vakkantham vamsi

హిందీలో దుమ్మురేపుతున్న బన్నీ మూవీ

Updated By ManamWed, 09/12/2018 - 10:23

Na Peru Surya Na Illu Indiaస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ తెరకెక్కించిన చిత్రం ‘నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా’. ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అనుకున్నంత మేర వారిని ఆకట్టుకోలేకపోయింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం హిందీలో దుమ్మురేపుతుంది.

బన్నీకి నార్త్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. అతడి డబ్బింగ్ చిత్రాలు యూట్యూబ్‌లో రికార్డు సృష్టించాయి. ఈ నేపథ్యంలో బన్నీ నా పేరు సూర్య చిత్రాన్ని డబ్బింగ్ చేసి గత వారం థియేటర్లలో రిలీజ్ చేశారు. విడుదలైన అన్ని చోట్ల ఈ చిత్రం మంచి కలెక్షన్లను సాధిస్తోంది. ఈ విషయాన్ని అక్షయ్ రతీ అనే క్రిటిక్ తెలిపాడు. కాగా 1983 వరల్డ్ కప్ ఆధారంగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ బయోపిక్‌లో ఓ పాత్ర కోసం బన్నీని సంప్రదించినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

 

 హెచ్‌బీవోలో ‘సూర్య’

Updated By ManamTue, 05/01/2018 - 12:59

allu arjun స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం ‘నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా’. మే 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లలోనూ వేగాన్ని పెంచేసింది చిత్ర యూనిట్. అయితే ఈ ప్రమోషన్స్ కేవలం తెలుగులోనే కాదు ఇంగ్లీష్ ఛానెల్స్‌లోనూ జరుగుతున్నాయి. ప్రముఖ ఇంటర్నేషనల్ టెలివిజన్ హెచ్‌బీవో(HBO) ఇండియా కోసం అల్లు అర్జున్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుండగా.. ఆ ఛానెల్‌లోనూ నా పేరు సూర్య ప్రమోషన్స్ జరగనున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా మరింతమందిని కనెక్ట్ అవ్వనున్నాడు బన్నీ.

కాగా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో బన్నీ సరసన అను ఇమ్మాన్యుఎల్ నటిస్తుండగా.. అర్జున్, నదియా, శరత్ కుమార్, రావు రమేశ్ తదితరులు ముఖ్యపాత్రలలో కనిపించనున్నారు. లగడపాటి శిరీషా శ్రీధర్, నాగబాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తుండగా, బాలీవుడ్ ద్వయం విశాల్-శేఖర్ సంగీతం అందించారు.

 కోపం వచ్చినప్పుడు బూతులే వస్తాయి, మంత్రాలు రావు

Updated By ManamSat, 04/28/2018 - 12:02

NSNI అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ తెరకెక్కించిన చిత్రం ‘నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా’. మే 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలైంది. యాంగ్రీ ఆర్మీ ఆఫీసర్‌గా ట్రైలర్‌లో మరింత రెచ్చిపోయాడు అల్లు అర్జున్. ‘‘ఒక మనిషి సమాజంలో బ్రతకాలంటే ఫ్యామిలీ, కెరియర్, ఫ్రెండ్స్, లవ్ ఇవన్ని కనీసం ఉండాలి’’, ‘‘కోపం వచ్చినప్పుడు బూతులే వస్తాయి, మంత్రాలు రావు’’, ‘‘ఇండియా కావాలి, ఇచ్చెయ్’’ అనే డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి. మొత్తానికి ట్రైలర్‌తో సినిమాపై మరింత అంచనాలను పెంచేశాడు అల్లు అర్జున్. 

ఇక ఈ చిత్రంలో బన్నీ సరసన అనూ ఇమ్మాన్యుల్ నటిస్తుండగా.. అర్జున్, శరత్ కుమార్, నదియా, రావు రమేశ్ తదితరులు ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. లగడపాటి శ్రీధర్, నాగబాబు నిర్మించిన ఈ చిత్రానికి విశాల్-శేఖర్ సంగీతం అందించారు. 

 దుమ్ముదులిపేందుకు తమ్ముడొస్తున్నాడు..!

Updated By ManamSun, 04/22/2018 - 20:25

Nagababu Promised to Pawan Kalyan Fans @ Naa Peru surya Naa Illu India Audio Launch

‘నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా’ ఆడియో వేడుక వేదికగా నటుడు నాగబాబు.. మరోసారి తన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించిమాట్లాడారు.

ముందుగా చిరు గురించి మాట్లాడుతూ.." మీ అందరికీ తెలుసు.. నాకు, నా తమ్ముడు పవన్, అల్లు అరవింద్, బన్నీ, రాంచరణ్, తేజ్, వరుణ్, నిహారిక ఇలా మెగా ఫ్యామిలీ మా అందరికీ లైఫ్ ఇచ్చింది మా అన్నయ్య మెగస్టార్ చిరంజీవే. సో ఆయన్ను తలుచుకోకుండా.. ఆయన పేరెత్తకుండా ఈ ఫంక్షన్ చేయడం నాకిష్టం లేదు. చిరు గురించి ఎంత చెప్పినా.. ఏం చెప్పినా సరిపోదు. థ్యాంక్యూ అన్నయ్యా.. ‘ అన్నయ్యా యూ ఆర్ గివింగ్ ఎ గ్రేట్ లైఫ్’.. గొప్ప జీవితాన్ని మా అందరికీ ఇచ్చావ్. ఇంతకంటే కృతజ్ఞతలు మీకు(చిరు) చెప్పలేం" అని నాగబాబు చెప్పుకొచ్చారు.

అన్నయ్య తర్వాత నా తమ్ముడు పవన్..
"
అన్నయ్య తర్వాత తమ్ముడు పవన్. ఆయన తమ్ముడికి పెద్ద హీరో లైఫ్ ఇచ్చాడు. సినీ ఇండస్ట్రీలో నంబర్ వన్ పొజీషన్‌లో ఉండి కోట్ల రూపాయిల సంపాదనను కూడా త్రుణపాయంగా వదిలేసి నిస్వార్థంగా ప్రజల సేవకు ముందుకెళ్తున్నాడు. ఈ సందర్భంలో ఇవన్నీ మాట్లాడొచ్చే లేదో నాకు తెలియదు. ఎన్నో కుతంత్రాలు, ఎన్నో కుయుక్తులు, నీచమైన రాజకీయాలు మా మీద చేస్తున్నారు. మేం సినిమా ఇండస్ట్రీలో ఉంటే మమ్మల్ని ఎవరేం అనరు. రాజకీయాల్లోకి వచ్చాం కదా ఇవన్నీ వస్తున్నాయ్..!

కల్యాణ్ బాబు అన్ని అడ్డంకుల్ని తొలగించేసుకుని మీ (ప్రజలు) ముందుకు వచ్చాడు.. చూశారా.. అలాంటోడు రాకూడదు వీళ్లకు(కుట్రదారులు). పవన్ వస్తే ఇలాంటోళ్ల ఆటలు సాగవ్. మీ అందరి కోసం.. మీ పిల్లల బాగుకోసం మంచి భవిష్యత్ కోసం తనకున్న భవిష్యత్‌ను వదిలేసుకుని మీ ముందుకు వస్తున్నాడు. సో పవన్ రాకూడదని ఎవరైతే కోరుకున్నారో, పార్టీలున్నాయో రకరకాల కుయుక్తులు.. రకరకాల ప్లాన్స్‌తో తొక్కేసి.. ఏమీ చేయలేక కుటుంబాలను నోటికొచ్చినట్లు దుర్భాషలాడించి నీచమైన రాజకీయాలు చేస్తున్నారు. వీళ్లందరికీ దుమ్ముదులిపేలాగా రాబోతున్నాడు నా తమ్ముడు. పవన్ కల్యాణ్ ఒక్కడే అనుకోకండి వాడి వెనక చాలామంది కల్యాణ్‌లు ఉన్నారు" అని ఆయన ఈ ఆడియో ఫంక్షన్ వేదికగా నాగబాబు తెలిపారు.

ఒక్కొక్కడికీ ఉంటుంది..!!
"
తమ్ముడు రాజకీయాల్లోకి వచ్చింది డబ్బులు సంపాదించుకోవాడానికో.. స్కాంలు చేయడానికో కాదు.. అవన్నీ మాకు అవసరం లేదు. దేవుడు మీ (అభిమానులు) రూపంలో మాకు చాలా ఇచ్చారు. నిస్వార్థంగా సేవచేయడానికి ప్రజల్లోకి వస్తున్నాము. ఎలా చేయాలో మాకు తెలుసు.. ఒక్కసారి కుదర్లేదు (ప్రజారాజ్యం పార్టీని ఉద్దేశించి).. ఈసారి కుదిరి తీరుతుంది అప్పుడు ఒక్కొక్కడికి ఉంటుంది.." అని థ్యాంక్యూ చెప్పేసి తన ప్రసంగాన్ని నాగబాబు ముగించేశారు. ఆయన మాట్లాడుతున్నంతసేపు ఫంక్షన్‌కు వచ్చిన మెగాభిమానులు జై పవర్ స్టార్, సీఎం పవర్ స్టార్.. పవనిజం అంటూ కేకలు, ఈలలతో హోరెత్తించారు.‘నా పేరు సూర్య’ షూటింగ్ పూర్తి

Updated By ManamThu, 04/19/2018 - 10:26

NSNIఅల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ తెరకెక్కించిన చిత్రం ‘నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా’. గతేడాది సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్ర షూటింగ్ తాజాగా పూర్తైంది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించాడు హీరో అల్లు అర్జున్. ‘‘నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా షూటింగ్ పూర్తైంది. లవ్‌లీ యూనిట్. లవ్‌లీ టీం. ఈ చిత్రంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అంటూ కామెంట్ పెట్టాడు బన్నీ.

ఇక యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన అను ఇమ్మాన్యుల్ నటించగా.. శరత్ కుమార్, అర్జున్, రావు రమేశ్ తదితరులు ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. నాగబాబు, లగడపాటి శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాలీవుడ్ ద్వయం విశాల్-శేఖర్ సంగీతాన్ని అందించారు. మేలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


 లవర్స్‌కు 'నా పేరు సూర్య' టీం ట్రీట్ 

Updated By ManamWed, 02/14/2018 - 08:52

Bunnyఅల్లు అర్జున్, అను ఇమ్మాన్యుల్ హీరో హీరోయిన్లుగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'. గణతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ సినిమా నుంచి 'సైనికా' అనే సాంగ్ విడుదల కాగా.. తాజాగా లవర్స్‌డే సందర్భంగా 'ఐ యామ్ ఎ లవర్ ఆల్సో, ఫైటర్ ఆల్సో' అంటూ సాగే రెండో సింగిల్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ పాటకు విశాల్-శేఖర్ సంగీతాన్ని అందించగా శేఖర్ రావ్జీయానీ తన గాత్రాన్ని అందించారు. తెలుగు, ఇంగ్లీష్ లిరిక్స్‌తో కూడిన ఈ పాట ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో అర్జున్, శరత్ కుమార్, రావు రమేష్ తదితరులు ముఖ్యపాత్రలలో కనిపించనున్నారు. లగడపాటి శ్రీధర్, నాగబాబు, బన్నీ వాసు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ వేసవి కానుకగా ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.రంగంలోకి రజనీ.. మహేశ్.. బన్నీ పరిస్థితి ఏంటి..?

Updated By ManamSun, 02/11/2018 - 11:59

kaalaసౌతిండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ చరిష్మా గురించి డౌట్స్ ఎవ్వరికీ లేవు. దక్షిణాదిలో ఆయన తిరుగులేని స్టార్.. బాలీవుడ్ ఖాన్ త్రయానికే ముచ్చెమటలు పట్టించిన చరిత్ర తలైవా సొంతం. ఆయన సినిమా వస్తుందంటే తమ సినిమాలు పోస్ట్‌పోన్ చేసుకున్న ఉదాహరణలు ఎన్నో ఎన్నెన్నో. ఇప్పుడు టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌లు రజనీ నిర్ణయంతో ఒత్తిడిలో పడ్డారు. ఒకవైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే చేతిలో ఉన్న సినిమాలను త్వరగా కంప్లీట్ చేస్తున్నారు రజీనీకాంత్. శంకర్ దర్శకత్వంలో రోబో 2.0 చేస్తూనే.. కబాలీ ఫేం పా రంజిత్‌తో "కాలా" చేస్తున్నాడు. 2.0 రాక మరింత లేట్ అయ్యే అవకాశాలు ఉండటంతో ఫ్యాన్స్‌ను నిరాశపరచకుండా.. కాలాను ముందుగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాత ధనుష్ ప్రకటించారు. ఏప్రిల్ 27న "కాలా" ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే అదే రోజున మహేశ్ "భరత్ అనే నేను", అల్లు అర్జున్ "నా పేరు సూర్య" విడుదల కానున్నాయి. తలైవా మార్కెట్ రేంజ్ వీరిద్దరి కంటే పెద్దది. రజనీ సినిమా అంటే కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ భారీగా రిలీజ్ చేస్తారు. అంతేనా.. తమిళ జనాలు ఎక్కువగా ఉండే అమెరికా, మలేషియా, సింగపూర్, థాయిలాండ్, గల్ఫ్, మిడిల్ ఈస్ట్‌లలోనూ కాలా గ్రాండ్ రిలీజ్ ఉంటుంది. ఓవర్సీస్‌లో మంచి ట్రాక్ రికార్డు ఉన్న మహేశ్‌కు ఇది ఇబ్బందికర పరిణామం. అలాగే అల్లు అర్జున్‌కు తెలుగుతో పాటు మలయాళంలోనూ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. "నా పేరు సూర్య" కోసం తెలుగువారితో పాటు మల్లువుడ్ జనాలు కూడా ఎగ్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు. రజనీకి కేరళలోనూ హార్డ్‌కోర్ ఫ్యాన్స్ ఉన్నారు.

ప్రపంచంలోని ఎక్కడ.. ఏ మూలకు వెళ్ళినా.. రజనీ నుంచి మహేశ్, బన్నీలకు పోటీ తప్పదు.. ఇక అన్నింటికంటే ముఖ్యంగా థియేటర్ల సమస్య తప్పకుండా ఎదురవుతుంది. హై బడ్జె‌ట్‌తో తెరకెక్కుతున్న మహేశ్, బన్నీ సినిమాలు ఆ స్థాయిలో వసూళ్లు సాధించాలంటే అందుకు ఓపెనింగ్స్ భారీగా రావాలి. భారీగా రిలీజైతేనే ఈ సినిమాలు నెట్టుకు రాగలవు.. ఒకవేళ డివైడ్ టాక్ వచ్చి పరిస్థితి తారుమారైతే ఊహించడానికే కష్టం. కాబట్టి జరగబోయే పరిణామాలను ముందుగానే బేరీజు వేసుకుని మహేశ్, బన్నీలలో ఎవరో ఒకరు వెనక్కి తగ్గుతారో లేక... కాలాకి పోటీగా నిలబడతారో వేచి చూడాలి.అదరగొడుతున్న 'సైనికా' సాంగ్

Updated By ManamFri, 01/26/2018 - 09:22

Allu Arjunఅల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ తెరకెక్కిస్తున్న చిత్రం 'నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా'. రిపబ్లిక్‌ డేను పురస్కరించుకుని ఈ సినిమాలో ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. 'సైనికా' అంటూ సాగే ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ వారి గొప్పదనాన్ని తెలుపుతున్నాయి. విశాల్ శేఖర్ ద్వయం అందించిన సంగీతం దానికితోడు విశాల్ దద్లానీ వాయిస్ ఈ సాంగ్‌కు ప్లస్‌గా నిలిచాయి.

ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన అను ఇమ్మాన్యుల్ నటిస్తుండగా.. అర్జున్, శరత్ కుమార్, రావు రమేశ్ తదితరులు ముఖ్యపాత్రలలో కనిపించనున్నారు. నాగబాబు, లగడపాటి శ్రీధర్, బన్నీ వాసు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.సూర్య కేరాఫ్ గోవా

Updated By ManamMon, 12/11/2017 - 16:06

bunnyర‌చ‌యిత వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కుడిగా మారి రూపొందిస్తున్న తొలి చిత్రం 'నా పేరు సూర్య‌'. స్టైలీష్ స్టార్‌ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రం.. ప్ర‌స్తుతం గోవాలో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది.  ఈ షెడ్యూల్‌లో బ‌న్ని, అనూప్ ఠాకూర్ సింగ్‌పై ఓ పోరాట స‌న్నివేశాన్ని.. అలాగే బ‌న్ని, అనుపై ఓ రొమాంటిక్ సాంగ్‌ని పూర్తిచేసార‌ని తెలిసింది. రేపు (మంగ‌ళ‌వారం) గోవా షెడ్యూల్‌ని పూర్తిచేసి.. హైద‌రాబాద్ తిరిగి రానుంది చిత్ర యూనిట్‌. ఆ త‌రువాత చిన్న విరామం తీసుకుని మ‌రో షెడ్యూల్‌కి వెళ్ల‌నున్నార‌ని స‌మాచార‌మ్‌. విశాల్ శేఖ‌ర్ సంగీత‌మందిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 27న విడుద‌ల కానుంది.

 బండ్ల గ‌ణేష్‌కి జైలు శిక్ష‌

Updated By ManamFri, 11/24/2017 - 15:23

bandlaప్ర‌ముఖ న‌టుడు, నిర్మాత బండ్ల‌ గ‌ణేష్‌కి చెల్ల‌ని చెక్కు కేసులో జైలు శిక్ష ప‌డింది. ఆయ‌న నిర్మించిన హిట్ చిత్రం 'టెంప‌ర్'కి వక్కంతం వంశీ క‌థ అందించిన సంగ‌తి తెలిసిందే. అయితే వంశీకి గ‌ణేష్ ఇచ్చిన చెక్కు చెల్ల‌క‌పోవ‌డంతో.. స‌ద‌రు ర‌చ‌యిత కోర్టులో ఫిర్యాదు చేశారు. శుక్ర‌వారం హైద‌రాబాద్‌లోని ఎర్ర‌మంజిల్ కోర్టులో ఈ కేసు తాలుకు విచార‌ణ జ‌రిగింది. వాద‌ ప్ర‌తివాద‌న‌లు విన్న త‌రువాత న్యాయ‌మూర్తి.. బండ్ల‌గ‌ణేష్‌కి ఆరు నెల‌లు జైలు శిక్ష‌తో పాటు, రూ.15.86 ల‌క్ష‌ల జ‌రిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. అయితే.. గ‌ణేష్ అప్పీల్ చేసుకోవ‌డంతో కోర్టు ఆయ‌న‌కి బెయిల్ మంజూరు చేసింది.

Related News