Praja Sankalpa yatra

259వ రోజు యాత్రను కొనసాగిస్తున్న జగన్

Updated By ManamMon, 09/10/2018 - 11:58

Jagan Mohan Reddyవిశాఖపట్నం: ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 259వ రోజు కొనసాగుతోంది. యాత్రలో భాగంగా సోమవారం ఉదయం విశాఖపట్నం నియోజకవర్గంలోని తాటిచెట్లపాలెం నుంచి పాదయాత్రను ప్రారంభించారు జగన్. అక్కడి నుంచి అక్కయ్యపాలెం, దొండపర్తి జంక్షన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, వాల్తేరు మీదుగా జగన్ తన పాదయాత్రను కొనసాగించనున్నారు. వాల్తేరులో బ్రాహ్మణుల ఆత్మీయ సదస్సులో జగన్ పాల్గొననున్నారు. కాగా యాత్రలో అక్కడి ప్రజలతో మమేకమౌతున్న జగన్ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.



253వ రోజు జగన్ పాదయాత్ర సాగనుందిలా

Updated By ManamMon, 09/03/2018 - 09:56

Jagan విశాఖపట్నం: ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్పయాత్ర 253వ రోజుకు చేరింది. యాత్రలో భాగంగా సోమవారం మడుగుల నియోజకవర్గం ములకలాపల్లిలో నుంచి తన పాదయాత్రను జగన్ ప్రారంభించారు. అక్కడి నుంచి కొత్తపెంట, ఎ.భీమవరం, పడుగు పాలెం, ఎ.కోడూరు మీదుగా కె.కోటపాడు వరకు జగన్ పాదయాత్రను కొనసాగించనున్నారు. అనంతరం సాయంత్రం కె.కోటపాడులో బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఇక యాత్రలో జగన్‌ వేలాదిమంది ప్రజలతో మమేకమౌతూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు.



వైఎస్సాఆర్ సీపీలోకి మాజీ డీజీపీ సాంబశివరావు

Updated By ManamSat, 08/25/2018 - 18:10
AP EX DGP Sambasivarao-Ys jagan

విశాఖ : ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ సాంబశివరావు త్వరలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆయన త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం విశాఖ జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. రాంబిల్లి మండలం హరిపురంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్‌ను శనివారం సాంబశివరావు కలిశారు. పార్టీలో చేరిక విషయాన్ని ప్రస్తావించారు.  

కాగా సాంబశివరావు స్వస్థలం ప్రకాశం జిల్లా ఒంగోలు. గత ఏడాదే ఆయన ఏపీ డీజీపీగా పదవీ విరమణ చేశారు. మరోవైపు సాంబశివరావు చేరికను ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ధ్రువీకరించారు.



విశాఖలోకి జగన్ ఎంట్రీ

Updated By ManamTue, 08/14/2018 - 13:09

Jagan Mohan Reddyవిశాఖపట్నం: ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర విశాఖపట్నం జిల్లాలోకి ప్రవేశించింది. ఈ రోజు ఉదయం తూర్పుగోదావరి జిల్లా నుంచి జగన్ పాదయాత్రను ప్రారంభించగా.. నర్సీపట్నం నియోజకవర్గ పరిధిలోని నాతవరం మండలం గన్నవరం మెట్టు గ్రామంలోకి అడుగుపెట్టడం ద్వారా విశాఖ జిల్లాలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

అనంతరం పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి, నేతలు గుడివాడ అమర్ నాథ్, వరదు కల్యాణి తదితరులు జగన్ పాదయాత్రలో పాల్గొన్నారు. కాగా మంగళవారం జగన్ పాదయాత్ర 237రోజుకు చేరింది. 



జగన్‌ కోసం విశాఖ వాసుల ఎదురుచూపు!

Updated By ManamSun, 08/12/2018 - 18:38

YS Jagan Praja Sankalpa Yatra to enter Vizag on August 14

విశాఖపట్నం‌: ప‌్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు వైసీపీ అధిపతి, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘ప్రజా సంక‌ల్ప యాత్ర’ ఈ నెల 14వ తేదీ విశాఖ‌లోకి అడుగుపెడుతుంద‌ని పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి త‌ల‌శీల ర‌ఘురామ్‌, వైసీపీ నేత గుడివాడ అమ‌ర్‌నాథ్ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన ఈ వివరాలు వెల్లడించారు. జ‌న‌నేత రాక‌కోసం జిల్లా వాసులు ఆశ‌గా ఎదురుచూస్తున్నారని అమర్ చెప్పుకొచ్చారు.నర్సీపట్నం నియోజకవర్గంలోని గన్నవరం మెట్టు నుంచి జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర మొదలు కానుంది. అక్కడి నుంచి శరభవరం ఎల్లవరం, దొండపేట, ములగపూడి, బెన్నవరం, నయ్యపురెడ్డిపాలెం, నర్సీపట్నం మీదుగా.. పాయకరావుపేట నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. ఈ నియోజకవర్గంలో యండపల్లి, సుంకపూరు, కోటవురట్ల, గొట్టివాడ, ములగల్లోవ, దార్లపూడి, ఏటికొప్పాక మీదుగా సాగతుంది. 

అనంతరం యలమంచిలి నియోజకవర్గంలో ప్రవేశించనున్న పాదయాత్ర పులపర్తి, పురుషోత్తపట్నం, రేగుపాలెం, యలమంచిలి, అచ్యుతాపురం, కొండకర్ల జంక్షన్, హరిపాలెం, తిమ్మరాజుపేట, మునగపాక మీదుగా అనకాపల్లి నియోజకవర్గంలోని తుమ్మపాలకు చేరుకుంటుంది. తుమ్మపాల మీదుగా బావులపాడు, మామిడిపాలెం, గంధవరం, వెంకన్నపాలెం మీదుగా చోడవరం నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. గోవాడ, గణపతినగరం, చోడవరం మీదుగా రేవళ్లు, గౌరవరం, కొత్తవూరు, ఎ.భీమవరం, పొడుగుపాలెం, ఎ.కోడూరు, సూరెడ్డిపాలెం, సింగరెడ్డిపాలెం మీదుగా మాడుగుల నియోజకవర్గంలోకి పాదయాత్ర సాగుతుంది.

jagan reddy

ఈ నియోజకవర్గంలో కె.కోటపాడు, జోగన్నపాలెం, రామచంద్రపురం మీదుగా పెందుర్తి నియోజకవర్గంలోని గులిపల్లి, సబ్బవరం మీదుగా ప్రజాసంకల్పయాత్ర సాగతుంది.అక్కడి నుంచి విశాఖ నగర పరిధిలో జరిగే పాదయాత్ర రూట్‌ మ్యాప్‌ త్వరలో ఖరారు కానుంద‌ని వెల్ల‌డించారు. యాత్రలో భాగంగా రాయలసీమ, కోస్తాంధ్రలో పాదయాత్ర పూర్తి చేసుకుని ఉత్తరాంధ్ర ముఖద్వారమైన విశాఖ జిల్లాలో ఈనెల 14న అడుగుపెట్టనుండ‌టంతో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.



234వ రోజు జగన్ యాత్ర సాగనుందిలా

Updated By ManamSat, 08/11/2018 - 09:28

jagan mohan reddyఅమరావతి: ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్పయాత్ర 234వ రోజుకు చేరింది. యాత్రలో భాగంగా శనివారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడిలో మండలంలోని డీజేపురం నుంచి పాదయాత్రను ప్రారంభించారు జగన్. అక్కడి నుంచి తుని మండలంలోని కొత్త వేలంపేట, సీతయ్యపేట, లోవకొత్తూరు, తల్లూరు జంక్షన్‌, జగన్నాథగిరి మీదుగా తుని వరకు జగన్ పాదయాత్ర కొనసాగించనున్నారు. సాయంత్రం తునిలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్న జగన్, రాత్రి అక్కడే బస చేయనున్నారు. యాత్రలో ప్రజలలో మమేకమౌతున్న జగన్, వారి నుంచి సమస్యలను వింటున్నారు.



14నుంచి విశాఖలో ప్రజాసంకల్పయాత్ర

Updated By ManamWed, 08/08/2018 - 18:55
  • ఆగస్టు 14న విశాఖలోకి పాదయాత్ర

  • అనకాపల్లి పార్లమెంటు పరిధిలో ఖరారు

  • నర్సీపట్నంలో ప్రజా సంకల్పయాత్ర షురూ

  • జగన్ దృష్టికి ప్రజా సమస్యలు: అమర్నాథ్

 

ys jagan padayatra

విశాఖపట్నం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయుకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఈ నెల 14న విశాఖ జిల్లాలో ప్రవేశించనుంది. ఈ సందర్భంగా జిల్లాలో వైఎస్ జగన్ పాదయాత్రపై  అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ కన్వీనర్ గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీ ఎన్నో అలవికాని హామీలిచ్చి, ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని, జగన్ యాత్రలో ఆయా హామీలను నమ్మి తాము ఎలా మోసపోయామో జనం చెపుతున్నారని అన్నారు.

వైఎస్ జగన్ పాదయాత్ర సందర్భంగా ప్రతి ప్రాంతంలో, ప్రతి జిల్లాలో స్థానికులు అనేక సమస్యలను ఆయన దృష్టికి తీసుకు వచ్చారని తెలిపారు. ఆయా సమస్యల మీద ఆయన తగిన విధంగా స్పందిస్తున్నారని, హామీలు ఇస్తున్నారని పేర్కొన్నారు. విశాఖ జిల్లాలో కూడా ప్రజలు తమ సమస్యలు పెద్ద ఎత్తున జగన్ దృష్టికి తెస్తారన్నారు.

విశాఖ జిల్లాలోని అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో  వైఎస్ పర్యటన ప్రస్తుతానికి ఖరారైందన్నారు. నర్సీపట్నంలో ప్రారంభించి విశాఖ శివార్ల వరకూ ఆయన పర్యటన సాగుతుందని అమర్నాథ్ తెలిపారు. కాగా గత ఏడాది నవంబర్ 7న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి వైఎస్ జగన్ ప్రజాసంలక్పయాత్రను ప్రారంభించారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర కొనసాగుతోన్న విషయం తెలిసిందే. 



231వ రోజు జగన్ పాదయాత్ర సాగనుందిలా

Updated By ManamTue, 08/07/2018 - 09:30

Jagan తూర్పుగోదావరి: ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్పయాత్ర 231వ రోజుకు చేరింది. పాదయాత్రలో భాగంగా మంగళవారం తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని శంఖవరం శివారు నుంచి తన నడకను ప్రారంభించారు జగన్. అక్కడి నుంచి శంఖవరం, శృంగవరం, బంగారయ్యపేట మీదుగా రౌతులపూడి వరకు పాదయాత్ర కొనసాగించనున్నారు. రాత్రికి అక్కడే బస చేయనున్నారు. పాదయాత్రలో భాగంగా ప్రజలతో మమేకమౌతున్న జగన్, వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. కాగా జగన్ ఇప్పటివరకు 2666.9 కిలోమీటర్లు నడిచారు. 



230వ రోజు ప్రారంభమైన జగన్ పాదయాత్ర

Updated By ManamMon, 08/06/2018 - 10:27

Jagan Mohan Reddyకత్తిపూడి: ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 230వ రోజు ప్రారంభమైంది. తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి శివారు నుంచి సోమవారం పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి నెల్లిపూడి, శ్రీశాంతి ఆశ్రమం క్రాస్ మీదుగా శంఖవరం వరకు ఈ యాత్ర కొనసాగనుంది. యాత్రలో భాగంగా జగన్‌తో మమేకమౌతున్న ప్రజలు, అతడితో సమస్యలు చెప్పుకుంటున్నారు. కాగా ఇప్పటి వరకు జగన్ 2656.1కిలోమీటర్లు నడిచారు.



225వ రోజు జగన్ పాదయాత్ర సాగనుందిలా

Updated By ManamTue, 07/31/2018 - 09:56

Jagan Mohan Reddyపిఠాపురం: ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 225వ రోజుకు చేరింది. మంగళవారం ఉదయం ఆయన పిఠాపురం నియోజకవర్గంలోని విరవ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి విరావాడ, ఎఫ్‌కే పాలెం కుమారపురం మీదుగా పిఠాపురం వరకు జగన్ ఇవాళ పాదయాత్ర కొనసాగించనున్నారు. పిఠాపురంలో సాయంత్రం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్న జగన్.. ప్రజల సమస్యలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.





Related News