nagababu

అరవింద సమేత: మళ్లీ లీక్

Updated By ManamMon, 09/24/2018 - 17:02

Aravinda Samethaఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘అరవింద సమేత వీరరాఘవ’. క్రేజీ కాంబోగా తెరకెక్కిన ఈ సినిమాపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. వాటికి తగ్గట్లుగా దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ చిత్రంపై లీకురాయుళ్లు పగ బట్టారు. చిత్ర యూనిట్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఏదోరకంగా చిత్రంలోని సీన్లు, వీడియోలు లీక్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో మూవీలో హైలెట్ అవ్వనున్న మరో వీడియో బయటకు వచ్చింది.

నాగబాబు, ఎన్టీఆర్ కారులో వెళుతుండగా.. విలన్లు వారిపై దాడి చేసే సన్నివేశానికి సంబంధించిన ఓ వీడియో లీక్ అయ్యింది. చూస్తుంటే ఇది క్లైమాక్స్‌కు సంబంధించినదిగా ఉంది. దీన్ని చూసిన ఎన్టీఆర్ అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నప్పటికీ.. ఇలా లీక్ అవ్వడంపై విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ చిత్రం అక్టోబర్ 11వ తేదిన ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.‘అరవింద’ నుంచి రెండో పాటకు వేళాయరా

Updated By ManamTue, 09/18/2018 - 12:37

Aravinda Samethaఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన మొదటి సింగిల్ ఆకట్టుకోగా.. తాజాగా రెండో సింగిల్‌కు ముహూర్తం ఖరారు చేశారు. పెనివిటి అంటూ సాగే ఈ పాటను బుధవారం సాయంత్రం 4.50గంటలకు విడుదల చేయనున్నారు. చూస్తుంటే చిత్రంలో వచ్చే ఎమోషనల్ పాటగా ఇది ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఇక యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటించగా.. నాగబాబు, ఈషా రెబ్బా తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. హారిక అండ్ హాసిని పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. దసరా కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రేజీ కాంబోగా తెరకెక్కిన ఈ సినిమాపై అటు అభిమానుల్లోనే కాకుండా ఇటు మూవీ ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు ఉన్నాయి.ఎస్.వి.రంగారావుగా...

Updated By ManamWed, 09/05/2018 - 22:28

imageనందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యన్.టి.ఆర్’. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రను నందమూరి బాలకృష్ణ పోషిస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని నందమూరి బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ప్రతి పాత్రా ఎంతో కీలకం కాబట్టి ఆయా పాత్రల కోసం ప్రముఖ తారాగణాన్ని ఎంపిక చేస్తున్నారు. అక్కినేని నాగేశ్వరరావు పాత్రను సుమంత్ పోషిస్తుండగా, ఎస్.వి.రంగారావు పాత్రలో నాగబాబును ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. మొదట ఈ పాత్ర కోసం మోహన్‌బాబు పేరు పరిశీలనలో ఉంది. ఇటీవల విడుదలై సంచలన విజయం సాధించిన ‘మహానటి’ చిత్రంలో ఎస్.వి.రంగారావు పాత్రను మోహన్‌బాబు పోషించిన విషయం తెలిసిందే. కానీ, ఆ పాత్రకు నాగబాబును ఎంపిక చేసినట్టు సమాచారం. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.‘గీత గోవిందం’ రివ్యూ

Updated By ManamWed, 08/15/2018 - 13:21
Geetha Govindam

హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన‌ `పెళ్లిచూపులు`, `అర్జున్ రెడ్డి` సినిమాల త‌ర్వాత రిలీజ్‌కి ముందు ఆ రేంజ్‌లో ప‌బ్లిసిటీ వ‌చ్చిన సినిమా `గీత గోవిందం`. తొలి సినిమా `చ‌లో`తో గోల్డెన్ లెగ్‌గా పేరు తెచ్చుకున్న ర‌ష్మిక మండ‌న్న ఇందులో హీరోయిన్‌. వీరిద్ద‌రు క‌లిసి క‌నిపించిన `ఇంకేం ఇంకేం కావాలే` సాంగ్ సూప‌ర్ హిట్‌. సినిమా రిలీజ్‌కి ముందు పైర‌సీ అయి కొన్ని సీన్లు లీక‌య్యాయి. ఇవ‌న్నీ ఎక్స్ పెక్టేష‌న్స్ ని భారీగా పెంచాయి. సినిమా వాటికి ధీటుగా ఉంటుందా? ఆల‌స్య‌మెందుకు.. రివ్యూ చ‌దివేయండి. 

బ్యాన‌ర్‌:  జిఎ2 పిక్చ‌ర్స్
తారాగ‌ణం: విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మందాన్న, నాగ‌బాబు, సుబ్బ‌రాజు, వెన్నెల కిషోర్‌,  రాహుల్ రామ‌కృష్ణ‌, గిరిబాబు, అన్న‌పూర్ణ‌మ్మ‌, మౌర్యాని, సుభాష్‌, అభ‌య్‌, స్వ‌ప్న‌క‌, స‌త్యం రాజేష్‌, దువ్వాసి మెహ‌న్‌, గుండు సుద‌ర్శ‌న్‌, గౌతంరాజు, అనీష‌, క‌ళ్యాణి న‌ట‌రాజ‌న్‌, సంధ్య జ‌న‌క్ త‌దిత‌రులు...
మ్యూజిక్‌: గోపిసుంద‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ: మ‌ణికంద‌న్‌
ఎడిట‌ర్‌: మార్తాండ్‌.కె.వెంక‌టేష్
ఆర్ట్‌: ర‌మ‌ణ వంక‌
ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌: స‌త్య గ‌మిడి
లిరిక్స్‌: అనంత్ శ్రీరామ్‌, శ్రీమ‌ణి, 
ప్రెజెంట్స్: అల్లు అర‌వింద్‌
ప్రొడ్యూస‌ర్‌: బ‌న్నివాసు
స్టోరీ-స్క్రీన్‌ప్లే-డైలాగ్స్-డైర‌క్ష‌న్‌: ప‌రశురామ్‌
విడుద‌ల తేదీ: 15.08.2018

క‌థ‌
విజ‌య్ గోవింద్ (విజ‌య్ దేవ‌ర‌కొండ) ప్రైవేట్ ఇంజ‌నీరింగ్ కాలేజీలో లెక్చ‌ర‌ర్‌. గీత (ర‌ష్మిక‌) సాఫ్ట్ వేర్ ఎంప్లాయీ. గీత కంపెనీ ఓన‌ర్ కూతురు నీలు కి విజ‌య్ అంటే ఇష్టం. అత‌న్ని పెళ్లి చేసుకోవాల‌ని క‌ల‌లు కంటుంది. త‌న చెల్లెలి నిశ్చితార్థం కోసం ప‌ల్లెటూరికి వెళ్తాడు విజ‌య్‌. బ‌స్సులో అత‌ని ప‌క్క సీట్లో గీత ట్రావెల్ చేస్తుంది. అనుకోకుండా ఆమెతో అత‌నికి లిప్ లాక్ అవుతుంది. త‌న త‌ప్పేం లేద‌ని చాలా మొత్తుకుంటాడు విజ‌య్‌.

అత‌ని మాట విన‌కుండా త‌న అన్న‌య్య‌కు ఫోన్ చేసి విష‌యం చెబుతుంది. అత‌న్ని చంపేయాల‌ని తిరుగుతుంటాడు ఆమె అన్న‌య్య (సుబ్బ‌రాజు). అయినా అనుకోని ప‌రిస్థితుల కార‌ణంగా గీత‌, విజ‌య్ క‌లిసి తిరగాల్సి వ‌స్తుంది. దీని వ‌ల్ల ఏమైంది?  విజ‌య్ చెల్లెలి పెళ్లి సంగ‌తేంటి?  గీత అన్న‌య్య విజ‌య్ మీద ప‌గ పెంచుకున్నాడా? అతనికి ఇత‌నిపై ఎలాంటి అభిప్రాయం ఉంది? వ‌ంటివ‌న్నీ ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు. 

geeta govindam

స‌మీక్ష‌
ప్ర‌తి వ్య‌క్తికీ పెళ్లి ఒక క‌ల‌. చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలి?  చేసుకున్నాక ఎలా చూసుకోవాలి.. వంటివ‌న్నీ అబ్బాయిల జేబుల్లో లిస్ట్ అయి రెడీగా ఉంటుంది. ఈ సినిమాలో విజ‌య్ పాత్ర కూడా అలాంటిదే. చిన్న‌ప్పుడే త‌ల్లిని పోగొట్టుకుని, క‌నుసైగ‌ల్లో అర్థం చేసుకునే భార్య రావాల‌ని కోరుకుంటుంటాడు. తొలి చూపులోనే గీతతో ప్రేమ‌లో ప‌డ‌తాడు. అనుకోని పొర‌పాటు వ‌ల్ల త‌న ప్రేమ‌ను వ్య‌క్తం చేసే సంద‌ర్భం అత‌నికి రాదు.

త‌న మ‌న‌సులోని మాట‌ను తీరా అవ‌త‌లి వ్య‌క్తి చెప్పే సంద‌ర్భ‌మే ఎదురైనా తృణీక‌రిస్తాడు. త‌ర్వాత త‌ప్పు తెలుసుకుని బాధ‌ప‌డ‌తాడు. బావ‌ను కాళ్లావేళ్లా ప‌డి త‌ను అనుకున్న‌ది సాధిస్తాడు. ఇదంతా ఏంటి? అంటే కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుల‌తో వ్య‌క్తులు చేసే యుద్ధ‌మే. క్లిష్ట‌మైన ప‌రిస్థితుల‌ను త‌మ‌కు తాము సృష్టించుకుంటున్న ప‌లువురు యువ‌త‌కు నిద‌ర్శ‌నం విజ‌య్ పాత్ర‌. గీత పాత్ర కూడా నేటి స‌మాజానికి అద్దం ప‌టే పాత్రే. ఈ పాత్ర‌ల చుట్టూ ద‌ర్శ‌కుడు క‌థ అల్లుకున్నారు.

అయితే సీన్లు కాసింత కొత్త‌గా రాసుకుని ఉంటే బావుండేది. భావోద్వేగాల్లో ఇంకాస్త ప‌దును చూపించి ఉంటే స‌రిపోయేది. ముందే హిట్ట‌యిన పాట‌ల ఊపు సినిమాకు ప‌నికొచ్చింది. ఎన్న‌డూ లేనంత‌మంది యువ‌త‌ను థియేట‌ర్ల వైపు తీసుకొచ్చింది. ప్రారంభ‌పు వ‌సూళ్ల‌ను పిచ్చ‌గా రాబ‌ట్టింది. సినిమా యువ‌త‌కు న‌చ్చుతుంది. స‌కుటుంబంగా చూసేలా ఉంది. విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాకు ప్ల‌స్‌.

ర‌ష్మిక కూడా ప్ల‌స్సే. .. కాక‌పోతే క్లైమాక్స్ లో ఏడ‌వ‌డం స‌రిగా రాలేదు. ఆమె ఏడుస్తున్నా.. చిత్రమేంటో న‌వ్వుతున్న‌ట్టే అనిపించింది. అన్న‌పూర్ణ‌మ్మ‌, వెన్నెల కిశోర్ కామెడీ బావుంది. నాగ‌బాబుకు గొంతు అరువిచ్చారు. అయితే అదేదో కృత్తిమంగా అనిపించింది. సుబ్బ‌రాజుకు చాన్నాళ్ల త‌ర్వాత మంచి పాత్ర ప‌డింది. ద‌ర్శ‌కుడు సినిమాను చ‌క్క‌గా తీసినా, ఆయ‌న గ‌త సినిమాల్లో ఉన్న సెంటిమెంట్ స‌న్నివేశాలు, ప‌దునైన డైలాగులు ఇందులో అంత‌గా క‌నిపించ‌లేదు.

ప్ల‌స్ పాయింట్లు
- పాట‌లు
- న‌టీన‌టులు
- కామెడీ
- కెమెరా

మైన‌స్ పాయింట్లు
- నాగ‌బాబు వాయిస్‌
- ర‌ష్మిక న‌ట‌న‌
- పేల‌వంగా సాగే స‌న్నివేశాలు
- క‌థ ఫ్లాట్‌గా ఉండ‌టం

రేటింగ్‌: 3/5
బాట‌మ్ లైన్‌:  యూత్ కోసం `గీత గోవిందం`.మళ్లీ లీకైన అరవింద సమేత ఫొటోలు.. తలలు పట్టుకుంటున్న యూనిట్

Updated By ManamSat, 08/11/2018 - 11:01

NTR ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘అరవింద సమేత’. సెట్స్ మీదకు వెళ్లినప్పటి నుంచి ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. మరోవైపు లీకురాయుళ్లు తమ పనిని మొదలుపెట్టారు. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఫొటోలను లీక్ చేస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఎన్టీఆర్, నాగబాబు ఉన్న ఫొటో ఒకటి లీక్ అవ్వగా.. తాజాగా కూడా వారిద్దరికి సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి.

విడుదలైన ఫొటోలలో సీన్‌కు సంబంధించిన సమయం కూడా ఉండటంతో యూనిట్‌లో వారే ఎవరో వీటిని నెట్‌లో పెట్టి ఉంటారని సమాచారం. షూటింగ్ స్పాట్‌లోకి ఫోన్లు తీసుకురాకుండా దర్శకుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. లీకులు అవుతుండటంతో చిత్రయూనిట్ తలలు పట్టుకుందట. దీంతో షూటింగ్‌ స్పాట్‌లో మరింత కఠినంగా దర్శకుడు వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. కాగా స్వాతంత్ర్యదినోత్సవం కారణంగా ఈ చిత్ర టీజర్‌ విడుదల కానున్నట్లు తెలుస్తోంది.‘అరవింద సమేత’లో ఎన్టీఆర్, నాగబాబు ఫొటో లీక్

Updated By ManamMon, 07/23/2018 - 13:17

ntr ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘అరవింద సమేత’. దసరాకు ఈ చిత్రాన్ని విడుదల చేయనుండగా.. అందుకు తగ్గట్లుగా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా ఈ చిత్రం నుంచి తాజాగా ఓ ఫొటో లీక్ అయ్యింది. అందులో వర్షం పడుతుండగా.. నాగబాబు తీవ్ర గాయాలతో ఉన్నాడు. అతడిని కారులో తీసుకెళ్తూ, ధీనంగా చూస్తూ, గడ్డం పట్టుకొని లేపుతున్నట్లుగా ఉంది. చూస్తుంటే ఈ ఫొటో చిత్రానికి కీలకమైన సన్నివేశమని తెలుస్తోంది. ఇక పిక్‌ను ఎవరు లీక్ చేశారో తెలీదు కానీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా ఫ్యాక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా.. ఈషా రెబ్బా కీలక పాత్రలో కనిపించనుంది. హారిక అండ్ హాసిని పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.‘మెగా’ ఫొటో వెనుక కథ చెప్పిన పవన్

Updated By ManamFri, 07/06/2018 - 10:01

తన అన్నలు చిరంజీవి, నాగబాబు అక్క, చెల్లితో తీసుకున్ ఓ ఫొటోను జనసేన అధినేత పవన్ కల్యాన్ గురువారం సోషల్ మీడియాలో అభిమానులు చేశారు. ఈ సందర్భంగా ఆ ఫొటో వెనుక ఉన్న కథను కూడా చెప్పారు. అప్పుడు మేము నెల్లూరులో ఉన్నాం. నేను ఏడో తరగతి చదువుతున్నా. చాలా కాలం బ్రాంకెటిస్‌తో బాధపడ్డా. దాని నుంచి బయటపడ్డాక ఈ ఫొటో తీసుకున్నాం అంటూ పవన్ తెలిపారు. మరోవైపు ఈ ఫొటోపై మెగాభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మెగా ఫొటో అంటూ వారు ఆ ఫొటోను షేర్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో ఏపీలో పోటీ చేయాలనుకుంటున్న పవన్ కల్యాణ్ తన ప్రచారంలో వేగాన్ని పెంచారు. అధికార పార్టీ లోపాలను ఎత్తిచూపుతూ ఆయన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.ఫ్యాక్షన్ నేపథ్యంతో ఎన్టీఆర్ సినిమా

Updated By ManamWed, 05/02/2018 - 16:35

ntrయంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబ కథా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతోంద‌ని స‌మాచారం. కాగా.. అంతర్లీనంగా ఫ్యాక్షన్ నేపథ్యంతో సాగే ఈ కథలో జగపతిబాబు, నాగ‌బాబు ఫ్యాక్షనిస్టుల పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఒక యాక్షన్ సన్నివేశంతో సినిమా మొదలవుతుందనీ.. కథకి అదే మూలమని అంటున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా తొలి షెడ్యూల్‌ను పూర్తిచేసిన‌ చిత్రబృందం.. తదుపరి షెడ్యూల్‌ను వచ్చే వారం నుంచి హైదరాబాద్‌లో ప్రారంభించ‌నుంది. ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్, పూజా హెగ్డేపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీక‌రించ‌నున్నారు. సెప్టెంబర్ కల్లా సినిమాని పూర్తి చేసి.. అక్టోబర్‌లో దసరా సందర్భంగా విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.హెచ్‌బీవోలో ‘సూర్య’

Updated By ManamTue, 05/01/2018 - 12:59

allu arjun స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం ‘నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా’. మే 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లలోనూ వేగాన్ని పెంచేసింది చిత్ర యూనిట్. అయితే ఈ ప్రమోషన్స్ కేవలం తెలుగులోనే కాదు ఇంగ్లీష్ ఛానెల్స్‌లోనూ జరుగుతున్నాయి. ప్రముఖ ఇంటర్నేషనల్ టెలివిజన్ హెచ్‌బీవో(HBO) ఇండియా కోసం అల్లు అర్జున్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుండగా.. ఆ ఛానెల్‌లోనూ నా పేరు సూర్య ప్రమోషన్స్ జరగనున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా మరింతమందిని కనెక్ట్ అవ్వనున్నాడు బన్నీ.

కాగా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో బన్నీ సరసన అను ఇమ్మాన్యుఎల్ నటిస్తుండగా.. అర్జున్, నదియా, శరత్ కుమార్, రావు రమేశ్ తదితరులు ముఖ్యపాత్రలలో కనిపించనున్నారు. లగడపాటి శిరీషా శ్రీధర్, నాగబాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తుండగా, బాలీవుడ్ ద్వయం విశాల్-శేఖర్ సంగీతం అందించారు.

 కోపం వచ్చినప్పుడు బూతులే వస్తాయి, మంత్రాలు రావు

Updated By ManamSat, 04/28/2018 - 12:02

NSNI అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ తెరకెక్కించిన చిత్రం ‘నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా’. మే 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలైంది. యాంగ్రీ ఆర్మీ ఆఫీసర్‌గా ట్రైలర్‌లో మరింత రెచ్చిపోయాడు అల్లు అర్జున్. ‘‘ఒక మనిషి సమాజంలో బ్రతకాలంటే ఫ్యామిలీ, కెరియర్, ఫ్రెండ్స్, లవ్ ఇవన్ని కనీసం ఉండాలి’’, ‘‘కోపం వచ్చినప్పుడు బూతులే వస్తాయి, మంత్రాలు రావు’’, ‘‘ఇండియా కావాలి, ఇచ్చెయ్’’ అనే డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి. మొత్తానికి ట్రైలర్‌తో సినిమాపై మరింత అంచనాలను పెంచేశాడు అల్లు అర్జున్. 

ఇక ఈ చిత్రంలో బన్నీ సరసన అనూ ఇమ్మాన్యుల్ నటిస్తుండగా.. అర్జున్, శరత్ కుమార్, నదియా, రావు రమేశ్ తదితరులు ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. లగడపాటి శ్రీధర్, నాగబాబు నిర్మించిన ఈ చిత్రానికి విశాల్-శేఖర్ సంగీతం అందించారు. 

 

Related News