mammutti

వై.ఎస్.జగన్ పాత్ర లేదా ...?

Updated By ManamTue, 10/09/2018 - 07:30

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రను యాత్ర పేరుతో సినిమాగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వై.ఎస్.ఆర్ పాత్రలో మమ్ముట్టి నటిస్తున్నారు.  ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణలో పోచంపల్లిలో జరుగుతుంది. పోచంపల్లిలోని టూరిజం పార్క్, చెరువు కట్ట సమీపంలో షూటింగ్ జరుపుకుంటుంది. వై.ఎస్.ఆర్ పాత్రధారి మమ్ముట్టి, సబిత ఇంద్రారెడ్డి పాత్రధారి సుహాసిని కొంత మంది వేర్వేరు వర్గాలకు చెందిన ప్రజలను కలుసుకునే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

image


అలాగే ఓ పాటలో బ్యాగ్రౌండ్  స్కోర్‌తో కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వై.ఎస్.ఆర్ తనయుడు వై.ఎస్.జగన్ పాత్రలో ఎవరు కనిపిస్తారనే దానిపై క్లారిటీ రాలేదు. ఇంతకు ముందు వై.ఎస్.జగన్ పాత్రలో సూర్య లేదా కార్తి నటించే అవకాశాలున్నాయని వార్తలు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం యాత్ర చిత్రంలో వై.ఎస్.జగన్ పాత్ర ఉండదట. కృష్ణ కుమార్ సంగీతం, సత్యన్ సూర్యన్ కెమెరామెన్‌గా వర్క్ చేస్తున్నారు. డిసెంబర్ 21న సినిమా విడుదల కానుంది. మహి వి.రాఘవ్ దర్శకుడు విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి నిర్మాతలు. డబ్బింగ్ తెలుగులోనే!

Updated By ManamThu, 09/27/2018 - 00:08

imageతెలుగులో ‘యాత్ర’ సినిమాలో నటిస్తున్నారు మమ్ముట్టి. ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని ఈ బయోపిక్‌ను రూపొందిస్తున్నారు. మహి వి.రాఘవ్ దర్శకుడు. విజయ్ చల్లా, శశిదేవి రెడ్డి నిర్మాతలు. రాజశేఖర్ రెడ్డి ప్రజల కష్టసుఖాలను తెలుసుకోవడానికి చేసిన పాద యాత్రే ఇందులో ప్రధానైమెన కాన్సెప్ట్‌గా కనపడుతుంది. త్వరలోనే చిత్రీకరణ పూర్తి చేసుకోబోతున్న ఈ సినిమాలో డబ్బింగ్‌ను తనే స్వయంగా చెప్పాలని మమ్ముట్టి నిర్ణయించుకున్నారట. ఈ చిత్రాన్ని డిసెంబర్ 21న విడుదల చేయబోతున్నారు. విలన్‌గా...

Updated By ManamThu, 09/06/2018 - 22:33

వైవిధ్యమైన పాత్రల్లో నటించడానికి మలయాళ అగ్ర కథానాయకులైన మోహన్‌లాల్, మమ్ముట్టి ఆసక్తిని కనపరుస్తుంటారు. మమ్ముట్టి విషయానికి వస్తే ఆయన ఇప్పుడు తెలుగులో యాత్ర సినిమాలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈయన తమిళంలో విలన్‌గా నటించబోతున్నారు. జయం రవి, మోహన్ రాజా కాంబినేషన్‌లో వచ్చిన ‘తనీ ఒరువన్’కు సీక్వెల్ రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయ్యాయి. తనీ ఒరువన్‌లో అరవింద స్వామిని విలన్‌గా చూపించిన దర్శకరుడు మోహన్ రాజా.. సీక్వెల్‌లో మమ్ముట్టిని విలన్‌గా చూపించాలనుకుంటున్నారట. చిత్ర యూనిట్ మమ్ముట్టితో సంప్రదింపులు జరుపుతుంది. 
 

image

 వావ్.. రాయ్‌లక్ష్మీ.. సూర్యుణ్ణే మింగేస్తుంది..!

Updated By ManamWed, 04/04/2018 - 17:57

అందాల తార రాయ్ లక్ష్మికి బాగా ఆకలేసినట్టుంది.. షూటింగ్‌ లోకేషన్‌లో ఏమి దొరక్క ఇలా సూర్యుణ్ణే అమాంతం మింగేస్తుంది కాబోలు.. అలానే ఉంది కదా? ఈ ఫొటో.. ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గ్రాఫిక్స్ కాదండోయ్.. రియల్ ఫొటోనే.. ఇంతకీ ఈ ఫొటో ఎవరూ తీసి వుండచ్చు..

Rai laxmi, Sunrise, Mammutti, Rai Photo viral 

ఓ అగ్ర హీరో తీసిన ఈ ఫొటోను చూసి ముచ్చటపడిన రాయ్.. తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిందట. ఆ అగ్ర హీరో ఎవరో కాదు.. జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందిన మలయాళి మెగాస్టార్ మమ్ముట్టి. మంచి నటుడిగానే కాదు.. మంచి ఫొటో గ్రాఫర్‌ కూడా ఆయనలో ఉన్నారని ఈ ఫొటోతో నిరూపించుకున్నారు. చిత్రం షూటింగ్ లోకేషన్‌లో అందమైన జలపాతాల నడుమ రాయ్ లక్ష్మి దిగిన మరో స్టిల్ కూడా వైరల్ అవుతోంది. ఈ ఫొటోను కూడా మమ్ముట్టితోనే ముచ్చటపడి తీయించుకున్న రాయ్.. ఎంతో అందంగా అద్భుతంగా తీశారో మీరే చూడండి.. అంటూ తన ట్విట్టర్ ఖాతాలో అభిమానులతో పంచుకుంది..  26 ఏళ్ల త‌రువాత‌..

Updated By ManamSun, 11/26/2017 - 16:22

rajani, mammuttiమణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘దళపతి’ ఎంత‌టి ఘ‌న‌విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇందులో.. తమిళ‌ సూపర్ స్టార్ రజనీకాంత్, మలయాళ మెగా స్టార్ మమ్ముట్టి ప్రాణ స్నేహితులుగా చేసిన సంద‌డి అంత సులువుగా మ‌ర‌చిపోలేం. 26 ఏళ్ల త‌రువాత‌ ఈ ఇద్ద‌రు స్టార్స్ మ‌రోసారి తెరపై సందడి చేయడానికి సిద్దమౌతున్నారు. కాకపోతే ఈ సారి ద‌క్షిణాది సినిమాలో కాకుండా.. ఒక మరాఠీ సినిమాలో ఈ కాంబినేష‌న్‌ కలిసి హంగామా చేయనుంది. దీపక్ భావే డైరెక్షన్ లో రూపొందుతున్న ఆ చిత్రమే ‘పసాయదన్’. బాల్ కృష్ణ సర్వే నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ మూవీ వచ్చే ఫిబ్రవరి నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ సినిమాకి సంబంధించి మరో ఆసక్తికర విషయమేమిటంటే.. తన మాతృ భాష మరాఠీలో మొదటి సారిగా రజనీ నటిస్తుండడం. మరి..దక్షిణాది భాషల్లో కూడా ఈ మూవీని డబ్ చేస్తారేమో చూడాలి.

Related News