Ravindra Jadeja

జడేజా భార్యపై పోలీస్ దాడి, గాయాలు

Updated By ManamTue, 05/22/2018 - 08:54

jadeja టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజాపై ఓ పోలీస్ కానిస్టేబుల్ దాడి చేశాడు. ఈ దాడిలో ఆమెకు కొన్ని గాయాలు అయ్యాయి. ఈ ఘటన సోమవారం సాయంత్రం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరిగింది. 

అయితే జామ్‌నగర్‌లో రీవా సోలంకి ప్రయాణిస్తుండగా.. అదే సమయంలో రాంగ్ రూట్‌లో వస్తున్న కానిస్టేబుల్ సజయ్ అహిర్ బైక్‌ను ఆమె కారు ఢీకొంది. దీంతో ఆగ్రహానికి గురైన కానిస్టేబుల్ ఆమెతో వాగ్వాదానికి దిగి దాడి చేశాడు. ఒకానొక దశలో రివాబాను జుట్టు పట్టుకొని కొట్టడానికి ప్రయత్నించగా.. తాము అడ్డుకున్నామని ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న జామ్ నగర్ ఎస్పీ ప్రదీప్ సేజుల్.. దాడికి దిగిన కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
 'వణక్కమ్ చెన్నై', 'విజిల్ పొడు'

Updated By ManamFri, 01/05/2018 - 09:57

CSKరెండేళ్ల నిషేధం తరువాత ఈ సంవత్సరం ఐపీఎల్‌లో పునరాగమనం చేస్తుంది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. ఈ నేపథ్యంలో దిగ్గజ ఆటగాళ్లైన మహేంద్ర సింగ్ ధోని, సురేశ్ రైనా, రవీంద్ర జడేజాలను రీటెయిన్‌ చేసుకుంది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. ఈ సందర్భంగా సురేశ్ రైనా, రవీంద్ర జడేజా సంతోషాన్ని వ్యక్తం చేశారు. 'వణక్కమ్ చెన్నై', 'విజిల్ పొడు' అంటూ తమ ఆనందాన్ని తెలుపుతూ వీడియో సందేశాన్ని ఇచ్చారు.

అందులో "వణక్కమ్ చెన్నై. చెన్నై సూపర్ కింగ్స్ రీ ఎంట్రీ సంతోషంగా ఉంది. గత రెండేళ్లుగా కోల్పోయిన ఆటను మీ ముందు ఆటడానికి ఉవ్విళ్లూరుతున్నాను. చెపాక్ స్టేడియంలో మిమ్మిల్ని కలవడానికి ఉత్సాహంగా ఉన్నాను" అంటూ సురేశ్ రైనా తెలపగా.. "నేను సీఎస్‌కేలో మళ్లీ భాగమైనందుకు చాలా సంతోషంగా ఉన్నాను. మా ఆటను మీరు ఆస్వాదిస్తారని ఆశిస్తున్నా. మ్యాచ్ గెలిచేందుకు ప్రయత్నిస్తాం. విజిల్ పొడు" అంటూ జడేజా సందేశాన్ని ఇచ్చారు. అయితే ధోని నాయకత్వంలో సీఎస్‌కే రెండు సార్లు ఐపీఎల్‌ చాంపియన్స్‌గా నిలిచిన విషయం తెలిసిందే. 
 లంక ఉఫ్!

Updated By ManamMon, 11/27/2017 - 14:05
  • రెండో టెస్ట్‌లో కోహ్లిసేన అతిపెద్ద ఇన్నింగ్స్ విజయం

  • లంకేయులను తిప్పేసిన భారత స్పిన్నర్లు..

  • మూడు టెస్టుల సిరీస్‌లో 1-0 తో ఆధిక్యంలో భారత్

  • శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 205.. రెండో ఇన్నింగ్స్ 166 ఆలౌట్ 

  • టీమిండియా తొలి ఇన్నింగ్స్ 610/6 డిక్లేర్డ్

‘వరుస విజయాలతో దూసుకెళ్తున్న కోహ్లిసేన అతిపెద్ద టెస్టు విజయాన్ని సొంతం చేసుకుంది. లంక సొంతగడ్డపైనే క్లీన్‌స్వీప్ చేసిన భారత జట్టు స్వదేశంలోనూ అదే జోరును కొనసాగిస్తూ తిరుగులేని జట్టుగా అవతరించింది. మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లి డబుల్ సెంచరీ, రోహిత్, పుజారా, మురళీ విజయ్‌లు సెంచరీలు నమోదు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.’  

Team India, Srilanka, 239 Huge runs Innings, 2nd Test, Nagpur, Virat Kohli, Ravindra Jadeja, Ravichandran Ashwinనాగ్‌పూర్: శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు అతిపెద్ద టెస్టు విజయం సాధించింది. విదర్భ క్రికెట్‌ సంఘం మైదానంలో పర్యాటక జట్టు శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో భారత స్పిన్ దిగ్గజాలు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాల తమ స్పిన్ మాయాజాలంతో లంకను తిప్పేశారు. భారత్ ఇన్నింగ్స్‌ 239 పరుగుల తేడాతో గెలిచింది. తద్వారా రాహుల్‌ ద్రవిడ్‌ సేన 2007లో బంగ్లాదేశ్‌పై సాధించిన ఇన్నింగ్స్‌ 239 పరుగుల రికార్డును కోహ్లీసేన సమం చేసింది. నాలుగో రోజు తొలి సెషన్‌లో ఆధిపత్యం కొనసాగించిన భారత స్పిన్నర్ల దెబ్బకు లంక బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. 49.3 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌట్‌ అయింది. దీంతో మూడు టెస్టుల సిరీస్‌లో 1-0తో కోహ్లిసేన ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. నాగ్‌పూర్ టెస్టులో అశ్విన్ 8 వికెట్లు తీయగా, తొలి ఇన్నింగ్స్‌లో నలుగురు భారత బ్యాట్స్‌మెన్ సెంచరీలు సాధించారు. 

లంక విలవిల.. 
Team India, Srilanka, 239 Huge runs Innings, 2nd Test, Nagpur, Virat Kohli, Ravindra Jadeja, Ravichandran Ashwin21/1 ఓవర్‌నైట్‌ స్కోరుతో సోమవారం ఆట ప్రారంభించిన శ్రీలంక పేలవ ప్రదర్శనతో వెనువెంటనే వికెట్లు టపటపామని రాలిపోయాయి. 41వ ఓవర్లో భారత బౌలర్ ఇషాంత్‌ శర్మ వేసిన బంతిని బౌండరీగా మలిచిన లంక కెప్టెన్ దినేశ్‌ చండీమాల్‌ ( 110 బంతుల్లో 82 ఫోర్లు, 10 సిక్స్)లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఓపెనర్‌ కరుణరత్నే (18), మాథ్యూస్‌ (10)ను స్వల్ప స్కోరుకే జడేజా పెవిలియన్‌కు పంపేశాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన శనక (17), పెరీరా (0), హెరాత్‌ (0)ను కూడా రవిచంద్రన్ అశ్విన్‌ తన స్పిన్ మాయాజాలంతో వరుసగా పెవిలియన్‌కు పంపాడు. డిక్వెలా (4) ఔటవ్వడంతో క్రీజులోకి వచ్చిన శనగ కాస్త దూకుడుగా ఆడాడు. 8 బంతుల్లో రెండు సిక్స్‌లు, ఒక ఫోర్‌ బాది స్కోరు బోర్డును పరిగెత్తించాడు.

34వ ఓవర్లో అశ్విన్‌.. దూకుడు మీదున్న లంక ఆటగాడు శనగ (17)ను వెనక్కి పంపడంతో లంక జోరుకు కళ్లెం పడింది. 41 ఓవర్లు ముగిసే సమయానికి లంక 8 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. గమేజ్, పెరీరా, హెరాత్ పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగారు. దీంతో లంక పీకల్లోతు కష్టాల్లో పడింది. జట్టును ఆదుకునే యత్నం చేసిన లంక కెప్టెన్ చండీమాల్ మినహా మరెవరూ కూడా భారీ స్కోరు చేయలేక చేతులేత్తేయడంతో లంక పతనం అనివార్యమైంది. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ, జడేజా, ఉమేశ్ యాదవ్ తలో రెండు వికెట్లు తీయగా, రవిచంద్రన్ అశ్విన్ 4 వికెట్లు తీసుకున్నాడు. అంతకుముందు భారత్‌ తన తొలి ఇన్నింగ్స్‌ను 610/6 వద్ద డిక్లేర్‌ చేసిన సంగతి తెలిసిందే.

300 వికెట్ల క్లబ్‌లో అశ్విన్
Team India, Srilanka, 239 Huge runs Innings, 2nd Test, Nagpur, Virat Kohli, Ravindra Jadeja, Ravichandran Ashwinభారత ప్రధాన స్పిన్నర్‌ రవి చంద్రన్‌ అశ్విన్‌ అరుదైన రికార్డు సాధించాడు. టెస్టుల్లో 300 వికెట్లను వేగవంతంగా సాధించిన స్పిన్ బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. శ్రీలంకతో రెండో టెస్టులో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో​ లహిరు గామేగ్‌ అవుట్‌ చేసిన అశ్విన్‌ 300 వికెట్ల క్లబ్‌లో చేరాడు. ఈ మ్యాచ్‌కు ముందు 292 వికెట్లతో ఉన్న అశ్విన్‌.. ఎనిమిది వికెట్లు సాధించి మూడొందల వికెట్ల మార్కును చేరాడు. ఫలితంగా వేగవంతంగా 300 టెస్టు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 54 టెస్టు మ్యాచ్‌ల్లో  ఆడిన అశ్విన్‌ ఈ ఫీట్‌ను సాధించాడు. ఈ క్రమంలోనే ఆసీస్‌ దిగ్గజం డెన్నిస్‌ లిల్లీ సాధించిన 56 మ్యాచ్‌ల రికార్డును అశ్విన్‌ బ్రేక్‌ చేశాడు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌ లో 4 వికెట్లు సాధించిన అశ‍్విన్‌.. రెండో ఇన్నింగ్స్ఖ్‌లో కూడా 4 వికెట్లన తన ఖాతాలో వేసుకున్నాడు. 

Related News