rajamouli

‘సైమా’ విజేతలు వీరే

Updated By ManamSun, 09/16/2018 - 11:15
SIIMA

ఏడో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా) దుబాయ్‌లో అంగరంగ వైభవంగా జరిగాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు అందదూ అక్కడ సందడి చేశారు. ఇక ఈ అవార్డుల్లో ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి.. చిత్రంగా బాహుబలి 2 ఎంపికయ్యాయి.

విజేతలు వీరే
ఉత్తమ నటుడు: ప్రభాస్(బాహుబలి 2)
ఉత్తమ నటి: కాజల్ అగర్వాల్(నేనే రాజు నేనే మంత్రి)
ఉత్తమ నటుడు(క్రిటిక్): బాలకృష్ణ(గౌతమీ పుత్ర శాతకర్ణి)
ఉత్తమ నటి(క్రిటిక్): రితికా సింగ్(గురు)
ఉత్తమ నిర్మాత: రాజీవ్ రెడ్డి(గౌతమీపుత్ర శాతకర్ణి)
ఉత్తమ నటుడు(నెగిటివ్ రోల్): రానా దగ్గుబాటి(బాహుబలి 2)
ఉత్తమ హాస్యనటుడు: రాహుల్ రామకృష్ణ
ఉత్తమ పరిచయ నటుడు: ఇషాన్(రోగ్)
ఉత్తమ పరిచయ నటి: కల్యాణి ప్రియదర్శన్(హలో)
ఉత్తమ పరిచయ దర్శకుడు: సందీప్ రెడ్డి వంగా(అర్జున్ రెడ్డి)
ఉత్తమ సహాయ నటుడు: ఆది పినిశెట్టి(నిన్నుకోరి)
ఉత్తమ సహాయ నటి: భూమిక(ఎమ్‌సీఏ)
ఉత్తమ సంగీత దర్శకుడు: ఎంఎం కీరవాణి(బాహుబలి 2)
ఉత్తమ గాయకుడు: కాల భైరవ(దండాలయ్య- బాహుబలి 2)
ఉత్తమ గాయని: మధు ప్రియ(వచ్చిండే- ఫిదా)
ఉత్తమ గేయ రచయిత: సుద్దాల అశోక్ తేజ(ఫిదా)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: సెంథిల్ కుమార్.జపాన్‌లో దుమ్మురేపుతున్న ‘మగధీర’.. థ్యాంక్స్ చెప్పిన చెర్రీ

Updated By ManamTue, 09/11/2018 - 12:29

Magadheera‘బాహుబలి’తో తెలుగోడి సత్తాను ఖండాంతరాలు తెలిసేలా చేశాడు దర్శకధీరుడు రాజమౌళి. ఈ చిత్ర రెండు భాగాలు భారతదేశంలోనే కాకుండా మిగిలిన దేశాల్లోనూ భారీ విజయం సాధించాయి. ఇక జపాన్‌లో అయితే బాహుబలి సిరీస్‌లు వందరోజులు పూర్తిచేసుకొని భారతీయ సినీ చరిత్రలో కొత్త రికార్డును సృష్టించాయి. ఇక ఈ సినిమాలకు వచ్చిన ఆదరణను చూసి రాజమౌళి.. గతంతో రామ్ చరణ్ హీరోగా తాను తెరకెక్కించిన మగధీరను తాజాగా జపాన్‌లో విడుదల చేశారు.

ఈ చిత్రం కూడా అక్కడి వారికి బాగా ఆకట్టుకోగా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. విడుదలైన పదిరోజుల్లోనే మగధీర అక్కడ రూ.17కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీ విజయంపై హీరో రామ్ చరణ్ చాలా సంతోషంగా ఉందని, తనకు గుర్తుండిపోయే సినిమాను ఇచ్చిన రాజమౌళికి కృతఙ్ఞతలు అంటూ పేర్కొన్నారు.

 

Thank you Japan.. feel really blessed and humbled with all the love showered upon us. This will always remain close to...

Posted by Ram Charan on Monday, September 10, 2018

 గాయనితో రాజమౌళి తనయుడి నిశ్చితార్థం

Updated By ManamThu, 09/06/2018 - 08:28

Karthikeyaప్రముఖ దర్శకుడు రాజమౌళి తనయుడు కార్తికేయ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. భక్తిగీతాలు ఆలపించే గాయని పూజా ప్రసాద్‌తో కార్తికేయ ప్రేమలో ఉండగా.. వీరిద్దరి పెళ్లికి ఇరు వర్గాలు ఒప్పుకోవడంతో నిశ్చితార్థం చేశారు. రాజమౌళి ఇంట్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇక ఈ ఏడాది చివరిలో వీరిద్దరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా పూజా.. ప్రముఖ నిర్మాత ‘జగపతి’ రాజేంద్రప్రసాద్ పెద్ద కుమారుడు రాంప్రసాద్ కుమార్తె. నటుడు జగపతిబాబుకు రాంప్రసాద్ సోదరుడు అవుతారు. ఇదిలా ఉంటే రాజమౌళి దగ్గర అసిస్టెంట్‌గా చేయడంతో పాటు పలు చిత్రాలకు లైన్ ప్రొడ్యూసర్‌గా పనిచేసిన కార్తికేయ.. ప్రస్తుతం వివిధ రంగాల్లో తన ప్రతిభను కనబరుస్తున్నాడు.

 రాజమౌళి తనయుడి ‘కబడ్డీ’ ఆట

Updated By ManamMon, 09/03/2018 - 15:01

Rajamouli, Karthikeyaఅసిస్టెంట్‌గా, లైన్ ప్రొడ్యూసర్‌గా పలు సినిమాలకు పనిచేసిన దర్శకధీరుడు రాజమౌళి తనయుడు ఎస్.ఎస్. కార్తికేయ మరో కొత్త అవతారం ఎత్తాడు. తెలంగాణ ప్రీమియర్ కబడ్డీలో నల్గొండ ఈగల్స్‌ టీమ్‌ను కొనుగోలు చేశాడు కార్తికేయ. ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటితో కలిసి నల్గొండ టీమ్‌కు సహ యజమానిగా వ్యవహరించనున్నాడు.

ఈ విషయాన్ని కార్తికేయ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. దానికి స్పందించిన రాజమౌళి.. ‘‘ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో కబడ్డీకి మంచి ప్రాచుర్యం లభించింది. నల్గొండ ఈగల్స్ టీమ్‌కు మెంటర్‌గా ఉన్నందుకు సంతోషపడుతున్నా. వారు ఆడటం చూసేందుకు ఎదురుచూస్తున్నా’’ అంటూ కామెంట్ పెట్టాడు. కాగా తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ రెండో సీజన్ సెప్టెంబర్ 14నుంచి మొదలు కానున్న విషయం తెలిసిందే.

 గీత గోవిందంపై దర్శకధీరుడి ప్రశంసలు

Updated By ManamThu, 08/16/2018 - 09:21

Rajamouli, Geetha Govindamవిజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా పరశురామ్ తెరకెక్కించిన చిత్రం ‘గీత గోవిందం’. స్వాతంత్ర్యదినోత్సవం కానుకగా బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో థియేటర్లో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని చూసిన దర్శకధీరుడు రాజమౌళి మూవీ యూనిట్‌పై ప్రశంసలు కురిపించారు.

‘‘గీత గోవిందం ఓ నవ్వుల ప్రవాహం. విజయ్ దేవరకొండ పాత్రను ఇలా ఊహించలేదు. అర్జున్ రెడ్డి తరువాత అతడి పాత్ర ఎంపిక బావుంది. ఏం చేస్తున్నాడో అతడికి బాగా స్పష్టంగా తెలుసు. సినిమా మొత్తం నవ్వులు పూయించింది. పరశురామ్ చిత్రాన్ని బాగా రచించి, దర్శకత్వం వహించారు. రాహుల్ రామకృష్ణ, అన్నపూర్ణమ్మ గారు, వెన్నల కిశోర్.. చాలా బాగా చేశారు. చిత్ర యూనిట్ మొత్తానికి కంగ్రాట్స్’’ అంటూ ప్రశంసలు కురిపించాడు. దీనిపై స్పందించిన విజయ్ దేవరకొండ.. ‘‘మీ దగ్గర నుంచి ప్రశంసలు పొందడం ఎప్పటికైనా స్పెషల్’’ అంటూ కామెంట్ ఇచ్చాడు.

 ఆమిర్ చేతిలో ‘మహాభారతం’.. నెక్ట్స్ ప్రాజెక్ట్ అదేనా..?

Updated By ManamMon, 08/06/2018 - 12:56

Aamir Khanమహాభారతం.. భారతదేశంలోని చాలా మంది నటీనటులు, దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. అందులో రాజమౌళి, ఆమిర్ ఖాన్, మోహన్‌లాల్ తదితరులు ఉన్నారు. ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించాలని రాజమౌళి ఒకసారి తెలపగా.. ఏదో ఒకరోజు మహాభారతం చేయాలనుందని ఆమిర్ కూడా పేర్కొన్నారు. అంతేకాదు ఈ ఇద్దరి కాంబినేషన్లోనే ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుందని వార్తలు కూడా వచ్చాయి. అయితే దానికి సంబంధించిన పనులు మాత్రం ఇప్పటికీ ప్రారంభం కాలేదు. కానీ తాజాగా ఆమిర్‌ను చూస్తుంటే ఆ ప్రాజెక్ట్‌ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లేలా ఉంది. 

వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఆమిర్‌ఖాన్ ఓ బుక్ పట్టుకొని కనిపించారు. దానిమీద ‘కండెన్స్‌డ్ మహాభారత ఆఫ్ వ్యాస’ అని రాసి ఉంది. దీంతో ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించేందుకు ఆమిర్ ఖాన్ సిద్ధమయ్యాడని పలువురు బాలీవుడ్ ప్రముఖులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే మహాభారతాన్ని తెరకెక్కిస్తే అందుకు వెయ్యి కోట్లు ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ ప్రకటించిన విషయం తెలిసిందే.కేటీఆర్‌కు రాజమౌళి చాలెంజ్

Updated By ManamTue, 07/24/2018 - 14:25

rajamouli తెలంగాణ ఎంపీ కవిత విసిరిన సవాల్‌ను దర్శకధీరుడు రాజమౌళి స్వీకరించారు. హరితహారంలో భాగంగా మర్రి, గుల్మోహర్, మలబారు వేప చెట్టలను తన ఫామ్‌ హౌస్‌లో నాటిన రాజమౌళి.. దానికి సంబంధించిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి ఛాలెంజ్‌ను స్వీకరించినట్లు తెలిపారు. ఆ తరువాత తన సవాల్‌ను స్వీకరించవల్సిందిగా మంత్రి కేటీఆర్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్, దర్శకులు సందీప్ వంగ, నాగ్ అశ్విన్‌ల పేర్లను నామినేట్ చేశారు. అయితే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో భాగంగా ఇప్పటికే కొన్నివేల చెట్లను రాష్ట్ర వ్యాప్తంగా నాటిన విషయం తెలిసిందే.రాజ‌మౌళికి నో..?

Updated By ManamSat, 07/21/2018 - 12:44

Rajamouli, Samantha బాహుబ‌లితో తెలుగు సినిమా స్థాయిని ప్ర‌పంచానికి చాటిన ద‌ర్శ‌క‌డు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి. ప్ర‌స్తుతం ఈయ‌న ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌ల‌తో ఓ మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ చేస్తున్నారు.  ఈ చిత్రం న‌వంబ‌ర్ నుండి సెట్స్‌కి వెళుతుంద‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల టాక్‌. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర కోసం రాజ‌మౌళి టీమ్ స‌మంత‌ను సంప్ర‌దించార‌ట‌. అయితే స‌మంత ఆ ఆఫ‌ర్‌ని సున్నితంగా తిర‌స్క‌రించార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళితో సినిమా చేయ‌డానికి ఏ హీరోయిన్ అయినా కాద‌న‌దు. అలాంటి స‌మంత ఆ ఆఫ‌ర్‌ను తిరస్క‌రించార‌ని వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేద‌ని కూడా ఇంకొంద‌రు అంటున్నారు. మ‌రి స‌మంత దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌తో రాజమౌళి

Updated By ManamWed, 07/18/2018 - 11:24

rajamouli, cherry ‘బాహుబలి’తో తెలుగు సినిమా చరిత్రను తిరగ రాసిన ఎస్.ఎస్.రాజమౌళి తదుపరి చిత్రంపైనే అందరి దృష్టీ ఉంది. రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి ఓ భారీ మల్టీస్టారర్‌ను రూపొందించనున్న విషయం తెలిసిందే. ఆర్.ఆర్.ఆర్. అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. డి.వి.వి. దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా అక్టోబర్‌లో ప్రారంభమవుతుంది. అయితే ఈ సినిమా బ్యాక్‌డ్రాప్‌పై పలు క‌థ‌నాలు విన‌ప‌డ్డాయి. తాజాగా సినిమా 1947 బ్యాక్‌డ్రాప్‌లో స్వాతంత్ర్యం కోసం చేసే పోరాటాల బ్యాక్‌డ్రాప్‌లో కూడా ఉంటుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మ‌రి సినిమా మొత్తం ఇదే బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందా?  లేక కొంతేనా అని తెలియాలంటే వేచి చూడాల్సిందే.ఆ అద్భుతానికి మూడేళ్లు

Updated By ManamTue, 07/10/2018 - 11:29

Baahubali భారత సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న చిత్రం ‘బాహుబలి’. రాజమౌళి తెరకెక్కించిన ఆ అద్భుత దృశ్యకావ్యం తెలుగు సినిమా స్థాయిని ఖండాలు దాటించింది. ఇక రెండు భాగాలుగా ఈ చిత్రం విడుదల కాగా.. అందులో మొదటి భాగం ‘‘బాహుబలి-ది బిగినింగ్’’ రిలీజై జూలై 10కి సరిగ్గా మూడేళ్లు అయ్యింది. రాజమౌళి తెరకెక్కించిన తీరు, నటీనటుల అద్భుత నటన, సాంకేతిక వర్గాల పనితీరు.. ఇలా ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి అంశం అన్ని వర్గాలను ఆకట్టుకుంది. అలాగే బాక్సాఫీస్ వద్ద భారత సినీ చరిత్రలోనే కొత్త రికార్డును సృష్టించింది ఈ చిత్రం. 

ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రీక్వెల్‌కు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రాజమౌళి పర్యవేక్షణలో దేవాకట్టా ఈ మూవీ ప్రీక్వెల్‌ను తెరకెక్కించనున్నారు. ఈ చిత్రం కోసం దాదాపు రూ.350 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు సమాచారం.

Related News