anr

‘ఏఎన్నార్‌’ స్వయంగా దిగివచ్చిరా?

Updated By ManamThu, 09/20/2018 - 17:38
ntr

‘ఎన్టీఆర్’ బయోపిక్ మీద రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. గతవారం ఎన్టీ రామారావు గెటప్‌లో ఉన్న బాలయ్య ఫస్ట్ లుక్, ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు పాత్రలో రానా ‘లుక్’ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా గురువారం ‘ఏఎన్నార్‌’ జయంతి సందర్బంగా ‘ఎన్టీఆర్’ బయో పిక్‌లో ఏఎన్నార్ క్యారెక్టర్‌‌‌లో నటిస్తున్న సుమంత్ లుక్‌ని రిలీజ్ చేశారు. ఈ లుక్ చూస్తుంటే ‘ఏఎన్నార్‌’ స్వయంగా ఎన్టీఆర్ బయోపిక్ కోసమే దిగి వచ్చారా అనే అనుభూతి కలుగుతోంది. ఈ లుక్స్ అన్నింటిని  చూస్తుంటే ‘ఎన్టీఆర్’ బయోపిక్‌పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు.

చదవండి:

 అచ్చు ‘అక్కినేని’లాగే.. ఆకట్టుకుంటున్న సుమంత్అచ్చు ‘అక్కినేని’లాగే.. ఆకట్టుకుంటున్న సుమంత్

Updated By ManamThu, 09/20/2018 - 09:58

Sumanthఉమ్మడి ఆంధ్రప్రదేశ్  మాజీ ముఖ్యమంత్రి, నటసార్వభౌమ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘యన్‌టిఆర్’. బాలకృష్ణ ఇందులో ఎన్టీఆర్‌గా ప్రధానపాత్రలో నటిస్తుండగా.. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో ఆయన మనవడు సుమంత్ నటిస్తున్నాడు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్‌లో సుమంత్ పాల్గొనగా.. ఇవాళ అక్కినేని జయంతి సందర్భంగా మొదటి లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.

అందులో అక్కినేని నాగేశ్వరరావు లుక్‌లో నిజంగానే ఆయనేనా అన్నట్లుగా అచ్చు దిగిపోయాడు సుమంత్. కాగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ నటిస్తుండగా.. రానా, ప్రకాశ్ రాజ్, నరేశ్, కైకాల సత్యనారాయణ, కీర్తి సురేశ్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రంపై అటు అభిమానుల్లో పాటు ఇటు విమర్శకుల్లోనూ మంచి అంచనాలు ఉన్నాయి.ఎన్టీఆర్, ఏఎన్నార్‌కు షాకిచ్చిన సావిత్రి

Updated By ManamThu, 05/17/2018 - 21:55

savitriతెలుగు సినీ పరిశ్రమకు మ‌హాన‌టులు ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్ళ లాంటివారు. అటువంటి మహానటులు సైతం వారి సినిమాల్లో అల‌నాటి మేటి న‌టి సావిత్రి ఉండాల‌ని నిర్మాతలను డిమాండ్ చేసారంటే.. సావిత్రి నటనా ప్రతిభ ఏమిటో అర్థం చేసుకోవ‌చ్చు. ఆ ఇద్ద‌రు హీరోల‌తో సమానంగా అప్పట్లో పారితోషికాన్ని అందుకున్న లేడీ సూపర్ స్టార్ మహానటి సావిత్రి.. రెండు సందర్భాల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్‌లను సైతం ఆశ్చర్యానికి గురి చేశార‌ట‌.

కాస్త ఆ వివరాల్లోకి వెళితే.. 1977 సంవ‌త్స‌రంలో ఆంధ్రప్రదేశ్‌లోని దివిసీమలో జరిగిన ప్రకృతి వైపరీత్యానికి  తెలుగు సినీ పరిశ్రమ స్పందించింది. ఆ వైపరీత్యానికి బాధితులైన వారిని ఆదుకోవడానికి ఎన్టీఆర్, ఏఎన్నార్‌లతో పాటు సావిత్రి కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడ కొంతమంది అభిమానులు ఎన్టీఆర్‌ను పూలమాలతో సత్కరిస్తే.. ఆ మాలను వేలం పాటలో రూ.10,000కు సొంతం చేసుకున్నారు సావిత్రి. దానికి షాక్ అయిన‌ ఎన్టీఆర్ “కేవ‌లం ఒక పూలదండ‌ కోసం డబ్బులను ఎందుక‌లా దుబారాగా ఖర్చు చేస్తావ్?” అని హెచ్చరించారట. దానికి బదులుగా ఆమె, “ఇది అందరికీ మాలే కాని నాకు మాత్రం వెల కట్టలేని వస్తువు. అదీగాక ఈ రూపంలో ఈ బాధితులకు సాయం చేసినందుకు ఆనందంగా కూడా ఉంది” అని బదులిచ్చారట.

మరొక సందర్భంలో చెన్నైలో ఒక ఇంటిని కట్టుకున్న ఏఎన్నార్, తన పాత ఇంటిని అమ్మకానికి పెడితే.. ఒక బ్లాంక్ చెక్కుతో ఆ ఇంటి విలువను రాసుకోమని చెప్పారట సావిత్రి. దీంతో.. ఏఎన్నార్ షాక్‌కు గుర‌వ‌డ‌మే కాకుండా త‌న‌ ఈగో కూడా హ‌ర్ట‌య్యింద‌ట‌. తన అభిమాన నటుడి ఇంటిని వెల కట్టడం తన వల్ల కాదన్న‌దే ఆమె భావన కావ‌డంతో.. అలా చేశార‌ట‌. ఆమె ఉద్దేశం ఏదైనా.. ఆమె ఎంచుకున్న మార్గం మాత్రం సరైనది కాదని అప్పట్లో కొంతమంది అభిప్రాయ‌ప‌డ్డారు.

ఏదేమైనా.. ఈ రెండు సందర్భాలను ‘మహానటి’ సినిమాలో చూపించి ఉంటే మ‌రింత‌ బాగుండేదని అభిమానులు భావిస్తున్నారు.చైతుని చూస్తే గ‌ర్వంగా ఉంది - నాగ్‌

Updated By ManamThu, 05/10/2018 - 16:33

nag''ఈ రోజు ఒక తండ్రిగా గ‌ర్వపడుతున్నాను.. ఒక కొడుకుగా అసూయపడుతున్నాను'' అంటున్నారు అక్కినేని నాగార్జున‌. కాస్త వివ‌రాల్లోకి వెళితే..

న‌టీమ‌ణి సావిత్రి జీవితం ఆధారంగా తెర‌కెక్కిన 'మ‌హాన‌టి' బుధ‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇందులో నాగార్జున తండ్రి, మ‌హాన‌టుడు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు పాత్ర‌లో..  నాగ‌చైత‌న్య కొన్ని స‌న్నివేశాల కోసం సందడి చేశారు. వీటికి మంచి స్పంద‌న వ‌స్తోంది. త‌న తండ్రి పాత్ర‌లో చైతు న‌టించ‌డంపై నాగ్ ఈ రోజు (గురువారం) స్పందించారు. ''ఈ రోజు నేను గ‌ర్వంతో కూడిన తండ్రిని.. అలాగే అసూయపడుతున్న కొడుకుని. నా జీవితంలో నేనెప్పుడు.. అక్కినేని నాగేశ్వ‌ర‌రావులా న‌టించ‌లేదు. అయితే.. ఏఎన్నార్ పాత్ర‌లో చైత‌న్యని మీ అంద‌రికి ప్ర‌జెంట్ చేయ‌డం చాలా సంతోషంగా ఉంది'' అంటూ నాగ్ ట్విట్ట‌ర్‌లో స్పందించారు. ఈ పోస్ట్‌తో పాటు ఏఎన్నార్ లుక్‌లో ఉన్న చైతు ఫొటోను విడుద‌ల చేశారు.సెవెన్త్ వండ‌ర్స్ ( స్పెష‌ల్ ఆర్టిక‌ల్‌)

Updated By ManamThu, 05/03/2018 - 18:38

7th'రంగ‌స్థ‌లం'.. తెలుగు నాట వ‌సూళ్ళ వ‌ర్షం కురిపిస్తున్న తాజా చిత్రం పేరిది. 1980ల నాటి గ్రామీణ వాతావ‌ర‌ణంతో.. అక్క‌డి రాజ‌కీయాల నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమా.. ద‌ర్శ‌కుడిగా సుకుమార్ ప్ర‌తిభ‌ని మ‌రోసారి చాటింది. అంతేగాకుండా.. ఆయ‌న కెరీర్ బెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా.. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన 7వ చిత్రం. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే.. గ‌తంలో ప‌లువురు సినీ ప్ర‌ముఖుల ఏడో చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఇలానే సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డ‌మే కాకుండా.. కెరీర్ బెస్ట్ హిట్‌గా నిల‌వ‌డ‌మో.. ట‌ర్నింగ్ పాయింట్‌గా నిల‌వ‌డ‌మో జ‌రిగిన సంద‌ర్భాలున్నాయి. అలాగే వారి కెరీర్‌లో మంచి విజ‌యాలు అందించ‌డ‌మో జ‌రిగింది.  ఓ సారి ఆ ప్ర‌ముఖుల 7వ సినిమాల‌ వైపు దృష్టి పెడితే..

నంద‌మూరి తార‌క రామారావు
న‌ట సార్వ‌భౌముడు ఎన్టీఆర్ సినీ ప్ర‌స్థానంలోనే కాదు, తెలుగు సినిమా చరిత్ర‌లోనూ 'పాతాళ భైర‌వి'ది చెర‌గ‌ని స్థానం. ఈ సినిమాలో తోట రాముడు పాత్ర‌లో ఆయ‌న చేసిన సంద‌డి అంతా ఇంతా కాదు. కె.వి.రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం అప్ప‌ట్లో సంచ‌ల‌న విజ‌యం సాధించింది. న‌టుడిగా ఈ సినిమా.. ఎన్టీఆర్‌కు ఏడ‌వ చిత్రం.

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు
మ‌హాన‌టుడు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు కెరీర్‌లో 'బాల‌రాజు' చిత్రం ప్ర‌త్యేకం. ఈ సినిమాతో న‌టుడిగా ఏఎన్నార్ స్థాయి మ‌రింత పెరిగింది.  విజ‌య‌వాడ‌లో ఏడాది పాటు ఆడిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వ‌ద్ద ప‌లు రికార్డుల్ని సృష్టించింది. ఈ సినిమా.. త‌న‌ కెరీర్‌లో ఏడ‌వ చిత్రం కావ‌డం విశేషం.

ప‌వ‌న్ క‌ల్యాణ్‌
ప‌వ‌న్ క‌ల్యాణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రాల‌లో 'ఖుషి' ఒక‌టి. ఆడియో ప‌రంగానూ.. సినిమా ప‌రంగానూ అనేక సంచ‌ల‌నాల‌కు కేంద్ర బిందువుగా నిలిచిన ఈ చిత్రం.. ప‌వ‌న్ ఇమేజ్‌ను అమాంతం ఎన్నో రెట్లు పెంచింది.  అలాంటి 'ఖుషి'.. ప‌వ‌న్ కెరీర్‌లో ఏడ‌వ సినిమా కావ‌డం విశేషం.

మ‌హేశ్ బాబు, భూమిక‌, గుణ‌శేఖ‌ర్‌
'ఒక్క‌డు'.. మ‌హేశ్ బాబు కెరీర్‌లో ట‌ర్నింగ్ పాయింట్‌లా నిలిచిన చిత్రం పేరిది. అప్ప‌టివ‌ర‌కు మ‌హేశ్‌కున్న ఇమేజ్‌ను పూర్తిగా మార్చివేయ‌డ‌మే కాకుండా.. రికార్డు స్థాయి వ‌సూళ్ళ‌ను మూట‌గ‌ట్టుకుంది. మ‌హేశ్‌కు స్టార్ డ‌మ్ తీసుకువ‌చ్చిన ఈ సినిమా.. ఆయ‌న కెరీర్‌లో ఏడ‌వ చిత్రం. అలాగే క‌థానాయిక భూమిక‌, ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ కెరీర్‌లోనూ ఇది ఏడో చిత్రం కావ‌డం విశేషం.

ఎన్టీఆర్‌
తాత‌య్య ఎన్టీఆర్‌కు ఏడ‌వ చిత్రం 'పాతాళ భైర‌వి' ఏ విధంగానైతే ట‌ర్నింగ్ పాయింట్‌లా నిలిచిందో.. అలాగే మ‌న‌వ‌డు ఎన్టీఆర్‌కు కూడా అత‌ని ఏడో చిత్రం మంచి బ్రేక్‌ను అందించిన సినిమా కావ‌డం యాదృచ్ఛిక‌మైనా ఓ విశేషంగానే చెప్పుకోవాలి. ఇంత‌కీ ఆ చిత్ర‌మేమిటంటే.. 'సింహాద్రి'. తార‌క్ ద‌శ‌ను, దిశ‌ను మార్చివేసిన ఈ సినిమా.. అప్ప‌ట్లో ఎన్నో సంచ‌ల‌నాల‌కు కేంద్ర బిందువుగా నిలిచింది.

రాజ‌మౌళి
'బాహుబ‌లి' సిరీస్‌తో ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ప్ర‌తిభాపాట‌వాలు ఖండాంత‌రాలు దాటినా.. ఆయ‌న కెరీర్‌ను కీల‌క మలుపు తిప్పిన సినిమా మాత్రం 'మ‌గ‌ధీర' అనే చెప్పాలి.  జాతీయ స్థాయిలో తెలుగు సినిమా కూడా విజువ‌ల్ ఎఫెక్ట్స్ ప‌రంగా ముందుందని చాటి చెప్పిన ఈ చిత్రం.. ద‌ర్శ‌కుడిగా రాజ‌మౌళి స్థాయిని అమాంతం పెంచింది. అలాంటి 'మ‌గ‌ధీర‌'.. రాజ‌మౌళి కెరీర్‌లో ఏడో చిత్రం కావ‌డం విశేషం.

శ్రియ‌
కేవ‌లం గ్లామ‌ర్ పాత్ర‌ల‌కే ప‌రిమితం కాకుండా.. ఆడ‌పాద‌డ‌పా అభిన‌యానికి పాత్ర‌ల్లోనూ క‌నిపించి మెప్పించిన క‌థానాయిక శ్రియ‌. 'సంతోషం'తో తొలి హిట్‌ను అందుకున్న శ్రియ‌.. బిగ్గెస్ట్ హిట్‌ను అందుకుంది మాత్రం చిరంజీవి హీరోగా న‌టించిన 'ఠాగూర్' సినిమాతోనే. న‌టిగా ఆమెకిది ఏడో చిత్రం కావ‌డం విశేషం.

స‌మంత‌
తొలి చిత్రం 'ఏమాయ చేసావె'తోనే విజ‌యం అందుకున్న స‌మంత‌కి.. క‌మ‌ర్షియ‌ల్ హీరోయిన్‌గా మంచి బ్రేక్ ఇచ్చిన చిత్రం మ‌హేశ్ బాబు హీరోగా న‌టించిన‌ 'దూకుడు'నే. తెలుగు, త‌మిళ భాష‌ల్లో అప్ప‌టికే ఆరు సినిమాల్లో న‌టించిన స‌మంత‌కు ఇది ఏడో సినిమా. మిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్‌లో సౌత్ క్వీన్‌గా నిలిచిన స‌మంత‌కు.. ఆ క్ల‌బ్‌లో తొలిసారిగా స్థాన‌మిచ్చిన చిత్రం కూడా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం.

శ్రుతి హాస‌న్‌
లోక నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ త‌న‌య‌గా ప‌రిచ‌య‌మైన శ్రుతి హాస‌న్‌కు తెలుగు, హిందీ, త‌మిళ్‌.. ఇలా మూడు భాష‌ల్లో చేసిన మొద‌టి ఆరు సినిమాలు వ‌రుస‌గా ప‌రాజ‌యాల‌నే అందించాయి. ఇలాంటి స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ జోడీగా నటించిన 'గ‌బ్బ‌ర్ సింగ్' చిత్రం.. క‌థానాయిక‌గా ఆమె న‌టించిన ఏడో సినిమాగా విడుద‌లై ఆమెకు క‌మ‌ర్షియ‌ల్‌గా ఘ‌న‌విజ‌యాన్ని అందించింది. దీంతో.. 7 అనేది శ్రుతి ల‌క్కీ నెంబ‌ర్‌గా మారింది. ఇటీవ‌ల ట్విట్ట‌ర్‌లో త‌న ఫాలోవ‌ర్లు 7 మిలియ‌న్లకి చేరుకున్నాక‌.. 7 త‌న ల‌క్కీ నెంబ‌ర్ అంటూ మ‌రోసారి ప్ర‌స్తావించింది శ్రుతి.

వీరితో పాటు.. వెంక‌టేశ్ (శ్రీ‌నివాస క‌ళ్యాణం), రామ్ చ‌ర‌ణ్ (ఎవ‌డు), నాగ‌చైత‌న్య (మ‌నం), అనుష్క (ల‌క్ష్యం), కృష్ణ‌వంశీ (మురారి), పూరీ జ‌గ‌న్నాథ్ (అమ్మ‌ నాన్న ఓ త‌మిళ‌మ్మాయి), వి.వి.వినాయ‌క్ (లక్ష్మీ), ఎ.క‌రుణాక‌ర‌న్ (డార్లింగ్‌), దిల్ రాజు (కొత్త బంగారు లోకం), త్రివిక్ర‌మ్ (స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి) వంటి సినీ ప్ర‌ముఖుల‌కు కూడా వారి వారి ఏడో చిత్రాలు మంచి విజ‌యాలు అందించ‌డం విశేషం. ఏదేమైనా.. మ‌న సినీ ప్ర‌ముఖుల్లో చాలా మందికి ఏడో సినిమాలు 'సెవెన్త్ వండ‌ర్‌'గా నిల‌వ‌డం ప్ర‌త్యేక‌మైన విష‌యంగానే చెప్పుకోవాలి.                                                                                    -మ‌ల్లిక్ పైడి60 ఏళ్ళ 'భూకైలాస్‌'

Updated By ManamTue, 03/20/2018 - 11:41

bhookailasరామాయ‌ణంలో రాముడు క‌థానాయ‌కుడు అయితే.. రావ‌ణాసురుడు ప్ర‌తినాయ‌కుడు. అలాంటి.. రావ‌ణాసురుడికి హీరోయిజాన్ని తీసుకువ‌చ్చిన ఘ‌న‌త మ‌హాన‌టుడు ఎన్టీఆర్‌ది. ఆయ‌న రావ‌ణాసురుడి పాత్ర‌లో న‌టించిన చిత్రం 'భూ కైలాస్‌'. మ‌హా శివ భ‌క్తుడైన రావ‌ణాసురుడి పాత్ర‌లో ఎన్టీఆర్ జీవించేశారిందులో. నార‌ద మ‌హ‌ర్షి పాత్ర‌లో అక్కినేని నాగేశ్వ‌ర‌రావు న‌టించిన ఈ సినిమాలో మండోద‌రిగా జ‌మున‌, శివుడిగా నాగ‌భూష‌ణం, పార్వ‌తిగా బి.స‌రోజాదేవి, మాయాసుర‌గా ఎస్వీ రంగారావు న‌టించారు. కె.శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని ఏవీయ‌మ్ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించింది. ఆర్‌.సుద‌ర్శ‌న‌మ్‌, ఆర్‌.గోవ‌ర్థ‌న‌మ్ సంగీత సార‌థ్యంలో రూపొందిన పాట‌ల‌న్నీ ప్ర‌జాద‌ర‌ణ పొందాయి. ముఖ్యంగా 'దేవ దేవ ధ‌వ‌ళాచ‌ల' పాట ఇప్ప‌టికీ ఎక్క‌డో చోట వినిపిస్తూనే ఉంటుంది. మార్చి 20, 1958న విడుద‌లైన ఈ చిత్రం నేటితో 60 వ‌సంతాల‌ను పూర్తిచేసుకుంటోంది.తాత‌య్య పాత్ర‌లో నాగ‌చైత‌న్య‌?

Updated By ManamSun, 03/11/2018 - 17:55

nagaయువ క‌థానాయ‌కుడు అక్కినేని నాగ‌చైత‌న్య.. త‌న తాత‌య్య అక్కినేని నాగేశ్వ‌ర‌రావు పాత్ర‌లో సందడి చేయ‌నున్నారా? అవున‌నే వినిపిస్తోంది టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. న‌టీమ‌ణి సావిత్రి జీవితకథ ఆధారంగా ‘మహానటి’ పేరుతో సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. నాగ అశ్విన్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ టైటిల్ రోల్‌లో న‌టిస్తోంది. జెమిని గ‌ణేశ‌న్ పాత్ర‌లో దుల్క‌ర్ స‌ల్మాన్‌, ఎస్వీఆర్ పాత్ర‌లో మోహ‌న్ బాబు, జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌ల్లో స‌మంత‌, విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్నారు. అలాగే సావిత్రి సినీ జీవితంలో కీల‌క పాత్రలు పోషించిన నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు పాత్ర‌ల‌కు కూడా ఈ సినిమా చోటు ఉంద‌ని చాలా రోజులుగా వార్త‌లు వినిపించాయి. అంతేగాకుండా, ఆ పాత్ర‌ల్లో న‌టించే తార‌ల‌పై ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వినిపించాయి.

అయితే.. ఎట్ట‌కేల‌కు ఏఎన్నార్ పాత్ర‌కు సంబంధించి క్లారిటీ వ‌చ్చేసింది. ఏఎన్నార్ మ‌న‌వ‌డు నాగచైతన్య ఆ పాత్ర‌లో క‌నిపించ‌డానికి అంగీకారం తెలిపార‌ని స‌మాచారం. అందులో భాగంగా.. రెండు రోజులు షూటింగ్ చేయడానికి డేట్స్ కూడా ఇచ్చార‌ని.. త్వరలోనే చైతన్యపై ఏఎన్నార్‌కు సంబంధించిన స‌న్నివేశాల‌ను తెర‌కెక్కించ‌నున్నార‌ని తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక స‌మాచారం రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తారు? అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. త‌మిళ క‌థానాయ‌కుడు సూర్య నుంచి నాని వరకు చాలామంది పేర్లు వినిపించాయి. త్వ‌ర‌లోనే దీనిపైనా క్లారిటీ వ‌స్తుంది.నంద‌మూరి, అక్కినేని వారి మూడు త‌రాల‌తో..  

Updated By ManamSun, 02/11/2018 - 15:49

ntr, anrకొన్ని కాంబినేష‌న్‌లు బాక్సాఫీస్ వ‌ద్ద మ్యాజిక్ చేస్తాయి. అలాంటి జాబితాలో క‌థానాయిక ర‌మ్య‌కృష్ణ‌, సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి కాంబినేష‌న్ కూడా చేర్చుకోవ‌చ్చు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వచ్చిన 'అల్ల‌రి మొగుడు', 'అల్ల‌రి ప్రియుడు,' 'ఘ‌రానా బుల్లోడు', 'మేజ‌ర్ చంద్ర‌కాంత్', 'అన్న‌మ‌య్య‌', 'బాహుబ‌లి', 'బాహుబ‌లి 2' త‌దిత‌ర సినిమాల‌న్నీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సంచ‌ల‌నం సృష్టించాయి. ఇదిలా ఉంటే..ఈ కాంబినేష‌న్‌కు తెలుగు సినిమాల ప‌రంగా ఒక అరుదైన ఘ‌న‌త కూడా ఉంది. అదేమిటంటే..తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు రెండు క‌ళ్ళుగా చెప్పుకునే ఎన్టీఆర్, ఏఎన్నార్ కుటుంబాల‌కు చెందిన మూడు త‌రాల క‌థానాయ‌కుల‌తో క‌లిసి ప‌నిచేయ‌డం.

ramyakrishnaముందుగా ర‌మ్య‌కృష్ణ విష‌య‌మే తీసుకుంటే..నంద‌మూరి కుటుంబానికి చెందిన మొద‌టి త‌రం క‌థానాయ‌కుడు ఎన్టీఆర్ న‌టించిన 'మేజ‌ర్ చంద్ర‌కాంత్' సినిమాలో ఆయన‌తో క‌లిసి న‌టించారు. అదే కుటుంబానికి చెందిన రెండో త‌రం క‌థానాయ‌కుడు బాల‌కృష్ణ‌తో 'బంగారు బుల్లోడు', 'వంశానికొక్క‌డు', 'దేవుడు', 'వంశోధ్ధార‌కుడు' చిత్రాల్లో క‌థానాయిక‌గా న‌టించారు. అలాగే హ‌రికృష్ణ‌తో 'టైగ‌ర్ హ‌రిశ్చంద్ర‌ప్ర‌సాద్' సినిమాలో సంద‌డి చేశారు. ఇక మూడో త‌రం న‌టుడు జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో 'సింహాద్రి', 'నా అల్లుడు' చిత్రాల కోసం క‌లిసి ప‌నిచేశారు. అంటే..తాత (ఎన్టీఆర్), తండ్రి (హ‌రికృష్ణ‌), మ‌న‌వ‌డు (జూనియ‌ర్ ఎన్టీఆర్ )..ఇలా నంద‌మూరి కుటుంబానికి చెందిన మూడు త‌రాల న‌టుల‌తో ఆమె క‌లిసి న‌టించార‌న్న‌మాట‌. 
ఇక అక్కినేని కుటుంబం విష‌యానికి వ‌స్తే..ఆ కుటుంబానికి చెందిన తొలి త‌రం క‌థానాయ‌కుడు ఏఎన్నార్ తో 'సూత్ర‌ధారులు' చిత్రంలో క‌లిసి న‌టించారు. రెండో త‌రం క‌థానాయ‌కుడు నాగార్జున‌తో 'అన్న‌మ‌య్య' స‌హా దాదాపు ప‌ది చిత్రాల్లో క‌థానాయిక‌గా న‌టించారు. తాజాగా, ఆ కుటుంబంలోని మూడోత‌రం క‌థానాయ‌కుడు అఖిల్ న‌టించిన 'హ‌లో' మూవీలో  అత‌ని త‌ల్లి పాత్ర‌లో క‌నిపించారు ర‌మ్య‌కృష్ణ. అంతేగాకుండా, నాగ‌చైత‌న్య క‌థానాయ‌కుడిగా రూపొందుతున్న 'శైల‌జారెడ్డి అల్లుడు' (ప్ర‌చారంలో ఉన్న పేరు) చిత్రంలోనూ అత్త పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు ర‌మ్య‌.

keeravaniఇక కీర‌వాణి విష‌యానికొస్తే..ఈ స్వ‌ర‌వాణి ఆరాధ్య న‌టుడు ఎన్టీఆర్. ఆయ‌న ఆఖ‌రి హిట్ చిత్రం 'మేజ‌ర్ చంద్ర‌కాంత్'కు స్వ‌రాల‌ను అందించి..నంద‌మూరి కుటుంబంలోని తొలిత‌రం క‌థానాయ‌కుడితో ప‌నిచేసే అవ‌కాశం అందుకున్నారు కీర‌వాణి. ఇక రెండో త‌రంలో క‌థానాయ‌కులైన బాల‌కృష్ణ ('బొబ్బిలిసింహం', 'గాండీవం', 'పాండురంగ‌డు'), హ‌రికృష్ణ ('లాహిరి లాహిరి లాహిరిలో', 'సీత‌య్య‌') తోనూ క‌లిసి ప‌నిచేశారు. ఇక మూడో త‌రంలో జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన 'స్టూడెంట్ నం.1', 'సింహాద్రి', 'య‌మ‌దొంగ‌', 'ద‌మ్ము' సినిమాల‌కి సంగీతాన్ని అందించారు. అంతేగాకుండా.. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ బ‌యోపిక్ 'య‌న్.టి.ఆర్'కు స్వ‌రాలు అందించే అరుదైన అవ‌కాశాన్ని పొందారు. అంటే..తాత (ఎన్టీఆర్), తండ్రి (హ‌రికృష్ణ‌), మ‌న‌వ‌డు (జూనియ‌ర్ ఎన్టీఆర్ ) చిత్రాల‌కి ప‌నిచేసే అరుదైన అవ‌కాశం కీర‌వాణికి ద‌క్కింద‌న్న‌మాట‌. ఇక అక్కినేని కుటుంబం విష‌యానికి వ‌స్తే..తొలి త‌రం న‌టుడు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు న‌టించిన 'సీతారామ‌య్య గారి మ‌న‌వ‌రాలు' త‌దిత‌ర సినిమాల‌కి సంగీతాన్ని స‌మ‌కూర్చారు ఈ స్వ‌ర‌క‌ర్త‌. ఇక రెండో త‌రం క‌థానాయ‌కుడైన నాగార్జున‌తో అటు క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌తో పాటు 'అన్న‌మ‌య్య‌', 'శ్రీ‌రామ‌దాసు', 'శిరిడిసాయి', 'ఓం న‌మో వేంక‌టేశాయ' వంటి భ‌క్త‌ర‌స చిత్రాల‌కు కూడా సంగీతాన్ని అందించారు. ఇప్పుడు మూడోత‌రంలో నాగ‌చైత‌న్య న‌టిస్తున్న 'స‌వ్య‌సాచి' సినిమాకి స్వ‌రాల‌ను అందిస్తున్నారు. 

ఇలా..రెండు ప్ర‌ముఖ సినీ కుటుంబాల‌కి చెందిన మూడు త‌రాల హీరోల‌తో క‌లిసి న‌టించిన తార‌గా అరుదైన ఘ‌న‌త‌ను ర‌మ్య‌కృష్ణ కైవ‌సం చేసుకోగా...సంగీతాన్ని అందించిన ఘ‌న‌త‌ను స్వ‌ర‌క‌ర్త కీర‌వాణి  సొంతం చేసుకున్నారు.ఏఎన్నార్ డూప్‌ రామానాయుడు 

Updated By ManamSun, 12/17/2017 - 11:44

anr, ramanaiduఎన్నో అద్భుత చిత్రాలను తెరకెక్కించి, మరెన్నో ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకొని.. కేవలం టాలీవుడ్‌లోనే కాకుండా భారత సినీ చరిత్రలోనూ తనకంటూ ప్రత్యేక పేరును లిఖించుకున్నారు నిర్మాత రామానాయుడు. అయితే కెరీర్ ప్రారంభంలో నటనంటే ఆసక్తిని చూపిన రామానాయుడు ఒక సినిమాలో ఏఎన్నార్‌ డూప్‌గా నటించారట.

ఆదుర్తి సుబ్బారావు తెరకెక్కించిన 'నమ్మిన బంటు'కు రామానాయుడు సహ నిర్మాతగా వ్యవహరించగా, ఆ మూవీలో ఒక సన్నివేశంలో అక్కినేని డూప్‌గా చేశారట. రామానాయుడు ఉత్సాహాన్ని చూసిన దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు, అతడితో ఆ పాత్రను చేయించారట. అంతేకాదు ఈ సినిమాలో ఒక చిన్న పాత్రలో కూడా మెరిశారు రామానాయుడు. ఆ తరువాత కూడా పలు సినిమాల్లోనూ నటించి, నటుడిగా కూడా రామానాయుడు మెప్పించిన విషయం తెలిసిందే.
 ర‌మ్య‌కృష్ణ‌.. ఓ అరుదైన ఘ‌న‌త‌

Updated By ManamFri, 12/15/2017 - 17:14

ramyaచిన్న చిన్న హావభావాలను కూడా చక్కగా పలికించగలిగే అతి కొద్ది మంది కథానాయికలలో రమ్యకృష్ణ ఒకరు. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా అవకాశం వచ్చిన ప్రతీసారి తన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించిన నిన్నటి తరం కథానాయిక ఈమె. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా తన సత్తా చాటుతున్న ర‌మ్య‌.. తాజాగా ‘బాహుబలి 2’ సినిమాలో శివగామిగా ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసారు.  ఇదిలా ఉంటే.. నిన్నటితరం నాయికలలో ఎవరికీ దక్కని అరుదైన అవకాశం ఈమెని వరించింద‌నే చెప్పాలి.  ఇంత‌కీ అదేమిటంటే.....తెలుగు సినీ పరిశ్రమకు రెండు కళ్ళుగా చెప్పుకునే ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల‌ కుటుంబాలకి చెందిన‌ మూడు త‌రాల క‌థానాయ‌కుల‌తో కలిసి నటించడమే.

‘మేజర్ చంద్రకాంత్’ (ఎన్టీఆర్), ‘టైగర్ హరిశ్చంద్రప్రసాద్’ (హరికృష్ణ), ‘సింహాద్రి’, ‘నా అల్లుడు’ (జూ.ఎన్టీఆర్).. ఇలా నంద‌మూరి వారి మూడు త‌రాల (తాత‌, తండ్రి, మ‌న‌వ‌డు) క‌థానాయ‌కుల సినిమాల్లో ఆమె తెర‌పై సంద‌డి చేశారు. అదే కుటుంబానికి చెందిన రెండో త‌రం క‌థానాయ‌కుడు బాలకృష్ణతోనూ నాలుగు సినిమాలలో నాయిక‌గా ఆడిపాడారు. ఇక అక్కినేని ఫ్యామిలీ విష‌యానికొస్తే.. ఏఎన్నార్‌తో ‘సూత్రధారులు’లో క‌లిసి న‌టించిన ర‌మ్య‌.. ఆయన త‌న‌యుడు నాగార్జునతో ప‌లు రొమాంటిక్, మాస్, క్లాస్ చిత్రాలతో పాటు ‘అన్నమయ్య’ లాంటి భక్తిరస చిత్రంలో కూడా నటించారు. ఇప్పుడు అఖిల్ హీరోగా నటించిన ‘హలో’మూవీలో అఖిల్ తల్లి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ఈ నెల 22న విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. అంటే.. ఏఎన్నార్‌, నాగ్‌, అఖిల్‌.. ఇలా అక్కినేని వారి మూడు త‌రాల క‌థానాయ‌కుల (తాత‌, తండ్రి, మ‌న‌వ‌డు) సినిమాల్లో ర‌మ్య క‌లిసి న‌టించార‌న్న‌మాట‌. మొత్త‌మ్మీద‌..  రెండు సినీ ప్ర‌ముఖుల‌ కుటుంబాలకి చెందిన‌ మూడు తరాల హీరోలతో నటించిన అరుదైన ఘనతను తన సొంతం చేసుకున్నారు రమ్యకృష్ణ.

Related News