anu emmanuel

నాగ్ సినిమాలో అను

Updated By ManamSat, 09/15/2018 - 23:30

యువ హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా ఎంతో హుషారుగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు హీరో నాగార్జున. అంతేకాదు మల్టీస్టారర్స్‌లో కూడా నటించేందుకు సిద్ధపడుతున్నారు. నాగార్జున, నాని కలిసి నటిస్తున్న ‘దేవదాస్’ సెప్టెంబర్ 27న విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే ఓ తమిళ సినిమాలో కూడా నటించేందుకు నాగ్ ఓకే చెప్పారు. హీరో ధనుష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నాగార్జున నటిస్తున్నారు.

image


తేనాండళ్ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఒక హీరోయిన్‌గా అదితిరావ్ హైదరీని ఫైనల్ చేయగా, మరో హీరోయిన్ పాత్రకు అనూ ఇమ్మాన్యుయేల్‌ను ఎంపిక చేశారని తెలుస్తోంది. తాజాగా నాగచైతన్య సరసన ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమాలో నటించిన అను, వెంటనే నాగ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. శరత్ కుమార్, ఎస్.జె.సూర్య ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు ‘పవర్ పాండి’ ఫేం సీన్ రోనాల్డ్ సంగీతాన్ని అందిస్తున్నారు. 
 



హిందీలో దుమ్మురేపుతున్న బన్నీ మూవీ

Updated By ManamWed, 09/12/2018 - 10:23

Na Peru Surya Na Illu Indiaస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ తెరకెక్కించిన చిత్రం ‘నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా’. ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అనుకున్నంత మేర వారిని ఆకట్టుకోలేకపోయింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం హిందీలో దుమ్మురేపుతుంది.

బన్నీకి నార్త్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. అతడి డబ్బింగ్ చిత్రాలు యూట్యూబ్‌లో రికార్డు సృష్టించాయి. ఈ నేపథ్యంలో బన్నీ నా పేరు సూర్య చిత్రాన్ని డబ్బింగ్ చేసి గత వారం థియేటర్లలో రిలీజ్ చేశారు. విడుదలైన అన్ని చోట్ల ఈ చిత్రం మంచి కలెక్షన్లను సాధిస్తోంది. ఈ విషయాన్ని అక్షయ్ రతీ అనే క్రిటిక్ తెలిపాడు. కాగా 1983 వరల్డ్ కప్ ఆధారంగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ బయోపిక్‌లో ఓ పాత్ర కోసం బన్నీని సంప్రదించినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

 

 



‘శైలజా రెడ్డి అల్లుడు’ మొదటి సింగిల్ విడుదల

Updated By ManamFri, 08/10/2018 - 11:00

Sailajareddy Alluduనాగచైతన్య హీరోగా మారుతి తెరకెక్కించిన చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ విడుదలైంది. బేబి అనూ బేబి అంటూ సాగే ఈ పాటలో హీరోయిన్ అనూ ఇమ్మాన్యుల్‌ను పడగొట్టేందుకు నాగచైతన్య ట్రై చేస్తుంటాడు. కృష్ణకాంత్ ఈ పాటకు సాహిత్యాన్ని అందించగా.. గోపి సుందర్ సంగీతం అందించాడు. అనుదీప్ దేవ్ పాటను ఆలపించారు. ఇక ఈ చిత్రం ఆగష్టు 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ, పీడీవీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించారు.



ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది

Updated By ManamTue, 08/07/2018 - 11:21

Sailaja Reddy Alluduనాగచైతన్య, అను ఇమ్మాన్యుల్ జంటగా నటించిన చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. మారుతి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగష్టు 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర మొదటి సింగిల్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు. ‘అను బేబి’ అంటూ సాగే మొదటి పాట ఆగష్టు 10వ తేదిన ఉదయం 10గంటలకు విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగ వంశీ, పీడీవీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించాడు.



‘శైలజా రెడ్డి అల్లుడు’కు ముహూర్తం ఫిక్స్

Updated By ManamMon, 07/30/2018 - 13:00

Sailaja Reddy Alludu నాగచైతన్య హీరోగా మారుతి తెరకెక్కించిన చిత్రం ‘శైలజా రెడ్డి అల్లుడు’. అను ఇమ్మాన్యుల్ ఇందులో హీరోయిన్‌గా నటించగా, రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించనుంది. ఇటీవలే షూటింగ్‌ను పూర్తి చేసుకొని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రానికి విడుదల తేది ఖరారు అయ్యింది. ఆగష్టు 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటనను ఇచ్చేసింది. ఇక త్వరలోనే టీజర్, ట్రైలర్‌ను కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించగా.. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. 



నాకు అంత తొందరలేదు

Updated By ManamMon, 07/23/2018 - 01:33

anu‘మజ్ను’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమై తక్కువ కాలంలోనే పెద్ద హీరోల సరసన భారీ సినిమాలు చేసింది. అనూ ఇమ్మానుయేల్. ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రంలో నటిస్తున్న అనూ కెరీర్ నెమ్మదించిందని, ఆమె చేతిలో ఎక్కువ లేవని సోషల్ మీడియా కోడై కూస్తోంది.

దీనిపై స్పందించిన అనూ ఇమామనుయేల్ ‘‘ఒక సినిమా పూర్తయిన తర్వాత మరో సినిమా చేస్తూ నేను బిజీగానే ఉన్నాను. నా కెరీర్ నెమ్మదించిందని నేను అనుకోవడం లేదు. ఇండస్ట్రీలో చాలా కాలం ఉండాలని ఉంది. అందుకే నేను చేయాల్సిన సినిమాల విషయంలో తొందర పడడం లేదు. కథ, సినిమాలో నా పాత్ర నచ్చితేనే ఓకే చెప్తున్నాను. ఏది ఏమైనా నా కెరీర్ పట్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నా లేటెస్ట్ మూవీ ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రంలో చాలా కీలకమైన పాత్ర పోషించాను. బాగా పొగరున్న అమ్మాయిగా కనిపిస్తాను. ఇలాంటి పాత్రను ఇంత వరకు చేయలేదు. ఈ సినిమాకి పనిచేయడం గొప్ప అనుభూతిని ఇచ్చింది’ అని తెలిపారు.
 

image

 



‘శైలజా రెడ్డి అల్లుడు’ ఫస్ట్‌లుక్

Updated By ManamMon, 07/09/2018 - 12:01
sa

నాగచైతన్య హీరోగా మారుతి తెరకెక్కిస్తున్న చిత్రం ‘శైలజా రెడ్డి అల్లుడు’. అనూ ఇమ్మాన్యుల్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్ తాజాగా విడుదలైంది. అందులో కొత్త లుక్‌లో నాగచైతన్య అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఇక ఈ చిత్రంలో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించగా.. ఆమెకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను కూడా రివీల్ చేశాడు. ఇక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తుండగా.. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

 



స‌గం ప‌ని పూర్తిచేసుకున్న 'శైల‌జా రెడ్డి అల్లుడు'

Updated By ManamWed, 05/09/2018 - 20:20

sailajaయూత్‌పుల్ చిత్రాల ద‌ర్శ‌కుడు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌చైత‌న్య క‌థానాయ‌కుడిగా ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. 'శైల‌జారెడ్డి అల్లుడు' అనే పేరు ప‌రిశీల‌న‌లో ఉన్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా.. ర‌మ్య‌కృష్ణ ఓ కీల‌క పాత్ర‌లో సంద‌డి చేయ‌నున్నారు. విశ్వ‌స‌నీయ వర్గాల స‌మాచారం ప్రకారం.. 20 రోజుల షెడ్యూల్‌లో ఈ సినిమాకి సంబంధించిన ప్ర‌థ‌మార్థం పూర్త‌య్యింద‌ని తెలిసింది. ఇక‌ ద్వితీయార్థానికి సంబంధించిన షూటింగ్ మాత్ర‌మే మిగిలి ఉంద‌ని.. మొత్తం 30 రోజుల పాటు జ‌రిగే ఈ సెకండాఫ్‌కు సంబంధించిన షూటింగ్ చైతు జాయిన‌య్యాకే పూర్త‌వుతుంద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం చైతు 'స‌వ్య‌సాచి' చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా చిత్రీక‌ర‌ణ తుదిద‌శ‌లో ఉంది.



ఆర్మీ ఆఫీస‌ర్‌తో ఆర్ట్స్ స్టూడెంట్ రొమాన్స్‌

Updated By ManamThu, 05/03/2018 - 17:21

nps'మ‌జ్ను' చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన క‌థానాయిక అను ఇమ్మాన్యుయేల్‌. తొలి చిత్రంతోనే తెలుగు వారికి చేరువైన ఈ కేర‌ళ‌కుట్టి.. ఈ ఏడాది  సంక్రాంతికి  విడుద‌లైన‌ 'అజ్ఞాత‌వాసి'లో మెగా హీరో ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు జోడీగా సంద‌డి చేసింది. మ‌రో మెగా హీరో అల్లు అర్జున్‌కు జోడీగా అను న‌టించిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ రేపు (శుక్ర‌వారం) తెర‌పైకి రానుంది.

ఈ సినిమా గురించి అను మాట్లాడుతూ.. ''ఇలాంటి మంచి చిత్రంలో న‌టించే అవ‌కాశం రావ‌డం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నా పాత్ర పేరు వ‌ర్ష‌. ఆర్ట్స్ స్టూడెంట్‌గా క‌నిపిస్తా. ఆర్మీ ఆఫీస‌ర్ అయిన సూర్య (అల్లు అర్జున్‌) ఓ విహారయాత్రకు వచ్చినప్పుడు వర్షను చూస్తాడు. ఆ త‌రువాత ఏం జ‌రిగింద‌న్న‌ది తెర‌పైనే చూడాలి. ఈ సినిమాలో నేను చేసిన‌ వర్ష పాత్ర నా నిజ జీవితానికి ద‌గ్గ‌ర‌గా ఉంటుంది. అందుకే ఈ పాత్ర‌కి చాలా త్వరగా కనెక్ట్‌ అయ్యాను. ఈ చిత్రంలో నేను న‌టించిన ప్ర‌తి స‌న్నివేశంలోనూ బన్నీ ఉంటారు. ఈ సినిమా షూటింగ్ టైమ్‌లో నటనకు సంబంధించిన అనేక విష‌యాల‌ను ఆయ‌న‌ నాకూ నేర్పించారు. ఇక ద‌ర్శ‌కుడు వ‌క్కంతం వంశీకి ఇదే తొలి సినిమా అయినా.. సినిమాను చాలా బాగా రూపొందించారు. సినిమాలో ఓ కీల‌క స‌న్నివేశాన్ని చిత్రీక‌రించిన తీరు చూస్తే.. హాలీవుడ్‌ సినిమా చూస్తున్న ఫీలింగ్‌ కలిగింది. ఈ సినిమా విడుద‌ల కోసం ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నా'' అంటూ చెప్పుకొచ్చారు.



హెచ్‌బీవోలో ‘సూర్య’

Updated By ManamTue, 05/01/2018 - 12:59

allu arjun స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం ‘నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా’. మే 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లలోనూ వేగాన్ని పెంచేసింది చిత్ర యూనిట్. అయితే ఈ ప్రమోషన్స్ కేవలం తెలుగులోనే కాదు ఇంగ్లీష్ ఛానెల్స్‌లోనూ జరుగుతున్నాయి. ప్రముఖ ఇంటర్నేషనల్ టెలివిజన్ హెచ్‌బీవో(HBO) ఇండియా కోసం అల్లు అర్జున్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుండగా.. ఆ ఛానెల్‌లోనూ నా పేరు సూర్య ప్రమోషన్స్ జరగనున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా మరింతమందిని కనెక్ట్ అవ్వనున్నాడు బన్నీ.

కాగా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో బన్నీ సరసన అను ఇమ్మాన్యుఎల్ నటిస్తుండగా.. అర్జున్, నదియా, శరత్ కుమార్, రావు రమేశ్ తదితరులు ముఖ్యపాత్రలలో కనిపించనున్నారు. లగడపాటి శిరీషా శ్రీధర్, నాగబాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తుండగా, బాలీవుడ్ ద్వయం విశాల్-శేఖర్ సంగీతం అందించారు.

 





Related News