jyothika

జ్యోతికపై పోలీసులకు ఫిర్యాదు

Updated By ManamSat, 02/17/2018 - 14:27
jyothika

సినీ నటి జ్యోతికపై హిందూ మక్కళ్‌ కట్చి నేతలు చెన్నై పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో  ఫిర్యాదు చేశారు. బాలా దర్శకత్వంలో జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘నాచియార్’ శుక్రవారం విడుదలయ్యింది‌. ఈ చిత్రంలోని కొన్ని సంభాషణలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ గతంలోనే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో కొన్ని సంభాషణలను ఇప్పటికే చిత్ర వర్గాలు తొలగించాయి. 

అయినా హిందూ మక్కల్ కట్చి శాంతించడం లేదు. ఈ చిత్రంలో సంభాషణలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ హిందూ మక్కళ్‌ కట్చి నేతలు చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిందూ ఆలయాలకు వ్యతిరేకంగా జ్యోతిక చెప్పే డైలాగ్‌ను తొలగించాలని, దీనివల్ల మతపరమైన సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని అభ్యంతరం చెప్పారు. ఇందుకు బాధ్యులైన దర్శకుడు బాలా, నటి జ్యోతికలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. జూలైలో మ‌ణిర‌త్నం 'న‌వాబ్‌'

Updated By ManamMon, 02/12/2018 - 21:21

maniద‌ర్శ‌క‌దిగ్గ‌జం మ‌ణిర‌త్నం.. ప్ర‌స్తుతం ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. అర‌వింద్ స్వామి, శింబు, విజ‌య్ సేతుప‌తి, అరుణ్ విజ‌య్‌, జ్యోతిక‌, అదితి రావ్ హైద‌రి, ఐశ్వ‌ర్యా రాజేష్‌, ప్ర‌కాష్ రాజ్ త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రం తెలుగులో 'న‌వాబ్' పేరుతో.. త‌మిళంలో 'చెక్క చివంద వాన‌మ్' పేరుతో రూపొందుతోంది. కాగా, ఈ రోజు (సోమ‌వారం) నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్‌ను ప్రారంభించుకున్న ఈ సినిమాని కేవ‌లం 5 నెల‌ల్లో పూర్తిచేయాల‌ని మ‌ణిర‌త్నం ప్లాన్ చేసుకున్నార‌ట‌. అన్నీ కుదిరితే జూలైలో ఈ సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఈ చిత్రానికి మ‌ణిర‌త్నం ఆస్థాన సంగీత ద‌ర్శ‌కుడు ఎ.ఆర్‌.రెహ‌మ‌న్ సంగీత‌మందిస్తున్నారు.జ్యోతిక, బాలాపై కేసు

Updated By ManamFri, 11/24/2017 - 20:24

jyothika, balaబాలా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న త‌మిళ‌ చిత్రం ‘నాచియార్’. ఇందులో న‌టి జ్యోతిక పవర్ ఫుల్ లేడీ పోలీస్ ఆఫీసర్ గా లీడ్ రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఈ మధ్యనే రిలీజైన టీజర్ లో జ్యోతిక చెప్పే ఒక బూతు డైలాగ్ కాంట్రవర్సీకి దారి తీసింది. జ్యోతికతో అటువంటి డైలాగ్ చెప్పించడమేమిటని కొంతమంది నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే ఆ సీన్ డిమాండ్ చేయబట్టే.. బాలా అలా చెప్పించి ఉంటాడని కొంత మంది వాదిస్తున్నారు. ఇదిలా ఉంటే..తాజాగా ఈ డైలాగ్‌ పై మెట్టుపాలయం పోలీస్ స్టేషన్ లో డైరెక్టర్ బాలా, జ్యోతికల పై కేసు నమోదు చేయడం జరిగింది. మరి ఈ వివాదం, కేసు పై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.ఇళ‌య‌రాజా సంగీతంలో జి.వి.ప్ర‌కాష్ పాట‌

Updated By ManamSat, 11/18/2017 - 19:44

g.v, ilayaraja‘శివపుత్రుడు’, ‘వాడు వీడు’ వంటి సినిమాలతో డిఫరెంట్ చిత్రాల‌ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు బాలా. తను చెప్పాలనుకున్నది బోల్డ్ గా చెప్పడంలో ఈ ద‌ర్శ‌కుడు దిట్ట. ఈ డైరెక్టర్ నుంచి ఓ సినిమా వస్తుందంటే తమిళంలోనే కాదు తెలుగులో కూడా ఆస‌క్తిగా ఎదురుచూస్తారు. ఇప్పుడు తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ ‘నాచియార్’ని తమిళంలో నిర్మిస్తున్నారు బాలా. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో జ్యోతిక పోలీస్ ఆఫీసర్ గా లీడ్ రోల్ పోషిస్తోంది. అలాగే సంగీత ద‌ర్శ‌కుడు జి.వి.ప్రకాష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి మ్యూజిక్‌ మేస్ట్రో ఇళయరాజా సంగీత‌మందిస్తున్నారు. ఇటీవ‌ల ఈ సినిమా టీజర్ ని సూర్య విడుద‌ల చేశారు. అయితే ఈ టీజర్ లో జ్యోతిక చెప్పే ఒక బూతు డైలాగ్ కాంట్రవర్సీకి దారి తీసింది. జ్యోతికతో అటువంటి డైలాగ్ చెప్పించడమేమిటని కొంతమంది నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే ఆ సీన్ డిమాండ్ చేయబట్టి బాలా అలా చెప్పించి ఉంటాడని కొంత మంది వాదిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. సూపర్ సింగర్ ప్రియాంకతో కలిసి జి.వి.ప్రకాష్ ఈ సినిమాలో “ఉన్నయి విడయారు మిల్ల” అనే పాటను కూడా పాడటం జరిగింది. రీసెంట్ గా విజయ్ నటించిన ‘మెర్సల్’, గతంలో అర్జున్ నటించిన ‘జెంటిల్ మేన్’ సినిమాల్లో కూడా ఎ.ఆర్. రెహ్మాన్ మ్యూజిక్ డైరెక్షన్లో ఈ యువ గాయకుడు గొంతును సవరించాడు. మరి ఇన్ని స్పెషల్స్ ఉన్న ఈ సినిమాని తెలుగులో డబ్ చేస్తారో? లేదో? చూడాలి.కుటుంబ క‌థ‌తో మ‌ణిర‌త్నం సినిమా

Updated By ManamFri, 11/17/2017 - 21:11

mani ratnam filmమణిరత్నం.. సినీ ప్రేమికులకి పరిచయం అక్కర్లేని పేరు. తమిళ సినిమా రేంజ్ ని నేషనల్ వైడ్, ఇంటర్నేషనల్ వైడ్ తీసుకుని వెళ్ళిన ఘ‌న‌త ఈ సూప‌ర్ డైరెక్ట‌ర్‌ది. 2016 వరకు 24 సినిమాలను డైరెక్ట్ చేసిన ఈ స్టార్ డైరెక్టర్, 15 సినిమాలకు గాను నిర్మాతగా కూడా వ్యవహరించారు. అయితే ప్రస్తుతం ఈ డైరెక్టర్ సినిమాల విజయాల విషయంలో కొంచెం వెనకపడ్డారు. ఇటీవ‌లే 'చెలియా'తో ప‌ల‌క‌రించిన మ‌ణిర‌త్నం.. త్వ‌ర‌లో ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీని చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. అయితే.. ఈ సినిమా కోసం ఒక ఫ్యామిలీ కథను సిద్దం చేసుకున్నారని వినికిడి.

కథానుసారం ప్రకాష్ రాజ్, జయసుధ తల్లిదండ్రులుగా లీడ్ రోల్స్ పోషిస్తున్నారని.. వీరికి పిల్లలుగా అరవింద్ స్వామి, శింబు, ఫాహద్ ఫాజిల్ నటించనున్నార‌ని తెలిసింది. విజయ్ సేతుపతి ఇన్స్ పెక్ట‌ర్‌ రోల్ లో మెరవనుండగా.. జ్యోతిక, ఐశ్వర్య రాజేష్ కీలక పాత్రలను పోషించనున్నారు. మద్రాస్ టాకీస్ బ్యానర్ లో నిర్మించబోయే ఈ మూవీకి ఏ.ఆర్‌. రెహ్మాన్ సంగీతం సమకూర్చనున్నారు. సంతోష్ శివ‌న్ ఛాయాగ్ర‌హ‌ణం అందించ‌నున్న ఈ సినిమాకి శ్రీ‌క‌ర్ ప్ర‌సాద్ ఎడిటింగ్ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.18 ఏళ్ల త‌రువాత‌..

Updated By ManamTue, 11/14/2017 - 15:06

jayasudhaఎలాంటి పాత్ర‌లోనైనా ఒదిగిపోయే న‌టి జ‌య‌సుధ‌. అందుకే ఆమె స‌హ‌జ న‌టి అనిపించుకున్నారు. చాలా కాలంగా క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా కొన‌సాగుతున్న ఈ ఒక‌ప్ప‌టి క‌థానాయిక‌.. త‌న భ‌ర్త నితిన్ క‌పూర్‌ మ‌ర‌ణించిన త‌రువాత కొత్త‌గా ఏ సినిమాల‌కు సంత‌కం చేయ‌లేదు. అయితే తాజాగా వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం.. మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న కొత్త‌ చిత్రంలో ఓ కీల‌క పాత్ర చేయ‌డానికి జ‌య‌సుధ అంగీక‌రించార‌ని తెలిసింది. మ‌ల్టీస్టార‌ర్ మూవీగా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో జ్యోతిక‌, అర‌వింద్ స్వామి, విజ‌య్ సేతుప‌తి, శింబు త‌దిత‌రులు న‌టించ‌నున్నారు. జ‌న‌వ‌రి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. 2000లో విడుద‌లైన త‌మిళ అనువాద చిత్రం 'స‌ఖి' త‌రువాత మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో జ‌య‌సుధ న‌టిస్తున్న సినిమా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం.రేపు రిలీజ్ కానున్న‌ 'నాచియార్' టీజ‌ర్‌

Updated By ManamTue, 11/14/2017 - 14:08

nachiyaarద‌ర్శ‌కుడిగా బాల రూపొందించిన సినిమాల సంఖ్య త‌క్కువే. అయినా.. ఆయ‌న రూపొందించిన ప్ర‌తి చిత్రం కూడా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంది. ప్ర‌స్తుతం ఆయ‌న రూపొందిస్తున్న త‌మిళ చిత్రం 'నాచియార్‌'. జ్యోతిక‌, జి.వి.ప్ర‌కాష్ ప్ర‌ధాన పాత్రల్లో న‌టిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ మేస్ట్రో ఇళ‌య‌రాజా సంగీత‌మందిస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఈ చిత్రం ఫ‌స్ట్‌లుక్‌కి మంచి స్పంద‌న వ‌చ్చింది. కాగా, ఈ సినిమా టీజ‌ర్‌ని రేపు (బుధ‌వారం) విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ప్రముఖ క‌థానాయ‌కుడు, జ్యోతిక భ‌ర్త‌ సూర్య రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఈ టీజ‌ర్ని రిలీజ్ చేయ‌నున్నారు. త‌మిళ సినీ వ‌ర్గాలు ఈ టీజ‌ర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. 'నాచియార్' త‌రువాత విక్ర‌మ్ త‌న‌యుడు ధ్రువ్‌తో 'అర్జున్ రెడ్డి' రీమేక్ చేయ‌నున్నారు బాల. ఈ చిత్రానికి 'వ‌ర్మ' అనే టైటిల్ ఫిక్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. బాల రూపొందిస్తున్న తొలి రీమేక్ చిత్రమిదే కావ‌డం విశేషం.లుక్ మార్చిన శింబు

Updated By ManamSun, 09/24/2017 - 12:55

'మ‌న్మ‌థ‌', 'వ‌ల్ల‌భ' చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన త‌మిళ క‌థానాయ‌కుడు శింబు. ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు టి.రాజేంద‌ర్ త‌న‌యుడు అయిన శింబు.. ఇటీవ‌లే 'స‌ర‌సుడు'గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఇదిలా ఉంటే.. లెజండ‌రీ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం రూపొందించ‌నున్న మ‌ల్టీస్టార‌ర్ మూవీలో ఓ ప్ర‌ధాన పాత్ర‌కి శింబు ఎంపికైన సంగ‌తి తెలిసిందే. ఈ పాత్ర కోసం బాగా మేకోవ‌ర్ అయ్యాడీ యువ క‌థానాయ‌కుడు.

త‌న గ‌త చిత్రం 'అన్బ‌న‌వ‌న్ అస‌ర‌ధ‌వ‌న్ అడంగ‌ద‌వ‌న్' కోసం కాస్త బొద్దుగా క‌నిపించిన శింబు.. తాజా చిత్రం కోసం స‌న్న‌గా, స్టైలీష్‌గా త‌యార‌య్యాడు. ఇక్క‌డ చూస్తున్న స్టిల్లో అత‌ని కొత్త లుక్ చూడొచ్చు. జ‌న‌వ‌రి నుంచి సెట్స్ పైకి వెళ్ల‌నున్న మ‌ణిర‌త్నం చిత్రంలో అర‌వింద్ స్వామి, జ్యోతిక‌, ఫాహ‌ద్ ఫాజిల్‌, విజ‌య్ సేతుప‌తి, ఐశ్వ‌ర్యా రాజేష్ ముఖ్య పాత్ర‌లు పోషించ‌నున్నారు. ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీత‌మందించ‌నున్న ఈ చిత్రానికి సంతోష్ శివ‌న్ ఛాయాగ్ర‌హ‌ణం అందించ‌నున్నారు.ఈ వారం మ‌హిళ‌ల‌కు ప్ర‌త్యేకం

Updated By ManamWed, 09/13/2017 - 11:06

ఒకే వారంలో మూడు భాష‌ల్లో మ‌హిళా ప్ర‌ధాన చిత్రాలు విడుద‌ల‌వడం అరుదైన విష‌యంగా చెప్పుకోవాలి. సెప్టెంబ‌ర్ 15న అలాంటి వాతావ‌ర‌ణ‌మే ఉంది తెలుగు, త‌మిళ్‌, హిందీ భాష‌ల్లో. ఆ రోజు మూడు హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. ఆ చిత్రాల వివ‌రాల్లోకి వెళితే..

కంగ‌నా ర‌నౌత్ టైటిల్ రోల్‌లో న‌టించిన చిత్రం 'సిమ్ర‌న్‌'. హ‌న్స‌ల్ మెహ‌తా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిందీ సినిమా. త‌న తొలి చిత్రం 'గ్యాంగ్‌స్ట‌ర్' లో కంగనా పోషించిన పాత్ర పేరు సిమ్ర‌న్‌. మ‌ళ్లీ అదే పేరుతో ఇప్పుడు ఓ సినిమా చేయ‌డం విశేషంగా చెప్పుకోవాలి. ఎన్నారై  సందీప్ కౌర్ జీవితంలో జ‌రిగిన కొన్ని ఇన్సిడెంట్స్‌ని బేస్ చేసుకుని ఈ చిత్రం రూపొందింద‌ని బాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.  'క్వీన్' చిత్రంలో త‌న అద్భుత న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న కంగనా.. 'ఫ్యాష‌న్‌', 'ర‌జ్జో', 'రివాల్వ‌ర్ రాణి' వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ మెప్పించింది. 'సిమ్ర‌న్' చిత్రం కంగనాకి మ‌రో 'క్వీన్' అవుతుందో లేదో తెలియాలంటే ఈ శుక్ర‌వారం వ‌రకు ఆగాల్సిందే.

 magalir mattumఇక ఇదే శుక్ర‌వారం రాబోతున్న మ‌రో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం 'మ‌గ‌ళిర్ మ‌ట్టుమ్' (ఆడ‌వాళ్ల‌కు మాత్ర‌మే). జ్యోతిక‌, భానుప్రియ‌, ఊర్వ‌శి, శ‌ర‌ణ్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారీ సినిమాలో.  ముఖ్యంగా ఇది జ్యోతిక సినిమా. 'చంద్ర‌ముఖి' చిత్రంలో త‌న అభిన‌యంతో తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌ను  మెప్పించిన జ్యోతిక‌.. క‌థానాయ‌కుడు సూర్య‌ని పెళ్లాడాక సినిమాల‌కు దూర‌మైన సంగ‌తి తెలిసిందే. రెండేళ్ల క్రితం త‌మిళ చిత్రం '36 వ‌య‌దినిలే'తో రీ ఎంట్రీ ఇచ్చిన జ్యోతిక‌కి ఆ సినిమా పేరు తెచ్చినా.. ఆశించిన విజ‌యాన్ని ఇవ్వ‌లేదు. దాంతో కొత్త చిత్రం 'మ‌గ‌ళిర్ మ‌ట్టుమ్'పై  భారీ ఆశ‌లే పెట్టుకుందీ అభినేత్రి.  ఇందులో డాక్యుమెంట‌రీ ఫిల్మ్ మేక‌ర్‌గా జ్యోతిక క‌నిపించ‌నుంది. అలాగే మోట‌ర్‌బైక్ న‌డిపే స‌న్నివేశాల్లోనూ క‌నిపించ‌నుంది.  38 ఏళ్ల త‌రువాత త‌న ఫ్రెండ్స్‌ని క‌లిసిన అత్త‌తో పాటు రోడ్ ట్రిప్‌కి వెళ్తుంది జ్యోతిక‌. ఆ ప్ర‌యాణంలో ఎదుర‌య్యే సంఘ‌ట‌న‌లేమిటి? అన్న‌దే ఈ చిత్ర క‌థాంశం. బ్ర‌హ్మ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొందింది. 

srivalliఇదే శుక్ర‌వారం రానున్న మ‌రో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం 'శ్రీ‌వ‌ల్లీ'.  అశోక్ మ‌ల్హోత్రా అనే సైంటిస్ట్, మ‌నిషి భావ‌త‌రంగాల‌ను కొల‌వ‌గ‌లిగే మిష‌న్‌ని త‌యారు చేస్తాడు. శ్రీ‌వ‌ల్లీ అనే అమ్మాయిపై దాన్ని ప్ర‌యోగిస్తాడు. ఈ ప్ర‌యోగం కార‌ణంగా ఆమె జీవితం ఎలాంటి మ‌లుపు తిరిగింది?  రెండు జ‌న్మ‌ల మ‌ధ్య ఆమె ఎలాంటి సంఘ‌ర్ష‌ణ‌కు లోనైంది అనేది చిత్ర క‌థాంశం. నేహా  హింగే టైటిల్ పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రం ప్ర‌ముఖ ర‌చ‌యిత‌ విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందింది. ఈ సినిమా కూడా ఈ శుక్ర‌వార‌మే వెండితెర‌పైకి రానుంది.  

ఒకే రోజున మూడు విభిన్న భాష‌ల్లో వ‌స్తున్న ఈ విభిన్న మ‌హిళా ప్ర‌ధాన చిత్రాలు ఎలాంటి ఫ‌లితం సాధిస్తాయో అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో జ్యోతిక‌

Updated By ManamWed, 09/06/2017 - 11:26

'చంద్ర‌ముఖి' చిత్రంలో జ్యోతిక న‌ట‌న‌ని అంత సుల‌భంగా మ‌రిచిపోలేం. క‌థానాయ‌కుడు సూర్యని పెళ్లాడిన త‌రువాత‌ జ్యోతిక సినిమాల‌ని త‌గ్గించుకుంది. పిల్ల‌లు దియా, దేవ్ కాస్త పెద్ద వాళ్లు కావ‌డంతో మ‌ళ్లీ సినిమాల‌పై దృష్టి పెట్టింది. రెండేళ్ల క్రితం  '36 వ‌య‌దినిలే' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం చేసిన జ్యోతిక‌.. ప్ర‌స్తుతం 'మ‌గ‌ళిర్ మ‌ట్టుమ్' (ఆడ‌వాళ్లు మాత్ర‌మే), 'నాచియార్' అనే త‌మిళ‌ సినిమాల‌తో బిజీగా ఉంది. వీటిలో 'మ‌గ‌ళిర్ మ‌ట్టుమ్' ఈ నెల 15న విడుద‌ల కానుండ‌గా.. బాల ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్న 'నాచియార్' చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. 

ఇదిలా ఉండ‌గా.. జ్యోతిక మ‌రో ప్ర‌తిష్టాత్మ‌క చిత్రంలో న‌టించే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం రూపొందించ‌నున్న కొత్త‌ చిత్రంలో జ్యోతిక ఓ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నుంద‌ని స‌మాచారం. ఇంత‌కుముందు మ‌ణిర‌త్నం నిర్మించిన 'డుమ్ డుమ్ డుమ్' సినిమాలో జ్యోతిక న‌టించింది. అత‌ని ద‌ర్శ‌క‌త్వంలో జ్యోతిక న‌టించ‌డం ఇదే తొలిసారి. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డ‌వుతాయి.

Related News