deepika padukone

సింధీ సంప్రదాయంలో...

Updated By ManamSat, 09/08/2018 - 02:35

బాలీవుడ్ జంట రణవీర్ సింగ్, దీపికా పదుకొన్ ఈ సంవత్సరం నవంబర్‌లో వివాహ బంధంతో ఒక్కటి కానున్న విషయం తెలిసిందే. వీరి వివాహం ఏ పద్ధతిలో జరగనుందనే విషయం చర్చనీయాంశంగా మారింది. అయితే సింధీ సంప్రదాయ పద్ధతిలోనే ఈ వివాహం జరిపించడానికి రణవీర్ సింగ్ కుటుంబ సభ్యులు ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. వారి సంప్రదాయ దుస్తులు, వంటకాలు, వివాహ పద్ధతి ప్రకారం ఉండాలని భావిస్తున్నారు.

image


స్నేహితులు, బంధువులు పెళ్లి కుమారుడి వస్త్రాలను చంపే సంప్రదాయమైన సాంత్ కార్యక్రమం కూడా పెళ్ళిలో ఉండాలని చెబుతున్నారు. దీపికా, రణ్‌వీర్‌ల వివాహం ఇటలీలోని ఓ సుందర సరస్సు సమీపాన అత్యంత వేడుకగా నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇప్పటివరకు వెలువడలేదు. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌కు బంధువులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యే అవకాశం ఉంది. నేను చాలా మారిపోయా: రణ్‌బీర్

Updated By ManamWed, 08/01/2018 - 17:13
Ranbir Kapoor

రణ్‌బీర్ కపూర్ చాలా మారిపోయాడట. నేను అప్పటిలా లేనని అతడు ఇటీవల చెప్పిన మాటలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇంతకు ఏ విషయంలో అతడు మారిపోయాడని అనుకుంటున్నారా..? బంధాల విషయంలో. ప్రేమలో రణ్‌బీర్ నిజాయితీ ఉండడంటూ అతడితో బ్రేకప్‌ అయిన దీపికా, కత్రినా బహిరంగంగానే తెలిపారు. అయితే ఆ విషయంలో ఇప్పుడు తాను చాలా మారిపోయానని రణ్‌వీర్ తెలిపాడు. ప్రస్తుతం తాను బంధాలను చాలా విలువ ఇస్తానని తెలిపాడు.

ప్రస్తుతం రణ్‌బీర్, అలియాతో ప్రేమలో ఉండగా.. ఆమె గురించి మాట్లాడుతూ.. ‘‘ప్రేమలో పడటం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. కొత్త మనిషి, కొత్త ఆలోచనలు అవన్నీ మనల్ని చాలా ఆనందపరుస్తుంటాయి. గతంలో అపరిపక్వత వల్లన నా గర్ల్‌ఫ్రెండ్స్‌ను మోసం చేశా. కానీ ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయా’’ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో రణ్‌బీర్ మాటలను ఎంత వరకు నమ్మాలో అర్థం కావడం లేదని బాలీవుడ్ జనాలు గుసగుసలాడుకుంటున్నారు.ఇటలీలో పెళ్లి.. ముంబైలో రిసెప్షన్

Updated By ManamSat, 07/28/2018 - 11:52

ranveer, deepika బాలీవుడ్ ప్రేమపక్షులు రణ్‌వీర్, దీపికలు త్వరలో పెళ్లిచేసుకోనున్నారా..? అంటే అవునంటున్నారు వారి సన్నిహితులు. ఈ నవంబర్‌ 10న ఈ ఇద్దరి వివాహానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఉత్తర ఇటలీలోని లంబార్టీ అనే ప్రదేశంలో ప్రకృతి అందాల మధ్య ఈ ఇద్దరి వివాహం జరగనుందని సన్నిహితవర్గాలు తెలిపాయి. డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో ఈ ఇద్దరు వివాహం చేసుకోనున్నారట. దీనికి సంబంధించి అక్కడికి వెళ్లనున్న అతిథులందరి కోసం లాడ్జిలు, విల్లాలు ఇప్పటికే బుక్ చేశారని అంటున్నారు. ఇక ఆ తరువాత ముంబైలో అందరి కోసం రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

కాగా పద్మావతి తరువాత ఏ చిత్రాన్ని ఒప్పుకోని దీపికా.. ప్రస్తుతం పెళ్లి పనులు చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు గల్లీబాయ్‌తో పాటు టెంపర్ రీమేక్‌లో నటిస్తున్న రణ్‌వీర్ ఈ రెండు చిత్రాలను నవంబర్‌లోగా పూర్తి చేయాలని భావిస్తున్నాడట. మరి ఈ వార్తలపై రణ్‌వీర్, దీపికా జంట ఎలా స్పందిస్తుందో చూడాలి.రణ్‌బీర్‌ నాకు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికాడు

Updated By ManamWed, 07/25/2018 - 14:42

Ranbir, deepikaరణ్‌వీర్ సింగ్‌తో ప్రేమాయణం కొనసాగించక మునుపు దీపికా పదుకొనే, రణ్‌బీర్ కపూర్‌లు కొన్ని సంవత్సరాలు డేటింగ్ చేసి, మనస్పర్థల కారణంగా విడిపోయారు. ఆ తరువాత ఒకరి గురించి మరొకరు మాట్లాడేందుకు కూడా వీరు ఇష్టపడలేదు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన దీపికా పదుకునే రణ్‌బీర్ పేరు చెప్పకుండా.. తన పాత రిలేషన్‌ ఎందుకు చెడిందో చెప్పింది. ఈ నేపథ్యంలో రణ్‌బీర్‌పై ఘాటు కామెంట్లు చేసింది దీపికా.

‘‘రిలేషన్‌లో ఉన్నప్పుడు నేను ఎవరినీ మోసం చేయలేదు. కానీ అతడు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడి నా నమ్మకాన్ని వమ్ముచేశాడు. ఆ సమయంలో రెండో చాన్స్ ఇవ్వాలంటూ చాలా ప్రాధేయపడ్డాడు. కానీ మరోసారి ఫూల్ అవ్వకూడదనే ఉద్దేశంతోనే అతడికి దూరమయ్యాను. అతడి నుంచి విడిపోయిన తరువాత చాలా కుమిలిపోయా. ఆ తరువాత ఆ విషాదం నుంచి నెమ్మదిగా బయటపడ్డా’’ అంటూ రణ్‌బీర్ గురించి చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. అయితే దీపికాతో బ్రేకప్ తరువాత రణ్‌బీర్, కత్రినాను ప్రేమించాడు. వీరి రిలేషన్ కూడా మూడు రోజుల ముచ్చటగానే నిలిచింది. విడిపోయిన సమయంలో కత్రినా కూడా రణ్‌బీర్‌పై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం అలియాతో రణ్‌బీర్ ప్రేమలో ఉన్నాడు.రణ్‌వీర్ ఫొటోకు షాక్ తిన్న దీపికా

Updated By ManamSun, 06/24/2018 - 13:48
ranveer

గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న బాలీవుడ్ సెలబ్రిటీలు రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకునేలు ఈ ఏడాది పెళ్లి పీటలెక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రారంభమయ్యాయని, ఈ నేపథ్యంలో ఇద్దరు షాపింగ్ కూడా చేస్తున్నారని బాలీవుడ్‌లో గుసగసలు వినిపించాయి. అయితే వీటిని ఈ జోడి ఖండించకపోవడంతో అవి నిజమని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో రణ్ వీర్ సింగ్ పెట్టిన ఓ ఫొటోకు దీపికా షాక్ తింది. అంతేకాదు ‘నో’ అంటూ కామెంట్ పెట్టేసింది. మరి దీపికా అంతలా షాక్ తిన్న ఫొటో ఏంటంటే రణ్‌వీర్‌ చిన్నప్పటి ఫొటో. ఓ ఢిపరెంట్ హెయిల్‌స్టైల్‌లో ఉన్న రణ్‌వీర్‌ ఈ ఫొటోను 1985లో తీసుకోగా.. దాన్ని తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాన్ని చూసిన ఆయుష్మాన్ ఖురానా, గుల్షన్ గ్రోవర్, అర్జున్ కపూర్, అదితీ రావు హైదారీ ఇలా ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తుండగా.. దీపికా ‘నో’ అంటూ కామెంట్ పెట్టింది. 
 

Ranveer singh

 రణ్‌వీర్, దీపికా వివాహ తేది ఖరారు!

Updated By ManamThu, 06/21/2018 - 14:34

Ranveer, Nani గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న రణ్‌వీర్, దీపికా పదుకునేలు తమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి వివాహానికి ఇరు కుటుంబాల నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో త్వరలో పెళ్లిపీటలెక్కేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. దీంతో ఎప్పటి నుంచో ప్లాన్‌ను వేసుకున్న ఈ జంట తాజాగా పెళ్లికి ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో నవంబర్ 10న వీరి వివాహానికి ఇరు వర్గాలు ఓకే చెప్పినట్లు వారి సన్నిహితులు ద్వారా తెలిసింది.

అంతేకాదు విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ లాగా మీడియాకు దూరంగా ఫారిన్‌లో పెళ్లి చేసుకొని, ఇండియాలో రిసెప్షన్‌ పెట్టుకోవాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో పెళ్లి కోసం ఇటలీని వారి ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన పనులు కూడా ప్రారంభమయ్యాడట. మరి దీనిపై ఈ జోడి ఎలా స్పందిస్తుందో చూడాలి.కేరాఫ్ ఫిమేల్ డైరెక్ట‌ర్స్

Updated By ManamMon, 05/21/2018 - 20:48

c/o female directorsచిత్ర ప‌రిశ్ర‌మ‌.. అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లాగే స్ప‌ష్టంగా పురుషాధిక్యం ఉన్న ప‌రిశ్ర‌మ‌. తార‌ల విష‌యం ప‌క్క‌న‌పెడితే.. టెక్నీషియ‌న్లలో స్త్రీలు చాలా త‌క్కువ మంది క‌నిపిస్తుంటారు. అందుకు త‌గ్గ‌ట్టే.. 'కెప్టెన్ ఆఫ్ ది షిప్‌'గా భావించే డైరెక్ట‌ర్‌లుగా స్త్రీలు క‌నిపించ‌డం అరుదు. అయిన‌ప్ప‌టికీ.. అడ‌పాద‌డ‌పా కొంత‌మంది ఫిమేల్ డైరెక్ట‌ర్స్ సంద‌డి చేస్తూనే ఉన్నారు. వీరిలో కొంతమంది సంచ‌ల‌న విజ‌యం అందుకున్న‌వారు ఉన్నారు. అలాంటి ఫిమేల్ డైరెక్ట‌ర్స్‌తో త‌రుచుగా సినిమాలు చేస్తూ కొంత‌మంది క‌థానాయిక‌లు వార్త‌ల్లో నిలుస్తున్నారు. వారి వైపు కాస్త దృష్టి సారిస్తే..

దీపికా ప‌దుకొనే

ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో అత్య‌థిక పారితోషికం తీసుకుంటున్న క‌థానాయిక దీపికా ప‌దుకొనే. క‌న్న‌డ చిత్రంతో ఈమె కెరీర్ మొద‌లైనా.. ద‌శ, దిశ మారింది మాత్రం బాలీవుడ్ మూవీ 'ఓం శాంతి ఓం'తోనే. నృత్య ద‌ర్శ‌కురాలు ఫ‌రా ఖాన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంతో.. ఆ త‌రువాత దీపికా వెనుతిరిగాల్సిన అవ‌స‌రం రాలేదు. ఈ చిత్రం త‌రువాత కూడా దీపిక 'హ్యాపీ న్యూ ఇయ‌ర్' చిత్రం కోసం ఫ‌రా డైరెక్ష‌న్‌లో నటించారు. అలాగే ర‌జ‌నీకాంత్ కుమార్తె సౌంద‌ర్య రూపొందించిన త‌మిళ చిత్రం 'కోచ‌డైయాన్'లోనూ దీపికా న‌టించారు. 

నిత్యా మీన‌న్

ద‌క్షిణాదిలోని అన్ని భాష‌ల్లోనూ క‌థానాయిక‌గా సంద‌డి చేసిన కేర‌ళ కుట్టి నిత్యా మీన‌న్. క‌న్న‌డ‌లో మిన‌హాయిస్తే.. మిగిలిన అన్ని భాష‌ల్లోనూ మ‌హిళా ద‌ర్శ‌కుల‌తో ప‌నిచేశారు నిత్య‌. తెలుగులో ఆమె తొలి చిత్రం 'అలా మొద‌లైంది'.. నందిని రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కింది. సంచ‌ల‌న విజ‌యం సాధించిన ఈ సినిమా త‌రువాత‌ నిత్య ఇక వెనుతిరిగి చూడాల్సిన అవ‌స‌రం రాలేదు. నందిని మ‌రో  చిత్రం 'జ‌బ‌ర్‌ద‌స్త్'లో అతిథి పాత్ర పోషించారు. అలాగే.. అంజ‌నా ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళ చిత్రం 'వెప్పమ్‌' (సెగ‌) చేశారు. అదేవిధంగా.. శ్రీ‌ ప్రియ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన త‌మిళ చిత్రం 'మాలిని 22 ప‌ల‌యం కోట్టై' (ఘ‌ట‌న‌)లోనూ న‌టించారు. ఇక మ‌ల‌యాళంలో అంజ‌లీ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'బెంగ‌ళూరు డేస్‌'లోనూ నిత్య సంద‌డి చేశారు. ఇలా.. త‌న కెరీర్‌లో చెప్పుకోద‌గ్గ సంఖ్య‌లోనే మ‌హిళా ద‌ర్శ‌కుల‌తో సినిమాలు చేశారు నిత్య.

న‌జ్రీయా న‌జీమ్

త‌మిళ అనువాద చిత్రం 'రాజా రాణి'తో తెలుగు వారికి ప‌రిచ‌య‌మైన క‌థానాయిక న‌జ్రీయా న‌జీమ్. మ‌ల‌యాళం, త‌మిళ చిత్రాల్లో సంద‌డి చేసిన న‌జ్రీయాకి.. మ‌హిళా ద‌ర్శ‌కుల‌తో ప‌నిచేసిన చిత్రాలు న‌టిగా మంచి పేరు తీసుకువ‌చ్చాయి. ముఖ్యంగా న‌జ్రీయా కెరీర్‌లో ప్ర‌త్యేకంగా నిలిచిన 'బెంగ‌ళూరు డేస్‌'కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించింది ఫిమేల్ డైరెక్ట‌ర్ అంజ‌లీ మీన‌న్‌నే. సెన్సేష‌న‌ల్ హిట్ అయిన ఈ చిత్రంలో త‌న‌కు జోడీగా న‌టించిన ఫ‌హ‌ద్ ఫాజిల్‌నే నిజ‌జీవితంలో పెళ్ళి చేసుకున్న న‌జ్రీయా.. పెళ్ళ‌య్యాక సినిమాల‌కు దూర‌మ‌య్యారు. ఇటీవ‌లే మ‌ళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లుపెట్టిన న‌జ్రీయా.. అంజ‌లీ మీన‌న్ చిత్రంతోనే  రీ ఎంట్రీ ఇస్తుండ‌డం విశేషం. ఆమె క‌థానాయిక‌గా న‌టించిన తొలి చిత్రం 'మ్యాడ్ డాడ్'కి కూడా మ‌హిళా ద‌ర్శ‌కురాలు (రేవ‌తి ఎస్‌.శ‌ర్మ‌) డైరెక్ష‌న్ చేయ‌డం విశేషం.

అలియా భ‌ట్‌

అన‌తికాలంలోనే బాలీవుడ్‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ క‌థానాయిక అలియా భ‌ట్‌. తాజాగా 'రాజీ' చిత్రంతో ఈ ముద్దుగుమ్మ సంద‌డి చేశారు. మేఘ‌నా గుల్జార్ రూపొందించిన ఈ సినిమా.. అలియాకి న‌టిగా మ‌రింత గుర్తింపు తీసుకువ‌చ్చింది. ఈ చిత్రానికి కంటే ముందే 'డియ‌ర్ జింద‌గీ' కోసం మ‌రో మ‌హిళా ద‌ర్శ‌కురాలు గౌరీ షిండేతో క‌లిసి ప‌నిచేశారు అలియా. ప్ర‌స్తుతం మ‌రో మ‌హిళా ద‌ర్శ‌కులు జోయా అఖ్త‌ర్ డైరెక్ష‌న్‌లో 'గ‌ల్లీ బాయ్స్' చిత్రం చేస్తున్నారు.  

అమైరా ద‌స్తూర్

త‌మిళ అనువాద చిత్రం 'అనేకుడు'తో ప‌రిచ‌య‌మైన క‌థానాయిక అమైరా ద‌స్తూర్.  ఈ ఏడాది ఆరంభంలో విడుద‌లైన 'మ‌న‌సుకు న‌చ్చింది' చిత్రంతో ఈ ముద్దుగుమ్మ‌ తెలుగు ప్రేక్ష‌కుల‌కు నేరుగా ప‌రిచ‌య‌మ‌య్యారు. ఈ సినిమాతోనే సూప‌ర్ స్టార్ కృష్ణ కుమార్తె మంజుల ఘ‌ట్ట‌మ‌నేని ద‌ర్శ‌కురాలిగా  ప‌రిచ‌య‌మ‌య్యారు. ఈ చిత్రం ఫ‌లితం సంగ‌తి ప‌క్క‌న పెడితే.. ఇదే ఏడాది మ‌హిళా ద‌ర్శ‌కులు రూపొందించిన మ‌రో రెండు సినిమాల‌తో అమైరా సంద‌డి చేయ‌నున్నారు. సంజ‌నా రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రాజ్ త‌రుణ్‌కు జోడీగా అమైరా న‌టించిన 'రాజు గాడు' చిత్రం జూన్ 1న విడుద‌ల కానుండ‌గా.. లీనా యాద‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న 'రాజ్మా చావ‌ల్' ఈ ఏడాదిలోనే తెర‌పైకి రానుంది.                                                   -మ‌ల్లిక్ పైడి

 

 దీపికాతో భ‌న్సాలీ కామెడీ ఫిల్మ్‌

Updated By ManamTue, 05/01/2018 - 16:28

deepikaబాలీవుడ్ సెన్సేష‌న‌ల్ కాంబినేష‌న్‌ల‌లో డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ, హీరోయిన్ దీపికా పదుకోన్ కాంబో ఒక‌టి. ఇప్పటి వ‌ర‌కు వీరిద్దరి కలయికలో ‘గోలీయోంకీ రాస్ లీలా రామ్ లీలా’, ‘బాజీరావ్ మస్తాని’, ‘పద్మావత్’ చిత్రాలు రాగా.. ఈ మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. ఈ నేప‌థ్యంలో.. భన్సాలీ, దీపికా కాంబోలో నాలుగో సినిమా రాబోతోంద‌ని బాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. తన కథలకి తగ్గట్టుగా బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చే దీపికాతో కలిసి పనిచేయడమంటే భన్సాలీ ఎప్పుడూ ఆసక్తి కనబరుస్తార‌ని.. అయితే ఈ సారి గ‌త చిత్రాల‌కు భిన్నంగా ఆమె కోసం ఓ కామెడీ ఫిల్మ్‌కి సంబంధించిన స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నారని తెలుస్తోంది. ఇంతవరకు పిరియాడిక్‌ డ్రామాలతో సందడి చేసిన ఈ ద్వయం.. ఈ సారి కామెడీ ఫిల్మ్‌తో ప్రేక్షకులను అలరించ‌బోతోంద‌న్న‌మాట‌. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డుతుంది. మొత్తానికి.. చాలా కాలం తర్వాత దీపిక ఓ కామెడీ మూవీలో న‌టించే అవ‌కాశం ఉంద‌న్న‌మాట‌.ఆకట్టుకున్న మాజీ ప్రేమికుల ర్యాంప్ వాక్

Updated By ManamSat, 04/21/2018 - 09:26

Ranbir, Deepika బాలీవుడ్ నటీనటుడు రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొనే ఒకప్పుడు ప్రేమికులన్న విషయం తెలిసిందే. అయితే కొన్ని కారణాల వలన ఈ ఇద్దరు లవర్స్‌గా విడిపోయినప్పటికీ.. మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ సోషల్ కాజ్ కోసం ఈ ఇద్దరు కలిసి ర్యాంపు వాక్ చేశారు. ముంబైలో గురువారం జరిగిన మిజ్వాన్ ఫ్యాషన్ షోలో రణ్‌బీర్, దీపికా జోడి ర్యాంప్‌పై అదరగొట్టింది. ప్రముఖ డిజైనర్ మనీశ్ మల్హోత్రా డిజైన్ చేసిన సంప్రదాయ డ్రస్సులను వేసుకున్న ఈ ఇద్దరు అక్కడున్న అందరినీ అలరించారు. కాగా ప్రముఖ నటి షబానా అజ్మీ ‘మిజ్వాన్ వెల్ఫేర్ సొసైటీ’ అనే ఓ ఎన్జీవోను నడుపుతుండగా.. అందుకోసం ప్రతి సంవత్సరం కొందరు నటీనటులు తమ వంతు సహాయం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకునే, షబానా అజ్మీ, హ్యూమా ఖురేషి, మోనీ రాయ్, షయామీ ఖేర్, సోనాలీ బింద్రే, సోనాక్షి సిన్హా, యామీ గౌతమ్, డింపుల్ కపాడియా, నీతు సింగ్, జావేద్ అక్తర్, సూరజ్ పంచోలి తదితరులు పాల్గొన్నారు.

రణ్‌బీర్-దీపిక ర్యాంప్ వాక్.. ఫొటోల కోసం క్లిక్ చేయండి

 శ్రీదేవి పాత్రలో దీపికా?

Updated By ManamTue, 04/03/2018 - 22:59

srideviబాలీవుడ్ నటి దీపికా పదుకొనె.. అందాల తార శ్రీదేవి పాత్రలో నటించనుందట. వివరాల్లోకెళ్తే.. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ బయోపిక్ ‘యన్.టి.ఆర్’ ఇటీవల లాంఛనంగా ప్రారంభ‌మైన సంగతి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ.. ఎన్టీఆర్ పాత్రలో నటిస్తూ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తేజ దర్శకుడు. సాయికొర్రపాటి, విష్ణు ఇందూరి సహనిర్మాతలు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సినిమాలో శ్రీదేవి పాత్రకి సంబంధించిన స‌న్నివేశాలు కూడా ఉన్నాయ‌ట‌. స్వర్గీయ ఎన్టీఆర్, శ్రీదేవి హీరో హీరోయిన్లుగా ఎన్నో విజయవంత‌మైన చిత్రాల్లో నటించి హిట్ పెయిర్ అనిపించుకున్నారు. స్క్రిప్ట్‌లో భాగంగా కనిపించనుండే ఈ అతిథి పాత్రలో.. బాలీవుడ్ నటి దీపికా పదుకొనెను నటింప చేసేందుకు యూనిట్ ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. ఈ సినిమాను దసరాకు విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

Related News