Republic Day

పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు

Updated By ManamFri, 01/26/2018 - 09:27

Telangana CM KCR at Republic day celebrationsహైదరాబాద్: నగరంలోని పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ ప్రభుత్వం గణంత్ర వేడుకలను ఘనంగా జరుపుతోంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌ హాజరయ్యారు. శుక్రవారం 9గంటలకు పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకున్న సీఎం మొదట అమరవీరుల స్థూపానికి పుష్పగుచ్ఛంతో నివాళులర్పించారు. గవర్నర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

మరికాసేపట్లో పరేడ్‌ గ్రౌండ్స్‌లో గవర్నర్ చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరణ జరగనుంది. ఈ కార్యక్రమానికి పలువురు పార్టీ నేతలు, ప్రముఖులు హాజరయ్యారు. మరికాసేపట్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం సీఎం, గవర్నర్ ప్రసంగిస్తారు. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు.తెలుగు ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

Updated By ManamFri, 01/26/2018 - 07:31

governer narasimhanహైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు 69వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జనవరి-26న హైదరాబాద్‌లోని సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్‌లో జరగనున్న గణతంత్ర వేడుకల్లో గవర్నర్ నరసింహన్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం కాసేపు స్వాతంత్ర సమరయోధులను ఉద్దేశించి గవర్నర్, సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. అటు నుంచి నేరుగా గవర్నర్.. బేగంపేట నుంచి గవర్నర్‌ విజయవాడకు బయలుదేరి వెళతారు. విజయవాడలో ఉదయం 11:25 గంటలకు జరిగే గణతంత్ర వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.వ్యక్తుల కంటే వ్యవస్థలే ముఖ్యం

Updated By ManamThu, 01/25/2018 - 20:23

presidentవ్యక్తుల కంటే వ్యవస్థలే ముఖ్యమని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ వ్యాఖ్యానించారు. దేశ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతినుద్దేశించి గురువారం సాయంత్రం రాష్ట్రపతి ప్రసంగించారు. రాష్ట్రపతి హోదాలో దేశ గణతంత్ర దినోత్సవాల సందర్భంగా జాతినుద్దేశించి ఆయన చేసిన తొలి ప్రసంగం ఇదే కావడం విశేషం.  భారత అత్యున్నత సంస్కృతైన ధాతృత్వాన్ని పునరుద్ధరించాలని దేశంలోని ధనవంతులకు రాష్ట్రపతి పిలుపునిచ్చారు. స్వచ్ఛందంగా తమ సంపదను పేదలకు పంచిపెట్టాలని సూచించారు. ప్రభుత్వ ప్రాధమ్యాలను వివరించిన రాష్ట్రపతి...దేశంలోని ప్రతి ఒక్కరికీ ఇళ్లు ఉండేలా దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పేదరిక నిర్మూలన చర్యలను వేగవంతం చేయాలన్నారు. దేశంలోని వ్యవస్థలు సరైన మార్గంలో నడవాలని, వ్యక్తుల కంటే వ్యవస్థలే ముఖ్యమన్న పరమార్థాన్ని గ్రహించాలన్నారు.

విద్యా వ్యవస్థలో సంస్కరణలతో పాటు ప్రమాణాల పెంపుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, రోబోటిక్స్, ఆటోమేషన్, జీనోమిక్స్‌కు అనువైన విధంగా విద్యా వ్యవస్థలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రాయితీలను స్వచ్ఛందంగా వదులుకునేందుకు స్తోమత కలిగిన ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పద్మ అవార్డ్స్‌ను ప్రకటించిన కేంద్రం

Updated By ManamThu, 01/25/2018 - 20:12

padma awardsన్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం 2017 సంవత్సరానికి గానూ పద్మ అవార్డులను ప్రకటించింది. పలు రంగాల్లో సేవలందించిన వారికి ఈ అవార్డులను ప్రకటించింది. సంగీత దర్శకుడు ఇళయరాజాకు పద్మ విభూషణ్ దక్కింది. పద్మ అవార్డులకు అర్హులైన వారిగా ప్రకటించిన వారి వివరాలివే..

భజ్జు శ్యామ్(పెయింటర్)(మధ్యప్రదేశ్)
అర్‌వింద్ గుప్తా(శాస్త్రవేత్త)(మహారాష్ట్ర)
సుదాన్ష్ బిస్వాస్(సేవారంగం)(పశ్చిమబెంగాల్) 
సుభాషిణి మిస్త్రీ(సేవారంగం)
లక్ష్మీకుట్టి(వైద్యరంగం)(కేరళ)
రాజగోపాలన్ వాసుదేవన్(సేవారంగం)(తమిళనాడు)
సలగత్తి నరసమ్మ(జనని అమ్మ)(కర్ణాటక)
విజయలక్ష్మి నవనీతకృష్ణన్(తమిళ్ ఫోక్ ఎన్‌సైక్లోపీడియా)(తమిళనాడు)
మురళీకాంత్(క్రీడారంగం)

 జియో యూజర్లకు శుభవార్త!

Updated By ManamTue, 01/23/2018 - 19:55

Reliance Jio plans, Republic Day, 28-day pack at Rs. 98న్యూఢిల్లీ: రిలయన్స్ జియో యూజర్లకు శుభవార్త.  రిపబ్లిక్‌ డే సందర్భంగా జియో మరోసారి ప్లాన్లను సవరించింది. నూతన సంవత్సరం 2018 సందర్భంగా ప్లాన్లను సవరించిన జియో.. 50 శాతం అదనపు డేటాను అందిస్తోంది. రూ. 98 రీచార్జ్ ప్యాక్‌ను సవరించి కొత్త ప్లాన్‌తో అదనపు డేటాను అందిస్తోంది. ఈ ఆఫర్‌ ద్వారా రూ.98 ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాల్స్, 2జీబీ డేటాను 28రోజుల కాలపరిమితిపై అందిస్తోంది. అలాగే రోజు 1జీబీ డేటాను అందించే అఫర్లలో కూడా ప్రస్తుతం రోజుకు 1జీబీ డేటా ప్లాన్‌ను 1.5జీబీగా సవరించింది. రోజుకు 1.5జీబీ అందించే ప్యాక్‌లను 2జీబీగా సవరించి అదనంగా అందిస్తోంది.

రిపబ్లిక్ డే సందర్భంగా జియో ఆఫరల్లో రూ.149 ప్లాన్‌లో 42జీబీ (28రోజుల కాలపరిమితి), రూ. 349 ప్లాన్‌లో 105జీబీ (70రోజల కాలపరిమితి), రూ.399 ప్లాన్‌లో 126జీబీ (84రోజుల కాలపరిమితి), రూ.449 ప్లాన్లలో 136జీబీ (91రోజుల కాలపరిమితి) డేటా చొప్పున అందిస్తోంది. రూ.198 ప్లాన్‌లో (56జీబీతో 28రోజుల కాలపరిమితి), రూ.398 ప్లాన్‌లో (140జీబీతో 70రోజలు), రూ.448 ప్యాక్‌లో (168జీబీతో 84రోజులు), రూ.498 ప్లాన్‌లో 18జీబీతో 91రోజుల కాలపరిమితిపై అందిస్తోంది. వరుసగా రోజుకు 2జీబీ డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్లన్నీ రిపబ్లిక్ డే జనవరి 26 (శుక్రవారం) నుంచి అందుబాటులోకి వస్తాయి. రూ.400 విలువ గల వోచర్లపై రూ. 398 రీచార్జ్‌తో 100శాతం క్యాష్‌బ్యాక్‌‌ను జియో అందిస్తోంది. 

Reliance Jio plans, Republic Day, 28-day pack at Rs. 98


ఆర్-డే గగనతల ఆంక్షల సడలింపు

Updated By ManamMon, 01/08/2018 - 21:20

flightsదేశ గణతంత్ర దినోత్సవాల సందర్భంగా దేశ రాజధానిలో విధించిన గగనతల ఆంక్షలను సడలించారు. ముందస్తు  జాగ్రత్త చర్యగా గగనతల ఆంక్షలను 9 రోజుల పాటు ప్రతి రోజూ 100 నిమిషాల పాటు అమలు చేయాలని ముందుగా నిర్ణయించగా...దీన్ని కేవలం రెండు రోజులకు మాత్రమే పరిమితం చేయాలని నిర్ణయించారు. తద్వారా ఢిల్లీ మీదుగా విమానాల్లో ప్రయాణించే వారికి ఊరట లభించనుంది. 

ముందుగా అనుకున్నట్లు 9 రోజుల పాటు 100 నిమిషాలు గగనతల ఆంక్షలు అమలు చేస్తే దాదాపు 1000 విమాన సర్వీసులను రద్దు చేయడం లేదా వాటి సమయాల్లో మార్పులు చేయాల్సి వచ్చేది. అయితే 19 నుంచి 25 వరకు విమానాలపై ఎలాంటి ఆంక్షలు పెట్టరాదని నిర్ణయించడంతో...కేవలం 780 విమాన సర్వీసుల రాకపోకలకు అంతరాయం కలగడం లేదా రద్దు చేయాల్సిన పరిస్థితి నెలకొననుంది. 
 26న విముక్తి !

Updated By ManamFri, 01/05/2018 - 21:18

republic dayరిపబ్లిక్ డే ఖైదీలకు కొత్త జీవితాన్ని ఇవ్వబోతున్నట్ల తెలుస్తోంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సత్‌ప్రవర్తన ఖైదీలకు విముక్తి కల్గించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం కసరత్తు మొదలుపెట్టింది. పరిస్థితుల ప్రభావంతో వివిధ నేరాలు చేసి జైల్లో శిక్ష అనుభవిస్తూ సత్ర్పవర్తన కలిగిన ఖైదీలకు క్షమాభిక్ష పెట్టాలని సర్కార్ నిర్ణయించింది. తెలంగాణ సచివాలయంలో హోంశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ రాజీవ్ త్రివేది, లా కమిషన్ ఛైర్మన్, తెలంగాణ జైళ్లశాఖ డీజీ వీకే సింగ్, ఐజీ అకుల నరసింహా నేతృత్వంలో సమావేశం నిర్వహించారు. ఖైదీల విడుదలకు సంబంధించిన మార్గదర్శకాలపై అధికారులు సుదీర్ఘంగా చర్చించారు. మరో రెండు, మూడు రోజుల్లో జీవో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.ఈసారి 'రిపబ్లిక్ డే' అతిథులు ఎవరంటే

Updated By ManamWed, 12/13/2017 - 12:58

rEPUBLICఢిల్లీ: రానున్న జనవరి 26న 69వ గణతంత్ర వేడుకలను జరుపుకోబోతోంది భారత దేశం. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా ప్రారంభించేసింది కేంద్రప్రభుత్వం. ఇక తాజా సమాచారం ప్రకారం ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు కేంద్రప్రభుత్వం అతిథులను ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.

ఆసియన్‌కు(ASEAN) చెందిన పది దేశాల నుంచి పదిమంది నాయకులను ఈ సంవత్సరం గణతంత్ర వేడుకలకు ఆహ్వానించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఆసియన్ సమ్మిట్‌లో థాయ్‌లాండ్, వియత్నాం, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పిన్స్, సింగపూర్, మయన్మార్, కంబోడియా, లావోస్, బ్రెనైకి అనే దేశాలు భాగంగా ఉన్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే ఈసారి జరగబోయే గణతంత్ర వేడుకలు మరింత ప్రాధాన్యతను సంతరించుకుంటాయి.
 

Related News