rangasthalam

హీరోగా కీరవాణి తనయుడు..?

Updated By ManamFri, 11/02/2018 - 10:19

Simha, Keeravaniహీరో, హీరోయిన్ల తనయులే కాదు సంగీత దర్శకుల తనయులు కూడా హీరోలుగా టాలీవుడ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు. ఈ క్రమంలో అప్పట్లో కోటి కుమారుడు రాజీవ్ సాలూరి హీరోగా కొన్ని చిత్రాల్లో నటించగా.. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడట.

కీరవాణి రెండో తనయుడు సింహా కోడూరి హీరోగా రాబోతున్నాడట. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి కొత్త దర్శకుడు దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. అంతేకాదు కీరవాణి పెద్ద తనయుడు కాల భైరవ(దండాలయ్య, పెనిమిటి పాటల ఫేమ్)ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం కాబోతున్నట్లు కూడా తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందట. కాగా రంగస్థలం చిత్రానికి సింహా అసిస్టెంట్ డైరక్టర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే.బుల్లితెరపైనా ‘రంగస్థలం’ రికార్డు

Updated By ManamThu, 10/25/2018 - 12:19

Rangasthalamమెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన చిత్రం ‘రంగస్థలం’. ఈ ఏడాది మార్చి చివర్లో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకొని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించగా.. తాజాగా వెండితెరపైనా దూసుకుపోయింది. ఇటీవలే ‘రంగస్థలం’ మొదటి ప్రీమియర్ స్టార్ మాలో ప్రదర్శించబడగా.. 19.5టీఆర్పీ రేటింగ్‌ను సాధించింది. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకు విడుదలైన సినిమాలలో మహానటి అత్యధిక టీఆర్పీని సాధించగా.. ఆ తరువాత రంగస్థలం నిలిచింది. దీంతో మెగాభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా రామ్ చరణ్, ఆది పినిశెట్టి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సమంత, అనసూయ తదితరులు కీలక పాత్రలలో నటించగా.. కేరళలో ఈ చిత్రాన్ని వచ్చే నెలలో విడుదల చేయనున్నారు.చిన్న సినిమాల నిర్మాణంలో..!

Updated By ManamWed, 09/19/2018 - 18:53
mythri movies

శ్రీమంతుడు, జనతాగ్యారేజ్, రంగస్థలం చిత్రాలతో వరుస విజయాలను సొంతం చేసుకున్న నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. ఈ మూడు చిత్రాలు అగ్ర కథానాయుకులతో చేసిన భారీ బడ్జెట్ చిత్రాలే. అయితే కేవలం భారీ బడ్జెట్ చిత్రాలే కాదు.. తక్కువ బడ్జెట్ చిత్రాలను కూడా నిర్మించడానికి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ సన్నాహాలు చేసుకుంటుంది. సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఎప్పుడో స్టార్ట్ అయ్యాయట. కొత్త దర్శకుడు, కొత్త నటీనటులతో ఈ సినిమా తెరకెక్కనుందనేది సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయట. ‘‘రంగమ్మా.. మంగమ్మా’’.. మరో రికార్డమ్మా

Updated By ManamMon, 09/17/2018 - 09:29

Rangamma Mangammaరామ్ చరణ్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన ‘రంగస్థలం’ ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలోని ప్రతి విభాగం అందరినీ ఆకట్టుకొని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇక ఈ చిత్రంతో మరోసారి తన మ్యూజిక్ సత్తాను చాటాడు రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్. మొత్తం ఆరు పాటలు ఉండగా.. ప్రతి పాట అందరినీ మెప్పించేలా కంపోజ్ చేశాడు. కాగా ఈ చిత్రంలోని రంగమ్మా మంగమ్మా వీడియో పాట  ఇప్పుడు అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.

ఈ ఏడాది ఏప్రిల్ 28న విడుదలైన ఈ పాట తాజాగా 100మిలియన్ వ్యూస్‌ను దాటేసింది. దీంతో 100మిలియన్లు సాధించిన రెండో తెలుగు పాటగా రంగమ్మా.. మంగమ్మా నిలిచింది. దేవీ శ్రీ మ్యూజిక్, మానసి వాయిస్‌కు తోడు సమంతల ఎక్స్‌ప్రెషన్స్ ఈ పాట ఇంత పెద్ద విజయాన్ని సొంతం చేసుకునేలా చేసింది. కాగా బాహుబలిలోని సాహోరో బాహుబలి పాట తెలుగులో మొదటి 100మిలియన్ల వ్యూస్‌ను సాధించి, రికార్డు సృష్టించింది.‘సైరా’ షూటింగ్‌కి బ్రేక్.. సెట్స్ కూల్చివేత

Updated By ManamWed, 08/01/2018 - 09:42

Sye Raa Shooting

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఈ సినిమా షూటింగ్‌ విజయవంతంగా సాగుతోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దిగ్గజ నటులంతా నటిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ షూటింగ్‌కు చిక్కులొచ్చిపడ్డాయి!. శేరిలింగంపల్లి రెవెన్యూ పరిధిలో ఉన్న ఈ సెట్స్‌లో ఇదివరకు ‘రంగస్థలం’ షూటింగ్ జరిగింది. అయితే ఇదే సెట్‌‌లోనే సైరా షూటింగ్ జరిపింది చిత్రబృందం. ఇంతలో రెవెన్యూ సిబ్బంది ఎంటరవ్వడంతో షూటింగ్ ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది.! ఎలాంటి అనుమతులు లేకుండా ఇక్కడ షూటింగ్ ఎలా జరుపుతారంటూ రెవెన్యూ సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సైరా నిర్మాణ సంస్థపై వేటు వేయడం జరిగింది. అంతటితో ఆగని రెవెన్యూ సిబ్బంది సైరా సెట్స్‌ను కూల్చివేసింది. ఈ చిత్రంలో కథానాయకుడు నివసించే ఇళ్లను కూల్చివేసినట్లు తెలుస్తోంది.

అనుమతులు లేకుండా ఇలా షూటింగ్ చేయడం ఓ రకమైన భూ కబ్జా కిందికి వస్తుందని అధికారులు మీడియాకు వివరించారు. పలుమార్లు చిత్ర నిర్మాణ సంస్థకు నోటీసులు పంపినప్పటికీ స్పందించకపోగా.. మమ్మల్ని లెక్కచేయకుండానే ఇలా దౌర్జన్యంగా షూటింగ్ జరుపుతోందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ల్యాండ్‌కు సంబంధించిన కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తోందని అందుకే వారి దగ్గర్నుంచే తాము అనుమతి తెచ్చుకుని షూటింగ్ జరుపుతున్నామని చిత్రబృందం చెబుతోంది. అయితే ఈ వ్యవహారం ఎంత వరకూ వెళ్తుందో వేచి చూడాల్సిందే.

కాగా.. రెవెన్యూ అధికారులు కూల్చేసిన సెట్స్‌తో నిర్మాణ సంస్థకు ఎంత నష్టం వాటిల్లిందనే విషయం తెలియరాలేదు. కొద్దిరోజుల పాటు సినిమా షూటింగ్ ఆపేయాలని చిత్రబృందం యోచిస్తోంది. కాగా మంగళవారం మధ్యాహ్నమే సినిమా షూటింగ్ నుంచి ఇంటికొచ్చిన మెగస్టార్ చిరంజీవి గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి తన పెరట్లో మొక్కలు నాటిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత ఈ సెట్స్ కూల్చివేయడం జరిగిందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.మొత్తానికి ‘జిగేలు రాణి’కి న్యాయం జరిగింది

Updated By ManamSat, 07/21/2018 - 12:02

jigelu Rani ఈ ఏడాది ఘన విజయం సాధించిన రంగస్థలంలోని ‘జిగేలు రాణి’ అనే పాటను పాడినందుకు గానూ తనకు ఒక్క రూపాయి కూడా ముట్టలేదని ఆ పాటను ఆలపించిన వెంకటలక్ష్మి ఇటీవల ఓ చానెల్‌తో తన గోడును చెప్పుకుంది. ఇది కాస్త వైరల్‌గా మారి దర్శకుడి వరకు వెళ్లడంతో.. ఈ వివాదంపై సుకుమార్ స్పందించారు. ఈ పాట  పాడినందుకు గానూ ఆమెకు లక్ష రూపాయల చెక్‌ను సుకుమార్ పంపించారు. రంగస్థలం 100 రోజుల వేడుకకు ఆమెను పిలిచేందుకు ప్రయత్నించామని, అయితే ఫోన్ నంబర్ అందుబాటులో లేకపోవడంతో కుదరలేదని ఈ సందర్భంగా సుకుమార్ అన్నారు.

అయితే చిన్నప్పటి నుంచి బుర్రకథలు చెప్పుకునే వెంకటలక్ష్మికి ‘రంగస్థలం’లో పాడే అవకాశం వచ్చింది. నాగభూషణం అనే మధ్యవర్తి వలన చెన్నై వెళ్లిన ఆమె రెండు రోజులు అక్కడే ఉండి పాటను పాడి వచ్చింది. అప్పటి నుంచి ఇంతవరకు తనకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఇటీవలే తన గోడును ఓ చానెల్‌కు చెప్పుకుంది వెంకటలక్ష్మి. దీనిపై చిత్ర యూనిట్‌ను స్పందించాలని చాలా సార్లు ప్రయత్నించినప్పటికీ మధ్యవర్తి తనకు మోసం చేశాడని వెంకటలక్ష్మి తెలిపిన విషయం తెలిసిందే.రామ్ చరణ్‌కు అరుదైన ఆహ్వానం

Updated By ManamThu, 07/12/2018 - 11:52

Ram Charan ఈ యేడాది‘రంగస్థలం’తో పెద్ద హిట్‌ను సొంతం చేసుకున్న మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌కు అరుదైన ఆహ్వానం లభించింది. ఈ సంవత్సరం ఆస్ట్రేలియాలో జరగబోయే మెల్‌బోర్న్ ఫిలింఫెస్టివల్‌లో ముఖ్య అతిథిగా పాల్గొనవలసిందిగా రామ్ చరణ్‌కు ఆ కమిటీ ఆహ్వానం పలికింది. ఆగష్టు 10 నుంచి 22వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. అయితే ఈ ఉత్సవాలకు చెర్రీ వెళ్తాడా..? లేదా..? అన్నది తెలియాల్సి ఉంది. కాగా ప్రస్తుతం రామ్ చరణ్ బోయపాటి చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో చెర్రీ సరసన కియారా అద్వాణి నటిస్తుండగా.. వివేక్ ఒబెరాయ్ విలన్‌గా కనిపించనున్నాడు. స్నేహ, ప్రశాంత్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.‘రంగస్థలం’, ‘మహానటి’లకు అరుదైన గౌరవం

Updated By ManamThu, 07/12/2018 - 11:38

Rangasthalam, Mahanatiఈ ఏడాది వేసవిలో విడుదలై బ్లాక్ బస్టర్‌లుగా నిలిచిన ‘రంగస్థలం’, ‘మహానటి’ చిత్రాలకు అరుదైన గౌరవం లభించింది. ఈ యేడాది ఆస్ట్రేలియాలో జరగబోయే మెల్‌బోర్న్ ఫిలిం ఫెస్టివల్‌లో ఈ చిత్రాలు ప్రదర్శింపబడనున్నాయి. ఈ మేరకు ద ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్-2018 కమిటీ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ప్రాంతీయ చిత్రాలలో తెలుగు నుంచి ఈ రెండు చిత్రాలు ఎంపికవ్వడం విశేషం. ఇక ఈ ఉత్సవాలు ఆగష్టు 10 నుంచి 22వరకు జరగనున్నాయి.

కాగా 80లలో జరిగిన పల్లెటూరి రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన రంగస్థలం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాదు కొన్ని చోట్ల నాన్ బాహుబలి రికార్డులను కూడా బ్రేక్ చేసింది. మరోవైపు సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి అన్ని వర్గాల వారికి ఆకట్టుకుంది. ఈ రెండు చిత్రాలు విదేశీ బాక్సాఫీస్ వద్ద కూడా తెలుగు వారి సత్తాను చాటి చెప్పిన విషయం తెలిసిందే.చెర్రీ.. నీ నుంచి దూరమవుతానని భయంగా ఉంది

Updated By ManamMon, 07/09/2018 - 09:02

Ram Charan, Sukumar‘‘చెర్రీ నీతో మరో చిత్రం తీయాలనుంది. లేకపోతే నీ నుంచి దూరం పెరుగుతుందని భయంగా ఉంది’’ అంటూ దర్శకుడు సుకుమార్, రామ్ చరణ్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో వచ్చిన ‘రంగస్థలం’ బాక్సాఫీస్ వద్ద వసూళ్లు కురిపించి ఇటీవలే వంద రోజులను పూర్తి చేసుకోగా.. ఆదివారం జరిగిన శతదినోత్సవ వేడుకల్లో చిత్ర యూనిట్ పాల్గొంది.

ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ.. ఈ చిత్రం ఇంత బాగా రావడానికి చెర్రీనే కారణమని, చెర్రీ ఒప్పుకోకపోతే ఈ సినిమా ఉండేదే కాదని అన్నారు. ఈ చిత్రం కోసం పనిచేసిన అందరికీ చాలా కృతఙ్ఞతలని తెలిపారు. అలాగే తన విజన్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, తన సోల్ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ అని.. వారిద్దరు లేకపోతే ఈ చిత్రం ఇంత బాగా వచ్చేది కాదని చెప్పారు. ఇక మూవీ తరువాత చెర్రీ నుంచి దూరం పెరుగుతుందని భయంగా ఉందని, అందుకే అతడితో మరో మూవీ తీయాలనుందని మనసులోని మాటను సుకుమార్ బయటపెట్టగా.. వెంటనే స్పందించిన రామ్ చరణ్.. ‘‘ఎప్పుడెప్పుడేంటి, తొందరగా చెప్పు’’ అంటూ ఉత్సాహాన్ని చూపారు. ఇక వీరి మాటలను విన్న అభిమానులందరూ సంతోషాన్ని వ్యక్తపరిచారు.‘రంగస్థలం’@100 రోజులు

Updated By ManamSat, 07/07/2018 - 12:05
rangasthalam

ఇప్పటికాలంలో ఏదైనా చిత్రం థియేటర్లలోకి వచ్చిందంటే రెండు, మూడు వారాలు.. ఒకవేళ అదిరిపోయే టాక్ వస్తే నెల అంతకుమించి ప్రదర్శించబడే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇలాంటి సమయంలో రామ్ చరణ్ రంగస్థలం వంద రోజులను పూర్తి చేసుకుంది. ఒకటి, రెండు కాదు దాదాపు 16 థియేటర్లలో ఈ చిత్రం సెంచరీని పూర్తి చేసుకుంది. ఇక రంగస్థలం వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు.

రామ్ చరణ్, సమంత, ఆది, ప్రకాశ్ రాజ్, జగపతి బాబు, అనసూయ ఇలా ప్రధాన పాత్రాధారులందరూ తమ పాత్రలలో ఒదిగిపోవడం, సుకుమార్ స్ర్కీన్ ప్లే , రత్నవేలు సినిమాటోగ్రఫీ, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం, రామకృష్ణ- మౌనిక ఆర్ట్ వర్క్ ఇలా ప్రతి విభాగంలోనూ ఈ చిత్రం అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఇప్పటి వరకు విడుదలైన అన్ని చిత్రాల్లో పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది రంగస్థలం.

Related News