వెళ్లి సాధారణ జీవితాన్ని గడపాలనుకుంటున్నామని రామ్- లక్ష్మణ్ తెలిపారు. 

కాగా 2001లో సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించిన రామ్- లక్ష్మణ్‌లు 1100పైగా సినిమాలకు ఫైట్స్ అందించారు. ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. పలు చిత్రాల్లో కూడా నటించారు. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’తో పాటు మహేశ్ బాబు ‘మహర్షి’, విజయ్ ‘సర్కార్’ చిత్రాలకు పనిచేస్తున్నారు. అలీబాబా సంచలన నిర్ణయం

Updated By ManamSat, 09/08/2018 - 13:35

Jack Maబీజింగ్: చైనా అత్యంత సంపన్నుడు, అలీబాబా సహ వ్యవస్థాపకుడు, చైర్మన్ జాక్ మా సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోమవారం జాక్ మా 54వ పుట్టినరోజు కాగా.. ఆ రోజున తాను రిటైర్‌మెంట్ తీసుకోనున్నట్లు ప్రకటించారు. విరమణ ముగింపు కాదని, మరో శకానికి ప్రారంభం అని తెలిపిన జాక్ మా.. తన తదుపరి సమయాన్ని ఫిలాంత్రఫీ కోసం కేటాయిస్తానని జాక్ మా వెల్లడించారు.

అయితే ఇంగ్లీష్ టీచర్ అయిన జాక్ మా.. 1999లో ఇ-కామర్స్ రంగంలోకి అడుగుపెట్టి అలీబాబా సంస్థను స్థాపించారు. తక్కువ కాలంలో ఈ సంస్థ వేగంగా అభివృద్ధి చెంది బిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించింది. ఆ తరువాత 2013లో సీఈవో పదవి నుంచి తప్పుకున్న జాక్ మా.. ఆ తరువాత నుంచి కంపెనీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ తనకు ఆదర్శమని, బిల్‌గేట్స్ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇంకా సంపన్నుడిగా ఎదగాలని కాదు. ముందుగానే రిటైర్ అవ్వాలని అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన జాక్ మా.. తాజాగా రిటైర్‌మెంట్ ప్రకటించి, అందరికీ షాక్ ఇచ్చాడు.క్రికెట్‌కు ఆర్పీ సింగ్ గుడ్‌బై

Updated By ManamWed, 09/05/2018 - 13:58
Ex-Indian pacer RP Singh bids adieu to cricket

న్యూఢిల్లీ : టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ రుద్ర ప్రతాప్ సింగ్ (ఆర్పీ సింగ్) రిటైర్‌మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు అతడు తన ట్విట్టర్‌ అకౌంట్‌లో అధికారికంగా (మంగళవారం) వెల్లడించాడు. ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఆర్పీ సింగ్ 2005లో జింబాబ్వేపై అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఇక 2016లో ఐపీఎల్ మ్యాచ్‌ తర్వాత నుంచి అతడు క్రికెట్‌కి దూరంగా ఉంటున్నాడు.

క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడం బాధాకరమే అని అయినా తప్పదని ఆర్పీ సింగ్ పేర్కొన్నాడు. సరిగ్గా ఇదే రోజు సెప్టెంబర్ 4, 2005లో తొలిసారి భారత జట్టు జెర్సీ ధరించా. క్రికెట్ నాకెన్నో మధుర జ్ఞాపకాలు ఇచ్చింది. మళ్లీ ఇదే రోజు క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నా అని తెలిపాడు. ఈ మేరకు తన క్రికెట్ ప్రయాణంలోని అనుభూతులను గుర్తు చేసుకున్నాడు. టీమిండియాకు 14 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించిన ఆర్పీ సింగ్ 3.98 సగటుతో 40 వికెట్లు తీశాడు. త‌ల్లి హోస్టెస్‌..కూతురు పైలెట్‌!

Updated By ManamWed, 08/01/2018 - 14:22
 air hostess

ముంబై : పూజా చిన్‌చంక‌ర్ ఉద్వేగంతో క‌న్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎయిరిండియాతో 38 ఏళ్ల అనుబంధం ఆమెది. ఎయిర్ హోస్టెస్‌గా ముంబై- బెంగ‌ళూరు ఫ్ల‌యిట్లో ఆమె చివ‌రి ప్ర‌యాణం. ఇంకా...ఆ ఫ్ల‌యిట్ పైలెట్ ఎవ‌రో కాదు. ఆమె కూతురు ఆశ్రిత‌నే.  రిటైర్మెంట్ రోజున ఆశ్రిత ఆ ఫ్ల‌యిట్‌ పైలెట్‌గా ఉండాల‌న్న‌ ఆమె కోరిక కూడా తీరడమే ఆమె ఉద్విగ్న‌త‌కు అస‌లైన కార‌ణం..!

బుధవారం విమానంలో ఆశ్రిత ఈ విష‌యం ప్ర‌క‌టించ‌గానే సిబ్బందితోపాటు అందులోని ప్ర‌యాణికులు త‌ల్లి, కూతురుకు శుభాకాంక్ష‌లు తెలిపారు. కొందరు ప్రేమ‌గా హ‌త్తుకున్నారు. ఆశ్రిత త‌న ట్విట‌ర్ అకౌంట్‌లో ఉంచిన ఈ పోస్టింగ్‌కు విప‌రీత‌మైన స్పంద‌న ల‌భించింది. త‌ల్లి ఆశ‌య సాధ‌న కోసం ప‌నిచేసే అవ‌కాశం వ‌చ్చిందంటూ అంద‌రూ ఆశ్రితకు అభినంద‌న‌లు తెలిపారు. త‌ల్లి, కూతురు ఒకే ఫ్ల‌యిట్‌లో ఉండ‌టం కాక‌తాళీయంగానే జ‌రిగింద‌ని ఎయిరిండియా ప్ర‌క‌టించింది. పూజా అందించిన సేవ‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపింది.క్రికెట్‌కు మిస్టర్ కూల్ గుడ్‌బై?

Updated By ManamWed, 07/18/2018 - 15:22
  • ఇంగ్లాండ్ వన్డేలో సూచన

MS dhoni

న్యూఢిల్లీ: పరిమిత ఓవర్ల క్రికెట్‌కు మహేంద్ర సింగ్ ధోనీ గుడ్‌బై చెప్పనున్నారంటూ తాజాగా మరోసారి ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేనే మిస్టర్ కూల్ చివరి మ్యాచంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ధోనీ రిటైర్మెంట్‌పై ఊహాగానాలకు, పుకార్లకు కొదవేంలేదు.

ఇప్పటికి చాలాసార్లు ఇలాగే ప్రచారం జరిగినా, ఇప్పుడు మాత్రం నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు. ఇంగ్లాండ్ టూర్‌లో వన్డే సిరీస్‌ను భారత్ కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇందులో భారత ఆటగాళ్ల ప్రదర్శన అభిమానులను నిరశపరిచింది. 

ముఖ్యంగా మూడో వన్డేలో ధోనీ ఆటపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. అభిమానులతో పాటు గవాస్కర్ వంటి మాజీ ఆటగాళ్లు ధోనీ ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ధోనీని జట్టులో కొనసాగించడాన్నీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మూడో వన్డేలో పరుగులు చేయడంలో మిడిలార్డర్ మరోసారి విఫలం కాగా.. వికెట్లు తీయలేక బౌలర్లు చేతులెత్తేశారు. ధోనీ క్రీజులో నిలబడినా దూకుడుగా ఆడలేకపోయాడు.

పరుగులు తీయడానికి ఇబ్బంది పడ్డాడు. వేగంగా పరుగులు రాబట్టాల్సిన పరిస్థితుల్లో మందకొండిగా ఆడాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత డ్రెస్సింగ్ రూంకు వెళ్తున్న సమయంలో ధోనీ అంపైర్ల దగ్గర్నుంచి బంతిని అడిగి తీసుకున్నాడు. దీంతో ధోనీ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నారంటూ రూమర్లు ప్రారంభమయ్యాయి.

సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. క్రికెట్‌లో చివరి మ్యాచ్ ఆడుతున్న ఆటగాళ్లు బంతినో వికెట్‌నో గుర్తుగా దాచుకోవడం సాధారణమే. గతంలో ధోనీ కూడా ఇలాగే ప్రవర్తించాడు. టెస్టుల నుంచి రిటైరయ్యే సమయంలో.. 2014లో ఆస్ట్రేలియాపై చివరి టెస్ట్ మ్యాచ్ ముగిశాక ధోనీ స్టంప్లను తనతో తీసుకెళ్లాడు. ఆ తర్వాత టెస్ట్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

తాజాగా ఇంగ్లాండ్ వన్డేలో బంతిని తీసుకెళ్లడంతో త్వరలో ధోనీ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నారంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో ఇంగ్లాండ్ మూడో వన్డే మ్యాచ్ ముగిశాక ధోనీ అంపైర్ దగ్గర్నుంచి బంతిని అడిగి తీసుకుంటున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.పశ్చాత్తాపం లేదు...

Updated By ManamSat, 06/23/2018 - 12:45
  •     మూసిన తలుపుల వెనక ఎవరన్నది ముఖ్యం

  •     జస్టిస్ రంజన్‌గొగోయ్‌ని సీజేఐ చేయాలి

  •     పదవీ విరమణ అనంతరం జస్టిస్ చలవేుశ్వర్

న్యూఢిల్లీ, : సంప్రదాయాన్ని ధిక్కరిస్తూ సుప్రీంకోర్టు చరిత్రలోనే తొలిసారిగా మరికొందరు న్యాయమూర్తులతో కలిసి బహిరంగంగా మీడియాకు ఎక్కడంపై తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని జస్టిస్ జాస్తి చలవేుశ్వర్ అన్నారు. శుక్రవారం సుప్రీంకోర్టు న్యాయుమూర్తిగా పదవీవిరమణ చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. కమ్యూనిస్టు నాయకుడు డి. రాజాను కలిసినట్లు వచ్చిన వార్తలపై కూడా ఆయన స్పందించారు. తాను ఎవరిని కలిశానన్నది పెద్ద ముఖ్యైమెన విషయం కాదని, తాము దేశాన్ని పాలించడం లేదని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నవాళ్లెవరు, లేదా.. మూసిన తలుపుల వెనక ఉండి దేశాన్ని నడిపిస్తున్నది ఎవరన్న విషయాలు ముఖ్యమని చెప్పారు. 

 Jasti Chelameswar

రాజకీయ నాయుకులు, సుప్రీంకోర్టు న్యాయుమూర్తుల మధ్య సంబంధాలున్నాయని తాను చేసిన ఆరోపణలను ఆయన సమర్థించుకున్నారు. ఇక వైద్య కళాశాల ప్రవేశాల కేసు విషయంలో.. ఏడుగురు జడ్జీల ధర్మాసనం ఏర్పాటు చేయగా అందులో తన ఉత్తర్వులను రద్దు చేయడానికి కేవలం ఐదుగురే ధర్మాసనంలో కూర్చోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. జడ్జి లోయా మృతి లేదా ఎంసీఐ స్కాం లాంటి ఒక్కో అంశం మాత్రమే కాదని.. న్యాయవ్యవస్థను వ్యవస్థాగతమైన అంశాలు దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా మీద వ్యాఖ్యలు చేయడానికి ఆయన నిరాకరించారు. అయితే, తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా మాత్రం జస్టిస్ రంజన్ గొగోయ్‌ని నియమించాలని, అందుకు ఆయనకు అన్ని అర్హతలూ ఉన్నాయని అన్నారు. అలాగే ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్ పేరును కేంద్రానికి తప్పనిసరిగా మళ్లీ పంపాలన్నారు. డివిలియర్స్ రిటైర్మెంట్‌పై అనుష్క స్పందన

Updated By ManamThu, 05/24/2018 - 12:14

Anushka  దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు బుధవారం రిటైర్మెంట్‌ ప్రకటించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా క్రికెటర్లతో పాటు ఆయన అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఈ నేపథ్యంలో డివిలియర్స్ రిటైర్మెంట్‌పై టీమిండియా కెప్టెన్ కోహ్లీ భార్య, సినీ నటి అనుష్క శర్మ స్పందించారు.

‘‘జీవితంలో మన కోసం చేసే మంచి పనుల కంటే ఇతరులను ప్రభావితం చేసేలా పని చేయడం గొప్ప విషయం. నువ్వు రెండింటిని అద్భుతంగా నిర్వర్తించావు. నువ్వు, డేనియల్ ఎప్పుడూ సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నా’’ అంటూ అనుష్క ట్వీట్ చేసింది. అయితే ఐపీఎల్‌లో‌ 2008-10 మధ్య దిల్లీ డేర్‌డెవిల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన డివిలియన్స్ 2011 నుంచి రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే.
 

 


 టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సౌతాఫ్రికా క్రికెటర్ డుమ్నీ

Updated By ManamSat, 09/16/2017 - 17:35

దక్షిణాఫ్రికా క్రికెటర్ జెపి డుమ్నీ సంచలన ప్రకటన చేశాడు. టెస్ట్ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించి అందరినీ విస్మయానికి గురిచేశాడు. ఇక నుంచి తాను పూర్తిగా వన్డే, టీ20 ఫార్మాట్లపై దృష్టి సారించనున్నట్లు డుమ్నీ తెలిపాడు. తన దేశం తరపున 46 టెస్ట్ మ్యాచ్‌లలో ఆడటం సంతృప్తినిచ్చిందని డుమ్నీ చెప్పాడు. గత 16సంవత్సరాలుగా తన దేశం తరపున ఆడటం గర్వంగా ఉందన్నాడు. టెస్ట్ క్రికెట్ ఫార్మాట్‌లో ఆడటం వల్ల తానెంతో నేర్చుకున్నానని చెప్పాడు. 

Related News