suriya

సూర్య సరసన ఆఫర్ కొట్టేసిందా..?

Updated By ManamWed, 05/16/2018 - 11:53

suriya  కేవీ ఆనంద్ దర్శకత్వంలో సూర్య 37వ చిత్రంలో నటించనున్నాడు. మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ ఈ చిత్రంలో విలన్‌గా కనిపించనుండగా.. అల్లు శిరీశ్ మరో కీలక పాత్రలో నటించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. కాగా ఈ చిత్రంలో హీరోయిన్‌గా సాయేషా ఎంపికైనట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం కార్తీ సరసన ‘కడై కుట్టి సింగం’ చిత్రంలో నటిస్తున్న సాయేషా తాజాగా సూర్య చిత్రంలో కూడా ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా, హారీశ్ జైరాజ్ సంగీతాన్ని అందించనున్నాడు. కాగా సూర్య ప్రస్తుతం ‘ఎన్జీకే’ చిత్రంలో నటిస్తున్నాడు. అందులో సూర్య సరసన రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి నటిస్తున్నారు. 

 అభిమాన నటుడి సినిమాలో అల్లు వారబ్బాయి

Updated By ManamSun, 05/13/2018 - 11:22

suriya, sirishఅల్లువారిబ్బాయి శిరీశ్ బంపర్ ఆఫర్ కొట్టేశాడు. తన అభిమాన నటుడి సినిమాలో నటించే అవకాశం కొట్టేశాడు. సూర్య, మోహన్ లాల్ కలిసి నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో శిరీష్ కూడా భాగం అవ్వనున్నాడు. ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చేసింది. సూర్య ప్రధాన పాత్రలో కేవీ ఆనంద్ తెరకెక్కిస్తు్న్న ఈ చిత్రంలో మోహన్ లాల్ విలన్‌గా కనిపిస్తుండగా.. అల్లు శిరీశ్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు.

ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పేర్కొన్న అల్లు శిరీశ్.. ‘‘సూర్య 37వ చిత్రంలో భాగం అయినందుకు సంతోషంగా ఉంది. నా అభిమాన నటుడితో తెరను పంచుకోవాలన్న నా కోరిక తీరింది. అలాగే మోహన్ లాల్ గారితో రెండోసారి కలిసి నటిస్తున్నందుకు గర్వపడుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆనంద్‌కు చాలా థ్యాంక్స్’’ అంటూ పేర్కొన్నాడు. ఇక ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా.. హారీష్ జైరాజ్ సంగీతాన్ని అందించనున్నాడు.

 సూర్య చిత్రంలో మోహ‌న్ లాల్‌

Updated By ManamFri, 05/11/2018 - 22:39

suriya'అయ‌న్' (వీడొక్క‌డే), 'మాట్రాన్' (బ్ర‌ద‌ర్స్‌) వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల త‌రువాత క‌థానాయ‌కుడు సూర్య‌, ద‌ర్శ‌కుడు కె.వి.ఆనంద్ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హేరిస్ జైరాజ్ సంగీత‌మందించనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో మ‌లయాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ ఓ కీల‌క పాత్ర చేయ‌నున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం ఈ రోజు (శుక్ర‌వారం) అధికారికంగా ప్ర‌క‌టించింది. లాల్ ఎంట్రీతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిన‌ట్లయ్యింది. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళ‌నుంది.'చిన‌బాబు' మే డే స్పెష‌ల్ పోస్ట‌ర్స్‌

Updated By ManamTue, 05/01/2018 - 18:02

chinababuకార్తీ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం 'చిన‌బాబు'. త‌మిళంలో 'క‌డైకుట్టి సింగ‌మ్‌'గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాకి పాండిరాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సాయేషా సైగ‌ల్‌, ప్రియా భ‌వాని శంక‌ర్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్న ఈ సినిమాకి డి.ఇమాన్ సంగీత‌మందిస్తున్నారు. 2డి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సూర్య‌తో పాటు మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ సినిమాని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. మే డేని పుర‌స్క‌రించుకుని ఈ రోజు (మంగ‌ళ‌వారం) ఈ సినిమాకి సంబంధించిన పోస్ట‌ర్స్‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది. అలాగే.. ఈ సినిమా టీజ‌ర్‌ను త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.chinaసూర్య 37 కోసం లండన్ వెళ్ళిన హేరిస్‌

Updated By ManamTue, 04/10/2018 - 17:31

suriyaతమిళ క‌థానాయ‌కుడు సూర్య న‌టిస్తున్న 36వ‌ చిత్రం ‘ఎన్.జి.కె’. త‌మిళ్‌, తెలుగు భాష‌ల్లో రూపొందుతున్న‌ ఈ సినిమాకి సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తున్నారు. సాయిపల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికలు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, ఎస్.ఆర్.ప్రభు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా స్వరాలను అందిస్తున్న ఈ సినిమా ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా తర్వాత సూర్య.. దర్శకుడు కె.వి.ఆనంద్‌తో కలిసి త‌న తదుపరి చిత్రాన్ని(సూర్య 37) చేయనున్నారు. గ‌తంలో వీరిద్ద‌రి కల‌యిక‌లో ‘అయ‌న్’ (తెలుగులో ‘వీడొక్క‌డే’), ‘మాట్ర‌న్’ (తెలుగులో ‘బ్ర‌ద‌ర్స్‌’) సినిమాలు వచ్చిన సంగతి విదితమే. కాగా.. ఈ సినిమా న్యూయార్క్, బ్రెజిల్, ముంబై, చెన్నై తదితర ప్ర‌దేశాల్లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకోనుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులను కూడా ప్రారంభించారు. ఈ పనుల్లో భాగంగా.. దర్శకుడితో కలిసి మ్యూజిక్ డైరెక్ట‌ర్ హేరిస్ జయరాజ్.. సంగీతం సమకూర్చడం కోసం లండన్ వెళ్లినట్టు సమాచారం. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్‌గా ఆంటోనీ, సినిమాటోగ్రాఫర్‌గా గేవ్‌మిక్ యు. అరి వ్యవహరించనున్నారు.సూర్య‌తో ప్రియా ప్ర‌కాశ్‌?

Updated By ManamTue, 03/20/2018 - 15:48

priya'వింక్ సెన్సేష‌న్' ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌.. ఒక్క క‌న్ను మీటుతో ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోయిన సంగ‌తి తెలిసిందే. ఆమె తొలి మ‌ల‌యాళ చిత్రం 'ఒరు అదార్ ల‌వ్' జూన్ నెల‌లో విడుద‌లకు సిద్ధంగా ఉంది. ఈ లోపే.. ఆమెను మ‌రిన్ని అవ‌కాశాలు వ‌రిస్తున్నాయ‌ని ద‌క్షిణాది సినీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేప‌థ్యంలోనే.. తాజాగా ఈ ముద్దుగుమ్మ‌కు  త‌మిళ స్టార్ హీరో సూర్య‌తో క‌లిసి న‌టించే అవ‌కాశం ద‌క్కింద‌ని క‌థ‌నాలు వినిపించాయి. కె.వి.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో సూర్య న‌టించ‌నున్న చిత్రం కోసం క‌థానాయిక‌గా ప్రియా ప్ర‌కాశ్ ఎంపిక‌య్యింద‌ని వార్త‌లు వ‌చ్చాయి.

అయితే.. ద‌ర్శ‌కుడు కె.వి.ఆనంద్ ఈ విష‌యాన్ని త్రోసిపుచ్చారు. ఇంకా క‌థానాయిక ఎంపిక పూర్తికాలేద‌ని.. త్వ‌ర‌లోనే ఆ విష‌యాన్ని తెలియ‌జేస్తామ‌ని చెప్పారు. ప్రియా ప్ర‌కాశ్ పేరు ప‌రిశీల‌నలోకి కూడా రాలేద‌ని.. ఆ వార్త‌లంతా అబ‌ద్ధాలేన‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. 'టెంప‌ర్' హిందీ రీమేక్‌లో కూడా ప్రియా పేరు వినిపించినా.. ఇప్పుడా అవ‌కాశం సారా అలీ ఖాన్‌కు ద‌క్కింది. మొత్త‌మ్మీద‌.. ప్రియా పేరుని గాసిప్స్‌కు బాగానే వాడుకుంటున్నారు.సూర్య, కె.వి.ఆనంద్ మూవీ అప్‌డేట్‌

Updated By ManamTue, 03/13/2018 - 16:31

suriya'వీడొక్క‌డే' (త‌మిళంలో 'అయ‌న్‌'), 'బ్ర‌ద‌ర్స్' ('మాట్రాన్‌') వంటి వైవిధ్య‌మైన చిత్రాల త‌రువాత త‌మిళ క‌థానాయ‌కుడు సూర్య‌, డిఫ‌రెంట్ చిత్రాల ద‌ర్శ‌కుడు కె.వి.ఆనంద్ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రానున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌నున్న ఈ సినిమాకి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలిసింది. సూర్య‌, ఆనంద్ కాంబినేష‌న్‌లో ఇదివ‌ర‌కు వ‌చ్చిన‌ రెండు చిత్రాల‌కు సంగీత ద‌ర్శ‌కుడైన‌ హేరిస్ జైరాజ్‌నే.. కొత్త సినిమాకి కూడా స్వ‌రాలు అందించ‌నున్నారు.

లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'బ‌రేలీ కా బ‌ర్ఫీ' (హిందీ) ఫేమ్ గేవ్‌మిక్ యూ ఆరీ ఛాయాగ్ర‌హ‌ణం అందించ‌నుండ‌గా.. డీఆర్‌కే కిర‌ణ్ ప్రొడ‌క్ష‌న్ డిజైన్ చేయ‌నున్నారు. ప‌ట్టుకోట్టై ప్ర‌భాక‌ర్ సంభాష‌ణ‌లు అందించ‌నున్నారు. క‌థానాయిక, ఇత‌ర న‌టీన‌టుల వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డి కానున్నాయి. కాగా, ప్ర‌స్తుతం సూర్య‌.. సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో 'ఎన్‌.జి.కె' చిత్రాన్ని చేస్తున్నారు. ర‌కుల్ ప్రీత్ సింగ్‌, సాయి ప‌ల్ల‌వి హీరోయిన్స్‌గా న‌టిస్తున్న ఈ సినిమా దీపావ‌ళికి విడుద‌ల కానుంది.సూర్య 36 టైటిల్, ఫ‌స్ట్ లుక్‌ వ‌చ్చేసింది

Updated By ManamMon, 03/05/2018 - 17:14

ngkత‌మిళ క‌థానాయ‌కుడు సూర్య హీరోగా సెల్వ రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. సాయి ప‌ల్ల‌వి, ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రానికి యువ‌న్ శంక‌ర్ రాజా సంగీత‌మందిస్తున్నారు. సోమ‌వారం ద‌ర్శ‌కుడు సెల్వ రాఘ‌వ‌న్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్‌, ఫ‌స్ట్ లుక్‌ను చిత్ర విడుద‌ల చేసింది. ఈ సినిమాకి 'ఎన్‌.జి.కె' అనే టైటిల్ క‌న్‌ఫ‌ర్మ్ చేశారు. అలాగే ఫ‌స్ట్ లుక్‌లో సూర్య చాలా ఢిప‌రెంట్‌గా క‌నిపిస్తున్నారు. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం దీపావ‌ళి కానుక‌గా తెర‌పైకి రానుంది.సూర్య 36.. టైటిల్‌, ఫ‌స్ట్ లుక్‌పై మ‌రో అప్‌డేట్‌

Updated By ManamSun, 03/04/2018 - 16:46

suriya 36త‌మిళ క‌థానాయ‌కుడు సూర్య‌.. సెల్వ రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. న‌టుడిగా ఆయ‌న‌కు ఇది 36వ చిత్రం. సాయి ప‌ల్ల‌వి, ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ సినిమాకి యువ‌న్ శంక‌ర్ రాజా సంగీత‌మందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ మార్చి 5న విడుద‌ల చేస్తున్న‌ట్లు ఇప్ప‌టికే చిత్ర బృందం ప్ర‌క‌టించింది. తాజాగా.. రేపు (సోమవారం) సాయంత్రం 5 గంట‌ల‌కు వీటిని రిలీజ్ చేస్తున్న‌ట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. కాగా, దీపావ‌ళి కానుక‌గా ఈ సినిమా తెర‌పైకి రానుంది.సూర్య 36.. ఫ‌స్ట్ లుక్, టైటిల్‌ డిటైల్స్‌

Updated By ManamTue, 02/27/2018 - 18:09

suriyaత‌మిళ క‌థానాయ‌కుడు సూర్య‌.. ప్ర‌స్తుతం సెల్వ రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సూర్య‌కి న‌టుడిగా ఇది 36వ చిత్రం కావ‌డం విశేషం. ఇందులో సూర్య‌కి జోడీగా సాయిపల్ల‌వి, ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తున్నారు. కాగా, ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌,  టైటిల్‌ను మార్చి 5న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర బృందం ప్ర‌క‌టించింది. యువ‌న్ శంక‌ర్ రాజా సంగీత‌మందిస్తున్న ఈ సినిమా దీపావ‌ళి కానుక‌గా తెర‌పైకి రానుంది.
Related News