gang

మద్యం బాటిళ్లను రోలర్‌తో తొక్కించారు..

Updated By ManamWed, 07/11/2018 - 18:16

Spiked foreign liquor gang busted in Hyderabad

రంగారెడ్డి: హైదరాబాద్ నగర వ్యాప్తంగా అక్రమ మార్గాల ద్వారా విక్రయిస్తున్న విదేశీ మద్యాన్ని పెద్ద ఎత్తున పోలీసులు స్వాధీనం చేసుకుని పలువుర్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇలా విదేశీ మద్యం పెద్ద ఎత్తున పట్టుకోవడంలో రాజేంద్రనగర్ ఎక్సైజ్ పోలీసులు కీలక పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. అక్రమ మార్గాల ద్వారా శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి నగరంలో విక్రయిస్తున్న ఇద్దరు స్మగ్లర్లను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. 

గత కొంత కాలంగా.. చెన్నై, బెంగుళూరు, సీపోర్టుల నుంచి విదేశీ మద్యాన్ని కొనుగోలు చేసి నగరంలో అధిక దరకు విక్రయిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు పక్కా సమాచారంతో రంగంలోకి మాటు వేసి పలువుర్ని పట్టుకున్నారు. కాగా.. స్లగ్లర్ల నుంచి వివిధ బ్రాండ్లకు చెందిన 640 విదేశీ మద్యం బాటిళ్ల స్వాదీనం చేసుకోవడం జరిగింది. వాటి విలువ సుమారు 40 లక్షలు వుంటుందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది. సెక్షన్ 46 ప్రకారంగా విదేశీ మద్యంను అధికారుల సమక్షంలో రోడ్డుపై వరుసగా పేర్చి రోడ్డు రోలర్‌‌తో  తొక్కించారు. బహుశా ఇలాంటి ఘటనలు సినిమాలో తప్ప.. రియల్ లైఫ్‌లో చూడటం చాలా అరుదు. ఈ సీన్ చూసిన మందు బాబులకు గుండె పగిలుంటుందేమో..!'గ్యాంగ్' 10 రోజుల క‌లెక్ష‌న్లు

Updated By ManamMon, 01/22/2018 - 15:26

gangసూర్య‌, కీర్తి సురేష్‌ జంట‌గా న‌టించిన త‌మిళ అనువాద‌ చిత్రం 'గ్యాంగ్‌'. విఘ్నేష్ శివ‌న్‌ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా.. సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న తెర‌పైకి వ‌చ్చింది. యావ‌రేజ్‌ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ.. ఆదివారం నాటికి 10 రోజులు పూర్తిచేసుకుంది. కాగా,  తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 10 రోజుల షేర్ రూ.6.87 కోట్ల వ‌ర‌కు ఉంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. త‌మిళంలోనూ ఈ సినిమా యావ‌రేజ్ రిజ‌ల్ట్ సొంతం చేసుకుంది. అభిమానుల‌పై సూర్య ఆగ్ర‌హం

Updated By ManamFri, 01/19/2018 - 17:59

suriyaక‌థానాయ‌కుల‌కు అభిమానులే ఆస్తి. అలాంటి అభిమానుల‌కు విలువ ఇచ్చే క‌థానాయ‌కులు ద‌క్షిణాదిన చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో త‌మిళ క‌థానాయ‌కుడు సూర్య ఒక‌రు. అనువాద చిత్రాల‌తో తెలుగువారికీ చేరువైన సూర్య‌.. తాజాగా ఓ విష‌యంలో అభిమానుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. సూర్య తాజా త‌మిళ చిత్రం 'తాన సేరంద కూట‌మ్' తెలుగులో 'గ్యాంగ్‌’ పేరుతో సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌లైంది. రెండు చోట్లా ఈ సినిమా.. హిట్ టాక్ తెచ్చుకుంది.

ఈ సంద‌ర్భంగా.. సక్సెస్‌ మీట్‌లో భాగంగా వివిధ ప్రాంతాల్లో సూర్య పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం రాత్రి  చెన్నైలో సందడి చేశారు సూర్య. అయితే.. ఈ స‌క్సెస్ టూర్‌ని పుర‌స్క‌రించుకుని.. కొందరు సూర్య‌ అభిమానులు బైకులపై హెల్మెట్లు లేకుండా ర్యాలీ నిర్వహించారట‌. ఈ దృశ్యాన్ని గ‌మ‌నించిన‌ సూర్య.. త‌న‌ కారు దిగి వారందరిపై ఆగ్రహం వ్యక్తం చేశారట‌.

ఈ ర్యాలీలో పాల్గొన్న అభిమానుల్లో చాలామంది బైకులపై హెల్మెట్లు లేకుండా వేగంగా దూసుకెళుతున్నారని, వారిలో ఒకరి బైక్‌ అదుపు తప్పి త‌న‌ కారు కింద పడబోయింద‌ని.. వారికేమన్నా జరిగితే అది త‌న‌ను జీవితాంతం వెంటాడుతుంద‌ని, దయచేసి అందరూ హెల్మెట్లు ధరించండ‌ని సూర్య మీడియా ద్వారా విన్న‌పించుకున్నారు. 'గ్యాంగ్' 4 రోజుల క‌లెక్ష‌న్లు

Updated By ManamTue, 01/16/2018 - 18:13

suriaసూర్య‌, కీర్తి సురేష్‌, ర‌మ్య‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన త‌మిళ అనువాద చిత్రం 'గ్యాంగ్‌'. విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం సంక్రాంతి సంద‌ర్భంగా శుక్ర‌వారం విడుద‌లైంది. తొలి రోజు ఈ సినిమాకి ఆశించిన మేర వసూళ్ళు రాలేదు. అయిన‌ప్ప‌టికీ.. తెలుగు రాష్ట్రాల్లో మూడో రోజు, నాలుగో రోజు వ‌చ్చిన క‌లెక్ష‌న్లు.. తొలి రోజు (రూ.86 ల‌క్ష‌ల షేర్)ని మించి ఉండ‌డం ట్రేడ్ వ‌ర్గాల‌ని విస్మ‌య‌ప‌రుస్తోంది. ఓవ‌రాల్‌గా.. నాలుగు రోజుల‌కిగానూ ఈ సినిమా రూ.3.61 కోట్ల షేర్ రాబ‌ట్టుకుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. త‌మిళ నాట హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. ఇక్క‌డ బ్రేక్ ఈవెన్ అయ్యే అవ‌కాశాలున్నాయ‌ని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు.'గ్యాంగ్' తొలి రోజు వ‌సూళ్ళు

Updated By ManamSat, 01/13/2018 - 15:11

gangసూర్య‌, కీర్తి సురేష్‌, ర‌మ్య‌కృష్ణ ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన త‌మిళ అనువాద చిత్రం 'గ్యాంగ్'. విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. యావ‌రేజ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. తొలి రోజు క‌లెక్ష‌న్ల విష‌యంలో నిరాశ‌ప‌రిచిందంటున్నారు ట్రేడ్ పండితులు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.86 ల‌క్ష‌లు మాత్ర‌మే రాబ‌ట్టింద‌ని ట్రేడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉంటే.. త‌మిళంలో తాన సేరంద కూట‌మ్ పేరుతో విడుద‌లైన ఈ చిత్రం అక్క‌డ మంచి టాక్‌నే తెచ్చుకోవ‌డం గ‌మ‌నార్హం.  'గ్యాంగ్' రివ్యూ

Updated By ManamFri, 01/12/2018 - 17:59

gangచిత్రం: గ్యాంగ్
తారాగణం: సూర్య, కీర్తి సురేష్, రమ్యకృష్ణ, కార్తిక్, సెంథిల్, తంబి రామయ్య, ఆనంద్ రాజ్, బ్రహ్మానందం, సురేష్ మీనన్, నందా, ఆర్‌.జె.బాలాజీ, నిరోషా తదితరులు
ఛాయాగ్రహణం: దినేష్ కృష్ణన్
కూర్పు: ఎ.శ్రీకర్ ప్రసాద్
మాటలు: శ‌శాంక్ వెన్నెల కంటి
సంగీతం: అనిరుధ్‌ రవిచందర్
నిర్మాతలు: ప్రమోద్, వంశీ
బ్యానర్: యువి క్రియేషన్స్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విఘ్నేష్‌ శివన్
విడుదల తేది: జనవరి 12, 2018

మంచి వాళ్లు చెడ్డ‌వాళ్లుగా మారితేనే.. చెడ్డ‌వాళ్లు మంచి వాళ్లుగా మారుతారు.. అని భావించే 1987 కాలం నాటి ఓ యువ‌కుడి ఆలోచ‌న‌కు రూప‌మే 'గ్యాంగ్' చిత్రం. సూర్య‌, కీర్తి సురేష్, ర‌మ్య‌కృష్ణ‌, కార్తీక్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమా.. హిందీ చిత్రం ‘స్పెషల్ ఛ‌బ్బీస్‌’ రీమేక్‌గా తెర‌కెక్కింది. శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ సినిమాపై మనం అందిస్తున్న‌ సమీక్ష మీ కోసం:

కథ: 
gangతిలక్ (సూర్య) చిన్నప్పటినుంచి సి.బి.ఐ ఆఫీసర్ అవ్వాలని కల‌లు కంటూ ఉంటాడు. తిల‌క్  తండ్రి (తంబి రామ‌య్య‌) మాత్రం ఓ సి.బి.ఐ ఆఫీస్‌లో గుమాస్తాగా పనిచేస్తూ ఉంటాడు. అయితే తండ్రి ప‌నిచేసే ఆఫీస్‌కే ఇంట‌ర్వ్యూకి వెళ్ళిన తిల‌క్‌ని.. ఇంట‌ర్వ్యూ చేసిన అధికారి అవ‌మానిస్తాడు. ''క్లర్క్‌గా ప‌నిచేసే నీ తండ్రి ఆఫీస్‌కే నువ్వు అధికారిగా రావాల‌నుకుంటున్నావా? ఆయ‌న స‌ర్వీస్‌లో పోతే అదే ఉద్యోగం నీకు వ‌స్తుంది? అది చేయ్‌'' అంటూ వ్యంగ్యంగా మాట్లాడ‌తాడు. దీనికి తోడు పోలీస్ కావాల‌నుకున్న తిల‌క్‌ స్నేహితుడు.. అర్హ‌త ఉన్నా నిరుద్యోగం కార‌ణంగా అత‌ని క‌ళ్ళ ముందే ఆత్మ‌హ‌త్య చేసుకుంటాడు. దీంతో.. ల‌క్ష‌లు పోసి ప‌నిచేసే ఉద్యోగం కంటే.. ల‌క్ష్యం కోసం ప‌నిచేసే ఉద్యోగం ఉత్త‌మం అనుకుంటూ.. త‌ను ఓ ఫేక్ సి.బి.ఐ.అధికారిగా మారి.. త‌నలాగే నిరుద్యోగంతో బాధ‌ప‌డుతున్న మ‌రో ముగ్గురు (ర‌మ్య‌కృష్ణ‌, సెంథిల్‌,) స‌హ‌కారంతో సి.బి.ఐ బృందం అంటూ.. అవినీతితో సంపాదించిన వారి ఇళ్ళ‌ల్లో డూప్లికేట్ రెయిడ్ చేసి డ‌బ్బు, న‌గ‌లు సొంతం చేసుకుంటారు. ఈ సోదాల తర్వాత తెలుస్తుంది.. తిల‌క్ టీమ్‌ అసలు సిబిఐ టీమ్‌ కాదు అని. దీంతో అసలు సి.బి.ఐ టీమ్‌ అప్రమత్తమ‌వుతుంది. తిల‌క్ గ్యాంగ్‌ని పట్టుకోవడానికి రంగంలోకి దిగుతుంది.  దీంతో.. తిల‌క్‌ గ్యాంగ్ మరో డూప్లికేట్ రెయిడ్‌ చేయడం కోసం హైదరాబాద్ వెళుతుంది. మ‌రోవైపు ఈ గ్యాంగ్‌ని పట్టుకోవడానికి సి.బి.ఐ స్పెషల్ ఆఫీసర్‌గా శివ‌శంక‌ర్ (కార్తీక్‌) వస్తాడు. మ‌రి.. శివ‌శంక‌ర్ ఈ బృందాన్ని ప‌ట్టుకుంటాడా?  లేదా?  తిల‌క్ ల‌క్ష్యం ఎంత‌వ‌ర‌కు నెర‌వేరింది? అనేది మిగిలిన క‌థ‌.

విశ్లేషణ: 
హిందీలో విజ‌యం సాధించిన స్పెష‌ల్ 26కి రీమేక్‌గా ఈ చిత్రాన్ని రూపొందించినా.. చెప్పుకోద‌గిన మార్పుల‌తో ఈ సినిమాని తెర‌కెక్కించాడు విఘ్నేష్ శివ‌న్‌. అయితే.. ప్ర‌ధానంగా త‌మిళంలో తెర‌కెక్కిన ఈ సినిమాకి త‌మిళ వాస‌న‌లు ఎక్క‌వ‌గా ఉండ‌డంతో ఇక్క‌డివారిని ఆక‌ట్టుకోవ‌డంలో ఫెయిలయింద‌నే చెప్పాలి. ప్ర‌థ‌మార్థంలో మినిస్ట‌ర్ ఇంటిపై సోదా చేసే స‌న్నివేశం, ద్వితీయార్థంలో వ‌చ్చే ఇంట‌ర్వ్యూ సీన్ మాత్ర‌మే ఈ సినిమాలో క‌ట్టిప‌డేసే దృశ్యాలు. ఇక‌ మిగిలిన సినిమా.. అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. న‌టీన‌టుల విషయానికి వ‌స్తే.. త‌న ఆశ‌యం నెర‌వేర‌క‌పోయినా నిరాశ‌ప‌డ‌క‌.. మ‌రో మార్గంలో దాన్ని ఫుల్‌ఫిల్ చేసుకునే యువ‌కుడిగా సూర్య న‌ట‌న మెప్పిస్తుంది. చేసే ప‌నితోనే మ‌న గుర్తింపు అంటూ చెప్పుకొచ్చే స‌న్నివేశంలో ఆయ‌న న‌ట‌న మెప్పిస్తుంది. ఆయ‌న సొంత డ‌బ్బింగ్ ఒక‌ట్రెండు చోట్ల ఇబ్బంది పెట్టినా.. త‌న‌ ప్ర‌య‌త్నాన్ని మెచ్చుకోక‌త‌ప్ప‌దు. ఎనిమిది మంది పిల్ల‌ల త‌ల్లి అయిన నిస్స‌హాయ‌క మ‌ధ్య‌త‌ర‌గ‌తి గృహిణి బుజ్జ‌మ్మ‌గానూ.. (ఫేక్‌) సి.బి.ఐ.ఝూన్సీరాణిగానూ.. ఇలా రెండు షేడ్స్ ఉన్న పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ న‌ట‌న గుర్తుండిపోతుంది. కీర్తి సురేష్‌కి ఇందులో న‌టించ‌డానికి పెద్ద‌గా స్కోప్ లేదు. ఒక‌ట్రెండు స‌న్నివేశాల్లో మాత్ర‌మే కాస్త అందంగా క‌నిపించింది. మిగిలిన న‌టులు త‌మ పాత్ర‌ల ప‌రిధుల్లో ఓకే అనిపించుకున్నారు. 
సాంకేతికంగా తీసుకుంటే.. ఈ సినిమాకి దినేష్ అందించిన ఛాయాగ్ర‌హ‌ణం బాగా కుదిరింది. అనిరుధ్ పాట‌లు, నేప‌థ్య సంగీతం ఇంప్రెసివ్‌గా లేవు. శ్రీ‌క‌ర్ ప్ర‌సాద్ ఎడిటింగ్ వ‌ర్క్ బాగుంది. శశాంక్ మాట‌ల్లో ''ఒక్కడు కోటీశ్వరుడు అవడానికి కోటి మంది చావాల్సి వస్తోంది. మొత్తం తవ్వి బయటికి తీస్తే మన దేశంలో ఉన్న చాలా ప్రాబ్ల‌మ్స్‌ని ఈకల్లా పీకి పారేయొచ్చు”, “గుండెల్లో ధైర్యం...చేతిలో ధర్మం ఉంటే మనం దేనికి భయపడక్కర్లేదు”వంటి డైలాగులు ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

ప్ల‌స్ పాయింట్స్‌
సూర్య‌, ర‌మ్య‌కృష్ణ‌
ఛాయాగ్ర‌హ‌ణం
మాట‌లు
నిర్మాణ విలువలు
సినిమా నిడివి

మైన‌స్ పాయింట్స్‌
సంగీతం
ద‌ర్శ‌క‌త్వం
త‌మిళ వాస‌న‌లు ఎక్కువ‌గా ఉండ‌డం

చివ‌ర‌గా.. రీమేక్ వ‌ర్క‌వుట్ కాలేదు
రేటింగ్‌.. 2.5/5
 ‘గ్యాంగ్’ నిడివి ఎంతంటే..

Updated By ManamThu, 01/11/2018 - 21:55

gangతమిళ నటుడు సూర్య నటించిన తాజా త‌మిళ‌ చిత్రం ‘తానా సేరంద కూటం’. తెలుగులో ఈ సినిమాని ‘గ్యాంగ్’ పేరుతో అనువదించారు. తమిళంతో పాటు తెలుగులో కూడా సంక్రాంతి సందర్భంగా రేపు (శుక్రవారం) విడుదలకు సిద్ధంగా ఉందీ చిత్రం. విఘ్నేష్‌ శివన్ దర్శక‌త్వంలో కీర్తి సురేష్ కథానాయికగా న‌టించగా.. రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర పోషించారు.  అనిరుధ్‌ అందించిన స్వరాలకు ఇప్పటికే మంచి ఆదరణ లభించింది. “గుండెల్లో ధైర్యం...చేతిలో ధర్మం ఉంటే మనం దేనికి భయపడక్కర్లేదు” అని ట్రైలర్‌లో ఉన్న డైలాగ్ బాగా ఆకట్టుకుంటోంది. కాగా, ఈ మూవీ నిడివికి సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలిసింది. ఈ చిత్రం  రన్ టైం కేవ‌లం 2 గంటల 18 నిమిషాల నిడివిగా ఉందని సమాచారమ్‌. సినిమా బాగుంటే.. ఈ నిడివి కూడా క‌లిసొచ్చే అంశ‌మ‌వుతుంద‌నే చెప్పాలి.'గ్యాంగ్’లో రమ్య పాత్రే కీలకం

Updated By ManamThu, 01/11/2018 - 19:42

ramya‘గ్యాంగ్’ సినిమాతో రేపు (శుక్ర‌వారం) తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు సూర్య. వినోదాత్మకంగా సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్‌ని విఘ్నేష్‌ శివన్ తెరకెక్కించారు. కీర్తి సురేష్ కథానాయికగా న‌టించిన ఈ సినిమా.. బాలీవుడ్ చిత్రం ‘స్పెషల్ 26’కి అధికారిక రీమేక్. సీనియర్ నటి రమ్యకృష్ణ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించారు. ‘గ్యాంగ్’ అనే దొంగల ముఠా జట్టులో ఒక సభ్యురాలైన రమ్యకృష్ణ పాత్ర చాలా ఆసక్తికరంగాను, అలాగే హాస్యాన్ని కూడా పండించే విధంగాను ఉంటుందని సమాచారం. ఈ మధ్య తనకు తగిన, ప్రాముఖ్యత ఉన్న పాత్రలనే పోషిస్తున్న రమ్య.. ఈ సినిమాలో తన వైవిధ్యమైన నటనతో మరోసారి ఆకట్టుకుంటారని చిత్ర బృందం చెప్పుకొస్తోంది. అలాగే రమ్యకృష్ణతో సూర్య మొదటిసారిగా నటించిన‌ ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ సంస్థ తెలుగు ప్రేక్ష‌కులకు అందిస్తోంది.ఫ్యాన్స్‌ కాళ్లు మొక్కిన సూర్య.. వీడియో!

Updated By ManamThu, 01/11/2018 - 17:36

suryaఎంత ఎదిగినా ఒదిగివుండే తత్వం ఉన్న కొద్దిమంది నటుల్లో త‌మిళ క‌థానాయ‌కుడు సూర్య ఒకరు. అందుకే సినిమాలతో సంబంధం లేకుండా అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఎప్పుడూ సినిమాలతో, మాధ్యమాలతో అభిమానులకి దగ్గరగా ఉండే సూర్య.. సేవా కార్యక్రమాలలో కూడా తనదైన పాత్ర పోషిస్తూ ఉంటారు. ఒక్క తమిళనాడులోనే కాదు.. ఎక్కడైనా ఎటువంటి అవసరం ఏర్పడినా ఆయ‌న  తన వంతు సాయం చేస్తూ ఉంటారు. అందుకే సూర్య అంటే అందరికి ప్రత్యేకమైన అభిమానం. ఇదిలా ఉంటే...నిన్న జరిగిన ‘తాన సేరంద కూటం’ (తెలుగులో ‘గ్యాంగ్) సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలో..  ఆశ్చర్యకరమైన విషయం ఒకటి చూపరులను ఆకట్టుకుంది. ఇంత‌కీ అదేమిటంటే.. సూర్య వేదికపై నుండి మాట్లాడుతూ ఉండగా..కొంతమంది సూర్య అభిమానులు వేదికపైకొచ్చి సూర్య కాళ్ళకు నమస్కరించారు. వెంటనే.. సూర్య కూడా అందుకు ప్రతిగా ఆ అభిమానుల కాళ్ళకు నమస్కరించి, “ఇకపై కాళ్ళ మీద పడి ఇలా అభివాదం చేయవద్ద”ని వినమ్రంగా వేడుకున్నారు. ఇది చూసిన అతిథులు సూర్య సంస్కారానికి, వ్యక్తిత్వానికి ఫిదా అయిపోయారు. ఏప్రిల్ నుంచి సూర్య‌, కె.వి.ఆనంద్ చిత్రం

Updated By ManamSun, 01/07/2018 - 18:14

suriya'వీడొక్క‌డే', 'బ్ర‌ద‌ర్స్' వంటి త‌మిళ అనువాద చిత్రాల‌తో ఆక‌ట్టుకున్న కాంబినేష‌న్ క‌థానాయ‌కుడు సూర్య‌, ద‌ర్శ‌కుడు కె.వి.ఆనంద్‌ది. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో దాదాపు ఐదున్న‌ర సంవ‌త్స‌రాల గ్యాప్ త‌రువాత మ‌రో సినిమా రానుందంటూ ఆ మ‌ధ్య కొన్ని క‌థ‌నాలు వినిపించాయి. తాజాగా సూర్య ఈ విష‌యాన్ని ధృవీక‌రించారు. అంతేకాకుండా.. ఈ సినిమా ఏప్రిల్‌లో సెట్స్ పైకి వెళుతుంద‌ని చెప్పుకొచ్చారు. సూర్య తాజా త‌మిళ అనువాద చిత్రం 'గ్యాంగ్' ఈ నెల 12న విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. కాగా, సెల్వ రాఘ‌వ‌న్‌తో సూర్య చేయ‌నున్న చిత్రం ఇటీవ‌లే లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. మొత్తానికి.. సూర్య ఈ ఏడాది ఫుల్ బిజీగా ఉండ‌నున్నార‌న్న‌మాట‌.

Related News