pm narendra modi

మోదీ ప్రసంగిస్తుంటే.. గుర్రుబెట్టి నిద్రించిన ఎంపీ..

Updated By ManamMon, 09/24/2018 - 17:35

PM Narendra modi, BJP MP, Ayushman Bharat scheme, Koderma Ravindra Raiరాంచీ: జార్ఖండ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ‘ఆయుష్మాన్ భారత్’ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మోదీ ఒకవైపు.. ఆయుష్మాన్ భారత్ పథకానికి సంబంధించి ప్రసంగిస్తుంటే.. మరోవైపు వేదికపై కూర్చొన్న బీజేపీ ఎంపీ గుర్రు బెట్టి మరి నిద్రపోయారు. ప్రతిష్ఠాత్మకంగా మోదీ చేపట్టిన ఆయుష్మాన్ భారత్ పథకం ప్రారంభ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ రవీంద్ర రాయ్ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మోదీ పథకాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తుండగా.. ఎంపీ రవీంద్ర రాయ్ నిద్రపోయారు. వేదికపై కూర్చొన్న ఎంపీ రాయ్ నిద్రపోతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. బాధ్యతారహితంగా ప్రవర్తించారంటూ ఎంపీ రాయ్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. మోదీ ప్రసంగాన్నే ఎంపీలు వినకపోతే.. ఇక ప్రజలకు పథకం గురించి ఏం చెబుతారని విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు ఎంపీ వేదికపై నిద్రపోవడంపై విపక్షాలు కూడా చురకలంటించాయి. దేశంలోని పేద కుటుంబాలకు ‘ఆయుష్మాన్ భారత్’ పథకం కింద ఆరోగ్య బీమా కల్పించే దిశగా కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.



చంద్రబాబుపై కన్నా ధ్వజం..

Updated By ManamFri, 09/21/2018 - 18:13

Kanna laxminaraya, Chandrbabu nidu, AP CM, PM Narendra modiఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇద్దరు దొంగల్లో చంద్రబాబు మంచిదొంగ అని ఏపీ ప్రజలు ఓటేస్తే... ఇప్పుడు చంద్రబాబు గజదొంగ అయ్యారని కన్నా విమర్శించరు. ప్రధాని నరేంద్ర మోదీని చూసి చంద్రబాబు భయపడుతున్నారని అన్నారు.

ధర్మాబాద్‌ కోర్టు నోటీసులపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు 35 సార్లు కోర్టు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన హాజరు కాలేదని ఆరోపించారు. కోర్టును ప్రధాని ప్రభావితం చేశారని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కోర్టులను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని కన్న దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రచార ఆర్భాటం వల్లే పుష్కరాల్లో 29 మంది వరకు మృతిచెందారని విమర్శించారు. 



ఇది మాటలకందని ప్రమాదం..

Updated By ManamTue, 09/11/2018 - 18:32

PM Narendra modi, Kondagattu, Bus accident, shocking beyond words న్యూఢిల్లీ: తెలంగాణలో జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద మంగళవారం జరిగిన బస్సు ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఇంత భారీ సంఖ్యలో ప్రజలు చనిపోవడం తననెంతో బాధ కలిగిస్తోందని అన్నారు. ఇది మాటలకందని ప్రమాదమని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ దుర్ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. ఆర్టీసీ చరిత్రలోనే పెద్దప్రమాదమైన ఈ ఘటనపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాల్సిందిగా డిమాండ్ చేశారు. 

ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ రవాణా శాఖ మంత్రి, టీఎస్ఆర్టీసీ అధికారులను వెంటనే తొలగించాల్సిందిగా డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా, తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి ఆర్టీసీ తరపున 3 లక్షల ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించినట్టు మంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాల బస్సు డిపో హనుమంతురావును సస్పెండ్ వేటు పడింది. కాగా, కొండగట్టు ఘాట్ రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సు బోల్తాపడిన ఘటనలో 50మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. 



తెలంగాణ కొత్త జోనల్‌కు కేంద్రం ఆమోదం

Updated By ManamThu, 08/30/2018 - 15:52
  • ఆమోదం తెలిపిన రాష్ట్రపతి రామ్‌నాద్ కోవింద్ 

  • గెజిట్ విడుదల చేసిన కేంద్ర హోం శాఖ

  • రాష్ట్రంలో ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లు 

Telangana New zonal, Central govt, CM Kcr, President, PM Narendra modi, Multi zonesన్యూఢిల్లీ: తెలంగాణ కొత్త జోన్ల ఏర్పాటుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఈ మేరకు కేంద్రం తాజాగా గురువారం గెజిట్‌ విడుదల చేసింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతకం అనంతరం 7 జోన్లు, 2 మల్టీ జోన్లకు కేంద్ర హోంశాఖ గెజిట్‌ను విడుదల చేసింది. కేంద్రం తాజా ప్రకటన నేపథ్యంలో త్వరలోనే కొత్త జోనల్ వ్యవస్థకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ వెలువరించే అవకాశం ఉంది. తెలంగాణ జోనల్‌ విధానానికి ఆమోదం నిమిత్తం సీఎం కేసీఆర్‌ ఇటీవల ఢిల్లీ పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రధాని నరేంద్రమోదీని కలిసి ఈ అంశంపై చర్చించారు. దాంతో ఎన్నాళ్ల నుంచో అపరిష్కృతంగా ఉన్న నూతన జోనల్‌ వ్యవస్థకు ప్రధాని మోదీ ఆమోద ముద్ర వేశారు. సీఎం కేసీఆర్‌తో సమావేశమైన తర్వాత ఇందుకు సంబంధించిన దస్త్రంపై మోదీ సంతకం చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. జోనల్ వ్యవస్థలో జిల్లా, జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగాల్లో 95శాతం స్థానిక రిజర్వేషన్ కల్పించారు. 

5 శాతం మాత్రమే ఓపెన్ క్యాటగిరీ ఉంటుంది. స్థానికులు మెరిట్ సంపాదించుకొని ఓపెన్ క్యాటగిరీలో ఉద్యోగం పొందే అవకాశం కల్పించారు. రాష్ట్ర క్యాడర్‌ను రద్దు చేయడంతో 5 శాతం ఓపెన్ క్యాటగిరీలోనూ తెలంగాణలోని 31 జిల్లాలకు చెందిన నిరుద్యోగులు మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. తద్వారా రాష్ట్రంలోని ఉద్యోగాలన్నీ పూర్తిగా స్థానికులకే దక్కనున్నాయి. కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదంతో స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు దక్కనున్నాయి. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు నాలుగేళ్లు ఎక్కడ చదివితే అదే స్థానికతగా పరిగణిస్తారు. మరోవైపు కొత్తగా దాదాపు 50 వేల ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. కాగా, తెలంగాణలో కొత్త జోన్ల ఏర్పాటకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ ఆమోదం తెలపడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి, రాష్ట్రపతికి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.  

తెలంగాణ కొత్త జోన్లు ఇవే.. 
తెలంగాణ జోన్లు: కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి, చార్మినర్, యాదాద్రి, జోగులాంబ.
తెలంగాణ మల్టీ జోన్లు: యాదాద్రి, కాళేశ్వరం. 
కాళేశ్వరం జోన్: భూపాల పల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి జిల్లాలు
బాసర జోన్: ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలు
రాజన్న సిరిసిల్ల జోన్: కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్ జిల్లాలు
భద్రాద్రి జోన్: కొత్తగూడెం, ఖమ్మం, మహబూబ్‌నగర్,వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాలు
యాదాద్రి జోన్: సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి, జనగామ జిల్లాలు
చార్మినార్ జోన్: హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి
జోగులాంబ గద్వాల జోన్: మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల నాగర్ కర్నూల్, వికారాబాద్ జిల్లాలు

కాళేశ్వరం మల్టీ జోన్: బాసర, రాజన్న, కాళేశ్వరం, భద్రాద్రి. 
యాదాద్రి మల్టీ జోన్: జోగులాంబ, యాదాద్రి, చార్మినార్  



నేపాల్ పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ

Updated By ManamThu, 08/30/2018 - 08:35
  • రెండు రోజుల పాటు 4వ బిమ్ స్టెక్ సదస్సు 

  • పాల్గొనున్న వివిధ దేశాల ప్రధానులు, వివిఐపీలు

PM Narendra Modi, Nepal, BIMSTEC Summit, VVIP guestsఖాట్మాండు: ప్రధాని నరేంద్ర మోదీ గురువారం నేపాల్ పర్యటనకు బయల్దేరారు. రెండు రోజుల పాటు నేపాల్‌లో పర్యటించనున్న మోదీ.. 4వ బిమ్ స్టెక్ సదస్సులో పాల్గొననున్నారు. ప్రధాని హోదాలో మోదీ నేపాల్‌లో పర్యటించడం ఇది నాల్గోసారి. ఈ రోజు ఉదయమే ప్రత్యేక విమానంలో నేపాల్‌ పర్యటనకు బయల్దేరిన ఆయన ఉదయం 8 గంటల ప్రాంతంలో త్రిభువన్ అంతర్జాతీయ విమానశ్రయానికి చేరుకోనున్నారు. అలాగే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా వజీద్, థాయి ప్రధాని ప్రయూత్ చాన్-ఒ-ఛా ఇరువురు కూడా ఖాట్మాండుకు ఉదయం 10.15లకు చేరుకొనే అవకాశం ఉంది.

ఖాట్మాండులో జరుగనున్న 4వ బిమ్ స్టెక్ సదస్సులో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి  వివిఐపీలు వస్తున్న నేపథ్యంలో నేపాల్ అంతర్జాతీయ విమానాశ్రయం, త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాలను రెండెన్నర గంటల పాటు మూసివేయనున్నట్టు ఏయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ రూమ్ (ఏటీఆర్) పేర్కొంది. నేపాల్ స్థానిక కాలమానం ప్రకారం.. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో విమానాశ్రయంలో విమానాల సర్వీసులను నిలిపివేశారు. ఇప్పటికే నేపాల్‌లో భారీ భద్రతను కట్టదిట్టం చేశారు. 



‘రాఫెల్’ కొనుగోళ్లలో భారీ అవినీతి: ఉత్తమ్

Updated By ManamSat, 08/18/2018 - 17:35

Rafale defence scam, Uttam Kumar reddy, Rahul gandhi, UPA govt, PM Narendra modiన్యూఢిల్లీ: రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలులో భారీ అవినీతి జరిగిందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆరోపించారు. అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులతో పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఢిల్లీలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ఉత్తమ్ అనంతరం మీడియాతో మాట్లాడారు. రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతిపై సుదీర్ఘంగా చర్చించామన్నారు. యుద్ధ విమానాల కొనుగోలులో రూ.41వేల కోట్ల భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఒక్కో విమానం రూ.526 కోట్లకు యూపీఏ హయాంలో ఒప్పందం కుదిరిందని అన్నారు.

ఒక్కో విమానాన్ని రూ.1600 కోట్లకు కొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. మొత్తం 36 విమానాలకు రూ.41వేల కోట్లు అధికంగా ఖర్చు చేశారని విమర్శించారు. వర్ష బీభత్సంతో అతులాకుతలమైన కేరళ రాష్ట్రంపై కూడా సమావేశంలో చర్చించామని ఉత్తమ్‌ చెప్పారు. కేరద వరదలను జాతీయ విపత్తులగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌కు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేరళకు ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. తెలంగాణ పీసీసీ తరఫున కూడా సాయం చేస్తామని ఉత్తమ్ స్పష్టం చేశారు. 



కేరళకు పయనమైన ప్రధాని మోదీ

Updated By ManamFri, 08/17/2018 - 20:47

Kerala Flood Live Updates

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి కేరళకు పయనమయ్యారు. కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కేరళ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎడతెరిపిలేని వరదలకు వందాలాది మంది ప్రాణాలు పోయాయి. ఆస్తి నష్టం అయితే అంచానాలకు లెక్కలేనంత. ఇదీ గత కొద్దిరోజులుగా కేరళ పరిస్థితి. ఇప్పటికే రంగంలోకి ఆర్మీ, నేవీ బృందాలు రంగంలోకి దిగి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది.

శుక్రవారం సాయంత్రం ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి కేరళకు బయల్దేరిన మోదీ.. ఇవాళ రాత్రికి తిరువునంతపురం చేరుకోనున్నారు. మొదట సీఎం పినరయితో పాటు పలువురు కీలకాధికారులతో ఆయన సమావేశమై పరిస్థితిపై సమీక్షిస్తారు. అనంతరం సీఎంతో కలిసి మోదీ కూడా ఏరియల్ సర్వేలో పాల్గొననున్నారు. ఏరియల్ సర్వే అనంతరం 'జాతీయ విపత్తు'గా రాష్ట్రాన్ని ప్రకటించే అవకాశాలుండొచ్చని కూడా అంచనా వేస్తున్నారు. కాగా గురువారం మధ్యాహ్నమే మోదీ కేరళకు వెళ్లాల్సి ఉండగా అదే రోజు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి తుదిశ్వాస విడవడం.. ఆ మరుసటి రోజు అంత్యక్రియలు ఉండటంతో పర్యటన రెండ్రోజులు ఆలస్యమైంది.



వాజ్‌పేయికి తుది వీడ్కోలు..

Updated By ManamFri, 08/17/2018 - 15:27
  • బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి అంతిమ యాత్ర.. ముగిసిన అంత్యక్రియలు

  • రాష్ట్రీయ స్మృతి స్థల్‌ వద్ద ప్రభుత్వ లాంఛనాలతో తుదివీడ్కోలు

  • పాల్గొన్న విదేశీ ప్రముఖులు, బీజేపీ అగ్రనేతలు

Atal Bihari Vajpayee's funeral, BJP HQ to Smriti Sthal, PM Narendra modi, amith shah (1426)న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి అంత్యక్రియలు ముగిశాయి. యమునా నదీ తీరంలోని రాష్ట్రీయ స్మృతి స్థల్‌ వద్ద ప్రభుత్వ లాంఛనాలతో వాజ్‌పేయికి తుది వీడ్కోలు పలికారు. వాజ్‌పేయి దత్తపుత్రిక నమిత భట్టాచార్య ఆయన చితికి నిప్పుంటించారు. వాజ్‌పేయి అంత్యక్రియల్లో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, స్పీకర్ సుమిత్రా మహాజన్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఢిల్లీలోని దీన్‌దయాళ్‌ మార్గ్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. ఈ అంతిమ యాత్రలో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా సహా పలువురు అగ్రనేతలు పాల్గొన్నారు. 
Atal Bihari Vajpayee's funeral, BJP HQ to Smriti Sthal, PM Narendra modi, amith shah (1426)వాజ్‌పేయి పట్ల అమితమైన గౌరవభావం కలిగిన ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, ఎల్‌కే అద్వానీ, మధ్య ప్రదేశ్ సీఎం, మహారాష్ట్ర సీఎం సహా బీజేపీ అగ్రనేతలు వాజ్‌పేయి పార్థివదేహం వెంట నడుస్తూ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. మరోవైపు వాజ్‌పేయి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు భారత్‌కు  పాక్ బృందం వస్తుండగా.. విదేశీ ప్రముఖులు భూటన్ రాజు జిగ్మే ఖేసర్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రులు సైతం ఆయన అంతిమ యాత్రలో పాల్గొంటున్నారు. 

Atal Bihari Vajpayee's funeral, BJP HQ to Smriti Sthal, PM Narendra modi, amith shah (1426)

విజయ్ ఘాట్ వద్ద మెమోరియల్ ఏర్పాటు.. 
విజయ్ ఘాట్ పక్కన 1.5 ఎకరాల్లో వాజ్‌పేయి మెమోరియల్ ఏర్పాటు చేశారు. వాజ్‌పేయి అంతిమ యాత్రలో ఆయన్ను కడసారి చూసేందుకు భారీసంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. వాజ్‌పేయి మృతికి సంతాపంగా 15 రాష్ట్రాలు సెలవుదినంగా ప్రకటించగా.. కేంద్రంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వారం రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించారు. ఏపీలోనూ 7 రోజుల పాటు సంతాప దినాలు జరుపుకోనున్నారు. అంతకుముందు వాజ్‌పేయి నివాసం నుంచి బీజేపీ కార్యాలయానికి చేరుకున్న నరేంద్ర మోదీ, బీజేపీ అగ్రనేత ఎల్‌.కె.అద్వానీ, పలువురు కేంద్రమంత్రులు, అమిత్‌ షా, బీజేపీ అగ్రనేతలు వాజ్‌పేయి భౌతికకాయానికి నివాళులర్పించారు.

వాజ్‌పేయి అంతిమ యాత్ర ఫొటోలు



'పవన్‌కు కౌంటర్ ఇచ్చిన ఎంపీ కేశినేని '

Updated By ManamSun, 07/29/2018 - 11:02

MP Kesineni nani, Central govt, PM Narendra modi, Pawan Kalyanఅమరావతి: ఏపీ, చంద్రబాబును టార్గెట్‌ చేసుకొని ప్రధాని నరేంద్ర మోదీ-అమిత్ షా కుట్ర పన్నుతున్నట్టు విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆరోపించారు. ఈ కుట్రలో గవర్నర్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇద్దరూ భాగస్వాములేనని విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రం విషయంలో కేంద్రం చేస్తున్న మోసం మరోసారి బయటపడిందన్నారు. రైల్వేజోన్ ఇస్తామన్న రాజ్‌నాథ్‌ సింగ్ ప్రకటనకు విరుద్ధంగా కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవిశ్వాసం పెట్టి వారం రోజులు గడవక ముందే మోదీ ఏపీ ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. నిన్నటి దాకా రైల్వే జోన్ అంశం పరిశీలిస్తున్నామని చెప్పి నేడు సాధ్యం కాదని అఫడవిట్ వేయడం ఎంతవరకు సమంజసమో చెప్పాలన్నారు.

తాజా అఫడవిట్‌పై రేపటి నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీస్తామని చెప్పారు. ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చేవరకు కేంద్రాన్ని వదిలిపెట్టమని స్పష్టం చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు అసలు రైతులు అంటే తెలుసా? అని ప్రశ్నించారు.  నాలుగు రోజులు రోడ్ల మీద తిరిగి 40 రోజులు హైదరాబాద్‌లో ఉండే వ్యక్తి పవన్ కల్యాణ్‌ని ఎద్దేవా చేశారు. రైతులకు న్యాయం చేస్తున్న చంద్రబాబుపై పవన్ పోరాటం చేయడం కంటే.. ఏపీ హక్కుల సాధన కోసం మోదీపై పోరాటం చేయడం మంచిదని కేశినేని నాని హితవు పలికారు. పవన్‌కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదని.. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. నాగపూర్ జనాభా కంటే విజయవాడ జనాభా ఎక్కువని చెప్పారు. నాగపూర్‌లో మెట్రో మంజూరుకు లేని ఇబ్బంది విజయవాడకు ఎందుకు వచ్చిందని నాని కేంద్రాన్ని ప్రశ్నించారు. 



రైతుల ఆదాయం రెండింతలు చేస్తాం: మోదీ

Updated By ManamSun, 07/15/2018 - 15:03
  • ఉత్తరప్రదేశ్‌లో ప్రధాని రెండు రోజుల పర్యటన

  • యూపీలో కీలక ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ

  • బన్‌సార్ బ్రిడ్జి ప్రారంభోత్సవం, మెడికల్ కాలేజీకి శంకుస్థాపన 

  • మీర్జాపూర్‌లో బహిరంగ ర్యాలీలో మోదీ ప్రసంగం

PM Narendra Modi,  key projects, UP's Mirzapur, Mirzapur Medical Collegeమీర్జాపూర్(ఉత్తరప్రదేశ్): ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం ఉత్తరప్రదేశ్‌లో కీలక ప్రాజెక్టులను ప్రారంభించారు. యూపీలోని బన్‌సాగర్ కేనల్ ప్రాజెక్టును తొలుత ప్రారంభించిన ఆయన.. మీర్జాపూర్‌లోని మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు. మీర్జాపూర్, వారణాసి మధ్య అనుసంధానిస్తూ గంగా నదిపై బ్రడ్జిని ప్రారంభించారు. అలాగే (పీఎంబీజేపీ) పథకం కింద 108 జన్ ఆశాధి కేంద్రాలను కూడా ఆయన ప్రారంభించారు. అనంతరం మీర్జాపూర్‌లో బహిరంగ ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. తన ప్రసంగంలో ప్రధానంగా రైతుల గురించే ప్రస్తావించారు. దేశంలోని రైతుల శ్రేయస్సు కోసమే తమ ప్రభుత్వం రాత్రింబవళ్లూ కష్టపడుతోందని అన్నారు. 2022 నాటికి దేశంలోని రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు తెలిపారు.

రైతుల ఆదాయం అంతకు రెండింతలు కావాలంటే ప్రభుత్వ పథకాలను సద్వినియోగపర్చుకోవాలని కోరారు. ధనిక, పేదరికానికి మధ్య వారదిని నిర్మించే దిశగా అడుగులు వేస్తున్నామని, త్వరలోనే ఆ రోజులును ప్రతిఒక్కరూ చూస్తారని చెప్పారు. బన్ సాగర్ ప్రాజెక్టుతో ఈ ప్రాంతంలోని ప్రజల కలలను సాకారం చేసుకోవచ్చున్నారు. 70ఏళ్ల క్రితం 300 కోట్లతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు.. ఈ రోజు రూ.3,500 కోట్ల ఖర్చు పెట్టిన తరువాత మాత్రమే పూర్తి అయిందని మోదీ చెప్పారు. రైతుల కోసం మొసలి కన్నీళ్లు కారుస్తున్న వారంతా తమ పాలనలో ప్రాజెక్టులను ఎందుకు అసంపూర్తిగా ఉంచారో ఈరోజు ప్రజలంతా గట్టిగా అడగాల్సి ఉందన్నారు.    





Related News