whats up

‘సోషల్’ ప్రచారం

Updated By ManamMon, 09/10/2018 - 00:11
  • ఎన్నిక ల్లో కీలకం కానున్న సామాజిక మాధ్యమాలు..

  • ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసుకుంటున్న పార్టీలు

  • ఇమేజ్ పెంచుకునేందుకు నేతల ప్రయత్నాలు

  • కన్సల్టెంట్టు, స్పెషలిస్టులకు డిమాండ్

  • హద్దులు మీరితే కటకటాల పాలే!

MEIDAహైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ రద్దుతో రాజకీయ వేడి రాజుకుంది. ఎవరూ ఊహించని రీతిలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తమ పార్టీ తరఫున పోటీచేసే 105 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించడంతో పార్టీల్లో ఎన్నికల సందడి మొదలైంది. హుస్నాబాద్‌లో ప్రజా ఆశీర్వాద సభతో ఎన్నికల ప్రచారానికి తెరలేపిన కేసీఆర్‌ను ఇతర పార్టీలు, నేతలు అనుసరిస్తూండడంతో ప్రచారం ఊపందుకునే దిశగా సాగుతుంది. గత ప్రచారాల కన్నా ఈ సారి ఒక ప్రత్యేకత ఉంది. సోషల్ మీడియా కీలక పాత్ర పోషించనుంది. ఆయా పార్టీలు ప్రత్యేకంగా సోషల్ మీడియాకు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసుకోగా, కొంతమంది నేతలు తమ వ్యక్తిగత ఇమేజ్‌ను పెంచుకునేందుకు నిపుణులను నియ మించుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో ఎక్కువ ప్రభావం చూపి అధిక మొత్తంలో సీట్లు కూడా పొందే వీలుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ముమ్మర ప్రచారం..
సెల్‌ఫోన్.. ప్రస్తుత కాలంలో పరిచయం అక్కరలేని సాధనం. చిన్నపిల్లగాడి నుంచి పండు ముసలి వరకు ఈ ఫోన్ గురించి తెలియనివారుండరు. ప్రస్తుతం ఇదిఎంత ప్రభావితం చేస్తుందంటే చెప్పడం కష్టమే. వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లాంటి సోషల్ మీడియాల్లో అకౌంట్లు లేనివారిని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి మొదలుకుని రాత్రి పడుకునే వరకు అందరూ సోషల్ మీడియాలోనే మునిగిపోతున్నారు. అలాంటి సోషల్ మీడియా ఎన్నికల్లో ఎంతో ప్రాధాన్యం కానుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలకు ఇక ఆయుధంగా నిలవనుంది. వివిధ రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా తమ పార్టీ కార్యాలయంలో సోషల్ మీడియా వింగ్‌లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. అధికార టీఆర్‌ఎస్ పార్టీ అయితే తాము ఇప్పటివరకు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తోంది. ఇక ప్రతిపక్ష పార్టీల తమకు అవకాశం దొరికినప్పుడల్లా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతూనే ఉన్నాయి.  ఇప్పటికే రాష్ట్ర మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత ఇతర నేతలు ట్విటర్‌లో యాక్టివ్‌గా ఉంటు న్నారు. ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఫేస్ బుక్ లైవ్‌లో కార్యర్తలతో తమ అభిప్రాయాలను పంచుకుం టున్నారు. బీజేపీ సోషల్ మీడియా వింగ్ మాత్రం ఏకంగా పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక పోస్టింగ్‌లు పెడుతోంది.

హద్దు మీరితే అంతే సంగతులు.. 
ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాల్లో ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడతామన్నా, కామెంట్లు చేస్తామన్నా కుదరదు. భావ ప్రకటనా స్వేచ్ఛకు కూడా హద్దులు ఉన్నాయి. ఈ హద్దులు దాటి ప్రవర్తిస్తే అప్పుడు ఎవరైనా శిక్షార్హులే అవుతారు. ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తే ఐపీసీ 499, 500 సెక్షన్ల కింద కేసు పెడతారు. అలాగే ఐటీ చట్టం సెక్షన్ 66డి కింద కూడా కేసుకు అర్హులవుతారు. అవతలి వ్యక్తి అనుమతి లేకుండా ఎవరైనా వేరొకది ఫొటోను వాడినా, మార్ఫింగ్ చేసినా ఐటీ చట్టం కేసు నమోదవుతుంది. ఫొటోను వాడారు కనుక చీటింగ్ కేసు పెడతారు. మతానికి సంబంధించిన అంశం అయితే ఐటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తారు. 295 సెక్షన్ ప్రకారం కూడా కేసు పెడతారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్ అసభ్యకరమైన ఫొటో షేర్ చేస్తే ఐపీసీ సెక్షన్ 292 కింద శిక్షార్హులవుతారు. ఈ సెక్షన్ ప్రకారం అసభ్యకరమైన అంశాన్ని (వీడియో, ఫొటో, టెక్ట్స్ ఏదైనా సరే) షేర్ చేస్తే రెండేండ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. అదే ఇలాంటి పని మళ్లీ చేస్తే అప్పుడు ఏకంగా 5 ఏండ్ల పాటు జైలు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది. ఇంటర్నెట్‌లో చాలా మంది తామేం చేస్తున్నా అది ఎవరికీ తెలియద నుకుంటున్నారు. ఇంటర్నెట్‌లో ఎవరు ఏం చేసినా అది రికార్డవుతుంది. తరువాత తప్పించు కోవడం అసాధ్యం. బాధితులు ఫిర్యాదు చేస్తే పోలీసు లు, సైబర్ నిపుణులు తేలిగ్గా ట్రాక్ చేయగలుగుతారు. 

స్పెషలిస్టుల నియామకం
వివిధ పార్టీలు ప్రత్యేకంగా సోషల్ మీడియా విభాగాలు ఏర్పాటు చేసుకున్నప్పటికీ పలువురు నేతలు తమ ఇమేజ్‌ను పెంచుకోవడానికి సామాజిక మాధ్యమాల ద్వారా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. దీని కోసం ప్రత్యేకంగా సమాజంపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తులను నియమించుకుని వేతనాలు కూడా ఇస్తున్నారు. వారు ఆయా నేతల వివరాలు ఎప్పటికప్పుడు వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో పోస్ట్ చేస్తుంటారు. 2014 ఎన్నికల్లో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి సోషల్ మీడియా కీలక పాత్ర పోషించింది. బీజేపీ.. ప్రశాంత్ కిషోర్‌ను సోషల్ మీడియా ఇన్‌చార్జిగా నియమించి, పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేసి, ప్రజలకు చేరువ కావడంలో సఫలీకృతమైన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ వేర్వేరు పేర్లతో అనేక అ కౌంట్లు క్రియేట్ చేసి గొప్పలు చెప్పు కుంటూ ప్రచారం చేసిందన్న ఆరో పణలు కూడా వెల్లువెత్తాయి.వాట్సాప్ వ్యసనం.. ఆ పిల్ల మాకొద్దు!

Updated By ManamSun, 09/09/2018 - 22:38

whattsappలఖ్‌నవ్: కాబోయే కోడలుకు వాట్సాప్ వాడకం ఓ వ్యసనంగా మారిపోయిందంటూ పెళ్లి రద్దు చేసుకున్నారు వరుడి తరఫు బంధువులు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. అమ్రోహా జిల్లా నౌగాన్ సాదత్ గ్రామానికి చెందిన ఓ వధువు, తన కుటుంబీకులతో కలిసి వరుడి కోసం ఎదురుచూస్తూ కూర్చుంది. ఇంతలో వరుడి తరఫు వారు రానే వచ్చారు. అయితే ఈ పెళ్లి జరగదని తేల్చి చెప్పేశారు. దాంతో వధువు, ఆమె కుటుంబీకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.కారణమేంటని అడగ్గా.. వధువు 24 గంటలూ వాట్సాప్‌తోనే బిజీగా ఉంటోందని, అలాంటి వ్యసనం ఉన్న కోడలు వద్దని అన్నారు. దాంతో ఇరు కుటుంబాల మధ్య వాదన చోటుచేసుకుంది. వధువు తరఫు వారు పోలీసులను ఆశ్రయించారు. పెళ్లికి రూ.64 లక్షలు కట్నంగా కావాలని డిమాండ్ చేశారని అది ఇవ్వనందుకు తమ కుమార్తెపై నిందలు వేస్తున్నారని వాపోయారు. ఈ మేరకు వరుడి కుటుంబీకులను పోలీసులు విచారిస్తున్నారు. జూన్‌లో బిహార్‌లోని సరణ్ ప్రాంతంలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. పెళ్లి సమయంలో వర్షం పడుతుండగా ఉరుములు ఉరమడంతో వరుడు భయపడ్డాడు. దాంతో అతని ప్రవర్తన వింతగా ఉందంటూ వధువు పెళ్లి మానుకుని వెళ్లిపోయింది.అడ్మిన్ చేతిలో బ్రహ్మాస్త్రం

Updated By ManamSat, 12/02/2017 - 21:04

whats up, new adminవాట్సాప్..ఇది లేని ఫోన్ లేదు. ఈ ఉసు లేని మనిషి లేడు. లోకమంతా దీని మాయలో పడింది. చిటికెలో సమాచారాన్ని చేరవేసేస్తోంది. అందుకే వాట్సాప్ లేని ఫోన్ ఉండదంటే అతిసయోక్తి కాదు. దీంతో  ఎంత ఉపయోగముందో..అంతే తలనొప్పి ఉంది. గ్రూప్‌లో ఉన్న సభ్యులు అవసరం ఉన్నా, లేకున్నా లేనిపోని మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు పోస్టు చేసి మనసులు నొప్పిస్తుంటారు.
అంతేకాకుండా ఇంకో గ్రూప్‌లో వచ్చిన సమాచారం..ఈ గ్రూప్‌లోకి పంపిస్తూ చికాకు తెప్పిస్తుంటారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు అడ్మిన్ చేతికి బ్రహ్మాస్త్రం అందించేందుకు సరికొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది వాట్సాప్. ఈ కొత్త ఫీచర్‌తో గ్రూప్‌ నంతటిని అడ్మిన్ మాత్రమే ఆఫరేట్ చేయగలడు. మిగతా సభ్యులంతా డమ్మీలే. ఏదైనా పోస్టు పెట్టారంటే ముందు అడ్మిన్ పరిశీలనకు వెళ్తుంది. అతను ఆమోదం పొందాకే మెసేజ్ అందరికీ చేరుతుంది. ఇదేదో బాగుంది కదు. రాత్రనక, పగలనక ఇష్టమొచ్చినట్లు వచ్చే మెసేజ్‌లతో తలనొప్పి ఉండదు. ఇక నిశ్చంతగా పడుకోవచ్చు.

Related News