mp balka suman

నా పై దాడి చేసి చంపాలని చూశారు: బాల్క 

Updated By ManamWed, 09/12/2018 - 15:55
MP Balka Suman Sensational Comments over nallala odelu follower suicide attempt

చెన్నూరు : ఎంపీ బాల్క సుమన్‌కు చెన్నూరు అసెంబ్లీ టికెట్ కేటాయింపుతో అసమ్మతి సెగలు రగులుతున్నాయి. చెన్నూర్‌ నియోజకవర్గ సిట్టింగ్‌ ఎమ్మెల్యే నల్లాల ఓదేలుకు కాకుండా ఆ సీటును బాల్క సుమన్‌కు కేటాయించడంపై ఓదేలు అనుచరులు నిరసన వ్యక్తం చేస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపుతోంది. 

జైపూర్‌ మండలం ఇందారంలో బుధవారం శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన బాల్క సుమన్‌కు వ్యతిరేకంగా ఓదేలు అనుచరులు నిరసనకు దిగారు. అంతేకాకుండా బాల్క సుమన్‌ను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఓ కార్యకర్త తనతో పాటు తెచ్చుకున్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. అయితే అతడితో పాటు మరో నలుగురికి మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

odelu supporters

ఈ ఘటనపై ఎంపీ బాల్క సుమన్ మాట్లాడుతూ... టికెట్ కేటాయించిన తర్వాత తొలిసారి నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన తనపై దాడి చేసి చంపాలని చూశారని, తాను చనిపోతే చెన్నూర్‌ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందంటే అందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఓదేలు వర్గం వారు చేస్తున్న బెదిరింపులకు తాను భయపడేది లేదని స్పష్టం చేశారు.

పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకే తాను చెన్నూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి దిగుతున్నట్లు చెప్పారు. ఆ నెల 14 నుంచి చెన్నూరులో ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేస్తానని, చెన్నూరును మరో సిద్ధిపేటలాగా అభివృద్ధి చేస్తానని బాల్క సుమన్ తెలిపారు.ఎంపీ బాల్కకు ఎమ్మెల్యే టికెట్...

Updated By ManamThu, 09/06/2018 - 15:54
TRS MP Balka suman Get Chennur Assembly Ticket

హైదరాబాద్ : పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బరిలోకి దిగనున్నారు. రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గం నుంచి బాల్క సుమన్ పోటీ చేయనున్నారు. అయితే పెద్దపల్లి లోక్‌సభ స్థానం నుంచి మాజీ ఎంపీ జి.వివేకానంద్‌ బరిలోకి దిగనున్నట్లు సమాచారం. కాగా టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ... గురువారం 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. 

అయితే రెండు స్థానాలు (చెన్నూర్, ఆంధోల్)కు మాత్రం సిట్టింగ్‌లకు కాకుండా వేరే అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. 2014లో చెన్నూర్ నుంచి నల్లాల ఓదేలు గెలుపొందగా, ఈసారి ఆ సీటును బాల్క సుమన్‌కు కేటాయించడం జరిగింది. మరోవైపు ఆంధోల్ ఎమ్మెల్యే బాబూ మోహన్‌కు కూడా మొండిచేయి లభించింది. ఆయనకు పార్టీ టికెట్ నిరాకరించిన కేసీఆర్... ఆ నియోజకవర్గ అభ్యర్థిగా జర్నలిస్ట్ క్రాంతి కిరణ్‌ పేరును ప్రకటించారు.కాంగ్రెస్ నేతలపై ఎంపీ బాల్కసుమన్ ధ్వజం

Updated By ManamMon, 09/03/2018 - 20:12

MP Balka suman, MLA Jeevan Reddy, Congress leaders హైదరాబాద్: ప్రగతి నివేదిక సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ నేతలు బెంబేలెత్తుతున్నారని ఎంపీ బాల్కసుమన్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. సోమవారం టీఆర్ఎస్ నేతలు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో కొత్త బిచ్చగాడు రేవంత్, పాత బిచ్చగాడు మధు యాష్కీ, బొమ్మాళి డీకే అరుణ, గడ్డం బాబా ఉత్తమ్‌ కుమార్ రెడ్డిలు.. టీఆర్ఎస్ సభపై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ సభలు పెట్టుకుంటే కాంగ్రెస్ నేతలకు ఎందుకు కడుపు మంటగా ఉందో చెప్పాలన్నారు.

టీఆర్ఎస్ సభలలో పల్లీలు, వాటర్ పాకెట్లు అమ్ముకునే వారి సంఖ్య కన్నా మొన్న రాహుల్ గాంధీ మీటింగ్‌కు వచ్చిన వారి సంఖ్య తక్కువని విమర్శించారు. కాంగ్రెస్ నేతలది సొల్లు పురాణమని, కాంగ్రెస్ నేతలు తమ సభపై తిట్లు ఆపకపోతే కాంగ్రెస్‌కు డబుల్ డిజిట్ సీట్లు కూడా రావన్నారు. చాలా మందికి డిపాజిట్లు రావని టీఆర్ఎస్‌ను విమర్శిస్తే సూర్యుడిపై ఉమ్మేసినట్టేనని దుయ్యబట్టారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని కేసీఆర్ ఎక్కడా చెప్పలేదని, ఉత్తమ్ తెలంగాణ ఉద్యమంలో పదవీ త్యాగము చేయలేదన్నారు. 

డబ్బు సంపాదనే ధ్యేయంగా ఉత్తమ్ ఆనాడు పని చేశారని, అపుడు నిరుద్యోగులపై ప్రేమ చూపని ఉత్తమ్‌కు ఇపుడు వారు గుర్తొస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌లో నేతలు దొంగల ముఠాలా ఏర్పడి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సోనియా తానే తెలంగాణ ఇచ్చినా అని చెప్పినా కరీంనగర్‌లో ఎంపీ సీటు ఎమ్మెల్యే సీటు టీఆర్ఎస్ గెలిచిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ నేతలు పేపర్ పులులు, టీవీ టైగర్లు .. ఆందోళన, భయం, ఆవేదన కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. అందుకే కేసీఆర్‌పై తిట్ల పురాణం అందుకుంటున్నారని మండిపడ్డారు.

గాంధీ భవన్ గోబెల్స్ భవన్‌గా మారిందని, తెలంగాణలో డ్రామాలు, ద్రోహాలకు కాంగ్రెస్ తెర లేపుతోందని ధ్వజమెత్తారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా కోర్టుకు వెళ్తూ కాంగ్రెస్ నేతలే అడ్డుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ఎంత అడ్డుపడ్డా కేసీఆర్ ప్రకటించినట్టుగా లక్షా 12 వేల ఉద్యోగాలను తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు విమర్శలు మానకపోతే వారి పార్టీ కథ కంచికి, కాశికేనని ఎంపీ బాల్కసుమన్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఆరోపణలపై స్పందించిన ఎంపీ బాల్క సుమన్‌

Updated By ManamFri, 07/06/2018 - 20:51
  • ఆరోపణలు రుజువు చేస్తే ప్రాణ త్యాగం

  • అంబేద్కర్ సాక్షిగా ఉరి వేసుకుంటా

balka suman

హైదరాబాద్‌ :   తనపై వచ్చిన ఆరోపణలపై టీఆర్‌ఎస్‌ ఎంపీ బాల్క సుమన్‌ స్పందించారు. రాజకీయంగా తన ఎదుగుదల చూసి ఓర్వలేక తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.  తనపై వచ్చిన ఆరోపణలపై ఆధారాలతో రుజువు చేస్తే లోయర్ ట్యాంక్ బండ్‌ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం  సాక్షిగా ఉరి వేసుకోని ప్రాణ త్యాగానికి సిద్ధమన్నారు. దళిత ఎంపీ అయిన తనను రాజకీయంగా ఎదురుకొనే సత్తాలేకే ఇటువంటి అసత్య ప్రచారాలు చేయడం తనపై మానసిక దాడిగా పరిగణిస్తున్నానని బాల్క సుమన్‌ అన్నారు. 

భార్య, కుమారుడితో కలిసి తాను దిగిన ఫోటోను మార్ఫింగ్‌ చేసి బ్లాక్‌ మెయిలింగ్‌కు పాల్పడుతున్న మంచిర్యాలకు చెందిన ఇద్దరు మహిళలపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారిపై కేసులు కూడా నమోదు చేసి, అరెస్ట్‌ చేసినట్లు ఎంపీ తెలిపారు. ఆ తర్వాత కూడా వాళ్లిద్దరూ మెసేజ్‌ల ద్వారా బెదిరింపులకు పాల్పడటమే కాకుండా, తన ఇంటికి వచ్చి కూడా దౌర్జన్యానికి పాల్పడ్డారని, అయితే మహిళలు అయినందున వారిపై తాను ఇప్పటి వరకూ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఈ మేరకు ఎంపీ బాల్క సుమన్‌ శుక్రవారం ఓ లేఖ విడుదల చేశారు.కోదండరామ్‌పై బాల్క సుమన్ ఫైర్

Updated By ManamSat, 12/02/2017 - 19:24

balka sumanహైదరాబాద్: ప్రొఫసర్ కోదండరామ్, విపక్షాలపై టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. వారది తమ సొంత కొలువుల కోసం ఆరాటమే తప్ప...నిరుద్యోగుల గురించి కాదని వ్యాఖ్యానించారు. నిరుద్యోగుల భుజాలపైన తుపాకీ పెట్టి ప్రభుత్వాన్ని కాల్చాలని చూస్తున్నారని, వారి కల నెరవేరబోదని అన్నారు. నిరుద్యోగులు కోదండరాం ట్రాప్‌లో పడొద్దని సూచించారు. అంతర్జాతీయ సదస్సుపై విమర్శలు చేస్తున్న వాళ్ళు దద్దమ్మలని, ఇలాంటి నేతలు తెలంగాణలో ఉండటం సిగ్గు చేటన్నారు. మేధావులంతా కేటీఆర్ పనితీరును మెచ్చుకుంటున్నారని అన్నారు. రాజకీయాలుంటే ఎన్నికల్లో చూసుకుందామని..ప్రతీది రాజకీయం చేయొద్దని విపక్షాలకు హితవు పలికారు. ప్రతిపక్షాలు ఎంత ఏడ్చినా హైదరాబాద్ నెం.1 కావటం ఖాయమన్నారు.
 

Related News