balka suman

'రేవంత్.. దమ్ముంటే విచారణ ఎదుర్కో'

Updated By ManamSat, 09/29/2018 - 18:58
  • ఎంపీ బాల్క సుమన్ హెచ్చరిక.. 

Balka Suman, Revanth Reddy, IT Raids, Chandrababu Naidu, KCR, TRS govtహైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి రాష్ట్ర రాజకీయాల్ని భ్రష్టుపట్టిస్తున్నారని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పటికైనా చేసిన తప్పులు ఒప్పుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఐటీ దాడుల నేపథ్యంలో మీడియా ముందుకొచ్చిన రేవంత్ కేసీఆర్‌‌పై తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన ఎంపీ బాల్కసుమన్ తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అదే స్థాయిలో తిప్పికొట్టారు. రేవంత్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని.. నోరుంది కదా అని ఏదిబడితే అది మాట్లాడితే బయట తిరగలేని పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. రేవంత్‌ రెడ్డి చంద్రబాబు కోవర్ట్‌ అని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి నువ్వు స్వాతిముత్యం కమల్‌హాసన్‌వి కాదు.. విశ్వరూపం కమలహాసన్‌వి అని సెటైర్లు వేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వ్యక్తి కేసీఆర్‌.. కేసీఆర్‌ది ఉద్యమ కుటుంబం.. ఆయన తెలంగాణ జాతిపిత అని సుమన్‌ చెప్పారు. 

తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ ఎదుర్కొని నిజాయితీగా బయటపడాలని హితవు పలికారు. ఆరోపణలు ఎదుర్కొంటూ జగన్‌ విచారణకు హాజరుకావడం లేదా? అని ప్రశ్నించారు. దమ్ముంటే విచారణ ఎదుర్కో.. అని ఇష్టమొచ్చినట్టు మాట్లాడొద్దని అన్నారు. రేవంత్ బండారం మొత్తం తనకు తెలుసనని సుమన్ విమర్శించారు. డొల్ల కంపెనీలు, అక్రమాస్తులపై రేవంత్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రేవంత్ వ్యవహారంలో కాంగ్రెస్ నేతలు తేలు కుట్టిన దొంగలా మారారని దుయ్యబట్టారు. రేవంత్ ఎవరెవర్ని మోసం చేశారో అందరికి తెలుసుని చెప్పారు. రేవంత్ ఓ విష పురుగు అని ధ్వజమెత్తారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు ఉంది రేవంత్‌రెడ్డి తీరని ఎద్దేవా చేశారు. కులం పేరిట రాష్ట్రంలో విద్వేష పూరిత వాతావరణం సృష్టిస్తున్నారని ఆరోపించారు. నిప్పులాగా బతుకుతున్న కేసీఆర్‌ కుటుంబంపై రేవంత్‌ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం అన్నా.. ప్రభుత్వమన్నా అతనికి గౌరవం లేదని సుమన్ విమర్శలు గుప్పించారు. 'తులసి వనంలో రేవంత్ గంజాయి మొక్క'

Updated By ManamFri, 09/28/2018 - 16:51
  • సర్వేలన్ని మాకు అనుకూలంగా వున్నాయి

  • ఐటీ దాడులకు టీఆర్ఎస్‌‌కు ఎలాంటి సంబంధం లేదు

  • కాంగ్రెస్ నేతల ఆరోపణలను ఖండిస్తున్నాం

  • రేవంత్ రెడ్డిపై ఎంపీ బాల్క సుమన్ ధ్వజం

Balka Suman, Revanth Reddy, Congress Party, IT Raids, Revanth Reddy assetsహైదరాబాద్: కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఆయన బంధువులు, కంపెనీలపై జరుగుతున్న ఐటీ దాడులకు టీఆర్ఎస్‌‌కు ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ ఎంపీ బాల్క సుమన్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్‌కు సంబంధం వుందని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. కాంగ్రెస్  నేతల తీరు దొంగే దొంగ అని అరుస్తున్నట్లు ఉందని, గొంగట్లో కూసోని తింటూ వెంట్రుకలు రావొద్దని అనుకున్నట్లు వుంది వారి వ్యవహారమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారని, వారిపైన ఐటీ సోదాలు జరగటం లేదు కదా ? అని ప్రశ్నించారు. తప్పుడు లెక్కలతో ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టించినందుకుగాను వచ్చే ఎన్నికల్లో రేవంత్‌ పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్టు చెప్పారు.

ఆ కంపెనీ కారులోనే తిరుగుతున్నాడు..
తెలంగాణ తులసి వనంలో రేవంత్ రెడ్డి గంజాయి మొక్కని, సెటిల్మెంట్‌లు, భూ కబ్జాలకు కేరాఫ్ అడ్రస్ రేవంత్ రెడ్డిని, ఒకే అడ్రస్‌పై 18 కంపెనీలు పెట్టి అక్రమ వ్యాపారాలు చేయటం న్యాయమా? కాంగ్రెస్ నేతలు చెప్పాలన్నారు. 14కోట్ల రూపాయల ఒక యంత్రం చేతులు మారి.. ఒక కంపెనీ 80 కోట్లకు దాన్ని కొనడం అంటే ఏంటీ..?అని మరోమారు సుమన్ ప్రశ్నించారు. ఈ కంపెనీ ఇచ్చిన గిఫ్ట్ కారులోనే రేవంత్ తిరుగుతున్నాడని, తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ నేతలు వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ఒక చోటా షకీల్, ఒక విజయ మాల్య, ఒక దావూద్ ఇబ్రహీం, 2009 ఎలక్షన్ అఫిడవిట్‌లో 3.6 కోట్లు, 2014లో అఫిడవిట్ 13.2 కోట్లు చూపించారని విమర్శలు గుప్పించారు.

‘ఓటుకు నోటు’ ఆరా తీస్తే డొంక కదిలింది..
చంద్రబాబుతో కలిసి రేవంత్ రెడ్డి ఈ వ్యవహారాలు నడిపించాడని, ఓటుకు నోటు కేసులో దొరికిన 50 లక్షల రూపాయలు ఎక్కడినుంచి వచ్చాయి అనేది ఆరా తీస్తే డొంక కదిలిందని తెలిపారు. నారాయణగూడలో మామూలు పెయింటర్ రేవంత్ రెడ్డి ఇన్ని కోట్లు ఎలా సంపాదించారో ప్రజలకు చెప్పాలన్నారు. మిలట్రీలో పని చేసిన ఉత్తమ్ మని లాండరింగ్ చేసిన రేవంత్‌కి ఎలా మద్దతు తెలుపుతారని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల ముఠా స్టువర్టుపురం దొంగల ముఠా.. వారిలో ఎవరిని కదిలించినా వేల కోట్లు బయటపడతాయని దుయ్యబట్టారు. 

రేవంత్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి..
ఉమ్మడి ఏపీలో ఆంధ్ర నేతల మోచేతి నీళ్ళు తాగి అక్రమర్జన చేశారని, చిల్లర రాజకీయాలతో తాము అధికారంలోకి రావాలని అనుకోవటం లేదని, సర్వేలన్ని తమకు అనుకూలంగా వున్నాయన్నారు. తాము చేసిన అభివృద్దే తమను గెలుపిస్తుందని సుమన్ ధీమా వ్యక్తం చేశారు. వాళ్లకు అధికారం ఇస్తే అమరావతి, ఢిల్లీలో మన ఆత్మ గౌరవం తాకట్టు పెడుతారని విమర్శించారు. సచీలుడని చెప్పుకుంటున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి తన నిజాయితీ నిరూపించుకోవాలని బాల్క సుమన్ డిమాండ్ చేశారు. తెలంగాణలోబాబు మళ్ళీ కుట్రలు చేస్తుండు..

Updated By ManamSun, 09/16/2018 - 01:00
  • బాల్క సుమన్, గట్టు తీవ్ర ఆరోపణలు

Balka-sumanహైదరాబాద్: తెలంగాణ పట్ల నాటి సమైఖ్య వాది, ఏపీ సీఎం చంద్రబాబు నేటికీ శిఖండి రాజకీయాలు చేస్తున్నారని టీఆర్‌ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఎంపీ బాల్క సుమన్, మండలి విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, టీఆర్‌ఎస్ కార్యదర్శి గట్టు రామచంద్రరావు మీడియాతో మాట్లాడారు. నక్క జిత్తుల చంద్రబాబు తెలంగాణలో మళ్ళీ కుట్రలు మొదలు పెట్టారని ఎంపీ బాల్క సుమన్ తీవ్రంగా మండిపడ్డారు.  తెలంగాణను కలుషితం చేసేందుకు చంద్రబాబు ఏపి ఇంటెలిజెన్స్ ను వాడుకుంటున్నారని సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రాల ఇటెలిజెన్స్ పోలీస్‌లు తెలంగాణలో ఎందుకు తిరుగుతున్నారని ఆయన ప్రశ్నించారు. డీజిపి, గవర్నర్ లు దీనిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని సుమన్ తెలిపారు. అయితే, తామే రెడ్ హ్యాండెడ్‌గా డబ్బు సంచిలు పట్టుకొని ఐటీ విభాగానికి అప్పగిస్తామన్నారు. జరిగే పరిణామాలకు చంద్రబాబే బాధ్యత వహించాల్సి ఉంటుందని టీఆర్‌ఎస్ నేతలు చెప్పారు. చంద్రబాబు చీకటి రాజకీయాలు మానుకోవాలన్నారు. తెలంగాణపై మొదటి నుండి రెండు కళ్ల బాబుది శిఖండి పాత్రేనని గట్టు రాంచందర్ రావు తీవ్రంగా విమర్శించారు. అయితే, చంద్రబాబు రాజకీయ నాయకుడు కాదని..ఆయన ఓ మాయల మరాఠీ అంటూ గట్టు మండిపడ్డారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో తెలంగాణలో ఖర్చు పెట్టీ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేద్దామని చంద్రబాబు కుట్ర చేస్తున్నారని గట్టు ఆరొపించారు. ఏబీ వెంకటేశ్వర్ రావు, ఏపీ ఇంటలిజెన్స్ పొలిటికల్ అధికారి చంద్రబాబుకు బ్రోకరన్నారు. ఆయనకు ఇక్కడ ఏం పని? ..అతనిపై గవర్నర్ తో పాటు డిజిపికి పిర్యాదు చేస్తామని పేర్కోన్నారు. వారు, స్పందించకపోతే టీఆర్‌ఎస్ కార్యకర్తలు, ప్రజలు వెంటబడి తరిమే ఏర్పాటు చేస్తామంటు తీవ్రంగా మండిపడ్డారు. ఒక వేళ చర్యలు తీసుకోక పోతే జరిగే పరిణామాలకు టీఆర్‌ఎస్ కు సంబంధం లేదన్నారు. చంద్రబాబు.. ఆయనతో కలిసి పోవాలనుకుంటున్న  కాంగ్రెస్ బాధ్యత వహించాలన్నారు. ఇన్నాళ్లు చంద్రబాబుపై కేసులు వేసిన కాంగ్రెస్ నేతలు ..ఇప్పుడు ఆయన చేతులు పట్టుకొని తిరుగుతున్నారని ఆయన విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ కుటుంబానికి సిగ్గుంటే చంద్రబాబును తన్ని తరమాలన్నారు. చంద్రబాబు చేసిన అక్రమాలకు నాలుగైదు సార్లు జీవిత ఖైదు శిక్ష వేయాలంటూ తీవ్ర వాఖ్యలు చేశారు. చంద్రబాబు కుట్రలు ఆపకపోతే తరిమి తరిమి కొట్టే పరిస్థితి వస్తుందని గట్టు ఈ సందర్భంగా హెచ్చరించారు. 'అరాచకం సృష్టించేది టీఆర్ఎస్సే..'

Updated By ManamSat, 09/15/2018 - 19:32
  • ఎమ్మెల్యే బోండా ఉమ కౌంటర్ ఎటాక్.. 

MLA Bonda Uma Maheswara rao, TRS Leaders, Balka Suman, Palla Rajeswar reddy, TRS partyహైదరాబాద్: టీఆర్ఎస్ నేతలు బాల్కా సుమన్, పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలపై విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా కౌంటర్ ఎటాక్ చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకొని అరాచకం సృష్టించేది టీఆర్ఎస్సేనని ఆయన ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బాబ్లీ విషయంలో మహారాష్ట్రకు వంతపాడుతున్నట్టు టీఆర్ఎస్ వ్యవహరిస్తోందని విమర్శించారు. హైదరాబాద్ కామన్ క్యాపిటల్‌ అని బోండా ఉమ స్పష్టం చేశారు.

హైదరాబాద్‌పై 2024 వరకు తమకు సర్వహక్కులు ఉంటాయని చెప్పారు. విభజన చట్టం ద్వారా తమకు ఇచ్చిన హక్కు ఇదేనని ఉమా తెలిపారు. అంతకుముందు చంద్రబాబుపై టీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లోని సెక్షన్ 8ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దుర్వినియోగం చేస్తున్నారని పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఏపీ డీజీపీ ఆఫీసు టీడీపీ ఆఫీస్‌ (పొలిటికల్ డెన్)గా మార్చారని విమర్శించారు. చంద్రబాబు తెలంగాణలో డబ్బుల సంస్కృతిని ప్రవేశపెడుతున్నారని బాల్క సుమన్ ఆరోపించారు. కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటా: ఓదేలు

Updated By ManamFri, 09/14/2018 - 09:24

KCR, Odeluహైదరాబాద్: చెన్నూరు నియోజకవర్గం సీటు తనకు ఇవ్వకుండా బాల్క సుమన్‌కు ఇవ్వడంపై అలకబూనిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు తాజాగా సీఎం కేసీఆర్‌ను కలిశారు. అనంతరం మాట్లాడిన ఓదేలు.. కేసీఆర్ మాటే తమకు శిరోధార్యమని.. పార్టీలో తనకు సముచిత స్థానం కల్పిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని తెలిపారు. కేసీఆర్ ఆదేశాలకు, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. 

కేసీఆర్‌తో కలిసి జీవిత కాలం పని చేస్తానని.. ప్రత్యేక పరిస్థితుల్లో ఆయన తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. ఈ విషయాన్ని నియోజకవర్గ ప్రజలు పెద్ద మనసుతో అర్థం చేసుకొని.. బాల్క సుమన్ గెలుపు కోసం పనిచేయాలని కోరారు. సమన్వయంతో ముందుకు సాగుదాం

Updated By ManamFri, 09/07/2018 - 22:42
  • చెన్నూరుపై మరోసారి గులాబి జెండా : బాల్క సుమన్

  • అభినందించిన నియోజకవర్గ నేతలు

sumanహైదరాబాద్: త్వరలో రాబోయే ఎన్నికల్లో అందరం కలిసి పని చేసి నియోజక వర్గంపై మరోసారి గులాబీ జెండా ఎగురవేసే విధంగా కృషి చేద్దామని చెన్నూరు నియోజక వర్గం టీఆర్‌ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ పిలుపునిచ్చారు. ఇందుకు అనుకూలంగా ప్రణాళికలు చేసుకొని ప్రచారం చేద్దామని అయన అన్నారు. బాల్క సుమన్‌ను సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపధ్యంలో నియోజక వర్గానికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు పార్టి ముఖ్య నాయకులు శుక్రవారం తెలంగాణ భవన్‌లో కలిసి ఆయనను అభినందించారు. ఈ సందర్బంగా సుమన్ మాట్లాడుతూ... తనపై ఉన్న నమ్మకం తో చెన్నూరు నియోజక వర్గ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు సిఎం కెసిఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కెసిఆర్ నమ్మకానికి అనుగుణంగా పని చేసి చెన్నూరు పై గులాబీ జెండా ఎగురవేద్దామని అన్నారు. సమిష్టిగా పని చేసి సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు. అతి త్వరలో ఎన్నికల నియోజకవర్గంలో ప్రచారాన్ని ప్రారంబించి ప్రతి గ్రామంలో పర్యటించే విధంగా ప్రణాళికలు చేద్దామన్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు చేపట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తే, భారీ మెజార్టీ తో గెలుపు ఖాయం అన్నారు. సమాజంలోని ప్రతి వర్గానికి ఏదో ఒక రకమైన పథకాలను ప్రవేశ పెటామని అన్నారు. బొగ్గు గనుల కార్మికుల సమస్యలను పరిక్షరించిన ఘనత సీఎం కేసీఆర్‌దేని ఆయన స్పష్టం చేశారు. ఇక, తెలంగాణ భవీష్యతునూ కాంగ్రెస్ నాయకుల చేతుల్లో పెడితే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తారని సుమన్ ఘాటుగా విమర్శించారు.  చెన్నూరు నియోజక వర్గం మొదటి నుండి తెరాసకు అండగా నిలుస్తున్నదని మరోసారి పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి సిద్దంగా ఉన్నారని స్థానిక నాయకులు సుమన్‌తో అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో సింగరేణి కార్మికులకు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, నియోజక వర్గంలో చేపట్టిన సంక్షేమ, అభివద్ధి కార్యక్రమాలు టీఆర్‌ఎస్‌కు విజయం చేకూరుస్థాయని అన్నారు. పెద్దపల్లి ఎంపీగా సుపరీచితులైన బాల్క సుమన్‌ను గెలిపించుకోవడానికి తామంత అందరం సిద్దంగా ఉన్నామన్నారు.బాల్క సుమన్‌పై ఆ ఆరోపణల్లో నిజం లేదు

Updated By ManamFri, 07/06/2018 - 15:02

Balka Sumanహైదరాబాద్: పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌పై వైరలవుతున్న లైంగిక వేదింపుల ఘటన అవాస్తవమని పోలీసులు తెలిపారు. ఎంపీని ట్రాప్ చేసి బ్లాక్‌మెయిల్ చేసి లబ్ధి పొందాలని బోయిని సంధ్య, విజిత అనే ఇద్దరు అక్కాచెల్లెల్లు ఈ చర్యలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. వీరిపై హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో 420, 292A, 419, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు వారు తెలిపారు.

దీనిపై మాట్లాడిన మంచిర్యాల సీఐ ఎడ్ల మహేశ్.. ‘‘ఎంపీ బాల్క సుమన్‌పై వస్తున్న వార్తలు అవాస్తవాలు. మంచిర్యాలకు చెందిన బోయిని సంధ్య, ఆమె అక్క విజేతలు గత కొన్ని రోజులుగా ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతూ  అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు. ఆ క్రమంలోనే బాల్క సుమన్ తమను వేధిస్తున్నాడంటూ వారు జనవరి 18న కేసు పెట్టారు. దీన్ని మేము విచారించే క్రమంలో చాలా విషయాలు బయటపడ్డాయి. ఎంపీ సుమన్ ఫేసుబుక్‌లో పెట్టుకున్న ఫోటోను కాపీ చేసుకొని దాన్ని సంధ్య తన ఫొటోలతో మార్ఫింగ్ చేశారు’’ అంటూ తెలిపారు.‘అరే బుద్ధి లేనోడా’.. బాల్కపై రేవంత్ ఫైర్

Updated By ManamSat, 01/13/2018 - 15:54

balkaహైదరాబాద్: తెలంగాణలో పవర్‌వార్ రోజురోజుకూ ముదురుతోంది. టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ప్రెస్‌మీట్‌లో రేవంత్ మాట్లాడుతూ తన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా బాల్క సుమన్ ప్రతివిమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోళ్ల గురించి ప్రశ్నిస్తే.. బాల్క సుమన్ ఏదేదో చెబుతూ మతి తప్పినట్లు మాట్లాడుతున్నాడని రేవంత్ ఎద్దేవా చేశారు. అయినా 24గంటల విద్యుత్ తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని రేవంత్ చెప్పారు. 2008లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేడని.. వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రిగా.. మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలో 24గంటల విద్యుత్‌ను తెలంగాణ రైతాంగానికి అందించింది కాంగ్రెస్ పార్టీయేనని ఆయన గుర్తుచేశారు. 

భద్రాద్రి పవర్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల వల్ల 23మంది అధికారులపై ఫిర్యాదులు అందిన నేపథ్యంలో గ్రీన్ ట్రిబ్యునల్ వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తాను చెబితే దాన్ని బాల్క సుమన్ వక్రీకరించారని రేవంత్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై బాల్క సుమన్ కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఇద్దరు అధికారులనే శిక్షించాలని కోర్టు చెప్పిందని చెబుతున్నాడని చెప్పిన రేవంత్ ఈ సందర్భంలోనే బాల్క సుమన్‌పై విరుచుకుపడ్డారు. ‘అరేయ్ బుద్ధి లేనోడా.. నే చెప్పేదదే.. కేసీఆర్ తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల అధికారులు జైలుకెళ్లే పరిస్థితి వచ్చిందని చెబుతుంటే.. ఇద్దరికీ శిక్ష పడిందని చెబుతున్నవు’.. అంటే ఏంది నువ్వు తప్పుడు పని చేసినవని ఒప్పుకుంటున్నవా.. కేసీఆర్‌ను ఇరికిస్తున్నవా.. లేక కేసీఆర్ తరపున వకాల్తా పుచ్చుకుంటున్నవా’ అని బాల్క సుమన్‌ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్ రవ్వంతా అని బాల్క మాట్లాడుతున్నాడని, వారి అవినీతి కొంప తగలబెట్టడానికి ఒక్క నిప్పురవ్వ చాలని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.టీఆర్ఎస్ తోకముడిసి పారిపోయింది

Updated By ManamThu, 01/11/2018 - 18:55

revanth reddyహైదరాబాద్: మిగులు విద్యుత్‌పై బహిరంగ చర్చ విషయంలో టిఆర్ఎస్ తోకముడిచి పారిపోయిందని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. విద్యుత్ కొనుగోళ్లు, విద్యుత్ ప్రాజెక్టుల విషయంలో కేసిఆర్ చేసిన అవినీతి బండారం బయటపడుతుందన్న భయంతోనే తోక ముడిచారని విమర్శించారు. ఇప్పటికైనా బహిరంగ చర్చలో మాట్లాడే దమ్ము తమకు లేదని టిఆర్ఎస్ ఒప్పుకుంటే మంచిదన్నారు. విద్యుత్ రంగంలో అన్నింటా అవినీతికి పాల్పడుతున్న పాల‌క‌ప‌క్షం ప‌లాయ‌న‌వాదం ఎత్తుకున్నా వారు చేసిన అవినీతి, అక్రమాలను బ‌య‌ట‌పెట్టేవ‌ర‌కూ వ‌దిలేది లేదన్నారు. 24 గంటల విద్యుత్ కొనుగోళ్లలో తాను చెప్పకుండా మిగిలిపోయిన అవినీతి బండారాన్ని శుక్రవారం పాత్రికేయుల స‌మావేశంలో బహిర్గతం చేస్తానని చేస్తానంటూ రేవంత్ రెడ్డి ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. 

Read related Article: చర్చకు సిద్ధం..షరతులు వర్తిస్తాయ్

 చర్చకు సిద్ధం..షరతులు వర్తిస్తాయ్

Updated By ManamThu, 01/11/2018 - 17:11

balka sumanహైదరాబాద్: అధికార టీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య పవర్ వార్ మరింత ముదురుతోంది. మిగులు విద్యుత్ అంశంపై  రేవంత్ రెడ్డి సవాల్‌‌ను స్వీకరిస్తున్నట్లు అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. విద్యుత్‌పై బహిరంగ చర్చకు తాము సిద్ధమంటూనే టీఆర్ఎస్ ఎంపీ బల్కా సుమన్ కొత్త మెళికపెట్టారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత జానా రెడ్డి, షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి చర్చకు వస్తేనే వారితో చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. రేవంత్ రెడ్డి డబ్బు కట్టలతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన విశ్వసనీయతలేని నాయకుడిగా ఎద్దేవా చేశారు.విశ్వసనీయత లేని వ్యక్తులు ఉచిత ప్రచారం కోసం పాకులాడుతున్నారని, వారితో బహిరంగ చర్చ ద్వారా ఒరిగేదేమీ లేదన్నారు. 

మిగులు విద్యుత్‌పై తాను చర్చకు వస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చెబుతున్నారని గుర్తు చేశారు. చర్చకు ఎవరు వస్తారో ముందుగా కాంగ్రెస్ నేతలు తేల్చుకోవాలన్నారు. 

Read Related Article: టీఆర్ఎస్ తోకముడిసి పారిపోయిందన్న రేవంత్ రెడ్డి

 

Related News