finance minister

జైట్లీతో మాట్లాడా.. బాకీలన్నీ తీర్చేస్తా: మాల్యా

Updated By ManamWed, 09/12/2018 - 19:51

Finance Minister, Vijay Mallya, Lies, Arun Jaitleyన్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో బ్యాంకులకు వేల కోట్లు ఎగొట్టి విదేశాలకు చెక్కేసిన లిక్కర్ కింగ్, కింగ్‌ఫిషర్ అధినేత విజయ్ మాల్యా అందరి బాకీలు పూర్తిగా తీర్చివేస్తానని స్పష్టం చేశాడు. మాల్యాను భారత్‌కు రప్పించే అంశంపై లండన్‌లోని ఓ కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ విచారణలో భాగంగా కోర్టుకు వచ్చిన మాల్యా మీడియాతో మాట్లాడారు. ‘రుణాల చెల్లింపులపై కర్ణాటక హైకోర్టులో ప్రతిపాదించాను. ఈ ఏడాది జూన్‌ 22న కర్ణాటక హైకోర్టులో ఓ దరఖాస్తు దాఖలు చేశాను. కోర్టు అధీనంలో ఉన్న నా ఆస్తులను అమ్మేందుకు అనుమతించాలని కోరాను. ఆ ఆస్తులను అమ్మేసి అందరి బాకీలు తీర్చివేస్తాను’ అని మాల్యా చెప్పారు.

ఈ సందర్భంగా మాల్యా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో మాట్లాడిన అంశాన్ని ప్రస్తావించారు. రుణాలు తీసుకున్న అంశాన్ని సమర్థించుకున్న మాల్యా.. తాను భారత్ విడిచే ముందు జైట్లీతో రుణాల్ని చెల్లించే విషయంలో చర్చించినట్టు వ్యాఖ్యానించారు. మాల్యా వ్యాఖ్యలపై ఫేస్‌బుక్ వేదికగా స్పందించిన అరుణ్ జైట్లీ తీవ్రంగా ఖండించారు. మాల్యా చెప్పేవి అన్ని అబద్దాలుగా కొట్టిపారేశారు. తాను అసలు మాల్యాకు ఎప్పుడు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదన్నారు. ఓసారి పార్లమెంట్ ఆవరణలో హడావుడిగా తనతో మాల్యా మాట్లాడినట్టు జైట్లీ పోస్ట్‌లో పేర్కొన్నారు.  త్వరలోనే విధులకు జైట్లీ: గోయల్

Updated By ManamThu, 08/09/2018 - 16:55
Piyush Goyal

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్యం బాగుందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. జైట్లీ త్వరలోనే విధులకు హాజరు అవుతారని ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రిత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన పేర్కొన్నారు. పీయూష్ గోయల్ గురువారం లోక్‌సభలో తన మంత్రిత్వ శాఖకు సంబంధించి రెండు తీర్మానాలు ప్రవేశపెడుతూ...‘ అరుణ్ జైట్లీ ఆరోగ్యంగానే ఉన్నారు.

ఆయన త్వరలో ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలు తిరిగి తీసుకుంటారు’అని తెలిపారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా అరుణ్ జైట్లీ గురువారం సభకు హాజరయ్యారు. ఈనెల మూడో వారంలో జైట్లీ మళ్లీ ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలను స్వీకరించనున్నారు. మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన చాలాకాలంగా ఇంటికే పరిమితం అయిన విషయం తెలిసిందే.మళ్లీ ఆర్థిక మంత్రిగా జైట్లీ బాధ్యతలు

Updated By ManamFri, 08/03/2018 - 11:52

Arun Jaitleyన్యూఢిల్లీ: ఆరోగ్య కారణాల రీత్యా గత మూడు నెలలుగా అధికారిక విధులకు దూరంగా ఉన్న కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ త్వరలోనే తిరిగి ఆర్థికశాఖ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ విషయాన్ని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆగష్టు రెండో వారం తర్వాత జైట్లీ విధుల్లోకి రానున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. 

మరోవైపు అరుణ్‌జైట్లీ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా నార్త్‌ బ్లాక్‌లోని ఆయన కార్యాలయానికి కొన్ని మరమ్మతులు చేపట్టారు. ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా 2014లో భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అరుణ్‌జైట్లీ.. ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరగడంతో మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో.. మే నుంచి ఆయన విధులకు స్వల్ప విరామం ఇచ్చారు. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ మంత్రి పియూష్‌ గోయల్‌కు తాత్కాలికంగా ఆర్థికశాఖ బాధ్యతలను స్వీకరించిన విషయం తెలిసిందే.‘పద్దు’లో ఏముంది?

Updated By ManamWed, 01/31/2018 - 09:18
  • 1న పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ సమర్పణ

  • మధ్య తరగతి జీవులలో మొలకెత్తిన ఆశలు

  • ఆదాయ పన్నులో మళ్లీ ‘ప్రామాణిక తగ్గింపు’!

  • వ్యవ‘సాయం’ కోసం ప్రత్యేక రుణహామీ నిధి?

  • స్థిరాస్తి రంగానికి ‘మౌలిక సదుపాయ’ హోదా?

  • 1న పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ సమర్పణ.. 

  • మధ్య తరగతిలో ఆశల మోసులు

Budget Session 2018

న్యూఢిల్లీ: కేంద్ర ‘పద్దు’ (బడ్జెట్)లో ఏముంది? జైట్లీ మనసులో ఏముంది? ఆర్థిక మంత్రి పెట్టెలో ఏముంది? జనంపై బడ్జెట్ వరాల జల్లు కురిపిస్తుందా... గుండె ఝల్లుమనిపిస్తుందా? మధ్య తరగతి మనిషికి ఊరట కలుగుతుందా? వేతనజీవికి కోతల నుంచి సాంత్వన లభిస్తుందా? అన్నీ ప్రశ్నలే... వీటన్నిటికీ పార్లమెంటు (పరీక్ష) హాలులో మన ‘విత్త సచివుడు’ అరుణ్ జైట్లీ గురువారం జవాబులు వెల్లడించబోతున్నారు. ఈలోగా సగటు మానవుల ఆరాటం ఆగుతుందా... ఆగదు! నానారకాల ఆలోచనలు, అధ్యయనాలు గట్రా మామూలే కదా! వివిధ రంగాల్లో పద్దులు ఇలా ఉండొచ్చునంటూ అలాంటి  కొన్ని అధ్యయనాలు ఊహించాయి... ఆ గుసగుసలేమిటో విందామా...

వచ్చే ఏడాది ఎన్నికలు రానున్న నేపథ్యంలో మోదీ ప్రభుత్వం ఫిబ్రవరి 1న తన చివరి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతోంది. ఈ సందర్భంగా రంగాలవారీగా ఆర్థిక మంత్రి అంచనాలు ఇలా ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు.

వేతన జీవులకు...
ఏటా బడ్జెట్ అనగానే మధ్యతరగతి వేతన జీవుల్లో ఆదాయపు పన్ను పరిమితి పంపుపై  ఆశలు మొలకెత్తడం ఆనవాయితీ. నిరుడు పన్ను శ్లాబులను అలాగే ఉంచిన ఆర్థిక మంత్రి... వార్షికాదాయం రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలదాకాగల చిన్న పన్ను చెల్లింపుదారులకు పన్నును 10 శాతం నుంచి 5 శాతానికి తగ్గించి స్వల్ప ఊరట కల్పించారు. అయితే, ఈసారి పన్ను శ్లాబులను, శాతాలను కిందకు దించి, వ్యక్తులపై భారాన్ని తగ్గించే యోచన ఉంది. పన్ను విధింపు ఆదాయ పరిమితిని పెంచడంద్వారా ప్రజల చేతిలో ఖర్చు చేయదగ్గ నగదు నిల్వ పెరుగుతుందని సర్వేలో పాల్గొన్న 69 శాతం ప్రజలు భావిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు ప్రామాణిక తగ్గింపు (స్టాండర్డ్ డిడక్షన్)ను మళ్లీ ప్రవేశపెట్టే అవకాశం లేకపోలేదన్న మాట కూడా వినిపిస్తోంది.

పన్నులు
కార్పొరేట్ పన్ను 30 శాతం నుంచి 25 శాతానికి, ప్రత్యా మ్నాయ పన్ను 18.5 శాతం నుంచి 15 శాతానికి తగ్గవచ్చు. వ్యక్తుల ఆదాయాలకు సంబంధిం చి కోతలు, మినహాయింపులు పెరగొచ్చు. పెట్టుబడులపై దీర్ఘకా లిక మూలధన లాభాలమీద పన్ను విధించవచ్చు.

ఐటీ/సాంకేతికత
డిజిటల్ లావాదేవీలకు మరింత ప్రోత్సాహకాలు. డిజిటల్ చెల్లింపు వేదికల మౌలిక వసతులకు మద్దతు. మొబైల్ ఫోన్లు, టాబ్లెట్ కంప్యూటర్లపై పన్నుల వ్యవస్థ, ఎక్సైజ్ సుంకాల హేతుబద్ధీకరణ. టెలికం సేవలపై ప్రస్తుతం విధిస్తున్న వస్తుసేవల పన్నును (జీఎస్టీ) 18 నుంచి 12 శాతానికి తగ్గించే అవకాశం.

వ్యవసాయం
వ్యవసాయ రంగంలో పెట్టుబడులకు ప్రోత్సాహం కోసం రుణహామీ నిధి ఏర్పాటు. పంట బీమా పథకాలకు మరిన్ని నిధుల కేటాయింపు. ఆనకట్టలు, కాలువలు, సూక్ష్మ నీటిపారుదల వ్యవస్థలపై వ్యయం పెరగొచ్చు. నశ్వర పంటల వృథాను అరికట్టేందుకు శీతల గిడ్డంగుల నిర్మాణానికి రాయితీలు. ఎరువులపై రాయితీల తగ్గింపు.

బ్యాంకింగ్
రుణదాతల వద్ద నిరర్ధక ఆస్తుల కేటాయింపుల కోసం పూర్తి పన్ను కోతను అనుమతించే అవకాశం. బ్యాంకు డిపాజిట్లపై పన్ను కోతకు ఉద్దేశించిన వడ్డీ పరిమితిని రూ.10వేల నుంచి పెంచే వీలుంది. చిల్లర కాలవ్యవధి డిపాజిట్లపై పన్ను మినహాయింపు పరిమితి కాలాన్ని 3 ఏళ్ల నుంచి 5 ఏళ్లకు పెంచే అవకాశం. ఆర్థిక అశక్తత స్మృతి (ఇన్‌సాల్వెన్సీ కోడ్) కింద కార్యకలాపాలకు వీలుగా పన్ను ఉపశమన కల్పన.

మౌలిక సదుపాయాలు
మునుపటి బడ్జెట్‌తో పోలిస్తే రహదారుల నిర్మాణానికి పెట్టుబడులను 10 నుంచి 15 శాతందాకా పెంచే అవకాశం. ‘భారత్ మాల’ పథకంసహా తూర్పు-పశ్చిమ భారతాలను సంధానించే కీలక రహదారి నిర్మాణ ప్రాజెక్టులకు ఆర్థిక మద్దతు కల్పించవచ్చు. అలాగే 2017-18 బడ్జెట్‌లో కేటాయించిన రైల్వే పెట్టుబడులను 10 శాతం మేర పెంచవచ్చు.

స్థిరాస్తి రంగం
స్థిరాస్తి రంగంలోని అన్ని ప్రాజెక్టులకూ... ప్రత్యేకించి గృహ నిర్మాణంలో ప్రారంభ-సంపూర్ణ దశల్లో జాప్యం నివారణ దిశగా ఏక గవాక్ష (సింగిల్ విండో) అనుమతుల వ్యవస్థ. ప్రాజెక్టు వ్యయాలు, ఆర్థిక వనరుల సేకరణతోపాటు సముచిత ధరలో ఇళ్ల అందుబాటుకు వీలుగా స్థిరాస్తి రంగానికి మౌలిక వసతుల రంగం హోదా ఇవ్వొచ్చు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు ప్రస్తుత విధిస్తున్న పన్నును 12 శాతం నుంచి తగ్గించడం. సముచిత ధరలో ఇళ్ల నిర్మాణంపై వ్యయం పెంపు. ఇళ్ల కొనుగోళ్లపై జీఎస్టీ 12 శాతం నుంచి తగ్గింపుతోపాటు స్టాంపు రుసుములో కోతకు అవకాశం.

చమురు-సహజవాయువు
చమురు-సహజవాయు అన్వేషణ, ఉత్పత్తిపై పన్నేతర రుసుము 20 శాతం నుంచి 8-10 శాతానికి తగ్గింపు. సహజవాయువుపై మరింత లబ్ధికి వీలుగా జీఎస్టీ శాతాన్ని నిర్ణయించడం. నగరాల్లో సహజవాయు పంపిణీ కంపెనీలకు కేంద్ర సుంకం తగ్గింపు లేదా మినహాయింపు. ద్రవీకృత సహజవాయు దిగుమతులకు ప్రాథమిక కేంద్ర సుంకం నుంచి మినహాయింపు. ఎల్పీజీ, కిరోసిన్‌లను మార్కెట్ ధరకన్నా తక్కువకు విక్రయించే దిగువస్థాయి సరఫరా సంస్థలకు రాయితీల మద్దతు కల్పన.

ఆటోమొబైల్
పదిహేనేళ్ల వాడకం తర్వాత ఉద్గార ప్రమాణాలకు తగినవిధంగా లేని వాణిజ్య వాహనాలను తుక్కులో చేర్చడంపై విధాన ప్రకటన. విద్యుత్ వాహనాలపై ప్రస్తుతం విధిస్తున్న జీఎస్టీని 12 శాతం నుంచి తగ్గించవచ్చు.డిపాజిటర్ల సంరక్షణే ధ్యేయం

Updated By ManamFri, 12/08/2017 - 19:02

arun jaitley, finance ministerన్యూఢిల్లీ: ప్రతిపాదిత ఎఫ్‌ఆర్‌డిఐ బిల్లు డిపాజిటర్ల హక్కులను హరిస్తుందని వస్తున్న వార్తలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఖండించారు. నిజానికది, డిపాజిటర్ల హక్కులను సంరక్షిస్తుందని ఆయన అన్నారు. ‘‘ఫైనాన్షియల్ రిజల్యూషన్, డిపాజిట్ బీమా బిల్లు 2017 స్థాయి సంఘం వద్ద పెండింగ్‌లో ఉంది. ఫైనాన్షియల్ సంస్థల, డిపాజిటర్ల ప్రయోజనాలను పూర్తిగా సంరక్షించడమే ప్రభుత్వ ధ్యేయం’’ అని ఆయన ట్వీట్ చేశారు. ప్రభుత్వం ఈ లక్ష్యానికి కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. డిపాజిటర్లకు ఇప్పుడున్న హక్కులను కాపాడాలనే ఎఫ్.ఆర్.డి.ఐ బిల్లు ప్రతిపాదిస్తోందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎస్.సి. గార్గ్ చెప్పారు. డిపాజిటర్లకున్న రక్షణ ‘‘నీరుగారడవున్నదేదీ లేదు. నిజానికిది, కొన్ని విధాలుగా ఇప్పుడున్న సంరక్షణలను మరింత కట్టుదిట్టం చేస్తుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల డిపాజిటర్ల ముఖ్య గ్యారంటీ ప్రభుత్వ యాజమాన్యం నుంచి ఉంది. వారు దాచుకున్న మొత్తాలపై ఇది ఏమాత్రం ప్రభావం చూపబోదు’’ అని గార్గ్ చెప్పారు. ప్రభుత్వం ఫైనాన్షియల్ రిజల్యూషన్, డిపాజిట్ బీమా బిల్లు 2017ను గత ఆగస్టులో లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం అది పార్లమెంట్ సంయుక్త కమిటీ పరిశీలనలో ఉంది. ఫైనాన్షియల్ సర్వీసుల ప్రొవైడర్ల దివాలాతో వ్యవహరించేందుకు ఈ బిల్లు రూపొందించారు. ఒక పరిష్కార కార్పొరేషన్ ఏర్పాటుకు ఈ బిల్లు వీలు కల్పిస్తోంది. దివాలా తీస్తున్న సంస్థ ఆస్తులను మరో ఆరోగ్యకరైమెన ఫైనాన్షియల్ సంస్థకు బదలీ చేయడం, విలీనాలు, సమ్మేళనాలు, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ఆదేశం మేరకు లిక్విడేషన్ ప్రక్రియను చేపట్టడం వంటి అధికారాలను అది ఆ కార్పొరేషన్‌కు కల్పిస్తోంది. కొన్ని ముఖ్యైమెన ఫైనాన్షియల్ సంస్థలు విఫలైమెతే మొత్తం ఫైనాన్షియల్ వ్యవస్థ విచ్ఛిన్నవువుతుందని, అలా కాకుండా చూసేందుకు కొన్ని ఫైనాన్షియల్ ప్రొవైడర్లను నియుమించే అధికారం కూడా ఆ కార్పొరేషన్‌కు ఉందని బిల్లు ‘లక్ష్యాలు, కారణాల ప్రకటన’లో పేర్కొన్నారు. 

Related News