jyothika

‘గజ’ బాధితులకు సూర్య కుటుంబం విరాళం

Updated By ManamMon, 11/19/2018 - 15:00
Siva Kumar

తమిళనాట గజ తుఫాను బీభత్సం సృష్టించింది. ఈ తుఫాను ప్రభావంతో పడిన భారీ వర్షాలతో తమిళనాడులోని చాలా ప్రాంతాలు అతలాకుతలం అవ్వగా.. ఇప్పటివరకు 45మంది మరణించారు. మరోవైపు గజ తుఫాను ప్రాంతాలను పునర్మించేందుకు తమిళనాడు ప్రభుత్వం సహాయచర్యలను చేపట్టింది. ఈ క్రమంలో పలువురు కోలీవుడ్ హీరోలు తమ వంతు సహాయాన్ని ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా సూర్య కుటుంబం రూ.50లక్షలను వరద బాధితుల కోసం విరాళంగా ప్రకటించింది. సూర్య, ఆయన భార్య జ్యోతిక, తండ్రి శివకుమార్, సోదరుడు కార్తీ నలుగురు కలిసి వారి తరఫున ఈ డబ్బును సీఎం సహాయనిధికి ఇవ్వనున్నారు. మరోవైపు డీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా తమ ఒక నెల జీతాన్ని వరద బాధితుల కోసం విరాళంగా ఇచ్చారు.నవాబుపై డయానా ఆశలు..!!

Updated By ManamWed, 09/12/2018 - 17:53

dayana

గత కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న అగ్రదర్శకుడు మణిరత్నం మరోసారి నవాబు రూపంలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అరవింద్ స్వామి, శింబు, విజయ్ సేతుపతి, అరుణ్ విజయ్ లు ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం భారీ తారాగణంతో రూపొందించగా తమిళంలో చెక్క చివంతా వానం అనే పేరుతో విడుదల అవుతున్నది ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ లుగా అదితి రావు హైదరి ,ఐశ్వర్య రాజేష్, డయానా  హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.

ఇటీవలే రిలీజ్ అయిన చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోగా సినిమా  ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలను ఏర్పరిచింది. మద్రాస్ టాకీస్ , లైకా ప్రొడక్షన్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా  సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతుంది..ఎమోషనల్, యాక్షన్ అంశాలను మేలవించి ఈ చిత్రాన్ని మణిరత్నం రూపొందించారు. 

కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా పరిచయమవుతున్న డయానా సినిమా పై మంచి హోప్స్ పెట్టుకుంది.. ఈ సినిమాతో గ్రాండ్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మంచి ఆఫర్స్ దక్కించుకునే ప్రయత్నంలో ఉంది.. ఇప్పటికే లుక్ లో సూపర్ అనిపించుకున్న ఈ ముద్దుగుమ్మ నటన లోనూ పర్వాలేదు అనిపించుకుంటే టాలీవుడ్‌ను ఏలేస్తుంది మరీ.. మొదటి ‘నవాబ్’ వచ్చేస్తున్నాడు

Updated By ManamMon, 08/13/2018 - 14:24

Nawabఅరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, శింబు, ప్రకాశ్ రాజ్, అరుణ్ విజయ్, జ్యోతిక, అదితీరావ్ హైదారీ, ఐశ్వర్య రాజేశ్ వంటి భారీ తారాగణంతో లెజండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న చిత్రం ‘చెక్క చీవంత వానమ్’ (తెలుగులో నవాబ్). ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి వరుస ఫస్ట్‌లుక్‌లు రానున్నాయి. అందులో భాగంగా సోమవారం సాయంత్రం 5గంటలకు ఒక హీరో లుక్‌ను విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని వెల్లడించిన నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ ఎవరో కనుక్కోండి అంటూ క్లూ ఇచ్చింది. దాన్ని చూసిన అందరూ అరవింద్ స్వామి అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి మొదట నవాబ్‌గా అరవింద్ స్వామి ఎలా ఉంటాడో తెలియాలంటే మాత్రం ఇంకొన్ని గంటలు వేచి ఉండాల్సిందే. ఇక ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా.. త్వరలోనే ప్రేక్షకుల మందుకు రానుంది.

 జ్యోతిక ‘జిమ్మికి కమల్‌’

Updated By ManamFri, 08/03/2018 - 11:01

Jyothika మోహన్ లాల్ ‘వెలిపడింతే పుస్తకమ్’ చిత్రంలోని ‘జిమ్మికి కమల్’ పాట ఎంత పాపులారిటీ సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భాషలకు అతీతంగా ఈ పాట ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యింది. కాగా ఇప్పుడు ఈ పాటకు స్టెప్‌లు వేయనుంది జ్యోతిక.

హిందీలో ఘన విజయం సాధించిన ‘తుమ్హారీ సులు’ చిత్రం రీమేక్‌లో జ్యోతిక నటించనున్న విషయం తెలిసిందే. ‘కాట్రిన్ మొళి’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జిమ్మికి కమిల్ పాటకు స్టెప్‌లు వేయనుంది జ్యోతిక. ఆ పాటలో జ్యోతికతో పాటు మంచు లక్ష్మి, కుమరవేల్, సిద్ధు శ్యామ్, ఆర్జే శాండ్రా కనిపించనున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయ్యింది. కాగా ఈ చిత్రం అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.3న జ్యోతిక  ‘ఝాన్సీ’ విడుదల

Updated By ManamSat, 07/28/2018 - 18:16
Jyothika

తమిళంలో విడుదలై భారీ విజయం సాధించిన నాచియార్ చిత్రం తెలుగు లో ఝాన్సీ పేరు తో విడుదలకు సిద్ధంగా ఉంది అని మన్నందరికి తెలుసు. జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా విడుదలకు సిద్ధం గా ఉంది. కోనేరు కల్పన మరియు  డి అభిరాం అజయ్ కుమార్ కలిసి కల్పనా చిత్ర మరియు యశ్వంత్ మూవీస్ బ్యానర్ ద్వారా  సంయుక్తంగా  ఆగష్టు 3న విడుదల కు అని ఏర్పాట్లు చేస్తున్నారు.

సంచలనాల దర్శకుడు బాల తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమా తీశారు. విక్రమ్ నటించిన సేతు, సూర్య నటించిన నందా, సెన్సషనల్ హిట్ అయినా శివపుత్రుడు, విశాల్ తో వాడు వీడు, ఇలా ఎన్నో విజయాలు అందుకున్న బాల గారు జ్యోతిక తో నాచియార్ సినిమా తీశారు. తమిళనాడు లో ఘానా విజయం సాధించింది. జ్యోతిక ఒక్క పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో కనబడుతుంది. తెలుగులో  ఝాన్సీ పేరుతో ఆగష్టు 3న విడుదలకు కానుంది. ఇళయరాజా సంగీతం మరో హైలైట్. జి వి ప్రకాష్ మరో కీలక పాత్రలో కనిపిస్తారు. 

ఈ సందర్భంగా నిర్మాతలు కోనేరు కల్పన మాట్లాడుతూ ‘నాచియార్ చిత్రం తమిళం లో ఘానా విజయం సాధించింది. స‌న్సేష‌న‌ల్ డైరెక్టర్ బాల స్వయ దర్శకత్వం నిర్మించబడిన ఈ చిత్రం తెలుగు హక్కులు మాకు దక్కటం చాల సంతోషం గా ఉంది. బాల గారి అద్భుతమైన దర్శకత్వం ఒక్క ఎత్తు అయితే జ్యోతిక గారి నటన మరో ఎత్తు. వీరి ఇద్దరి కలయికలో వచ్చిన ఈ సినిమా తమిళనాడు అంతటా విజయవంతంగా ప్రదర్శింపబడినది. 

ఇప్పుడు ఈ సినిమా తెలుగు లో ఝాన్సీ అనే పవర్ ఫుల్ టైటిల్ తో ఆగష్టు 3నా విడుదల కు సిద్ధంగా ఉంది. తమిళం లో ఎంతో  విజయం సాధించిన ఈ సినిమా పై తెలుగు లో అంచనాలు భారీగా ఉన్నాయ్. బయర్లు మరియు డిస్ట్రిబ్యూటర్ ల దగ్గర నుంచి మంచి ఆఫర్ వస్తుంది. ఇక్కడ కూడా మంచి విజయం సాధిస్తుంది అనే నమ్మకం నాకుంది" అని తెలిపారు`ఝాన్సీ`గా జ్యోతిక‌

Updated By ManamSat, 07/14/2018 - 12:34

jhansi హీరో సూర్య‌ను పెళ్లాడిన త‌ర్వాత సినిమాల నుండి బ్రేక్ తీసుకున్న జ్యోతిక త‌ర్వాత `36 వ‌య‌దినిలే` చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. త‌ర్వాత మ‌గ‌లిర్ మ‌ట్ర‌మ్‌, నాచియార్ సినిమాల్లో న‌టించింది. ‘నాచియార్’ సినిమాలో జ్యోతిక పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టించింది. ఈ సినిమాలో జి.వి.ప్ర‌కాశ్ కీల‌క‌పాత్ర‌లో న‌టించాడు. బాలా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో జ్యోతిక న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఈ సినిమా తెలుగు హ‌క్కుల‌ను డి.వి.సినీక్రియేష‌న్స్ అధినేత డి.వెంకటేశ్ ద‌క్కించుకున్నారు. త్వ‌ర‌లోనే తెలుగులో `ఝాన్సీ` పేరుతోవిడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు నిర్మాత డి.వెంక‌టేశ్‌. జ్యోతికను కలవాలనుకుంటున్నారా..? ఇదుగో చాన్స్

Updated By ManamThu, 04/19/2018 - 09:29

Jyothikaసినీ నటి జ్యోతికను కలవాలనుకుంటున్నారా..? ఆమెతో ఒక రోజంతా సరదాగా గడపాలనుకుంటున్నారా..? అయితే మీరు చేయాల్సిందల్లా ఒకటే.. అదేంటంటే ఆమె తదుపరి చిత్ర టైటిల్‌ను గెస్ చేయడమే. సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న జ్యోతిక ‘తుమ్హారీ సులు’ తమిళ రీమేక్‌లో నటించనుంది. జూన్ నుంచి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఓ ఆసక్తికర పోటీని పెట్టింది.

ఈ మూవీకి టైటిల్‌ను గెస్ చేసిన పది మంది లక్కీ విన్నర్స్‌కు జ్యోతికను కలిసే అవకాశం ఉంటుందని తెలిపింది. జ్యోతికను మాత్రమే కాదు ఆ మూవీ యూనిట్ మొత్తంతో కలిసి సరదాగా ఒక రోజు గడిపే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఏప్రిల్ 20తో ముగియనున్న ఈ కాంటెస్ట్ కోసం టైటిల్ రెండు అక్షరాలు మాత్రమే ఉంటుందన్న క్లూ కూడా ఇచ్చారు. ఇక ఈ చిత్రానికి రాధామోహన్ దర్శకత్వం వహిస్తుండగా.. ధనుంజయంగ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మంచు లక్ష్మి కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. దంపతులుగా అర‌వింద్ స్వామి, జ్యోతిక‌

Updated By ManamFri, 03/16/2018 - 19:54

arvind‘రోజా’, ‘బొంబాయి’ వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్‌ను అందుకున్న ద్వయం మణిరత్నం, అరవింద్ స్వామి. ప్రస్తుతం మణిరత్నం ఓ కుటుంబకథా చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అరవింద్ స్వామితో పాటు శింబు, విజయ్ సేతుపతి, అరుణ్ విజయ్, జ్యోతిక, ఐశ్వర్య రాజేష్, అదితిరావు హైదరి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ‘నవాబ్’ గా తెలుగులో విడుదల కానున్న ఈ మల్టీస్టారర్ మూవీ.. ‘చెక్క చివంత వాణమ్’ పేరుతో తమిళంలో తెర‌కెక్కుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో అరవింద్ స్వామి, జ్యోతిక దంపతులుగా నటించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో జ్యోతిక సోదరి నగ్మాతో ‘మౌనం’ (1995)అనే తెలుగు సినిమాలో నటించిన అరవింద్ స్వామి.. దాదాపు 23 సంవత్సరాల తర్వాత జ్యోతికతో కలిసి ఈ చిత్రంలో నటిస్తుండడం విశేషం.జ్యోతిక పాత్ర‌లో అనుష్క‌?

Updated By ManamFri, 03/02/2018 - 15:46

anushkaహీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల‌కు చిరునామాలా నిలిచిన తార‌ల‌లో జ్యోతిక‌, అనుష్క‌ను ప్ర‌త్యేకంగా చెప్పుకోవ‌చ్చు. త‌మిళ‌నాట ఇలాంటి చిత్రాల‌తో జ్యోతిక ఆక‌ట్టుకుంటే.. తెలుగు నాట ఈ త‌ర‌హా చిత్రాల‌లో అనుష్క మెప్పించారు. ఇదిలా ఉంటే.. విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు బాలా ద‌ర్శ‌క‌త్వంలో జ్యోతిక ఓ సినిమా చేసిన సంగ‌తి తెలిసిందే. 'నాచియార్' పేరుతో రూపొందిన ఈ త‌మిళ‌ చిత్రంలో జ్యోతిక ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించారు. ఈ చిత్రానికి అక్క‌డ మంచి స్పంద‌న వ‌చ్చింది.

ఈ నేప‌థ్యంలో.. ఇప్పుడు ఈ సినిమా రీమేక్ హ‌క్కుల‌ను క‌ల్ప‌న కోనేరు కొనుగోలు చేశారు. అంతేగాకుండా, చిత్ర ద‌ర్శ‌కుడు బాలా స‌ల‌హా మేర‌కు అనుష్క‌తో ఈ చిత్రం రీమేక్ చేసేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయ‌ని స‌మాచారం. 'భాగ‌మ‌తి' త‌రువాత మ‌రో చిత్రానికి సంత‌కం చేయ‌ని అనుష్క‌.. ఈ రీమేక్ చేస్తారా? లేదా అనేదానిపై త్వ‌ర‌లోనే క్లారిటీ వ‌స్తుంది. 

అన్న‌ట్టు.. త‌మిళ చిత్రం 'శ‌కుని'లో అనుష్క పోలీస్ అధికారి పాత్ర‌లో కాసేపు త‌ళుక్కున మెరిసిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌రువాత మ‌ళ్ళీ ఆ త‌ర‌హా పాత్ర‌లో ఆమె క‌నిపించ‌నేలేదు. ఈ రీమేక్ కార్య‌రూపం దాల్చితే.. పూర్తి స్థాయి  పోలీస్ పాత్ర‌లో అనుష్క‌ని తెర‌పై చూసే అవ‌కాశం ఆమె అభిమానుల‌కు ద‌క్కిన‌ట్టే.బాలీవుడ్ రీమేక్‌లో జ్యోతిక‌

Updated By ManamSun, 02/18/2018 - 21:16

jyothikaత‌మిళ క‌థానాయ‌కుడు సూర్యని పెళ్ళాడిన నటి జ్యోతిక.. కొంత కాలం పాటు న‌ట‌న‌కు గ్యాప్ తీసుకున్నారు. ఇటీవ‌లే సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లుపెట్టిన ఈ అభినేత్రి.. ‘36 వయదినిలే’, ‘మగళిర్ మట్టుమ్’, ‘నాచియార్’ వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా జ్యోతిక ఓ రీమేక్ సినిమాలో నటించేందుకు అంగీక‌రించార‌ని కోలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.  విద్యాబాలన్ టైటిల్ పాత్రలో నటించిన ‘తుమ్హారీ సులు’ సినిమా బాలీవుడ్‌లో మంచి విజయాన్ని దక్కించుకున్న సంగతి విదితమే. ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేయనున్నారు. గతంలో జ్యోతికతో ‘మొళి’ అనే సినిమాను తెరకెక్కించిన దర్శకుడు రాధామోహన్.. ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నారట. మరి ఈ సినిమాను కూడా సూర్య తన స్వంత బ్యానర్ 2 డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తాడా ? లేదా? అని తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. 

Related News