Chandrababu naidu 

'టీఆర్ఎస్ కావాలో తేల్చుకునే సమయం..' 

Updated By ManamWed, 09/12/2018 - 18:08
  • తెలంగాణను అడ్డుకున్న శక్తులు ఒక్కటయ్యాయని విమర్శ

  • కొండగట్టు కారణంగా కేసీఆర్ రాలేకపోయారు... 

TRS-KTR, option, people, KCR, TRS party, Uttam kumar reddy, Congress party, Chandrababu naidu హైదరాబాద్: తెలంగాణలో ముందస్తు ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలోని పలు రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రాష్ట్రంలో అధికారం దక్కించుకునేందుకు విపక్షాలు ఇప్పటికే కసరత్తును ప్రారంభించాయి. కాంగ్రెస్‌లో నుంచి టీఆర్ఎస్‌లోకి.. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వలసల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముదిగొండ, బషిర్‌బాగ్‌లు ఒక్కటయ్యాయని వ్యాఖ్యానించారు. తెలంగాణను అడ్డుకున్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు ఒక్కటయ్యారని కేటీఆర్ విమర్శించారు. ఓ స్పష్టమైన ప్రత్యామ్నాయం ప్రజల ముందుందని, ఇద్దరిని ఒకే దెబ్బతో కొట్టే అవకాశం లభించిందన్నారు. 60ఏళ్లుగా రాబందుల్లా ప్రజలను పీక్కుతున్న వాళ్లు కావాలా.. రైతుబంధుగా నిలిచిన టీఆర్ఎస్‌ కావాలో తేల్చుకునే సమయం వచ్చిందని కేటీఆర్ చెప్పారు. గడ్డం పెంచుకున్న ప్రతీ ఒక్కరూ గబ్బర్‌సింగ్‌లు కాలేరని దుయ్యబట్టారు. 

రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిన పార్టీలు ఒకవైపు.. 24 గంటల కరెంట్ ఇచ్చిన పార్టీ మరోవైపు ఉందని తెలిపారు. అపవిత్ర, నీచమైన పొత్తుతో ప్రజలకు ఓ మంచి అవకాశం లభించిందని చెప్పారు. తాగునీరు ఇవ్వకుండా చేసిన టీడీపీ, కాంగ్రెస్ ఇప్పుడు ఒక్కటయ్యాయాని, ఎన్టీఆర్ ఆశయాలకు తూట్లు పొడిచారని ధ్వజమెత్తారు. కరెంట్ ఇవ్వకుండా తెలంగాణ రైతుల్ని ముంచిన ఇద్దరు ఒక్కటవుతున్నారని విమర్శలు గుప్పించారు. కొండగట్టు ఘటన కారణంగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు రాలేకపోయారని చెప్పారు. కాలంతో పోటీ పడుతూ కాళేశ్వరం పూర్తి చేస్తున్నామని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సెంచరీకి అడుగుదూరంలో నిలిచామన్నారు. కార్పొరేటర్ ఝాన్సీ రాకతో సెంచరీ కొట్టామని కేటీఆర్ స్పష్టం చేశారు.'చంద్రబాబు పాలనలో విశాఖ రివర్స్ గేర్‌'

Updated By ManamSun, 09/09/2018 - 18:33

Vizag, reverse gare, rulling for 4 years, Chandrababu naidu విశాఖపట్నం: వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర విశాఖ నగరానికి చేరుకుంది. విశాఖలోని కంచరపాలెంలో ఆదివారం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లాడారు. వైఎస్ హయాంలో విశాఖలో అభివృద్ధి పరుగులు పెట్టిందన్నారు. చంద్రబాబు నాలుగున్నరేళ్ల పాలనలో విశాఖ రివర్స్ గేర్‌లో వెళ్తోందని జగన్ విమర్శించారు. నష్టాల్లో ఉన్న విశాఖ ఉక్కును వైఎస్ నిలబెట్టారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. పేదల కోసం వైఎస్ఆర్ వేల ఇళ్లను కట్టించారని అన్నారు.

బీజేపీతో ఉన్నప్పుడు చంద్రబాబుకు రైల్వేజోన్, ప్రత్యేక హోదా గుర్తుకు రాలేదని, బీజేపీతో విడాకులు తీసుకున్నాక ఇప్పుడు రైల్వేజోన్, హోదా గుర్తుకొచ్చాయని విమర్శించారు. నాలుగున్నరేళ్లు మొదటి భార్య మంచిదెలా అయ్యిందో చెప్పాలన్నారు. విశాఖలో ఎక్కడైనా ఐటీ సిగ్నేచర్ టవర్స్ కనిపిస్తున్నాయా? అని ప్రశ్నించారు. ఉన్న పోర్టులో ఉద్యోగాలు పోతుంటే డీప్ వాటర్ పోర్ట్ కడతారట అని జగన్ ఎద్దేవా చేశారు. కాగా, వైఎస్ జగన్ భారీ బహిరంగ సభకు వేలాదిగా ప్రజలు, పార్టీ అభిమానులు హాజరైయ్యారు. సభ ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది. త్వరలో ఏపీ మంత్రివర్గ విస్తరణ: చంద్రబాబు

Updated By ManamMon, 09/03/2018 - 21:14

AP Cabinet, AP CM, Chandrababu Naidu అమరావతి: ఏపీ మంత్రివర్గ విస్తరణ త్వరలో చేపట్టనున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. సోమవారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, సినీ నటుడు హరికృష్ణ మరణంతో విస్తరణ కొంచెం ఆలస్యమైందని అన్నారు. సీపీఎస్‌ విధానం జాతీయ స్థాయిలో తీసుకున్న విధాన నిర్ణయమని చంద్రబాబు చెప్పారు.

అన్ని రాష్ట్రాల్లోనూ సీపీఎస్‌ విధానం ఉందని గుర్తు చేశారు. దీన్ని ఏవిధంగా పరిష్కరించాలో ఆలోచిస్తున్నామని సీఎం తెలిపారు. డిసెంబర్‌ నాటికి హైకోర్టు భవనం పూర్తవుతుందని స్పష్టం చేశారు. హైకోర్టు ఏర్పాటు విషయంలో తాము స్పష్టంగా ఉన్నామని చంద్రబాబు తెలిపారు. లాంచీ వెలికితీత.. మృతదేహాలపై రాని స్పష్టత

Updated By ManamWed, 05/16/2018 - 14:21

boat 2 అమరావతి: గోదావరిలో మునిగిన లాంచీని ఎట్టకేలకు బయటకు తీశారు. ఎన్డీఆర్‌ఎఫ్, నేవీతో సహా ప్రభుత్వ యంత్రాగ కృషితో లాంచీని బయటకు తీశారు. మంటూరు దగ్గర 40 అడుగుల లోతులో లాంచీని గుర్తించిన అధికారులు, భారీ క్రేన్ సాయంతో లాంచీని ఒడ్డుకు చేర్చారు. అయితే బోటును బయటకు తీసినప్పటికీ, అందులో ఎంతమంది మృతదేహాలు ఉన్నాయన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

కాగా బయటపడ్డ మృతదేహాలను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. గుర్తించిన తరువాత వెంటనే పోస్ట్‌మార్టం నిర్వహించి మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నారు. మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను ఆయన పరిశీలిస్తున్నారు.

 ధర్మపోరాట సభకు పూర్తైన ఏర్పాట్లు

Updated By ManamMon, 04/30/2018 - 08:02
Dharma Porata Sabha

తిరుపతి: ఏపీకి మోదీ ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ధర్మపోరాట సభ జరగనుంది. ఇవాళ సాయంత్రం తిరుపతిలో జరగనున్న ఈ సభకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇక ఈ సభలో టీడీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలలందరూ పాల్గొననున్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం నుంచి ఈ సభకు హాజరుకానున్నారు. కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ చేస్తున్న రాజీలేని పోరాటాన్ని ప్రజలకు తెలియజేయడంతోపాటు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన వాగ్దానాలను ఏ విధంగా పక్కన పెట్టారన్నది ఈ సభలో చంద్రబాబు వివరించనున్నారు. అసెంబ్లీని సందర్శించిన సింగపూర్ మంత్రి

Updated By ManamFri, 11/17/2017 - 11:15
  • అమరావతికి విచ్చేసిన మంత్రి ఈశ్వరన్.. ఘన స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.. 
  • సింగపూర్ సంస్థల ప్రాజెక్టులపై చర్చ.. ఏపీ సచివాలయం, అసెంబ్లీని చూపించిన సీఎం 

Singapore minister visit, Eshwaran team, AP assembly, Amaravati, Chandrababu naidu అమరావతి: సింగపూర్ మంత్రి ఈశ్వరన్ శుక్రవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి చేరుకున్నారు. ఏపీ సచివాలయం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆయనకు ఘనస్వాగతం పలికారు. కొత్తగా నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీని ఈశ్వరన్ బృందానికి చూపించారు. అతి తక్కువ సమయంలోనే అద్భుతమైన అసెంబ్లీని నిర్మించారని చంద్రబాబును ఈశ్వరన్ అభినందించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మంత్రి ఈశ్వరన్‌తో భేటీ అయ్యారు. అమరావతిలో సింగపూర్ సంస్థలు చేపట్టబోయే ప్రాజెక్టులపై చర్చించారు. అమరావతిలో నిర్మించబోతున్న శాశ్వత అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం తదితర నిర్మాణాలపై కూడా చర్చించారు. అనంతరం అనంతరం ఇరువురు సచివాలయానికి చేరుకున్నారు.

Related News