Republic Day

ట్రంప్ ఇంకా నిర్ణయించుకోలేదు..

Updated By ManamThu, 08/02/2018 - 15:18
Trump

న్యూఢిల్లీ : ఈ ఏడాది  గణతంత్ర వేడుకలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటనపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. భారత ప్రభుత్వం పంపిన ఆహ్వానంపై ట్రంప్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని వైట్ హౌస్ వెల్లడించింది. కాగా రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా రావాలంటూ భారత్ ఆహ్వానం పంపిన విషయం తెలిసిందే. భారత్ ఆహ్వానం అందిందని, అయితే దీనిపై ట్రంప్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని యూఎస్ ప్రెస్ సెక్రటరీ సారా శాండర్స్ వెల్లడించారు. 

2015 గణతంత్ర వేడుకలకు అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హాజరయిన విషయం తెలిసిందే. కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే ఒబామాను ఆహ్వానించారు. భారత రిపబ్లిక్ డే వేడుకలకు 2016లో  ఫ్రెంచ్ ప్రధాని ఫ్రాంకోయిస్ హోలండ్, 2017లో అబుదాబి ప్రిన్స్ హాజరయ్యారు. కాగా గత ఏడాది ప్రపంచవ్యాప్త ఔత్సాహిక వ్యాపారవేత్తలతో హైదరాబాద్‌లో జరిగిన గ్లోబల్‌ ఎంటర్ ప్రెన్యూర్ సమ్మిట్ (జీఈఎస్)లో ట్రంప్  కుమార్తె ఇవాంకా ట్రంప్‌ హాజరైన విషయం తెలిసిందే.
 ఆమ్రపాలి వివరణ కోరిన సీఎస్

Updated By ManamMon, 01/29/2018 - 18:08

amrapaliహైదరాబాద్: రిపబ్లిక్ డే వేడుకల్లో వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ ఆమ్రపాలి చేసిన ప్రసంగం ‘నవ్వులపాలు’ కావడంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ స్పందించారు. సోమవారం ఆమ్రపాలితో ఫోన్‌లో మాట్లాడిన ఆయన...రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రసంగం సమయంలో తడబాటుపై ఆరా తీశారు. కొన్ని పదాలు పలకడంలో ఇబ్బంది ఎదురైందని ఆమె సీఎస్‌కు వివరణ ఇచ్చినట్టు సమాచారం. ప్రభుత్వ కార్యక్రమంలో...అదీ రిపబ్లిక్ డే ప్రసంగంలో కలెక్టర్ పదేపదే నవ్వడంపై సీఎస్ ఆమెకు క్లాస్ తీసుకుని ఉండొచ్చని తెలుస్తోంది. 

రిపబ్లిక్ డే రోజున హన్మకొండలోని పరేడ్‌ మైదానంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆమ్రపాలి ప్రసంగం నవ్వులపాలయ్యింది. తన ప్రసంగం మధ్యలో ఆమె పదేపదే అకారణంగా నవ్వడం, గణాంకాల దగ్గర తడబడటం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కలెక్టర్ గారి రిపబ్లిక్ డే ప్రసంగం నవ్వులపాలయ్యిందంటూ చాలా విమర్శలు కూడా రావడంతో సీఎస్ ఆమె‌కు ఫోన్‌ చేసి వివరణ కోరినట్లు తెలుస్తోంది. వీరనారీమణుల వీరోచిత విన్యాసాలు

Updated By ManamFri, 01/26/2018 - 16:52
Dare devils

రిపబ్లిక్ డే పరేడ్‌లో భారత ఆర్మీలో సేవలందిస్తున్న మహిళా జవాన్ల వీరోచిత సాహన విన్యాసాలు గగుర్పాటుకు గురిచేశాయి. నడుస్తున్న బుల్లెట్లపై ఒళ్లు గగుర్పొడిచే విధంగా ‘డేర్ డెవిల్స్’ వివిధ రకాల స్టంట్లు చేశారు. రోమాంచిత విన్యాసాలు చూపరులను అలరించాయి. రాష్ట్రపతి కోవింద్ తన కరతాళ ధ్వనులతో వారిని అభినందించారు. వీరనారీమణుల విన్యాసాలు చుపరులను కళ్లార్పనివ్వలేదు. మీరు కూడా దీన్ని మిస్ కాకండి...ఒకసారి చూడండి.

Read Related Article: సాహస బాలలకు వీర వందనం

Read Related Article: మైనస్ 30 డిగ్రీల వద్ద ‘జైహింద్’

 మైనస్ 30 డిగ్రీల వద్ద ‘జైహింద్’

Updated By ManamFri, 01/26/2018 - 16:03
ITBP

దేశ రక్షణ కోసం ఎంతటి సాహసాలకైనా సిద్ధమని రిపబ్లిక్ డే రోజున భారత సేనలు మరోసారి చాటాయి. దట్టమైన మంచుతో కప్పేసిన హిమాలయ పర్వతాల్లో ఇండో-టిబెటిన్ బార్డర్ పోలీస్(ఐటీబీపీ)‌కి చెందిన జవాన్లు మార్చ్ చేశారు. 18 వేల అడుగుల ఎత్తుకు చేరుకున్న జవాన్లు...మైనస్ 30 డిగ్రీల ఉష్ణోగ్రతలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా చేసిన ఈ సాహసాన్ని కెమరాలో చిత్రీకరించి...సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీరోచిత సాహసాన్ని ప్రదర్శించిన ఐటీబీపీ జవాన్లకు నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు. వారి దేశభక్తికి శతకోటి వందనాలు తెలియజేస్తున్నారు. 

Read Related Article: సాహస బాలలకు వీర వందనం

Read Related Articles: వీరనారీమణుల వీరోచిత విన్యాసాలు

చైనా సరిహద్దులో ఐటీబీపీ జవాన్లు సేవలందిస్తున్నారు. కేంద్ర హోం శాఖ ఆధీనంలోని ఐటీబీపీ...జమ్ముకశ్మీర్‌లోని కరకొరం పాస్ నుంచి అరుణాచల్ ప్రదేశ్‌లోని జెకాప్ లా వరకు ఐదు రాష్ట్రాల మీదుగా 3,488 కిలో మీటర్ల దూరం వాస్తవాధీన రేఖ వెంబడి రక్షణ విధులు నిర్వహిస్తోంది. ఐటీబీపీ సరిహద్దు పోస్ట్‌లో 3,000 నుంచి 19,000 అడుగుల ఎత్తుల్లో ఉన్నాయి. రిపబ్లిక్ డే వేళ పాక్‌కు వార్నింగ్

Updated By ManamFri, 01/26/2018 - 14:22
wagha

దేశ గణతంత్ర దినోత్సవాల వేళ దాయాది దేశం పాకిస్థాన్‌కు భారత సేనలు గట్టి వార్నింగ్ ఇచ్చాయి. పాక్ రేంజర్లతో స్వీట్స్ పంచుకునేందుకు భారత సరిహద్దు దళాలు నిరాకరించాయి. రిపబ్లిక్ డే సందర్భంగా ఇరు దేశాల సేనలు సరిహద్దులో మిఠాయిలు పంచుకోవడం ఆనవాయితీగా వస్తోంది. స్వాతంత్ర దినోత్సవ రోజు, గణతంత్ర దినోత్సవ రోజుతో పాటు దీపావళి, రంజాన్ తదితర ప్రధాన పండుగల సమయంలోనూ ఇరు దేశాల సేనలు అమృతసర్‌కు సమీపంలోని వాఘా సరిహద్దు వద్ద స్వీట్స్ పంచుకోవడం పరిపాటి.  అయితే పాక్ కవ్వింపు చర్యల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని పాక్‌ రేంజర్లతో మిఠాయిలు పంచుకునేందుకు బీఎస్ఎఫ్ దళాలు నిరాకరించాయి. 

గత కొన్ని మాసాలుగా జమ్ముకశ్మీర్‌లోని వాస్తవాధీన రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ రేంజర్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఏకపక్ష కాల్పులు జరుపుతూ భారత సేనలను రెచ్చగొడుతున్నారు. అటు భారత భూభాగంలోని గ్రామాలపై కూడా షెల్స్ ప్రయోగిస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ ఏకపక్ష కాల్పుల్లో పలువురు భారత జవాన్లు, అమాయక పౌరులు దుర్మరణం చెందారు. దీంతో ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా స్వీట్స్ పంచుకోరాదని బీఎస్ఎఫ్ దళాలు నిర్ణయించాయి. 

భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం దేశ సరిహద్దులో స్వీట్స్ పంచుకునే కార్యక్రమం ఉండదని గురువారమే బీఎస్ఎఫ్ అధికారులు...పాక్‌కు తెలియజేశారు. గతంలోనూ ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా బీఎస్ఎఫ్ దళాలు-పాక్ రేంజర్లు స్వీట్స్ పంచుకోని సందర్భాలున్నాయి. 

Read Related Articles:

దేశ భక్త గౌతమ్ గంభీర్

తొలి రిపబ్లిక్ డే ఫోటోలు చూశారా?

సాహస బాలలకు వీర వందనం

 

 సాహస బాలలకు వీర వందనం

Updated By ManamFri, 01/26/2018 - 13:34

Bravery awardsఢిల్లీ రాజ్‌పథ్‌ వద్ద నిర్వహించిన రిపబ్లిక్ డే పరేడ్‌లో సాహస బాలలను చూపరులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఆపదలో ఉన్నవారి ప్రాణాలు కాపాడేందుకు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించే బాలలకు ప్రతియేటా గణతంత్ర దినోత్సవాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ బ్రేవరీ అవార్డులను ప్రదానం చేస్తోంది . ఈ ఏడాది 18 మంది బాలబాలికలు జాతీయ బ్రేవరీ అవార్డుకు ఎంపికయ్యారు. బ్రేవరీ అవార్డుకు ఎంపికైన వీరిలో ముగ్గురు బాలలు ఇప్పుడు ప్రాణాలతో లేరు.

ఇప్పటికే వీరిని అభినందించిన రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ...వారికి పతకాలు అందజేశారు. వీరు రాథ్‌పథ్‌లో జరిగిన పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు తమ కరతాళ ధ్వనులతో వారిని అభినందించారు. వీరికి మనం కూడా వీర వందనాలు చెబుదాం రండి...తొలి రిపబ్లిక్ డే ఫోటోలు చూశారా?

Updated By ManamFri, 01/26/2018 - 13:18
republic day

దేశ 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో భారత సైనిక సంపత్తి, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా పరేడ్ నిర్వహించారు. గణతంత్ర దినోత్సవాల సందర్భంగా 1950నాటి దేశ తొలి గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించిన ఫోటోలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ అరుదైన ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి...

Read related Article: దేశ భక్త గౌతమ్ గంభీర్దేశ భక్త గౌతమ్ గంభీర్

Updated By ManamFri, 01/26/2018 - 12:57
goutham gambhir

మైదానంలో ఉన్నా...మైదానం బయట ఉన్నా దేశ భక్తిని చాటడంలో ఎప్పుడూ ముందుండే భారత క్రికెటర్ గౌతమ్ గంభీర్. దేశ గణతంత్ర దినోత్సవ వేళ భారత ఆర్మీపై గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్‌ రిహార్సల్‌లో‌ పాల్గొన్న గంభీర్...తన తొలి ప్రేమ భారత ఆర్మీపైనేనని వెల్లడించారు. దేశ కోసం భారత ఆర్మీ సేనలు అందిస్తున్న సేవలు, త్యాగాలు అమోఘమని కొనియాడారు. 

భారత ఆర్మీలో చేరాలని తాను ఉవ్విళ్లూరినట్లు చెప్పారు. క్రికెటర్ కాని పక్షంలో తాను భారత సైనిక బలగాల్లో చేరి దేశానికి సేవలందించి ఉండేవాడినన్నారు. భారత సైన్యంలో చేరలేకపోవడం పట్ల చింతిస్తున్నట్లు వ్యాఖ్యానించాడు. 

Related Articles: తొలి రిపబ్లిక్ డే ఫోటోలు చూశారా?

దేశంలోని ప్రతి ఒక్కరూ జాతీయ గీతాన్ని గౌరవించాలన్నారు. ఈ విషయంలో చర్చ అవకాశం లేదన్నాడు. జాతీయ గీతాన్ని గౌరవించని వారి నుంచి ఏమీ ఆశించలేమని వ్యాఖ్యానించాడు. జాతీయ గీతం పాడుతున్నప్పుడు లేచి నిలబడాలా? వద్దా? అనే చర్చ కూడా అవసరం లేదన్నాడు. గణతంత్ర వేడుకలకు చంద్రబాబు గైర్హాజరు

Updated By ManamFri, 01/26/2018 - 11:34

Ap Cmఅమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. గురువారం సాయంత్రంతో బాబు పర్యటన ముగిసింది. అయితే శుక్రవారం ఉదయం దావోస్ నుంచి తిరుగు పయనమై ఏపీలో జరుతున్న రిపబ్లిక్ వేడుకల్లో ఆయన పాల్గొనాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్యకారణాల వల్ల అమరావతికి రాలేకపోయారు. చంద్రబాబు ఇండియాకు రావాల్సిన విమానం పొగమంచు కారణంగా ఆలస్యమవ్వడంతో ఆయన రాలేకపోయారు. దీంతో చంద్రబాబు అధికారిక నివాసంలో ఆయన సతీమణి నారా భువనేశ్వరి జాతీయ జెండాను ఆవిష్కరించారు. 

ఇదిలా ఉంటే శుక్రవారం 12గంటల లోపు గవర్నర్ విజయవాడకు చేరుకుని జాతీయ జెండా ఆవిష్కరించి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల గురించి ఆయన ప్రసంగించనున్నారు. కాగా చంద్రబాబు శుక్రవారం సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. నాలుగు రోజుల దావోస్ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు బృందం పలు కీలక సంస్థల ప్రతినిధులతో సమావేశమై, కీలక ఒప్పందాలపై సంతకాలు చేసింది.గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న జగన్

Updated By ManamFri, 01/26/2018 - 11:15

Ysrcp Celebrates Republic Day Celebrationsనెల్లూరు: వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలోని ఓజిలి మండలం సగుటూరు వైసీపీ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్ జగన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం స్కూల్ పిల్లలతో వైఎస్ జగన్ ముచ్చటించారు. భారతీయులకు వైఎస్‌ జగన్‌ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉంటే వైసీపీ కేంద్ర కార్యాలయం, జిల్లా, మండలస్థాయి కార్యాలయాల్లో స్థానిక నేతలు గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. 

ys jagan in republic day celebrations

Related News