aadhar

ఆధార్.. తుస్!

Updated By ManamTue, 09/11/2018 - 22:22
  • సెక్యూరిటీ ఫీచర్లు లేకుండా ఆధార్.. కొంపముంచిన సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టలేషన్

  • క్లౌడ్ పరిజ్ఞానం వాడి ఉంటే మేలు.. రూ. 2,500కే దొరుకుతున్న ప్యాచ్

  • వేలాది వాట్సాప్ గ్రూపుల్లో లభ్యం.. ఐటీ సెక్యూరిటీ నిపుణుల ఆందోళన

aadharన్యూఢిల్లీ: ఆధార్ డేటాబేస్ ఎంతవరకు సురక్షితం అనే అంశం మరోసారి చర్చనీయాంశమైంది. మూడునెలల పాటు కొంతమంది కలిసి చేసిన పరిశోధనలతో.. అందులో ఒక సాఫ్ట్‌వేర్ ప్యాచ్ కనిపించింది. దానిద్వారా ఆధార్ గుర్తింపు డేటాబేస్‌లో నిల్వచేసిన సమాచార భద్రత ప్రమాదంలో పడింది. ఈ ప్యాచ్‌ను యూఐడీఏఐ తయారు చేయలేదు గానీ, దానివల్ల హ్యాకర్లు అనధికారికంగా ఆధార్ నంబర్లను జనరేట్ చేయచ్చని తేలింది. అందుకోసం వారు అధికారిక ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సాఫ్ట్‌వేర్‌లోని సెక్యూరిటీ ఫీచర్లను డిజేబుల్ చేయగలుగుతున్నారు. ఒకే ఒక్కసారి కేవలం రూ. 2,500 పెడితే ఆ ప్యాచ్ దొరుకుతుందని, ఇప్పటికే దేశంలో చాలామంది ఆపరేటర్లు దాన్ని వాడారని తెలుస్తోంది. త్వరలోనే ఫేస్ రికగ్నిషన్ పరిజ్ఞానాన్ని యూఐడీఏఐ ప్రవేశపెట్టాలనుకుంటున్న తరుణంలోనే ఈ ప్యాచ్ విషయం బయటపడటం విశేషం. ఇప్పటికే ఉన్న ఐరిస్, వేలిముద్రలకు తోడు ఫేషియల్ రికగ్నిషన్ అదనంగా ఉంటుంది. హఫింగ్టన్ పోస్ట్ ఇండియా ప్రతినిధులు ఈ ప్యాచ్‌కి యాక్సెస్ పొందారు, దాన్ని పలువురు ఐటీ నిపుణులతో పరీక్ష కూడా చేయించారు. ఈ ప్యాచ్ వాడే యూజర్లు బయోవెుట్రిక్ ఆథెంటికేషన్ అక్కర్లేకుండానే కొత్తవారిని ఎన్‌రోల్ చేయచ్చు. అలాగే సాఫ్ట్‌వేర్‌లో ముందుగానే ఉండే జీపీఎస్ సెక్యూరిటీ ఫీచర్‌ను కూడా ఆపేయచ్చు. దానివల్ల ఆ ఎన్‌రోల్‌మెంట్ ఎక్కడ జరుగుతోందో యూఐడీఏఐ వర్గాలకు తెలియదు. దాంతో ప్రపంచంలో ఏ మూల ఉన్నా కూడా కొత్తగా ఆధార్ నంబర్లను జనరేట్ చేయచ్చు. పైపెచ్చు, ఐరిస్ గుర్తింపు వ్యవస్థను కూడా డిజేబుల్ చేయడం ద్వారా కేవలం ఒక ఫొటో ఉపయోగించి ఆధార్ కార్డును రూపొందించవచ్చు. ఇన్ని రకాలుగా భద్రతా ప్రమాణాలన్నింటినీ ఉల్లంఘించి కొత్తగా ఆధార్ కార్డులు ఇచ్చేసేందుకు ఈ ప్యాచ్ అవకాశం కల్పిస్తుంది.

ఈ ప్యాచ్‌ని ఎవరు తయారుచేశారో గానీ, ఆధార్ భద్రతా వ్యవస్థను కొల్లగొట్టేందుకే అన్నట్లుందని యాక్సెస్ నౌ సంస్థలో చీఫ్ టెక్నాలజిస్టు గుస్తాఫ్ జోర్క్‌స్టెన్ చెప్పారు. ఈ ప్యాచ్ ఏకంగా 2017 ప్రారంభం నుంచే అందుబాటులోకి వచ్చింది. దీన్ని ఒకరి కంటే ఎక్కువమంది కోడర్లు కలిసి తయారుచేసి ఉండాలని జోర్క్‌స్టెన్ తెలిపారు. ప్రైవేటు సంస్థలు కూడా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ చేయడానికి వీలుగా 2010లో యూఐడీఏఐ ఒక సాఫ్ట్‌వేర్‌ను తయారుచేసింది. దానిపేరు ఎన్‌రోల్‌మెంట్ క్లయింట్ మల్టీ ప్లాట్‌ఫాం. దీన్ని ప్రతి కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అలాంటివారికి సాధారణంగా క్లౌడ్ ఆధారిత పరిష్కారం ఇవ్వాలి తప్ప ఇలా సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయనివ్వకూడదని జోర్క్‌స్టెన్ అన్నారు. దీనివల్లే ఆధార్ ప్రమాదంలో పడిందని తెలిపారు. ఇలాంటి సాఫ్ట్‌వేర్ ఎవరికి పడితే వాళ్లకు అందుబాటులోకి రావడంతోనే ఎవరో హ్యాకర్లు ఈ ప్యాచ్ తయారుచేయగలిగారని చెప్పారు. ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సాఫ్ట్‌వేర్ పాత వెర్షన్లలో అయితే సెక్యూరిటీ ఫీచర్లు చాలా తక్కువగా ఉంటాయి. వాటిని ఆధారంగా చేసుకునే ప్యాచ్ తయారుచేసి ఉంటారన్నది ఆయన వాదన.  కొన్ని వేల వాట్సాప్‌గ్రూపుల ద్వారా ఈ ప్యాచ్ అందరికీ అందుబాటులోకి వెళ్తోందని, రూ.2,500 చెల్లిస్తే ఎవరికైనా దొరుకుతోందని హఫింగ్టన్ పోస్ట్ ప్రతినిధులు తెలిపారు. ముందుగా కంప్యూటర్‌లో మామూలు సాఫ్ట్‌వేర్‌లాగే దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోవాలని, ఆ తర్వాత కొనిన కట్ పేస్ట్ కమాండ్ల ద్వారా జావా లైబ్రరీలను మార్చాలని తెలిపారు. ఒకసారి ఇన్‌స్టాల్ చేసుకున్నారంటే వేలిముద్రలు, జీపీఎస్, ఐరిస్ లాంటివి ఏవీ చెక్ చేయాల్సిన అవసరం లేకుండానే ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ చేసేయచ్చని వివరించారు. చివరకు ఎన్‌రోల్‌చేసేవారి వేలిముద్రలు కూడా వేయాల్సిన అవసరం లేకపోవడంతో ఒకే ఆపరేటర్ ఎన్ని మిషన్లలోనైనా ఒకేసారి లాగిన్ కావచ్చు. దీనివల్ల ఎన్‌రోల్‌మెంట్లకు అయ్యే ఖర్చు బాగా తగ్గిపోతుంది. కానీ ఎవరు పడితే వాళ్లు ఎన్‌రోల్ చేయడం వల్ల తప్పుడు సమాచారం కూడా డేటాబేస్‌లోకి వెళ్లిపోయే ప్రమాదం పొంచి ఉంటుంది.2020వరకు ఆయనే ట్రాయ్ చైర్మన్

Updated By ManamThu, 08/09/2018 - 17:08
Government reappoints RS Sharma as Trai chief

న్యూఢిల్లీ: ట్రాయ్ (టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) చైర్మన్‌గా ఆర్ఎస్ శర్మ మరోసారి నియమితులయ్యారు. ఆయనను ట్రాయ్ చైర్మన్‌గా మరో రెండేళ్ల పాటు కొనసాగించాలనే నిర్ణయాన్ని క్యాబినెట్ నియామక కమిటీ (ఎసిసి) గురువారం ఆమోదించింది. దీంతో ఆర్ఎస్ శర్మ ఈ పదవిలో  సెప్టెంబర్ 30, 2020వరకు కొనసాగుతారు. కాగా  ట్రాయ్‌ చైర్మన్‌గా ఆయన పదవీకాలం నేటితో ముగియనుంది. 2015 ఆగస్ట్‌లో తొలిసారిగా శర్మ ట్రాయ్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. 

కాగా సోషల్ మీడియాలో ఒకరు విసిరిన సవాల్‌కు స్పందిస్తూ తన వివరాలు బయటపెట్టాలని శర్మ ఆధార్‌ సంఖ్యను వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ తర్వతా ఆయన బ్యాంక్ ఖాతా వివరాలతో పాటుగా, ఈ మెయిల్ సమాచారాన్ని హ్యాకర్లు ట్వీట్ చేయగా, మరికొందరు ఆయన బ్యాంక్ ఖాతలో ఒక రూపాయి జమ చేశారు.

దీనిపై స్పందించిన ఆధార్ అధికారులు.. ఆ వివరాలు యూఐడీఏఐ నుంచి సేకరించినవి కావని స్పష్టం చేశారు. గూగుల్, ఇతర పబ్లిక్ డొమైన్ల నుంచి శర్మ వివరాలను హ్యాకర్లు సంపాదించారని పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఆధార్‌ వల్ల తన వ్యక్తిగత సమాచారమేదీ బయటికి రాలేదని, అలా వెల్లడైనట్లుగా చెబుతున్న ఆ వివరాలను ఆధార్‌ లేకుండానే తెలుసుకోవచ్చని శర్మ పేర్కొన్నారు కూడా.‘ఆధార్’ ఆధారంగా ‘పోలీస్ రాజ్యం’

Updated By ManamWed, 08/01/2018 - 02:06

Adharఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని సెక్రెటేరియట్ మొత్తం ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు కార్యాలయం వరకు  పెద్దపెద్ద గోడలతో నిర్మితమై కిటికీలు లేకుండా స్క్రీన్‌లతో నిండివుంటుంది. రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది జనాభాకు చెందిన 43 లక్షలమంది వ్యక్తిగత వివరాలన్నీ ఈ స్క్రీన్లపై కనిపిస్తూ ఉంటాయి. ఈ 43 లక్షలమంది ఇళ్ల వివరాలు సహా వారు వాడే మందులు, తీసుకునే ఆహారం, చంద్రబాబుపై సామాజిక మాధ్యమాల్లో చేసే వ్యాఖ్యలు తదితర వ్యక్తిగత వివరాలన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకునే వ్యవస్థ ఫీడ్ చేస్తుంటుంది. ఈ వ్యవస్థనే ఎప్పటికప్పుడు ‘ప్ర స్తుతం ఉన్న స్థానం తెలుసుకునే వ్యవస్థ’ (global positioning) అంటారు. ఈ వ్యవస్థ ఫీడ్ చేసే వివరాల ద్వారా ప్రతి వ్యక్తి ఎక్కడ ఎప్పుడు ఏం చేస్తున్నాడో స్పష్టంగా తెలిసిపోతుంది. ఇందుకోసం ప్రతి ఇంట్లోనూ కొన్ని కెవేురాలను (వారి ఇష్టాయిష్టాలపైనే) బిగిస్తారు. తద్వారా వారి కులం, ఉపకులం, మతం, పిల్లలు అందుకుంటున్న విద్యార్థి ఉపకారవేతనాలు, వృద్ధాప్య పించన్లు, రాష్ట్రంలో అంబులెన్స్‌ల సంచారం, వారి ఆధార్ నెంబర్ సహా ఏ అంశంలోనైనా వ్యక్తిగత వివరాలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది భద్రతా కెవేురాల ఏర్పాటు ద్వారా తెలుసుకోవచ్చు. 

‘సూర్యోదయ ఆంధ్రప్రదేశ్-2022’ (sunrise AP 2022) కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయం మేరకు, ‘ఈ-ప్రగతి’ లో భాగంగా ప్రతి ఒక్క వ్యక్తి వివరాలు ఈ స్క్రీన్‌ల ద్వారా తెలుసుకునే వీలుంది. వ్యక్తుల ఆధార్ నెంబర్ ద్వారా ప్రతి వ్యక్తి ఈ-కేవైసీని తెలుసుకునే వీలుంది. ముఖ్యమంత్రి కార్యాలయం ఎదుట ఉన్న రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ (ఆర్‌టీజీసీ)లోని కంట్రోల్ రూమ్‌లో ఏర్పాటుచేసిన డిస్‌ప్లే బోర్డులపై ఈ వ్యక్తిగత వివరాలు నమోదవుతాయి. ఈ సెంటర్‌లో ఉన్న 40 కంప్యూటర్ల ముందు కూర్చున్న వ్యక్తులు తదేకదృష్టితో ప్రభుత్వ కార్యక్రమాల అమలు, సామర్థ్యాన్ని పెంపొందించడం, వ్యర్థాలను నియంత్రిం చడం, లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందే విషయంలో నిర్వహణ తీరుతెన్నులను నిరంతరం గమనిస్తుంటారు. ఒకపక్క ఆధార్ చట్టబద్ధతపై సుప్రీంకోర్టు ఆలోచిస్తుండగా మరోపక్క శ్రీకృష్ణ కమిషన్ భారత్‌లో నిర్దిష్ట పరిధిలో వివరాల భద్రతా చర్యలు తీసుకోవాలని సూచిస్తోంది. అయినప్పటికీ సాధ్యమైనంత మంది వ్యక్తిగత వివరాలను సేకరించేందుకు రాష్ట్రప్రభుత్వాలు ఉత్సాహపడుతున్నా యి. ఈ అంశంలో డాటాబేస్ సేకరణ అంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితం కాలేదు. చాలా రాష్ట్రాలు ఇదే కార్యక్రమంలో ఉండగా ఏపీ మాత్రం సంపూర్ణంగా సఫలీకృతమైంది. ప్రజల్లో గందరగోళం, ఆందోళన, అంశంలో దాగున్న సంక్లిష్టత కలిగిన ఇలాంటి ప్రధాన అంశంపై ప్రజాభిప్రాయ సేకరణగానీ, ఇందుకు సంబంధించి చర్చలుగానీ జరగలేదు. ఆధార్ ద్వారా ఈ-కేవైసీని తెలుసుకోవడం వల్ల ప్రజలను గుర్తించవచ్చు. ఇందులో ఉన్న అసలు ప్రమాదాన్ని గుర్తించడం లేదు. ‘ఈ ప్రయత్నం అసలు ఉద్దేశానికి ఇదెంత మాత్రం సరిపోదు...’ అని న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అండ్ సెంటర్ ఫర్ డాటా సైన్స్ ప్రొఫెసర్ వసంత్ ధర్ వ్యాఖ్యానించారు. ఈ విధంగా వ్యక్తిగత వివరాల సేకరణ వల్ల ఆ వ్యక్తికి ఎలాంటి అపాయం ఉండదని స్పష్టం కావలసి ఉంటుందని ఆయన చెప్పారు. 

2016లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాసాధికార సర్వే లేదా స్మార్ట్‌పల్స్ సర్వేను నిర్వహించారు. ప్రతినిత్యం అత్యంత ఖరీదైన ఆండ్రాయిడ్‌తో కూడిన టాబ్‌ను తీసుకుని ఇంటింటికి ప్రభుత్వ సర్వేయర్లు తిరిగి వ్యక్తిగత సామాజిక ఆర్థిక వివరాలు వేలిముద్ర సహా సేకరిస్తున్నారు. ఈ వివరాలన్నింటినీ ఈ-ప్రగతి పోర్టల్‌కు అప్‌లోడ్ చేస్తారు. తరువాత ఈ వివరాలు నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరతాయి. ఇంతవరకు 43 లక్షల మంది వివరాలు ఈ- ప్రగతిలో నిక్షిప్తమై ఉన్నాయి. అందులో 33 లక్షల మంది ఆధార్ ఆధారిత ఈకేవైసీ వివరాల పరిశీలన పూర్తయింది. దీనిపై స్పందించేందుకు సీనియర్ అధికారులు అందుబాటులో లేరు. క్షేత్రస్థాయిలో (internet of things) పరికరాల ద్వారా సేకరించిన భూగర్భ జలాల స్థితి, ఉష్ణోగ్రతల వివరాలు, విద్య, లైటింగ్, మరెన్నో అంశాల వివరాలు వివిధ శాఖల నుంచి సేకరించినవి మా వద్ద ఉన్నా’యని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ అధికారులు తెలిపారు. పగటిపూట వీధిలైట్లు వెలుగుతున్న సంగతి కూడా మాకు తెలిసిపోతుందని వారు చెప్పారు. పారదర్శకత, వ్యక్తిగతగోప్యత హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని సెంటర్ ఫర్ ఇంటర్‌నెట్ అండ్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సునీల్ అబ్రహాం అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కశాఖా ఆన్‌లైన్ డాష్‌బోర్డులు రూపొందించుకోవలసిన అవసరాన్ని ఆయన ప్రశ్నించారు. దీనివల్ల వ్యక్తిగత వివరాలను తెలుసుకోవడం ఏ అధికారికైనా చాలా సులువని ఆయన అన్నారు. ఇటీవలి కాలంలో ఈ డాష్‌బోర్టులు ప్రజల కోసం తెరిచే ఉంటున్నాయి. ఇది భద్రతకు ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికి ఈ విధానంలో నాలుగువేల కెవెురాలు పనిచేస్తున్నాయి. త్వరలో మరో 20వేల కెవేురాలను ఏ ర్పాటు చేయనున్నామని ఇంజినీర్లు తెలిపారు. ప్రస్తుతం తాము నే రసంబంధిత సమాచారాన్ని అనుసంధానం చేస్తున్నామని వారు చెప్పారు. ఇవన్నీ కేవలం నిపుణుల పర్యవేక్షణలోనే పనిచేయడం లేదు. ప్రైవేట్ వ్యక్తులు ఇళ్లల్లో సెలవు రోజుల్లో పర్యవేక్షించేందుకు పోలీసు శాఖ కెవెురాలను లాక్‌డ్ హౌస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఇవి వాస్తవానికి ప్రోగ్రామ్ కార్యక్రమం ద్వారా బిగిస్తున్నారు. ‘సెలవులకు ఎక్కడికైనా వెళ్తుంటే ఆ విషయాన్ని ఫోన్ ద్వారా తెలియజేస్తే వా ళ్ళే కెవెురాలను ఆయా ఇళ్లల్లో ఏర్పాటుచేస్తారని ఇంజినీర్ ఒకరు తెలిపారు. ఇవి రాత్రులందు కూడా పనిచేస్తాయని, ఇంటి యుజమాని లేనపుడు ఎవరైనా ఇంట్లోకి ప్రవేశిస్తే ఆ సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తుందని ఆయన చెప్పారు. 4.5 కోట్ల మంది వ్యక్తిగత వివరాలు ప్రస్తుతం ప్రభుత్వ నిఘాలో ఉన్నాయి. ఆధార్ వివరాల అంశంలో రోజుకు 30 వేల బెదిరింపులు వస్తున్నాయి. వ్యక్తిగత వివరాలుతెరిచిన పుస్తకంలా ఉండడం వల్ల ఏ విధమైన అనర్థాలు ఎదురవుతాయోనని పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 
గోపాల్ సాథె,
హఫింగ్‌టన్ పోస్టు టెక్నికల్ ఎడిటర్ ఇకపై ఆస్తులకూ ఆధార్!

Updated By ManamMon, 05/14/2018 - 01:08
  • మునిసిపాలిటీల్లో అనుసంధానం.. వేగవంతం చేయాలని ఆదేశాలు

  • తద్వారా అక్రమ ఆస్తులకు చెక్... ప్రతి నెలా ఆస్తి పన్నుల సవరణ

  • నిర్మాణం పూర్తయిన 30 రోజుల్లో.. పన్నుపరిధిలోకి తెచ్చేందుకు కార్యాచరణ

aadharహైదరాబాద్: ఓవైపు వివిధ సంక్షేమ పథకాలకు ‘ఆధార్’ అనుసంధానంపై చర్చ నడు స్తోంది. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా మునిసిపాలిటీల్లోని ప్రైవేట్ ఆస్తులకు ఆధార్‌తో అనుసంధానించడం ప్రభుత్వం తప్పనిసరి చేసింది.  పన్ను చెల్లించే ప్రతిఆస్తికీ ఆధార్‌ను అనుసంధానం చేసే పనిని వేగవం తం చేయాలని పురపాలకశాఖ రాష్ట్రం లోని మునిసిపాలిటీలకు ఆదేశాలు జారీ చేసింది. 
ఆస్తులకు  ఆధార్‌ను అనుసంధానం చేసే విషయమై గతంలోనే ఆదేశాలున్నా పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. గతంలో రాష్ట్రంలోని పలు మునిసిపాలిటీల్లో ఇంటింటి సర్వే నిర్వహించిన దాఖలాలున్నాయి. ప్రస్తుతం సీడీఎంఎ ఆదేశాలతో ఆధార్ అనుసంధానంపై మున్సిపల్ అధికారులు దృష్టి సారించనున్నారు. ఆధార్ అనుసంధానంతో అక్రమాలకు అడ్డుకట్టపడే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఆధార్ అనుసంధానం పూర్తి అయిన తర్వాత ఎవరి పేరుమీద ఎన్ని ఆస్తులున్నాయి, అక్రమంగా సంపాదించిన ఆస్తుల వివరాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఆధార్‌తో పాటు సెల్‌ఫోన్ నెంబర్లను అనుసంధానించే విధంగా అధికారులు కసరత్తు చేపట్టారు.

ఇక ప్రతి నెలా ఆస్తిపన్ను..
రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో ఇకపై ప్రతి నెలా ఆస్తిపన్ను సవరణలు చేసే విధంగా మునిసిపాలిటీలు పురపాలకశాఖ ఆదేశించింది. కొత్తగా నిర్మించిన, పునర్నిర్మాణం చేసిన, విస్తరించిన కట్టడాలను ఎప్పటికప్పుడు పన్ను పరిధిలోకి తీసుకు వచ్చేందుకు మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. భవనాల నిర్మాణాలు పూర్తి అయిన 30 రోజుల్లో, గృహనిర్మాణం చేసిన మరుక్షణం నుంచి వాటిని పన్ను పరిధిలోకి తీసుకువచ్చే విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలని పురపాలక శాఖ మునిసిపాలిటీలకు సూచించింది. పన్ను సవరణల కోసం బిల్ కలెక్టర్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు క్షేత్రస్థాయిలో పనిచేసే ఇతర సిబ్బందిని ప్రత్యేకంగా నియమించుకోవాలని సూచించింది. మునిపాలిటీల్లో  కొత్తగా ఏర్పాటు కానున్న 68 మునిసిపాలిటీల పరిధిలో వసూలు చేస్తున్న ఆస్తిపన్నుల వివరాలను ఆయా గ్రామపంచాయతీల నుంచి పురపాలక శాఖ పన్నుల విభాగం ముందస్తుగా సేకరించాల్సి ఉంది. 72 మునిసిపాలిటీల్లో  ఉన్న ఆస్తులను జీఐఎస్ పరిజ్ఞానంతో మ్యాపింగ్ చేసి ఆస్తిపన్నుల జాబితాలో ఆస్తుల సమాచారాన్ని పోల్చి చూడగా 50శాతం తక్కువగా పన్నులు వసూలైనట్లుగా వెల్లడైంది. దీంతో ఈ నెల 15లోగా ఆస్తి పన్నుల జాబితాను సవరించాలని మున్సిపల్ అధికారులను పురపాలకశాఖ ఆదేశించింది. ఆస్తిపన్నుల సవరణలపై వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించింది. అనుమతి లేకుండా నిర్మించిన ప్రైవేటు, ప్రభుత్వ, వక్ఫ్, దేవాదాయ, ఇతర భూములను కబ్జా చేసి నిర్మించిన భవనాలపై అదనంగా వందశాతం ఆస్తి పన్నును జరిమానాగా విధించాలని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. పన్నుల డిమాండ్ నోటీస్‌లో భవనం యజమాని పేరుకు బదులు భవనాన్ని ఆధీనంలో పెట్టుకున్న వ్యక్తి పేరు రాయాలని మున్సిపల్ అధికారులకు  పురపాలకశాఖ సూచించింది.ఆధార్ ఉంటేనే రైల్వే టికెట్!

Updated By ManamTue, 05/08/2018 - 23:21
  • రైల్వే శాఖ యోచన

aadharన్యూఢిల్లీ: రైలు టికెట్లు బుక్ చేస్తున్నారా..? అయితే మీ దగ్గర ఆధార్ కార్డు ఉండాల్సిందే.. ఎందుకంటే ఇకపై రైల్వే టికెట్ల బుకింగ్‌కు ఆధార్ కార్డు తప్పనిసరి చేసే అవకాశాలు కన్నిస్తున్నాయి. ఇటీవల రైల్వేశాఖకు అందిన ఓ నివేదికలో ఈ మేరకు సిఫార్సులు చేశారు. ఈ సిఫార్సులను పరిశీలిస్తున్న రైల్వేశాఖ టికెట్ బుకింగ్‌కు ఆధార్‌కార్డును తప్పనిసరి చేయాలనే యోచనలో ఉన్నట్లు సమచారం. ఇటీవల ముంబైలో రైల్వే టికెట్ల రాకెట్ గుట్టు బయటపడింది. దీనిపై విచారణ చేపట్టిన రైల్వే అధికారులు సల్మాన్‌ఖాన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతడి నుంచి దాదాపు రూ. 1.5కోట్ల విలువ గల ఈ-రైల్వే టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో సల్మాన్‌ను విచారించేందుకు సెంటర్ ఫర్ ఇన్ఫర్మేషన్ రైల్వే సిస్టమ్(సీఆర్‌ఐఎస్) నుంచి కొందరు సీనియర్ అధికారులు సోమవారం ముంబైకి వచ్చారు.సల్మాన్‌ను విచారించిన అనంతరం సీఆర్‌ఐఎస్, ఐఆర్‌సీటీసీ సాంకేతిక నిపుణులు సంయుక్తంగా ఓ నివేదిక తయారుచేశారు. ఇందులో టికెట్ల రాకెట్‌ను అడ్డుకునేందుకు కొన్ని సిఫార్సులు చేశారు. ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట వేయాలంటే ప్రయాణికుల యూజర్ ఐడీలను వారి ఆధార్ కార్డులతో అనుసంధానం చేయాలని నివేదికలో పేర్కొన్నారు. అంతేగాక..ప్రయాణికుల మొబైల్‌ఫోన్‌కు ఓటీపీ వచ్చేలా సిస్టమ్‌ను మార్చాలని ప్రతిపాదించారు. ఈ నివేదికను రైల్వేశాఖకు అందించారు. ప్రస్తుతం ఈ సిఫార్సులను రైల్వే ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. వీటిని అమలు చేయాలనే యోచనలో రైల్వేశాఖ ఉన్నట్లు తెలుస్తోందిఆధార్ లీక్‌తో.. ప్రజాస్వామ్యమే ప్రశ్నార్థకం

Updated By ManamWed, 04/18/2018 - 06:12
  • ఎన్నికల ఫలితాలపై ప్రభావం.. సమాచార భద్రతకు చర్యలేవి?

  • భద్రతా ప్రమాణాలు తెలపండి.. ఇది మరో ఫేస్‌బుక్ ఉదంతం కాదా

  • నమోదు సంస్థల మాటేమిటి?.. యూఐడీఏఐను నిలదీసిన సుప్రీం

aadharన్యూఢిల్లీ: ఆధార్ సమాచారం లీక్ ఎన్నికల ఫలితాలను ప్రభావితంచేసే ప్రమాదం ఉందని భారత అత్యున్నత న్యాయస్థానం మంగళవారం పేర్కొంది. ఫేస్‌బుక్ డేటా లీక్ ఉదంతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారంలో 1.3 బిలియన్ల భారతీయుల సమాచారం కూడా లీక్ కావడం ఆందోళనకరమని పేర్కొంటూ.. అదే సమయంలో ఆధార్ సమాచారం లీకేజీ వ్యవహారం భారత్‌లో జరిగే ఎన్నికలలో ప్రభావం చూపే ప్రమాదం ఉందని తెలిపింది. ఈ వ్యవహారంపై ఆధార్ నిర్వహణ సంస్థ యూఐడీఏ ఐ స్పందిస్తూ.. ఆధార్ సమాచా రమేమీ అణుబాంబు కాదని వ్యాఖ్యానించడాన్ని కోర్టు తప్పు బట్టింది. ఈ మొత్తం వ్యవహారంలో ఆధార్ సమాచారం దేశ ఎన్నికల ఫలితాలను తారుమారుచేసే ప్రమాదం పొంచి ఉండడం ఆందోళనకరమని, ఒకవేళ అదే జరిగితే దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగించగలదా అని జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రశ్నించారు. ఈమేరకు ఆధార్ విశ్వసనీయత, కార్డుదారుల నుంచి సేకరించిన వ్యక్తిగత సమాచారం భద్రత తదితర అంశాలకు సంబంధించి దాఖలైన 27 పిటిషన్లను జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారిస్తోంది.

ఫేస్‌బుక్ ఉదంతంతో..
కొంతకాలంగా ఆధార్ భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే! ఫేస్‌బుక్ ఖాతాదారుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి కేంబ్రిడ్జి ఎనలిటికా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు అనుకూలంగా వ్యవహరించింది. ఈ వ్యవహారం బట్టబయలు అయ్యాక ఆధార్ వివరాల భద్రతపై సందేహాల తీవ్రత మరింత పెరిగిపోయింది. దీంతోపాటు కేంబ్రిడ్జి ఎనలిటికా సేవలు మీరు ఉపయోగిం చుకున్నారంటే మీరే వాడుకున్నారని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పరస్పరం ఆరోపించుకోవడమే! ఈ నేపథ్యంలో ఆధార్ సమాచార భద్రతకు మీరు తీసుకున్న చర్యలేం టని సుప్రీం ధర్మాసనం యూఐడీఏఐని ప్రశ్నించింది. సమస్యలన్నీ ముందుగా తగు హెచ్చరికలతో రావని, అనుకోకుండా ఒకేసారి వచ్చి మీదపడే ప్రమాదం పొంచి ఉందని బెంచ్ వ్యాఖ్యానించింది. వ్యక్తిగత సమాచార రక్షణకు సంబంధించిన చట్టాన్ని అనుసరించి ఆధార్ వివరాల పరిరక్షణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారని ప్రశ్నించింది. డాటా లీకేజ్ వ్యవహారాలలో జరుగుతున్న అనర్థాలను తేలిగ్గా తీసుకోలేమని, భవిష్యత్తునూ ప్రభావితం చేయనున్న చట్టాలను రూపొందించే ప్రయత్నం జరుపుతున్నట్లు బెంచ్ పేర్కొంది.

లీక్ సాధ్యం కాదు.. యూఐడీఏఐ
బయోమెట్రిక్ ద్వారా సేకరించిన సమాచారాన్ని ఆధార్ నమోదు సంస్థలు దుర్వినియోగపరిచే ప్రమాదం ఉందికదా అంటూ బెంచ్ సందేహం వ్యక్తంచేసింది. అయితే, ఒకసారి సమాచారం సేకరించాక అంతా ఎన్‌క్రిప్టెడ్ రూపంలోకి మారిపోతుందని, తర్వాత ఆ వివరాలను ఇతరత్రా ఉపయోగించుకోవడం సాధ్యం కాదని యూఐడీఏఐ తెలిపింది. ఈమేరకు యూఐడీఏఐ తరఫున సీనియర్ లాయర్ రాకేష్ ద్వివేదీ ధర్మాసనానికి జవాబిచ్చారు. పిటిషన్‌దారులు ఆధార్‌కు ప్రత్యామ్నాయంగా స్మార్ట్ కార్డులను సూచించారని ద్వివేదీ కోర్టుకు తెలిపారు. ఆధార్ ప్రాజెక్టు విజయంతం కావడం గూగుల్ లాంటి సంస్థలకు ఆమోదయోగ్యం కాదని.. ఆయా సంస్థలకు అనుకూలంగానే ఈ పిటిషన్లు దాఖలయ్యాయని ద్వివేదీ వివరించారు.ఇంట్రస్టింగ్: పోర్న్‌ను దాటేసిన ఆధార్!

Updated By ManamMon, 03/19/2018 - 17:26

aadharనీలిచిత్రాలను వీక్షించే వారు ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉంటారు. ఇంటర్నెట్‌లో ఎక్కువగా శోధించే విషయాల్లో పోర్న్ ముందు వరుసలో ఉంటుంది. అయితే భారతీయులు మాత్రం ఇప్పుడు పోర్న్ వెబ్‌సైట్ కంటే ఆధార్ వెబ్‌సైట్ గురించే ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారట. వెబ్‌సైట్ స్టాటిస్టిక్స్ సంస్థ అలెక్సాలో ఈ విషయం వెల్లడైంది. భారతదేశంలో ఎక్కువ మంది పోర్న్ చూసేందుకు సెర్చ్ చేసే ఓ వెబ్‌సైట్ కంటే యూఐడీఏఐ వెబ్‌సైట్ ముందు వరుసలో ఉందట. ఆ పోర్న్ వెబ్‌సైట్ మోస్ట్ సెర్చింగ్ లిస్ట్‌లో 16వ స్థానంలో ఉంటే, ఆధార్ వెబ్‌సైట్ 15వ స్థానంలో ఉండటం విశేషం. అయితే దీనికి కారణం లేకపోలేదు. ఆధార్ కార్డును మొబైల్ నంబర్‌కు, బ్యాంకు సేవలకు అనుసంధానం చేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఎక్కువ మంది వివరాల కోసం ఆధార్ గురించి శోధించారు. అయితే పోర్న్ వెబ్‌సైట్‌ను వీక్షించే సమయంతో పోలిస్తే ఆధార్ వెబ్‌సైట్‌ను వీక్షించిన సమయం తక్కువనే చెప్పక తప్పదు. ప్రపంచంలోనే పోర్న్ ఎక్కువగా వీక్షించే దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. భారత్‌లో పోర్న్ చూసేందుకు సెర్చ్ చేస్తున్న ఓ వెబ్‌‌సైట్ వర్డ్‌వైడ్ అలెక్సా ర్యాంకింగ్స్‌లో 38వ స్థానంలో ఉంది.87 కోట్ల బ్యాంకు ఖాతాలు ఆధార్‌తో లింకు

Updated By ManamMon, 03/05/2018 - 00:57


aadharన్యూఢిల్లీ: ఇప్పటివరకు 80 శాతం బ్యాంకు ఖాతాలు, 60 శాతం మొబైల్ కనెక్షన్స్ ఆధార్‌తో అనుసంధానమయ్యాయని యూఐడీఏఐ సీనియర్ అధికారి ఆదివారం వెల్లడించారు. లెక్కలో లేని నల్లధనాన్ని వెలికితీసే ఉద్దేశంతో మార్చి 31, 2018 నాటికి ప్రతి బ్యాంకు ఖాతాదారుడు 12 నెంబర్లు కలిగిన ఆధార్ సమర్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉద్దేశంతోనే పాన్‌కార్డును కూడా జతచేయాలని పేర్కొంది. మొబైల్ ఫోన్ వినియోగదారుల గుర్తింపు కోసం ఈ మార్చి 31 కల్లా మొబైల్ నంబర్లను ఆధార్‌తో తప్పనిసరిగా అనుసంధానించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొందాలంటే కొన్నింటికి ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేయడానికి సుప్రీంకోర్టు సైతం సుముఖంగా ఉంది. ఆ దిశలో పాన్ కార్డులకు, మొబైల్ సిమ్ కార్డులకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేశారు. ఇప్పుడు బ్యాంకు ఖాతాల విషయంలో పనులు చాలా వేగంగా సాగుతున్నాయి. దేశ వ్యాప్తంగా మొత్తం 109.9 కోట్ల బ్యాంకు ఖాతాలుంటే అందులో 87 కోట్ల ఖాతాలు ఆధార్ సంఖ్యతో అనుసంధానం అయినట్లుగా యూఐడీఏఐ అధికారి చెప్పారు. ఇందులో 58 కోట్ల ఖాతాలకు సంబంధించి వెరిఫికేషన్ పూర్తికాగా మిగిలిన ఖాతాల విషయంలో బ్యాంకులకు పత్రాలు అందగా, వాటిని బ్యాంకు ఖాతా వివరాలతో అధికారులు సరిపోల్చి చూసే ప్రక్రియ సాగుతోందని ఆ అధికారి తెలిపారు.రైల్వే బుకింగ్‌కు 'ఆధార్' అక్కర్లేదు

Updated By ManamThu, 01/04/2018 - 07:54

Railwayన్యూఢిల్లీ: రైలు టికెట్ల బుకింగ్ విషయంలో ప్రయాణికులకు కాస్త ఊరట లభించింది. టికెట్ బుకింగ్‌కు ఆధార్ తప్పనిసరి కాదని రైల్వే శాఖ సహాయ మంత్రి రాజెన్ గోహైన్ తెలిపారు. లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన ఈ ప్రకటన చేశారు. టికెట్ల బుకింగ్ సమయంలో ఆధార్ తప్పనిసరి కాదని ఆయన స్పష్టం చేశారు. అయితే రాయితీపై వృద్ధులకు జారీ చేస్తున్న టికెట్లకు మాత్రం ఆధార్ నంబర్ ఇవ్వాలనే ప్రతిపాదనను గతేడాది జనవరిలో ప్రవేశపెట్టినట్టు తెలిపారు. 
 2018-ఆధార్ నామ సంవత్సరం!!

Updated By ManamSat, 12/30/2017 - 13:51

Aadharఆధార్‌కు సంబంధించినంత వరకు కొత్త సంవత్సరం (2018) అత్యంత కీలకంకానుంది. ప్రజల జీవితాలతో విడదీయలేని మరింత బంధాన్ని ఆధార్ పెనవేసుకోనుంది.  పలు ప్రభుత్వ సేవలకు సంబంధించి ఆధార్ అనుసంధానం విషయంలో 2017లో పలు వివాదాలు, గందరగోళాలు నెలకొన్నాయి. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో పలు పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది. పౌరుల ప్రైవసీకి విఘాతం కలిగించే ఆధార్‌ను ప్రభుత్వ సేవలకు తప్పనిసరి చేయడం సరికాదన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈ మేరకు దాఖలైన పలు పిటిషన్లపై 2018లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. 

బ్యాంకు అకౌంట్లు, మొబైల్ ఫోన్లు, పాన్ నెంబర్లకు ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై 2018 మార్చి 31న సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించనుంది. ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తే...డిజిటల్ ఇండియా దిశగా ఓ గొప్ప ముందడుగు పడే అవకాశం ఉంది. ప్రభుత్వ పథకాలన్నిటికీ ఆధార్ తప్పనిసరిగా మారనుంది. ఆ రకంగా ప్రభుత్వ పథకాలకు ఆధారే మూలం కారణం కానుంది. నేర విచారణలోనూ ఆధార్‌లోని వేలిముద్రలు వంటి వివరాలు పోలీసుల చేతిలో కీలక ఆయుధాలుగా మారనున్నాయి. 

aadharప్రైవేటు రంగంలోనూ ఆధార్ వివరాలను విరివిరిగా వినియోగించుకోనున్నారు. ఇప్పటికే పలు ఉద్యోగ నియామక సంస్థలు అభ్యర్థుల నుంచి ఆధార్ వివరాలను తీసుకుంటున్నాయి. కొత్తగా అకౌంట్ తెరిచేందుకు ఆధార్‌లో ఉన్నట్లు పేరు ఇవ్వాలని ఫేస్‌బుక్ సంస్థ కోరడం తెలిసిందే. దేశంలోని అతిపెద్ద ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ ఇప్పటికే కొన్ని సేవలకు సంబంధించి వినియోగదారుల ఆధార్ వివరాలు కోరుతోంది. అటు బెంగుళూరుకు చెందిన క్యాబ్ రెంటల్ సంస్థ-జూమ్‌కార్ ఆధార్ ప్రూఫ్ చూపనిదే బుకింగ్స్ స్వీకరించడం లేదు. 

ఇలా 2018లో ఆధార్‌ను పలు ప్రైవేటు సంస్థలు కూడా తమ సేవలు పొందాలంటే వినియోగదారులు ఆధార్ వివరాలు సమర్పించడం తప్పనిసరి చేయనున్నాయి. ఆ రకంగా ఎవరికి నచ్చినా...నచ్చకపోయినా...2018 ఆధార్ నామ సంవత్సరం కావడం ఖాయమన్న భావన వ్యక్తమవుతోంది. 

Related News