jogu ramanna

చట్ట సభల్లో రిజర్వేషన్లు పెట్టిన ఘనత కేసీఆర్‌దే

Updated By ManamFri, 09/28/2018 - 00:53
 • కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలకు పాటుపడాలి: జోగురామన్న 

joguహైదరాబాద్: రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా చట్టసభల్లో రిజర్వేషన్లు ఉండాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన ఘనత  టిఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న పేర్కొన్నారు. గురువారం రవీంద్రభారతిలో ఆచార్య కొండా లక్ష్మన్ బాపూజీ 103వ జయంతి వేడుకలు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఆదిలాబాద్ జిల్లాలో పుట్టిన బాపూజీ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామని, రానున్న ఎన్నికల్లో ప్రజల ఆశ్వీరాదం ఉంటే మళ్లీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం వస్తుందన్నారు. బీసీ రిజర్వేషన్లతో పాటు మిహ ళాలకు రిజర్వేషన్లు పెట్టి బీసీ విద్యార్దులకు ప్రత్యేకంగా రెసిడె న్షియల్ స్కూల్  ఏర్పాటు, దేశంలో కార్పొరేట్‌కు దీటుగా విద్యనందించామని, విదేశీ విద్యపథకం ద్వారా 500 మంది విద్యార్దులను విదేశాలకు పంపామన్నారు. హాస్టల్‌ల్లో ఉచితంగా సన్నబియ్యం,ఉపకార వేతనాలు అందిస్తున్నాం, కుల వత్తులను కాపాడాలని యువతకు రుణాలు మంజూరు చేస్తామని వివరించారు. రజకులకు, నాయి బ్రాహ్మణు లకు రూ. 250 కోట్లు, గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ, బెస్త కులస్తులకు చేపల పంపిణీ చేశామని, బిసికులాలకు  రూ.63కోట్లతో 63 ఎకరాల్లో ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. అనంతరం మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ప్రసంగిస్తూ  కొండా లక్ష్మన్ బాపూజీ జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించడం ఎంతో గొప్పవిషమని, ఆయన మచ్చలేని రాజకీయనాయకుడు తెలంగాణ కోసం 1967లో కాంగ్రెస్ పార్టీకి, మంత్రి పదవికి రాజీనామా  చేసిన ఏకైక మంత్రిగా చరిత్రలో నిలిచిపో యారని, రజాకార్ల పోరాటంలో ముందుండి పోరాటం చేసిన మహానీయుడు, రెండుసార్లు సిఎం అయ్యే అవకాశం వచ్చిన కాలేకపోయారని, సామాజిక తెలంగాణ కోసం పనిచేయాలని సిఎం పదవి వదులుకున్నారని పేర్కొన్నారు.

ట్యాంక్‌బండ్‌పై వచ్చే సంవత్సరం బాపూజీ విగ్రహం పెట్టాలని కోరారు.అదే విధంగా మహిళ కమిషన్ చైర్మన్ గుండు సుధారాణి మాట్లాడుతూ  బడుగు, బలహీనవర్గాల కోసం రాజీనామా చేసి మళ్లీ రాజకీయాల్లోకి రాకుండా ఉన్న మొదటి వ్యక్తి బాపూజీనేనని, కొండా లక్ష్మన్ బాపూజీ ఆశయాలకు అనుగుణంగా సిఎం అన్ని వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని వెల్లడించారు. బాపూజీ లాంటి వ్యక్తులను మనమంతా ఎప్పుడు స్మరించుకోవాలని పార్లమెంటు సభ్యులు బి.బి.పాటిల్ అన్నారు. ఈసందర్భంగా ఎంబిసి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ ప్రసంగిస్తూ  లక్ష్మన్ బాపూజీ ఆశయాలకు అనుగుణంగా నేటి యువత నడవాలని, 2009 ప్రకటన వచ్చినప్పుడు ఆయన ఎంతో సంతోషిం చారని, వెంటనే వాపసు తీసుకోవడంతో ఎంతో బాధప డ్డారని అన్నారు. కేసీఆర్ బిసిలకు పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. నగరంలో బాపూ జీ విగ్రహం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం  సాను కూలంగా ఉందన్నారు. బిసిల కోసం రూ.6 వేల కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టారని, దీనిపై బిసి సంఘాల నాయ కులు విమర్శలు చేయడం సరికాద న్నారు. ఆత్మగౌరవ భవనాలు ఏర్పాటు చేసింది టిఆ ర్‌ఎస్ ప్రభుత్వ మేనన్నారు.ఇలాంటి ప్రభుత్వం ఇప్పటి వరకు చూడ లేదని, పేదల కోసం తపించే కేసీఆర్ లాం టి నాయకులను ఇప్పటివరకు చూడలేదని, వచ్చే ఎన్ని కల్లో టిఆర్ ఎస్‌ని  గెలిపించాలన్నారు.

బాపూజీ జీవితం అందరికీ ఆదర్శం
స్వాతంత్య్ర ఉద్యమం కాలం నుండి స్వరాష్ట్ర సాధన వరకు అలుపెరుగని పోరాటం చేసిన తెలంగాణ ఉద్యమకారుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకమని  నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. గురువారం కొండా లక్ష్మణ్ బాపూజీ 103వ జయంతిని పురస్కరించుకుని నిజామాబాదులో బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి కవిత నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  ఆంధ్ర పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన బాపూజీ టీఆర్‌ఎస్ పార్టీ ఆఫీసుకు తన ఇంటిని ఇచ్చి ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచారని కొనియాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం బాపూజీ జయంతిని అధికారికంగా నిర్వహిస్తూ ఆయన సేవలను భావి తరాలకు తెలియజేసేలా కార్యక్రమాలను నిర్వహిస్తోందని చెప్పారు. హార్టికల్చర్ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో, క్విట్ ఇండియా ఉద్యమంలో బాపూజీ పాల్గొన్నారని కవిత గుర్తు చేసుకున్నారు. గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడైన బాపూజీ.. తన జీవితాన్నంతా తెలంగాణ కోసమే అంకితం చేశారని కవిత కొనియాడారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, మేయర్ ఆకుల సుజాత, పలువురు కార్పొరేటర్లు, స్థానిక పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు.పంద్రాగస్టు నుంచి బీసీ రుణాలు

Updated By ManamTue, 08/14/2018 - 01:57
 • ఒక్కో జిల్లాలో వందమందికి అందజేత

 • ఇకపై నిరంతరం సబ్సిడీ రుణాల పంపిణీ

 • కలెక్టర్లతో మంత్రి జోగు రామన్న కాన్ఫరెన్స్

 • సంక్షేమ అధికారుల ఖాతాల్లో రూ.750 కోట్లు

 • మొత్తం రూ.2 వేల కోట్ల రుణ ప్రణాళిక

imageహైదరాబాద్: పంద్రాగస్టు నుంచి బీసీ, ఎంబీసీ కార్పొరేషన్లు, వివిధ కులాల ఫెడరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాల పంపిణీకి సర్వం సిద్ధం చేసినట్లు బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగు రామన్న వెల్లడించారు. సోమవారం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే జోషి, బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, 31 జిల్లాల కలెక్టర్లతో ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రం నుంచి మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పంద్రాగస్టు రోజున అన్ని జిల్లా కేంద్రాల్లో వంద మంది చొప్పున లబ్ధిదారులకు రూ.50 వేల చెక్కులను పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. 15నుంచి రుణాల పంపిణీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు దాదాపు రూ.2 వేల కోట్ల రుణాల పంపిణీకి ప్రణాళికను రూపొందించామని చెప్పారు.

తక్షణ సాయం కింద రూ.725 కోట్లు విడుదల చేసి జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారుల ఖాతాల్లో జమా చేశామని వివరించారు. సబ్సిడీ రుణాల కోసం దళారులను నమ్మి మోసపోవద్దని, పూర్తి పారదర్శంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. కలెక్టర్ చైర్మన్‌గా, జాయింట్ కలెక్టర్, డీఆర్డీవో పీడీ సభ్యులుగా, బీసీ సంక్షేమాధికారి కన్వీనర్‌గా ఉండే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపడుతుందని తెలిపారు. అత్యంత పేద వర్గాలకు, చిరు వ్యాపారులకు ఆర్థికంగా సాంత్వన కల్పించేందుకు సీఎం కేసీఆర్ ఆలోచనను అమలు చేస్తున్నామన్నారు. సబ్సిడీ రుణాల పంపిణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆయన కలెక్టర్లను కోరారు. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి సైదా, బీసీ కార్పొరేషన్ ఎండీ అలోక్ కుమార్, రజక, నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్ల ఎండీ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.జన్యు పరిశోధనలకు హైదరాబాద్ అనుకూలం

Updated By ManamMon, 08/13/2018 - 05:32
 • కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్థన్

 • 260 మూషిక జింకల పునరుత్పత్తి 

 • వన్య ప్రాణుల జన్యు వనరుల బ్యాంక్ ప్రారంభం

 • హజరైన రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న

imageహైదరాబాద్:  వన్య ప్రాణుల జన్యువనరులకు వాటి పరిశోధనలకు హైదరాబాద్ అనుకూలంగా ఉందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్థన్ తెలిపారు. ఆదివారం సీసీయంబీ లాక్సోన్ పరిశోధన కేంద్రను సందర్శించారు. అంతరించిపోతున్న వన్యజీవి మూషిక జింకను పునరుత్పత్తి చేసీ వాటిని అడవిలోకి పంపించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్రం మంత్రి హర్షవర్థన్ హాజరైనారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ.. నగరంలోని లాకోన్స్ పరిశోధన కేంద్ర చాలా భాగుందని, ఇక్కడ అంతర్జాతీయ స్థాయి వనరులు ఉన్నాయన్నారు. అంతర్జాతీయ  స్థాయికి కావలసినా అన్ని పరికరాలను అమార్చి అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. వన్య ప్రాణుల జన్యు వనరుల బ్యాంక్‌ను పారంభించడం సంతోషంగా ఉందన్నారు.

అంతరించిపోతున్న జీవులలో మూషిక జింకలు ఒక్కటనీ, శాస్త్రవేత్తలు చిత్తశుద్దితో పని చేసీ 7 సంవత్సరాలలోనే ఆరు మూషిక జింకల సంతతిని 260 జింకలను పునరుత్పత్తి చేయడం గొప్ప విషయమన్నారు. శాస్త్రవేత్తల కృషికి అద్భుత ఫలితాలు వచ్చాయని వారిని అభినందించారు. అంతరించి పోతున్న వన్యజీవులను కాపాడవలసినా బాధ్యత అందరి మీద ఉందని, పరిశోధనకు కేంద్ర ప్రభుత్వం నుంచి అన్నివిధాల సహకారం ఉంటుందని తెలిపారు. అనంతరం నెహ్రూ జూ పార్క్‌ను రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్నతో కలిసి సందర్శించారు. జూ పార్క్‌లో ఉన్నా మూషిక జింకలను ఆమ్రాబాద్ అరణ్యానికి ప్రత్యేక వాహనంలో తరలించడానికి  మంత్రి జోగు రామన్నతో కలిసి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జూ పార్క్‌లో అరుదైన నల్ల హంసల ఎంక్లోసెర్‌ను ప్రారంభించిన మంత్రులు హరితహారంలో భాగంగా మొక్కలను నాటారు.మంత్రి జోగు రామన్నకు తప్పిన ప్రమాదం

Updated By ManamMon, 07/30/2018 - 13:29
jogu ramanna

ఆదిలాబాద్ : మంచిర్యాలలో తెలంగాణ అటవీశాఖ మంత్రి జోగు రామన్నకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన సోమవారం అగస్త్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజీ  ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్లారు. ఆస్పత్రిని ప్రారంభించి లిఫ్ట్‌లో పైకి వెళుతున్న సమయంలో... ఓవర్ లోడ్ కావడంతో ఒక్కసారిగా లిఫ్ట్ వైరు తెగి మూడో ఫ్లోర్ నుంచి కిందకు జారింది. అయితే లిఫ్ట్ బలంగా గ్రౌండ్ ఫ్లోరును తాకకపోవడంతో వీరంతా సురక్షితంగా బయటపడ్డారు. దీంతో  అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఓవర్ లోడ్ కారణంగానే లిఫ్ట్ కేబుల్ వైర్ తెగిందని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి.ఎలుకపై పరిశోధనకు పీహెచ్‌డీ

Updated By ManamSat, 07/14/2018 - 02:44
 • జంతుశాస్త్రంలో పీహెచ్‌డీ..

 • గిరిజన యువకుడికి మంత్రి సత్కారం 

joguహైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గిరిజనగూడెనికి చెందిన గిరిజన విద్యార్థి మెస్రం నాగేశ్వర్ జంతుశాస్త్రంలో పీహెచ్‌డీ పట్టాను సాధించారు. ఆదిలాబాద్ నియోజకవర్గం బేల మండలంలోని సోన్‌కాస్ గిరిజన ప్రాంతానికి చెందిన జనార్ధన్, శాంతాబాయిలు వ్యవసాయ కూలీలకు మెస్రం నాగేశ్వర్ జన్మించారు. నాగేశ్వర్ ఉస్మానియా యూనివర్సిటీలో జంతుశాస్త్రంలోని న్యూరో బయోలాజీ విభాగంలో పీహెచ్‌డీని పూర్తి చేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ, అటవీశాఖ మంత్రి జోగు రామన్న శుక్రవారం సచివాలయంలోని తన ఛాంబర్‌లో నాగేశ్వర్‌ను ఘనంగా సన్మానించారు. జీవితంలో మరిన్ని శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

ఎలుకపై ప్రయోగ పత్రాలను కూడా సమర్పించారు. ఎలుకకు ఫ్లోరోసిస్‌ను వ్యాపింపజేసి.. వనమూలికలతో తయారు చేసిన లేహ్యం కొర్సిటిన్ అనే మందుతో ఫ్లొరోసిస్ వ్యాధిని నయం చేసిన ఘనత మెస్రం నాగేశ్వర్ సాధించారు. నాగేశ్వర్ పదో తరగతి నుంచి ఎంఎస్సీ వరకు ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే విద్యను కొనసాగించారు. సన్మానించిన వారిలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు పైడిపల్లి రవీందర్‌రావు, జుట్టు అశోక్, విద్యార్థి జేఏసీ నాయకుడు రుయ్యాడి దత్తాద్రి, నాయకులు గెడాం ప్రవీణ్, గెడాం విలాస్, కలీం తదితరులు ఉన్నారు.మాయల ఫకీరు మాటలొద్దు

Updated By ManamThu, 07/12/2018 - 00:19
 • మునిగిపోయే పడవ బీజేపీదే

 • మళ్లీ టీఆర్‌ఎస్‌దే అధికారం.. లేదంటే రాజకీయ సన్యాసం చేస్తా

 • అధికారం మాకొస్తే మీరు చేస్తారా?.. బీజేపీ నేత లక్ష్మణ్‌కు మంత్రి జోగు సవాల్

jogu ramannaహైదరాబాద్: బీజేపీ నాయకుల మాటలు మాయల ఫకీరును తలపించేవిగా ఉన్నాయని బీసీ సంక్షేమం, అటవీ శాఖల మంత్రి జోగు రామన్న విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం సచివాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా క్షేత్రంలో బీజేపీకి పరాభవం తప్పదని ఆయన పేర్కొన్నారు. మునిగిపోయే పడవ బీజేపీదేనని, ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తెలంగాణ ప్రజలు సహించరని జోగు హెచ్చరించారు. బీజేపీని బండకేసీ ఉతకడం ఖాయమన్నారు. మతి భ్రమించిన బీజేపీ నేతలు పగటి కలలు కంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని మంత్రి జోగు రామన్న స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి రాకుంటే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఆయన విస్పష్టంగా ప్రకటించారు. టీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటారా? అని ఆయన బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌కు సవాల్ విసిరారు. అవినీతిని పెంచి పోషిస్తున్న బీజేపీ పాలనను ప్రజలు గమనిస్తున్నారని, అవినీతికి కేరాఫ్ అడ్రస్ బీజేపీయేనని ఆయన అన్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో వేలాది కోట్ల రూపాయలు ప్రజా ధనాన్ని మింగేసీన నీరబ్ మోడీ, విజయ్ మాల్యా వంటి ప్రముఖులు దర్జాగా విదేశాల్లో తిరుగుతున్నా.. వారిని పట్టుకునే ప్రయత్నమే చేయని బీజేపీ పెద్దలు తమను విమర్శిస్తారా అని ఆయన నిలదీశారు. విదేశాల్లోని నల్లధనాన్ని వెలికితీస్తానన్న బీజేపీ నాయకులు నాలుగేళ్లు దాటినా దాని ఊసే ఎత్తడం లేదని ఆయన ఆరోపించారు. నల్లధనం వెనక్కి తెస్తానన్న బీజేపీ నాయకులు.. బ్యాంకుల్లో ఉన్న ప్రజల ధనాన్ని ఊడ్చుకుపోయారని మంత్రి జోగు రామన్న ఆరోపించారు. నోట్ల రద్దు పేరుతో సామాన్య ప్రజలను పిచ్చోళ్లుగా మార్చారని ఆయన విమర్శించారు. జన్ధన్ పేరిట బ్యాంక్ అకౌంట్లు తెరిపించిన బీజేపీ నాయకులు.. ఆ అకౌంట్ నుంచి ఒక్క రూపాయి తీసుకునే పరిస్థితి లేకుండా మహిళలను మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు. బీజేపీ నాయకుడు లక్ష్మణ్ పగటి కలలు కనడం మానేసి, వాస్తవ పరిస్థితుల్లో జీవించాలని ఆయన సూచించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను బీజేపీ పాలిత రాష్ట్రాలు, కేంద్ర మంత్రులు అభినందిస్తున్న విషయాన్ని గమనించాలని మంత్రి జోగు రామన్న హితవు పలికారు.కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో ప్రమాదం

Updated By ManamSat, 02/17/2018 - 12:25

Fireమంచిర్యాల: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో విషాదం జరిగింది. మంత్రి జోగురామన్న సమక్షంలో మంచిర్యాల జిల్లాలో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు జరుగుతుండగా.. అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో టెంటుకు మంటలు అంటుకోగా మంత్రి జోగు రామన్న క్షేమంగా భయటపడ్డాడు. అయితే ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు.

jogu ramanna

 తెలంగాణకు అరుదైన గౌరవం

Updated By ManamThu, 11/16/2017 - 18:26
ktr

తెలంగాణ ప్రభుత్వానికి అరుదైన గౌరవం దక్కింది. ఇండియాటుడే ఆధ్వర్యంలో స్టేట్ ఆఫ్ ది స్టేట్స్-2017 కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణకు రెండు అవార్డులు వచ్చాయి. ఆర్థిక వ్యవస్థ పురోగతి, పర్యావరణ, స్వచ్ఛత విభాగాల్లో తెలంగాణకు అవార్డులు లభించాయి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా మంత్రులు కేటీఆర్, జోగురామన్న అవార్డులను అందుకున్నారు.

jogu ramanna

 

Related News