dangal

జాతీయ అవార్డు గ్రహీత ప్రాణం కాపాడిన ఆమిర్

Updated By ManamMon, 09/10/2018 - 13:00

Aamir Khanతన సినిమా కోసం పనిచేసిన జాతీయ అవార్డు గ్రహీత ప్రాణాన్ని బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్‌ కాపాడారు. దీంతో సోషల్ మీడియాలో ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. కాగా ఆమిర్ నటించిన ‘దంగల్‌’ చిత్రానికి పనిచేసిన సౌండ్ డిజైనర్ సాజిత్ కోయేరి తీవ్ర అస్వస్థతకు గురై గురువారం ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. అయితే అక్కడున్న డాక్టర్లు కనీసం ట్రీట్‌మెంట్ ఇవ్వకుండా అతడిని అలానే వదిలేశారు. దీంతో అతడి పరిస్థితి క్షీణిస్తుండటంతో ఏమీ చేయాలో పాలుపోని సాజిత్ కుటుంబసభ్యులు ఆమిర్‌ను ఆశ్రయించారు.

విషయం తెలుసుకున్న ఆమిర్ వెంటనే సాజిత్‌ను కొకిలాబెన్ ఆసుపత్రికి మార్పించడమే కాకుండా.. అనిల్ అంబానీతో మాట్లాడి అత్యవసర చికిత్స అందేలా చర్యలు తీసుకున్నాడు. దీంతో కోలుకున్న సాజిత్.. పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఆమిర్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కాగా ‘బర్ఫీ’, ‘హైదర్’, ‘ఓంకార’, ‘దంగల్’ వంటి హిట్ చిత్రాలకు సాజిత్ పనిచేశాడు. ఓంకార చిత్రానికి గానూ ఆయనకు జాతీయ అవార్డు కూడా లభించింది.ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోంది

Updated By ManamFri, 05/11/2018 - 15:06

Zaira మొదటి సినిమాతోనే అందరినీ ఆకట్టుకొని జాతీయ అవార్డును సొంతం చేసుకున్న ‘దంగల్’ బ్యూటీ జైరా వసీంకు ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తోందట. గత కొన్ని రోజులుగా మానసిక ఒత్తిడితో భాదపడుతున్న ఈ బ్యూటీ కొన్ని రోజులు అన్నింటి నుంచి తనకు కొంత విరామం కావాలని తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది జైరా వసీం.

‘‘గత కొన్ని రోజులుగా మానసిన ఒత్తిడితో బాధపడుతున్నాను. దీంతో రోజూ ఐదు యాంటీ డిప్రెసెంట్‌ మందులు వేసుకుంటున్నాను. ఒక్కోసారి విపరీతమైన ఉత్సాహంతో రాత్రిళ్లు ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తోంది. కొన్ని వారాల పాటు సరిగ్గా నిద్ర ఉండటం లేదు. కొన్ని సందర్భాల్లో విపరీతంగా నిద్రపోతున్నాను. మితిమీరిన ఆహారం తింటున్నాను. కొన్ని రోజులు ఏమీ తినాలని అనిపించక పస్తునుంటున్నాను. ఒళ్లు నొప్పులు, వాపులు బాధిస్తున్నాయి. చాలాసార్లు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలూ వస్తున్నాయి. 25 ఏళ్లు దాటితేనే డిప్రెషన్‌ అనే వ్యాధికి చికిత్స ఉంటుంది అనుకునేలా చేశారు. నన్ను వైద్యుల వద్దకు తీసుకెళ్లినప్పుడు ‘నీకు 17 ఏళ్లే. ఈ వయసులో డిప్రెషన్ ఏంటి?’ అని ప్రశ్నిస్తున్నారు. వారు చెప్పే విషయాలన్నింటికీ తల ఉపుతూ నాకు నేను సర్దిచెప్పుకుంటున్నాను. నాకు అన్నింటి నుంచి కొంత విరామం కావాలి. నా పని, చదువు, ముఖ్యంగా సామాజిక మాధ్యమాల నుంచి. నేను రంజాన్‌ మాసం కోసం ఎదురుచూస్తున్నా. ఆ పవిత్ర సమయంలో నా జీవితంలో అన్నీ సర్దుకుంటాయని భావిస్తున్నా. మీ ప్రార్థనల్లో నన్నూ గుర్తుచేసుకోండి‘‘ అంటూ పోస్ట్ చేసింది జైరా.

 

 

I’m writing this to (finally) admit and confess that I, for a very long time have been suffering from severe anxiety and...

Posted by Zaira Wasim on Thursday, May 10, 2018

 చైనాలో  'దంగ‌ల్' కంటే మిన్న‌గా..

Updated By ManamSat, 01/20/2018 - 17:25

secret superstarబాలీవుడ్ న‌టుడు అమీర్ ఖాన్ నుంచి ఓ సినిమా వ‌స్తుందంటే.. కొత్త‌దనం కోరుకునే ప్రేక్ష‌కుడికి పండ‌గే. కొత్త‌ద‌నం అందిస్తూనే.. వ్యాపారం ప‌రంగానూ బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌నం సృష్టిస్తుంటాయి అమీర్ సినిమాలు. ఆయ‌న రెండేళ్ల క్రితం న‌టించిన  'దంగ‌ల్'  సినిమా అయితే.. కేవ‌లం భార‌త్‌లోనే కాకుండా చైనాలోనూ స‌రికొత్త రికార్డులు న‌మోదు చేసింది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న అతిథి పాత్ర‌లో మెరిసిన తాజా హిట్ మూవీ 'సీక్రెట్ సూప‌ర్‌స్టార్'ని కూడా ఈ శుక్ర‌వారం చైనాలో రిలీజ్ చేశారు. ఈ సినిమాకి తొలి రోజే 6.79 మిలియ‌న్ డాల‌ర్ల (రూ. 43.35 కోట్లు) వ‌సూళ్ల వ‌చ్చాయి.   'దంగ‌ల్' తొలి రోజు క‌లెక్ష‌న్ల కంటే ఇవి ఎక్కువ కావ‌డం విశేషం. అంతేకాకుండా.. హాంకాంగ్‌, మచ్చు వంటి ప్రాంతాల్లో ఎక్కువ వ‌సూళ్లు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇదే జోరు కొన‌సాగితే... 'దంగ‌ల్' సృష్టించిన రికార్డును   'సీక్రెట్ సూప‌ర్‌స్టార్' తిర‌గరాసే అవ‌కాశ‌ముంద‌ని ట్రేడ్ పండితులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. చైనాలో రూ. 1000 కోట్లు వ‌సూలు చేసి  'దంగ‌ల్'  వ‌సూళ్ల ప‌రంగా భార‌తీయ సినిమాల‌కు స‌రికొత్త ల్యాండ్ మార్క్ సెట్ చేసింది.జైరా వేధింపుల కేసులో మరో ట్విస్ట్

Updated By ManamTue, 12/12/2017 - 20:25

waseemన్యూఢిల్లీ: దంగల్ సినిమా ఫేం జైరా వసీం వేధింపుల కేసు మరో కొత్త మలుపు తిరిగింది. విమానంలోని తోటి ప్రయాణికుడు వికాస్ సచ్‌దేవా తనను వేధించాడంటూ ఆమె ఇటీవల ఓ వీడియోను పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును విచారిస్తున్న ముంబై పోలీసులు అదే విమానంలో ప్రయాణించిన సాక్షి వాదనను విన్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సచ్‌దేవా అమాయకుడని ఆ సాక్షి చెప్పడం కొసమెరుపు. తానూ వారి వరుసలోనే కూర్చున్నానని, సచ్‌దేవ్ ఆ నటిని లైంగికంగా వేధించలేదని, అసభ్యంగా ప్రవర్తించలేదని చెప్పుకొచ్చాడు. అయితే చేసిన దాంట్లో కొంత తప్పుందని, తన కాళ్లను నటి కూర్చున్న సీటు వైపు పెట్టాడని.. అంతేతప్ప ఆమెను ఎక్కడా తాకలేదని తెలిపాడు. ముంబైలో విమానం ల్యాండ్ అవ్వగానే వారిద్దరి మధ్య గొడవ జరిగిందని ఆ సాక్షి చెప్పాడు. కాళ్లు ఎందుకు పెట్టావని ఆమె ప్రశ్నించిందని.. దీంతో సచ్‌దేవ్ ఆమెకు క్షమాపణ చెప్పాడని తోటి ప్రయాణికుడు తెలిపాడు. ఆ గొడవ అక్కడే సమసిపోయిందని చెప్పాడు. పోలీసులు అతను చెప్పిన విషయాన్ని రికార్డు చేశారు. సాక్షి చెప్పిన విషయానికి, ఆమె ఆరోపణలకు పొంతన లేకపోవడంతో ముంబై పోలీసులకు ఈ కేసు తలనొప్పిగా మారింది. మా ఆయన అలాంటోడు కాదు

Updated By ManamMon, 12/11/2017 - 14:46

Zaira Wasimముంబై: బాలీవుడ్ నటి, 'దంగల్' ఫేం జైరా వసీమ్  విమానంలో లైంగిక వేధింపులకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు బాధ్యుడైన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయగా, దానిపై అతడి భార్య స్పందించింది. తన భర్త అలాంటి వాడు కాదని, ఎవ్వరినీ ఇబ్బంది పెట్టాలని అనుకోడని ఆమె తెలిపింది.

"తన భర్త చాలా మంచోడని, లైంగిక వేధింపులు చేయాలని అనుకోడని ఆమె పేర్కొంది. అంతకుముందు రోజు తమ కుటుంబంలో ఒక మరణం ఉండటం వలన అతడికి 24గంటలుగా నిద్రలేదని, విమానం ఎక్కినప్పుడు కూడా తన నిద్రకు ఎవరూ భంగం కలిగించొద్దంటూ ఆయన అందులోని వారిని విన్నవించాడని తెలిపింది. గాఢ నిద్రలో ఉన్న అతడి కాలు, జహీరాకు అనుకోకుండా తగిలింటుంది తప్ప, కావాలని తన భర్త అలా ఎప్పుడూ చేయడని తెలిపింది. అయినా ఇది జరిగిన వెంటనే జహీరా స్పందించలేదని, ఒక చిన్న అపార్ధం వల్ల ఇలా జరిగిందని పేర్కొంది. తన భర్త మంచి కుటుంబ మనిషిని, ఎప్పుడూ ఇలా చేయాలని భావించడని, తమకు న్యాయం కావాలి" అంటూ ఆమె అభ్యర్థించింది.హీరోయిన్‌గా అమీర్ రెండో కూతురు

Updated By ManamSat, 12/02/2017 - 16:10

sanyaబాలీవుడ్ మిస్టర్ ప‌ర్‌ఫెక్ష‌నిస్ట్‌ అమీర్ ఖాన్ నటించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘దంగల్’. ఈ సినిమాలో అమీర్ మహావీర్ సింగ్ ఫోగాట్ పాత్రని పోషించారు. ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లైన అమీర్ కూతుళ్లుగా గీత, బబిత రోల్స్‌లో ఫాతిమా సనా, సాన్య మల్హోత్రలు న‌టించారు. ఇప్ప‌టికే ఫాతిమా స‌నా హీరోయిన్‌గా న‌టించేసింది. ఇప్పుడు సాన్య మల్హోత్ర వంతు వ‌చ్చింది. ఆయుష్మాన్‌ ఖురానా హీరోగా రూపొందుతున్న‌ ‘బధాయి హో’ సినిమా ద్వారా సాన్య హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వ‌నుంది. ఓ ఊహించ‌ని వార్త‌.. ఒక‌ కుటుంబాన్ని ఎలాంటి పెనుగులాటలకు దారి తీసిందో చెప్పే ఇతివృత్తంతో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. అమిత్ శర్మ దర్శక‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జంగ్లీ పిక్చర్స్, క్రోమ్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ వచ్చే జనవరి నుంచి ఢిల్లీలో ప్రారంభం కానుంది.

Related News