TTD

టీటీడీ పేరు మార్చండి

Updated By ManamTue, 11/20/2018 - 15:24

YS Jagan Mohan Reddy, Kiranmaiవిజయనగరం: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పేరు మార్చాలని ప్రముఖ గాయని, ఆధ్యాత్మికవేత్త కొండవీటి కిరణ్మయి, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి విన్నవించారు. టీటీడీ పాలక మండలి పేరును ధార్మిక సేవా సంస్థగా మార్చాలని ఆమె విఙ్ఞప్తి చేశారు. మంగళవారం జగన్ పాదయాత్రలో ఆయనను కలిసిన కిరణ్మయి.. తిరుమల తిరుపతి దేవస్థానంలో రాజకీయ జోక్యం ఎక్కవయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.

అలాగే తిరుమల చుట్టూ 25 కి.మీ పరిధిలో మద్యం అమ్మకాలు నిషేధించడంతో పాటు, టీటీడీ పవిత్రతను కాపాడాలని ఆమె కోరారు. ఇక రాజకీయ నాయకులు, సినీ ప్రముఖుల స్థానంలో సంఘ సేవలో ఉన్న వారిని టీటీడీ బోర్డులో నియమించాలని ఆమె తెలిపారు. వీటిపై సానుకూలంగా స్పందించిన జగన్.. టీటీడీ బోర్డు ప్రక్షాళన గురించిన ఆలోచన తనకు కూడా ఉందని అన్నారు.టీటీడీ న్యూఇయర్ డైరీలు రెడీ..

Updated By ManamSun, 10/28/2018 - 09:42
 • భక్తులకు అందుబాటులోకి తెచ్చిన టీటీడీ.. ఆన్‌లైన్‌లోనూ బుక్ చేసుకునే సదుపాయం

 • తపాలా శాఖ ద్వారా విదేశాలకు సైతం .. డీడీ తీసి పంపినా చాలు డైరీ అందజేత

తిరుపతి: టీటీడీ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన 2019వ సంవత్సరం క్యాలెండర్లు, డైరీలు భక్తులకు తగినన్ని అందుబాటులో ఉన్నాయి. 12 పేజీల క్యాలెండర్, పెద్ద డైరీ, చిన్న డైరీ, టేబుల్ టాప్ క్యాలెండర్, వేంకటేశ్వర స్వామివారి పెద్ద క్యాలెండర్, పద్మావతి అమ్మవారి పెద్ద క్యాలెండర్, శ్రీవారు, శ్రీ పద్మావతి అమ్మవారు కలిసి ఉన్న క్యాలెండర్, తెలుగు పంచాంగం క్యాలెండర్లను టీటీడీ ముద్రించింది. తిరుమలలోని శ్రీవారి ఆలయం ఎదురుగా, లడ్డూ కౌంటర్ల వద్ద, లేపాక్షి ఎదుట, అన్నదాన భవనం లోని పుస్తక విక్రయశాలల్లో, తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయం వద్దగల ధ్యానమందిరం, రైల్వేస్టేషన్, శ్రీనివాసం, విష్ణు నివాసం, తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్దగల పుస్తక విక్రయశాలల్లో క్యాలెండర్లు, డైరీలు అందుబాటులో ఉన్నాయి.

image


విజయవాడ, వైజాగ్, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబయిలోని టీటీడీ సమాచార కేంద్రాల్లోనూ క్యాలెం డర్లు, డైరీలను టీటీడీ భక్తులకు అందుబాటులో ఉంచింది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల తొలిరోజైన సెప్టెంబరు 13న రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు 2019వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించారు. రూ.100/- విలువైన 12 పేజీల క్యాలెండర్లు 16 లక్షలు, రూ.130/- విలువైన పెద్ద డైరీలను 8 లక్షలు, రూ.100/- విలువైన చిన్నడైరీలు 2 లక్షలు, రూ.60/- విలువైన టేబుల్ టాప్ క్యాలెండర్లు 50 వేలు, రూ.15/- విలువైన శ్రీవారి పెద్ద క్యాలెండర్లు 4 లక్షలు, రూ.15/- విలువైన శ్రీ పద్మావతి అమ్మవారి క్యాలెండర్లు 10 వేలు, రూ.10/- విలువైన శ్రీవారు, శ్రీపద్మావతి అమ్మవారి క్యాలెండర్లు 6 లక్షలు, రూ.20/- విలువైన తెలుగు పంచాంగం క్యాలెండర్లు 2.50లక్షల కాపీలను టీటీడీ ముద్రించింది.

ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే సదుపాయం
టీటీడీ క్యాలెండర్లు, డైరీల ఆన్‌లైన్ బుకింగ్‌కు భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఇప్పటివరకు దాదాపు 8 వేల డైరీలు, క్యాలెండర్లను భక్తులు బుక్ చేసుకున్నారు. 12 పేజీల క్యాలెండర్, డైరీని భక్తులు బుక్ చేసుకునేందుకు వీలుగా 2017వ సంవత్సరం నుండి ఆన్‌లైన్‌లో టిటిడి అందుబాటులోహొ ఉంచుతోంది. నూతన సంవత్సరం కానుకగా తమ బంధువులకు, స్నేహితులకు తపాలా శాఖ ద్వారా పంపే అవకాశాన్ని టిటిడి కల్పించింది. భక్తులు ్ట్టఛీట్ఛఠిౌ్చజూజ్ఛీ.ఛిౌఝ వెబ్‌సైట్‌లో ‘’పబ్లికేషన్స్’’ను క్లిక్ చేసి డెబిట్‌కార్డు, క్రెడిట్ కార్డులతో ఆర్డరు చేయవచ్చు. టీటీడీ క్యాలెండ ర్లు, డైరీలు తపాలా శాఖ ద్వారా ఇంటి వద్దకే వచ్చి చేరుతుండడంతో ఎక్కువ మంది భక్తులు ఉత్సాహంగా బుక్ చేసుకుంటున్నారు. భక్తులు ఎన్ని క్యాలెండర్లు, డైరీలనైనా బుక్ చేసుకోవచ్చు.

విదేశాల్లోని భక్తులకు సైతం..
ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే విదేశాల్లోని భక్తులకు తపాలా శాఖ ద్వారా డైరీలు, క్యాలెండర్లను అందించేలా టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. తపాలా శాఖ నిర్దేశిత ఛార్జీలను వసూలుచేసి నిర్ణీత సమయంలో బట్వాడా చేస్తోంది. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న భక్తులకు బట్వాడా సమాచారాన్ని ఎస్‌ఎంఎస్ ద్వారానూ తెలియజేస్తున్నారు.

డీడీ తీసి పంపితే చాలు .. 
టీటీడీ క్యాలెండర్, డైరీలను పోస్టు ద్వారానూ భక్తులు పొందవ చ్చు. ఇందుకోసం ‘’కార్యనిర్వహణాధికారి, టీటీడీ, తిరుపతి’ పేరిట ఏదైనా జాతీయ బ్యాంకులో డీడీ తీసి కవరింగ్ లెటర్‌తో కలిపి ‘’సహాయ కార్యనిర్వహణాధికారి, పుస్తక ప్రచురణల విక్రయ విభాగం, ప్రెస్ కాంపౌండ్, కేటీరోడ్, తిరుపతి’’ అనే చిరునామాకు పంపాల్సి ఉంటుంది. టు పే విధానం (పోస్టల్ చార్జీలు అదనం) ద్వారా భక్తులకు టీటీడీ క్యాలెండర్, డైరీలను పంపిస్తామని తెలిపారు.రమణదీక్షితులపై రూ.200కోట్ల పరువునష్టం దావా

Updated By ManamWed, 10/24/2018 - 12:29

Ramana Deekshituluతిరుపతి: టీటీడీ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులపై ఆ బోర్డు రూ.200కోట్ల మేర పరువు నష్టం దావా వేసింది. వయసును నిర్దేశిస్తూ ప్రధానార్చకుడి పదవి నుంచి టీటీడీ రమణ దీక్షితులను తొలగించగా.. ఆ తరువాత ఆ బోర్డుపైనా, అధికారుల తీరుపైనా ఆయన తీవ్ర విమర్శలు చేశారు.

స్వామివారి నగలు అన్యాక్రాంతం అవుతున్నాయని, కోట్లాడి రూపాయల విలువైన ఆభరణాలను అధికారులు మాయం చేశారని.. ఆలయంలోని నేల మాళిగల్లో ఉన్న అపార సంపదను కొల్లగొట్టేందుకు ఎవరికీ తెలియకుండా తవ్వకాలు జరిపించారని ఇలా పలు సంచలన ఆరోపణలు చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా రమణ దీక్షితులు ఆరోపణలు చేశారని.. దీంతో ఆలయ పరువు పోయిందని టీటీడీ దావాను వేసింది. కోర్టు ఫీజుగా రూ.2కోట్లను చెల్లించింది టీటీడీ.ఫారిన్ సర్వీసు నుంచి వస్తే మూడేళ్లే

Updated By ManamTue, 10/09/2018 - 22:52
 • టీటీడీలో ఉద్యోగులకు కాలపరిమితి

 • అలిపిరి వద్ద 500 గదుల నిర్మాణం

 • ఉద్యోగులందరి సమస్యలపై కమిటీ 

 • ఉద్యోగులకు పరకామణి విధుల రద్దు

 • టీటీడీ బోర్డు సమావేశంలో నిర్ణయాలు

ttdతిరుమల: ఫారిన్ సర్వీసు నుంచి టీటీడీకి వచ్చిన ఉద్యోగులను మూడేళ్ల కాలపరిమితి అయిన తరువాత మాతృసంస్థకు బదిలీ చేయాలని నిర్ణయం తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) ట్రస్టు బోర్డు నిర్ణయం తీసుకుని ఒకసారి వచ్చిన వారిని రెండోసారి విధుల్లోకి తీసుకోరాదని కూడా నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది. ధర్మకర్తల మండ లి అధ్యక్షులు పుట్టా సుధాకర్‌యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమా వేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. తరువాత ఆయన ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్‌తో కలసి విలేకరులతో మాట్లాడుతూ అలిపిరి వద్ద భక్తుల సౌకర్యార్థం మొదటి దశలో రూ.120 కోట్లతో దాదాపు 500 గదులతో వసతి సముదాయం నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తిరుమలలోని వసతిగృహాల ఆధునీకరణ, ఇతర మౌలిక సౌకర్యాల కల్పనకు టీటీడీ బోర్డు ఎఫ్‌ఎంఎస్ సబ్ కమిటీ చేసిన సిఫార్సులను ఆమోదించినట్లు తెలిపారు. దీనికి రూ.112 కోట్లు ఖర్చు కానుందని తెలిపారు. టీటీడీలో పనిచేస్తున్న రెగ్యులర్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వృత్తిపరంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ఒక కమిటీ ఏర్పాటు చేయడానికి ఆమోదించినట్లు తెలిపారు. టీటీడీ విద్యాసంస్థల్లోని బోధనా సిబ్బందికి పదవీ విరమణ లేదా మరణించిన సందర్భాలలో ఆర్జిత సెలవు, అర్ధవేతన సెలవుల నగదు మార్పిడికి సంబంధించి జి.ఓ.నం.90 అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. టీటీడీఆధ్వర్యంలోని జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ఆదరణ ఎక్కువ గా ఉన్న గ్రూపులలో సీట్ల సంఖ్యను పెంచి, తక్కువ ఉన్న గ్రూపు లలో తగ్గించనున్నామని అన్నారు. టీటీడీ సిబ్బంది విజ్ఞప్తి మేరకు వారికి పరకామణి డిప్యూటేషన్ విధులను రద్దు చే స్తున్నట్లు తెలిపారు. ఒకేచోట మూడేళ్లు పనిచేసిన టీటీడీ ఉద్యోగులను మరో విభాగానికి బదిలీ చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని నవంబరు 1 నుంచి అమలు చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, రాష్ట్ర దేవాదాయశాఖ ముఖ్యకార్య దర్శి మన్‌మోహన్ సింగ్, కమిషనర్ ఎం.పద్మ, ధర్మకర్తల మండలి సభ్యులు సుధా నారాయణమూర్తి, రాయపాటి సాంబశివరావు, బోండా ఉమామహేశ్వరరావు, ఇ.పెద్దిరెడ్డి, రుద్రరాజు పద్మరాజు, మేడా రామకృష్ణారెడ్డి, చల్లా రామచంద్రారెడ్డి, బీకె.పార్థసారధి, జిఎస్‌ఎస్. శివాజి, సండ్ర వెంకటవీరయ్య, డొక్కా జగన్నాథం, ప్రత్యేక ఆహ్వాని తులు రాఘవేంద్రరావు, ఎన్.శ్రీకృష్ణ, తిరుమల జేఈవో కె.ఎస్.శ్రీనివాసరాజు, తిరుపతి జేఈవో పోల భాస్కర్ పాల్గొన్నారు. బ్రహ్మోత్సవం

Updated By ManamThu, 09/20/2018 - 00:21

గరుడ సేవ 
తిరుమలలో శ్రీవారి గరుడ సేవలకు ప్రత్యేకత ఉంది. అ రోజున గరుడ పక్షి కూడా తిరుమలలో విహరిస్తుంది.  దీని కోసం స్థానికులతో పాటు, వివిధ ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో తిరుమలకు చేరుకుంటారు. గరుడ వాహన సేవ కు 2 లక్షల మందికి పైగా భక్తులు రాగా వీరిలో తమిళనాడు నుంచి వచ్చే భక్తుల్లో ఎక్కువ శాతం నడిచి వచ్చారు. ఇందుకు తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు నుంచి గోదాదేవి అలంకరించుకున్న మాలలు,  చెన్నై నుంచి అలంకృతమైన గొడుగులు కూడా స్వామి వారి కోసం ప్రత్యేకంగా వస్తాయి. ఆ తరువాతి రోజుమలయప్పస్వామి శ్రీరాముడి భక్తుడైన హనుమంత వాహనంలో, అదే రోజు సాయంత్రం స్వర్ణరథంపై.. రాత్రి గజ వాహనంపై ఊరేగారు. మరుసటి రోజు సూర్య ప్రభ, చంద్ర ప్రభ వాహనాలపై స్వామి ఊరేగారు. 
 

image


ఆధ్యాత్మిక ఆకర్షణలు
బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా 4 గజ రాజులు, 4 అశ్వాలు, 4 వృషభాలను వాహన సేవలకు వినియోగించారు. వాహన సేవల్లో స్వామివారి వైభవాన్ని వ్యాప్తి చేసేలా దాస సాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టులతో పాటు అళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు, ఎస్వీ సంగీత కళాశాలలు కనుల విందుగా కళా ప్రదర్శనలు ఏర్పాటు చేశాయి. భరతనాట్యం, గాత్ర, సంగీత కచేరీలు, ధార్మిక ఉపన్యాసాల ద్వారా భక్తుల్లో ఆధ్యాత్మికత నింపారు.  అక్టోబరు 10 నుంచి 18వ తేదీ వరకు తిరుమల గిరులు మరోమారు బ్రహ్మోత్సవ శోభను సంతరించుకోనున్నాయి.
 మోహినీ అవతారంలో జగన్మోహనుడు

Updated By ManamMon, 09/17/2018 - 16:20
lord venkateswara in mohini avataram

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవ రోజైన సోమవారం ఉదయం శ్రీహరి మోహినీ రూపంలో శృంగార రసాధి దేవతగా సర్వాలంకార భూషితుడై భక్తులకు దర్శనమిచ్చాడు. పక్కనే శ్రీకృష్ణుడు అలంకృతుడై మరో తిరుచ్చిపై భక్తులకు అభయమిచ్చాడు. ఏనుగులు, అశ్వాలు ఠీవిగా ముందు కదులుతుండగా భక్తుల కోలాటాలు, డ్రమ్స్‌ వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ ఊరేగింపు అత్యంత రమణీయంగా జరిగింది.

ఈ అవతారం ద్వారా జగత్తు అంతా మాయామోహానికి లొంగివుందని, అదంతా తన లీలా విలాసమేనని, తన భక్తులు కానివారు ఈ జగన్మాయలోలులు కాక తప్పదని స్వామివారు చాటి చెబుతున్నారు.  రాత్రి 7 నుంచి 12 గంటల వరకు గరుడవాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించనున్నారు.

Srivari Brahmotsavam 2018 – MOHINI AVATARAMజగన్నాటక సూత్రధారియైన శ్రీమలయప్పస్వామివారు సోమవారం రాత్రి గరుడవాహనంపై తిరుమాడ వీధులలో నింపాదిగా ఊరేగుతూ భక్తులందరికీ తన దివ్యమంగళ రూపదర్శనమిస్తారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది.

ఇదేరోజు తిరుమలలో శ్రీవారు శ్రీవిల్లిపుత్తూరు నుండి విచ్చేసిన ప్రత్యేక మాలలు, చెన్నై నుండి వచ్చిన అలంకృత ఛత్రాలు స్వామివారి గరుడవాహన సేవకు మరింత శోభను చేకూర్చుతాయి. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటి నమ్మకం.

Srivari Brahmotsavam 2018 – MOHINI AVATARAMఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు పుట్టా సుధాకర్ యాదవ్, కార్యనిర్వహణాధికారి అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల సంయుక్త కార్యనిర్వహణాధి శ్రీనివాసరాజు, బోర్డు సభ్యులు మేడా రామకృష్ణారెడ్డి, శ్రీమతి సుధా నారాయణమూర్తి,  పొట్లూరి రమేష్ బాబు, ప్రత్యేక ఆహ్వానితులు  రాఘవేంద్రరావు, ఎన్.కృష్ణ, ఆలయ డెప్యూటి ఈఓ హరీంద్రనాథ్, పేష్కార్  రమేష్ తదితరులు పాల్గొన్నారు.
 నేలను తాకిన ఉత్సవ విగ్రహం!

Updated By ManamSun, 09/09/2018 - 05:44
 • తిరుమల ఆలయంలో ఘటన.. నేలను తాకిన మలయప్ప విగ్రహం

 • ఆగమోక్తంగా లఘు సంప్రోక్షణ.. మడతపడిన అర్చకస్వామి కాలు

 • తిరుమల ఆలయంలో ఘటన

ttdతిరుమల: తిరుమల వేంకటేశ్వర స్వామి వారి ఉత్సవ విగ్రహం నేలను తాకింది. తిరుమల ఆలయంలో శనివారం సాయంత్రం బంగారు వాకిలి నుంచి గర్భాలయానికి శ్రీ మలయప్పస్వామి వారిని (ఉత్సవ విగ్రహాన్ని) అర్చక స్వాములు తీసుకువెళ్తున్న సందర్భంలో, అర్చకస్వామి కాలు మడత పడి, నేలపైకి జారడం వలన శ్రీ మలయప్పస్వామివారి విగ్రహం నేలను తాకింది. ఇందుకు సంబంధించి ప్రధాన అర్చకులు, ఆగమ సలహాదారు వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహదారు ఎన్.ఎ.కె.సుందరవరద భట్టచార్యుల సూచనల మేరకు ప్రాయశ్చిత్తంగా శ్రీవారి యాగశాలలో వైఖానస ఆగమోక్తంగా లఘు సంప్రోక్షణ నిర్వహించారు.బ్రహ్మోత్సవాలకు వాహనాలు సిద్ధం

Updated By ManamSat, 09/08/2018 - 23:18
 • వాహనాల్లో బ్రహ్మాండనాయకుని ఊరేగింపు

 • మెరుగుపట్టి తళతళ మెరిపించిన కార్మికులు

 • గరుడవాహన సేవకు రానున్న గొడుగులు 

imageతిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలకు వాహనాలన్నీ సిద్ధమయ్యాయి. ఈనెల 13వ తేదీ నుంచి జరగనున్న బ్రహ్మోత్సవాలలో అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుని ఊరేగించడానికి అన్ని వాహనాలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. కార్మికులు కష్టపడి.. అన్ని వాహనాలకు మెరుగుపెట్టి తళతళలాడేలా చేశారు. వాహనాలు తిరువీధుల్లో తిరిగే సమయంలో, అక్కడి దీపాల కాంతిలో మరింతగా మెరుస్తూ భక్తులకు దర్శనమిస్తుంటాయి. ఈ వాహనాల్లో  గరుడ వాహనానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది.

బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజున... అంటే ఈనెల 17వ తేదీన రాత్రి ఏడు గంటలకు గరుడవాహన సేవ ప్రారంభమవుతుంది. శ్రీవారు మలయప్పస్వామి రూపంలో తిరువీధుల్లో తిరుగుతారు. పౌరాణిక నేపథ్యం ప్రకారం 108 వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడసేవ ప్రాముఖ్యత సంతరించుకుంది. దాస్యభక్తితో కొలిచే భక్తులకు తానుimage దాసుడినవుతానని గరుడవాహనం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నారు. మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలుగుతాయని స్వామివారి భక్తకోటికి తెలియజేసే వాహనసేవ అని అంటారు. అదేవిధంగా శ్రీహరికి అత్యంత సన్నిహతుడైన ఆదిశేషుని కూడా తన వాహనంగా చేసుకుని పెద్దశేష వాహనంపై ఊరేగుతారు. ఆదిశేషుడు రామావతారంలో లక్ష్మణుడిగాను, కృష్ణావతారంలో బలరాముడిగా స్వామికి సన్నిహితులుగా ఉండేవారట. చిన్న శేషవాహనాన్ని వాసుకిగా భావిస్తారు. భక్తులకు కోరుకున్న ఫలాలను అందజేసే కల్పవృక్ష వాహనాలలో 15వ తేదీన ఉదయం స్వామివారు విహరించనున్నారు. అదేవిధంగాశ్రీవారు సకల దిక్పాలకులకు రారాజని తెలియజేసేలా సర్వభూపాల ఊహనంపై 16వ తేదీన రాత్రి 8 గంటలకు ఊరేగుతారు. హనుమంతుడు భగవత్ భక్తులలో అగ్రగణ్యుడు కావడంతో గురుశిష్యతత్వాన్ని బోధించేందుకు హనుమంత వాహనంపై ఈనెల 18వతేదీన ఉదయం ఊరేగనున్నారు.

సూర్యప్రభ వాహనంపై శ్రీనివాసుని దర్శించుకున్నవారికి ఆరోగ్య, విద్య, ఐశ్వర్యం, సంతానం లాంటి ఫలాలను imageసూర్యదేవుని అనుగ్రహం ద్వారా అందుతాయి. అదే విధంగా చంద్రప్రభ వాహనంలో స్వామి వారిని దర్శించుకునే భక్తుల హృదయాల నుంచి ఆనందరసం స్రవిస్తుంది. శ్రీవారి రథోత్సవాన్ని తిలకించే భక్తులకు స్థూలశరీరం వేరు.. సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. స్వామివారు అశ్వ వాహనారూఢుడై కల్కి అవతారంలో తన స్వరూపాన్ని ప్రకటిస్తూ భక్తులను కలిదోషాలకు దూరంగా ఉండాలని అశ్వవాహనం తెలియజేస్తుంది. శ్రీవారి సరసన ఉన్న చక్రత్తాళ్వార్లకు పాలు పెరుగు, నెయ్యి, తేనె, చందనంతో అర్చకులు అభిషేకం చేస్తారు. చక్రస్నానం సమయంలో అధికారులు, భక్తులు అందరూ పుష్కరిణిలో స్నానం చేసి యజ్ఞఫలాన్ని పొందుతారు. బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యి, ధ్వజావరోహణంతో ముగుస్తాయి. ఇవికాకుండా చిన్న శేష వాహనం, హంసవాహనం, సింహ వాహనం, ముత్యపుపందిరి వాహనం, మోహినీ అవతారం, స్వర్ణరథం సేవలు ఉంటాయి. ఒక్కో వాహనాన్ని దర్శించుకునే భక్తులు తదనుగుణంగా పుణ్య ఫలాలను పొందుతారు.

ఈ వాహనాలన్నింటినీ గత కొన్ని రోజులుగా సిద్ధం చేస్తూ వచ్చారు. శనివారం నాటికి అన్ని వాహనాలు శ్రీవారి సేవలకు సిద్ధంగా ఉండేలా తీర్చిదిద్దారు. గరుడ వాహనం రోజున స్వామివారికి కొత్త గొడుగులు వివిధ ప్రాంతాల నుంచి వస్తాయి. గతంలో చెన్నై నుంచి ఒక ఛారిటీ సంస్థ గొడుగులను తీసుకుని వస్తుండగా, గత కొన్నేళ్లుగా పలు సంస్థలు గొడుగులను పంపుతున్నాయి. నన్ను తొలగించి గుట్టుగా 30లక్షలు అకౌంట్లో వేశారు: రమణ దీక్షితులు 

Updated By ManamWed, 08/29/2018 - 10:52

Ramana Deekshituluతిరుపతి: టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా తన బ్యాంకు ఖాతాలోకి టీటీడీ అధికారులు రూ.30 లక్షలు డిపాజిట్ చేశారని రమణ దీక్షితులు ఆరోపించారు. ఆ తరువాత ఇవే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అని అధికారులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం తాను అసలు దరఖాస్తే చేయలేదని రమణ దీక్షితులు స్పష్టం చేశారు. ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా టీటీడీలో జరుగుతున్న అక్రమాలను బయటపెట్టినందుకే కక్షపూరితంగా బాధ్యతల నుంచి తనను తొలగించారన్నారు.

ఇక తన నియామకం వంశపారంపర్య హక్కుల కింద జరిగిందనీ, సర్వీస్ రూల్స్ ప్రకారం కాదని.. అందువల్లే గత 30 ఏళ్ల పాటు తనకు ఎలాంటి అలవెన్సులు, ఇతర సదుపాయాలు కల్పించలేదని రమణదీక్షితులు వెల్లడించారు. తనతో పాటు బలవంతంగా తొలగించిన అర్చకుల బ్యాంకు ఖాతాల్లోనూ ఇలాగే డబ్బును డిపాజిట్ చేశారని పేర్కొన్నారు. ఎలాంటి అధికారిక ఉత్తర్వులు, రసీదులు లేకుండా దరఖాస్తు చేయకుండా అధికారులు ఈ మొత్తాన్ని బ్యాంకు ఖాతాల్లో వేశారనీ, టీటీడీ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని చెప్పడానికి ఇదే సాక్ష్యమని రమణ దీక్షితులు అన్నారు.బ్రహ్మోత్సవ శోభ

Updated By ManamTue, 08/28/2018 - 07:13
 • తిరుమలలో 13 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు

 • సెప్టెంబరు 12వ తేదీన అంకురార్పణ.. అక్టోబరు 10 నుంచి నవరాత్రి ఉత్సవాలు 

 • గంట ముందే వాహన సేవలు ప్రారంభం.. భక్తులకు సౌకర్యవంతంగా ఉండాలనే...

 • 13న తిరుమలకు సీఎం చంద్రబాబు?.. బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతున్న తిరుమల 

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 13వ తేదీ నుంచి జరగనున్నాయి. దీనికిగాను తిరుమల, తిరుపతిలను అత్యంత శోభాయమానంగా టీటీడీ తీర్చిది ద్దుతోంది. ఇల వైకుంఠాన్ని తలపించేలా అలంకరణలు, విద్యుత్తు దీపాలతో పాటు భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేలా ముందస్తు చర్యలను తీసుకుంటోంది. ఈసారి అధికమాసం ఉండటంతో రెండు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. సెప్టెంబరు 13 నుంచి 21వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుండగా, అక్టోబరు పదో తేదీ నుంచి 18వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. రెండు బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లను టీటీడీ చేపడుతోంది.  అయితే ఈసారి వాహన సేవలలో స్వల్ప మార్పులు ఉండబోతున్నాయి.

image


ఉదయం జరిగే వాహనసేవలు యథావిధిగా ఉదయం 9.00 గంటల నుంచి 11.00 గంటల వరకు కొనసాగుతాయి. అయితే రాత్రి సమయాల్లో జరిగే వాహన సేవలను భక్తుల సౌకర్యార్థం ఒక గంట ముందుగా చేపడుతున్నారు.  రాత్రి 9.00 గంటలకు బదులుగా రాత్రి 8.00 గంటల నుంచే వాహన సేవలు ప్రారంభించి, పది గంటలకు మగిసేలా చర్యలు తీసుకుంటున్నారు. బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టైమెన గరుడ సేవను మరో గంట ముందుగా అంటే రాత్రి 7.00 గంటలకే ప్రారంభిస్తారు.  బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని, సెప్టెంబరు 11వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపడతారు. 12వ తేదీన బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజారోహణం రోజున  అంటే ఈనెల 13వ తేదీ తిరుమలకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అయితే ఆయన పర్యటన పూర్తిస్థాయిలో ఖరారు కాలేదని తెలిపారు.

బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల వివరాలు 
13.09.2018      ధ్వజారోహణం-పెద్ద శేష వాహనం
14.09.2018     చిన్న శేష వాహనం-హంస వాహనం
15.09.2018     సింహ వాహనం- ముత్యపు పందిరి వాహనం
16.09.2018    కల్పవృక్ష వాహనం-సర్వభూపాల వాహనం 
17.09.2018    మోహినీ అవతారం-గరుడవాహనం 
18.09.2018    హనుమంత వాహనం-స్వర్ణరథం- గజవాహనం
19.09.2018    సూర్యప్రభ వాహనం-చంద్రప్రభ వాహనం
20.09.2018     రథోత్సవం-అశ్వ వాహనం
21.09.2018    చక్రస్నానం-ధ్వజావరోహణం

Related News