manchu vishnu

‘మహానటి’ టీంకు ‘మంచు’ వారి సత్కారం

Updated By ManamWed, 05/16/2018 - 13:00

mahanati  సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘మహానటి’ మంచి టాక్‌తో థియేటర్లలో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు ‘మహానటి’ టీంకు తమ అభినందనలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ ఫ్యామిలీ ఇప్పటికే ‘మహానటి’ టీంను తమ ఇంటికి పిలిపించి సత్కరించగా.. తాజాగా మంచు వారి ఫ్యామిలీ కూడా చిత్ర యూనిట్‌కు ఆతిథ్యమిచ్చారు. ‘మహానటి’ దర్శకనిర్మాతలైన నాగ్ అశ్విన్, స్వప్నా దత్, ప్రియాంక దత్‌లను తమ ఇంటికి ఆహ్వానించిన మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు లక్ష్మి వారిని సత్కరించారు. కాగా మహానటిలో మోహన్‌బాబు ఎస్వీ రంగారావు పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

 ల్యాండ్‌మార్క్ జ‌ర్నీ (స్పెష‌ల్ ఆర్టిక‌ల్‌)

Updated By ManamWed, 05/02/2018 - 15:56

land markప్ర‌తి ప్ర‌యాణంలోనూ కొన్ని మైలురాళ్ళు ఉంటాయి. సినిమా వాళ్ళ‌కి కూడా.. అలాంటి మైలురాళ్ళు వాళ్ళ ప్ర‌యాణంలో సినిమాల సంఖ్య ప‌రంగానూ లేదంటే సంవ‌త్స‌రాల ప‌రంగానూ ఉంటాయి. అలా సంవ‌త్స‌రాల ప‌రంగా.. ఒక్కో మైలురాయికి చేరుకుంటున్న కొంద‌రి సినీ ప్ర‌ముఖుల ప్ర‌యాణం గురించి టూకీగా..

చిరంజీవి@ 40 
తెలుగు సినిమా చ‌రిత్ర‌లో మెగాస్టార్ చిరంజీవి న‌ట ప్ర‌స్థానం.. సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించ‌ద‌గ్గ ఓ అధ్యాయం. 1978 సెప్టెంబ‌ర్‌లో  విడుద‌లైన 'ప్రాణం ఖ‌రీదు'తో న‌టుడిగా తొలి అడుగులు వేసిన చిరంజీవి.. కెరీర్ ఆరంభంలో నెగెటివ్ ట‌చ్ ఉన్న పాత్ర‌లు చేసినా.. ఆ త‌రువాత క‌థానాయ‌కుడిగానే ఎదిగారు.1983లో వ‌చ్చిన 'ఖైదీ'తో స్టార్‌డమ్ పొందారు. ఆ త‌రువాత ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించారు. 'ప‌సివాడి ప్రాణం, య‌ముడికి మొగుడు, జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి, గ్యాంగ్ లీడ‌ర్‌,  ఘ‌రానా మొగుడు, చూడాల‌ని ఉంది, ఇంద్ర‌' వంటి ఇండ‌స్ట్రీ హిట్స్‌తో దాదాపు రెండు ద‌శాబ్దాల పాటు నంబ‌ర్ వ‌న్ క‌థానాయ‌కుడిగా త‌న ప్ర‌భావం చూపించారు. 2008 నుంచి రాజ‌కీయాలపై దృష్టిపెట్టిన చిరు.. గ‌త ఏడాది సంక్రాంతికి విడుద‌లైన 'ఖైదీ నంబ‌ర్ 150'తో దాదాపు తొమ్మిదేళ్ళ త‌రువాత‌ హీరోగా రీ ఎంట్రీ ఇచ్చారు. రికార్డు స్థాయిలో వ‌సూళ్ళు ఆర్జించిన ఈ సినిమాతో మెగా స్టామినా త‌గ్గ‌లేద‌ని నిరూపించారు. ఈ ఏడాదితో చిరు సినీ జీవితం నాలుగు ద‌శాబ్దాలు పూర్తిచేసుకుంటోంది. ప్ర‌స్తుతం చిరు.. ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెర‌కెక్కుతున్న 'సైరా న‌ర‌సింహారెడ్డి'తో బిజీగా ఉన్నారు. ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 

ఎ.క‌రుణాక‌ర‌న్ @ 20
తెలుగు తెర‌పై ఎన్నో ప్రేమ‌క‌థ‌లు వ‌చ్చాయి. అయితే వాటిలో కొన్ని మాత్ర‌మే ప్ర‌భావం చూపించాయి. వాటిలో 'తొలి ప్రేమ' ఒక‌టి. ప‌వ‌న్ క‌ల్యాణ్ కెరీర్‌ను కీల‌క మ‌లుపు తిప్పిన ఈ చిత్రంతోనే ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యారు క‌రుణాక‌ర‌న్‌. ఆ త‌రువాత కొన్ని ప‌రాజ‌యాలు ప‌ల‌క‌రించినా.. 'ఉల్లాసంగా ఉత్సాహంగా', 'డార్లింగ్' చిత్రాల‌తో విజ‌యాల‌ను అందుకున్నారు. స్వ‌ల్ప‌ విరామం త‌రువాత‌ త‌న తొలి చిత్ర క‌థానాయ‌కుడికి మేన‌ల్లుడైన సాయిధ‌ర‌మ్ తేజ్‌తో ప్ర‌స్తుతం 'తేజ్ ఐ ల‌వ్ యు' సినిమా చేస్తున్నారు ఈ ప్రేమ‌క‌థా చిత్రాల స్పెష‌లిస్ట్‌. ఈ జూలై 24కి 'తొలి ప్రేమ' విడుద‌లై 20 ఏళ్ళు పూర్తికానున్నాయి. అంటే ద‌ర్శ‌కుడిగా క‌రుణాక‌ర‌న్ ప్ర‌యాణం మొద‌లై రెండు ద‌శాబ్దాలు పూర్త‌వుతోంది అన్న‌మాట‌. 

అల్లు అర్జున్ @15
సినిమా సినిమాకి త‌న స్థాయిని పెంచుకుంటున్న యువ క‌థానాయ‌కుడు స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌. ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు 100వ చిత్రం 'గంగోత్రి'(2003)తో హీరోగా తొలి అడుగులు వేసిన బ‌న్ని.. రెండో చిత్రం 'ఆర్య'తో ప్రామిసింగ్ హీరో అనిపించుకున్నారు. ఆ త‌రువాత 'బ‌న్ని, దేశ‌ముదురు, ప‌రుగు, జులాయి, రేసు గుర్రం, స‌రైనోడు' వంటి స‌క్సెస్‌ఫుల్ మూవీస్‌తో స్టార్ హీరోగా ఎదిగారు. ప్ర‌తి సినిమాలోనూ లుక్స్ ప‌రంగా తీసుకునే శ్ర‌ద్ధ.. అలాగే పాత్ర‌ల ఎంపిక ప‌రంగా తీసుకునే జాగ్ర‌త్త‌లు.. బ‌న్నికి యువ‌త‌లో ప్ర‌త్యేక గుర్తింపు తీసుకువ‌చ్చాయి. ఈ ఏడాదితో  హీరోగా ఒక‌టిన్న‌ర ద‌శాబ్ద‌పు ప్ర‌యాణాన్ని పూర్తిచేసుకున్నారు బ‌న్ని. ఈ సంద‌ర్భంగా త‌న కెరీర్ మొద‌లైన వేస‌విలోనే.. త‌న త‌దుప‌రి చిత్రం 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'తో సంద‌డి చేయ‌నున్నారు. మే 4న రిలీజ్ కానున్న ఈ సినిమాలో.. యారోగెంట్‌ ఆర్మీ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌డం కోసం బ‌న్ని మేకోవ‌ర్ అయిన విధానం ఇప్ప‌టికే అభిమానుల‌ని ఫిదా చేసేసింది.

క‌ల్యాణ్ రామ్ @ 15
బాబాయ్ బాల‌కృష్ణ న‌టించిన 'బాల‌గోపాలుడు' చిత్రంలో బాల‌న‌టుడిగా సంద‌డి చేసిన‌ క‌ల్యాణ్ రామ్‌.. 'తొలి చూపులోనే' (2003) చిత్రంతో హీరోగా అడుగులు వేశారు. అయితే తొలి విజ‌యాన్ని అందుకుంది మాత్రం 'అత‌నొక్క‌డే' (2005) చిత్రంతోనే. ఆ త‌రువాత కొన్ని ప‌రాజ‌యాలు ప‌ల‌క‌రించినా.. మూడేళ్ళ క్రితం రిలీజైన 'ప‌టాస్‌'తో గుర్తుండిపోయే విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు. గ‌త ఏడాది త‌న త‌మ్ముడు ఎన్టీఆర్ హీరోగా 'జై ల‌వ కుశ' చిత్రాన్ని నిర్మించిన క‌ల్యాణ్ రామ్‌.. ఇటీవ‌లే 'ఎం.ఎల్‌.ఎ'గా సంద‌డి చేశారు. అతి త్వ‌ర‌లో 'నా నువ్వే' చిత్రంతో మ‌రోసారి ప‌ల‌క‌రించ‌నున్నారు. ఈ అక్టోబ‌ర్ 9కి హీరోగా క‌ల్యాణ్ రామ్ కెరీర్ మొద‌లై ఒక‌టిన్న‌ర ద‌శాబ్దం పూర్తి కానుంది.

నాని @ 10
ఓ యువ‌ క‌థానాయ‌కుడు వ‌రుస‌గా ఏడు చిత్రాల‌తో విజ‌యాలు అందుకోవ‌డం అంటే సాదాసీదా విష‌యం కాదు. అయితే.. దాన్ని సుసాధ్యం చేసి వార్త‌ల్లోకెక్కారు నేచుర‌ల్ స్టార్ నాని. మేటి ద‌ర్శ‌కుల వ‌ద్ద అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేయ‌డంతో మొద‌లైన నాని ప్ర‌యాణం.. 'అష్టా చమ్మా' రూపంలో న‌టుడిగా చేసిన తొలి ప్ర‌య‌త్నంతో మ‌లుపు తిరిగింది. ప్రారంభంలో కొన్ని అడుగులు త‌డ‌బ‌డినా.. గ‌త మూడేళ్ళుగా నిల‌క‌డ‌గా ప్ర‌యాణం సాగిస్తున్నారు ఈ యంగ్ హీరో. 'భ‌లే భ‌లే మ‌గాడివోయ్' నుంచి ఇటీవ‌ల విడుద‌లైన 'ఎంసీఏ' వ‌ర‌కు వ‌రుస‌గా ఏడు విజ‌యాలు అందుకుని వార్త‌ల్లో నిలిచారు. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్న నాని.. ఓ వైపు సోలో హీరోగా సినిమాలు చేస్తూనే.. మ‌రో వైపు నాగార్జున వంటి సీనియ‌ర్ అగ్ర క‌థానాయ‌కుడితో మ‌ల్టీస్టార‌ర్ మూవీ కూడా చేస్తున్నారు. ఈ సెప్టెంబ‌ర్ 5తో క‌థానాయ‌కుడిగా నాని ప్ర‌యాణం ద‌శాబ్దం పూర్తిచేసుకోనుంది.

వీరితో పాటు.. సంగీత ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ గోగుల (20), క‌థానాయ‌కుడు మంచు విష్ణు (15 ), ద‌ర్శ‌కులు శ్రీ‌కాంత్ అడ్డాల (10), ప‌రశురామ్ (10) త‌దితరులు త‌మ త‌మ కెరీర్స్‌లో మైలురాయికి చేరుకుంటున్నారు. అలాగే త‌మ సినీ ప్ర‌యాణాన్ని కొన‌సాగిస్తున్నారు.                              -మ‌ల్లిక్ పైడిఆచారి అమెరికా యాత్రకు డేట్ ఫిక్స్ 

Updated By ManamThu, 03/22/2018 - 12:57

Achari America Yatra మంచు విష్ణు, బ్రహ్మానందం ప్రధాన పాత్రలలో జి.నాగేశ్వర్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం 'ఆచారి అమెరికా యాత్ర'. ఈ ఏడాది జనవరి 26నే విడుదల కావాల్సిన ఈ చిత్రం కొన్ని కారణాల వలన వాయిదా పడింది. ఆ తరువాత ఈ చిత్ర రిలీజ్‌కు పలు డేట్లను పరిశీలించిన చిత్ర యూనిట్.. తాజాగా మరో కొత్త తేదీని ప్రకటించింది.

ఏప్రిల్ 6వ తేదిన ఆచారి అమెరికా యాత్రను విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. ఇక కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో విష్ణు సరసన ప్రగ్యా జైశ్వాల్ నటించింది. కిర్తి రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందించాడు.‘ఆచారి అమెరికా యాత్ర’ రిలీజ్ ఎప్పుడంటే..

Updated By ManamSun, 03/18/2018 - 16:21

aachariమంచు విష్ణు హీరోగా నటించిన చిత్రం ‘ఆచారి అమెరికా యాత్ర’. జి.నాగేశ్వరరెడ్డి దర్శకుడు. పద్మజ పిక్చర్స్ పతాకంపై కీర్తి చౌదరి, కిట్టు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం.ఎల్.కుమార్ చౌదరి సమర్పకుడు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5న విడుదల చేస్తున్నారు. విష్ణు, జి.నాగేశ్వర్‌రెడ్డిల కాంబినేషన్‌లో ‘దేనికైనా రెడీ’, ‘ఈడో రకం ఆడో రకం’ వంటి సూపర్ హిట్ కామెడీ సినిమాలు వచ్చాయి. ‘ఆచారి అమెరికా యాత్ర’ కూడా పూర్తి వినోదాత్మక చిత్రం కావడంతో ఇది కూడా ఘనవిజయం సాధిస్తున్న నమ్మకంతో ఉంది చిత్ర యూనిట్. అమెరికా, మలేసియా, హైదరాబాద్‌లలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రంలో విష్ణు సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది.  తనికెళ్ళ భరణి, కోట శ్రీనివాసరావు, పోసాని, పృథ్వీ తదితరులు ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన‌ ఈ చిత్రానికి సంగీతం: థమన్, మాటలు: డార్లింగ్ స్వామి.మోహ‌న్ బాబును డైరెక్ట్ చేసిన విష్ణు

Updated By ManamMon, 03/12/2018 - 13:13

manchu vishnuయువ క‌థానాయ‌కుడు మంచు విష్ణు ద‌ర్శ‌కుడి అవ‌తార‌మెత్తారు. అయితే సినిమా కోసం కాదు.. ఓ ల‌ఘు చిత్రం కోసం. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. ఇటీవ‌ల తన తండ్రి మోహన్ బాబును డైరెక్ట్ చేస్తూ మంచు విష్ణు ఒక ల‌ఘు చిత్రాన్ని రూపొందించారు. ఒక నిమిషం నిడివి ఉండే ఈ ల‌ఘు చిత్రాన్ని ప్రజా ప్రచారం కోసం వాడుకోనున్నారు. నీటిని పొదుపుగా వాడుకోమని.. దాని ప్రాముఖ్యతను తెలియజెప్పే నీటి వనరుల శాఖా మంత్రిగా ఇందులో మోహన్ బాబు కనిపించున్నార‌ని తెలిసింది. ఈ లఘు చిత్రాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలో తెర‌కెక్కించారు. కొద్ది రోజుల క్రితం.. నదుల అనుసంధానం గురించి ప్ర‌ముఖులు ప్రచారం చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో నీటిని జాగ్రత్తగా వాడుకోమని చెప్పే ఈ లఘు చిత్రం కూడా ప్రాచుర్యం సంతరించుకోనుంది. ఈ ల‌ఘు చిత్రం అవుట్‌పుట్ ప‌ట్ల‌ మోహన్ బాబు, విష్ణు ఇద్దరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే వారం ఈ ల‌ఘు చిత్రం విడుదల కానుంది. కాగా, విష్ణు నటించిన తాజా చిత్రాలు ‘ఓటర్’, ‘ఆచారి అమెరికా యాత్ర’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.'గాయ‌త్రి'.. 'ఒక నువ్వు ఒక నేను' వీడియో ప్రోమో

Updated By ManamThu, 02/01/2018 - 18:00

gayatriమోహ‌న్ బాబు, మంచు విష్ణు, శ్రియ‌, అన‌సూయ‌, నిఖిలా విమ‌ల్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన సినిమా 'గాయ‌త్రి'. మ‌ద‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం.. ఈ నెల 9న తెర‌పైకి రానుంది. ఇదిలా ఉంటే.. త‌మ‌న్ సంగీత సార‌థ్యంలో రూపొందిన 'ఒక నువ్వు ఒక నేను' పాట‌కి సంబంధించిన వీడియో ప్రోమోని ఈ రోజు (గురువారం) విడుద‌ల చేశారు. విష్ణు, శ్రియపై చిత్రీక‌రించిన ఈ పాట‌లో భార్యాభ‌ర్త‌ల అనుబంధాన్ని చ‌క్క‌గా ఆవిష్క‌రించారు. అనసూయను ఆటపట్టించిన మంచు విష్ణు

Updated By ManamSun, 01/28/2018 - 20:29

anasuyaమోహన్‌బాబు, మంచు విష్ణు నటించిన గాయత్రి సినిమా ఆడియో ఫంక్షన్‌ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సినిమాలో యాంకర్ అనసూయ జర్నలిస్ట్‌గా నటిస్తోంది. ఈ సందర్భంగా ఆడియో ఫంక్షన్‌లో అనసూయ మాట్లాడుతుండగా ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. మంచు కుటుంబానికి తాను ఆస్థాన యాంకర్‌నని చెప్పుకున్న అనసూయ.. మిస్టర్ నూకయ్య ఆడియో ఫంక్షన్ సమయానికి తాను చిన్న పిల్లనని చెప్పింది. అయితే ఆ మాటలు విన్న మంచు విష్ణు అనసూయను టీజ్ చేశాడు. ‘‘మనోజ్ సినిమా టైంకు నువ్వు చిన్నపిల్లవా’’ అని అనసూయను విష్ణు ఆటపట్టించాడు. ‘‘ఇలాంటివి బాగా పట్టుకుంటారని’’ విష్ణును ఉద్దేశించి అనసూయ వ్యాఖ్యానించింది. మిస్టర్ నూకయ్య సినిమా ఆడియో ఫంక్షన్ చేసే సమయానికి యాంకరింగ్‌లోకి కొత్తగా వచ్చానని, అందుకే ప్రొఫెషన్‌లో చిన్న పిల్లనన్న ఉద్దేశంతో మాట్లాడానని అనసూయ చెప్పింది.'గాయ‌త్రి'.. ట్రైల‌ర్‌, ఆడియో డిటైల్స్‌

Updated By ManamThu, 01/25/2018 - 18:46

gayatriమోహ‌న్ బాబు ద్విపాత్రాభిన‌యం చేసిన‌ తాజా చిత్రం 'గాయ‌త్రి'. మంచు విష్ణు, శ్రియ, అన‌సూయ‌, నిఖిలా విమ‌ల్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రానికి మ‌ద‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఫ‌స్ట్ లుక్స్‌, టీజ‌ర్‌తో ఇప్ప‌టికే ఆస‌క్తిని పెంచిన ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 9న తెర‌పైకి రానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించిన థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌, ఆడియోని ఈ నెల 28న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర బృందం ప్ర‌క‌టించింది. త‌మ‌న్ సంగీత‌మందించిన ఈ చిత్రాన్ని మోహ‌న్ బాబు నిర్మించారు. 'గాయ‌త్రి'.. 'ఒక నువ్వు ఒక నేను' సింగిల్‌

Updated By ManamWed, 01/24/2018 - 14:42

gayatriమోహ‌న్ బాబు, మంచు విష్ణు, శ్రియ‌, నిఖిలా విమ‌ల్, అన‌సూయ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం 'గాయ‌త్రి'. మ‌ద‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని మోహ‌న్ బాబు నిర్మించారు. ఇదిలా ఉంటే.. త‌మ‌న్ సంగీత సార‌థ్యంలో 'ఒక నువ్వు ఒక నేను' అంటూ సాగే పాట‌ని ఈ రోజు (బుధ‌వారం) విడుద‌ల చేశారు. జుబిన్ నౌటియ‌ల్‌, శ్రేయా ఘోష‌ల్ పాడిన ఈ పాట‌ను రామ‌జోగ‌య్య శాస్త్రి ర‌చించారు. భార్యాభ‌ర్త‌ల అనుబంధం నేప‌థ్యంలో సాగే ఈ పాట‌ని విష్ణు, శ్రియ‌పై చిత్రీక‌రించారు. ఫిబ్ర‌వ‌రి 9న గాయ‌త్రి తెరపైకి రానుంది.వాయిదా ప‌డ్డ 'ఆచారి అమెరికా యాత్ర‌'

Updated By ManamMon, 01/22/2018 - 16:34

aachaari'దేనికైనా రెడీ', 'ఈడో ర‌కం ఆడో ర‌కం' వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల త‌రువాత క‌థానాయ‌కుడు మంచు విష్ణు, ద‌ర్శ‌కుడు జి నాగేశ్వ‌ర రెడ్డి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రం 'ఆచారి అమెరికా యాత్ర'. ప్ర‌గ్యా జైస్వాల్ క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రంలో బ్ర‌హ్మానందం కీల‌క పాత్ర పోషించారు. త‌మ‌న్ సంగీత సార‌థ్యంలో రూపొందిన పాట‌లు ఇటీవ‌లే విడుద‌ల‌య్యాయి. ఇదిలా ఉంటే.. జ‌న‌వ‌రి 26న విడుద‌ల కావాల్సిన ఈ సినిమా.. కొన్ని సాంకేతిక‌ కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డింద‌ని తెలిసింది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఫిబ్ర‌వ‌రి మూడో వారంలో ఈ సినిమా తెర‌పైకి వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది. త్వ‌ర‌లోనే ఈ విష‌యంపై క్లారిటీ వ‌స్తుంది.

Related News