media

కిడారి, సోమ హత్యలపై మావోయిస్టుల లేఖ

Updated By ManamFri, 11/02/2018 - 16:32

Maoists letter release to Media Kidari, Soma murderవిశాఖ: అరకు జంట హత్యలపై మీడియాకు మావోయిస్టులు లేఖ రాశారు. అరకులో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, సోమాలను మావోయిస్టులు కాల్చిచంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం మీడియాకు లేఖ రాసిన మావోయిస్టులు.. ఎమ్మెల్యే కిడారి, సోమా హత్యలను సమర్థించుకున్నారు.

వీరిద్దరూ మైనింగ్ మాఫియాగా మారి ఆదివాసీల సంపదను దోచుకుంటున్నారని లేఖలో ఆరోపించారు. పార్టీలు మారినా.. కిడారి డబ్బు సంపాదనకు అర్రులు చాచారని లేఖలో పేర్కొన్నారు. మెజార్టీ ప్రజలు అభిమతం మేరకే శిక్ష అమలు చేశామని మావోయిస్టులు స్పష్టం చేశారు. అవును నేను రౌడీనే...

Updated By ManamWed, 10/31/2018 - 14:15
TDP Chintamaneni Prabhakar Using Unparliamentary Language with media

ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి తన ప్రతాపం చూపించారు. ‘అవును.. నేను రౌడీనే’ అంటూ మీసాలు తిప్పుతున్నారు. విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తమ వాళ్లకు చెందిన వాహనాలను సీజ్ చేయడంతో ప్రభాకర్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సోమవారం రాత్రి దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం కొప్పాక వద్ద గల పోలవరం కుడి కాలువపై అక్రమంగా మైనింగ్ చేసి ఇసుక తరలిస్తున్న ఒక పొక్లెయిన్, నాలుగు లారీలను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అడ్డుకుని సీజ్ చేశారు. అవి చింతమనేని అనుచరులవి. దీంతో ఎమ్మెల్యే ప్రభాకర్ రంగప్రవేశం చేశారు.

‘మా వాళ్ల వాహనాలను సీజ్ చేస్తావా’ అంటూ  స్థానికంగా ఉన్న కొంతమంది తన అనుచరులను అధికారులపై ఉసిగొలిపి అధికారులను నిర్బంధించారు. దీంతో అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు పక్షాలను శాంతింపజేశారు. ఎమ్మెల్యే ప్రభాకర్ సూచనలతో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల ముందే సీజ్ చేసిన వాహనాలను అక్కడి నుంచి స్వేచ్ఛగా తరలించేశారు. దీంతో విజిలెన్స్ అధికారులు పెదవేగి పోలీస్‌స్టేషన్‌లో ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన సోదరుడు చింతమనేని సతీష్‌తో పాటు కొంతమంది అనుచరులపై ఫిర్యాదు చేశారు. 

ఈ విషయమై విజిలెన్స్, ఎన్స్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీని కలిసి వివరణ ఇచ్చేందుకు చింతమనేని మంగళవారం ఉదయం ఆ కార్యాలయానికి వచ్చారు. ఈ విషయం మీడియాకు తెలియడంతో అక్కడకు చేరుకున్న మీడియా ప్రతినిధులు... ఎమ్మెల్యే లోపలి నుంచి బయటకు వచ్చేవరకు వేచి ఉన్నారు.

చింతమనేని కార్యాలయం నుంచి బయటకు వచ్చే సమయంలో మీడియా ప్రశ్నించడంతో ఆయన ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయారు. ‘ఏం కావాలిరా మీకు నా కొడకలారా’ అంటూ పచ్చి బూతుపురాణం మొదలుపెట్టారు. దీంతో అక్కడికొచ్చిన విలేకరులు కూడా ఆశ్చర్యపోయారు. ఆయన ఒక్కసారిగా మీడియా ప్రతినిధులను దుర్భాషలాడారు. పత్రికలో రాయలేని అసభ్య పదజాలంతో రంకెలేశారు. 

దాదాపుగా అక్కడున్న ప్రతి ఒక్క విలేకరి వద్దకు వచ్చి బూతులు తిడుతూ తన అనుచరులతో సహా కారు ఎక్కి వెళ్లిపోయారు. అక్కడే ఉన్న అధికారులు సైతం ఇది చూసి అవాక్కై ఏమీ చేయలేక అలాగే ఉండిపోయారు. ఈ వ్యవహారంపై తీవ్రస్థాయిలో నిరసన తెలిపేందుకు జర్నలిస్టు సంఘాలు సిద్ధమవుతున్నాయి. తమ విధి నిర్వహణలో భాగంగా వివరణ అడిగేందుకు మాత్రమే అక్కడకు వెళ్లామని, అంతమాత్రానికే ఆయన అలా అసభ్య పదజాలంతో దూషించడం సరికాదని జర్నలిస్టులు అన్నారు. టీవీలతో టీనేజర్లలో హింసాధోరణి!

Updated By ManamSun, 09/30/2018 - 22:18

mediaవాషింగ్టన్:  మీడియాలో ప్రసారమవుతున్న హింసాత్మక సంఘటనలు టీనేజర్లలో దూకుడు స్వభావాన్ని, వారిలో హింసను రెచ్చగొడుతున్నాయని పరిశోధకులు హెచ్చరించారు.  టీనేజీలో ఈ ధోర ణికి ఆజ్యం పోస్తున్నది ఎలెక్ట్రానిక్ మీడియానే అంటున్న వీరు.. టీవీ దుష్ప్రభావంతో యువతరం హఠాత్తుగా క్షణికావేశానికి గురవుతోందని పరిశోధకులు వెల్లడించారు.  ఆన్‌లైన్‌లో 14 నుంచి 17 ఏళ్ల మధ్య ఉన్న 2000 మంది టీనేజర్లపై జరిగిన సర్వేతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.  ఈ అంశాన్ని ధీటుగా ఎదుర్కునేందుకు తల్లిదండ్రుల సహకారం అవసరమని అమెరికాలోని అరెగాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అటికా ఖురానా సూచించారు. కౌమార దశలో మీడియా ప్రభావం గరిష్ఠంగా ఉంటుంది కనుక వారు పదేపదే చూస్తున్న కార్యక్రమాలపై ఇంట్లో పెద్దలు కన్నేసి ఉంచాలంటున్నారు.అలెస్టర్ కుక్‌కు మీడియా స్పెషల్ గిఫ్ట్‌!

Updated By ManamTue, 09/11/2018 - 17:08

33 bottles of beer, Alastair Cook, farewell gift, mediaఓవల్: అంతర్జాతయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్ అలెస్టర్ కుక్‌కు మీడియా నుంచి ప్రత్యేక బహుమతి అందింది. భారత్‌తో జరిగే ఆఖరి టెస్టులో సోమవారం నాల్గోరోజున అలెస్టర్‌కు మీడియా సమక్షంలో ఘనంగా వీడ్కోలు పలికారు. తన ఫైనల్ టెస్టు ఇన్నింగ్స్‌లో కుక్ 33వ సెంచరీ పూర్తి చేశాడు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫిరెన్స్‌‌లో మీడియా సమక్షంలో కుక్‌కు 33 బీర్ బాటిళ్లను గిఫ్ట్‌గా ఇచ్చారు. గతవారమే తాను అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు కుక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ జట్టులో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన టెస్టు బ్యాట్స్‌మన్‌గా నిలిచిన కుక్.. 45.35 సగటుతో మొత్తం 12472 పరుగులు సాధించగా, అందులో 33 సెంచరీలు, 57 హాఫ్ సెంచరీలను తన పేరిట లిఖించుకున్నాడు.

ఈ సందర్భంగా మీడియా ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘‘మీడియా తరపు నుంచి కుక్.. నిన్ను అభినందిస్తున్నాం. కొన్నేళ్లుగా ఒక ఆటగాడిగా, ఇంగ్లండ్ కెప్టెన్‌గా నీ ప్రదర్శన ఎంతో అద్భుతం. ప్రత్యేకించి మీడియాతో నీకున్న అనుబంధం విషయంలో ఎంతో సంతోషకరం. నీ కోసం చిన్న గిఫ్ట్‌ తెచ్చాం. డిన్నర్ సమయంలో నువ్వు వైన్ తాగనని, బీర్ తాగే వ్యక్తినని చెప్పినట్టు గుర్తు. అందుకే నీ కోసం 33 బీర్ బాటిళ్లు తెచ్చాం. అందులో ఒక్కో బీర్ బాటిల్.. మీడియాలో ప్రతి ఒక్కరి సందేశంగా భావించు’’ అని పేర్కొన్నారు. దీనిపై కుక్ స్పందిస్తూ..‘ప్రియమైన నా మీడియా మిత్రులకు కృతజ్ఞతలు’’ అంటూ కరచాలనం చేస్తూ ఆనందం వ్యక్తం చేశాడు. ఓవల్ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో కుక్‌ ఫేర్‌వేల్ డే సందర్భంగా 33వ సెంచరీ సాధించి తన 291వ టెస్టు ఇన్నింగ్స్‌‌తో చెరగని ముద్రవేశాడు.    నా మీద, నా తల్లి మీదే ఎందుకిలా..?

Updated By ManamFri, 04/20/2018 - 08:57

Pawan kalyan హైదరాబాద్: ‘‘ఒకప్పుడు దొరలు అంటే భూస్వామ్యులు కానీ ఇప్పుడు దొరలంటే ఈ మీడియా ఆసాములని.. వారు చెప్పిందే వేదం, వారు పాడిందే నాదం’’ అంటూ మీడియా చానెల్స్ యాజమాన్యంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియా యాజమాన్యానికి ఆయన పలు ప్రశ్నలు సంధించారు.

ఇక తన మీద, తన తల్లి మీద మీరు చేస్తున్న ఈ స్పెషల్ ట్రీట్‌మెంట్.. చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, ప్రతిపక్ష నేత, బాలకృష్ణ గారి చేయగలరా అంటూ ప్రశ్నించిన పవన్.. కానీ ఇవన్నీ మీరు ఒక్క పవన్ కల్యాణ్, అతని తల్లి మీద మాత్రం బాగా చేస్తున్నారంటూ విమర్శలు కురిపించారు.


 తప్పుడు వార్తలపైనే మీడియా ఆసక్తి

Updated By ManamMon, 04/16/2018 - 08:31

Poonam మీడియా ఎప్పుడూ టీఆర్పీ రేటింగ్ కోసమే పాకులాడుతుందని ప్రముఖ సినీ నటి, ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్ పూనమ్‌ కౌర్ అసహనం వ్యక్తం చేశారు. ప్రజలకు ఉపయోగపడే వార్తలపై ఎప్పుడూ శ్రద్ద చూపని మీడియా.. తప్పుడు వార్తలను రాసేందుకు మాత్రం చాలా ఆసక్తిని చూపిస్తోందని విమర్శించారు. 

చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా, స్వచ్ఛంద సేవకురాలిగా తాను అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామాను, విశ్వసుందరి మానుషి చిల్లార్‌ను కలిశానని.. అయినా అవేవీ మీడియా పట్టించుకోవడం లేదని.. కానీ తప్పుడు వార్తలు రాసేందుకు మాత్రం ఉవ్విళ్లూరుతోందని అన్నారు. నటి శ్రీదేవి చనిపోయినప్పుడు కూడా ఎన్నో కల్పిత కథలు సృష్టించారని ఓ ఇంటర్వ్యూలో ఆవేదనను వ్యక్తం చేసింది.


 మీడియాపై నాని ఆవేదన 

Updated By ManamTue, 03/27/2018 - 15:10

nani సామాజిక మాధ్యమాలపై నాచురల్ స్టార్ నాని ఆవేదన వ్యక్తం చేశారు. "కొన్ని టీవీ చానెళ్లు, షోలను నిర్వహించే హోస్ట్‌లు, యూట్యూబ్‌ చానెళ్లు ఇటీవల సినీ ఇండస్ట్రీ గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నాయి.. వీరి చర్యలను ఇప్పటికైనా ఖండించాలి" అని నాని సామాజిక మాధ్యమాలలో వెల్లడించారు. అంతేకాకుండా "భవిష్యత్‌ను నిర్మించడంలో మీడియాలు చాలా ప్రాధాన్యతను వహిస్తాయి.. దీన్ని గుర్తు పెట్టుకోండి. చిన్న పిల్లలు కూడా అన్నింటిని చూస్తున్నారు. ఇప్పటి వరకు జరిగింది చాలు. ఇప్పటికైనా ఆపండి" అంటూ నాని అన్నారు.

అయితే సినీ ఇండస్ట్రీలో చాలా మంది అమ్మాయిలను వాడుకుంటారంటూ ఇటీవల ఓ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఆమెకు మద్దతిస్తూ కొంతమంది కామెంట్లు చేయగా.. మరికొందరు ఆమె వ్యాఖ్యలను ఖండించారు. ఇక ఈ అంశాన్ని తీసుకొని కొన్ని టీవీ చానెళ్లు లైవ్ ప్రోగ్రామ్‌లను కూడా నిర్వహించాయి. ఈ నేపథ్యంలో వాటిపై స్పందించిన నాని.. మీడియాపై అసహనం వ్యక్తం చేశాడు.షమీ భార్యకు కోపమొచ్చింది.. మీడియా కెమెరా పగిలింది

Updated By ManamTue, 03/13/2018 - 21:50

shami wifeకోల్‌కతా: తన భర్త తనను వేధిస్తున్నాడంటూ వార్తల్లో నిలిచి సంచలనానికి తెరలేపిన క్రికెటర్ షమీ భార్య హసిన్ జహన్ కోల్‌కతాలో మీడియా సిబ్బందితో దురుసుగా ప్రవర్తించింది. మీడియా ప్రతినిధిని చూడగానే ఒక్కసారిగా సహనాన్ని కోల్పోయి.. ఆగ్రహంతో ఊగిపోయింది. ఓ మీడియా ప్రతినిధి కెమెరాను ధ్వంసం చేసి, మీడియా సామాగ్రిని ధ్వంసం చేసింది. మీడియా సిబ్బందిపై కేకలేస్తూ రుసరుసలాడింది. ఈమె దురుసు ప్రవర్తన వల్ల ఓ మీడియా సిబ్బందిలోని ఒకరికి చిన్నపాటి గాయమైంది. ఆమె ప్రవర్తనపై జర్నలిస్టులు మండిపడుతున్నారు.ఫోర్త్ ఎస్టేట్.. ప్రజా విపక్షం

Updated By ManamThu, 02/01/2018 - 00:01

mediaవార్తా మాధ్యమాలను ‘ఫోర్త్ ఎస్టేట్’ అని పిలవడం నెపోలియన్ కాలం నుంచి ప్రారంభమైంది. విశిష్ట రాజకీయ అధికారాలున్న ఒక ప్రధాన రాజకీయ లేదా సామాజక సమూహం లేదా వర్గాన్ని ఎస్టేట్ అని పిలుస్తారు. పారిశ్రామిక విప్లవ సమయంలో యూరోపియన్ సమాజంలోని సామాజిక అధికార కేంద్రాలుగా పనిచేసే ప్రజా సమూహాలను మతాధికారులు, కులీనులు, సామాన్యులు అనే విభజనతో కూడిన అంతస్తులను థర్డ్ ఎస్టేట్‌గా పరిగణిస్తారు. ఈ మూడు అంతస్తులకు తోడు సమాజాన్ని ప్రభావితం చేసే నాల్గవ శక్తిగా వార్తాపత్రికలు రంగంలోకి రావడంతో వార్తా మాధ్యమాన్ని నాల్గవ ఎస్టేట్‌గా (ప్రాబల్యశక్తి) పరిగణించారు. ఇంగ్లీషు మినహా ఇతర యూరోపియన్ భాషలలో రాజ్యంలోని శాసన, న్యాయ, కార్య నిర్వాహక శాఖలను ఎస్టేట్‌లుగాను, మీడియాను ఫోర్త్ ఎస్టేట్‌గా పిలిచేవారు. అయితే భారత ప్రథమ ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ ఈ రెండు భావనలకు భిన్నంగా రాజ్యంలోని (సమాజంలోని ప్రజా సమూహాలు కాదు) నాలుగు ఎస్టేట్ (విభాగాలు)లను తీసు కొచ్చి ప్రజాస్వామిక సౌధానికి నాలుగు స్తంభాలుగా మార్చివేశారు.

మానవ సమాజం పరిణామంలో ఉనికిలోకి వ చ్చిన బానిస, ఫ్యూడల్, పెట్టుబడిదారీ వ్యవస్థల్లాగా ఒక భౌతిక సామాజిక వ్యవస్థగా ప్రజాస్వామ్యాన్ని పరిగణించరాదు. పైన పేర్కొన్న సామాజిక వ్యవస్థ లన్నిటిలో మెజారిటీ ప్రజల అభిప్రాయం మేరకు ఆధి పత్యవర్గాల మధ్య అధికార పంపక ప్రక్రియగా ప్రజా స్వామ్యం ఉంటుంది. అంటే ప్రజాస్వామ్యమనేది అన్ని సామాజిక వ్యవస్థల్లో పాలనాధికార కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునేందుకు పాటించే ప్రక్రియ మాత్రమే. ఆ తర్వాత అది క్రమంగా వివిధ రాజకీయ పక్షాలు ఒకరి విధానాన్ని మరొకరు విమర్శించే ‘అపవాదు’గా మారింది. ప్రజాస్వామ్య ప్రక్రియ బానిస వ్యవస్థలో బానిసలకు, ఫ్యూడల్ వ్యవస్థలో అర్థబానిసలకు, పెట్టుబడిదారీ వ్యవస్థలో చాలాకాలం పాటు వేతన బానిసలైన శ్రమజీవులకు, ఆధునిక వ్యవస్థలో తప్ప మిగిలిన అన్ని చారిత్రక వ్యవస్థలలోనూ మహిళలకు వర్తించ లేదు. ఆధునిక సమాజంలో సార్వజనీన ఓటు హక్కు ఏర్పడిననాటి నుంచి ప్రజాస్వామ్యమనేది వ్యవస్థలోని ఆధిపత్య వర్గాల ప్రయోజనాలకు అనుగుణంగా పాలన చేపట్టే ఒక కార్యనిర్వాహక వర్గం(ప్రభుత్వం) ఏర్పాటుకు అంటే రాజకీయ, పాలనా అధికారాన్ని పాలకవర్గాలు సొంతం చేసుకునేందుకు ఎన్నికల రూపంలో జరిగే ఒకతంతు (ఉపరితల విన్యాసం)గా ప్రజాస్వామ్య ప్రక్రియ ఉనికిలోకి వచ్చింది. పైకి అది ప్రజలందరి అభీష్టం మేరకు ప్రజాప్రతినిధులను ఎన్నుకున్నట్లు కనపడినా, అంతస్సారంలో సమాజంలోని ఆర్థిక, సామాజిక ఆధిపత్య వర్గాల్లోని ఒక ముఠా ప్రయోజనాలను నెరవేర్చే కార్యనిర్వాహక వర్గాన్ని శాసన వ్యవస్థ రూపంలో కొంతకాలం పీఠంపై కూ ర్చోబెట్టడం తప్ప వేరు కాదు. పాలక భావజాలంతో ఉన్న ప్రజానీకంలోని మెజారిటీ పాలకవర్గాలలోని ఒక ముఠాను అధికారపీఠంపై కూర్చోబెట్టే ప్రక్రియే ఎన్ని కలు. ఈ ప్రక్రియను ప్రజాస్వామిక ప్రక్రియగా పిలుస్తారే గానీ దానికదే ఒక సామాజిక వ్యవస్థగా పరిగ ణించకూడదు. అయితే ఆ ప్రక్రియను నెహ్రూ ఒక భౌతికరూపాన్ని సంతరించుకున్న ఆ వర్చువల్  ప్ర జాస్వామిక సౌధంగా అభివర్ణిస్తూ, రాజ్యంలోని విభా గాలైన శాసన, న్యాయ, కార్యనిర్వాహక విభాగాలను స్తంభాలుగా నిలబెట్టడం కేవలం ‘అసంబద్ధత’ తప్ప హేతుబద్ధమైన సూత్రీకరణ కాదు.

సామాజిక శాస్త్రాలను బట్టి రాజ్యం శాసన, న్యా య, కార్యనిర్వాహక విభాగాలతో పాటు రక్షణ విభా గాన్నీ (సైన్యం, పోలీసు వ్యవస్థలు) పరిగణనలోకి తీసుకొని నాలుగు ఎస్టేట్‌లుగా గుర్తించాలి. అంతేగాని రాజ్యం విభాగాల్లో మీడియాను కూడా చేర్చి ప్రజా స్వామ్య సౌధానికి నాలుగు స్తంభాలని తప్పుగా సూత్రీకరించడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే. అమెరికాలో మీడియాను ప్రభుత్వంలో నాల్గవశాఖ (ఫో ర్త్ బ్రాంచ్)గా పరిగణిస్తారు. ప్రభుత్వ యంత్రాంగంలో మీడియాను అంతర్భాగం చేస్తే మీడియా స్వే చ్ఛకు అర్థమేముంది? రాజ్యంలోని నాలుగు విభాగా లు (నెహ్రూ అన్నట్లు నాలుగు స్తంభాలు) ప్రజాస్వా మికంగా నడిస్తే ప్రభుత్వాలు జనరంజక పాలనను అందించగలవేగానీ, ఆ విభాగాలు సవ్యంగా నడిస్తేనే ప్రజాస్వామ్య సౌధం పటిష్టంగా ఉంటుందనడంలో అసలు అర్థమేలేదు. నెహ్రూ స్తంభాల పోలిక అలవోకగా చేసిన పొరపాటు సూత్రీకరణ ఎంతమాత్రమూ కాదు. మీడియాను రాజ్యయంత్రాంగంలో ఒక శాఖగా పనిచేయాలన్నది ఆయన అంతరార్థంగా గుర్తించాలి. మీడియాను ‘నాల్గవ స్తంభం’, ‘ఫోర్త్ ఎస్టేట్’ అనే అర్థ రాహిత్యాన్ని తలకెక్కించుకొన్న జర్నలిస్టు మేధావులు ఈ మీడియా స్వేచ్ఛను ప్రభుత్వాల, రాజకీయ పక్షా ల, వాణిజ్య వేత్తల, కార్పొరేట్ శక్తుల, వివిధరకాల మాఫియా, ఫ్యాక్షనిస్టుల కార్యకలాపాల పక్షపాత కథ నాలలో, వాళ్లందించే నజరానాలలో, పెట్టుబడులలో  చూసుకుంటున్నారు. సామ, దాన, భేద దండోపాయా లతో మీడియాను పంచమాంగ దళంగా మార్చుకునే క్రమం రెండు తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా నడుస్తోంది. కార్పొరేట్, ప్రభుత్వ విధానాల కుంభకో ణాలపై సంచలన కథనాలను ప్రచురించిన మీడియా సంస్థలు, పక్షపాత రహితంగా వార్తల్ని వార్తలుగా ఇస్తూ, ప్రజాపక్షం వహిస్తామని గంభీర ప్రకటనలు చేసిన దినపత్రికలు సైతం అంతిమంగా ఏదో ఒక రాజకీయ పక్షానికి అనుగుణంగా (బహిరంగంగా లేదా రహస్యంగా) మారిపోతున్నాయి. పత్రికలు ప్రజాపక్షంగా కనిపిస్తూ సారాంశంలో పాలకపక్షాలలో ఏదో ఒకదానితో లోపాయికారీ సంబంధాలతో ఉన్నాయి. 

వార్తాపత్రికల నుంచి వార్తలు పరారుకరణకు గురై వాటి స్థానాన్ని సంచలనాలు ఆక్రమించాయన్నది సర్వవిదితమే. ప్రపంచంలోని వివిధ సంఘటనలు, విషయాలకు సంబంధించి ఎలా? ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానాలుగా ‘మెయిన్ పేజీ’ల కథనాలుండాలి, ‘ఎందుకు?’ అనే ప్రశ్నకు సమాధానంగా సంపాదకీయాలు, సంపాదకీయ వ్యాసాలు ఉండాలి. అలాంటిది నేడు సాధారణ వార్తలు సైతం సంపాదకీయుల్లా మారి, పక్ష, మాస పత్రికల్లాగా రాజకీయ, వ్యాపార ప్రయోజనాలకు అనువైన కథనాలు, వ్యాఖ్యానాలే ప్రముఖంగా ఉంటున్నాయి.  ప్రజలు చదవరనీ, డ్రై సబ్జెక్టు అనే ప్రాథామ్యాల సాకుతో జాతీయ, అంతర్జాతీయ వార్తలు, రాజకీయ మనోవిశ్లేషణలు, విజ్ఞానశాస్త్రం, పర్యావరణం లాంటి విషయాలను దినపత్రికలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. దీర్ఘకాలిక ప్రయోజనం గల సామాజికార్ధిక విధానాలు, ప్రజా సంక్షేమం లక్ష్యంగా గల విశ్లేషణలు తగ్గి, రాజకీయ పక్షాల ఎత్తులు, జిత్తులకు సంబంధించిన అంశాలకు ప్రాముఖ్యత పెరగడం లాంటి అవలక్షణాలు నేడు ప్రధాన స్రవంతి వార్తా పత్రికల స్వభావంగా మారింది. యాజమాన్యం మూలవిరాట్టుగా, సంపాదకులు ఉత్సవ విగ్రహాలుగా మారారు. తెలుగు భాష వికృతీకరణకు గురైంది. అదే సమయంలో వివిధ సామాజిక శాస్త్రాలు, ప్రకృతి శాస్త్రాలకు చెందిన భావనలు, పారిభాషిక పదాలు అందరికీ అర్థమయ్యే భాషలో ఉండాలనే పేరుతో తప్పుడు అర్థాలు వచ్చే పదజాలాన్ని తెలుగు మీడియా బాధ్యతా రహితంగా వాడుతూ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తోంది.

చందాదారులపై ఆధారపడడం కంటే ‘లూజ్ సేల్స్’ పైనే పత్రికలు ఆధారపడడంతో యాజమాన్యాలు, సంపాదకులు, విలేఖర్లు కలసి తొలిపుటను సింగారించడంపైనే కేంద్రీకరిస్తారు. సినిమా డైలాగులు, పేర్లతో, అంత్యప్రాసల విన్యాసాలతో, అర్ధరహితవైున ద్విపద బంధాలతో, తెలుగు భాషను అడ్డంగా విరచి, ధ్వంసం చేస్తున్న తొలిపుట శీర్షికలతో ఆకర్షించేలా సింగారింపబడుతోంది. కోట్ల రూపాయల ప్రభుత్వ, వ్యాపార ప్రకటనలు రాబట్టుకునేందుకు పాలకుల, కార్పొరేట్ శక్తుల దయాదాక్షిణ్యాల కోసం వెంపర్లాడడంతో పత్రిక ప్రమాణాలు దిగజారి పోతున్నాయి. అర్థశాస్త్ర సూత్రాల ఓనమాలు తెలియని వారు బిజినెస్ పేజీ నడిపిస్తారు. సామాజిక శాస్త్రాల, సిద్ధాంతాల గురించి బొత్తిగా తెలియనివారు మెయిన్ పేజీలను, ఎడిట్ పేజీని, సాహిత్యంలో నిరక్షరకుక్షులు సాహిత్య పేజీని అలవోకగా నడిపించేస్తుంటారు. పీటీఐ వార్తాసంస్థ కథనాల పైపై పరిజ్ఞానంతో సర్వజ్ఞులుగా, మేధావుల్లా ఫోజులు కొడుతూ సున్నితమైన సామాజిక అంశాలను అడ్డదిడ్డంగా వండివారుస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు జన మాథ్యవూల రంగంలో పలు అప్రజాస్వామిక ధోరణులు, సామాజిక కుల, మత, జాతి ప్రాంత తదతర భావజాల వైపరీత్యాలు పరాకాష్ఠకు చేరుకున్నాయంటే అతిశయోక్తి కాదేమో!

స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో జాతీయో ద్యమ స్పూర్తితో పత్రికా రంగం గుబాళించేది. 1980వ దశకం చివరికల్లా జాతీయోద్యమ కాలం నాటి సామాజిక విలువలు భారతదేశ మీడియాలో క్రమంగా సన్నగిల్లాయి. సోషలిజం, ప్రజాస్వామ్య భావాల స్థానంలో లాభార్జనే పరమ లక్ష్యమన్న విలువలు చోటు చేసుకున్నాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో మీడియాలో ఆదర్శాలు అంతరించి ఆస్తి సంపాదన ఆధిపత్యం వహిస్తోంది. కులం, మతం, ప్రాంతాల్లాంటి పలు సామాజిక వికారాలు జర్నలిస్టుల్లో పరాకాష్టకు చేరుకున్నాయి. తదనుగుణమైన లాబీలు, ముఠాలు ఏర్పడి పరస్పరం కీచులాడుకుంటున్నాయి. యాజమాన్యవర్గం తన ఉనికిని ధ్రువీకరించే మీడియా మేధావుల్ని సృష్టించుకుంది, లేదా అథమపక్షం ప్రలోభాలతో రూపాంతీకరణకు గురిచేసింది.  ఆధునిక భారతీయ అమానవీయ సామాజిక స్వభావానికి సజీవ ప్రతిబింబంగా మీడియా రూపుదాల్చింది. మౌలిక సామాజిక పరిణామాలు మాత్రమే ఈ పరిస్థితిని చక్కదిద్దగలవు. 

వెన్నెలకంటి రామారావు
సెల్ : 9550367536నిరర్థక కలహం

Updated By ManamWed, 11/29/2017 - 00:33

nehruశాసన, కార్యనిర్వాహక, న్యాయ, సాయుధ బలగాల వ్యవస్థలతో కూడినట్టి నిర్మాణాన్ని రాజ్యాంగయంత్రం అని సామాజిక శాస్త్రం నిర్వచిస్తుంది. పౌరసమాజ (వర్గ, కుల, మత, ప్రాంత, జెండర్ తదితర అస్తిత్వాలు) స్వభావంపై  ఆ వ్యవస్థల పని తీరు, వాటి మధ్య సమన్వయం ఆధారపడి ఉంటుంది. అయితే అందుకు భిన్నంగా సాయుధ బలగాల వ్యవస్థను మినహాయించి మిగిలిన వ్యవస్థలతో, ప్రసార మాధ్యమాన్ని కలిపి ప్రజాస్వామ్యానికి నాలుగు మూల స్తంభాలుగా ప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ నిర్వచించారు. ఆయన బాణీలోనే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, న్యాయ శాఖా మంత్రి, ఆర్థిక మంత్రి తదితరులు  శాసన, నిర్వాహక, న్యాయ వ్యవస్థలు స్వతంత్రత నిలుపుకుంటూ, సమన్వయంతో పనిచేయగలిగితేనే ప్రజాస్వామ్యం  సజావుగా పరిఢవిల్లుతుందని వివిధ సందర్భాల్లో నొక్కి చెప్పారు. అయితే మిగిలిన మూడు స్థంభాలూ సజీవంగా పనిచేసేందుకు మీడియా స్తంభమే కీలక పాత్ర పోషిస్తుందన్న నెహ్రూ ఆంతర్యాన్ని వారెవరూ గుర్తించలేదనిపిస్తుంది. ఎందుకంటే శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలలోని అపశృతులను కథనాలుగా మార్చి ప్రజలకు అందించి ప్రజాధికారానికి గ్యారెంటీగా నిలవాల్సిన వ్యవస్థ అది. అయితే అందుకు విరుద్ధంగా శాసన వ్యవస్థకు అనుబంధంగానే మీడియా నడుస్తుండడం ఒక వాస్తవం. 

ప్రజాస్వామ్యమనేది నియమబద్ధంగా జరుగుతున్న ఎన్నికల జాతరలో మెజారిటీ సాధించిన రాజకీయ పక్షం గడువు తీరే దాకా రాజ్యాంగయంత్రాన్ని చేపట్టి పాలన సాగించడం కాదు. రాజ్యాంగయంత్రంలోని వివిధ వ్యవస్థలను ప్రజానుకూలంగా పనిచేయించడమన్నది సాంకేతిక అర్థంలో చూస్తే అర్థంకాదు. పౌరసమాజంలోని ఆధిపత్య శక్తుల ప్రభావపు పునాదిపై లేచే అధికార ప్రక్రియనే ప్రజాస్వామ్యంగా పరిగణిస్తారు. రాజ్యాంగయంత్ర వ్యవస్థలు మెజారిటీ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా నిజమైన అర్థంలో పనిచేసినప్పుడే వాటి మధ్య సమన్వయాన్ని తీసుకురాగలం. అంతేగానీ పౌర సమాజంలోని ఏ కొద్ది మంది ప్రయోజనాలకు అనుగుణంగా శాసన వ్యవస్థ ఏర్పడినంత కాలం రాజ్యాంగ యంత్ర వ్యవస్థలను సజావుగా నడపడం సాధ్యం కాదు. ఆర్థిక, సామాజిక, జెండర్ తదితర అసమానతలపై నడుస్తున్న పౌర సమాజం సంక్షోభంలోకి కూరుకుపోయిన సందర్భాల్లో రాజ్యాంగయంత్రాంగంలో వైరుధ్యాలు తీవ్ర తరమవడం కద్దు. ఒకదాని వైఫల్యాన్ని చూపి మరొకటి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నట్టుండడం జరుగుతుంది. శాసన వ్యవస్థలోని అవినీతిని న్యాయవ్యవస్థ ఒకసారి ప్రశ్నిస్తే, మరొకసారి ఎన్నికల కమిషన్ రూపంలోని కార్యనిర్వాహక వ్యవస్థ ప్రశ్నిస్తుంది. చట్టాలను సవ్యంగా అమలు చేయడం, పారదర్శకమైన పాలనను అందించడంలో ప్రభుత్వం విఫలమైతే ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పిల్స్) ఆధారంగా న్యాయవ్యవస్థ చొరవ చూపుతుంది. హైవేలపై తాగి వాహనాలు నడపడం, సినిమా హాళ్లలో జాతీయగీతాలాపన, నిర్భయ సామూహిక అత్యాచారం హత్యోదంతం, గుజరాత్, ముంబై మత విద్వేషకాండపై విచారణలు, 2జీ స్పెక్ట్రమ్, ఢిల్లీ కామన్‌వెల్త్ గేమ్స్ నుంచి ఈనాటి రాఫెల్ యుద్ధ విమానాల కుంభకోణాల వరకు చట్టాల ననుసరించి తీర్పులు చెప్పడమే కాదు, వాటి దర్యాప్తు బాధ్యతలు సైతం న్యాయవ్యవస్థ చేపట్టడం, ప్రభుత్వాలను చట్టాలను రూపొందించమని ఆదేశించడం, ప్రభుత్వ నిర్ణయాలను తోసిపుచ్చడం వంటివి వివాదాస్పదంగా మారాయి. అదే సమయంలో జడ్జీలను జడ్జీలతో కూడిన కొలీజియమే నిర్ణయించే విధానాన్ని రద్దు చేసి,  నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్ (ఎన్‌జేఏసీ)ని ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన చట్టాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. దాంతో 1993లో కొలీజియం ఏర్పాటు చేసినప్పటినుంచి జరిగిన నియావుకాల్లోని లాభనష్టాలను బేరీజు వేయాలని న్యాయశాఖ మంత్రి ప్రకటన న్యాయవ్యవస్థ లొసుగులను ప్రశ్నించినట్లవుతుంది. ఇలా ఎన్నో వివాదాలు రాజ్యాంగయంత్రంలోని వివిధ వ్యవస్థల మధ్య తలెత్తాయి. సమాజాన్ని నడిపించే ఈ వ్యవస్థల మధ్య తలెత్తిన కలహాలకు కారణం సామాజికార్థిక సంక్షోభం పర్యవసానంగా ఏర్పడినదే. వాటి మధ్య తలెత్తిన వివాదాలకు పరిష్కారం మెజారిటీ ప్రజలకు ప్రాతినిథ్యం వహించే సామాజికార్థిక విధానాలు కలిగిన రాజకీయపక్షం అధికారంలోకి రావడంతోనే సాధ్యమవుతుంది. 

Related News