arvind swamy

నవాబుపై డయానా ఆశలు..!!

Updated By ManamWed, 09/12/2018 - 17:53

dayana

గత కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న అగ్రదర్శకుడు మణిరత్నం మరోసారి నవాబు రూపంలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అరవింద్ స్వామి, శింబు, విజయ్ సేతుపతి, అరుణ్ విజయ్ లు ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం భారీ తారాగణంతో రూపొందించగా తమిళంలో చెక్క చివంతా వానం అనే పేరుతో విడుదల అవుతున్నది ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ లుగా అదితి రావు హైదరి ,ఐశ్వర్య రాజేష్, డయానా  హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.

ఇటీవలే రిలీజ్ అయిన చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోగా సినిమా  ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలను ఏర్పరిచింది. మద్రాస్ టాకీస్ , లైకా ప్రొడక్షన్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా  సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతుంది..ఎమోషనల్, యాక్షన్ అంశాలను మేలవించి ఈ చిత్రాన్ని మణిరత్నం రూపొందించారు. 

కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా పరిచయమవుతున్న డయానా సినిమా పై మంచి హోప్స్ పెట్టుకుంది.. ఈ సినిమాతో గ్రాండ్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మంచి ఆఫర్స్ దక్కించుకునే ప్రయత్నంలో ఉంది.. ఇప్పటికే లుక్ లో సూపర్ అనిపించుకున్న ఈ ముద్దుగుమ్మ నటన లోనూ పర్వాలేదు అనిపించుకుంటే టాలీవుడ్‌ను ఏలేస్తుంది మరీ.. దంపతులుగా అర‌వింద్ స్వామి, జ్యోతిక‌

Updated By ManamFri, 03/16/2018 - 19:54

arvind‘రోజా’, ‘బొంబాయి’ వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్‌ను అందుకున్న ద్వయం మణిరత్నం, అరవింద్ స్వామి. ప్రస్తుతం మణిరత్నం ఓ కుటుంబకథా చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అరవింద్ స్వామితో పాటు శింబు, విజయ్ సేతుపతి, అరుణ్ విజయ్, జ్యోతిక, ఐశ్వర్య రాజేష్, అదితిరావు హైదరి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ‘నవాబ్’ గా తెలుగులో విడుదల కానున్న ఈ మల్టీస్టారర్ మూవీ.. ‘చెక్క చివంత వాణమ్’ పేరుతో తమిళంలో తెర‌కెక్కుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో అరవింద్ స్వామి, జ్యోతిక దంపతులుగా నటించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో జ్యోతిక సోదరి నగ్మాతో ‘మౌనం’ (1995)అనే తెలుగు సినిమాలో నటించిన అరవింద్ స్వామి.. దాదాపు 23 సంవత్సరాల తర్వాత జ్యోతికతో కలిసి ఈ చిత్రంలో నటిస్తుండడం విశేషం.రేపు ‘నరగాసురన్’ టీజర్‌

Updated By ManamFri, 11/24/2017 - 19:48

naragasuran'ధ్రువంగ‌ళ్ ప‌ద‌నారు' (16) ఫేమ్ కార్తిక్ నరేన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న తమిళ సినిమా ‘నరగాసురన్’. అరవింద్ స్వామి, శ్రియ జంటగా నటించిన ఈ సినిమాని ‘నరకాసుర’ పేరుతో తెలుగులో కూడా డబ్ చేస్తున్నారు. ఒండ్రాగ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వెంకట సోమసుందరం, రేష్మ ఘ‌టాలా (న‌టి చంద్ర‌క‌ళ కుమార్తె) నిర్మించారు. సందీప్ కిషన్, ఇంద్రజీత్, ఆత్మిక, ఆత్మ పాట్రిక్ ఇత‌ర ముఖ్య తారాగణంగా తెరకెక్కిన ఈ చిత్రానికి రోన్ యోహన్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా, సుజిత్ సారంగ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్ స‌మ‌ర్ప‌ణ‌లో తెర‌కెక్కుతుండ‌డంతో ఈ సినిమాపై మంచి అంచ‌నాలే ఉన్నాయి.  కాగా ఈ సినిమా టీజ‌ర్‌ని రేపు సాయంత్రం 5 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ట్విట్ట‌ర్‌లో అర‌వింద్ స్వామి పోస్ట్ చేశారు. ఫిబ్ర‌వ‌రిలో ఈ సినిమా విడుద‌ల కానుంది.స‌ర్‌ప్రైజ్ చేయ‌నున్న శ్రియ‌

Updated By ManamFri, 11/24/2017 - 12:54

shiryaశ్రియ శరన్.. తెలుగు ఇండస్ట్రీలోకి మంచి పాత్రలతో అడుగుపెట్టిన గ్లామరస్ హీరోయిన్. దశాబ్దం పాటు ఇండస్ట్రీని ఏలిన నాయిక ఈమె. పెర్ఫార్మన్స్ బేస్డ్ కథలకి.. తనకోసమే ఆ క్యారెక్టర్ పుట్టిందా అన్నట్టుగా ఆ పాత్రలో లీనమైపోయే నటీమణి. అందుకే 'సంతోషం', 'నువ్వే నువ్వే', ‘మనం’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మదిలో త‌న‌కంటూ ఓ స్థానం ద‌క్కించుకుంది. ప్రస్తుతం శ్రియ నటించిన తమిళ సినిమా ‘నరగాసురన్’.. ఈ మధ్యనే ఊటీలో షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ మూవీని తెలుగులో కూడా ‘నరకాసుర’ పేరుతో డబ్ చేస్తున్న సంగతి విదితమే. 'ధ్రువంగ‌ళ్ ప‌ద‌నారు' (తెలుగులో '16') ఫేమ్‌ కార్తిక్ నరేన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో.. అరవింద్ స్వామితో మొదటి సారిగా జోడి కట్టింది శ్రియ‌. ద‌ర్శ‌కుడు కార్తిక్ ఈ సినిమాలో శ్రియ పాత్ర గురించి మాట్లాడుతూ ఏమన్నారంటే, “శ్రియ అయితే ఈ సినిమాకి బాగా ప్లస్ అవుతుందని భావించి.. తనకోసమే ఆ పాత్రను డిజైన్ చేసాం. త‌న‌ది గ్లామర్ రోల్ కి మాత్రమే పరిమితమయ్యే పాత్ర కాదు. పైగా అరవింద్ స్వామితో కూడా ఇంత‌కుముందు నటించలేదు కాబట్టి ఈ జోడి చాలా ఫ్రెష్ గా ఉంటుంది. అలాగే ఆమె ఈ మూవీని మరో స్థాయికి తీసుకువెళ్తుంది. అదేవిధంగా త‌న పాత్ర‌తో స‌ర్‌ప్రైజ్ చేస్తుంది” అని ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. సందీప్ కిషన్, ఆత్మిక, మ‌ల‌యాళ న‌టుడు ఇంద్ర‌జిత్‌ ఈ సినిమాలో లీడ్ రోల్స్ ని పోషిస్తున్నారు. కాగా, త్వరలోనే ఈ మూవీ ట్రైలర్ ని విడుదల చేయబోతున్నారు. ఫిబ్ర‌వ‌రిలో ఈ సినిమా తెర‌పైకి రానుంది.

Related News