aadhar

87 కోట్ల బ్యాంకు ఖాతాలు ఆధార్‌తో లింకు

Updated By ManamMon, 03/05/2018 - 00:57


aadharన్యూఢిల్లీ: ఇప్పటివరకు 80 శాతం బ్యాంకు ఖాతాలు, 60 శాతం మొబైల్ కనెక్షన్స్ ఆధార్‌తో అనుసంధానమయ్యాయని యూఐడీఏఐ సీనియర్ అధికారి ఆదివారం వెల్లడించారు. లెక్కలో లేని నల్లధనాన్ని వెలికితీసే ఉద్దేశంతో మార్చి 31, 2018 నాటికి ప్రతి బ్యాంకు ఖాతాదారుడు 12 నెంబర్లు కలిగిన ఆధార్ సమర్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉద్దేశంతోనే పాన్‌కార్డును కూడా జతచేయాలని పేర్కొంది. మొబైల్ ఫోన్ వినియోగదారుల గుర్తింపు కోసం ఈ మార్చి 31 కల్లా మొబైల్ నంబర్లను ఆధార్‌తో తప్పనిసరిగా అనుసంధానించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొందాలంటే కొన్నింటికి ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేయడానికి సుప్రీంకోర్టు సైతం సుముఖంగా ఉంది. ఆ దిశలో పాన్ కార్డులకు, మొబైల్ సిమ్ కార్డులకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేశారు. ఇప్పుడు బ్యాంకు ఖాతాల విషయంలో పనులు చాలా వేగంగా సాగుతున్నాయి. దేశ వ్యాప్తంగా మొత్తం 109.9 కోట్ల బ్యాంకు ఖాతాలుంటే అందులో 87 కోట్ల ఖాతాలు ఆధార్ సంఖ్యతో అనుసంధానం అయినట్లుగా యూఐడీఏఐ అధికారి చెప్పారు. ఇందులో 58 కోట్ల ఖాతాలకు సంబంధించి వెరిఫికేషన్ పూర్తికాగా మిగిలిన ఖాతాల విషయంలో బ్యాంకులకు పత్రాలు అందగా, వాటిని బ్యాంకు ఖాతా వివరాలతో అధికారులు సరిపోల్చి చూసే ప్రక్రియ సాగుతోందని ఆ అధికారి తెలిపారు.రైల్వే బుకింగ్‌కు 'ఆధార్' అక్కర్లేదు

Updated By ManamThu, 01/04/2018 - 07:54

Railwayన్యూఢిల్లీ: రైలు టికెట్ల బుకింగ్ విషయంలో ప్రయాణికులకు కాస్త ఊరట లభించింది. టికెట్ బుకింగ్‌కు ఆధార్ తప్పనిసరి కాదని రైల్వే శాఖ సహాయ మంత్రి రాజెన్ గోహైన్ తెలిపారు. లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన ఈ ప్రకటన చేశారు. టికెట్ల బుకింగ్ సమయంలో ఆధార్ తప్పనిసరి కాదని ఆయన స్పష్టం చేశారు. అయితే రాయితీపై వృద్ధులకు జారీ చేస్తున్న టికెట్లకు మాత్రం ఆధార్ నంబర్ ఇవ్వాలనే ప్రతిపాదనను గతేడాది జనవరిలో ప్రవేశపెట్టినట్టు తెలిపారు. 
 2018-ఆధార్ నామ సంవత్సరం!!

Updated By ManamSat, 12/30/2017 - 13:51

Aadharఆధార్‌కు సంబంధించినంత వరకు కొత్త సంవత్సరం (2018) అత్యంత కీలకంకానుంది. ప్రజల జీవితాలతో విడదీయలేని మరింత బంధాన్ని ఆధార్ పెనవేసుకోనుంది.  పలు ప్రభుత్వ సేవలకు సంబంధించి ఆధార్ అనుసంధానం విషయంలో 2017లో పలు వివాదాలు, గందరగోళాలు నెలకొన్నాయి. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో పలు పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది. పౌరుల ప్రైవసీకి విఘాతం కలిగించే ఆధార్‌ను ప్రభుత్వ సేవలకు తప్పనిసరి చేయడం సరికాదన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈ మేరకు దాఖలైన పలు పిటిషన్లపై 2018లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. 

బ్యాంకు అకౌంట్లు, మొబైల్ ఫోన్లు, పాన్ నెంబర్లకు ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై 2018 మార్చి 31న సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించనుంది. ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తే...డిజిటల్ ఇండియా దిశగా ఓ గొప్ప ముందడుగు పడే అవకాశం ఉంది. ప్రభుత్వ పథకాలన్నిటికీ ఆధార్ తప్పనిసరిగా మారనుంది. ఆ రకంగా ప్రభుత్వ పథకాలకు ఆధారే మూలం కారణం కానుంది. నేర విచారణలోనూ ఆధార్‌లోని వేలిముద్రలు వంటి వివరాలు పోలీసుల చేతిలో కీలక ఆయుధాలుగా మారనున్నాయి. 

aadharప్రైవేటు రంగంలోనూ ఆధార్ వివరాలను విరివిరిగా వినియోగించుకోనున్నారు. ఇప్పటికే పలు ఉద్యోగ నియామక సంస్థలు అభ్యర్థుల నుంచి ఆధార్ వివరాలను తీసుకుంటున్నాయి. కొత్తగా అకౌంట్ తెరిచేందుకు ఆధార్‌లో ఉన్నట్లు పేరు ఇవ్వాలని ఫేస్‌బుక్ సంస్థ కోరడం తెలిసిందే. దేశంలోని అతిపెద్ద ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ ఇప్పటికే కొన్ని సేవలకు సంబంధించి వినియోగదారుల ఆధార్ వివరాలు కోరుతోంది. అటు బెంగుళూరుకు చెందిన క్యాబ్ రెంటల్ సంస్థ-జూమ్‌కార్ ఆధార్ ప్రూఫ్ చూపనిదే బుకింగ్స్ స్వీకరించడం లేదు. 

ఇలా 2018లో ఆధార్‌ను పలు ప్రైవేటు సంస్థలు కూడా తమ సేవలు పొందాలంటే వినియోగదారులు ఆధార్ వివరాలు సమర్పించడం తప్పనిసరి చేయనున్నాయి. ఆ రకంగా ఎవరికి నచ్చినా...నచ్చకపోయినా...2018 ఆధార్ నామ సంవత్సరం కావడం ఖాయమన్న భావన వ్యక్తమవుతోంది. గోవాలో ‘ఆ’ సుఖానికీ ఆధార్!

Updated By ManamSun, 12/17/2017 - 23:48
  • కాల్‌గర్ల్స్ కావాలంటే ‘ఆధార్’ ఇవ్వాల్సిందే

  • పోలీసు ఇన్‌ఫార్మర్ల అనుమానంతో 

  • వేశ్యాగృహాల నిర్వాహకుల డిమాండ్

gova, aadharపణజి, డసెంబరు 17: బ్యాంక్ అకౌంట్లు, మొబైల్ ఫోన్లే కాదు.. అక్కడ సెక్స్ కావాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరిగా కావాలట. ముందు ఆధార్ కార్డు ఇస్తే.. వాళ్లు వాళ్లకు కావాల్సిన ఎంక్వైరీలన్నీ చేసుకొని ఆ తర్వాత కాల్ గర్ల్స్‌ని పంపిస్తారట. ఇదెక్కడో కాదు.. మన దేశంలోనే. మందు బాబులు భూతల స్వర్గంగా భావించే గోవాలో..! ఈ మధ్యే ఢిల్లీకి చెందిన ఐదుగురు వ్యక్తులు తమ ఫ్రెండ్ బ్యాచిలర్ పార్టీ కోసం వెళ్తే వాళ్లకు ఈ వింత అనుభవం ఎదురైంది. ఎలాగోలా కాల్‌గర్ల్స్‌ను సప్లై చేసే ఓ వ్యక్తి నంబర్ సంపాదించి వాళ్లు గోవా వెళ్లారు. అక్కడకెళ్లిన తర్వాత ఆ వ్యక్తికి ఫోన్ చేస్తే.. వాళ్లు అడిగినట్లే ఐదుగురు యువతులను పంపిస్తానని చెప్పాడట. అయితే తీరా కాల్‌గర్ల్స్ దగ్గరికి వెళ్లిన తర్వాత ఆ ఐదుగురు వ్యక్తుల ఆధార్ కార్డులు కావాలని డిమాండ్ చేశారు. ఆ యువకులు ముందు కంగారు పడినా.. వాళ్లు చెప్పినట్లే వాట్సాప్‌లో తమ ఆధార్ కార్డుల వివరాలు పంపించారు. ఆ తర్వాత ఆధార్ కార్డులను బట్టి వాళ్ల బ్యాక్‌గ్రౌండ్‌తోపాటు వాళ్లు ఉన్న హోటల్‌లో విచారణ కూడా చేశారట!

అయితే.. పోలీసులు ఇన్‌ఫార్మర్లేమో అన్న అనుమానంతో అక్కడ వ్యభిచార గహాలను నడిపే వ్యక్తులు ఇలా విటుల దగ్గర నుంచి ఆధార్ వివరాలు కూడా రాబడుతున్నారు. అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాతే వేశ్యలను పంపిస్తున్నారు. అప్పుడు కూడా వాళ్లు అలా పంపిస్తారన్న గ్యారెంటీ లేదని, చాలా మంది ఆన్‌లైన్‌లో ఇలాంటి వాటిని చూసి గోవాకు వచ్చి మోసపోతున్నారని అక్కడి పోలీసులు చెబుతున్నారు. వెబ్‌సైట్లలో వివరాలు చూసి వచ్చినవాళ్లలో 90 శాతం మోసపోతూనే ఉన్నారని, ఇలాంటి వాటి బారిన పడొద్దని వాళ్లు స్పష్టంచేస్తున్నారు. కొందరు మధ్యవర్తులు మోసం చేయడంలోనూ కొత్తకొత్త దారులు వెతుకుతున్నట్లు పోలీసులు చెప్పారు. ఇళ్లలో కొందరు యువతులను బాల్కనీల్లో నిలబెడతారు. టూరిస్టుల వైపు వాళ్లు చేతులు ఊపుతూ తాము వేశ్యలమని నమ్మేలా చేస్తారు. ఆ తర్వాత మధ్యవర్తి వారి నుంచి డబ్బు వసూలు చేసి ఆ ఇంటికి పంపిస్తారు. ఆ ఇంటికి వెళ్లి తలుపులు ఎంత కొట్టినా ఎవరూ తీయరు. ఈ లోపు పక్కనున్న వాళ్లు వచ్చి గొడవ చేస్తారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో టూరిస్టులు అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వస్తుంది అని పోలీసులు చెబుతున్నారు. ఎయిర్‌టెల్ ఈకేవైసీ లైసెన్సు రద్దు

Updated By ManamSat, 12/16/2017 - 21:41

airtelన్యూఢిల్లీ: ఆధార్‌ను ఎయిర్‌టెల్ దుర్వినియోగం చేయడంతో ఆధార్‌ను జారీ చేసే యు.ఐ.డి.ఎ.ఐ(ఉడాయ్) కఠిన నిర్ణయం తీసుకుంది. ఆధార్ వెరిఫికేషన్‌కు అనుమతించే ఈకైవెసి లైసెన్సును ఎయిర్‌టెల్, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌కు తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఫలితంగా, ఈకైవెసి ప్రక్రియను, పేమెంట్స్ బ్యాంక్ క్లయింట్ల ఈకైవెసిని ఉపయోగించుకుని భారతీ ఎయిర్‌టెల్‌ కానీ, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌ కానీ మొబైల్ కస్టవుర్లకు చెందిన ‘ఆధార్’ ఆధారిత ‘సిమ్’ వెరిఫికేషన్ నిర్వహించడానికి లేదు. భారతీ ఎయిర్‌టెల్ తన చందాదారులతో పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలు తెరిపించేందుకు ఆధార్-ఈకైవెసీ ఆధారిత ‘సిమ్’ వెరిఫికేషన్ ప్రక్రియను ఉపయోగించుకుంటోందని ఆరోపణలు రావడంతో యు.ఐ.డి.ఎ.ఐ ఈ కఠిన చర్య తీసుకుంది. చందాదారులకు తెలిపి వారి అనుమతి తీసుకోకుండా ఎయిర్‌టెల్ ఆ పని చేస్తోందని ఆరోపణ లొచ్చాయి. ఎల్.పి.జి సబ్సిడీ అందుకునేందుకు అటువంటి పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలను ఉపయోగించుకోవడం పట్ల కూడా యు.ఐ.డి.ఎ.ఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక ఆధార్ అనుసంధానం వెర్రీ ఈజీ

Updated By ManamSat, 12/09/2017 - 13:28

Aadharమనం న్యూస్ డిజిటల్: మొబైల్ నెంబర్‌ను ఆధార్‌తో అనుసంధానానికి సులభతరమైన విధానం జనవరి 1 నుంచి అమలులోకి రానుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మొబైల్ నెంబర్లను ఆధార్‌తో అనుసంధానించే ప్రక్రియ వచ్చే ఏడాది ఫిబ్రవరి
తొలివారంలో ముగియనుంది.  గడువు దగ్గరపడుతున్నా ఇంకా 50 కోట్ల మొబైల్ నెంబర్లు ఇప్పటికీ ఆధార్‌తో
అనుసంధానం కాలేదు. ఈ నేపథ్యంలో వినియోగదారులు తమ ఇళ్లలోనే కూర్చొని మొబైల్ నెంబర్‌ను ఆధార్‌తో
అనుసంధానం చేసుకునే సౌలభ్యం జనవరి 1 నుంచి అందుబాటులోకి రానుంది. వన్ టైమ్ పాస్‌వర్డ్(ఓటీపీ) నెంబర్
ద్వారా మొబైల్ నెంబర్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించనుంది. 

మొబైల్ నెంబర్‌ను ఆధార్‌తో అనుసంధానించే ప్రక్రియ గత కొన్ని మాసాలుగా కొనసాగుతోంది. అయితే ఈ
అనుసంధాన ప్రక్రియ కోసం వినియోగదారులు తమ మొబైల్ సర్వీస్ సంస్థల కస్టమర్ కేర్ సెంటర్లకు వెళ్లాల్సి వస్తోంది.
కొన్ని సందర్భాల్లో బయోమెట్రిక్ పరికరాలు పనిచేయకున్నా వినియోగదారులు నిరాశతో వెనుదిరగాల్సి వస్తోంది. అటు
వయోవృద్ధులు సుధూర ప్రాంతాల్లోని కస్టమర్ కేర్ సెంటర్లకు వెళ్లి ఆధార్ అనుసంధాన ప్రక్రియను పూర్తి చేయడం
కష్టతరంగా మారుతోంది.

ఈ నేపథ్యంలో ఓటీపీ ద్వారా మొబైల్ నెంబర్లను ఆధార్‌తో అనుసంధానం చేసుకునేందుకు జనవరి 1 నుంచి  
వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించడం పట్ల మొబైల్ వినియోగదారులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ఇవాంక ఆధార్ కోసం వచ్చిందా?

Updated By ManamSat, 12/02/2017 - 20:47

ivankaన్యూఢిల్లీ: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంక ట్రంప్...తన రెండ్రోజుల పర్యటన ముగించుకుని వెనుదిరిగారు. దేశం వీడి రెండ్రోజులు గడిచినా సోషల్ మీడియాలో ఇప్పటికీ ఆమె హైదరాబాద్ పర్యటనకు సంబంధించి పలు ఫన్నీ కామెంట్స్ చక్కర్లు కొడుతున్నాయి. మోదీ-ఇవాంకల ఫోటోపై పలు మెమ్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

ఈ ఫన్నీ కామెంట్స్‌లో ఒకటి ట్విట్టర్‌లో నవ్వులు పూయిస్తోంది. ఆధార్ కార్డు కోసమే ఇవాంక ట్రంప్ హైదరాబాద్ వచ్చారంటూ ఓ కామెడియన్ మెమ్ పోస్ట్ చేయగా, ఇది వైరల్ అయ్యింది. ఆధార్ కార్డు కోసం భారత్ వచ్చానంటూ డబ్ల్యూఈఎస్ ప్రతినిధులతో ఇవాంక చెబుతున్నట్లు ఓ వీడియోకు కామెడీ వాయిస్ ఓవర్ చెప్పించారు. దీన్ని ట్విట్టర్‌లో విపరీతంగా రీట్వీట్ చేసుకుంటున్నారు. 

ఇవాంక భారత్‌కు ఆధార్ కార్డు కోసం వచ్చారంటూ జరుగుతున్న ప్రచారాన్ని యునిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) కూడా లైట్‌గానే తీసుకుంది. ఇవాంక భారత్‌లో నివాసం లేనందున ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేయలేదంటూ యూఐడీఏఐ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి ట్వీట్ చేశారు. ఆధార్... ఆయుధం

Updated By ManamFri, 12/01/2017 - 00:35
  • బినామీ ఆస్తి లావాదేవీలకు అడ్డుకట్ట

  • బోగస్ ఖాతాలతో మెక్కడం అసాధ్యం

  • అర్హులకే రేషన్, స్కాలర్‌షిప్పులు కూడా..

  • రాయితీలు నేడు పేదలకే చేరుతున్నాయ్

  • ‘హిందూస్థాన్ టైమ్స్’ సదస్సులో మోదీ

modi, pm, aadharన్యూఢిల్లీ, నవంబరు 30: ఆధార్ అమలు వల్ల ప్రజలకు ప్రయోజనాలు అందించడంలో ‘తిరుగు లేని మార్పు’ వచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. అంతేకాకుండా బినామీ ఆస్తి లావాదేవీలకు అడ్డుకట్ట వేయడంలో విశిష్ట గుర్తింపు సంఖ్య ఓ పెద్ద ఆయుధంగా అందివచ్చిందని వివరించారు. గురువారం న్యూఢిల్లీలో ప్రారంభమై న హిందూస్థాన్ టైమ్స్ నాయకత్వ సదస్సు-2017లో ఆయన మాట్లాడారు. అర్హులకు సముచిత ధరలో రేషన్ సరుకులు అందించడంతోపాటు రేషన్ సరుకులు, పెన్షన్లు, రాయితీలను అర్హులై న పేదలకు నేరుగా చేర్చడంలో ఆధార్ ప్రధాన పాత్ర పోషిస్తున్నదని గుర్తుచేశారు. జన్‌ధన్ ఖాతాలతోపాటు మొబైల్‌తో ఆధార్ అనుసంధానం వల్ల కొన్నేళ్లకిందట ఊహించడానికైనా సాధ్యంకాదని అద్భుత వ్యవస్థ ఆవిష్కృతమైందని, ఇకపై ఇది ‘స్థిరంగా’ కొనసాగుతుందని ప్రధాని చెప్పారు. ‘‘ఇంతకుముందు కోట్ల రూపాయల్లో పెన్షన్లు బోగస్ ఖాతాలకు చేరిపోతుండేవి. ఆధార్ ఆయుధ ప్రయోగంతో మూడేళ్లుగా అదంతా బంద్ అయింది. ఇకపై బినామీ ఆస్తుల వ్యవహారంపైనా ఈ ఆయుధాన్ని ప్రయోగిస్తాం’’ అన్నారు. కాగా, స్థిరాస్తి రంగంలో నల్లధనం నిర్మూలన, బినామీ ఆస్తుల సమస్య పరిష్కారం దిశగా ఆస్తి లావాదేవీలకూ ఆధార్‌ను అనుసంధానిస్తామని ఇటీవల కేంద్ర గృహనిర్మాణ శాఖ మంత్రి హర్‌దీప్ పూరి కూడా చెప్పారు.రాజకీయంగా నష్టపోయినా ఫర్వాలేదు

Updated By ManamThu, 11/30/2017 - 12:49

Narendra Modiఢిల్లీ: దేశ ప్రగతి కోసం కొత్త విధానాలు, సంస్కరణలు అమలుచేస్తూనే ఉంటామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. అవసరమైతే ఈ కొత్త విధానాల కారణంగా రాజకీయంగా నష్టం కలిగినా ఫర్వాలేదని అన్నారు. ఢిల్లీలో హిందుస్థాన్‌ టైమ్స్‌ లీడర్‌షిప్‌ సదస్సులో మాట్లాడిన మోదీ..నోట్ల రద్దు, జీఎస్టీ, ఆధార్ అనుసంధానం వంటి అంశాల్లో ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టారు. తమ ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తుందని...అవినీతి, నల్లధన రహిత సమాజాన్ని తయారుచేయడమే తమ లక్ష్యమన్నారు. 

పెద్దనోట్ల రద్దుతో సమాంతర ఆర్థిక వ్యవస్థగా ఉన్న నల్లధనం.. ఇప్పుడు అంతరించిపోయే స్థితికి చేరిందని మోదీ పేర్కొన్నారు. అవినీతి నిర్మూలన, పారదర్శక వ్యవస్థకు జీఎస్‌టీతో ముందడుగు పడినట్లయిందని మోదీ అన్నారు. బినామీ ఆస్తులను బయటకు తీసుకొచ్చేందుకు ఆధార్‌ ఓ ఆయుధంలా పనిచేస్తోందన్నారు.  తాను ఎంచుకున్న మార్గానికి రాజకీయ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తే.. అందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నానని మోదీ అన్నారు. గోప్యతపై శ్వేత పత్రం

Updated By ManamThu, 11/30/2017 - 00:28

aadhar, suprim courtఆధార్ అనుసంధాన విధానం వల్ల ప్రాథమిక హక్కుకు భంగం వాటిల్లు తున్నదన్న వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ధర్మాసనం ‘వ్యక్తిగత గోప్యత’ను హక్కుగా గుర్తించాలని 2017 ఆగస్టులో తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో  వ్యక్తిగత గోప్యత పరిరక్షణకు విధివిధానాలు రూపొందించేందుకు కేంద్రం జస్టిస్ బి.ఎన్. శ్రీకృష్ణ కమిటీని నియమించింది. వ్యక్తిగత సమాచార పరిరక్షణ కోసం తీసుకోవలసిన చర్యలపై అభిప్రాయాలు తెలియజేయాలని కోరుతూ ఆ కమిటీ ఒక శ్వేత పత్రాన్ని ఇటీవల విడుదల చేసింది. వ్యక్తుల బయోమెట్రిక్ సమాచారం కలిగిన యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ (యూఐఎన్)ను స్కూల్ అడ్మిషన్ల నుంచి మరణ ధ్రువీకరణ పత్రం అభ్యర్థన వరకు అన్ని ప్రక్రియల్లోనూ వినియోగిస్తున్నారు. అయితే  యూఐఎన్ నెంబర్‌లోని వ్యక్తిగత సమాచారం దుర్వినియోగమవు తుందన్న భయాలు వ్యాపించడంతో వాటి వాడకం నేడు కొంత మందగించింది.  అయితే  ప్రస్తుత సమాచార సేకరణ కార్యక్రమాలపై అనేక అనుమానాలు రావడమే కాదు, వివిధ ప్రైవేట్ సంస్థలు వ్యక్తిగత సమాచారాన్ని సంబంధిత పౌరుల అనుమతిలేకుండా యథేచ్ఛగా వాడుకొంటున్న సంఘటనలు అనేకం వెలుగుచూస్తున్నాయి. అదే సమయంలో మొబైల్/టెలిఫోన్ నెంబర్లు, బ్యాంక్ అకౌంట్లు, గ్యాస్ కనెక్షన్లు, పింఛన్ అకౌంట్లు ఒక్కటేమిటి సమాజంలోని సకల సేవలు, వ్యాపార కార్యకలాపాలు ఆధార్‌తో అనుసంధానం కావాలని ప్రజల్ని కొన్ని నెలల నుంచి ప్రభుత్వం, సంబంధిత సంస్థలు తొందర పెడుతున్నాయి. కొన్ని సేవలు అందించేందుకు వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు నిరాకరి స్తున్నాయి. అనుసంధానం వల్ల వ్యక్తుల జీవిత పార్వ్శాల సమాచారమంతటినీ సునాయాసంగా తెలుసుకునేందుకు ఆధార్ ఒక తాళంచెవిలా ఉపకరిస్తుందని విమర్శకుల అభిప్రాయం. అలాంటి మాస్టర్ తాళం చెవి సుప్రీంకోర్టు స్పష్టం చేసిన గోప్యత హక్కును తప్పక కాలరాస్తుంది. 

సామాన్య మానవుడిని ఆధార్ గాటి కట్టేందుకు సర్కార్ ప్రయత్నాలు పౌరుల సాధికారతకు, ఏకాంత హక్కుకు భంగం కలిగిస్తున్నట్లు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యక్తి స్వేచ్ఛ, సమాచార భద్రత, ఏకాంతత హుక్కువంటి పెద్ద పెద్ద మాటలెలా ఉన్నా ఆహార సంక్షేమ పథకాన్ని ఆధార్‌తో బలవంతంగా  అనుసంధానించే ప్రయత్నం ఆకలి చావులకు కారణమవుతోంది. దేశ పౌరుల గుర్తింపు, మనుగడ ఆధార్ దాస్యానికి బలైంది. డిజిటలైజేషన్ ప్రక్రియకు  ముఖ్యంగా పేద కుటుంబాలే బలవుతున్నాయి. ఆకలితో ఆధార్ అనుసంధానం దేశంలో మరణమృదంగాన్ని మోగిస్తోంది.

సంక్షేమ పథకాలు లబ్దిదారులకు చేరడంలేదని, దళారులు ప్రభుత్వ నిధు లను కాజేస్తున్నారని, ఈ పరిస్థితిని సరిచేసే లక్ష్యంతో కేంద్రం రూపొందించిన ఆధార్ డిజిటలైజేషన్ ప్రక్రియ అత్యంత వివాదాస్పదమైంది. ఆ తర్వాత ఆధార్ అనుసంధాన విధానాన్ని సంక్షేమ పథకాల నుంచి సేవల రంగానికి, ఆర్థిక లావాదేవీలకు విస్తరించింది. ఈ విధానం వల్ల ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, పన్ను ఎగవేతలు, ఉగ్రవాద కార్యకలాపాలు, మనీ ల్యాండరింగ్ వంటి చీకటి వ్యవహారాలను నివారించవచ్చని కేంద్ర సర్కార్ బలవంతంగా ఆధార్ అనుసంధాన ప్రక్రియను చేపట్టింది. ఆధార్ ద్వారా లభించే సమాచారాన్ని సంఘ విద్రోహ శక్తులు దుర్వినియోగం చేసే ప్రమాదంతోపాటు, కులం, మతం, జెండర్, రాజకీయ అభిప్రాయాలు వగైరా ప్రాతిపదికన సమాజాన్ని విభజించే ప్రమాదం లేకపోలేదు. వీటన్నిటి నేపథ్యంలో ఒక సమగ్ర సమాచార పరిరక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయవలసిన అవసరం ఏర్పడింది.  

Related News