bunny vas

75కోట్ల క్లబ్‌లో ‘గీత గోవిందం’

Updated By ManamFri, 08/24/2018 - 09:24

Geetha Govindamవిజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా పరశురామ్ తెరకెక్కించిన చిత్రం ‘గీత గోవిందం’. ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకొని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం 75కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా తెలిపింది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కేరళ, తమిళనాడుతో పాటు ఆస్ట్రేలియా, యూఎస్‌లో ఈ చిత్రం తన హవాను కొనసాగిస్తోంది. ఇప్పటికే 75కోట్ల క్లబ్‌లో చేరిందంటే ఇక ఫుల్‌రన్‌లో ఈ చిత్రం మరెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. కాగా రొటీన్ స్టోరీ అయినప్పటికీ పరశురామ్ తెరకెక్కించిన తీరు, నటీనటుల సహజ నటన, గోపి సుందర్ మ్యూజిక్ ఈ చిత్రానికి మెయిన్ అస్సెట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.



గీత గోవిందంపై దర్శకధీరుడి ప్రశంసలు

Updated By ManamThu, 08/16/2018 - 09:21

Rajamouli, Geetha Govindamవిజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా పరశురామ్ తెరకెక్కించిన చిత్రం ‘గీత గోవిందం’. స్వాతంత్ర్యదినోత్సవం కానుకగా బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో థియేటర్లో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని చూసిన దర్శకధీరుడు రాజమౌళి మూవీ యూనిట్‌పై ప్రశంసలు కురిపించారు.

‘‘గీత గోవిందం ఓ నవ్వుల ప్రవాహం. విజయ్ దేవరకొండ పాత్రను ఇలా ఊహించలేదు. అర్జున్ రెడ్డి తరువాత అతడి పాత్ర ఎంపిక బావుంది. ఏం చేస్తున్నాడో అతడికి బాగా స్పష్టంగా తెలుసు. సినిమా మొత్తం నవ్వులు పూయించింది. పరశురామ్ చిత్రాన్ని బాగా రచించి, దర్శకత్వం వహించారు. రాహుల్ రామకృష్ణ, అన్నపూర్ణమ్మ గారు, వెన్నల కిశోర్.. చాలా బాగా చేశారు. చిత్ర యూనిట్ మొత్తానికి కంగ్రాట్స్’’ అంటూ ప్రశంసలు కురిపించాడు. దీనిపై స్పందించిన విజయ్ దేవరకొండ.. ‘‘మీ దగ్గర నుంచి ప్రశంసలు పొందడం ఎప్పటికైనా స్పెషల్’’ అంటూ కామెంట్ ఇచ్చాడు.

 



‘గీత గోవిందం’ రివ్యూ

Updated By ManamWed, 08/15/2018 - 13:21
Geetha Govindam

హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన‌ `పెళ్లిచూపులు`, `అర్జున్ రెడ్డి` సినిమాల త‌ర్వాత రిలీజ్‌కి ముందు ఆ రేంజ్‌లో ప‌బ్లిసిటీ వ‌చ్చిన సినిమా `గీత గోవిందం`. తొలి సినిమా `చ‌లో`తో గోల్డెన్ లెగ్‌గా పేరు తెచ్చుకున్న ర‌ష్మిక మండ‌న్న ఇందులో హీరోయిన్‌. వీరిద్ద‌రు క‌లిసి క‌నిపించిన `ఇంకేం ఇంకేం కావాలే` సాంగ్ సూప‌ర్ హిట్‌. సినిమా రిలీజ్‌కి ముందు పైర‌సీ అయి కొన్ని సీన్లు లీక‌య్యాయి. ఇవ‌న్నీ ఎక్స్ పెక్టేష‌న్స్ ని భారీగా పెంచాయి. సినిమా వాటికి ధీటుగా ఉంటుందా? ఆల‌స్య‌మెందుకు.. రివ్యూ చ‌దివేయండి. 

బ్యాన‌ర్‌:  జిఎ2 పిక్చ‌ర్స్
తారాగ‌ణం: విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మందాన్న, నాగ‌బాబు, సుబ్బ‌రాజు, వెన్నెల కిషోర్‌,  రాహుల్ రామ‌కృష్ణ‌, గిరిబాబు, అన్న‌పూర్ణ‌మ్మ‌, మౌర్యాని, సుభాష్‌, అభ‌య్‌, స్వ‌ప్న‌క‌, స‌త్యం రాజేష్‌, దువ్వాసి మెహ‌న్‌, గుండు సుద‌ర్శ‌న్‌, గౌతంరాజు, అనీష‌, క‌ళ్యాణి న‌ట‌రాజ‌న్‌, సంధ్య జ‌న‌క్ త‌దిత‌రులు...
మ్యూజిక్‌: గోపిసుంద‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ: మ‌ణికంద‌న్‌
ఎడిట‌ర్‌: మార్తాండ్‌.కె.వెంక‌టేష్
ఆర్ట్‌: ర‌మ‌ణ వంక‌
ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌: స‌త్య గ‌మిడి
లిరిక్స్‌: అనంత్ శ్రీరామ్‌, శ్రీమ‌ణి, 
ప్రెజెంట్స్: అల్లు అర‌వింద్‌
ప్రొడ్యూస‌ర్‌: బ‌న్నివాసు
స్టోరీ-స్క్రీన్‌ప్లే-డైలాగ్స్-డైర‌క్ష‌న్‌: ప‌రశురామ్‌
విడుద‌ల తేదీ: 15.08.2018

క‌థ‌
విజ‌య్ గోవింద్ (విజ‌య్ దేవ‌ర‌కొండ) ప్రైవేట్ ఇంజ‌నీరింగ్ కాలేజీలో లెక్చ‌ర‌ర్‌. గీత (ర‌ష్మిక‌) సాఫ్ట్ వేర్ ఎంప్లాయీ. గీత కంపెనీ ఓన‌ర్ కూతురు నీలు కి విజ‌య్ అంటే ఇష్టం. అత‌న్ని పెళ్లి చేసుకోవాల‌ని క‌ల‌లు కంటుంది. త‌న చెల్లెలి నిశ్చితార్థం కోసం ప‌ల్లెటూరికి వెళ్తాడు విజ‌య్‌. బ‌స్సులో అత‌ని ప‌క్క సీట్లో గీత ట్రావెల్ చేస్తుంది. అనుకోకుండా ఆమెతో అత‌నికి లిప్ లాక్ అవుతుంది. త‌న త‌ప్పేం లేద‌ని చాలా మొత్తుకుంటాడు విజ‌య్‌.

అత‌ని మాట విన‌కుండా త‌న అన్న‌య్య‌కు ఫోన్ చేసి విష‌యం చెబుతుంది. అత‌న్ని చంపేయాల‌ని తిరుగుతుంటాడు ఆమె అన్న‌య్య (సుబ్బ‌రాజు). అయినా అనుకోని ప‌రిస్థితుల కార‌ణంగా గీత‌, విజ‌య్ క‌లిసి తిరగాల్సి వ‌స్తుంది. దీని వ‌ల్ల ఏమైంది?  విజ‌య్ చెల్లెలి పెళ్లి సంగ‌తేంటి?  గీత అన్న‌య్య విజ‌య్ మీద ప‌గ పెంచుకున్నాడా? అతనికి ఇత‌నిపై ఎలాంటి అభిప్రాయం ఉంది? వ‌ంటివ‌న్నీ ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు. 

geeta govindam

స‌మీక్ష‌
ప్ర‌తి వ్య‌క్తికీ పెళ్లి ఒక క‌ల‌. చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలి?  చేసుకున్నాక ఎలా చూసుకోవాలి.. వంటివ‌న్నీ అబ్బాయిల జేబుల్లో లిస్ట్ అయి రెడీగా ఉంటుంది. ఈ సినిమాలో విజ‌య్ పాత్ర కూడా అలాంటిదే. చిన్న‌ప్పుడే త‌ల్లిని పోగొట్టుకుని, క‌నుసైగ‌ల్లో అర్థం చేసుకునే భార్య రావాల‌ని కోరుకుంటుంటాడు. తొలి చూపులోనే గీతతో ప్రేమ‌లో ప‌డ‌తాడు. అనుకోని పొర‌పాటు వ‌ల్ల త‌న ప్రేమ‌ను వ్య‌క్తం చేసే సంద‌ర్భం అత‌నికి రాదు.

త‌న మ‌న‌సులోని మాట‌ను తీరా అవ‌త‌లి వ్య‌క్తి చెప్పే సంద‌ర్భ‌మే ఎదురైనా తృణీక‌రిస్తాడు. త‌ర్వాత త‌ప్పు తెలుసుకుని బాధ‌ప‌డ‌తాడు. బావ‌ను కాళ్లావేళ్లా ప‌డి త‌ను అనుకున్న‌ది సాధిస్తాడు. ఇదంతా ఏంటి? అంటే కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుల‌తో వ్య‌క్తులు చేసే యుద్ధ‌మే. క్లిష్ట‌మైన ప‌రిస్థితుల‌ను త‌మ‌కు తాము సృష్టించుకుంటున్న ప‌లువురు యువ‌త‌కు నిద‌ర్శ‌నం విజ‌య్ పాత్ర‌. గీత పాత్ర కూడా నేటి స‌మాజానికి అద్దం ప‌టే పాత్రే. ఈ పాత్ర‌ల చుట్టూ ద‌ర్శ‌కుడు క‌థ అల్లుకున్నారు.

అయితే సీన్లు కాసింత కొత్త‌గా రాసుకుని ఉంటే బావుండేది. భావోద్వేగాల్లో ఇంకాస్త ప‌దును చూపించి ఉంటే స‌రిపోయేది. ముందే హిట్ట‌యిన పాట‌ల ఊపు సినిమాకు ప‌నికొచ్చింది. ఎన్న‌డూ లేనంత‌మంది యువ‌త‌ను థియేట‌ర్ల వైపు తీసుకొచ్చింది. ప్రారంభ‌పు వ‌సూళ్ల‌ను పిచ్చ‌గా రాబ‌ట్టింది. సినిమా యువ‌త‌కు న‌చ్చుతుంది. స‌కుటుంబంగా చూసేలా ఉంది. విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాకు ప్ల‌స్‌.

ర‌ష్మిక కూడా ప్ల‌స్సే. .. కాక‌పోతే క్లైమాక్స్ లో ఏడ‌వ‌డం స‌రిగా రాలేదు. ఆమె ఏడుస్తున్నా.. చిత్రమేంటో న‌వ్వుతున్న‌ట్టే అనిపించింది. అన్న‌పూర్ణ‌మ్మ‌, వెన్నెల కిశోర్ కామెడీ బావుంది. నాగ‌బాబుకు గొంతు అరువిచ్చారు. అయితే అదేదో కృత్తిమంగా అనిపించింది. సుబ్బ‌రాజుకు చాన్నాళ్ల త‌ర్వాత మంచి పాత్ర ప‌డింది. ద‌ర్శ‌కుడు సినిమాను చ‌క్క‌గా తీసినా, ఆయ‌న గ‌త సినిమాల్లో ఉన్న సెంటిమెంట్ స‌న్నివేశాలు, ప‌దునైన డైలాగులు ఇందులో అంత‌గా క‌నిపించ‌లేదు.

ప్ల‌స్ పాయింట్లు
- పాట‌లు
- న‌టీన‌టులు
- కామెడీ
- కెమెరా

మైన‌స్ పాయింట్లు
- నాగ‌బాబు వాయిస్‌
- ర‌ష్మిక న‌ట‌న‌
- పేల‌వంగా సాగే స‌న్నివేశాలు
- క‌థ ఫ్లాట్‌గా ఉండ‌టం

రేటింగ్‌: 3/5
బాట‌మ్ లైన్‌:  యూత్ కోసం `గీత గోవిందం`.



లేదు మేడమ్ నేను మారిపోయా

Updated By ManamMon, 07/23/2018 - 12:59

Geetha విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా పరశురామ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘గీత గోవిందం’. లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్ తాజాగా విడుదలైంది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా విజయ్, రష్మిక జంటతో పాటు విజువల్స్ బావున్నాయి. ఇక ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తుండగా.. గోపి సుందర్ సంగీతం అందించాడు. ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర ఆడియో జూలై 29న విడుదల కానుంది. 



'2.0' విడుదల తేదిపై బ‌న్నీ వాస్ స్పంద‌న‌

Updated By ManamSun, 12/03/2017 - 13:30

bunny vas'2.0' సినిమా ఎప్పుడెప్పుడు వ‌స్తుందా? అని దేశ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌, ఏస్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన 'రోబో' చిత్రం సంచ‌ల‌న విజ‌యం సాధించిన నేప‌థ్యంలో.. '2.0' సినిమాపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. దీపావ‌ళికి వ‌స్తుంద‌నుకున్న ఈ సినిమా.. కొన్ని కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డింది. త‌రువాత‌ జ‌న‌వ‌రి 25న ఈ సినిమా రానుంద‌ని నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. అయితే.. ఏప్రిల్ 13కి వాయిదా ప‌డింద‌ని ఆ మ‌ధ్య వార్త‌లు వినిపించాయి. తాజాగా.. ఏప్రిల్ 27వ‌ తేదిని నిర్మాత‌లు క‌న్‌ఫ‌ర్మ్ చేసుకున్నార‌ని వార్త‌లు వినిపించాయి.

అయితే ఈ సినిమా వాయిదా ప‌డ‌డం.. ప్రాంతీయ చిత్రాల‌పై బాగానే ప్ర‌భావం చూపిస్తోంది. ఎందుకంటే.. అప్ప‌టికే వాళ్లు ఓ తేదీ అనుకోవ‌డం.. స‌రిగ్గా  ఆ స‌మ‌యంలోనే ఈ సినిమా తేది వినిపిస్తుండ‌డంతో.. త‌మ సినిమాని ఎప్పుడు విడుద‌ల చేసుకోవాలో తెలియ‌ని ప‌రిస్థితి వీళ్ళ‌ది. ఈ విష‌య‌మై.. తాజాగా బ‌న్నీ వాస్‌ స్పందించారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్‌కి నా విన్న‌పం అంటూ.. ఓ లేఖ‌ని పోస్ట్ చేశారు. అందులో ఏముందంటే.. ''లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ.. మేము మీ సినిమాని గౌర‌విస్తున్నాం. అయితే.. త‌రుచుగా తేదీలు మారుస్తుండ‌డం ప్రాంతీయ చిత్రాల‌పై బాగా ప్ర‌భావం చూపుతోంది. నేను ('నా పేరు సూర్య‌'.. విడుద‌ల తేది ఏప్రిల్ 27), దాన‌య్య ('భ‌ర‌త్ అనే నేను'.. విడుద‌ల తేది ఏప్రిల్ 27) ఈ విష‌యంపై ఒక అవగాహ‌న‌కి వ‌చ్చాము. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల త‌రపున‌ ఈ ఇష్యూని నిర్మాత‌ల మండ‌లికి, ఎగ్జిబ్యూట‌ర్స్ అసోసియేష‌న్ కి తీసుకువెళ్తున్నాము. మేము మా విడుద‌ల‌కి తేదికి నిల‌బ‌డి ఉంటాము. భ‌విష్య‌త్‌లో ప్రాంతీయ చిత్రాల‌కు ఇలాంటి ఇబ్బంది రాకుండా ఉంటుంద‌ని భావిస్తున్నాము'' అంటూ చెప్పుకొచ్చారు. bunny vas

 

మ‌రి దీనికి లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఏమ‌ని స్పందిస్తుందో చూడాలి. అయితే లైకా త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఏప్రిల్‌లో '2.0' రాబోతుంద‌ని మాత్ర‌మే నిన్న రాత్రి ప్ర‌క‌టించింది. తేది గురించి ప్ర‌స్తావించ‌లేదు. అయితే ఏప్రిల్ 27 అని ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ జ‌రుపుకుంటోంది.lyca

 





Related News