Chennai Super Kings

ప్లేఆఫ్: చెన్నై లక్ష్యం 140 పరుగులు

Updated By ManamTue, 05/22/2018 - 20:50
  • సన్‌రైజర్స్ హైదరాబాద్ స్కోరు 139/7 

Chennai Super Kings, toss and elected to field, Sunrisers Hyderabad, IPL2018ముంబై: ఐపీఎల్-11 సీజన్‌లో భాగంగా ప్లే ఆఫ్ (క్వాలిఫయర్-1) మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగులు సాధించింది. దీంతో ప్రత్యర్థి జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌కు 140 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన చెన్నైలో జట్టులో ఓపెనర్‌గా బరిలోకి దిగిన శిఖర్ ధావన్ (0) ఆదిలోనే చేతులేత్తేశాడు. గోస్వామి (12), కెప్టెన్ విలియమ్సన్ (24), మనీశ్ పాండే (8), షకీబ్ అల్ హసన్ (12), యూసఫ్ పఠాన్ (24), భువనేశ్వర్ కుమార్ (7) పరుగులకే ఒకరితరువాత ఒకరు పెవిలియన్ బాటపట్టగా, చివరిదాకా నిలకడగా ఆడుతూ వచ్చిన బ్రాత్‌వైట్ (43) పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. చెన్నై బౌలర్లలో బ్రేవో రెండు వికెట్లు పడగొట్టగా, చాహర్, నిగిడి, శార్దూల్ థాకూర్, జడేజా తలో వికెట్ తీసుకున్నారు. అంతకుముందు తొలుత టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. చెన్నై జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సన్‌రైజర్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. 



టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై

Updated By ManamTue, 05/22/2018 - 18:56

Chennai Super Kings, toss and elected to field, Sunrisers Hyderabad, IPL2018ముంబై: ఐపీఎల్-11 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న ప్లే ఆఫ్ (క్వాలిఫయర్-1)  మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. చెన్నై జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సన్‌రైజర్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. చెన్నై జట్టులో ఒక మార్పు చోటుచేసుకోగా, వాట్సన్ స్థానంలో బిల్లింగ్స్‌కు చోటు దక్కింది. సన్‌రైజర్స్ ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతోంది.హైదరాబాద్ జట్టు నుంచి ఓపెనర్లుగా శిఖర్ ధావన్, కెప్టెన్ విలయమ్సన్ బరిలోకి దిగగా, దీపక్ చాహర్ తొలి ఓవర్ అందుకున్నాడు.



టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై

Updated By ManamSun, 05/20/2018 - 19:52

Chennai Super Kings, toss and elected to field, Kings XI Punjab, IPL 2018పుణె: ఐపీఎల్‌-11సీజన్‌లో భాగంగా ఆదివారం ఇక్కడ పుణె వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరుగనున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పంజాబ్ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. పంజాబ్ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగుతుండగా.. యువరాజ్ సింగ్, మార్కస్ స్టోయినీస్ వీరిద్దరి స్థానంలో కరుణ్ నాయర్, డేవిడ్ మిల్లర్ తుదిజట్టులో చోటు దక్కించుకున్నారు. ఇక చెన్నై జట్టులో ఒక మార్పు చోటుచేసుకోగా డు ప్లెసిస్ స్థానంలో షేన్ వాట్సన్‌కు చోటు దక్కింది. పంజాబ్ ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, క్రిస్ గేల్ బరిలోకి దిగారు. చెన్నై బౌలర్ దీపక్ చాహార్ తొలి ఓవర్ అందుకున్నాడు. 



శతక్కొట్టిన రాయుడు

Updated By ManamSun, 05/13/2018 - 20:28
  • సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై 8 వికెట్ల తేడాతో చెన్నై విజయం

  • వాట్సాన్ హాఫ్ సెంచరీ.. విఫలమైన సన్‌రైజర్స్ బౌలర్లు

Sunrisers Hyderabad, IPL 2018, Chennai Super Kings, Ambati Rayuduపుణె: ఐపీఎల్‌-11 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్‌తో ఆదివారం ఇక్కడ పుణె మైదానం వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఆటగాడు అంబటి రాయుడు రెచ్చిపోయాడు. సన్‌రైజర్స్ నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాయుడు కళ్లు చెదిరే ఇన్నింగ్స్‌‌తో అలవోకంగా అజేయ శతకం సాధించి జట్టుకు విజయాన్ని అందించాడు. రాయుడు (100నాటౌట్‌; 62బంతుల్లో 7×4, 7×6) రెచ్చిపోయి ఆడాడు. దాంతో సన్‌రైజర్స్‌పై చెన్నై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మరో ఓపెనర్‌ షేన్‌ వాట్సన్‌ (57; 35బంతుల్లో 5×4, 3×6) కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. వాట్సన్‌తో కలిసి పోటాపోటీగా బౌండరీలు, సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. 14 ఓవర్‌లో వాట్సన్‌ రనౌట్‌ కావడం.. మరో ఓవర్‌లో రైనా(2; 3బంతుల్లో) కూడా విలియమ్సన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

కానీ రాయుడు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ధోనీ( 20నాటౌట్‌; 14బంతుల్లో 1×4,1×6)తో కలిసి లాంఛనాన్ని పూర్తి చేశాడు. దాంతో చెన్నై 19 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి మరో 6 బంతులు మిగిలి ఉండగానే లక్ష ఛేదించి అద్భుత విజయాన్ని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో విజయంతో చెన్నై ప్లే ఆఫ్‌కు చేరుకుంది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.



దుమ్ము రేపిన ధావన్, విలియమ్సన్

Updated By ManamSun, 05/13/2018 - 18:15
  • హాఫ్ సెంచరీలతో అదరగొట్టేసిన సన్‌రైజర్స్ ఆటగాళ్లు .. 

  • చెన్నై విజయలక్ష్యం 180 పరుగులు.. 

Chennai Super Kings, Sunrisers Hyderabad, IPL 2018పుణె: ఐపీఎల్ -11 సీజన్‌లో భాగంగా పుణె వేదికగా ఆదివారం ఇక్కడ చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ బ్యాట్స్‌మెన్‌ దుమ్ము లేపారు. తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై బౌలింగ్‌ను కట్టుదిట్టం చేసినప్పటికీ ఆరంభంలో తడబడినా హాఫ్ ఓవర్లు ముగిసిన అనంతరం సన్‌రైజర్ ఆటగాళ్లు రెచ్చిపోయారు. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (79; 49బంతుల్లో 10×4, 3×6), కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (51; 39బంతుల్లో 5×4, 2×6) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఓపెనర్‌ హేల్స్‌ (2; 9బంతుల్లో) ఫీల్డర్‌ రైనా చేతికి చిక్కాడు. అనంతరం ధావన్‌తో జత కలిసిన కెప్టెన్‌ విలియమ్సన్‌ మొదట్లో నిదానంగా ఆడుతూ ఇన్నింగ్స్‌ నిలబెట్టే ప్రయత్నం చేశాడు. అనవసరపు షాట్లకు పోకుండా వీలుచిక్కనప్పుడల్లా బౌండరీలు బాదుతూ ఈ జోడీ స్కోరుబోర్డును నడిపించారు. ధావన్‌ భారీ సిక్సర్లతో విరుచుకుపడగా, విలియమ్సన్‌ బౌండరీలతో అలరించాడు.

ఈ క్రమంలో వీరిద్దరి జోడీ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. కానీ బ్రావో వేసిన 16వ ఓవర్‌ చివరి బంతికి ధావన్‌ హర్భజన్‌ చేతికి చిక్కింది. శార్థూల్‌ ఠాకూర్‌ వేసిన తర్వాత ఓవర్‌లోనే కెప్టెన్‌ విలియమ్సన్‌ బ్రావో చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. చివరి ఓవర్లలో దీపక్‌ హుడా (21నాటౌట్‌; 11బంతుల్లో 1×4, 1×6) రాణించాడు. ఫలితంగా సన్‌రైజర్స్‌ నిర్ణీత 20ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 179పరుగులు చేసింది. దాంతో ప్రత్యర్థి జట్టు చెన్నైకి 180 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. కాగా, చెన్నై బౌలర్లలో శార్దూల్ థాకూర్ (2/32) వికెట్లు తీసుకోగా, దీపక్‌ చాహార్‌ (1/16), బ్రేవో (1/39) పరుగులిచ్చి ఆకట్టుకున్నారు. 



టాస్ గెలిచి చెన్నై బ్యాటింగ్.. 

Updated By ManamFri, 05/11/2018 - 19:52

Chennai Super Kings, toss and elected to bat, Rajasthan Royals, IPL2018జైపూర్: ఐపీఎల్-11 సీజన్‌లో భాగంగా జైపూర్ వేదికగా శుక్రవారం ఇక్కడ రాజస్థాన్ రాయల్స్‌, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. తొలుత టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ ఎంచుకున్నాడు. చెన్నై జట్టులో రెండు మార్పులు చోటుచేసుకోగా, ధృవ్ షోరే, లుంగీ నిగిడి మ్యాచ్‌కు దూరం కాగా, వారి స్థానంలో శామ్ బిల్లింగ్స్, కరణ్ శర్మ తుదిజట్టులో తిరిగి చోటు దక్కించుకున్నారు. ఇక రాజస్థాన్ జట్టులో కూడా రెండు మార్పులు చోటుచేసుకోగా, అనురీత్ సింగ్, మహిపాల్ లోమ్రర్ దూరమవ్వగా.. వారి స్థానంలో అంకిత్ శర్మ, ప్రశాంత్ చోప్రా తుదిజట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా రహానె మాట్లాడుతూ.. ‘‘మేము కేన్సర్ గురించి అవగాహన కల్పించేందుకు ఈ మ్యాచ్‌లో పింక్ జెర్సీతో బరిలోకి దిగుతున్నాం. ఇదొక మాకు గొప్ప సవాల్‌. మా జట్టులో సభ్యులంతా చాలా ఉత్సాహంగా ఉన్నారు. మ్యాచ్‌లో పట్టు సాధించే దిశగా ముందుకు సాగుతాం’’ అని తెలిపాడు. టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ధోనీ మాట్లాడుతూ.. ‘‘మ్యాచ్‌కు ముందు మాకు ఉన్నత స్థాయి కమిటీ జరిగింది. మా కోచ్ టాస్ గెలిస్తే ముందుగా  బ్యాటింగ్ తీసుకోమని చెప్పాడు (నవ్వుతూ)..‘‘ అని తెలిపాడు.  చెన్నై జట్టులో ఓపెనర్లుగా షేన్ వాట్సాన్, అంబటి రాయుడు బరిలోకి దిగారు. రాజస్థాన్ బౌలర్లలో తొలి ఓవర్‌ను గౌతమ్ అందుకున్నాడు. 

జట్ల వివరాలు..
చెన్నై సూపర్ కింగ్స్: షేన్ వాట్సాన్, అంబటి రాయుడు, సురేశ్ రైనా, శామ్ బిల్లింగ్స్, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్, కెప్టెన్), డ్వేన్ బ్రేవో, రవీంద్ర జడేజా, కరణ్ శర్మ, డేవిడ్ విల్లీ, హర్భజన్ సింగ్, శార్దూల్ థాకూర్.

రాజస్థాన్ రాయల్స్: అజింక్యా రహానె (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), ప్రశాంత్ శర్మ, సంజు శాంసన్, బెన్ స్టోక్స్, బిన్నీ, క్రిష్ణప్ప గౌతం, జోఫ్రా అర్చర్, అంకింత్ శర్మ, జయ్‌దేవ్ ఉనాద్కత్, ఇష్ సోథీ. 



మూడు వికెట్లు కోల్పోయిన బెంగళూరు

Updated By ManamSat, 05/05/2018 - 16:55
  • దూకుడుగా ఆడుతున్న పార్థీవ్ పటేల్.. హాఫ్ సెంచరీకి చేరువలో.. 

  • పేలవ ప్రదర్శన.. మెకల్లమ్,విరాట్ కోహ్లీ,ఏబీ డెవిలియర్స్ ఔట్

Chennai Super Kings, Royal Challengers Bangalore, IPL 2018పుణె: ఐపీఎల్-11 సీజన్‌లో భాగంగా పుణె వేదికగా చెన్నై సూపర్‌కింగ్స్‌‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. తొలుత ఓపెనర్‌గా బరిలోకి దిగిన పార్థీవ్ పటేల్ (32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌) 47 పరుగులతో హాఫ్ సెంచరీకి చేరువలో నాటౌట్‌గా ఉన్నాడు. మెకల్లమ్ (5) పరుగుల వద్ద నిగ్డి బౌలింగ్‌లో శార్దూల్ ఠాకూర్ క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌ రూపంలో వెనుదిరిగాడు. ఆ తరువాత వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా (8) పరుగులకే జడేజా బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. అనంతరం ఏబీ డెవిలియర్స్ (1) పరుగుకే చేతుల్తేశాడు.

దాంతో బెంగళూరు జట్టు 56 స్కోరు వద్ద మూడు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం పార్థీవ్ పటేల్ (47), మన్‌దీప్ సింగ్ (4) పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు. బెంగళూరు స్కోరు 10 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 68 పరుగులతో కొనసాగుతోంది. చెన్నై బౌలర్లలో నిగ్డి, జడేజా, హర్భజన్ సింగ్ తలో వికెట్ తీసుకున్నారు.



టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై

Updated By ManamSat, 05/05/2018 - 16:15

Chennai Super Kings, Royal Challengers Bangalore, IPL 2018 పుణె: ఐపీఎల్-11 సీజన్‌లో భాగంగా పుణె వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టు తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. కోహ్లిసేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. చెన్నై జట్టులో ఒక మార్పు చోటుచేసుకోగా, డుప్లెసిస్‌ స్థానంలో విల్లే బరిలోకి దిగుతున్నట్లు ధోనీ తెలిపాడు. ఆర్‌సీబీ జట్టులోనూ మూడు మార్పులు జరిగాయి. డికాక్ స్థానంలో ఏబీ డివిలియర్స్‌ తుదిజట్టులోకి రాగా, వోహ్రా స్థానంలో పార్థివ్‌ పటేల్‌, వాషింగ్టన్‌ స్థానంలో ఎం.అశ్విన్‌ వచ్చినట్టు ఆర్‌సీబీ కెప్టెన్ కోహ్లీ పేర్కొన్నాడు. బెంగళూరు జట్టు నుంచి ఓపెనర్లుగా పార్థీవ్ పటేల్, మెకల్లమ్ బరిలోకి దిగారు.



ఐపీఎల్‌లో 100 విజయాలు

Updated By ManamWed, 05/02/2018 - 04:17
  • చెన్నై సూపర్ కింగ్స్ అరుదైన రికార్డు

Super Kingsచెన్నై: ఐపీఎల్‌లో మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వం వహిస్తోన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అరుదైన ఘనతను అందుకుంది. అత్యధిక  టీ20లు గెలిచిన జట్ల జాబితాలో చెన్నై సూపర్‌కింగ్స్ రెండో స్థానంలో నిలిచింది. ఐపీఎల్ 11వ సీజన్‌లో భాగంగా సోమవారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయంతో చెన్నై ఈ ఘనత సాధించింది. ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ 100 విజయాలు నమోదు చేసింది. ఇవన్నీ మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోనే కావడం విశేషం. ఇక అత్యధిక టీ20 మ్యాచ్‌లు గెలిచిన జట్ల జాబితాలో అగ్రస్థానంలో మూడు సార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన ముంబయి ఇండియన్స్ ఉంది. ఇప్పటి వరకు ముంబయి ఇండియన్స్ 186 మ్యాచ్‌లు ఆడగా అందులో 104 విజయాలను నమోదు చేసుకుని అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు 94 విజయాలతో మూడో స్థానంలో ఉన్న చెన్నై 6 విజయాలు నమోదు చేసుకుని శతక విజయా లతో రెండో స్థానంలోకి దూసుకెళ్లింది. చెన్నై సూపర్‌కింగ్స్ మొత్తం 166 మ్యాచ్‌లు ఆడగా 100 విజయాలు నమోదు చేసు కుంది. ఐపీఎల్‌లో చెన్నై అత్యధిక విజయాలను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పైనే సాధించింది. 12 సార్లు చెన్నై.. ఆర్‌సీబీపై గెలిచింది.   గత రెండేళ్ల పాటు నిషేధం కారణంగా ఐపీఎల్‌కు దూరమైంది చెన్నై. ఇదే జరగకుండా ఉంటే ధోనీ నాయకత్వంలోని చెన్నై జట్టు ఈ జాబితాలో ఎప్పుడో అగ్రస్థానాన్ని దక్కించుకునేది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు.  

ధోనీ ఖాతాలో మరో రికార్డు
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరో అరుదైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. సోమవారం ఢిల్లీపై ధనాధన్ ఇన్నింగ్స్‌తో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా మహీ రికార్డు నెలకొల్పాడు. ఇప్పటి వరకూ ఈ రికార్డు గౌతమ్ గంభీర్ (3518 పరుగులు) పేరిట ఉండేది. కాగా, ఢిల్లీపై మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ధోనీ (3536 పరుగులతో) ఆ రికార్డును అధిగమించాడు. అత్యధిక పరుగులు చేసిన ఐపీఎల్ కెప్టెన్ల జాబితాలో కొహ్లీ (3333 పరుగులు), రోహిత్ శర్మ (2198 పరుగులు) మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చే ధోని టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసే గంభీర్, కోహ్లి, రోహిత్‌ల కంటే ముందుండటం కొసమెరుపు.



రెండు వికెట్లు కోల్పోయిన చెన్నై

Updated By ManamSat, 04/28/2018 - 21:03

IPL2018, Mumbai Indians, Chennai Super kings, Ambati rayudu, Shane Watsonపుణె: ఐపీఎల్ -11 సీజన్‌లో భాగంగా పుణె వేదికగా శనివారం ముంబయి ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు 100 స్కోరు వద్ద రెండు వికెట్లు కోల్పోయింది. తొలుత ఓపెనర్లుగా దిగిన షేన్ వాట్సాన్ (12), అంబటి రాయుడు (46) పరుగులతో వెనుదిరిగారు. క్రునాల్ పాండ్యా తన అద్భుతమైన బౌలింగ్‌తో ఓపెనర్లను పెవిలియన్లకు పంపేశాడు. పాండ్యా బౌలింగ్‌లో మర్కండేకు క్యాచ్ ఇచ్చి వాట్సాన్ ఔట్ కాగా, రాయుడు కట్టింగ్‌కు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. ఓపెనర్లు ఇద్దరూ చేతులేత్తేయడంతో సురేశ్ రైనా, కెప్టెన్ ఎంఎస్ ధోనీ క్రీజులోకి వచ్చారు. 13 ఓవర్లు ముగిసే సరికి చెన్నై జట్టు 2 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేయగా, రైనా (38), ధోనీ (1) పరుగులతో నాటౌట్‌గా క్రీజులో కొనసాగుతున్నారు. ముంబై బౌలర్లలో క్రునాల్ పాండ్యాకు రెండు వికెట్లు దక్కాయి.




Related News