trivikram srinivas

అరవింద సమేత..చవితి శుభాకాంక్షలు

Updated By ManamWed, 09/12/2018 - 18:03
  • 20న అరవింద సమేత ఆడియో విడుదల

Aravinda sametha audio function on september 20

హారికా, హాసిని ప్రొడక్షన్స్‌లో దర్శకుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా ఆడియో ఈ నెల 20న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నహాలు చేస్తోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే కథనాయికగా నటిస్తుంది. ఈ పోస్టర్‌లో ఎన్టీఆర్ నవ్వుతూ... స్టైలిష్‌గా కనువిందు చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

ఇక అరవింద సమేత’. ‘వీర రాఘవ’ అనేది ట్యాగ్ లైన్‌తో వస్తున్న ఆ చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 11న అంటే సరిగ్గా నెల రోజుల తర్వాత  ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఎన్టీఆర్, ప్రభాస్‌లకు మంత్రి సవాల్

Updated By ManamFri, 08/10/2018 - 11:25

talasani srinivasa yadavటాలీవుడ్ హీరోలు ఎన్టీఆర్, ప్రభాస్‌లకు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సవాల్ విసిరారు. హరిత హారంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విసిరిన సవాల్‌ను స్వీకరించిన తలసాని, శుక్రవారం తన ఇంటి ఆవరణలో మూడు మొక్కలు నాటారు.

అనంతరం తన చాలెంజ్ స్వీకరించవలసిందిగా.. సినీ ప్రముఖులు ఎన్టీఆర్, ప్రభాస్, దిల్ రాజు, త్రివిక్రమ్ శ్రీనివాస్, తితిదే చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్‌ల పేర్లను వెల్లడించారు. మనవాళి మనుగడక కోసం ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని, భవిష్యత్ తరాలకు ఆక్సిజన్ ఉండాలంటే అందరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని కోరారు.ఫస్ట్‌లుక్ టాక్: ఛల్ మోహన్ రంగ

Updated By ManamSun, 02/11/2018 - 13:23

nithinతన దారిన కూల్‌గా లవ్‌స్టోరీలు చేసుకుంటూ హిట్లు కొట్టుకుంటూ వెళ్తున్న టైంలో.. ఎక్స్‌పెరిమెంట్ జోనర్ ట్రై చేసి చేతులు కాల్చుకున్నాడు యంగ్ హీరో నితిన్. హను రాఘవపూడి డైరెక్షన్‌లో వచ్చిన "లై" ఘోరంగా దెబ్బతింది. ఇది ఒకరకంగా మంచి జోష్‌లో ఉన్న నితిన్ కెరీర్‌ను వెనక్కి లాగింది. ఇక ప్రయోగాల జోలికి వెళ్లకుండా తనకు బాగా సూటయ్యే లవ్‌స్టోరీనే మరోసారి నమ్ముకున్నాడు నితిన్. రౌడీఫెలో ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో నితిన్ ఒక సినిమా చేస్తున్నాడు. ఇది నితిన్‌కి 25వ సినిమా..

హాఫ్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయిపోయినప్పటికీ ఈ మూవీకి ఇంత వరకు టైటిల్ సెట్ అవ్వలేదు. చాలా పేర్లు పరిశీలనకు వచ్చినప్పటికీ.. "గుర్తుందా శీతాకాలం" అనే టైటిల్ వార్తల్లో నిలిచింది. చివరకు దానిని కూడా పక్కనబెట్టి.. ఈ సినిమాకు "ఛల్ మోహన్ రంగ" టైటిట్ కన్ఫర్మ్ చేశారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. స్టిల్స్ చూస్తుంటే ఇది ఒక చక్కని ప్రేమకథ అని అర్థమవుతోంది. ఒక్క పాట మినహా మిగిలిన షూటింగ్ పార్ట్ పూర్తయ్యింది. ఫిబ్రవరి 14న టీజర్‌ను, ఏప్రిల్ 5న సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది. ఈ సినిమాని నితిన్ ఫేవరేట్ హీరో పవన్ కళ్యాణ్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. థమన్ స్వరాలు అందించిన ఈ సినిమాలో నితిన్ సరసన మేఘా ఆకాశ్ నటిస్తోంది.‘అజ్ఞాతవాసి’ మూవీ రివ్యూ

Updated By ManamWed, 01/10/2018 - 13:18
agnathavaasi

చిత్రం: అజ్ఞాతవాసి

తారాగణం: పవన్ కల్యాణ్, కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్, బోమన్ ఇరాని, ఖుష్బూ, ఆది పినిశెట్టి, జ‌య ప్ర‌కాష్‌, రావు రమేష్, మురళీ శర్మ, తనికెళ్ళ భరణి, శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిషోర్, ప‌రాగ్ త్యాగి, ప‌విత్రా లోకేష్‌, ర‌ఘుబాబు, ఇంద్ర‌జ‌ తదితరులు

ఛాయాగ్రహణం: వి. మ‌ణికంథ‌న్‌

కూర్పు: కోటగిరి వెంకటేశ్వర రావు

సంగీతం: అనిరుధ్‌

నిర్మాత: ఎస్.రాధాకృష్ణ

కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్

విడుదల: జనవరి 10, 2018

 

agnathavaasiకొన్ని కాంబినేషన్లు బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తాయి. అలాంటి కాంబినేషనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ లది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ సెన్సేషనల్ సృష్టించాయి. ‘జల్సా’ తర్వాత ఐదేళ్ళకు ‘అత్తారింటికి దారేది’ విడుదలైంది. ‘అత్తారింటికి దారేది’ విడుదలైన ఐదేళ్ళకు ఇప్పుడు ‘అజ్ఞాతవాసి’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతేకాకుండా ఇది పవన్ కల్యాణ్ కి 25వ చిత్రం కావడం విశేషం. ఎన్నో విశేషాల‌తో పాటు భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమాపై 'మనం' అందిస్తున్న సమీక్ష మీ కోసం:

కథ:

agnathavaasiఎబి గ్రూప్ అధినేత గోవిందా భార్గవ్(బోమన్ ఇరాని). అత‌ని భార్య ఇంద్రాణి (ఖుష్బూ), కొడుకు మోహన్ భార్గవ్.  గోవిందా, మోహ‌న్‌ని ప్లాన్ ప్ర‌కారం చంపేస్తారు. తన భర్త, కొడుకుల‌ అనూహ్య మ‌ర‌ణం ఇంద్రాణికి ఓ పెద్ద షాక్‌. చ‌నిపోయేట‌ప్పుడు విందా కాల్‌లో రికార్డ్ చేసిన ప్ర‌కారం.. వీరి చావుకి కార‌ణం అత‌ని బోర్డు మెంబ‌ర్స్ వ‌ర్మ (రావు రమేష్‌), శ‌ర్మ (ముర‌ళీ శ‌ర్మ‌) అని అర్థ‌మ‌వుతుంది. అయితే.. అస‌లు ఎందుకు చంపి ఉంటారు అనేది మిస్ట‌రీగా ఉండిపోతుంది. ఇది తెలుసుకోవ‌డం కోసం  ఆమె అస్సాం నుంచి ఒక యువకుడిని పిలిపిస్తుంది. అత‌నే బాల‌సుబ్ర‌మ‌ణ్యం (ప‌వ‌న్ క‌ల్యాణ్‌). అస‌లు విష‌యాలు రాబ‌ట్ట‌డం కోసం.. ఎబి గ్రూప్ ఆఫీస్‌లో ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్‌గా జాయిన్ అవుతాడు బాలు. అక్కడ శర్మ (మురళీ శర్మ), వర్మ (రావు రమేష్) ఫోన్ డాటా ద్వారా ఈ హత్య గురించి తెలుసుకోవాలనుకుంటాడు బాలు. ఈ ప్రాసెస్ లో వాళ్లకు దగ్గరవడం కోసం శర్మ దగ్గర అసిస్టెంట్‌గా పని చేస్తున్న సూర్యకాంతం (అను ఇమ్మాన్యుయేల్)కి, అలాగే వర్మ కూతురు సుకుమారి (కీర్తి సురేష్)కి కూడా దగ్గరౌతాడు బాలు. అయితే తర్వాత బాలుకి..ఈ హత్యలతో శర్మ, వర్మలకు ఎటువంటి సంబంధం లేదని తెలుస్తుంది. మరి ఆ హత్యలు చేసింది ఎవరు? ఎందుకోసం చేసారు? ఆ హత్యల తదనంతరం ఈ కంపెనీలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? హత్యలు జరిగిన వెంటనే బాలునే ఎందుకు ఇంద్రాణి పిలిపించింది? మరి బాలు ఆ హత్య ఉదంతాన్ని ఛేదించాడా? ఇంతకీ హంతకుడు ఎవరు?  సీతారామ్ (ఆది పినిశెట్టి) ఎవరు? అభిషిక్త్ భార్గ‌వ్‌కి, బాలుకి సంబంధం ఏమిటి? ఎ.బి.గ్రూప్‌లోని ఎ.బి. ఎవ‌రు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. 

విశ్లేషణ:

agnathavaasiపగ, ప్రతీకారంతో తెలిసిన కథనే మళ్ళీ తెరపై చూపించారు..త్రివిక్రమ్. కాకపోతే తన మార్కు కథనంతో, కామెడీతో, మాట‌ల‌తో సినిమాని ఎక్క‌డా బోర్ కొట్ట‌కుండా నడిపించేశారు. 'అత్తారింటికి దారేది'లో మేన‌త్త‌, మేన‌ల్లుడు బంధంని చ‌క్క‌గా చూపించిన త్రివిక్ర‌మ్‌.. ఈ సినిమాలో స‌వ‌తి త‌ల్లి, స‌వ‌తి కొడుకు మ‌ధ్య బంధం బాగా చూపించారు. ప్లాన్ బి అనే కాన్సెప్ట్‌ని త‌న స్క్రీన్ ప్లేలో చ‌క్క‌గా ఉప‌యోగించుకున్నారు. శ‌ర్మ‌, వ‌ర్మ కామెడీ ట్రాక్ బాగా డిజైన్ చేసుకున్నారు. అయితే సినిమాని ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కించ‌డంలో త‌న మ్యాజిక్‌ని రిపీట్ చేయ‌లేక‌పోయారు. న‌టీనటుల విష‌యానికి వ‌స్తే.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వన్ మాన్ షో చేసి సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోశారు. అస్సోంలో ఇచ్చే ఎంట్రీ సీన్ నుంచి చివ‌రి సీన్ వ‌ర‌కు అడుగ‌డుగున అభిమానుల‌ను అల‌రించే ప్ర‌య‌త్నం చేశారు. రొమాంటిక్ సీన్స్‌, ఆఫీస్ సీన్స్‌లో అమాయ‌కంగా క‌నిపిస్తూ ఇచ్చే హావ‌భావాలు అభిమానుల‌కు బాగా న‌చ్చుతాయి. త‌ను పాడిన 'కొడ‌కా కోటేశ్వ‌ర్రావా' పాట‌లో బాగా యాక్టివ్‌గా క‌నిపించారు. అలాగే సీరియస్ సీన్స్‌లో పవన్ పలికే సంభాషణలు చాలా బాగున్నాయి. ఇక తన కామెడీ టైమింగ్ తో సినిమాని మరో స్థాయికి తీసుకునివెళ్ళారు పవన్. ఇక హీరోయిన్స్‌ కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ గ్లామ‌ర్ షో, కామెడీకి ప‌రిమిత‌మ‌య్యారు. ఆది మరోసారి స్టైలిష్ విలన్‌గా తన విలనిజంతో ఆకట్టుకున్నాడు. సవతి తల్లి అయినా... కన్న కొడుకు కంటే ఎక్కువగా స‌వ‌తి కొడుకు అభిని చూసుకునే పాత్రలో ఖుష్బూ నటన బాగుంది. ప్ర‌తి ఫ్రేమ్‌లోనూ హుందాగా క‌నిపించింది. ఇక‌ వీలునామాలో తన వాటాను కూడా అభికే ఇచ్చేయమని భర్తకు చెప్పే సన్నివేశంలో ఆమె నటన చాలా బాగుంది. ఇక మురళీ శర్మ, రావు రమేష్‌లతో ప‌వ‌న్ సీన్స్ బాగా వ‌ర్క‌వుట్ అయ్యాయి.  మిగిలిన న‌టుల్లో భ‌ర‌ణి, వెన్నెల కిషోర్‌, ప‌విత్రా లోకేష్  పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. సాంకేతిక నిపుణుల విష‌యానికి వ‌స్తే.. అనిరుధ్‌ అందించిన సంగీతం బాగుంది. పాటలు వినసొంపుగా ఉన్నాయి. అలాగే వాటి చిత్రీక‌ర‌ణ లావిష్‌గా ఉంది. ముఖ్యంగా అనిరుధ్ అందించిన‌ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ అయితే సినిమాని మరో స్థాయికి తీసుకుని వెళ్ళింది. పోరాట స‌న్నివేశాల్లో.. కొత్త త‌ర‌హాలో ఆర్‌.ఆర్‌. ఇచ్చాడు. మ‌ణికంథ‌న్‌ ఛాయాగ్రహణం అద్భుతంగా ఉంది. ప్ర‌తి ఫ్రేమ్‌ని చాలా రిచ్‌గా ప్రెజంట్ చేసారు. కోట‌గిరి ఎడిటింగ్ మ‌రింత క్రిస్పీగా ఉండాల్సింది. ఇక మాటల విషయానికి వస్తే త్రివిక్రమ్ కలం.. మాటలు రాయడానికి తన పదునంతా చూపించింది. “కుందేళ్ళు కులాసాగా తిరుగుతున్నాయ్...సింహం సరదాగా రావొచ్చు”. “లారీ లాంటి శ్రుతి.. గులాబిలాంటి నా గుండెని తొక్కేసింది” “అందుకే లారీలు వెళ్ళే రోడ్లమీద పూలు పరచకూడదు” “అసలే మనకున్న క్రియేటివిటీ తక్కువ.. ఎక్కువ ఆలోచించకు” “ఆడు కన్నీళ్లు పెట్టుకున్నాడని కాఫీ షాపుకి తీసుకెళ్ళావ్...రేపు ఇబ్బందుల్లో ఉన్నాడని ఇంటిగ్గాని తీసుకొచ్చావ్”, “విమానంలో ఉన్నోళ్ళందరూ ఎగుర్తున్నామనే అనుకుంటారమ్మా...కాని విమానమే ఎగురుతాది”, '''సింహం పార్టీకి పిలిచింద‌ని.. జింక జీన్స్ ఫ్యాంట్ వేసుకుని పార్టీకి వెళ్ళింద‌ట‌'' అనే కామెడీ డైలాగులు.. “రాజ్యం మీద ఆశలేని వాడికంటే గొప్ప రాజు ఎక్కడ దొరుకుతాడు”తో పాటు ట్రైల‌ర్‌లో చూపించిన కుర్చీ డైలాగ్ అర్థ‌వంతంగా ఉన్నాయి.  నిర్మాణ విలువ‌ల‌కు ఎక్క‌డా వంక పెట్ట‌లేం.  

 

ప్ల‌స్ పాయింట్స్‌

పవన్ కల్యాణ్

కామెడీ

పాటలు, వాటి చిత్రీక‌ర‌ణ‌

అనిరుధ్ నేప‌థ్య సంగీతం

ఛాయాగ్రహణం

మాటలు

నిర్మాణ విలువ‌లు

 

మైన‌స్ పాయింట్స్‌

రొటీన్ స్టోరీ

ద‌ర్శ‌క‌త్వం

స్క్రీన్ ప్లే

ఎమోష‌న‌ల్ సీన్స్‌ వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డం

 

చివ‌ర‌గా.. ప్లాన్ బి.. ఫ‌ర్వాలేదు

రేటింగ్‌.. 3/5                   సీఎం కేసీఆర్ కోసం ‘అజ్ఞాతవాసి’ స్పెషల్ షో

Updated By ManamSun, 01/07/2018 - 20:23

trivikramహైదరాబాద్: ‘అజ్ఞాతవాసి’ సినిమా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిశారు. అనంతరం త్రివిక్రమ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి తలసాని కోసం స్పెషల్ షోను వేయనున్నట్లు తెలిపారు. ఎక్కువ షోలకు అనుమతినిచ్చిందుకు సీఎం కేసీఆర్‌కు చిత్ర దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత రాధాకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. ఏపీ ప్రభుత్వం కూడా జనవరి 10 నుంచి 17 వరకూ ‘అజ్ఞాతవాసి’ సినిమా స్పెషల్ షోలకు అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. ఆ వారం పాటు ఈ సినిమా రాత్రి 1 గంట తర్వాత కూడా థియేటర్లలో ప్రదర్శితం కానుంది.కత్తి ఏంటి.. ఇలా అనేశాడు!

Updated By ManamThu, 01/04/2018 - 19:15

kathiఇన్నాళ్లూ పవన్ కల్యాణ్‌ను, ఆయన అభిమానులను లక్ష్యంగా చేసుకుని పలు విమర్శలు చేసిన సినీ విమర్శకుడు కత్తి మహేశ్ ఇప్పుడు రూటు మార్చాడు. పవన్‌తో సినీ పరిశ్రమలో సన్నిహితంగా మెలిగే వారిని కత్తి మహేశ్ ఇప్పుడు టార్గెట్ చేశాడు. పవన్‌తో అత్యంత సన్నిహితంగా ఉండే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ సినిమాలన్నీ కాపీ కొట్టినవేనని పోస్ట్ పెట్టిన కత్తి మహేశ్ తాజాగా అజ్ఞాతవాసి సిినిమా కూడా కాపీయేనంటూ మరో వివాదాస్పద పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ యథాతథంగా...

త్రివిక్రమ్ కాపీ దెబ్బకి రెండోసారి ఒకే ప్రొడక్షన్ హౌస్ బలి అయ్యిందట పాపం. నవలని, పాత సినిమాని ఎత్తేస్తే కాస్త ఖర్చుతో పోయింది. ఈసారి ఏకంగా యూరోపియన్ సినిమా. వాళ్ళ కరెన్సీ యూరోలు మరి. ఇలా ఖర్సైపోతే ఎలా కోటేశ్వర్రావా!!!

ఇదీ కత్తి మహేశ్ పెట్టిన పోస్ట్. ఈ పోస్ట్‌పై పవన్ అభిమానులు మండిపడుతున్నారు. పవన్ కల్యాణ్‌కు ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలని కత్తి మహేశ్ భావిస్తున్నాడని, పవన్‌ను.. ఆయనతో సన్నిహితంగా ఉండేవారిని తిడితే పబ్లిసిటీ వస్తుందనే ఇదంతా చేస్తున్నాడని పవన్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. కత్తి మహేశ్ ఇకనైనా పవన్‌ను విమర్శించుకోవడం మానుకోకపోతే భవిష్యత్ పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అంటున్నారు. అయితే కత్తి మహేశ్ మాత్రం పవన్‌ను విమర్శించే విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటున్నాడు.

Related News