kollywood

న‌య‌న‌తార‌.. ఓ స్మ‌గ్ల‌ర్‌

Updated By ManamSat, 05/19/2018 - 15:51

nayanకోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార.. ఆర్థిక ఇబ్బందుల కార‌ణంగా స్మ‌గ్ల‌ర్ అవ‌తారం ఎత్తింది. అయితే.. ఇదంతా రియ‌ల్ లైఫ్‌లో అనుకుంటే పొర‌పాటే. రీల్ లైఫ్ కోస‌మే ఆమె స్మ‌గ్ల‌ర్‌గా మారిపోయింది. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. ప్ర‌స్తుతం న‌య‌న్ న‌టిస్తున్న సినిమాల‌లో త‌మిళ చిత్రం ‘కొలమావు కోకిల’ ఒక‌టి.  నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో న‌య‌న్ పాత్ర చుట్టే క‌థ తిరుగుతుంది. క‌థానుసారం.. ఆర్ధికపరమైన ఇబ్బందుల‌తో  మాదక ద్రవ్యాలను స‌ర‌ఫ‌రా చేసే స్మగ్ల‌ర్ పాత్ర‌లో న‌యన్ క‌నిపించ‌నుంది. ఈ సినిమాతో న‌టిగా న‌య‌న‌తార మ‌రో స్థాయికి వెళతార‌ని చిత్ర బృందం పేర్కొంది. యోగి బాబు, శరణ్య, అరణ్తాంగి ఇత‌ర‌ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుండ‌గా.. యువ సంగీత సంచ‌ల‌నం అనిరుధ్‌ రవిచంద్రన్ స్వరాలను సమకూరుస్తున్నారు.విజ‌య్ ఆంటోని చిత్రంలో అర్జున్‌?

Updated By ManamFri, 05/18/2018 - 20:01

vijay antoni‘మా పల్లెలో గోపాలుడు’, ‘ప్రతిధ్వని’, ‘మన్నెంలో మొనగాడు’ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన హీరో యాక్షన్ కింగ్ అర్జున్. మధ్యలో అడపాదడపా కొన్ని మంచి సినిమాలతో ప్రేక్షకులను అలరించినా.. శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన ‘జెంటిల్‌మేన్’, ‘ఒకే ఒక్కడు’ చిత్రాలు అర్జున్ స్థాయిని పెంచేశాయి. కాగా.. చాలా కాలం గ్యాప్ తర్వాత గత ఏడాది ‘లై’ సినిమాతో మళ్ళీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారాయ‌న‌. తాజాగా అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘నా పేరు సూర్య’ సినిమాలో కూడా బ‌న్నీకి తండ్రిగా నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు. అలాగే.. తమిళంలో విశాల్ హీరోగా నటించిన ‘ఇరుంబుతిరై’ మూవీలో విలన్ పాత్ర పోషించి.. సినిమా విజయానికి దోహదపడ్డారు యాక్షన్ కింగ్. ఈ సినిమా తెలుగులో 'అభిమ‌న్యుడు' పేరుతో ఈ నెలాఖ‌రులో విడుద‌ల కానుంది.

ఇదిలా ఉంటే.. విజయ్ ఆంటోనీ క‌థానాయ‌కుడిగా ‘కొలైక్కార‌న్‌’ పేరుతో ఓ సినిమా రానుంది. ఈ చిత్రంతో ఆండ్రు దర్శకుడిగా కోలీవుడ్‌కి పరిచయం కానున్నారు. ఇందులోనూ అర్జున్ ఓ కీల‌క పాత్ర పోషించ‌నున్నార‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన‌ మ‌రిన్ని వివ‌రాలు వెల్ల‌డికానున్నాయి.విశాల్‌ డైరెక్ట‌ర్‌తో కార్తి చిత్రం

Updated By ManamFri, 05/18/2018 - 17:20

vishalవిశాల్, సమంత జంటగా డెబ్యు డైరెక్టర్ పి.ఎస్.మిత్రన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన‌ చిత్రం ‘ఇరుంబుతిరై’ (తెలుగులో ‘అభిమన్యుడు’). తమిళనాట  ఈ నెల 11న విడుదలైన ఈ సినిమా.. విమర్శకుల ప్రశంసలను అందుకుంటూ విజయపథంలో దూసుకుపోతోంది. తొలి సినిమాతో ఇటు ప్రేక్షకుల్లోనూ, అటు ఇండస్ట్రీలోనూ మంచి మార్కులే కొట్టేసారు డైరెక్టర్ మిత్రన్. ఇదిలా ఉంటే.. కార్తి త‌దుప‌రి చిత్రాన్ని (కార్తి 17) కూడా ఈ దర్శకుడే తెరకెక్కించనున్నారని తెలిసింది. త్వ‌ర‌లో ప‌ట్టాలెక్క‌నున్న ఈ భారీ బ‌డ్జెట్‌ సినిమాని ‘సింగం2’, ‘మోహిని’ లాంటి చిత్రాల‌ను నిర్మించిన ఎస్.లక్ష్మణ్ కుమార్.. ప్రిన్స్ పిక్చర్స్ ప‌తాకంపై నిర్మించనున్నారు.  
‘ఇరుంబుతిరై’ సినిమాతో విశాల్ నటుడిగా, నిర్మాతగా రెండు విజయాలను సొంతం చేసుకున్నారని.. ఈ విజయాలకి విశాల్ అర్హుడని  కార్తి ఇటీవల ట్వీట్ చేశారు. కాగా.. ప్రస్తుతం కార్తి హీరోగా పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న‌ ‘కడైకుట్టి సింగం’ (తెలుగులో ‘చినబాబు) చిత్రీకరణ తుది దశలో ఉంది. 'అఖిల్' ఫేమ్‌ సయేషా సైగ‌ల్ ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తోంది.‘కాలా’.. ర‌న్ టైమ్‌

Updated By ManamFri, 05/18/2018 - 17:07

kaalaసూపర్ స్టార్ రజనీ కాంత్, డైరెక్టర్ పా.రంజిత్ కలయికలో తెరకెక్కిన చిత్రం ‘కాలా’. రజనీ అల్లుడు, నటుడు ధనుష్ నిర్మాతగా.. వండర్ బేర్ ఫిలిమ్స్ పతాకంపై ఈ సినిమాని నిర్మించారు. మాఫియా డాన్‌గా రజనీ నటించిన‌ ఈ చిత్రానికి.. సంతోష్ నారాయణన్ సంగీత దర్శకత్వం వహించారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా జూన్ 7న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే.. తాజాగా సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకున్న ఈ సినిమాకి.. సెన్సార్ బోర్డు 'యు/ఎ' సర్టిఫికేట్‌ను జారీ చేసింది. కాగా.. ఈ సినిమా ర‌న్ టైమ్‌ 164 నిమిషాలు (2గంట‌ల 44నిమిషాలు) అని తెలిసింది. ఇటీవ‌ల కాలంలో ఎక్కువ నిడివితో విడుద‌లైన సినిమాల‌లో సింహ‌భాగం విజ‌యం సాధించాయి. ఈ నేప‌థ్యంలో ‘కాలా’ కూడా ఆ సెంటిమెంట్‌ను కొన‌సాగిస్తాడేమో చూడాలి.అప్పుడు ట్రాక్ట‌ర్‌.. ఇప్పుడు ఆటో..

Updated By ManamThu, 05/17/2018 - 18:22

sai pallavi‘ఫిదా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మదిని దోచుకున్న తమిళ అమ్మాయి సాయిపల్లవి. తొలి చిత్రంతోనే సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. దాంతో ఈ అమ్మడుకి వరుస అవకాశాలు వచ్చాయి. నానితో 'ఎం.సి.ఎ', నాగశౌర్యతో 'కణం' సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. తమిళంలో రెండు సినిమాలు ఓకే చేసింది. అందులో ఒకటి హీరో సూర్యతో చేస్తున్న ‘ఎన్.జి.కె’ కాగా.. మరో సినిమా ధనుశ్‌తో చేసే ‘మారి 2’. ఈ సినిమాలో సాయిపల్లవి సరికొత్త పాత్రలో ప్రేక్షకులను మెప్పించనుంది. అదేదో కాదు.. ఆటో డ్రైవర్‌ పాత్రలో. ఈ పాత్ర కోసం సాయిపల్లవి ఆటో డ్రైవర్‌గా ట్రైనింగ్ కూడా తీసుకుంటుంది. 'ఫిదా'లో ట్రాక్టర్ నడిపి కుర్రకారును ఆకట్టుకున్న సాయిపల్లవి ఈసారి ఆటోను నడుపనుందన్నమాట.

బాలాజీ మోహ‌న్ రూపొందిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది ద్వితీయార్థంలో తెర‌పైకి రానుంది. అన్న‌ట్టు.. శ‌ర్వానంద్ హీరోగా రూపొందుతున్న 'ప‌డి ప‌డి లేచె మ‌న‌సు'లోనూ సాయి ప‌ల్ల‌వి క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఇందులో బెంగాలీ అమ్మాయిగా ఈ అమ్మ‌డు సంద‌డి చేయ‌నుంది.ప్ర‌భుదేవా.. స్నేహితుడు మాత్రమే!

Updated By ManamTue, 05/15/2018 - 21:13

nikesha'పులి' క‌థానాయిక నికీషా ప‌టేల్ ఇటీవ‌ల‌ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. మ‌ల్టీటాలెంటెడ్ అయిన‌ ప్రభుదేవాని పెళ్ళి చేసుకోవాలని ఉందని నికీషా చెప్పడంతో.. వాళ్లిద్దరి పెళ్ళి ఖరారైపోయిందన్న వార్తలు బ‌లంగా వినిపించాయి. ఈ క‌థ‌నాల‌తో ఉలిక్కిపడిన నికీషా.. ట్విట్టర్‌లో వెంటనే స్పందించింది. తమ పెళ్లి గురించి వ‌స్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని వివ‌ర‌ణ ఇచ్చింది. ‘‘ఈ వార్త బయటికి వచ్చినప్పటి నుంచి ఫోన్ కాల్స్, మెసేజ్‌లు విపరీతంగా వస్తున్నాయి. ప్రభుదేవా, నేను పెళ్లి చేసుకోబోతున్నామన్న వార్తలో నిజం లేదు. ప్రభుదేవా సార్ నాకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే. ప్రస్తుతం నా వర్క్, నా ఫ్యామిలీతో బిజీగా ఉన్నాను. పెళ్లి చేసుకునే ఆలోచన ఇప్పట్లో లేదు'' అంటూ చెప్పుకొచ్చింది నికీషా.  సూర్య చిత్రంలో మోహ‌న్ లాల్‌

Updated By ManamFri, 05/11/2018 - 22:39

suriya'అయ‌న్' (వీడొక్క‌డే), 'మాట్రాన్' (బ్ర‌ద‌ర్స్‌) వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల త‌రువాత క‌థానాయ‌కుడు సూర్య‌, ద‌ర్శ‌కుడు కె.వి.ఆనంద్ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హేరిస్ జైరాజ్ సంగీత‌మందించనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో మ‌లయాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ ఓ కీల‌క పాత్ర చేయ‌నున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం ఈ రోజు (శుక్ర‌వారం) అధికారికంగా ప్ర‌క‌టించింది. లాల్ ఎంట్రీతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిన‌ట్లయ్యింది. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళ‌నుంది.మ‌రోసారి అజిత్ ద్విపాత్రాభిన‌యం

Updated By ManamFri, 05/11/2018 - 15:33

ajith'వాలి', 'బిల్లా' (త‌మిళ్‌) త‌దిత‌ర చిత్రాల‌లో ద్విపాత్రాభిన‌యం చేసి అల‌రించారు త‌మిళ‌న‌టుడు అజిత్‌. ఇప్పుడు మ‌రోసారి ఆయన డ్యూయెల్ రోల్ చేయబోతున్నార‌ని తెలిసింది. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. 'వీర‌మ్' (వీరుడొక్క‌డే), 'వేదాళ‌మ్‌', 'వివేగ‌మ్' (వివేకం) చిత్రాల‌తో అజిత్ కాంబినేష‌న్‌లో హ్యాట్రిక్ విజ‌యాలను అందుకున్న ద‌ర్శ‌కుడు శివ‌.. ప్ర‌స్తుతం 'విశ్వాస‌మ్' పేరుతో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో అజిత్ రెండు పాత్ర‌ల్లో సంద‌డి చేయ‌నున్నార‌ని కోలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. అందులో ఓ పాత్ర కోసం సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్‌తోనూ.. మ‌రో పాత్ర కోసం క్లీన్ షేవ్‌, బ్లాక్ హెయిర్ కాంబో లుక్‌తోనూ క‌నిపించబోతున్నార‌ని తెలిసింది. ఈ రెండు పాత్ర‌లు కూడా అభిమానుల‌ను త‌ప్ప‌క అల‌రిస్తాయ‌ని నిర్మాణ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ సినిమా ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో పాట చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. డి. ఇమాన్ సంగీత‌మందిస్తున్న ఈ చిత్రం దీపావ‌ళి కానుక‌గా తెర‌పైకి రానుంది.హీరోయిన్ ఒరియెంటెడ్ మూవీలో హ‌న్సిక‌

Updated By ManamSat, 05/05/2018 - 16:41

hansikaబాల‌న‌టిగా ప‌రిచ‌య‌మైన హ‌న్సిక‌.. 'దేశ‌ముదురు' చిత్రంతో హీరోయిన్‌గా తొలి అడుగులు వేసింది. ఆ త‌రువాత‌ తెలుగు, త‌మిళ్ భాష‌ల్లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ‌.. హిందీ, క‌న్న‌డ భాష‌ల్లోనూ సంద‌డి చేసింది. ఇదిలా ఉంటే.. ఇప్ప‌టివ‌ర‌కు క‌థానాయిక ప్రాధాన్య‌మున్న చిత్రాల‌కు దూరంగా ఉన్న ఈ అమ్మ‌డు.. ఎట్ట‌కేల‌కు ఓ సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని తెలిసింది. హ‌న్సిక‌ క‌థానాయిక‌గా న‌టించిన త‌మిళ చిత్రం ‘రోమియో జూలియట్‌’కి సహాయ దర్శకుడిగా పనిచేసిన జ‌మాల్.. ఈ చిత్రంతో డైరెక్ట‌ర్‌గా తొలి అడుగులు వేస్తున్నారు. యాక్షన్‌, థ్రిల్లర్ అంశాల‌తో తెర‌కెక్క‌నున్న ఈ త‌మిళ చిత్రం జూన్‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. మొత్తం 55 రోజుల పాటు చిత్రీకరణ ఉంటే.. వాటిలో 25 రోజులు ఐరోపాలో షూటింగ్‌ నిర్వహించనున్నారు. డిసెంబరులో ఈ సినిమా తెర‌పైకి వ‌చ్చే అవ‌కాశ‌ముంది. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డి కానున్నాయి.40 రోజుల‌కి రూ.65 కోట్లు.. ర‌జ‌నీకాంత్ స్టామినా ఇది

Updated By ManamThu, 05/03/2018 - 16:34

rajiniసూపర్‌స్టార్‌ రజనీకాంత్ ఈ ఏడాదిలో రెండు సినిమాల‌తో సంద‌డి చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. జూన్ 7న 'కాలా'తోనూ.. ఈ ఏడాది ద్వితీయార్థంలో '2.0'తోనూ ఆయ‌న ప‌ల‌క‌రించనున్నారు. ఇదిలా ఉంటే.. యువ ద‌ర్శ‌కుడు కార్తిక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలోనూ ర‌జ‌నీ ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఇది ర‌జ‌నీ 165వ చిత్రం కావ‌డం విశేషం. స‌న్ పిక్చ‌ర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజ‌య్ సేతుప‌తి ఓ ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో సంద‌డి చేయ‌నున్నారు. యువ సంగీత సంచ‌ల‌నం అనిరుధ్ సంగీత‌మందించ‌నున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ సినిమా కోసం ర‌జ‌నీ 40 రోజుల కాల్షీట్స్ కేటాయించార‌ని.. అలాగే రూ.65 కోట్ల పారితోషికం తీసుకోనున్నార‌ని తెలిసింది. అయితే.. ఈ వార్త‌ల్లో ఎంత నిజ‌ముందో త్వ‌ర‌లోనే తెలుస్తుంది.

Related News