radha

30 ఏళ్ళ ‘యముడికి మొగుడు’ 

Updated By ManamSun, 04/29/2018 - 15:07

ymమెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ప్ర‌త్యేకంగా నిలిచిన చిత్రాల‌లో ‘యముడికి మొగుడు’ ఒక‌టి. త‌న‌ కెరీర్‌లో తొలిసారిగా చేసిన‌ సోషియో ఫాంటసీ ఫిల్మ్ ఇది. ఇందులో కాళిగా, బాలుగా రెండు భిన్నమైన పాత్రల్లో చిరు నటన మెగాభిమానుల‌నే కాకుండా స‌గ‌టు ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. ఒక విధంగా చెప్పాలంటే.. ఎన్టీఆర్ నటించిన ‘రాముడు భీముడు’, ‘యమగోల’ సినిమాలను మిక్స్ చేసి ఈ కథను రూపొందించినట్టుగా ఉంటుంది. అయిన‌ప్ప‌టికీ.. సినిమా చూస్తున్నంత సేపు ఆ భావ‌న క‌ల‌గకుండా త‌న న‌ట‌న‌తో మైమ‌ర‌పించారు చిరు. ఇక యమలోకంలో చిరు చేసిన సందడికి  ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. డైనమిక్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నారాయణరావు, సుధాకర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి.. రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు. విజ‌య శాంతి, రాధ క‌థానాయిక‌లుగా న‌టించిన ఈ సినిమాలో రావుగోపాల రావు, స‌త్య‌నారాయ‌ణ‌, కోట శ్రీ‌నివాస‌రావు, అల్లు రామ‌లింగ‌య్య, గొల్ల‌పూడి, సుధాక‌ర్, హ‌రి ప్ర‌సాద్‌, ప్ర‌సాద్ బాబు, అన్న‌పూర్ణ‌, వై.విజ‌య త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌లు పోషించారు.  

ఈ చిత్రం కోసం రాజ్ - కోటి అందించిన సంగీతం సినిమాని మరో స్థాయికి తీసుకువెళ్ళింది. 'అందం హిందోళం', 'వాన‌జ‌ల్లు గిల్లుతుంటే', 'బ‌హుశా నిన్ను బంద‌రులో చూసి ఉంటా', 'క‌న్నె పిల్ల‌తోటి', 'ఎక్కు బండెక్కు మావ‌', 'నో నో నాట్య‌మిదా'.. ఇలా ప్ర‌తీ పాట అప్ప‌ట్లో యువ‌త‌రాన్ని ఉర్రూత‌లూగించింది. ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచిన ఈ సినిమాని.. తమిళంలో ‘అతిశయ పైరవి’ (1990) పేరుతో రజనీ కాంత్ హీరోగా రీమేక్ చేసారు. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కిన ‘యముడికి మొగుడు’ ఏప్రిల్ 29, 1988న విడుదలై.. నేటితో 30 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.  రూ. 222 కోట్ల ఎలక్టోరల్ బాండ్ల విక్రయం

Updated By ManamFri, 03/16/2018 - 22:52

radhaన్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల ఆరంభ ఇష్యూలో ఇండియా రూ. 222 కోట్ల విలువ చేసే బాండ్లను విక్రయించింది. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వదలచుకున్న దాతలు తమ వివరాలు వెల్లడించకుండా షెడ్యూల్డు బ్యాంకుల నుంచి ఆ బాండ్లను కొనుగోలు చేయవచ్చని శుక్రవారంనాడు పార్లమెంట్‌కు తెలియజేశారు. ఆరంభ ఇష్యూ  మార్చి 1న మొదలై చందాలకు 10 రోజులు అందుబాటులో ఉంది. ‘‘పథకం మొదటి ఇష్యూ కింద  ఎలక్టోరల్ బాండ్ల అమ్మకం ద్వారా 2018 మార్చి 9 నాటికి వసూలైన మొత్తం రూ. 222 కోట్లు ఉంది’’ అని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్  లోక్‌సభకు ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. 

రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చే విధానాన్ని ప్రక్షాళన చేసే చర్యగా 2017-18 సంవత్సరపు కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ‘ఎలక్టోరల్ బాండ్ల’ను ప్రవేశపెట్టారు. రుణ సాధనాల మాదిరి కాకుండా ఈ బాండ్లు ప్రామిసరీ నోట్లను పోలినవిగా ఉంటాయి. బ్యాంకులను మధ్యవర్తులుగా చేసుకుని దాతలు రాజకీయ పార్టీలకు నిధులు ఇచ్చేందుకు ఇవి వీలు కల్పిస్తాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన కొన్ని శాఖల్లో ఈ బాండ్లు అందుబాటులో ఉన్నాయి. ‘‘ఈ పథకం కింద జారీ చేసే, ఎలక్టోరల్ బాండ్లను నగదుగా మార్చే అధీకృత బ్యాంకు ఎస్.బి.ఐ ఒక్కటే’’ అని ఆయన తెలిపారు. ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని ఈ ఏడాది జనవరిలో నోటిఫై చేసినట్లు ఆయన మరో ప్రశ్నకు జవాబుగా చెప్పారు. జనవరికి బదులుగా ఆరంభ ఇష్యూ ఈ నెలలో మొదలైంది. బాండ్లు మార్చి 1 నుంచి 10 వరకు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. ఈ వడ్డీ రహిత బ్యాంకింగ్ సాధనాన్ని భారతదేశ పౌరులు లేదా భారతదేశంలో రిజిస్టరైన కంపెనీలు కొనుగోలు చేయవచ్చు. ‘‘బాండ్ గడువు 15 రోజులు. రిజిస్టరైన రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు మాత్రమే వాటిని ఉపయోగించుకోవచ్చు. కడచిన లోక్ సభ లేదా శాసన సభ ఎన్నికల్లో అవి ఒక శాతం కన్నా తక్కువ ఓట్లు తెచ్చుకున్నవి కాకూడదు’’ అని మంత్రి తెలిపారు. ఆ పథకం కింద ఏప్రిల్, జూలై, అక్టోబర్‌లలో కూడా 10 రోజుల చొప్పున ఆ బాండ్లు కొనుగోలుకు అందుబాటులో ఉంటాయని ఆయన వెల్లడించారు. సాధారణ ఎన్నికలు జరిగే ఏడాదిలో అదనంగా మరో 30 రోజుల వ్యవధిని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. ‘‘దాతల పేరును గోప్యంగా ఉంచడంతోబాటు రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చే వ్యవస్థలో పారదర్శకత కల్పించేందుకు ఎలక్టోరల్ బాండ్ పథకం రూపొందింది’’ అని ఆయన తెలిపారు. కె.వై.సి పాటించిన ఖాతా ద్వారా మాత్రమే చెల్లింపులు జరిపి బాండ్లను కొనవచ్చు. అర్హత కలిగిన రాజకీయ పార్టీ అధీకృత బ్యాంకులో ఉన్న  బ్యాంకు ఖాతా ద్వారా మాత్రమే దాన్ని నగదుగా మార్చుకోగలుగుతుంది. రిజిస్టరైన రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు అదనపు బ్యాంకింగ్ సాధనంగా మాత్రమే ఎలక్టోరల్ బాండ్‌ను రూపొందించారని మంత్రి తెలిపారు. జారీ అయిన తేదీ నుంచి 15 రోజుల లోపల మాత్రమే బాండ్ చెల్లుబాటు అవుతుంది.  గడువు ముగిసిన తర్వాత డిపాజిట్ చేసే బాండ్‌కు చెల్లింపులు ఉండవు. రాజకీయ పార్టీ బాండ్‌ను డిపాజిట్ చేయడంతోనే ఆ మొత్తం దాని ఖాతాలో జమ అవుతుంది. 'అడ‌విదొంగ‌'కి 32 ఏళ్లు

Updated By ManamTue, 09/19/2017 - 11:56

చిరంజీవి కెరీర్‌ని మ‌లుపు తిప్పిన చిత్రాల‌లో 'అడ‌వి దొంగ' ఒక‌టి. కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టించిన తొలి చిత్రం కూడా ఇదే. ఈ చిత్రానికి కంటే ముందు ద‌ర్శ‌కేంద్రుడు రూపొందించిన‌ 'మోస‌గాడు', 'తిరుగులేని మ‌నిషి' చిత్రాల్లో చిరు కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ సినిమాలోని ప్ర‌థ‌మార్థం అంతా టార్జాన్ లుక్‌లో క‌నిపిస్తారు చిరు. ఆ లుక్ లో చిరు బాడీ లాంగ్వేజ్‌, హావ‌భావాలు ప్రేక్ష‌కుల‌కు కొత్త‌గా అనిపించాయి.

చిరంజీవి స‌ర‌స‌న రాధ న‌టించిన ఈ సినిమాలో శార‌ద ఓ కీల‌క పాత్ర పోషించారు. చ‌క్ర‌వ‌ర్తి స్వ‌ర‌క‌ల్ప‌న‌లో పాట‌ల‌న్నీ ఆద‌ర‌ణ పొందాయి. 'వానా వానా వంద‌నం', 'ఇది ఒక నంద‌న‌వ‌నం', 'వీర విక్ర‌మ ధీర‌దిగ్గ‌జ నీకే స్వాగ‌తాలు'..అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించిన పాట‌లు. 1985లో ఇదే తేదిన విడుద‌లైన 'అడ‌విదొంగ' నేటితో 32 వ‌సంతాల‌ను పూర్తిచేసుకుంటోంది.లావ‌ణ్య‌కి ఈ సారైనా..

Updated By ManamWed, 09/06/2017 - 10:35

లావ‌ణ్య త్రిపాఠికి ఈ ఏడాది ప్ర‌థ‌మార్థం అంత‌గా క‌లిసి రాలేదు. ఈ సంవ‌త్స‌రం ఆరంభంలో ఈ ముద్దుగుమ్మ న‌టించిన 'మిస్ట‌ర్‌', 'రాధ' చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ్డాయి. ఈ రెండు చిత్రాల్లోనూ మ‌రో హీరోయిన్‌తో షేర్ స్క్రీన్ చేసుకున్న లావ‌ణ్య‌.. వారం గ్యాప్‌లో రానున్న రెండు కొత్త చిత్రాల్లో మాత్రం సోలో హీరోయిన్‌గా సంద‌డి చేయ‌నుంది. ఈ నెల 8న నాగ‌చైత‌న్య‌తో లావ‌ణ్య జోడీక‌ట్టిన 'యుద్ధం శ‌ర‌ణం' విడుద‌ల కానుండ‌గా.. 15న సందీప్ కిష‌న్‌కి జంట‌గా న‌టించిన 'ప్రాజెక్ట్ z' రిలీజ్ కానుంది. ఇద్ద‌రు హీరోయిన్స్‌లో ఒక‌రిగా న‌టించిన సంద‌ర్భంలో లావ‌ణ్య‌కి ద‌క్క‌ని విజ‌యం.. సోలో హీరోయిన్‌గానైనా ద‌క్కుతుందా?  వేచిచూడాల్సిందే. 

Related News