geetha arts

కొత్త ఆఫీస్‌కు మారిన బన్నీ..?

Updated By ManamTue, 09/25/2018 - 12:23

Allu Arjunబాక్సాఫీస్ వద్ద తన తోటి హీరోలు దూసుకుపోతుంటే.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం కాస్త వెనకలో ఉన్నాడు. టన్నుల కొద్ది టాలెంట్ ఉన్నప్పటికీ టాలీవుడ్‌లో కొత్తదనానికి పెద్ద పీట వేస్తున్న తరుణంలో బన్నీ కూడా వారి అభిరుచికి తగ్గట్లుగా మారిపోవాలనుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో మూస కథలపై కాకుండా కొత్తదనంపైనే ఆసక్తిని చూపిస్తున్న బన్నీ.. తన తదుపరి చిత్రం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా బన్నీ గురించిన ఓ వార్త టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది.

అదేంటంటే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త ఆఫీస్‌కు తన మకాంను మార్చాడట. ఇన్నిరోజులు గీతా ఆర్ట్స్ ఆఫీస్‌నే తన ఆఫీస్‌గా ఉపయోగించుకున్న బన్నీ.. తాజాగా జూబ్లీహిల్స్‌లో ఓ కొత్త ఆఫీసుకు మారారట. ఇక మీదట తన సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు. మిగిలిన పనులన్నీ ఈ ఆఫీస్‌ నుంచే చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా మనం ఫేమ్ విక్రమ్ దర్శకత్వంలో బన్నీ తదుపరి చిత్రంలో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.స్టూడెంట్‌గా కనిపించనున్న శర్వా..?

Updated By ManamTue, 09/18/2018 - 10:57

Sharwanandఫ్లాప్ డైరక్టర్లకు ఛాన్స్‌లు ఇస్తూ అందరి హీరోలకంటే విభిన్నంగా దూసుకుపోతున్న శర్వానంద్ మరో ఫ్లాప్ దర్శకుడికి ఓకే చెప్పినట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. బ్రహ్మోత్సవంతో మరిచిపోలేని పరాజయాన్ని సొంతం చేసుకున్న శ్రీకాంత్ అడ్డాలకు శర్వా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మెగా నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మిస్తుందని టాక్.

దీనిపై వచ్చే నెలలో అధికారిక ప్రకటన రానుందట. ఇక ఈ చిత్రంలో శర్వానంద్ స్టూడెంట్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శర్వానంద్ హను రాఘవపూడి దర్శకత్వంలో పడి పడి లేచే వయసు, సుధీర్ వర్మ దర్శకత్వంలో మరో చిత్రంలో నటిస్తుండగా.. ఇవి రెండు కంప్లీట్ అయ్యాక శ్రీకాంత్ అడ్డాల డైరక్షన్‌లో నటించనున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.కేరళ వరద బాధితులకు ‘గీత గోవిందం’ టీం సాయం

Updated By ManamFri, 08/17/2018 - 14:30

Geetha Govindamభారీ వర్షాలతో కేరళ అతలాకుతలం అవుతోంది. ఇప్పటికి దాదాపు 50కి మంది పైగా మరణించగా.. వరద నీరు పెరిగిపోవడం, పలు భవనాలు ధ్వంసం అవ్వడంతో వేల సంఖ్యలో నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో పలు ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులు కేరళ బాధితులకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఇప్పటికే అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, కమల్ హాసన్, సూర్య, కార్తి, దుల్కర్ సల్మాన్, అనుపమ పరమేశ్వరన్, సిద్ధార్థ్ విశాల్ తదితరులు వరద బాధితులకు విరాళాలు ప్రకటించారు. ఈ క్రమంలో తాజాగా గీత గోవిందం టీం కేరళ బాధితులకు సాయం ప్రకటించింది.

గీతా ఆర్ట్స్ నిర్మాణంలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన గీత గోవిందం కేరళలోనూ విడుదలై మంచి వసూళ్లు రాబడుతోంది. దీంతో కేరళలో వచ్చిన వసూళ్లన్నీ అక్కడ వరద బాధితుల సంక్షేమం కోసం విరాళంగా ఇవ్వనుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ నిర్ణయం ప్రకారం కేరళలో గీత గోవిందంకు వచ్చే వసూళ్లన్నీ అక్కడ వరద బాధితుల కోసం విరాళంగా ఇవ్వనున్నాం అంటూ చిత్రవర్గాలు ట్విట్టర్‌ ద్వారా వెల్లడించాయి. గీత గోవిందంపై దర్శకధీరుడి ప్రశంసలు

Updated By ManamThu, 08/16/2018 - 09:21

Rajamouli, Geetha Govindamవిజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా పరశురామ్ తెరకెక్కించిన చిత్రం ‘గీత గోవిందం’. స్వాతంత్ర్యదినోత్సవం కానుకగా బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో థియేటర్లో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని చూసిన దర్శకధీరుడు రాజమౌళి మూవీ యూనిట్‌పై ప్రశంసలు కురిపించారు.

‘‘గీత గోవిందం ఓ నవ్వుల ప్రవాహం. విజయ్ దేవరకొండ పాత్రను ఇలా ఊహించలేదు. అర్జున్ రెడ్డి తరువాత అతడి పాత్ర ఎంపిక బావుంది. ఏం చేస్తున్నాడో అతడికి బాగా స్పష్టంగా తెలుసు. సినిమా మొత్తం నవ్వులు పూయించింది. పరశురామ్ చిత్రాన్ని బాగా రచించి, దర్శకత్వం వహించారు. రాహుల్ రామకృష్ణ, అన్నపూర్ణమ్మ గారు, వెన్నల కిశోర్.. చాలా బాగా చేశారు. చిత్ర యూనిట్ మొత్తానికి కంగ్రాట్స్’’ అంటూ ప్రశంసలు కురిపించాడు. దీనిపై స్పందించిన విజయ్ దేవరకొండ.. ‘‘మీ దగ్గర నుంచి ప్రశంసలు పొందడం ఎప్పటికైనా స్పెషల్’’ అంటూ కామెంట్ ఇచ్చాడు.

 ‘గీత గోవిందం’ రివ్యూ

Updated By ManamWed, 08/15/2018 - 13:21
Geetha Govindam

హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన‌ `పెళ్లిచూపులు`, `అర్జున్ రెడ్డి` సినిమాల త‌ర్వాత రిలీజ్‌కి ముందు ఆ రేంజ్‌లో ప‌బ్లిసిటీ వ‌చ్చిన సినిమా `గీత గోవిందం`. తొలి సినిమా `చ‌లో`తో గోల్డెన్ లెగ్‌గా పేరు తెచ్చుకున్న ర‌ష్మిక మండ‌న్న ఇందులో హీరోయిన్‌. వీరిద్ద‌రు క‌లిసి క‌నిపించిన `ఇంకేం ఇంకేం కావాలే` సాంగ్ సూప‌ర్ హిట్‌. సినిమా రిలీజ్‌కి ముందు పైర‌సీ అయి కొన్ని సీన్లు లీక‌య్యాయి. ఇవ‌న్నీ ఎక్స్ పెక్టేష‌న్స్ ని భారీగా పెంచాయి. సినిమా వాటికి ధీటుగా ఉంటుందా? ఆల‌స్య‌మెందుకు.. రివ్యూ చ‌దివేయండి. 

బ్యాన‌ర్‌:  జిఎ2 పిక్చ‌ర్స్
తారాగ‌ణం: విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మందాన్న, నాగ‌బాబు, సుబ్బ‌రాజు, వెన్నెల కిషోర్‌,  రాహుల్ రామ‌కృష్ణ‌, గిరిబాబు, అన్న‌పూర్ణ‌మ్మ‌, మౌర్యాని, సుభాష్‌, అభ‌య్‌, స్వ‌ప్న‌క‌, స‌త్యం రాజేష్‌, దువ్వాసి మెహ‌న్‌, గుండు సుద‌ర్శ‌న్‌, గౌతంరాజు, అనీష‌, క‌ళ్యాణి న‌ట‌రాజ‌న్‌, సంధ్య జ‌న‌క్ త‌దిత‌రులు...
మ్యూజిక్‌: గోపిసుంద‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ: మ‌ణికంద‌న్‌
ఎడిట‌ర్‌: మార్తాండ్‌.కె.వెంక‌టేష్
ఆర్ట్‌: ర‌మ‌ణ వంక‌
ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌: స‌త్య గ‌మిడి
లిరిక్స్‌: అనంత్ శ్రీరామ్‌, శ్రీమ‌ణి, 
ప్రెజెంట్స్: అల్లు అర‌వింద్‌
ప్రొడ్యూస‌ర్‌: బ‌న్నివాసు
స్టోరీ-స్క్రీన్‌ప్లే-డైలాగ్స్-డైర‌క్ష‌న్‌: ప‌రశురామ్‌
విడుద‌ల తేదీ: 15.08.2018

క‌థ‌
విజ‌య్ గోవింద్ (విజ‌య్ దేవ‌ర‌కొండ) ప్రైవేట్ ఇంజ‌నీరింగ్ కాలేజీలో లెక్చ‌ర‌ర్‌. గీత (ర‌ష్మిక‌) సాఫ్ట్ వేర్ ఎంప్లాయీ. గీత కంపెనీ ఓన‌ర్ కూతురు నీలు కి విజ‌య్ అంటే ఇష్టం. అత‌న్ని పెళ్లి చేసుకోవాల‌ని క‌ల‌లు కంటుంది. త‌న చెల్లెలి నిశ్చితార్థం కోసం ప‌ల్లెటూరికి వెళ్తాడు విజ‌య్‌. బ‌స్సులో అత‌ని ప‌క్క సీట్లో గీత ట్రావెల్ చేస్తుంది. అనుకోకుండా ఆమెతో అత‌నికి లిప్ లాక్ అవుతుంది. త‌న త‌ప్పేం లేద‌ని చాలా మొత్తుకుంటాడు విజ‌య్‌.

అత‌ని మాట విన‌కుండా త‌న అన్న‌య్య‌కు ఫోన్ చేసి విష‌యం చెబుతుంది. అత‌న్ని చంపేయాల‌ని తిరుగుతుంటాడు ఆమె అన్న‌య్య (సుబ్బ‌రాజు). అయినా అనుకోని ప‌రిస్థితుల కార‌ణంగా గీత‌, విజ‌య్ క‌లిసి తిరగాల్సి వ‌స్తుంది. దీని వ‌ల్ల ఏమైంది?  విజ‌య్ చెల్లెలి పెళ్లి సంగ‌తేంటి?  గీత అన్న‌య్య విజ‌య్ మీద ప‌గ పెంచుకున్నాడా? అతనికి ఇత‌నిపై ఎలాంటి అభిప్రాయం ఉంది? వ‌ంటివ‌న్నీ ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు. 

geeta govindam

స‌మీక్ష‌
ప్ర‌తి వ్య‌క్తికీ పెళ్లి ఒక క‌ల‌. చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలి?  చేసుకున్నాక ఎలా చూసుకోవాలి.. వంటివ‌న్నీ అబ్బాయిల జేబుల్లో లిస్ట్ అయి రెడీగా ఉంటుంది. ఈ సినిమాలో విజ‌య్ పాత్ర కూడా అలాంటిదే. చిన్న‌ప్పుడే త‌ల్లిని పోగొట్టుకుని, క‌నుసైగ‌ల్లో అర్థం చేసుకునే భార్య రావాల‌ని కోరుకుంటుంటాడు. తొలి చూపులోనే గీతతో ప్రేమ‌లో ప‌డ‌తాడు. అనుకోని పొర‌పాటు వ‌ల్ల త‌న ప్రేమ‌ను వ్య‌క్తం చేసే సంద‌ర్భం అత‌నికి రాదు.

త‌న మ‌న‌సులోని మాట‌ను తీరా అవ‌త‌లి వ్య‌క్తి చెప్పే సంద‌ర్భ‌మే ఎదురైనా తృణీక‌రిస్తాడు. త‌ర్వాత త‌ప్పు తెలుసుకుని బాధ‌ప‌డ‌తాడు. బావ‌ను కాళ్లావేళ్లా ప‌డి త‌ను అనుకున్న‌ది సాధిస్తాడు. ఇదంతా ఏంటి? అంటే కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుల‌తో వ్య‌క్తులు చేసే యుద్ధ‌మే. క్లిష్ట‌మైన ప‌రిస్థితుల‌ను త‌మ‌కు తాము సృష్టించుకుంటున్న ప‌లువురు యువ‌త‌కు నిద‌ర్శ‌నం విజ‌య్ పాత్ర‌. గీత పాత్ర కూడా నేటి స‌మాజానికి అద్దం ప‌టే పాత్రే. ఈ పాత్ర‌ల చుట్టూ ద‌ర్శ‌కుడు క‌థ అల్లుకున్నారు.

అయితే సీన్లు కాసింత కొత్త‌గా రాసుకుని ఉంటే బావుండేది. భావోద్వేగాల్లో ఇంకాస్త ప‌దును చూపించి ఉంటే స‌రిపోయేది. ముందే హిట్ట‌యిన పాట‌ల ఊపు సినిమాకు ప‌నికొచ్చింది. ఎన్న‌డూ లేనంత‌మంది యువ‌త‌ను థియేట‌ర్ల వైపు తీసుకొచ్చింది. ప్రారంభ‌పు వ‌సూళ్ల‌ను పిచ్చ‌గా రాబ‌ట్టింది. సినిమా యువ‌త‌కు న‌చ్చుతుంది. స‌కుటుంబంగా చూసేలా ఉంది. విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాకు ప్ల‌స్‌.

ర‌ష్మిక కూడా ప్ల‌స్సే. .. కాక‌పోతే క్లైమాక్స్ లో ఏడ‌వ‌డం స‌రిగా రాలేదు. ఆమె ఏడుస్తున్నా.. చిత్రమేంటో న‌వ్వుతున్న‌ట్టే అనిపించింది. అన్న‌పూర్ణ‌మ్మ‌, వెన్నెల కిశోర్ కామెడీ బావుంది. నాగ‌బాబుకు గొంతు అరువిచ్చారు. అయితే అదేదో కృత్తిమంగా అనిపించింది. సుబ్బ‌రాజుకు చాన్నాళ్ల త‌ర్వాత మంచి పాత్ర ప‌డింది. ద‌ర్శ‌కుడు సినిమాను చ‌క్క‌గా తీసినా, ఆయ‌న గ‌త సినిమాల్లో ఉన్న సెంటిమెంట్ స‌న్నివేశాలు, ప‌దునైన డైలాగులు ఇందులో అంత‌గా క‌నిపించ‌లేదు.

ప్ల‌స్ పాయింట్లు
- పాట‌లు
- న‌టీన‌టులు
- కామెడీ
- కెమెరా

మైన‌స్ పాయింట్లు
- నాగ‌బాబు వాయిస్‌
- ర‌ష్మిక న‌ట‌న‌
- పేల‌వంగా సాగే స‌న్నివేశాలు
- క‌థ ఫ్లాట్‌గా ఉండ‌టం

రేటింగ్‌: 3/5
బాట‌మ్ లైన్‌:  యూత్ కోసం `గీత గోవిందం`.‘గీత గోవిందం’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్

Updated By ManamThu, 07/19/2018 - 15:05

geetha govindam విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా పరశురామ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘గీత గోవిందం’. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన ‘ఇంకేం ఇంకేం కావాలే’ అనే సింగిల్ యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తుండగా.. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. ఈ నెల 22 ఉదయం 11.05గంటలకు ఈ టీజర్ విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తుండగా.. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. స్వాతంత్ర్యదినోత్సవ కానుకగా ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఆగ‌ష్టులో బ‌న్నీ చిత్రం

Updated By ManamTue, 07/03/2018 - 10:40

allu arjun`నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` సినిమా త‌ర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మ‌రో సినిమాను స్టార్ట్ చేయ‌లేదు. క‌థ విష‌యంలో కాస్త జాగ్ర‌త్త‌లో ప‌డ్డాడు. అయితే బ‌న్ని తదుప‌రి సినిమాపై చాలా ర‌కాలైన వార్త‌లు వినిపించాయి. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం బ‌న్ని వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో సినిమాలు చేసే ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌బోతున్నాడు. గీతాఆర్ట్స్‌పై ఈ సినిమా రూపొంద‌నుంది. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌బోతున్న ఈ సినిమాను ఆగ‌స్టు నుండి సెట్స్‌కు తీసుకెళ‌తార‌ట‌. హీరో అఖిల్‌తో `హ‌లో` త‌ర్వాత విక్ర‌మ్ కుమార్ అల్లు అర్జున్‌తో చేయ‌డానికి స‌మ‌యం తీసుకుని క‌థ‌ను సిద్ధం చేశాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని టాక్‌. శర్వానంద్‌ మూవీతో ఫ్లాప్ డైరక్టర్ రీలాంచ్..?

Updated By ManamTue, 05/15/2018 - 10:53

Sharwa, Srikanth  ‘కొత్తబంగారు లోకం’, ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి రెండు వరుస విజయాలను ఖాతాలో వేసుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఆ తరువాత ‘ముకుంద’తో ఓకే అనిపించినా., ‘బ్రహ్మోత్సవం’తో భారీ ఫ్లాప్‌ను ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఆ తరువాత అతడి దర్శకత్వంలో నటించేందుకు ఏ హీరో ఆసక్తిని చూపలేదు. ఇలాంటి సమయంలో మళ్లీ తనెంటో ప్రూవ్‌ చేసుకునే పనిలో పడ్డాడు. 

ఈ నేపథ్యంలో తాజాగా ఒక కథను రెడీ చేసుకున్న అడ్డాల, దానిని శర్వానంద్‌కు వినిపించాడు. కథ నచ్చడంతో వెంటనే ఇందులో నటించేందుకు శర్వా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ నిర్మించనున్నట్లు సమాచారం. అన్నదమ్ముల కథతో తెరకెక్కనున్న ఈ సినిమాలో మరో యంగ్ హీరో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.


 గీతా వారి 'గీతా గోవిందం'?

Updated By ManamSat, 12/09/2017 - 11:43

geetha'అర్జున్ రెడ్డి'తో టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ అయిన యువ క‌థానాయకుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ప్ర‌స్తుతం చేతినిండా సినిమాల‌తో బిజీగా ఉన్నాడు ఈ యంగ్ హీరో. ఆ చిత్రాల‌లో ప‌రశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం ఒక‌టి. గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న హీరోయిన్‌గా న‌టిస్తోంది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ సినిమాకి 'గీతా గోవిందం' అనే పేరు ఖ‌రార‌య్యింద‌ని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. గీత అనే అమ్మాయి, గోవింద్ అనే అబ్బాయికి మ‌ధ్య జ‌రిగే ప్రేమ‌క‌థ నేప‌థ్యంలో సినిమా ఉంటుంద‌ని.. అందుకోస‌మే ఈ టైటిల్ అయితేనే బాగుంటుంద‌ని చిత్ర బృందం ఆలోచిస్తోంద‌ని చిత్ర స‌న్నిహిత వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. 

Related News