pm narendra modi

భారత్ చేరుకున్న దక్షిణ కొరియా అధ్యక్షుడు

Updated By ManamSun, 07/08/2018 - 19:10
  • సతి సమేతంగా భారత్‌లో నాలుగు రోజుల పర్యటన

S. Korean president, India for state visit, PM Narendra modiన్యూఢిల్లీ: దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌ ఆదివారం సాయంత్రం భారత్‌ చేరుకున్నారు. ఆయనకు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వి.కె.సింగ్‌ ఘనస్వాగతం పలికారు. అధ్యక్షుడు మూన్‌ నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఈ నెల 8 నుంచి 11వరకు భారత్‌లో పర్యటించనున్నారు. మూన్ వెంట ఆయన సతీమణి కూడా ఉన్నారు. రెండు దేశాల పర్యటనలో భాగంగా ముందుగా మూన్‌ భారత్‌లో పర్యటించి అనంతరం సింగపూర్‌లో పర్యటించనున్నారు. 2017లో దక్షిణ కొరియా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి అధ్యక్షుడి హోదాలో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై, ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించనున్నారు. ఇరుదేశాల మధ్య సత్సాంబంధాలను పెంపొందించేందుకు ఈ చర్చలు ప్రాధాన్యాన్ని సంతరించుకోనున్నాయి.

ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు మూన్ భారత్‌లో పర్యటిస్తున్న నేపథ్యంలో మూన్-మోదీ మంగళవారం భేటీ కానున్నారు. దీంతో గత ఏడాది జర్మనీలో జరిగిన గ్రూపు 20 సదస్సు తరువాత రెండోసారి ఈ తరహాలో దేశాధినేతల మధ్య జరిగే తొలి సమావేశం కానుంది. తద్వారా ఇరుదేశాల మధ్య ఆర్థిక సహకారం, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని అభివృద్ధి చేసే దిశగా ఇరు దేశాల నేతల మధ్య చర్చలు కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నాలుగు రోజుల భారత్ పర్యటనలో భాగంగా అధ్యక్షుడు మూన్.. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కొత్త ఉత్పత్తి సౌకర్యాలను సందర్శించనున్నట్టు కొరియన్ అధ్యక్ష కార్యాలయం చియాంగ్ వా డేయి పేర్కొంది. అలాగే రాష్ట్రపతి రామ్‌‌నాధ్ కోవింద్‌తో కూడా మూన్ సమావేశం కానున్నారు. అనంతరం ఇద్దరు కలిసి జాయింట్ బిజినెస్ ఫౌరంలో పాల్గొనున్నారు. కాగా, అధ్యక్షుడు బుధవారం భారత్‌ నుంచి బయల్దేరి మూడు రోజుల పర్యటనలో భాగంగా సింగ్‌పూర్‌లో పర్యటించనున్నారు. యోగా చేస్తూ వృద్ధురాలు మృతి

Updated By ManamFri, 06/22/2018 - 16:20

73-Year Old Woman, Yoga Day Celebrations, Dehradun, PM Narendra modiడెహ్రాడూన్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా నిర్వహించిన యోగా దినోత్సవ వేడుకల్లో 73ఏళ్ల వృద్ధురాలు మృతిచెందింది. ఈ ఘటన శుక్రవారం డెహ్రాడూన్‌లోని ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్ఆర్ఐ)లో చోటుచేసుకుంది. ఎఫ్ఆర్ఐ ప్రాంగణంలో యోగా దినోత్సవ వేడుకల సందర్భంగా యోగా చేస్తున్న సుధా మిశ్రా (73) అనే వృద్ధురాలు ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్టు ఎస్పీ ప్రదీప్ రాయ్ చెప్పారు. యోగా వేడుకల సందర్భంగా ప్రాంగణంలో అంబులెన్స్‌లతో పాటు వైద్యశిబిరాలను ఏర్పాటు చేశారని, దాంతో తక్షణమే సుధా మిశ్రాను ఆస్పత్రికి తరలించినట్టు ఆయన తెలిపారు.

కానీ, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మిశ్రా చనిపోయారని, ఆమె మృతికి గల కారణం వైద్యులు మాత్రమే నిర్ధారించగలరని ఎస్పీ రాయ్ పేర్కొన్నారు. నాల్గో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకుల సందర్భంగా డెహ్రాడూన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో 50వేల మంది వాలంటీర్లు పాల్గొని మోదీతో పాటు యోగాసనాలు వేశారు.  ప్రధాని సూచన ప్రమాదకరం: రాఘవులు

Updated By ManamMon, 06/18/2018 - 14:58

BV raghavuluఅమరావతి: పార్లమెంటరీ విధానాన్ని దెబ్బతీయాలని కేంద్రంలోని బీజేపీ ప్రయత్నిస్తోందని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు విమర్శించారు. దేశంలో, రాష్ట్రంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ‘నీతి అయోగ్’ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సూచన ప్రమాదకరమని చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోదీ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరగాలన్నది ప్రజలు నిర్ణయించాలి గానీ, ప్రభుత్వం కాదని హితవు పలికారు. భారత వైవిధ్యాన్ని నాశనం చేసేలా హిందుత్వ విధానాన్ని అమలుపరిచేలా కేంద్రం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. 

ఢిల్లీలో లెప్టినెంట్ గవర్నర్ వ్యవహారశైలి ఫెడరల్ స్పూర్తికి విరుద్ధంగా ఉందని విమర్శించారు. ఫెడరల్ స్పూర్తిని కాపాడేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ప్రత్యేక హోదా రాజ్యాంగ బద్ధంగా ఇవ్వాల్సి ఉందని తాము అడిగినప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు హోదా వద్దు ప్యాకేజీ కావాలన్నారని, ఇప్పుడు హోదా కావాలని అడుగుతున్నారని రాఘవులు విమర్శించారు. ఇప్పటికైనా చంద్రబాబు హోదా కోసం డిమాండ్ చేయటం సంతోషకరమైన విషయమన్నారు. ఈవీయంల విధానాన్ని సీపీఎం వ్యతిరేకించటంలేదని, అయితే యంత్రానికి పేపరు ప్రింటింగ్ అనుసంధానించమని కోరుతున్నామని చెప్పారు. ఈనెల 20న సీపీఎం, సీపీఐ విజయవాడలో ఉమ్మడి సదస్సు నిర్వహిస్తున్నామని రాఘవులు చెప్పారు. ప్రధాని మోదీకి ఏం కావాలి?: కేజ్రీవాల్

Updated By ManamWed, 05/30/2018 - 16:04
  • సత్యేందర్ జైన్ ఇళ్లపై సీబీఐ దాడులు.. తీవ్రంగా ఖండించిన ఢిల్లీ సీఎం

  • పీడబ్ల్యూడీ శాఖలో నియమకాలపై ఆరోపణలు.. విచారణ చేపట్టిన సీబీఐ

PM Narendra modi, Arvind Kejriwal, CBI raids, Satyendar Jain’s residence న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అసహనం వ్యక్తం చేశారు. ఢిల్లీ పీడబ్ల్యూడీ శాఖ మంత్రి సత్యేందర్ జైన్ నివాసంలో సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ) అధికారులు దాడులు చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా కేజ్రీవాల్ మోదీపై మండిపడ్డారు. ‘‘అసలు ప్రధాని మోదీకి ఏం కావాలి?’’ అంటూ ట్వీట్ చేశారు. బుధవారం ఉదయం పీడబ్ల్యూడీ (పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్) శాఖ మంత్రి సత్యేందర్ జైన్ నివాసంలో సీబీఐ తనిఖీలు చేసింది. పీడబ్ల్యూడీ శాఖ 24 మందితో కూడిన క్రియోటివ్ టీమ్‌ను నియమించింది.

ఈ నియమకాలు పారదర్శకంగా జరుగలేదనే ఆరోపణల నేపథ్యంలో విచారణ చేపట్టిన సీబీఐ అధికారులు ఏకకాలంలో సత్యేందర్ నివాసంతో పాటు ఇతర పీడబ్ల్యూడీ అధికారుల ఇళ్లలో దాడులు జరిపారు. తన ఇంట్లో సీబీఐ దాడులు జరిపిన విషయాన్ని జైన్ కూడా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ‘‘పీడబ్ల్యూడీ శాఖలో పలు ప్రాజెక్టుల కోసం క్రియేటివ్ టీం నియమకాలకు సంబంధించి నా ఇంట్లో సీబీఐ దాడులు చేసింది. సీబీఐ దాడులతో క్రియేటివ్ టీంను వదులుకోవాల్సి వస్తోంది’’ అని ట్వీట్ చేశారు. ఇప్పటికే మనీలాండరింగ్ కేసులో జైన్ విచారణ ఎదుర్కొంటున్నారు.దేవెగౌడకు మోదీ శుభాకాంక్షలు.. రాహుల్ క్షమాపణలు!

Updated By ManamFri, 05/18/2018 - 15:25
  • దేవెగౌడకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రాహుల్, ప్రధాని మోదీ 

PM Narendra Modi, Rahul Gandhi, Deve Gowda on his birthday, Rahul also apologises బెంగళూరు: కర్ణాటకలో హంగ్‌ ఏర్పడిన నేపథ్యంలో ప్రస్తుతం జేడీఎస్‌ మద్దతు కాంగ్రెస్, బీజేపీలకు ఎంతో కీలకంగా మారిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కాంగ్రెస్, బీజేపీ జేడీఎస్‌ నుంచి మద్దతును కూడబెట్టేందుకు ఇరుపార్టీలు తెగ హైరానా పడుతున్నాయి. కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలన్నా, బలపరీక్షలో నెగ్గాలన్నా జేడీఎస్ మద్దతు అనివార్యమైంది. ఈ నేపథ్యంలో శుక్రవారం మాజీ ప్రధాని, జేడీఎస్‌ నేత దేవెగౌడ (85వ) పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘దేవెగౌడ ఆరోగ్యం, జీవితం బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను’’ అని ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. రాహుల్ కూడా దేవెగౌడకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ‘‘దేవెగౌడ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా గురువారమే దేవెగౌడ తిరుమలను దర్శించుకున్నారు. 

అయితే జేడీఎస్‌తో పార్టీ సంబంధాలు బలోపేతం చేసే దిశగా రాహుల్‌ గాంధీ.. దేవెగౌడతో మాట్లాడారు. కర్ణాటక ఎన్నికల ప్రచారం సమయంలో కాంగ్రెస్‌, జేడీఎస్ మీద విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. బీజేపీకి జేడీఎస్‌ టీమ్ బి పార్టీ లాంటిదని రాహుల్ ఎద్దేవా చేశారు. జనతాదళ్(సెక్యులర్‌)ను కాస్తా జనతాదళ్(సంఘ్‌ పరివార్‌) అంటూ తీవ్రంగా విమర్శలు గుప్పించారు. తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాహుల్ తన వ్యాఖ్యలపై దేవెగౌడకు క్షమాపణలు చెప్పినట్లు పార్టీ వర్గాల సమాచారం. టీఆర్ఎస్ సర్కార్ బీసీలకు వ్యతిరేకం

Updated By ManamWed, 04/11/2018 - 17:00
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్.. ఫూలేకు ఘననివాళి

laksman, bjp,  obc commission, pm narendra modiహైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. మహాత్మా జ్యోతిరావుఫూలే జయంతిని పురస్కరించుకొని తెలంగాణ బీజేపీ నేతలు ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం డిమాండ్ చేస్తుంటే కేసీఆర్ గొర్రెలు, మేకలు, చేపలు పంపిణీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పార్లమెంటులో ఎంపీలు ప్రవర్తించిన తీరుపై రేపు నరేంద్రమోదీ ఒక్కరోజు దీక్ష చేయనున్నారని పేర్కొన్నారు. ప్రైవేట్ యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు. అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ.. మహాత్మాజ్యోతిరావు ఫూలే గొప్ప ఆశయాలు కలిగిన వ్యక్తి అని కొనియాడారు. కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు విచ్ఛినకరశక్తులు ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు. ఓబీసీ కమిషన్ కు చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉందని దీనిపై కాంగ్రెస్ నేతలు తమ అధిష్ఠానాన్ని ఒప్పించాలని కోరారు.వావ్.. ‘మోదీ’ వంటకం.. అదిరింది!

Updated By ManamWed, 04/11/2018 - 13:54

PM Narendra Modi, special recipe, Modi Twin brotherఈ వీడియోలో వంట చేస్తున్న వ్యక్తిని గుర్తు పట్టారా? అరే.. అచ్చుగుద్దినట్టు మన ప్రధాని నరేంద్ర మోదీజీలా ఉన్నాడే.. భలే.. వేడివేడిగా రుచికరమైన వంటకాన్ని రెడీ చేస్తున్నాడు చూడండి.. ఆహా.. చూస్తేనే నోరూరిపోతోంది కదూ. వీడియోలో కనిపిస్తున్న ఆ వ్యక్తి.. కళ్లజోడు, తెల్లనిగడ్డం, ఆకుపచ్చని చొక్కా ధరించి చకచకా వండి వారుస్తున్నాడు. ఈ హోటల్ మెనూలో పకోడి కూడా చాలా ఫేమస్.. అంట. ఇతగాడు ఎవరో తెలియదు గానీ.. అచ్చం మోదీలా ముఖకవళికలతో వంట చేస్తున్న వీడియో నెట్టింట్లో తెగ హల్‌చల్ చేస్తున్నాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లంతా ప్రధాని మోదీని ఉద్దేశించి సెటైర్లు మీద సెటైర్లు వేస్తున్నారు. మరికొందరైతే.. ‘చాయ్‌వాలా అయ్యాడు.. పకోడివాలా..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మోదీ.. రోజుకు రూ. 200 నుంచి నెలకు రూ.6వేలకు సంపాదించే పకోడివాలా.. నిరుద్యోగి కాదని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మోదీ వ్యాఖ్యలపై పలువురు నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తూ.. ‘చాయ్‌వాలా మోదీ.. హోటళ్లలో వంట చేస్తున్నారు.. పకోడీలు కూడా.. మోదీ పార్ట్‌టైం జాబ్‌లో బిజీ.. చాయ్‌వాలాకు సరైన జాబ్ ఇదే.. మోదీ ట్విన్ బ్రదరేమో కామెంట్లు పెట్టగా.. మరో నెటిజెన్.. మాత్రం 2019 తర్వాత మోదీ పరిస్థితి ఇదే..’ అంటూ ఘాటైన కామెంట్ పెట్టాడు. ఈ వీడియోను మీరు కూడా చూసి సరదా కామెంట్లు పెట్టేయండి..'మోదీ తలచుకుంటే అర్ధగంటలో ప్రత్యేక హోదా'

Updated By ManamThu, 03/22/2018 - 17:00

Congress leader Tulasi reddy, AP Special status, PM Narendra modi, AP Special status, Rahul gandhi హైదరాబాద్‌: ప్రధాని నరేంద్ర మోదీ తలచుకుంటే అర్ధగంటలోనే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వస్తుందని కాంగ్రెస్‌ నేత తులసిరెడ్డి అన్నారు. కానీ, ప్రధాని మోదీ.. రాష్ట్రం పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మోదీ మనస్సును ఆ దేవుడే మార్చాలని కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పోరాట సమితి, ఆంధ్రప్రదేశ్‌ జర్నలిస్టు ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తులసి మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా ఇప్పడు రావడం ఆలస్యమైనప్పటికీ.. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక తప్పకుండా వస్తుందని జోస్యం చెప్పారు. అందులోనూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రధాని అయితేనే సాధ్యపడుతుందని అన్నారు. రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణాంజనేయులు, విద్యార్థి, యువజన, నిరుద్యోగ, రాజకీయ, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.‘మోదీ.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన చౌకీదార్’

Updated By ManamSat, 02/24/2018 - 18:18

PM narendra modi, Most Expensive Watchman, Congress, Kapil Sibal న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై సీనియర్ కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ శనివారం వ్యంగస్త్రాలు సంధించారు. గతకొన్ని రోజులుగా దేశంలో బ్యాంకుల్లో భారీ కుంభకోణాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో మోదీ ఎందుకు మౌనం వహిస్తున్నారని మండిపడ్డారు. ‘ప్రపంచంలో అత్యంత ఖరీదైన చౌకీదార్ (కాపలాదారుడు) మోదీనే’ అని సిబల్ వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యూపీఏ హయాంలో వెలుగుచూసిన రూ. 1.76 కోట్ల 2జీ కుంభకోణం నేపథ్యంలో మోదీ ప్రతిరోజు తన ప్రసంగంలో కాంగ్రెస్‌పైనే విమర్శలు గుప్పించేవారని అన్నారు. వజ్రాల వ్యాపారి, నీరవ్ మోదీ (దాదాపు రూ.11,400 కోట్లు), రొటొమాక్ కంపెనీ యజమాని విక్రమ్ కొఠారి  (రూ.3 వేల కోట్లు) ఎగవేతతో బ్యాంకులకు తీరని నష్టం వాటిల్లిందని సిబల్ ఆరోపించారు. 

బ్యాంకు కుంభకోణాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నా.. ప్రధాని మోదీ ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారో చెప్పాలని, ఆ మౌనం వెనుక ఆంతర్యం ఏమిటనని ఆయన ప్రశ్నించారు. బీజేపీలో చాలామంది నేతలకు దేశాన్ని విడిచి విదేశాలకు చెక్కేసిన ఆర్థిక మోసగాళ్లతో సంబంధాలు ఉన్నాయని సిబల్ ఆరోపించారు.కాగా, శుక్రవారం జరిగిన ఈటీ ప్రపంచ వాణిజ్య సదస్సులో పాల్గొన్న మోదీ.. బ్యాంకు కుంభకోణాలపై తొలిసారిగా మౌనాన్ని వీడారు. ఆర్థిక మోసాలకు పాల్పడే వారిపై తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని మోదీ స్పష్టం చేశారు.ప్రధానిపై రాహుల్ గాంధీ ఫైర్

Updated By ManamSat, 02/17/2018 - 20:35

rahul gandiప్రధాని దేశ ఆర్థిక వ్యవస్థను భ్రష్ట పట్టిస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. దేశం నుంచి డబ్బును దోచుకెళ్లిన నీరవ్ మోదీ గురించి ప్రధాని ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. అందుకు ఎవరు బాధ్యులో చెప్పాలన్నారు. నోట్లను రద్దుచేయించి ప్రజల సొమ్మును బ్యాంకుల్లో వేయించారు. మీ సొమ్ము బ్యాంకుల్లో భద్రంగా ఉంటుందని ఊదరగొట్టారు. కానీ వేల కోట్ల రూపాయలు బ్యాంకునుంచి దోచుకుపోతుంటే ఏంచేశారని ప్రధానిని ప్రశ్నించారు. పరీక్షలకు విద్యార్థుల ఎలా హాజరవ్వాలో గంటల తరబడి బోధిస్తున్నారని, కానీ ఈ బ్యాంకు కుంభకోణానికి బాధ్యులెవరో చెప్పడంలేదన్నారు. ఈరోజు కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ సమావేశం ముగిసిన తర్వాత రాహుల్ గాంధీ మీడియాతో  మాట్లాడారు.  వచ్చేనెల 16 నుంచి 18 వరకు ప్లీనరీ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్లీనరీ సమావేశాల అనంతరం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం

Related News